భారీ బడ్జెట్‌తో ‘కాల భైరవ’.. ఆసక్తికరంగా రాఘవ లారెన్స్‌ ఫస్ట్‌ లుక్‌! | Raghava Lawrence 25th Film Title And First Look Released | Sakshi
Sakshi News home page

భారీ బడ్జెట్‌తో ‘కాల భైరవ’.. ఆసక్తికరంగా రాఘవ లారెన్స్‌ ఫస్ట్‌ లుక్‌!

Published Tue, Oct 29 2024 5:57 PM | Last Updated on Tue, Oct 29 2024 6:48 PM

Raghava Lawrence 25th Film Title And First Look Released

కోలీవుడ్‌ హీరో రాఘవా లారెన్స్‌ కొత్త సినిమాను ప్రకటించాడు. ‘రాక్షసుడు’, ‘ఖిలాడి’లాంటి హిట్‌ సినిమాలను తెరకెక్కించిన రమేశ్‌ వర్మ దర్శకత్వంలో తన 25వ సినిమాను చేయబోతున్నాడు. లారెన్స్‌ బర్త్‌డే(అక్టోబర్‌ 29)సందర్భంగా నేడు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘కాల భైరవ’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ చిత్రంలో రాఘవ లారెన్స్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

భారీ బ‌డ్జెట్‌తో  ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు నిర్మాతలు  కోనేరే స‌త్య‌నారాయ‌ణ‌, మనీష్ షా తెలిపారు. ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని కథతో గొప్ప థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఆడియెన్స్‌ అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు. 

తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. న‌వంబ‌ర్ నుంచి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2025 వేస‌విలో సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్నివివ‌రాల‌ను మేక‌ర్స్ తెలియ‌జేస్తారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement