Critics Choice Awards: RRR Wins Best Foreign Language Film, Best Song - Sakshi
Sakshi News home page

RRR Movie: అవార్డులను వేటాడుతున్న నాటు నాటు.. ప్రతిష్టాత్మక అవార్డు..

Published Mon, Jan 16 2023 11:39 AM | Last Updated on Mon, Jan 16 2023 12:26 PM

Critics Choice Awards: RRR Wins Best Song, Best Foreign Language Film - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్న ఈ సినిమా తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డు కైవసం చేసుకుంది. ఉత్తమ పాట, ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో రెండు క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డులు అందుకుంది.

మరోసారి నాటు నాటు పాటకే బెస్ట్‌ సాంగ్‌ అవార్డు రావడం విశేషం. 28వ క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డు ఫంక్షన్‌లో రాజమౌళి, ఎమ్‌ఎమ్‌ కీరవాణి ఈ అవార్డులను అందుకున్నారు. ఈ మేరకు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ఓ వీడియోను సైతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇకపోతే గోల్డెన్‌ గ్లోబ్‌తో సహా నాలుగు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నందుకు ఆనందంగా ఉందంటూ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశాడు కీరవాణి. తన సంగీతం కోట్లాది మంది మనసులు గెలుచుకోవడానికి ఈ నలుగురు కూడా కారణమంటూ.. బాలచందర్‌, భరతన్‌, అర్జున్‌ సర్జా, భట్‌ సాబ్‌లకు కృతజ్ఞతలు తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement