షూటింగ్‌కు ఆటోలో వెళ్లిన స్టార్‌ హీరోయిన్.. ఎందుకంటే? | Shruti Haasan Went To Madh Island For Shooting In A Auto Goes Viral, Know Reason Inside | Sakshi
Sakshi News home page

Shruti Haasan: షూటింగ్‌కు ఆటోలో వెళ్లిన శృతిహాసన్.. ఎందుకో తెలుసా?

May 10 2024 8:54 AM | Updated on May 10 2024 11:46 AM

Shruti Haasan Went To Shooting In a Auto Goes Viral

ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉండే నిలిచిన హీరోయిన్ శృతిహాసన్‌. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె.. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ చేసుకున్నట్లు వార్తలు వైరలయ్యాయి. అయితే ఈ విషయంపై శృతిహాసన్‌ ఇప్పటి వరకూ స్పందించలేదు. తాజాగా మరోసారి వార్తల్లో  నిలిచారు కోలీవుడ్ భామ. కాకపోతే ఆమె చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటో చూసేద్దాం.

అసలు విషయానికొస్తే శృతి హాసన్‌ ప్రస్తుతం ముంబాయిలో ఉంటున్నారు. అక్కడే ఓ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే షూటింగ్‌కు బయలుదేరిన ఆమె ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. అది ఎంతసేపటికీ క్లియర్‌ కాకపోవడంతో.. షూటింగ్‌కు ఆలస్యం అవుతుందని శృతిహాసన్‌ తాను వెళుతున్న కారును పక్కన నిలిపేసి ఆటో ఎక్కి వెళ్లిపోయారు.

ఆమె ఆటోలో వెళుతున్న  వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. శృతిహాసన్‌ ఏ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారో తెలియదు గానీ ఆమె వృత్తి ధర్మానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనే ఆ మధ్య నటుడు అమితాబ్‌ బచ్చన్‌ విషయంలోనూ జరిగింది. ఆయన ఇదే విధంగా కారులో వెళ్తూ ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో కారు దిగి వేరే వ్యక్తి బైక్‌లో షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లడం విశేషం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement