హీరోయిన్‌తో స్టార్ డైరెక్టర్‌ రొమాన్స్‌.. ఫుల్ సాంగ్‌ వచ్చేసింది! | Lokesh Kanagaraj shruthi Haasan Latest Album Song Out Now | Sakshi
Sakshi News home page

Lokesh Kanagaraj: రొమాన్స్‌తో రెచ్చిపోయిన లియో డైరెక్టర్‌.. ఫుల్ సాంగ్ చూసేయండి!

Published Mon, Mar 25 2024 7:53 PM | Last Updated on Mon, Mar 25 2024 9:31 PM

Lokesh Kanagaraj shruthi Haasan Latest Album Song Out Now - Sakshi

హీరోయిన్ శృతిహాసన్, లియో డైరెక్టర్‌ లోకేశ్ కనగరాజ్‌ నటించిన ఆల్బమ్‌ సాంగ్ రిలీజ్ చేశారు. ఇటీవల ఇనిమెల్ సాంగ్ ప్రోమో రిలీజ్‌ చేయగా.. ఈ జంట రొమాన్స్‌తో రెచ్చిపోయి నటించారు. తాజాగా ఫుల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు కమల్‌హాసన్‌ లిరిక్స్ అందించడమే కాకుండా తానే స్వయంగా నిర్మించారు. 

అయితే ఈ సాంగ్‌లో డైరెక్టర్‌ లోకేశ్ కనగరాజ్‌ నటన ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా వీరిద్దరి రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. లోకేశ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా కామెంట్స్ చేశారు. ‍అయితే తాజాగా రిలీజైన సాంగ్ కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. సాంగ్ చూస్తే లవ్, రొమాన్స్, పెళ్లి అనే కాన్సెప్స్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మీరు కూడా ఈ రొమాంటిక్ సాంగ్‌ను చూసేయండి. ఇక సినిమాల విషయాకొనిస్తే లోకేశ్ కనగరాజ్‌ నెక్స్ట్‌ రజినీకాంత్‌తో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మరోవైపు శృతిహాసన్ అడివి శేష్ సరసన డెకాయిట్‌ చిత్రంలో నటించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement