Kala Bhairava
-
భారీ బడ్జెట్‌తో ‘కాల భైరవ’.. ఆసక్తికరంగా రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్!
కోలీవుడ్ హీరో రాఘవా లారెన్స్ కొత్త సినిమాను ప్రకటించాడు. ‘రాక్షసుడు’, ‘ఖిలాడి’లాంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన రమేశ్ వర్మ దర్శకత్వంలో తన 25వ సినిమాను చేయబోతున్నాడు. లారెన్స్ బర్త్‌డే(అక్టోబర్ 29)సందర్భంగా నేడు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘కాల భైరవ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు నిర్మాతలు కోనేరే సత్యనారాయణ, మనీష్ షా తెలిపారు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కథతో గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఆడియెన్స్ అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2025 వేసవిలో సినిమాను విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్నివివరాలను మేకర్స్ తెలియజేస్తారు. -
ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ రెడీ.. అదిరిపోయే టైటిల్ ఫిక్స్
'ముచ్చటగా మూడోసారి కూడా భారత దేశ పాలనా పగ్గాలు చేపట్టడం కేవలం లాంఛనం' అనే అంచనాల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కనుంది. 'విశ్వనేత' పేరుతో అన్ని భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కానున్న ఈ చిత్రానికి యువ ప్రతిభాశాలి సి.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్నారు. 'వందే మీడియా ప్రయివేట్ లిమిటెడ్' పతాకంపై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలో సెట్స్‌కు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఆర్టికల్ 370 రద్దు, డిమోనిటైజేషన్, జీ.ఎస్.టీ, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి ఎన్నో సంచలనాలతో కోట్లాది భారతీయుల గుండెల్లో కొలువుదీరి.. "యూనిఫామ్ సివిల్ కోడ్" అమలు దిశగా అడుగులు వేస్తున్న నరేంద్రుడి బయోపిక్‌లో చాయ్ వాలా స్థాయి నుంచి "విశ్వనేత" గా ఎదిగిన ఆయన మహాప్రస్థానానికి దృశ్యరూపం ఇవ్వనున్నామని సినిమా యూనిట్ చెబుతోంది!! -
బాబు.. నువ్వే మా జీవితంలో వెలుగు నింపావ్..నిహారిక పోస్ట్ వైరల్
జొన్నలగడ్డ చైతన్యతో విడాకుల తర్వాత మెగాడాటర్ నిహారిక పేరు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతోంది. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, తమ ప్రేవసీని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేసినా.. నిత్యం వీరి విడాకుల ఇష్యూపై ఏదో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే అటు నిహారిక కానీ, ఇటు చైతన్య కానీ వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. విడాకుల తర్వాత ఎవరి ప్రపంచం వారిదే అన్నట్లుగా జీవిస్తున్నారు. ఇక నిహారిక అయితే స్నేహితులతో కలిసి టూర్స్‌కి వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు విడాకుల తర్వాత సోషల్ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ని అలరిస్తోంది. కెరీర్ పరంగా కూడా ఫుల్ బిజీ అయింది. ఆ మధ్య డెడ్ పిక్సల్ అనే వెబ్ సీరీస్‌తో అలరించింది. త్వరలోనే ఓ సినిమా కూడా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా విడాకుల తర్వాత నిహారిక మరింత హుషారుగా వ్యవహరిస్తుంది. పెళ్లి జ్ఞాపకాలను మర్చిపోవడానికై ఎక్కువ సమయం స్నేహితులతోనే గడుపుతోంది. తాజాగా నిహారిక తన స్నేహితుడి గురించి షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మా జీవితాల్లో వెలుగు తీసుకొచ్చావ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు కాలభైరవ, నిహారికలు బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతుంది. నేడు కాలభైరవ పుట్టిన రోజు . ఈ సందర్భంగా తన బెస్ట్ ఫ్రెండ్‌కి బర్త్‌డే విషేస్ తెలియజేస్తూ ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘హ్యాపీ బర్త్‌డే బాబు.. నువ్వే మా జీవితాల్లో వెలుగును తీసుకొచ్చావ్. థాంక్స్.. లెట్స్ హ్యావ్ ఫన్ డే ’అని రాసుకొస్తూ.. కాలభైరవతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. -
ఆస్కార్‌తో తిరిగొచ్చిన RRR టీమ్, జై హింద్ అంటూ..
ఆర్ఆర్ఆర్ అనుకున్నది సాధించింది. తెలుగువారికి అందనంత ఎత్తులో ఉన్న ఆస్కార్‌ను అందిపుచ్చుకుంది. మహామహుల సమక్షంలో నాటు నాటు పాటకు కీరవాణి, చంద్రబోస్ అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ సంతోషంలో చిత్రయూనిట్‌కు అమెరికాలో ఆస్కార్ పార్టీ ఇచ్చాడు రాజమౌళి. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌కు వచ్చేయగా తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ విజయదరహాసంతో నగరానికి చేరుకుంది. తెల్లవారుజామున మూడు గంటలకు ఆస్కార్ అవార్డుతో రాజమౌళి, ఆయన సతీమణి రమ, కీరవాణి, కార్తికేయ, కాలభైరవ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అయితే మీడియాతో మాట్లాడకుండా జైహింద్.. అంటూ అక్కడి నుంచి రాజమౌళి వెళ్లిపోయాడు. చదవండి: తొలిసారి నెగెటివ్ రోల్లో ఒకరు, ఎమోషనల్ క్యారెక్టర్లో మరొకరు -
ఆస్కార్ స్టేజ్‌పై నాటు నాటుకు చరణ్, తారక్ డాన్స్? ఎన్టీఆర్ క్లారిటీ
అకాడమీ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో ఉంది ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలోని నాటు నాటు ఒరిజినల్ సాంగ్ కాటగిరిలో ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ వస్తుందా? లేదా? అనేది ఒక్క రోజులో తేలనుంది. మార్చి 12న అమెరికాలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. దీంతో అందరి చూపు ఆర్ఆర్ఆర్పైనే ఉంది. అంతేకాదు ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో నాటు నాటు సాంగ్ పర్ఫామెన్స్ కూడా ఉండనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. చదవండి: నేను నోరు విప్పితే.. మీరు ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పనా?: తమ్మారెడ్డి కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కీరవాణిలు స్టేజ్ఈ పాట పాడుతుండగా.. తారక్, చరణ్‌లు కాలు కదపనున్నారని సమాచారం. తాజాగా దీనిపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో నేపథ్యంలో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీం అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు వరుసగా పలు హాలీవుడ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా లాస్ ఏంజిల్స్‌కు చెందిన KTLA ఛానల్‌తో తారక్ ముచ్చటించాడు. చదవండి: శ్రీవారి సేవలో దిల్ రాజు ఫ్యామిలీ.. వారసుడిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు వేదికపై నాటు నాటు పాట పర్ఫామెన్స్పై ప్రశ్న ఎదురైంది. దీనికి తాను ఆస్కార్ అవార్డుల రెడ్ కార్పెట్‌పై పూర్తి ఇండియన్‌గా నడిచి వస్తానని చెప్పుకొచ్చిన తారక్, వేదికపై నాటు నాటు సాంగ్‌కు పర్ఫామెన్స్ చేయడం లేదని తేల్చి చెప్పాడు. కానీ, కీరవాణితో పాటు ఈ పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌లు స్టేజ్‌పై నాటు నాటు పాటను పాడనున్నారని స్పష్టం చేశాడు. కాగా ఆర్ఆర్ఆర్ ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గొల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ వంటి అవార్డులను గెలుచుకుంది. -
ఆకట్టుకుంటున్న కాల భైరవ ‘వీర శూర మహంకాళి’ సాంగ్
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో పాన్ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్. తెలుగులో కోనసీమ థగ్స్ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత శిబు తమీన్స్ కుమార్తే రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తూ జీయో స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి వీడియో సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. అమ్మవారు కాళికా రూపంలో ఊరేగింపుగా వచ్చే సన్నివేశం బ్యాక్ డ్రాప్ లో ఈ పాటను రోమంచితంగా చిత్రీకరించారు. ‘వీర శూర మహంకాళి వస్తోందయ్యా... వేటాడను ఆ తల్లే వస్తొందయ్యా... ’అంటూ సాగే ఈ పాట కీలక సన్నివేశంలో రానుందని చిత్ర బృందం పేర్కొంది. . అమ్మవారు పూనినట్లుగా హృదు చేసిన నృత్యం, డాన్స్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంటాయి. శామ్ సి ఎస్ అమ్మ ఉగ్ర రూపాన్ని ఎలివేట్ చేసే ఎనర్జిటిక్ ట్యూన్ ఇవ్వగా వనమాలి చెడును అంతమొందించే క్రోధాన్ని తెలిసేలా లిరిక్స్ అందించారు. కాలభైరవ తన గాత్రంతో పాటను మరింత రోమాంచితంగా ఆలపించారు