లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన లియో చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ చిత్రం విడుదలై సరిగ్గా ఏడాది పూర్తి అవుతుంది. దీంతో అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఒక కానుకను అందించింది. లోకేశ్- విజయ్ కాంబోలో మాస్టర్ తర్వాత ఈ చిత్రం గతేడాది అక్టోబర్ 19న విడుదలైంది. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించగా.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లియో రూ. 620 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతటి విజయం సాధించిన సినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తి కావడంతో 'లియో క్రానికల్స్' పేరుతో సుమారు 8 నిమిషాల నిడివి ఉన్న వీడియోను మేకర్స్ పంచుకున్నారు. సినిమాలో ట్రెండ్ అయిన సీన్స్‌ను ఎలా తెరకెక్కించారో చూపించారు. నెట్టింట వైరల్‌గా మారిన మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment