బాబును అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: నటి | Priya Malik on Four Month Old son Zorawar Hospitalisation | Sakshi
Sakshi News home page

ఎమర్జెన్సీ వార్డులో బాబు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాం..: నటి

Jul 28 2024 4:45 PM | Updated on Jul 28 2024 5:45 PM

Priya Malik on Four Month Old son Zorawar Hospitalisation

హిందీ నటి, కవయిత్రి ప్రియ మాలిక్‌ కుమారుడు జొరావర్‌ తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాలుగు నెలల పసివాడి ఒళ్లు కాలిపోతుంటే కన్నతల్లి తట్టుకోలేకపోతోంది. మళ్లీ ఆరోగ్యంగా ఎప్పుడు తిరిగొస్తాడా? అని కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. తాజాగా తను అనుభవిస్తున్న నరకం గురించి సోషల్‌ మీడియాలో రాసుకొచ్చింది.

వారం రోజులుగా
నా బాబుకు తీవ్ర జ్వరం వచ్చింది. వారం రోజుల నుంచి అస్సలు తగ్గడం లేదు. జూలై 20న ఆస్పత్రికి తీసుకెళ్తే 103 డిగ్రీల జ్వరం ఉందన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాం. పారాసిటమాల్‌ ఇచ్చారు, ఇంజక్షన్స్‌ వేశారు. ఇంకా ఏవో డ్రాప్స్‌ వేశాక ఇంటికి తీసుకొచ్చాం. బాబును అలా చూస్తే మా గుండె తరుక్కుపోయింది. అంతా నయమైపోయిందనుకునేలోపు జూలై 22న మళ్లీ జ్వరం మొదలైంది. ఈసారి కూడా 102 డిగ్రీలకు చేరుకుంది. ఆస్పత్రికి తీసుకెళ్తే అడ్మిట్‌ చేసుకున్నారు. యూరినరీ ఇన్‌ఫెక్షనే దీనికి కారణమై ఉండొచ్చంటున్నారు.

అందరూ బాబును ఎత్తుకున్నారు
ఆరు నెలల వరకు తనకు తల్లిపాలే పట్టించాను. కాకపోతే ఇంటికి వచ్చినవాళ్లు వాడిని చూస్తానంటే ఎత్తుకోనిచ్చాను. బహుశా అదే నేను చేసిన తప్పేమో! ఏ వాతావరణాన్నైనా తట్టుకునే శక్తి పెద్దలకు ఉంటుంది. కానీ పిల్లలకు ఉండదని డాక్టర్‌ అన్నారు. వాతావరణంలోని మార్పులే తనకు వచ్చిన జ్వరానికి ప్రధాన కారణమై ఉంటుందన్నారు. అలాగే బాబును అందరి చేతికీ ఇవ్వొదన్నారు. జూలై 23న నా భర్త కరణ్‌ బర్త్‌డే. కానీ బాబు పరిస్థితి చూసి సెలబ్రేషన్స్‌ వాయిదా వేసుకున్నాం అని చెప్పుకొచ్చింది.

చదవండి: నువ్వు లేకపోతే ఇంతదూరం వచ్చేవాడినే కాదు: విఘ్నేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement