హీరో మహేశ్ బాబు మేనమామ, ప్రముఖ నిర్మాత కన్నుమూత | Tollywood Producer Uppalapati Suryanarayana Babu Demise | Sakshi
Sakshi News home page

అనారోగ్య కారణాలతో మృతి చెందిన టాలీవుడ్ నిర్మాత

Jul 29 2024 7:12 AM | Updated on Jul 29 2024 9:12 AM

Tollywood Producer Uppalapati Suryanarayana Babu Demise

టాలీవుడ్‌లో మరో విషాదం. సూపర్‌స్టార్ మహేశ్ బాబు మేనమామ, ప్రముఖ నిర్మాత ఉప్పాలపాటి సూర్యనారాయణ బాబు కన్నుమూశారు. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. ఆదివారం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: బాబును అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: నటి)

సూపర్‌స్టార్ కృష్ణకు సూర్యనారాయణ బాబు.. బావ అవుతారు. ఈయన 'రామ్ రాబర్ట్ రహీమ్', 'సంధ్య', 'బెజవాడ రౌడీ' తదితర సినిమాలని నిర్మించారు. అలాంటిది ఇప్పుడు ఈయన మృతి చెందిన వార్తని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. 

(ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement