
నయనతార(Nayanthara) నటించిన ‘ది టెస్ట్’(The Test) సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో (OTT) విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. వైనాట్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ (Siddharth) లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
నిర్మాత శశికాంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ది టెస్ట్’ చిత్రం కొన్ని నెలల క్రితమే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర విడుదల కోసం నయనతార అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 4న ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. తమిళ్,తెలుగు,హిందీ,కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే ప్రధాన కాన్సెప్ట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో 'కుముధ' అనే పాత్రలో నయన్ కనిపించనుంది. ఇకపోతే ఇంతకుముందు కూడా నయనతార ప్రధాన పాత్రను పోషించిన మూకుత్తి అమ్మన్(అమ్మోరు తల్లి), నెట్రికన్ చిత్రాలు నేరుగా ఓటీటీలోనే విడుదల కావడం గమనార్హం. ఈ సినిమా తర్వాత నయన్ చేతిలో డియర్ స్టూడెంట్స్, అమ్మోరు తల్లి 2 చిత్రాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment