First single from 'Konaseema Thugs' movie is out - Sakshi
Sakshi News home page

Konaseema Thugs: ఆకట్టుకుంటున్న కాల భైరవ ‘వీర శూర మహంకాళి’ సాంగ్‌

Published Sat, Feb 11 2023 10:15 AM | Last Updated on Sat, Feb 11 2023 10:40 AM

First Single Out From Konaseema Thugs Movie - Sakshi

ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ బృందా గోపాల్‌ దర్శకత్వంలో పాన్‌ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్‌. తెలుగులో కోనసీమ థగ్స్‌ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత శిబు తమీన్స్‌ కుమార్తే రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తూ జీయో స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి వీడియో సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. అమ్మవారు కాళికా రూపంలో ఊరేగింపుగా వచ్చే సన్నివేశం బ్యాక్ డ్రాప్ లో ఈ పాటను రోమంచితంగా చిత్రీకరించారు. ‘వీర శూర మహంకాళి వస్తోందయ్యా... వేటాడను ఆ తల్లే వస్తొందయ్యా... ’అంటూ సాగే ఈ పాట  కీలక సన్నివేశంలో రానుందని చిత్ర బృందం పేర్కొంది. . అమ్మవారు పూనినట్లుగా  హృదు చేసిన నృత్యం, డాన్స్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంటాయి. శామ్ సి ఎస్ అమ్మ ఉగ్ర రూపాన్ని ఎలివేట్ చేసే ఎనర్జిటిక్ ట్యూన్ ఇవ్వగా వనమాలి చెడును అంతమొందించే క్రోధాన్ని తెలిసేలా లిరిక్స్ అందించారు. కాలభైరవ తన గాత్రంతో పాటను మరింత రోమాంచితంగా ఆలపించారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement