
ఆర్‌ఆర్‌ఆర్ అనుకున్నది సాధించింది. తెలుగువారికి అందనంత ఎత్తులో ఉన్న ఆస్కార్‌ను అందిపుచ్చుకుంది. మహామహుల సమక్షంలో నాటు నాటు పాటకు కీరవాణి, చంద్రబోస్ అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ సంతోషంలో చిత్రయూనిట్‌కు అమెరికాలో ఆస్కార్ పార్టీ ఇచ్చాడు రాజమౌళి. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌కు వచ్చేయగా తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ విజయదరహాసంతో నగరానికి చేరుకుంది.
తెల్లవారుజామున మూడు గంటలకు ఆస్కార్ అవార్డుతో రాజమౌళి, ఆయన సతీమణి రమ, కీరవాణి, కార్తికేయ, కాలభైరవ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అయితే మీడియాతో మాట్లాడకుండా జైహింద్.. అంటూ అక్కడి నుంచి రాజమౌళి వెళ్లిపోయాడు.
చదవండి: తొలిసారి నెగెటివ్ రోల్‌లో ఒకరు, ఎమోషనల్ క్యారెక్టర్‌లో మరొకరు
Comments
Please login to add a commentAdd a comment