
అందమైన నయనాలే కాదు వాటికి పైన ఉండే కనుబొమలతోనూ ముఖ కవళికల్లో మార్పులు తీసుకురావడం సాధ్యమేనా?! అని అడిగితే సాధ్యమే అంటోంది నటి నయనతార. ముఖాకృతిలో మార్పులకు కనుబొమలు కీలకమైనవి అంటోందామె.
జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి దేశవ్యాప్తంగా నయనతార ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. దీంతో ఆమెలో వచ్చిన మార్పును సూచిస్తూ పాత, కొత్త ఫోటోలు పెట్టి, నయన్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, సన్నబడటానికి లై పోసక్షన్ చేయించుకుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు కొందరు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ పుకార్లకు స్పందించి, కనుబొమల తీరులో, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్లనే ఇది సాధిస్తున్నానని, ఇందుకు ΄్లాస్టిక్ సర్జరీ అవసరమే లేదని తెలిపింది.
‘ఇది నిజమైన గేమ్ ఛేంజర్. నా కనుబొమలలో మార్పులు తీసుకురావడం నాకు చాలా ఇష్టం. కొన్నేళ్లుగా విభిన్న రకాల కనుబొమలను ట్రై చేస్తూ వచ్చాను. అది ఇప్పుడు వర్క్ ఔట్ అయిందనుకుంటా! అలాగే సన్నగా కనిపించేందుకు లైపోసక్షన్ చేయించుకున్నాననే వార్తలు కూడా వచ్చాయి. కానీ, అది నిజం కాదు. ఆహారాన్ని బట్టి బరువు హెచ్చుతగ్గుల్లో చాలా మార్పులు తీసుకురావచ్చు. ఆ మార్పుల్లో భాగంగా ఒకసారి నా బుగ్గలు లోపలికి వెళ్లినట్టు, మరోసారి బయటికి వచ్చినట్టు కనిస్తాయి. కావాలంటే నా బుగ్గలను నొక్కి చూడవచ్చు, వీటిలో ΄్లాస్టిక్ లేదు’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది నయన్.
Comments
Please login to add a commentAdd a comment