ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్ | Upcoming OTT Release Telugu Movies In August First Week 2024 | Sakshi
Sakshi News home page

This Week OTT Movies: ఓటీటీల్లో ఒకే వారంలో 20 మూవీస్ రిలీజ్.. అవి ఏంటంటే?

Published Mon, Jul 29 2024 8:03 AM | Last Updated on Mon, Jul 29 2024 10:14 AM

Upcoming OTT Release Telugu Movies In August First Week 2024

మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'శివం భజే', 'తిరగబడరా సామీ', 'ఉషా పరిణయం', 'బడ్డీ' సినిమా రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఏ ఒక్క దానిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 20 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఓవరాల్ లిస్టులో నాలుగు మాత్రం ఉన్నంతలో చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి.

(ఇదీ చదవండి: హీరో మహేశ్ బాబు మేనమామ, ప్రముఖ నిర్మాత కన్నుమూత)

ఓటీటీ మూవీస్ విషయానికొస్తే.. రాజమౌళి జీవితంపై తీసిన డాక్యుమెంటరీ 'మోడ్రన్ మాస్టర్స్', త్రిష 'బృందా' సిరీస్‌తోపాటు కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్, డ్యూన్ పార్ట్ 2 లాంటి తెలుగు డబ్బింగ్ చిత్రాలు కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీటితోపాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు ఉన్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందనేది దిగువన లిస్ట్ చూసేద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 29 నుంచి ఆగస్టు 4 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • ఏ గుడ్ గర్ల్ గైడ్ టూ మర్డర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01

  • బోర్డర్ లెస్ ఫాగ్ (ఇండోనేసియన్ మూవీ) - ఆగస్టు 01

  • లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 01

  • మ్యాన్ లఫెర్ట్ టెమో (స్పానిష్ సినిమా)  - ఆగస్టు 01

  • అన్ స్టెబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01

  • మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి (తెలుగు డాక్యుమెంటరీ) - ఆగస్టు 02

  • సేవింగ్ బికినీ బాటమ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 02

  • జో రోగన్ (ఇంగ్లీష్ కామెడీ ఈవెంట్) - ఆగస్టు 03

అమెజాన్ ప్రైమ్

  • ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29

  • బ్యాట్ మ్యాన్: క్యాప్డ్ క్రూసేడర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01

హాట్‌స్టార్

  • ఫ్యుచరమా సీజన్ 12 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29

  • నో వే ఔట్ (కొరియన్ సిరీస్) - జూలై 31

  • కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 02

బుక్ మై షో

  • ద బైక్ రైడర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 02

జియో సినిమా

  • డ్యూన్ పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 01

  • గుహ్డ్ చడీ (హిందీ మూవీ) - ఆగస్టు 01

  • టరోట్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - ఆగస్టు 03

  • దస్ జూన్ కీ రాత్ (హిందీ సిరీస్) - ఆగస్టు 04

సోనీ లివ్

  • బృందా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 02

ఆపిల్ ప్లస్ టీవీ

  • ఉమెన్ ఇన్ బ్లూ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31

(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement