రొమాన్స్‌తో రెచ్చిపోయిన స్టార్‌ డైరెక్టర్.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా! | Leo Director Lokesh Kanagaraj Video Song With Shruthi Haasan, Promo Out | Sakshi
Sakshi News home page

Shruthi Haasan: శృతిహాసన్‌తో స్టార్ డైరెక్టర్‌ రొమాన్స్‌.. ఏందన్నా ఈ అరాచకం!

Published Thu, Mar 21 2024 9:00 PM | Last Updated on Fri, Mar 22 2024 9:48 AM

Leo Director Lokesh Kanagaraj Video SOng With Shruthi Haasan Promo Out - Sakshi

లియో మూవీతో సూపర్ హిట్‌ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. తాజాగా నటుడి అవతారమెత్తాడు. తన తొలి వీడియోలోనే రొమాన్స్‌తో రెచ్చిపోయారు. హీరోయిన్ శృతి హాసన్‌తో కనగరాజ్ చేసిన రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. వీరిద్దరు ఇనిమేల్ పేరుతో ఓ మ్యూజిక్ వీడియో తీసుకురానుండగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో ఈ జంట రొమాన్స్‌లో మునిగితేలారు. 

తాజాగా రిలీజైన ఇనిమేల్ ప్రోమో చూస్తే లోకేశ్, శృతి రెచ్చిపోయి నటించినట్లు అర్థమవుతోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఈ వీడియోను రూపొందిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మ్యూజిక్ పెద్దగా లేకపోయినా.. వీరిద్దరి కెమిస్ట్రీ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమో చూసిన ఫ్యాన్స్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి వీడియోలోనే లోకేశ్ రెచ్చిపోయాడంటూ పోస్టులు పెడుతున్నారు. కేవలం 18 సెకన్లు మాత్రమే ఉన్న ప్రోమో తెగ వైరలవుతోంది. కాగా.. ఇనిమేల్ ఫుల్ సాంగ్ మార్చి 25న రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా.. లోకేశ్ కనగరాజ్ తన తదుపరి చిత్రాన్ని రజినీకాంత్‌తో తెరకెక్కించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement