Siddarth
-
అలాంటివి చేసుంటే పెద్ద స్టార్ అయ్యేవాడిని.. నేనే వదిలేశా!: సిద్దార్థ్
సిద్దార్థ్.. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరో.. కానీ ఆ క్రేజ్‌ను అలాగే కాపాడుకోలేకోయాడు. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, .. ఇలా పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇటీవలి కాలంలో కోలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. అయితే తన కెరీర్లో కొన్ని పనులు చేయకపోవడం వల్లే స్టార్ కాలేకపోయానంటున్నాడు.అలాంటివి రిజెక్ట్ చేశా..ఇటీవల హైదరాబాద్ సాహిత్య వేడుకకు హాజరైన హీరో సిద్ధార్థ్ (Siddharth) సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా దగ్గరికి చాలారకాల స్క్రిప్టులు వచ్చేవి. అమ్మాయిలను కొట్టడం, ఐటం సాంగ్స్ చేయడం, నడుము గిల్లడం.. నేను చెప్పినట్లుగా అమ్మాయిలు నడుచుకోవడం.. ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలన్నది నేనే ఆదేశాలివ్వడం.. ఇలాంటి కంటెంట్‌తో కొన్ని కథలు వచ్చాయి. వాటిని నేను రిజెక్ట్ చేశాను. బహుశా అవి ఒప్పుకుని ఉంటే ఈరోజు నేను పెద్ద స్టార్ అయ్యుండేవాడినేమో! కానీ నేను నా మనసుకు నచ్చినవే చేసుకుంటూ పోయాను.ఆ సంతోషాన్ని, అభిమానాన్ని వెలకట్టలేంచాలామంది నా దగ్గరకు వచ్చి మీరు ఆడవాళ్లకు చాలా గౌరవం ఇస్తారని చెప్తూ ఉంటారు. మహిళలకే కాదు, పేరెంట్స్‌కు, పిల్లలకు.. ఇలా అందరికీ గౌరవప్రాధాన్యతలిస్తారని అంటుంటారు. అంతేకాదు వారి పిల్లలు పదిహేనేళ్లుగా నా సినిమాలు చూస్తున్నారని చెప్తుంటారు. ఇంతకంటే సంతోషకరమైనది ఇంకేముంటుంది? ఈ అభిమానానికి కోట్లల్లో కూడా వెలగట్టలేం. చాలామంది హీరోలు యాక్షన్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మగవాళ్లు బాధను బయటకు చూపించకూడదన్నట్లుగా ఉంటున్నారు. కానీ నేనలా కాదు.. స్క్రీన్‌పై ఏడవడాన్ని కూడా సంతోషంగా చేస్తాను అని చెప్పుకొచ్చాడు.(చదవండి: Madha Gaja Raja Review: ‘మదగజరాజా’ మూవీ రివ్యూ)చేసిందంతా చేసి సుద్దపూసలా..అయితే ఈయన మాటలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆట (Aata Movie), గృహం సినిమా (Gruham Movie)లో నువ్వు చేసిందేంటి? అని ప్రశ్నిస్తున్నారు. చేసిందంతా చేసి ఇలాంటి నీతులు చెప్పడం అవసరమా? అని సెటైర్లు వేస్తున్నారు. మరికొందరేమో.. ఈ మార్పు ఎప్పుడు మొదలైందో చెప్పుంటే బాగుండేది.. ఎందుకంటే గతంలో సిద్దార్థ్ కూడా హీరోయిన్స్‌తో హద్దుమీరి రొమాన్స్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయని పెదవి విరుస్తున్నారు. పెళ్లి చేసుకున్నాక బుద్ధి వచ్చినట్లుంది.. అందుకే ఈ మార్పు అని పలువురూ కామెంట్లు చేస్తున్నారు.సినిమాసిద్దార్థ్ సినిమాల విషయానికి వస్తే.. 2023లో చిత్తా (చిన్నా) సినిమాతో హీరోగా, నిర్మాతగా విజయం అందుకున్నాడు ఈయన చివరగా ఇండియన్ 2, మిస్ యు మూవీలో యాక్ట్ చేశాడు. త్వరలోనే ఇండియన్ 3, టెస్ట్ చిత్రంలో భాగం కానున్నాడు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే హీరోయిన్ అదితిరావు హైదరిని గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ రెండో పెళ్లితెలంగాణలోని వనపర్తిలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన రంగనాథ స్వామి దేవాలయంలో వీరి వివాహం జరిగింది. తర్వాత రాజస్థాన్‌లోని అలీలా ఫోర్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరికిద్దరికీ ఇది రెండో పెళ్లే కావడం గమనార్హం! ఇకపోతే వీరిద్దరికీ మహాసముద్రం సినిమా సమయంలో పరిచయం, స్నేహం ఏర్పడింది. కొంతకాలానికే ప్రేమలో పడ్డారు. దాన్ని పెళ్లితో ముందుకు తీసుకెళ్లారు.చదవండి: 19 ఏళ్ల వయసు..అలా చూపిస్తేనే థియేటర్‌కి వస్తారన్నాడు: హీరోయిన్ -
kiara Advani: భర్తతో గేమ్ ఛేంజర్ బ్యూటీ వెకేషన్ (ఫోటోలు)
-
'పుష్ప2'పై కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్
పుష్ప2 పట్నా ఈవెంట్ కోసం భారీగా ప్రేక్షకులు వచ్చారు. అయితే, ఆ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిద్ధార్థ్ చేసిన కామెంట్లపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అయితే, తాజాగా తన వ్యాఖ్యలకు సిద్ధార్థ్ వివరణ ఇచ్చారు. ఇండస్ట్రీలో తనకు ఎవరితోను వ్యక్తిగత సమస్యలు లేవని క్లారిటీ ఇచ్చారు. సిద్ధార్థ్ కొత్త సినిమా 'మిస్ యూ' ప్రమోషన్స్‌లో భాగంగా పట్నాలో జరిగిన పుష్ప2 ఈవెంట్ కోసం భారీగా బన్నీ ప్యాన్స్ రావడంపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారు. అదంతా సినిమా కోసం చేసిన ఆర్గనైజ్ జనాలు అని అన్నారు. బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ కోసమే ఎక్కువగా జనాలు వెళ్తారని, పట్నా ఈవెంట్‌పై సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. దీంతో తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు.అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేఖత రావడంతో సిద్ధార్థ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. 'ఇండస్ట్రీలో నాకు ఎవరితోనూ వ్యక్తిగత సమస్యలు లేవు. అలాంటిది అల్లు అర్జున్‌తో సమస్య ఎందుకు ఉంటుంది. 'పుష్ప2' మంచి విజయం సాధించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. పుష్ప సినిమా హిట్ కావడంతో సీక్వెల్‌గా వచ్చిన పార్ట్2 కోసం భారీగా ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. సినిమా ఈవెంట్లకు జనాలు ఎక్కువగా వస్తే చాలా మంచిదే అనేది నా అభిప్రాయం. ఈ క్రమంలో థియేటర్లకు కూడా జనాలు భారీగా రావాలని ఆశిద్దాం. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ కళకళలాడుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలోని నటీనటులుగా మేము అందరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. అయితే, ఇక్కడ 100 సినిమాలు రిలీజ్ అయితే ఒకటి హిట్ అవుతుంది. ఈ క్రమంలో సినీ ఆర్టిస్టులందరికీ వారి కష్టానికి తగిన విధంగా ప్రతిఫలం అందాలి' అని సిద్ధార్థ్ అన్నారు.'పుష్ప' ఈవెంట్‌పై సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యల వల్లే వివాదం'పుష్ప 2 కోసం పట్నా ఈవెంట్లో 3 నుంచి 4 లక్షల మంది జనం రావడం అనేది ప్రమోషన్స్ జిమ్మిక్ తప్ప మరేమీ కాదు. మన దేశంలో, ఒక JCB తవ్విన స్థలాన్ని కూడా చూసేందుకు ప్రేక్షకులు ఎగపడుతారు. కాబట్టి, బీహార్‌లో అల్లు అర్జున్‌ని చూడటానికి ప్రజలు గుమిగూడడం అనేది పెద్ద విషయమేమి కాదు. వాళ్లు ఆర్గనైజ్ చేస్తేనే జనాలు ఉంటారు. భారతదేశంలో జనాలు వస్తేనే గొప్ప అనుకోవద్దు. అదే నిజమైతే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తప్పక గెలవాలి. బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ కోసమే ఎక్కువగా వెళ్తారు.' సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
'పుష్ప2'పై సిద్ధార్థ్ వ్యాఖ్యలు.. అల్లు అర్జున్స్ ఫ్యాన్స్ ఆగ్రహం
కోలీవుడ్‌కు చెందిన సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్లినా వివాదాలు వెంటాడుతూనే ఉంటాయి. తాజాగా పుష్ప సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే అనేకమార్లు బోలెడన్ని వివాదాలలో సిద్ధార్థ్ పేరు ఉండనే ఉంటుంది. కస్తూరి, చిన్మయి, సుచిత్రల మాదిరే అప్పుడప్పుడు ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు వివాదాలను తీసుకురావడమే కాకుండా ట్రోలింగ్ కూడా అవుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 సినిమాపై ప్రశంసలు వస్తున్న సమయంలో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు తన అపరిపక్వతను చూపుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇండస్ట్రీకి చెందిన వారి నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేఖత వస్తుంది.సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా 'మిస్ యూ' డిసెంబర్ 13న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో పట్నాలో పుష్ప2 ఈవెంట్ కోసం భారీగా జనాలు వచ్చారు కదా.. దానిపై మీ అభిప్రాయం ఏంటి అని సిద్ధార్థ్‌కు ప్రశ్న ఎదరురైంది. అయితే, తాను కూడా ఇండస్ట్రీలో భాగమే కదా అనే భావన లేకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన అభ్యంతరంగా ఉన్నాయి.అదంతా 'పుష్ప' కోసం జిమ్మిక్: సిద్ధార్థ్'పుష్ప 2 కోసం పట్నా ఈవెంట్లో 3 నుంచి 4 లక్షల మంది జనం రావడం అనేది ప్రమోషన్స్ జిమ్మిక్ తప్ప మరేమీ కాదు. మన దేశంలో, ఒక JCB తవ్విన స్థలాన్ని కూడా చూసేందుకు ప్రేక్షకులు ఎగపడుతారు. కాబట్టి, బీహార్‌లో అల్లు అర్జున్‌ని చూడటానికి ప్రజలు గుమిగూడడం అనేది పెద్ద విషయమేమి కాదు. వాళ్లు ఆర్గనైజ్ చేస్తేనే జనాలు ఉంటారు. భారతదేశంలో జనాలు వస్తేనే గొప్ప అనుకోవద్దు. అదే నిజమైతే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తప్పక గెలవాలి. బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ కోసమే ఎక్కువగా వెళ్తారు.' సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.నువ్వు ఐటెమ్ డ్యాన్స్ చేసినా రారు: బన్నీ ఫ్యాన్స్సిద్ధార్థ్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సిద్ధార్థ్ వీధుల్లో ఐటెమ్ డ్యాన్స్ చేసినా, బీహార్‌లో కాకుండా తమిళనాడులో కూడా అతన్ని చూడటానికి ఎవరూ రారని విరుచుకుపడుతున్నారు. తెలుగు నటులే కాకుండా ఇలాంటి వారు కూడా పుష్ప2 విజయం పట్ల అసూయతో ఉన్నారని వారు ఆరోపించారు. వివాదాల పేరుతో తన సినిమా ప్రమోషన్ కోసం సిద్ధార్థ్ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని చాలా మంది అంటున్నారు. అతను ఇటీవల పుష్ప 2తో తన సినిమా క్లాష్ అవ్వడం గురించి అడిగినప్పుడు 'పుష్ప 2 భయపడాలి, నేను కాదు' అని చెప్పాడు. కానీ తరువాత, అతను తన సినిమాను డిసెంబర్ 13కు వాయిదా వేసుకున్నాడు. ఈ కారణంగానే అల్లు అర్జున్ సినిమాపై ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేస్తున్నాడని తెలుస్తోంది. SHOCKING: Siddharth compares Pushpa 2 patna event with crowd which comes to watch JCB construction👷🚧🏗️ pic.twitter.com/BMyVUo3sWa— Manobala Vijayabalan (@ManobalaV) December 10, 2024 -
డబ్బు చెల్లించి టికెట్ కొన్న ప్రేక్షకులకు ఆ స్వేచ్ఛ ఉంది
సినిమా విడుదల రోజునే రివ్యూల ఇవ్వడం కారణంగా ఆ చిత్రాల కలెక్షన్లకు ముప్పు ఏర్పడుతుందనే వాదనను ఇటీవల మద్రాస్ న్యాయస్థానం కూడా కొట్టేసిన సంగతి తెలిసిందే. నటుడు సిద్దార్థ్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'మిస్ యూ'. నటి ఆషికా రంగనాథ్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని 7 మైల్స్ ఫర్ సెకండ్స్ పతాకంపై సామువేల్ మ్యాథ్యూ నిర్మించారు. దీనికి ఎన్.రాజశేఖర్ దర్శకత్వం వహించారు. జయప్రకాశ్, పొన్వన్నన్, నరేన్, అనుపమకుమార్, బాలా శరవణన్, లొల్లుసభ మారన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం గత నెల 29వ తేదీనే విడుదల కావాల్సి ఉంది. అయితే తుపాన్ కారణంగా విడుదల తేదీని వాయిదా వేశారు. తాజాగా మిస్ యూ చిత్రాన్ని ఈ నెల 13వ తేదీన తెరపైకి తీసుకువస్తున్నట్లు నటుడు సిద్ధార్థ్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ సినిమా విడుదలకు ఒక మంచి తేదీ లభించడం వరంగానే భావిస్తానన్నారు. అయితే 13ను హార్రర్ తేదీగా పేర్కొంటారని, అలాంటిది ఒక మంచి ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా రూపొందించిన తమ మిస్ యూ చిత్రాన్ని 13వ తేదీన విడుదల చేస్తున్నట్లు చెప్పారు. 9 పాటలతో కూడిన ఒక మంచి ప్రేమ కథా చిత్రం తనకు తమిళంలో చాలా కాలం తరువాత వచ్చిందన్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఇచ్చే ఆదరణను బట్టి ప్రేక్షకులు కుటుంబ సమేతంగా చూసి ఆనందించే పలు చిత్రాలను చేస్తానని చెప్పారు. ఈ ఏడాది తాను నటించిన రెండు చిత్రాలు విడుదల అవుతున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది మాధవన్, నయనతార, తాను కలిసి నటించిన టెస్ట్, శ్రీగణేశ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తదితర మూడు చిత్రాలు తెరపైకి వస్తాయని చెప్పారు. ఒక చిత్రం విడుదలైతే అది అందరికీ సొంతం అన్నారు. డబ్బుతో టిక్కెట్ కొని చిత్రం చూసే ప్రేక్షకులకు అభిప్రాయాలను చెప్పే భావ స్వేచ్ఛ ఉంటుందని నటుడు సిద్ధార్థ్ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని తమిళనాడులో రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది. -
రాజస్థాన్‌లో పెళ్లి పార్టీ.. అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ అన్‌సీన్ ఫోటోలు
-
చాలా బాధగా ఉంది.. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నా: ఆషికా రంగనాథ్
దక్షిణాది చిత్ర పరిశ్రమను చుట్టేస్తున్న వారిలో మలయాళం, కన్నడ బ్యూటీలే ఎక్కువగా ఉంటున్నారన్నది వాస్తవం. ముఖ్యంగా శాండిల్ ఫుడ్ భామలు అనుష్క,కృతి శెట్టి,అనుపమ పరమేశ్వరన్, రాశీఖన్నా, వంటివారు తెలుగు, తమిళం భాషల్లో రాణించారు. ప్రస్తుతం నటి రష్మిక మందన్న ఇండియన్ క్రష్‌గా వెలిగిపోతున్నారు. తాజాగా ఆషిక రంగనాథ్ అదే బాటలో పయనిస్తున్నారని చెప్పవచ్చు. తన మాతృభాష కన్నడలో 'క్రేజీ బాయ్' అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో నాగార్జునకు జంటగా నా సామిరంగ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆషికా రంగనాథ్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. దీంతో కోలీవుడ్ దృష్టి పడింది. ఇక్కడ నటుడు అధర్వకు జంటగా పట్టత్తు అరసన్ చిత్రంతో రంగ ప్రవేశం చేశారు. కాగా తాజాగా నటుడు సిద్ధార్థ్ కథానాయకుడిగా నటించిన 'మిస్ యూ' చిత్రంలో నాయకిగా నటించారు. దీంతోపాటు కార్తీ సరసన సర్ధార్ 2, మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర' వంటి భారీ చిత్రంలోనూ నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. కాగా మిస్ యూ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని నవంబర్ 29న విడుదల కావాల్సింది. అయితే ఇక్కడ తుపాన్ వంటి అననుకూల పరిస్థితులు కారణంగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. దీనిపై నటి ఆషీక రంగనాథ్ స్పందిస్తూ మిస్ యూ చిత్రం విడుదల వాయిదా పడటం తనకు బాధ కలిగించిందన్నారు. అయితే అంతా బాగానే జరుగుతుందని నమ్ముతున్నానన్నారు. ఇంతకుముందు నిర్ణయించిన విడుదల తేదీ కంటే ఇంకా మంచి తేదీ లభిస్తుందని భావిస్తున్నానన్నారు. అది చిత్రాన్ని అత్యధిక ప్రేక్షకుల మధ్యకు తీసుకెళ్లడానికి ఉపకరిస్తుందని, ఈ విషయాన్ని గమనిస్తే మిస్ యూ చిత్రం విడుదల వాయిదా అనే నిర్ణయం సరైనదేనని నమ్ముతున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
'పుష్ప' ఉన్నా మా సినిమా ఉంటుందని ట్విస్ట్ ఇచ్చిన సిద్ధార్థ్
సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా 'మిస్ యూ' వాయిదా పడింది. విడుదల తేదీని ప్రకటించి కూడా ఎలాంటి ప్రకటన లేకుండానే థియేటర్లోకి ఈ చిత్రం రాలేదు. ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అందులో భాగంగా సిద్ధార్థ్ పలు వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 5న పుష్ప విడుదల అవుతున్నప్పటికీ తమ సినిమా నవంబర్ 29న వచ్చి తీరుతుందని ఆయన చెప్పారు. తమకు పోటీ అనే భయం లేదని ఆయన అన్నారు. ఇప్పుడు మిస్ యూ సినిమా విడుదల కాలేదు. అందుకు కారణాలు ఏంటి అంటూ నెటిజన్లు ఎతుకుతున్నారు.సిద్దార్థ్ మాట్లాడిన మాటలకు చాలామంది మిస్ యూ సినిమా పట్ల ఆసక్తి చూపారు. కానీ, తీరా సినిమా విడుదల సమయానికి థియేటర్లో బొమ్మ పడలేదు. నవంబర్ 29న సినిమా విడుదల ఉంటుందని చెప్పిన మేకర్స్ కనీసం వాయిదా పడినట్లు కూడా ప్రకటించలేకపోయారు. ఇంతకూ ఏం జరిగింది అనేది కూడా వారు తెలుపలేదు. పుష్ప సినిమా తమకు అడ్డుకాదు అని చెప్పిన సిద్ధార్థ్ ఇప్పుడు ఎందుకు తగ్గాడు అని నెట్టింట ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే, తమిళనాడులో తుపాను వల్ల భారీ వర్షాలు పడుతుండటం వల్ల తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు సిద్దార్థ్ ప్రకటించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తామని చెప్పిన ఆయన ఎప్పుడు అనేది తెలుపలేదు. మిస్ యూ సినిమా ఇక వచ్చే ఏడాది రావాల్సి ఉంటుందని నెట్టింట గట్టిగానే వినిపిస్తుంది.పుష్ప సినిమాతో పోటీ.. హైదరాబాద్‌లో సిద్ధార్థ్ ఏమన్నారంటే..?మిస్ యూ సినిమా నవంబర్ 29న విడుదలైతే ఆ తర్వాత వారం రోజుల్లోనే పుష్ప-2 రిలీజవుతోంది.. ఈ ఎఫెక్ట్ మీ చిత్రంపై ఉంటుంది కదా..? మీరేందుకు డేర్ చేస్తున్నారని మీడియా వారు ప్రశ్నించారు. దీనిపై సిద్ధార్థ్ ఇలా స్పందించారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ..' ఇక్కడ నా కంట్రోల్లో ఉన్నదాని గురించే నేను మాట్లాడతా. ప్రతి సినిమా పెద్ద సినిమానే. ఎంత ఖర్చు పెట్టారనేది సినిమా స్థాయి నిర్ణయించదు. మీరు చెప్పింది కూడా కరెక్టే. రెండోవారం కూడా ఆడాలంటే ముందు నా సినిమా బాగుండాలి..ప్రేక్షకులకు నచ్చాలి. అప్పుడే నా మూవీ థియేటర్లో ఆడుతుంది. తర్వాత వేరే సినిమా గురించి వాళ్లు ఆలోచించాలి. వాళ్లు భయపడాలి. అంతేకానీ ఒక మంచి సినిమాను థియేటర్లో నుంచి ఎవరూ తీయలేరు. ఈ రోజుల్లో చేయడం అస్సలు కుదరదు. ఎందుకంటే ఇది 2006 కాదు.. ఇప్పుడున్నంత సోషల్ మీడియా అవేర్నెస్ అప్పట్లో లేదు. సో మంచి సినిమాను ఎవరూ థియేటర్ నుంచి తీయలేరు కూడా' అని అన్నారు. ఇప్పుడు మిస్ యూ సినిమా వాయిదా పడటంతో సిద్ధార్థ్ వ్యాఖ్యలను కొందరు ట్రోల్ చేస్తున్నారు. చెన్నైలో కూడా డిసెంబర్ 5 తర్వాత మిస్ యూ చిత్రానికి థియేటర్స్ దొరకకపోవడంతోనే సిద్ధార్థ్ టీమ్ ఈ నిర్ణయం తీసుకుందని నెట్టింట వైరల్ అవుతుంది. -
పెళ్లి తర్వాత మరింత గ్లామర్‌గా కనిపిస్తోన్న సిద్ధార్థ్ సతీమణి.. ఫోటోలు
-
Dhanteras 2024 : ధర్మ ఆఫీసు ధన్తేరస్ పూజలో సెలబ్రిటీల సందడి
-
ఓటీటీలో విడుదల కానున్న నయనతార, మీరా జాస్మిన్ సినిమా
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార నటించిన చిత్రం 'ది టెస్ట్'. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వైనాట్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. గతేడాదిలో జవాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నయనతార ఈ ఏడాదిలో వరుస సినిమాలతో అభిమానులను మెప్పించనుంది.ది టెస్ట్ సినిమా గురించి తాజాగా చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేసింది. జీవితాన్ని ఆడించే ‘టెస్ట్’ ఆట ముగిసిందంటూ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలిపింది. ఈ మూవీలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే ప్రధాన కాన్సెప్ట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో 'కుముధ' అనే పాత్రలో నయన్ కనిపించనుంది.తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డైరెక్ట్‌గా ఓటీటీలో ది టెస్ట్ సినిమా విడుదల కానుందని సమాచారం. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ కూడా త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా తర్వాత నయన్ చేతిలో డియర్ స్టూడెంట్స్, అమ్మోరు తల్లి 2 చిత్రాలు ఉన్నాయి. -
సిద్ధార్థ్,అదితి రావు హైదరీల పెళ్లి ఆ గుడిలోనే ఎందుకు..?
నటుడు సిద్ధార్థ్ తన ప్రియురాలు, నటి అదితి రావు హైదరీని వివాహం చేసుకున్నారు. వారు గతంలో చెప్పినట్లుగానే తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో వీరి పెళ్లి జరిగింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఇరు కుటుంబాల పెద్దలతో పాటు కొద్దిపాటు బంధువుల సమక్షంలో వారి పెళ్లి వేడుక జరిగింది. వనపర్తి రంగనాథస్వామి ఆలయంతో అదితి రావు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అందుకే అక్కడే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి కూడా అక్కడే చేసుకున్నారు. దీని వెనకున్న అసలు స్టోరీ ఇదే.అదితి రావు మన తెలుగమ్మాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ రాజ కుటుంబాలకు చెందినవారే. ఆమె తండ్రి పేరు ఎహసాన్ హైదరీ. తల్లి విద్యారావు. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్‌కు ప్రధానమంత్రిగా ఉన్న అక్బర్ హైదరీకి మనవడే అదితి తండ్రి అని తెలిసిందే. తల్లి విద్యా రావు ఏమో వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుమార్తె. అలా వనపర్తి సంస్థానానికి వారసురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. అలాగే అస్సాం మాజీ గవర్నర్ మహ్మద్ సాలెహ్ అక్బర్‌కు కూడా అదితి హైదరి మనవరాలు అవుతుంది. సినీ నిర్మాత, ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు, అదితి రావు కజిన్ అవుతుందనే విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: ఒక్కటైన సిద్ధార్థ్-అదితీ.. ఫొటోలు వైరల్)ఆమె ఆరవ ఏటనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో ఉన్న రిషీ వ్యాలీ స్కూల్ లో ప్రాథమిక విద్య అభ్యసించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీరాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ పెళ్లితో అదితి రావు తన పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగించింది. తమ కుటుంబంలో ఎలాంటి శుభకార్యక్రమైనా సరే శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో జరగాల్సిందే. అదీ వారికి వారసత్వంగా వస్తున్న సెంటిమెంట్. సుమారు 400 ఏళ్ల చరిత్ర అక్కడి ఆలయానికి ఉంది. ఈ వేడుకతో ఆమె తన రూట్స్‌ను గౌరవిస్తోందని చెప్పవచ్చు. అదితి రావు హైదరీ 2002లో సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. వనపర్తి రంగనాథస్వామి ఆలయంలో పెళ్లి చేసుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా కర్నాటకలోని గుల్బర్గా, రాయచూర్ వంటి ప్రాంతాల నుంచి కూడా నమ్మకంతో వస్తుంటారు. అక్కడ వివాహం జరిగితే వారి బంధం బలంగా ఉంటుందనేది అందరి నమ్మకం. దీంతో అక్కడ ప్రతి ఏడాది సుమారు 500కు పైగా వివాహాలు జరుగుతాయి. రాయలకాలంలో ఈ గుడిని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. -
మిసెస్& మిస్టర్ అదు-సిద్ధు: డిజైనర్ దుస్తుల్లో సింపుల్‌గా ఎంత సక్కగున్నారో!
చిరకాల ప్రేమికులు అదితి రావ్ హైదరి, సిద్దార్థ్ సూర్యనారాయణ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సోమవారం ఉదయం తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం మిసెస్ అండ్ మిస్టర్ అదు-సిద్ధు ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. నూతన దంపతులుగా, పెళ్లి దుస్తుల్లో బట్టల్లో చాలా అందంగా కనిపించారు. ప్రఖ్యాత డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన దుస్తుల్లో స్పెషల్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొత్త పెళ్లికూతురి గెటప్‌లో అదితి రావ్ హైదరీ లేత గోధుమరంగు , గోల్డెన్ లెహంగాలో మెరిసిపోయింది. ఈ లెహంగా ఆమెకు రాయల్ లుక్ తెచ్చి పెట్టింది. లెహంగాకు బంగారు రంగు చారల బ్లౌజ్‌ను, అందమైన చున్నీని జత చేసింది. భారీ అలంకారాలు లేకుండా సింపుల్‌గా అదితి పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అంతేకాదు ఒక చౌకర్, చెవిపోగులు, గాజులులతోపాటు భారీ మెహందీ హడావుడి లేకుండా, కాళ్లకు చేతులతో అర్థ చంద్రాకారంలో పారాణితో మెరిసింది. అటు సిద్ధార్థకూడా సింపుల్ స్టయిల్‌నే ఎంచుకున్నాడు. వైట్ కలర్ ఎంబ్రాయిడరీ కుర్తాలో,కొల్హాపురి చెప్పులతో దక్షిణాది పెళ్లికొడుకులా ఆకట్టుకున్నాడు. -
సిద్ధార్థ్-అదితీల 'బొమ్మరిల్లు'
హీరో సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నాడు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న హీరోయిన్ అదితీ రావు హైదరీతో ఏడడుగులు వేశాడు. వనపర్తి జిల్లాలోని దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో వివాహం జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని అదితీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పట్టు వస్త్రాల్లో కొత్త జంట చూడముచ్చటగా ఎంత చక్కగా ఉన్నారో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్)ఈ ఏడాది మార్చిలో వనపర్తి జిల్లాలోని రంగనాథ స్వామి ఆలయంలో నిశ్చితార్థం జరిగింది. హీరోయిన్ అదితీ రావు హైదరీ పూర్వీకులది వనపర్తి. అందుకే ఈ గుడిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పెళ్లి కూడా ఇక్కడే చేసుకున్నారు. అయితే ఈ శుభకార్యం ఆదివారం జరిగిందా? సోమవారం ఉదయం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. 'మహాసముద్రం' సినిమా షూటింగ్ టైంలో సిద్దార్థ్-అదితీకి పరిచయం ఏర్పడింది. అలా కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. తెలుగులో 'బాయ్స్', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' లాంటి సినిమాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. అదితీ కూడా 'సమ్మోహనం' లాంటి సినిమాతో ఆకట్టుకుంది.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)(ఇదీ చదవండి: తమన్‌కి ఏడాదికో ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్న అనుష్క) -
వనపర్తిలో మా పెళ్లి.. హీరోయిన్ అదితీ ఇంకేం చెప్పింది?
హీరోయిన్ అదితీ రావు హైదరీ తన పెళ్లి గురించి ఓపెన్ అయిపోయింది. హీరో సిద్ధార్థ్‌తో గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈమె.. ఈ ఏడాది ప్రారంభంలో తెలంగాణలోని వనపర్తిలోని ఆలయంలో నిశ్చితార్థం చేసుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్‌గా ఈ వేడుక జరిగిపోయింది. తాజాగా అదితీ పెళ్లి గురించి మాట్లాడింది. వనపర్తిలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఇంకా ఏమేం మాట్లాడిందంటే?అక్కడే ప్రపోజ్ చేశాడు'మా నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో నేను అన్ని విషయాలు షేర్ చేసుకునే దాన్ని. హైదరాబాద్‌లో ఆమెకు ఓ స్కూల్ ఉంది. అది నాకు చాలా స్పెషల్. నేను చిన్నప్పుడు అక్కడే ఉండేదాన్ని. కొన్నాళ్ల క్రితం ఆమె కన్నుమూశారు. ఇది సిద్ధార్థ్‌కి కూడా తెలుసు. అక్కడికి తీసుకెళ్లమని ఓ రోజు అడిగాడు. మార్చిలో మేం అక్కడికి వెళ్లాం. మోకాళ్లపై కూర్చుని, అతడు నాకు ప్రపోజ్ చేశాడు. ఆమె ఆశీస్సుల కోసమే అక్కడ ప్రపోజ్ చేశానని చెప్పాడు.'(ఇదీ చదవండి: సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?)పెళ్లి అక్కడే!'వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయం మా కుటుంబానికి చాలా ప్రత్యేకం. సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం అక్కడే జరిగింది. పెళ్లి కూడా అక్కడే. తేదీ ఖరారయ్యాక మేమేం ఎప్పుడనేది ప్రకటిస్తాం' అని అదితీ రావు హైదరీ చెప్పుకొచ్చింది.ఇద్దరు రెండోదే!సిద్ధార్థ్-అతిదీ బహుశా ఈ ఏడాదే పెళ్లి చేసుకునే అవకాశముంది. సరే దీని గురించి పక్కనబెడితే ఈ పెళ్లి ఇద్దరికీ రెండోదే. ఎందుకంటే సిద్ధార్థ్ గతంలో మేఘనా నారాయణ్‌ని 2003లో వివాహం చేసుకున్నాడు. కానీ నాలుగేళ్లకు ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. అదితీ కూడా సత్యదీప్ మిశ్రా అనే నటుడితో 2009-13 వరకు కాపురం చేసింది. కానీ బంధంలో కలతలు వచ్చి విడిపోయారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. సందేహాలు అక్కర్లేదు అంతా క్లారిటీ) -
రహస్యంగా నిశ్చితార్థం.. ఫోటోలు ఎందుకు షేర్ చేశానంటే: అదితి
కోలీవుడ్‌లో కాబోయే బ్యూటిఫుల్ కపుల్స్ సిద్దార్థ్ -అదితి రావు హైదరీ. గత నెలలోనే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే, ఈ విషయంపై వీరిద్దరూ కూడా మొదట అధికారికంగా ప్రకటన చేయలేదు. కొన్నిరోజుల తర్వాత మీడియాకు చెప్పారు. తాజాగా దీనిపై మొదటిసారి అదితి రావు హైదరీ రియాక్ట్ అయింది. ఇదే క్రమంలో మీడియా వాళ్లకు ఈ విషయాన్ని వెల్లడించడానికి గల కారణాన్ని కూడా ఆమె తెలిపింది. తను నటించిన 'హీరామండీ: ది డైమండ్ బజార్' వెబ్‌సిరీస్ ప్రమోషన్లో భాగంగా పలు విషయాలను పంచుకుంది.తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో మార్చి 27న వీరి నిశ్చితార్థం జరిగింది. ఉంగరాలతో దిగిన ఫొటో షేర్ చేస్తూ.. 'ఆమె నాకు ఎస్ చెప్పింది' అని సిద్ధార్థ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.తాజాగా ఇదే విషయంపై హైదరీ ఇలా తెలిపింది. ' అందరూ తమ జీవితంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలను చాలా ప్రత్యేకంగా ఉన్న ప్రదేశంలో చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఈ క్రమంలో అందరిలా నేను కూడా నా నిశ్చితార్థాన్ని 400 ఏళ్ల నాటి గుడిలో చేసుకున్నాను. ఈ విషయం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం ఆ దేవాలయంతో మా కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉండటమే.. నిశ్చితార్థం తర్వాత మా అమ్మ కోరికమేరకే ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాను. మా పెళ్లి విషయం గురించి తెలుసుకోవాలని చాలామంది మా అమ్మకు ఫోన్లు చేశారు. వాళ్లందరికీ ఆమె సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ నిశ్చితార్థం విషయం గురించి మీడియాకు చెప్పాలని ఆమ్మే సలహా ఇచ్చింది. ఆపై తెలిసిందే. వెంటనే నేను, సిద్ధార్థ్ సోషల్‌మీడియాలో ఫోటోలు షేర్ చేశాం.' అని ఆమె చెప్పింది. -
'చిన్నా'పై ఇలాంటి వ్యాఖ్యలా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సిద్దార్థ్
సిద్ధార్థ్ ఇటీవలి చిత్రం చిత్త (తెలుగులో చిన్నా) ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా అభినందనలు పొందింది. సిద్ధార్ధ్ కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా 'చిన్నా' ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది విడుదలైన ఈ సినిమా సౌత్ ఇండియాలో మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో సిద్ధార్థ్ పాల్గొన్నారు. చిన్నా సినిమాకు గాను 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్'గా ఆయన అవార్డు అందుకున్నారు. ఆ సమయంలో పలు ఆసక్తికరమైన విషయాలతో పాటు పరోక్షంగా రణబీర్ కపూర్ యానిమల్ సినిమాపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిద్ధార్థ్ మాట్లాడుతూ.. చిన్నా సినిమాను చూసిన కొందరు డిస్టర్బ్ అయ్యామంటూ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా సినిమా చూడలేకపోయామని అన్నారు. అది నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల హిట్ అయిన బాలీవుడ్ సినిమాను కొంతమంది ఎలాంటి ఇబ్బందిలేకుండా చూశారు. కానీ మనసుని హత్తుకునే కథతో చిన్నా సినిమా చేస్తే మాత్రం వారికి ఇబ్బందిగా మారింది. ఇది నిజంగానే సిగ్గుచేటు మనస్తత్వం.' అని సిద్ధార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. యానిమల్ సినిమా పేరు ఎత్తకుండా సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై కొందరి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నా మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలపై జరుగుతోన్న లైంగిక దాడుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్నా సినిమాలో సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమాలో నిమిషా సజయన్, సహస్ర శ్రీ కీలక పాత్రలు పోషించారు. Siddharth’s strong attack on #Animal 👌 pic.twitter.com/lgO0XD2TuG — Haricharan Pudipeddi (@pudiharicharan) April 13, 2024 -
సిద్దార్థ్- అదితి ఎంగేజ్మెంట్ జరిగింది ఈ గుడిలోనే!
-
అత్యధిక భాషల్లో రీమేకైన ఏకైక తెలుగు హిట్ సినిమా ఏదో తెలుసా..?
మంచి కథ ఉంటే ప్రాంతీయ, భాషా భేదాలుండవు అనేది నిజం. అందుకే అలాంటి కథలు ఏ భాషలో దొరికినా రీమేక్‌ల రూపంలో వాటిని మళ్లీ తెరకెక్కించి విడుదల చేస్తారు మేకర్స్. ఇప్పుడంటే ఈ ట్రెండ్ కాస్త తగ్గినప్పటికీ గతంలో ఎక్కువగా అరువు కథలకే ఎక్కవగా ప్రయారిటీ ఇచ్చేవారు. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమా నాలుగైదు భాషల్లోకి రీమేక్ కావడం అనేది సహజంగానే జరుగుతుంది. కానీ టాలీవుడ్లో విడుదలైన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రం ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయింది. సిద్ధార్థ్, త్రిష, శ్రీహరి నటించిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎస్ రాజు దీనిని నిర్మించారు. 2005లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. ధనిక కుటుంబానికి చెందిన అబ్బాయితో పేదింటికి చెందిన అమ్మాయి ప్రేమలో పడితే ఎలాంటి చిక్కులు వచ్చాయి అనేది ఈ చిత్రం కథ. ఆ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నిలిచింది. 35 సెంటర్స్‌లో వంద రోజులు ఆడింది. తొమ్మిది భాషల్లో రీమేకైన తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. 7 భారతీయ భాషల్లోకి, 2 విదేశీ భాషల్లోకి రీమేక్ అయింది. ఏ భాషలో ఏ పేరుతో విడుదలైందో మీరూ తెలుసుకోండి. 1. ఉనక్కం ఎనక్కం (తమిళం) 2. నీనెల్లో నానల్లే (కన్నడ) 3. రామయ్య వస్తావయ్యా (హిందీ) 4. సునా ఛాదీ మో రూపా ఛాదీ (ఒడియా) 5. నింగోల్ తజబ(మణిపురి) 6. తేరా మేరా కీ రిష్తా (పంజాబీ) 7. ఐ లవ్ యు (బెంగాలీ) 8. నిస్సా అమర్ తుమీ (బంగ్లాదేశ్ బెంగాలీ) 9. ది ఫ్లాష్ బ్లాక్: ఫర్కెరా హెర్దా (నేపాలీ) -
ఓటీటీల్లోకి ఆ రెండు హిట్ మూవీస్.. ఒక్కరోజు గ్యాప్‌లో రిలీజ్!
ఈ రెండు చిన్న సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రేక్షకులకు నచ్చాయి. కానీ థియేటర్లలో సరిగా ఆడకపోవడంతో కలెక్షన్స్ రాలేదు, జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. దీంతో అందరూ వీటి గురించి మర్చిపోయారు. తాజాగా ఈ మూవీస్ ఓటీటీ రిలీజ్ తేదీలకు అధికారికంగా ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఎమోషనల్ 'చిన్నా' సిద్ధార్థ్ పేరు చెప్పగానే లవర్ బాయ్ పాత్రలే గుర్తొస్తాయి. అప్పుడెప్పుడో 'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సరైన సినిమాలు చేయక.. తెలుగు ఆడియెన్స్‌కి బాగా దూరమైపోయాడు. మధ్యలో కొన్ని రొట్టకొట్టుడు మూవీస్ తీశాడు గానీ హిట్ కొట్టలేకపోయాడు. అలాంటిది స్టైల్ మార్చి.. ఎమోషనల్‌గా సాగే 'చిన్నా' సినిమా చేశారు. దీన్ని స్వయంగా నిర్మించాడు కూడా. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) తమిళంలో సూపర్‌హిట్ టాక్‌తో పాటు మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. తెలుగులో గత నెలలో రాంగ్ టైంలో థియేటర్లలో రిలీజైంది. దీంతో ప్రేక్షకులకు సరిగా రీచ్ కాలేకపోయింది. అలానే ఓటీటీలో నవంబరు 17న వస్తుందని అన్నారు. కానీ అది అబద్ధమని తేలింది. ఇప్పుడు అధికారికంగా నవంబరు 28 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. సో వచ్చాక దీనిపై ఓ లుక్కేసేయండి. సంపూ డిఫరెంట్ సినిమా లాక్డౌన్ టైంలో తమిళంలో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన 'మండేలా' చిత్రాన్ని తెలుగులో సంపూర్ణేశ్ బాబు హీరోగా 'మార్టిన్ లూథర్ కింగ్' పేరుతో తీశారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా బాగుందన్నారు గానీ థియేటర్‌కి వెళ్లి పెద్దగా చూడలేదు. ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో నవంబరు 29 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. సో ఇక్కడ ఆదరణ లభించొచ్చు. సో వచ్చేవారం వీకెండ్ కి ప్లాన్స్ ఏం లేకపోతే ఈ రెండు చిత్రాలు చూసేయొచ్చు. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఆ తెలుగు సినిమా!) -
కమల్ హాసన్ పెద్ద నటుడు.. ఆయన అన్న మాటలకు నేను షాక్
-
చాలా ఎమోషనల్‌గా సాగిన సిద్ధార్థ్ 'చిన్నా' ట్రైలర్
సిద్ధార్థ్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘చిన్నా’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సిద్ధమైన ఈ సినిమా తమిళనాట సెప్టెంబర్ 28న విడుదలైంది. కోలీవుడ్‌లో 'చిత్త' పేరుతో విడుదలైన ఈ సినిమా తెలుగులో అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కడ తొలి షో నుంచే మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాపై తమిళపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు భారీ ఎత్తున థియేటర్లకు క్యూ కడుతున్నారు. అంతేకాకుండా విమర్శకులు సైతం ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఒకరకంగా సిద్ధార్థ్ కెరీర్ లోనే అద్భుతమైన సినిమాగా వారందరూ చెప్పుకొస్తున్నారు. తల్లిదండ్రులు అందరూ ఈ సినిమాను తప్పకుండా చూడాలని కమల్ హాసన్ తెలిపారు. ఈ సినిమా చూసిన అనంతరం చాలా ఎమోషన్‌కు గురైయానని ఆయన చెప్పారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం,వెట్రిమారన్‌తో పాటు ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ సినిమా చూసి మేకర్స్‌ను అభినందించారు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటానని అప్పట్లో ఆ హీరోయిన్ ఇంటికి వెళ్లిన అజిత్..) ఈ చిత్రం అక్టోబర్ 6న 'చిన్నా'గా తెలుగులోకి రాబోతోంది. దీనిని ఏషియన్ మూవీస్ వారు విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీనిని చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సిద్ధార్థ్ ఇప్పటి వరకు చేయని డీగ్లామర్ రోల్ కనిపించారు. ఆయనకు జోడీగా మలయాళ టాలెంటెడ్ నటి అయిన నిమిషా సజయన్ నటించింది. -
స్టార్ హీరో సిద్ధార్థ్‌కి నిరసన సెగ.. ఆ గొడవ వల్లే!
స్టార్ హీరో సిద్ధార్థ్‌కు నిరసన సెగ తగిలింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూరు వెళ్లిన ఇతడికి చేదు అనుభవం ఎదురైంది. నేరుగా ఈవెంట్ జరుగుతున్న చోటుకే వచ్చిన కొందరు వ్యక్తులు ప్రెస్‌మీట్‌ని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు) హీరో సిద్ధార్థ్ నటించి నిర్మించిన కొత్త సినిమా 'చిత్తా'. దీన్ని తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరు వెళ్లి ప్రెస్ మీట్ లో పెట్టాడు. ప్రస్తుతం తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదం నడుస్తోంది. దీంతో అక్కడికి అకస్మాత్తుగా వచ్చిన కరవే కార్యకర్తలు.. సిద్ధార్థ్‌ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ప్రమోషన్స్ కి ఇది సరైన టైమ్ కాదని, వేరే ఎప్పుడైనా చేసుకోవాలని చెప్పారు. దీంతో విషయం అర్థం చేసుకున్న సిద్ధార్థ్.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే వెళ్తూ వెళ్తూ.. అందరూ తన సినిమా చూడాలంటూ చేతులు జోడించి మరీ స్టేజీ దిగి వెళ్లిపోయాడు. అయితే కరవే కార్యకర్తలు వచ్చినప్పుడు సిద్దార్థ్ కన్నడలో తన సినిమా గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో అతడి ప్రసంగాన్ని అడ్డుకున్న కరవే కార్యకర్తలు.. తమిళ సినిమా ఎవరూ ప్రోత్సాహించొద్దని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో తమిళ-కన్నడ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్‌గా మారింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' కోసం నాగార్జునకి అన్ని కోట్ల రెమ్యునరేషన్!?) Actor #Siddharth was forced to leave a press conference he was attending of #Tamil movie "#Chiththa" on #September 28, due to angry #protestors over the #Cauverywater dispute. pic.twitter.com/qviXRWcgLM — Madhuri Adnal (@madhuriadnal) September 28, 2023 -
సిద్ధార్థ్ కొత్త సినిమా.. రెండేళ్లు కేవలం దానికోసమే!
సిద్ధార్థ్ హీరోగా నటించి నిర్మించిన సినిమా 'చిత్తా'. ఎస్.యం అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిమిషా సజయన్, అంజలి నాయర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో గురువారం విడుదల కానుంది. (ఇదీ చదవండి: ఆస్కార్ బరిలో చిన్న సినిమా.. అవార్డ్ దక్కేనా?) ఈ సందర్భంగా సోమవారం చైన్నెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిద్ధార్థ్ మాట్లాడుతూ ఇది నిర్మాతగా తన తొలి చిత్రం అని చెప్పాడు. నిర్మాతగా మారాలనుకున్నప్పుడు రాజీ పడకుండా సహజత్వంతో కూడిన మంచి కథ చిత్రం చేయాలని అనుకున్నాను. అలానే ప్రీ ప్రొడక్షన్ కోసమే సుమారు రెండేళ్లు టైమ్ తీసుకున్నట్లు చెప్పాడు. సినిమాలోని చాలా సన్నివేశాలని పళనిలో లైవ్‌గా చిత్రీకరించినట్లు సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. 'చిత్తా' మూవీని చూసి తన యాక్టింగ్‌ని ప్రశంసించిన సినీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేశారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: పల్లవి ప్రశాంత్ తలకు గాయం.. కుప్పకూలిపోయిన రైతు బిడ్డ!) -
సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు
వరాహా ఫిలిమ్స్ పతాకంపై సంగీత దర్శకుడు వీఆర్.స్వామినాథన్ రాజేష్ నిర్మించిన చిత్రం 'లోకల్ సారక్క'. కొరియోగ్రాఫర్ దినేష్, ఉపాసన హీరో హీరోయిన్గా నటించారు. యోగిబాబు, సింగంపులి, ఇమాన్ అన్నాచ్చి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఎస్పీ రాజకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. శనివారం ఉదయం చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం.. స్థానిక సాలి గ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో నటుడు, మాజీ శాసనసభ్యుడు ఎస్వీ శేఖర్, నటుడు, నిర్మాత కె. రాజన్, నటి వనితా విజయకుమార్, సౌదర పాండియన్, విజయ మురళి, సంగీత దర్శకుడు దిన మొదలు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై ఎస్వీ శేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: నా జీవితంలో అది ఎప్పటికీ ప్రత్యేకమే: నిహారిక) 'ఎంటర్టైన్మెంట్ పేరుతో చిత్రాలు ప్రజలకు హాని కలిగించొద్దు. ఈ చిత్ర టైటిల్ చూస్తే కొంచెం హార్డ్‌గా అనిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో కామెడీతోపాటు మంచి సందేశం ఉంది. దర్శక నిర్మాతలు చిత్ర టైటిల్ కోసం చాలా శ్రమించారు. కళాకారులకు ఆత్మ విశ్వాసం ఉండాలి. ఇటీవల నిర్మాత వైనాట్ శశికాంత్ నా దగ్గరకొచ్చి 'టెస్ట్' మూవీ చేస్తున్నామని అందులో మీరు సిద్ధార్థ్‌కు తండ్రిగా నటించాలని అడిగారు. ఆ తరువాత వచ్చి ప్రధాని మోడీ మద్దతుదారులైన మీతో మోడీని వ్యతిరేకించే సిద్ధార్థ్ నటించని అన్నాడని చెప్పారు. 'దీంతో అందుకు నన్నేం చేయమంటారు అని సదరు దర్శకనిర్మాతని అడిగాను. ఆ తర్వాత ఫోన్లో చిత్ర కథ మారిందని, మిమ్మల్ని తీసుకోవడం లేదని నాతో చెప్పారు. వృత్తి వేరు రాజకీయాలు వేరు. ఇది చూస్తుంటే సిద్ధార్థ్ నాతో నటించడానికి భయపడ్డాడు అనిపిస్తుంది. ఈ విషయమై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాను' అని ఎస్వీ శేఖర్ చెప్పారు. కాగా ఈ చిత్రాన్ని కె.వినోద్‌కుమార్ విడుదల చేస్తున్నారు. (ఇదీ చదవండి: బాహుబలి కట్టప్ప కుటుంబంలో తీవ్ర విషాదం) -
8 సినిమాలు లైన్లో ఉన్నాయి ఏహీరో తో డైరెక్షన్ చేస్తానుఅంటే..!
-
ఈ సినిమాలో రియల్ కార్లతో స్టంట్స్ చేసినపుడు ..!
-
ఇండియన్ 2 లో నా క్యారెక్టర్..? ప్రభాస్, నేను పుట్టుమచ్చల గ్యాంగ్!
-
విడాకులు తీసుకుని పీకల్లోతు ప్రేమలో ఉన్న హీరో, హీరోయిన్
-
సిద్ధార్థ్, అదితి రావు మధ్య ఏముందో?.. శర్వానంద్ కామెంట్స్ వైరల్
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో అన్‌స్టాపబుల్. ప్రస్తుతం రెండో సీజన్ కొనసాగుతోంది. ఇటీవల ఈ షోలో యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్‌లు పాల్గొని సందడి చేశారు. ఈ షోలో హీరో శర్వానంద్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ వచ్చిన వార్తలపై శర్వానంద్ స్పందించారు. బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు శర్వానంద్ నవ్వుతూ సమాధానలిచ్చారు. మీరు సాధారణంగా హీరోయిన్లను ఎలా ఎంపికచేసుకుంటారు అని అడగ్గా.. ఆ విషయంలో నేను చేసేదేం లేదు. అంతా డైరెక్టర్లు చెప్పింది చేయడం తప్ప. నాకు ప్రత్యేకంగా ఎంపిక అంటూ లేదు' అంటూ సమాధానమిచ్చారు. మరీ అదితి రావు సంగతేంటీ? అని బాలయ్య ప్రశ్నించగా.. 'ఆమె మహాసముద్రంలో సిద్ధార్థ్‌కి జోడీగా నటించింది.. కానీ నాకు జోడీగా నటించలేదు అని అన్నారు. దానికి బాలయ్య ‘నిజ జీవితంలో కూడా సిద్ధార్థ్‌కి జంటగా మారిందా?’ అని శర్వానంద్‌ను మళ్లీ అడిగాడు. (చదవండి: సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్‌గా హీరో పోస్ట్) దీనికి శర్వానంద్ బదులిస్తూ.. ' ఏమో నాకేం తెలియదు, సిద్ధార్థ్ బయట ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. అతను సోషల్ మీడియాలో ‘స్వీట్ హార్ట్’ అంటూ ఓ పిక్ పోస్ట్ చేశాడు. కానీ అది నాకు అర్థం కాలేదు.' అని అన్నారు. కాగా.. సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, శర్వానంద్ కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్ ముందు సిద్ధార్థ్, అదితిరావు హైదరీ జంటగా మీడియాకు చిక్కారు. దీంతో అప్పటి నుంచి సిద్ధార్థ్, అదితిలు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇంతవరకు తమ డేటింగ్ రూమర్స్‌పై ఈ జంట స్పందించలేదు. ఇటీవల అదితి బర్త్‌డే సందర్భంగా సిద్ధార్థ్ చేసిన పోస్ట్ వైరలైంది. (చదవండి: ఆమె చూస్తే తట్టుకోలేదని బాత్రూమ్కు వెళ్లి ఏడ్చేదాన్ని: అదితి రావు) -
సిద్ధార్థ్ శ్రీవాస్తవ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
మరో వివాదంలో సిద్దార్థ్
-
మహా సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
చిక్కుల్లో పడ్డ పరిటాల సిద్దార్థ
-
యాహూ.... ముగించేశాం
ఫొటో చూశారుగా... శర్వానంద్, సిద్ధార్థ్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ జోరుకి కారణం ఈ ఇద్దరూ హీరోలుగా నటించిన ‘మహా సముద్రం’ సినిమా పూర్తి కావడమే. ఈ సందర్భంగా శర్వానంద్, సిద్ధార్థ్ ‘యాహూ.. ముగించేశాం’ అనేలా నవ్వుతూ ఉన్న పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సుంకర రామబ్రహ్మం నిర్మాత. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘ఎనిమిదేళ్ల తర్వాత ‘మహా సముద్రం’తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాను. ఇంతకంటే సంతోషమైనది మరేదీ లేదు.. థియేటర్లలో కలుద్దాం’’ అన్నారు. ‘‘పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో అన్ని అడ్డంకులను అధిగమించి బెస్ట్ ఔట్పుట్ ఇచ్చిన అజయ్ భూపతి, శర్వానంద్, సిద్ధార్థ్, అదితి, అనూ ఇమ్మాన్యుయేల్‌కి థ్యాంక్స్’’ అన్నారు అనిల్ సుంకర. ఈ చిత్రానికి సహ నిర్మాత: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి. -
Siddartha Murder: ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం
సాక్షి, కమ్మర్పల్లి: మండలంలోని హాసాకొత్తూర్‌లో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారమే హత్యకు దారి తీసిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్య ఘటనలో ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్మూర్ ఏసీపీ రఘు తెలిపిన ప్రకారం.. మాలవత్ సిద్దార్థ(17), కనక రాజేష్ బంధువైన యువతి మధ్య ఐదారు నెలలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. క్రమంగా సోషల్ మీడియాలో చాటింగ్ వరకు వెళ్లింది. ఈ విషయం రాజేష్‌కు తెలియడంతో తన స్నేహితులు దోన్పాల్ పృథ్వీరాజ్, జుంబరాత్ అన్వేష్‌తో కలిసి సిద్దార్థను బెదిరించాడు. సిద్దార్థ, అతని సోదరుడు కృష్ణలను హెచ్చరించాడు. హెచ్చరికలను ఖాతరు చేయకపోవడంతో ఎలాగైన కొట్టి భయభ్రాంతులకు గురి చేయాలని రాజేష్ భావించాడు. ఈ క్రమంలో బుధవారం నందిపేట్‌కు చెందిన సల్మాన్, రాకేష్‌ను హాసాకొత్తూర్‌కు రప్పించి సిద్దార్థపై దాడికి యత్నించారు. కానీ వీలు కాలేదు. అదే రోజు రాత్రి సిద్దార్థకు క్లోజ్ ఫ్రెండ్ అయిన అదే గ్రామానికి చెందిన షేరాల బాలాగౌడ్‌ను కలిసి సిద్దార్థకు ఫోన్ చేసి పిలిపించాడు. సిద్దార్థ రాగానే ద్విచక్ర వాహనాలపై మెట్ల చిట్టాపూర్ రోడ్డులోని బర్రెల మంద వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కర్రలతో విపరీతంగా కొట్టారు. ఒంటిపై గాయాలు కాగా, ద్విచక్ర వాహనంపై గ్రామానికి తీసుకువచ్చి బాలాగౌడ్‌తో బట్టలు తెప్పించి సిద్దార్థకు వేశారు. బాలాగౌడ్ ఇంటి వద్దే పడుకోబెట్టారు. అర్ధరాత్రి దాటాక సిద్దార్థ పరిస్థితి విషమించడంతో ఊపిరి ఆడలేదు. దీంతో బాలాగౌడ్ రాజేష్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. రాజేష్ బాలాగౌడ్‌తో కలిసి సిద్దార్థను తన కారులో మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తెల్లవారుజామున ఉప సర్పంచ్ రాజేశ్వర్‌కు ఫోన్ చేసి సిద్దార్థ కోవిడ్‌తో మరణించాడని చెప్పి అంత్యక్రియలకు ఏర్పాటు చేయాలని కోరాడు. గ్రామానికి చెందిన పీఎంపీ వైద్యుడు మథీన్‌తో కరోనా మృతిగానే రాజేశ్వర్‌కు చెప్పించాడు. కుటుంబీకులకు కూడా కరోనా మృతిగానే సమాచారం అందించాడు. అంబులెన్స్‌కు కూడా కరోనా మృతిగానే చెప్పి మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి చేర్చాడు. కరోనాతో మృతి చెందాడని చెప్పగా సిద్దార్థ కుటుంబ సభ్యులు అనుమానించి ఆర్మూర్‌లో మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో ఆరా తీశారు. కొట్టిన దెబ్బలతోనే మృతి చెందినట్లు విషయం బయట పడింది. ఈ కేసులో రాజేష్‌తో పాటు, పృథ్వీరాజ్, అన్వేష్, బాలాగౌడ్, మథీన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సల్మాన్, రాకేష్ పరారీలో ఉన్నారని ఏసీపీ తెలిపారు. చదవండి: వాట్సప్ చాటింగ్, ఫోన్ కాల్స్.. సిద్ధార్థది పరువు హత్య? -
వాట్సప్ చాటింగ్, ఫోన్ కాల్స్.. సిద్ధార్థది పరువు హత్య?
మోర్తాడ్ (బాల్కొండ): తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన కమ్మర్పల్లి మండలం హాసకొత్తూర్‌కు చెందిన యువకుడు సిద్దార్థది పరువు హత్యగా పోలీసులు భావిస్తు న్నారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా అనుమా నిస్తున్న టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కనక రాజేష్ సంబంధికులతో సిద్ధార్థ ప్రేమ వ్యవహారం నడిపించడమే హత్యకు దారితీసి ఉండవచ్చని అంటున్నారు. కొన్ని రోజుల నుంచి యువతితో వాట్సప్ చాటింగ్, ఫోన్లో మాట్లాడటం జీర్ణించుకోలేకనే సిద్ధార్థపై దాడి చేసి ఉంటారని వెల్లడవుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు సిద్దార్థను తీసుకువెళ్లి తీవ్రంగా చితకబాదారని అనుమానిస్తున్నారు. సిద్ధార్థపై ఎక్కువ మంది దాడి చేయడం, తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా వైద్యం కోసం ప్రధాన నిందితుడే ఆర్మూర్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. సిద్ధార్థను రాజేష్ గతంలోనే హెచ్చరించడాన్ని బట్టి పరువు హత్యగానే వెల్లడవుతోంది. పోలీసుల తీరుతోనే.. సిద్ధార్థ హత్య కేసులో పోలీసులు నిందితులకు కల్పించిన రాచమర్యాదల తీరుతోనే హాసకొత్తూర్‌లో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గురువారం మృతుని కుటుంబ సభ్యు లు, గ్రామస్తుల ఆందోళనతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసు స్టేషన్లో నిందితులు భోజనాలు చేస్తున్న ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇది చూసిన గ్రామస్తులు నిందితులకు పోలీసులు రాచమర్యాదలు కల్పిస్తున్నారని ఆరోపిస్తూ ఆగ్రహంతో ఆందోళనకు పూనుకున్నారు. పోలీసుల వాహనం అద్దాలు పగుల గొట్టారు. మోహరించిన పోలీసు బలగాలను, అధికారులను గ్రామం బయటకు పంపించేశారు. నిందితుడు కనక రాజేశ్ ఇంటిపై దాడి చేసి ఇంట్లోని సామగ్రి ధ్వంసం చేశారు. చదవండి: మృతదేహం మాయం: టీఆర్ఎస్ నాయకుడి ఇంటి ముట్టడి -
పోటీకి సిద్ధమవుతున్న సిద్ధార్థ్, జీవీ ప్రకాష్‌లు
సిద్ధార్థ్, జీవీ ప్రకాష్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బిచ్చగాడు లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ మూవీకి దర్శకత్వం వహించగా కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రమేష్ పి పిళ్లై నిర్మించారు. యాక్షన్ ఓరియెంటెడ్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్‌లు పోటాపోటీగా నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలవనున్నాయి. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమాని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై ఏ.ఎన్ బాలాజీ ఈ నెలలో విడుదల చేయనున్నారు. సిద్ధూ కుమార్ సంగీతం అందించగా ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. -
13 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి బొమ్మరిల్లు
2006లో విడుదలైన బొమ్మరిల్లు సినిమా అందులో నటించిన వారికి, తీసిన మేకర్స్‌కి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల దృష్టిలో నిలిచిపోయింది. దర్శకుడు భాస్కర్ని బొమ్మరిల్లు భాస్కర్‌గా మార్చింది. నిర్మాత దిల్ రాజుకు లాభాల పంట పండించింది. అందరూ ఈ సినిమాను అంతగా ఆధరించారు కాబట్టే తెలుగులోనే కాకుండా ఇతర మూడు భాషల్లో విడుదలై అక్కడ కూడా విజయాలను సాధించింది. తమిళంలో సంతోష్ సుబ్రహ్మణ్యంగా విడుదలైన సినిమాలలో జయం రవి సరసన జెనీలియానే కథానాయికగా నటించి తన నటనతో తమిళ ప్రేక్షకులను కూడా కట్టిపడేసింది. ఇంత మంచి సినిమా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్న నిర్మాత బోణీ కపూర్ 2007లోనే ఈ చిత్ర రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. అప్పటికి ఇంకా సినిమాల్లోకి అడుగుపెట్టని హర్మాన్ భవేజాని హీరోగా పరిచయం చేస్తూ అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఇట్స్ మై లైఫ్ అంటూ బొమ్మరిల్లును హిందీలో రీమేక్ చేశాడు. కానీ షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత సినిమా రిలీజ్ అవ్వలేదు. కారణం ఏదైనా ఆ సినిమా ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు. (నానికి విలన్‌గా మరో యంగ్ హీరో) అయితే 13 సంవత్సరాల తర్వాత ఇట్స్ మై లైఫ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవ్వడం మొదలైన తర్వాత ఎప్పటి నుంచో విడుదలకు నోచుకోని సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వైపు అడుగులేయడం మొదలుపెట్టాయి. ఇట్స్ మై లైఫ్ సినిమాకు కూడా ఇదే మంచి అవకాశం అనుకొని నవంబర్ 29న జీ5 యాప్‌లో విడుదల చేద్దామని నిర్ణయించుకున్నారు. ప్రకాశ్ రాజ్ పాత్రలో సీనియర్ నటుడు నానా పాటేకర్ మనల్ని అలరించనున్నారు. హాసిని లాగా జెనీలియా చేసే క్యూట్ యాక్టింగ్‌ను మళ్లీ మనం చూడబోతున్నాం. -
సమంత ప్లేస్‌లో‘వరల్ఢ్ ఫేమస్ లవర్’ నటి
సాక్షి, హైదరాబాద్: 'కౌసల్య కృష్ణమూర్తి', 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రాలతో వెండితెరకు పరిచయమైన నటి ఐశ్వర్య రాజేశ్ ప్రస్తుతం తెలుగులో నానితో ‘టెక్ జగదీశ్’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక తమిళంలో పలు ప్రాజెక్టులకు సంతాకాలు చేసిన ఐశ్వర్యకు చేతి నిండా సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఏకంగా సమంత స్థానంలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి తాజాగా తీస్తున్న మహా సముద్రం సినిమాలో శర్వానంద్‌కు జోడిగా ఐశ్వర్యను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మొదట దర్శకుడు సమంతను సంప్రదించినట్లు సమాచారం. ఆమెకు కథ వివరించగా పాత్ర నచ్చి ఒకే చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల సమంత ఇటీవల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో చివరకు ఈ పాత్రకు దర్శకుడు ఐశ్వర్య రాజేష్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్న ఈ సినిమాలో మరో హీరోగా లవర్ బాయ్ సిద్దార్థ నటింస్తున్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లో గ్రాండ్ ఏంట్రీ ఇవ్వనున్నాడు ఈ లవర్ బాయ్. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వు వస్తానంటే.. నేనొద్దంటానా’తో తెలుగులో బ్లక్‌బస్టర్ హిట్ కొట్టిన సిద్దార్థ్‌కు ఆ తర్వాత సక్సెస్‌లు తక్కువే అని చెప్పుకొవచ్చు. 2016లో పలు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాల్లో నటించినప్పటికి అవి అంతగా గుర్తింపు పొందలేదు. దీంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సిద్ధార్థ్ ‘మహా సముద్రం’తో ఎంట్రీ ఇస్తున్నాడు. -
టాలీవుడ్లో కొత్త జోడి.. సాయి కాదు అదితి
‘అర్ఎక్స్100’తో సూపర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. తాజాగా ఆయన ఇద్దరు కథా నాయకులతో ‘మహా సముద్రం’ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించబోతున్నారు. ‘బొమ్మరిల్లు’తో తన కంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్న సిద్ధార్థ్ పలు చిత్రాల్లో నటించిన అనంతరం తెలుగు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. అయితే చాలా కాలం తర్వాత అజయ్ భూపతి చిత్రంతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన హీరోయిన్ అదితిరావు హైదరీని చిత్రబృందం ఎంపిక చేసింది. దీంతో తెలుగు తెరపై మరొ కొత్త జోడి సందడి చేయనుందని సినీ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇందులో ఒకే హీరోయిన్‌కు అవకాశం ఉన్నట్లు సమాచారం. తొలుత సాయిపల్లవిని తీసుకోవాలని భావించినప్పటికీ చివరికి అదితి వైపే చిత్రబృందం మొగ్గు చూపింది. ఇక అదితి సుధీర్‌బాబు హీరోగా వచ్చిన ‘సమ్మోహనం’ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో నటన పరంగా అదితికి మంచి మార్కులే పడినప్పటికీ అవకాశాలు మాత్రం అంతగారాలేదు. ఇక ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. చదవండి: ‘అసలు మీరెవరు.. మమ్మల్ని అడగడానికి?’ ఆ అకౌంట్ నాది కాదు.. స్వాతి క్లారిటీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_841250433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దెయ్యమైనా వదలడు
‘బొమ్మరిల్లు’ ఫేమ్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం ‘వదలడు’. కేథరిన్ థెరిస్సా హీరోయిన్గా నటించారు. సాయిశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన టి.అంజయ్య సమర్పణలో పారిజాత క్రియేషన్స్ పతాకంపై టి. నరేష్కుమార్, టి. శ్రీధర్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా టి. నరేష్కుమార్, టి. శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘సినిమా రంగంపై అభిరుచి ఉండటంతో ఇండస్ట్రీకి వచ్చి, ‘ప్రేమంత ఈజీ కాదు, మిస్టర్ కె.కె’ సినిమాలు నిర్మించాం. తమిళ నిర్మాత ట్రిడెంట్ రవి నుంచి ‘వదలడు’ తెలుగు హక్కులు కొన్నాం. హారర్ నేపథ్యంలో సాగే చిత్రమిది. దెయ్యమైనా వదలడు అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కించారు. సిద్ధార్థ్–కేథరిన్ల మధ్య ప్రేమ విభిన్నంగా ఉంటుంది. దాదాపు 450 థియేటర్లలో మా సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్.కె. ఏకాంబరం, సంగీతం: ఎస్ఎస్. తమ¯Œ . -
‘కాఫీ డే’ల్లో మధురస్మృతులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా దాదాపు 200 అవుట్లెట్లు కలిగిన ‘కేఫ్ కాఫీ డే ’ వ్యవస్థాపకులు సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న విషాదాంత నేపథ్యంలో ‘కేఫ్ కాఫీ డే’లతో ప్రత్యక్ష అనుబంధం కలిగిన పలు వర్గాల భారతీయులు వాటితో పెనవేసుకున్న తమ మధురానుభూతులను సోషల్ మీడియా సాక్షిగా నెమరేసుకుంటున్నారు. వ్యాపార వర్గాలతోపాటు కాలేజీ యువతీ యువకులకు ఈ కాఫీ డేలతో ఎంతో అనుబంధం మిగిలి ఉంది. వ్యాపార రంగానికి చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలు వీటిల్లో కూర్చుని కాఫీలు సేవిస్తూ వ్యాపార లావాదేవీలు నిర్వహించడంతోపాటు పలు భారీ ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన యువతీ యువకుల మధ్య ఎక్కువ డేటింగ్లు మొదలయిందీ ఈ కాఫీ డేల నుంచే. చల్లటి సమయాల్లో వేడి వేడిగా దొరికే ఎక్స్‌ప్రెస్సో, కప్పూసినో, లట్టే, రోజ్ కారమెల్లర్, చకోలేట్ మొచే కాఫీలు సేవిస్తూ, అదే హాట్ హాట్ వెదర్లో చల్లటి ట్రాపికల్ ఐస్‌బెర్గ్, కూల్ ఎస్కినో, చోకో ఫ్రెప్పీ, కాపీ నిర్వహణ లాంటి రకాల కాఫీల రుచులను ఆస్వాదిస్తూ ఊసులాడుకున్న కబుర్లను వారు నేడు షేర్ చేసుకుంటున్నారు. మానస వెంకటేష్ లాంటి వాళ్లు నాటి డేటింగ్ రోజులను గుర్తు చేస్తూ అందుకు అవకాశం కల్పించి నేడు మధ్య లేకుండా పోయిన సిద్ధార్థకు నివాళులు కూడా అర్పిస్తున్నారు. హైదరాబాద్ పట్టణానికి వచ్చి పారిశుద్ధ్యం సరిగ్గాలేని టాయ్లెట్లకు వెళ్లలేక సతమతమవుతున్న తన లాంటి మహిళలకు ఈ కాఫీ డేలు ఎంతగానో ఉపయోగపడ్డాయని సుభా జే రావు లాంటి వాళ్లు ట్వీట్లు చేస్తున్నారు. దేశంలో సరికొత్త కాఫీ విప్లవాన్ని తీసుకొచ్చిన కాఫీ డేలకు తాము పది, పన్నెండేళ్ల క్రితం తరచుగా వెళ్లే వాళ్లమని, అప్పుడు ఏ కాఫీ అయినా 40 రూపాయలు ఉండేదని, ఇప్పుడు సమోసా కూడా 55 రూపాయలకు తక్కువకు దొరకడం లేదని ఐటీ రంగాన్ని కవర్ చేస్తూ వచ్చిన ఓ రిపోర్టర్ చెప్పారు. బెంగళూరులోని ఓ కాఫీ డేలో తన సమక్షంలోనే ఓ భారతీయ టాక్సీల కంపెనీ, మరో క్యాబ్ కంపెనీలో విలీనమయ్యే ఒప్పందాన్ని చేసుకుందని ఆయన తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే ‘కాఫీ డే’లతో అనుబంధాలు ఎన్నో ఉన్నాయి. -
గంభీర్ భాయ్.. ఇది నిజమా?
చెన్నై : టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీలో జేఎన్‌యూ నాటిన మొక్కనా? అంటూ హీరో సిద్ధార్థ్ ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు. ఇటీవల జై శ్రీరాం అనాలంటూ ఓ ముస్లిం యువకుడిపై గురుగ్రామ్‌లో అల్లరిమూకలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన గంభీర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నరేంద్ర మోదీ సబ్కా సాత్ , సబ్కా వికాస్, సబ్ కా విశ్వాస్‌తో తనకు లౌకికవాదంపై ఆలోచనలు పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు. ఇకపై కులం, మతం పేరిట జరిగే దాడులన్నింటిపై గళమెత్తుతానని ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. అయితే హిందుత్వవాదులకు ఇది రుచించలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా గంభీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే బీజేపీలో జేఎన్‌యూ గ్రూప్ నాటిన మొక్క గంభీర్ అని ఘాటుగా ట్వీట్ చేశాడు. ‘గౌతం గంభీర్ ఇప్పుడు సూడో సెక్యూలరిస్ట్, హిందూత్వ వ్యతిరేకుల ప్రియతమ నేత. సిగ్గుండాలి గంభీర్.. మధురులో 20 మంది ముస్లింలు ఒక హిందువును చంపినప్పుడు ఎక్కడికి పోయావు. అప్పుడెందుకు ట్వీట్ చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే మిమ్మల్ని బీజేపీలో జేఎన్‌యూ నాటిన మొక్కగా అనిపిస్తుంది’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌ను సిద్దార్థ్ రీట్వీట్ చేస్తూ.. ‘ హహ.. గంభీర్ భాయ్ ఇది నిజమా? అతి దేశభక్తులు మిమ్మల్ని జేఎన్‌యూ గ్రూప్ బీజేపీలో నాటిన మొక్క అంటున్నారు. నూతన భారత్ కోసం మీ గుండె, వెన్నుముక చూపినప్పుడు ఇలాంటివి జరుగడం మాములే. ఆల్‌దిబెస్ట్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. Haha! @GautamGambhir bhai, according to these hyper patriots, you've been planted by #JNU group in #BJP. This is what happens when you show a spine or a heart in #NewIndia. All the best! https://t.co/E1w6dT1c8w — Siddharth (@Actor_Siddharth) May 28, 2019 ఇక గంభీర్ తీరును బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సైతం తప్పుబట్టాడు.‘ ఓ వర్గంలో పాపులర్ అయ్యేందుకు కొంతమంది పన్నిన కుట్రలో చిక్కుకోవద్దు. మీరు ప్రకటనలు చేయాల్సిన పనిలేదు. మీరు చేసే పనులే మాట్లాడతాయి’ అంటూ ట్వీట్ చేశాడు. -
స్నేహితులే విరోధులయ్యారు!
‘ఇష్క్, మనం, 24..’ ఇలా లిస్ట్ చూస్తేనే వినూత్నమైన సినిమాలు కనిపిస్తుంటాయి విక్రమ్ కె.కుమార్ ఫిల్మోగ్రఫీలో. కొత్త కాన్సెప్ట్‌లతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేస్తుంటారాయన. ‘హలో’ సినిమా రిలీజ్ అయి ఏడాది కావస్తున్నా ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. లేటెస్ట్గా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఓ మల్టీస్టారర్ ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు విక్రమ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నాని హీరోగా విక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. విశేషం ఏంటంటే... ఇందులో విలన్ పాత్రలో హీరో సిద్ధార్థ్ కనిపిస్తారని సమాచారం. ఆఫ్ స్క్రీన్ నాని, సిద్ధార్థ్ మంచి ఫ్రెండ్స్. మరి ఆన్‌స్క్రీన్‌లో ఇద్దరూ ఎలా విరోధుల్లా మారతారో చూడాలి. అలాగే లవర్‌బాయ్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్ధార్థ్ విలన్‌గా ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథాంశం ఉండబోతోందట. ఇప్పటికే ఈ సినిమాలో నాని లుక్ టెస్ట్ కూడా చేశారట. మరి ఈ చిత్రం సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో చూడాలి. -
నటుడి భార్య ఆత్మహత్య
పెరంబూరు: పిల్లలు పుట్టలేదని మనస్తాపం చెంది నటుడి భార్య ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. మధురవాయిల్‌లో సిద్ధార్థ్ అనే సహాయ నటుడు నివశిస్తున్నాడు. ఇతను ఆది హీరోగా నటించిన యాగవరాయనుమ్, నాకాక్క చిత్రాల్లో సహాయ నటుడిగా నటించాడు. సిద్ధార్థ్ భార్య స్మిరిజ. వీరికి వివాహమై మూడేళ్లు అయ్యింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇదిలాఉండగా సోమవారం రాత్రి సిద్ధార్థ్ భార్యతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేసి ఇంటికి వచ్చారు. అనంతరం దంపతులు గొడవపడినట్లు తెలుస్తోంది. దీంతో స్మిరిజా కోపంగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. సిద్ధార్థ్ హాలులోనే పడుకున్నాడు. ఉదయం నిద్రలేచిన సిద్ధార్థ్ 8.30 గంటలు అవుతున్నా భార్య గది నుంచి బయటకు రాకపోవడంతో తలుపు తట్టి పిలిచాడు. ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే మధురవాయిల్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా స్మిరిజా ఫ్యాన్‌కు ఉరివేసుకుని శవంగా వేలాడుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్మిరిజా మృతదేహాన్ని శవపరిక్ష కోసం కీల్పాక్కం ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ జరుపుతున్నారు. -
స్పెషల్ పొంగల్
చేతిలో వైన్ గ్లాస్. డిఫరెంట్ హెయిర్ స్టైల్. కోపంగా చూస్తున్న చూపు... తెలుగు సినిమాల్లో కనిపించనంత డిఫరెంట్‌గా సిద్ధార్థ్ కనిపిస్తున్నారు కదూ. మలయాళ సినిమా ‘కమ్మార సంభవం’లో సిద్ధూ ఇలా కనిపించనున్నారు. మాలీవుడ్‌లో ఆయనకిది మొదటి సినిమా. రతిష్ అంబత్ దర్శకత్వంలో దిలీప్ కుమార్, సిద్ధార్థ్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ఇది. గత నెల ఈ సినిమాలోని దిలీప్ లుక్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం ఇప్పుడు íసిద్ధార్థ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘దిస్ ఈజ్ మోస్ట్ స్పెషల్ పొంగల్. నేను నటిస్తున్న ఫస్ట్ మలయాళం సినిమా ‘కమ్మార సంభవం’లో నా లుక్ రిలీజ్ అయ్యింది. రితిష్ అంబత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మురళీగోపీ కథ రాశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను’’ అని పేర్కొన్నారు సిద్ధార్థ్. -
డ్రింక్స్ బ్రేక్‌లో శుభవార్త!
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీలో భాగంగా పంజాబ్, సర్వీసెస్ మధ్య మ్యాచ్... వేదిక అమృత్‌సర్‌లోని గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్. డ్రింక్స్ బ్రేక్‌లో రిఫరీ సూచన మేరకు అంపైర్ పంజాబ్ జట్టులోని ఓ ఆటగాడిని పిలిచి ఏదో సమాచారమిచ్చాడు. అంతటితో ఆ క్రికెటర్ ఆనందానికి అవధుల్లేవు. అతనే పంజాబ్ పేస్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్. భారత వన్డే జట్టులో కౌల్ ఎంపికైన విషయం ఫీల్డ్ అంపైర్ ద్వారానే అతనికి తెలిసింది. టీమిండియాలో చోటు కోసం కౌల్ నిరీక్షణ సుదీర్ఘ కాలంగా కొనసాగింది. కోహ్లి నాయకత్వంలో 2008 అండర్–19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కౌల్ కూడా సభ్యుడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో విజయానికి దక్షిణాఫ్రికా చివరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా... కౌల్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టును విజేతగా నిలిపాడు. కోహ్లి స్టార్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగి కెప్టెన్‌గా మారినా... నాటి జట్టులోని జడేజా ప్రస్తుతం కీలక ఆటగాడిగా ఎదగడంతో పాటు అభినవ్ ముకుంద్, సౌరభ్ తివారీ వంటి వారు ఇప్పటికే భారత్‌కు ప్రాతినిధ్యం వహించినా... సిద్ధార్థ్ కౌల్‌కు మాత్రం జాతీయ సీనియర్ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. అయినా నమ్మకం కోల్పోకుండా దేశవాళీలో స్థిరమైన ప్రతిభతో రాణిస్తూనే ఉన్నాడు. ఇన్నాళ్లకు కౌల్‌కు భారత జట్టు నుంచి పిలుపొచ్చింది. సర్వీసెస్‌తో రంజీ మ్యాచ్ ఆడుతుండగానే శ్రీలంకతో వన్డేలకు ఎంపికైనట్లు తెలిసిందని... గ్రౌండ్లో ఉండగానే ఇంత గొప్ప వార్త వినడాన్ని జీవితంలో మరిచిపోలేనని కౌల్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో అతను ఐదు వికెట్లు తీసుకున్నాడు. పంజాబ్‌కు ఆడుతున్న సమయంలో యువరాజ్, హర్భజన్ సింగ్‌ల సలహాలతో మరింత రాటుదేలానని సిద్ధార్థ్ పేర్కొన్నాడు. ఆలస్యంగానైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నాడు. -
డై..లాగి కొడితే....
సినిమా : బొమ్మరిల్లు రచన: అబ్బూరి రవి, దర్శకత్వం: భాస్కర్ ఫ్రెండ్స్‌తో కలిసి గుడికెళ్లిన సిద్దు (సిద్దార్థ్) పొరపాటున హాసినిని (జెనీలియా) ఢీ కొడతాడు. అప్పుడు ఏర్పడిన పరిచయంతో హాసిని ఇంటి దగ్గర బస్‌స్టాప్‌లో వెయిట్ చేస్తుంటాడు సిద్ధు. హాసిని రాగానే హాయ్.. ఆరోజు గుడిలో సరిగ్గా మాట్లాడుకోలేదు కదా.. అందుకనీ అంటాడు. అయితే? అని హాసిని బదులివ్వగానే ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అంటాడు సిద్దు. ఇడియట్ అని కాలేజీకి వెళ్లిపోతుంది హాసిని. ఆమె కోసం కాలేజీకి వెళతాడు అతను. ఏదో గుడిలో కలిసావని మళ్లీ వస్తే సైట్ కొడుతున్నాడు.. లైనేస్తున్నాడని క్యారెక్టర్ డిసైడ్ చేస్తావా? నేను అలాంటి వాడిని కాదు. నేనూ ఇదే కాలేజీలో చదివా, కావాలంటే ఎంక్వైరీ చేసుకోమంటూ హాసినీకి చెప్పి వెళుతుంటాడు సిద్ధు. అప్పుడు హాసిని అంతేనా.. అంటుంది. ఇంకేం కావాలంటాడు సిద్ధు. వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ... అంటుంది హాసిని. ఈ డైలాగ్ ఎంత పాపులర్ అంటే సెల్‌ఫోన్స్‌లో రింగ్‌టోన్‌గా మోతమోగిపోయింది. -
ప్రేమ పేరెత్తితే భయపడుతున్న సిద్ధార్థ్
-
సమంత,సిద్దార్థ విడిపోయారా..?
-
ఎవరికీ పోటీ కాను
సిద్ధార్థ్ నటించిన ‘జిగర్తండా’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల తర్వాత ఒక సంవత్సరం ప్రత్యేకత కలిగి ఉంటుందన్నారు. 2014 తనకు అటువంటి ప్రత్యేకత కల్పించిందన్నారు. ఈ ఏడాది మొదట్లో విడుదలయిన జిగర్తండా పెద్ద హిట్ సాధించిందన్నారు. వసంతబాలన్ దర్శకత్వంలో ‘కావ్య తలైవన్’, కన్నడ రీమేక్ చిత్రం ‘లూసియా’ చిత్రాలు త్వరలో విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ రెండు చిత్రాలు భిన్న కథాంశాలతో రూపొందాయని తెలిపారు. ఇవి కూడా విజయం సాధిస్తాయన్నారు. తన నిర్మాణంలో చిత్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనేక సంవత్సరాల క్రితం రంగ్ దే బసంతి చిత్రంలో అమీర్‌ఖాన్‌తో నటిస్తుండగా ఆయన తన పాత్రకు మంచి స్కోప్ అందజేసి సహకరించారని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా జిగర్తండా చిత్రంలోను మరో పాత్రలో నటించిన సింహా కరతాళధ్వనులు అందుకోనున్నారని గ్రహించానని చెప్పారు. అందుకోసమే తాను నటించానన్నారు. సాటి నటులకు సహకరించడాన్ని అమీర్‌ఖాన్ నుంచి నేర్చుకున్నానని వెల్లడించారు. ఈ ఏడాది వివాహం చేసుకోనని, వచ్చే ఏడాది జరగవచ్చని పేర్కొన్నారు. దీని గురించి ఇప్పుడే ప్రముఖంగా ప్రస్తావించదలచుకోలేదన్నారు. తెలుగు చిత్రసీమ నుంచి వైదొలగలేదని, తర్వాత రెండు చిత్రాల్లో నటించనున్నానని తెలిపారు. తెలుగులో అభిమానులు తననెంతో ఆదరించారని, వారిని ఎప్పటికీ విడిచివెళ్లనని సిద్ధార్థ్ తెలిపారు. -
మూడు తరాలుగా తిరుగులేని టైటిల్
రంగురంగుల సినీ ప్రపంచం టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ ఎక్కడైనా వింతలూ విశేషాలకు కొదవే వుండదు. సినిమాల టైటిల్స్ కొన్నింటికి కాలంతో పని ఉండదు. ఎప్పుడైనా చలామణి అవుతాయి. ఒకే సినిమా టైటిల్ మూడు తరాలుగా పరిశ్రమలో ప్రయాణం చేస్తోంది. అప్పటికి ఇప్పటికీ ఆ టైటిల్‌కు అంతటి పవర్ ఉంది. అదే 'చిక్కడు దొరకడు'. 1967లో జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో నిర్మించిన 'చిక్కడు దొరకడు'లో ఎన్టీఆర్ ద్విపాత్రభినయం చేశారు. ఇందులో ఎన్టీఆర్ -జయలలిత జంటగా నటించారు. ఆ తరువాత వీరిద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ తర్వాత 1988లో హాస్య బ్రహ్మ రేలంగి నరసింహారావు దర్శకత్వంలో రూపొందించిన 'చిక్కడు దొరకడు'లో రాజేంద్రప్రసాద్- రజని జంటగా నటించారు. అదే 'చిక్కడు దొరకడు' పేరుతో ఇప్పుడు నిర్మిస్తున్న చిత్రంలో లవర్ బాయ్ సిద్దార్ద్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మధ్య సరైన విజయాల్లేక డీలాపడిన సిద్ధార్ధ్ తెలుగు-తమిళ భాషల్లో నిర్మించిన ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న 'జిగర్తండా' అనే సినిమాను తెలుగులో చిక్కడు దొరకడుగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో సిద్దార్ద్ దర్శకుడి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సినిమా దర్శకుడు అవ్వడం కోసం మదురై వెళ్లిన సిద్ధార్థ్‌కు అక్కడ ఇడ్లీలు అమ్ముకునే అమ్మాయి లక్ష్మీ మీనన్ పరిచయం అవుతుంది. ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మన సిద్ధార్ధ అసలు వచ్చిన విషయం మరచిపోయి హీరోయిజం చూపిస్తాడు. ఇదే ప్రధాన కథ. ప్రేమ - యాక్షన్ - డ్రామా సమ్మిళితంగా వస్తున్న ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్ చెబుతున్నారు. - శిసూర్య -
నిర్మాతపై సినీనటుడు సిద్దార్థ్ ఆగ్రహం!
జిగర్థాండ (తెలుగు డబ్బింగ్: చిక్కడు దొరకడు) చిత్రం వివాదంలో చిక్కుకుంది. సినిమా విడుదలను తమకు చెప్పకుండా వాయిదా వేశారనే కారణంతో జిగర్థాండ నిర్మాత కదిరేశన్ పై సినీనటుడు సిద్దార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిగర్థాండ చిత్రం వాస్తవానికి జూలై 25 తేదిన శుక్రవారం తమిళనాడులో విడుదల కావాల్సి ఉంది. అయితే చెప్పపెట్టకుండా విడుదలను నిర్మాత వాయిదా వేశారని సిద్దార్థ్ అన్నారు. మీరెవరైనా కానివ్వండి.. ఇలాంటి డర్టీ గేమ్ ఆడకండి. సినిమాను విడుదల చేయడంలో ఆలస్యం కావొచ్చు. కాని మమ్మల్ని ఆపలేవు అని ట్వీట్ చేశారు. ఓ మంచి చిత్రాన్ని విడుదల కాకుండా ఆపడం మంచిది కాదని సిద్దార్థ్ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పలు సందేశాలు పోస్ట్ చేయడం తాజా ఓ వివాదానికి దారి తీసింది. జిగర్థాండ చిత్రం కోసం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, ఇతర సభ్యులు చాలా కష్టించి పనిచేశారని.. తమతో సంప్రదించకుండా.. కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా.. చిత్ర విడుదలను వాయిదా వేశారు అని ట్విటర్ లో తెలిపారు. జిగర్థాండ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు క్షమాపణ చెబుతున్నానని సిద్దార్థ్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. Whoever you are who aided in this dirty game, you can delay us you cannot stop us. A good film cannot be killed. #JIGARTHANDA — Siddharth (@Actor_Siddharth) July 21, 2014 Karthik, our whole team and I worked really hard for Jigarthanda.With no respect for us, without even discussing it with us...postponed. — Siddharth (@Actor_Siddharth) July 21, 2014 -
నువ్వు నాకు కొండంత బలం
నటుడు సిద్ధార్థ్, సమంత మధ్య ఏదో ఉందన్న విషయాన్ని మీడియా కోడై కూస్తు న్నా, తమ మధ్య స్నేహం మినహా మరేమీ లేదని ఈ జంట పేర్కొంటోంది. నిప్పు లేని దే పొగరాదన్న విషయం వీరికి తెలిసినా తెలి యనట్లు ప్రవర్తిస్తున్నారని సినీ పండితులు అంటున్నారు. సిద్ధార్థ్ గురువారం తన పుట్టి న రోజును జరుపుకున్నారు. ఈ సందర్భం గా ఈ ప్రేమజంట గంటల తరబడి పోన్లో ప్రేమ ముచ్చట్లు వల్లె వేసుకున్నారట. అంతేకాదు. సిద్ధార్థ్ పుట్టిన రోజు ముందు అర్ధరాత్రి రెండు గంటలకు సమంత తన ట్విట్టర్లో సిద్ధార్థ్‌కు తనను మంత్రముగ్దురాలిని చేసే నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. నువ్వే నాకు కొండంత బలం, అందుకు థ్యాంక్స్ అని కూడా పోస్ట్ చేశారు. సిద్ధార్థ్ బదులిస్తూ తనకు 35 ఏళ్లు నిండిన సందర్భంగా ట్విట్టర్లో ముద్దుల వర్షం కురి పించిన వారికి, ఆశీస్సులు అందించిన వారి కి ధన్యవాదాలు అని తెలిపారు. దీంతో సిద్ధార్థ్, సమంత ప్రేమ వ్యవహారం గురించి చిత్ర పరిశ్రమలో ఆసక్తికర చర్చ మొదలైంది. -
శైవం మూవీ ఆడియో ఆవిష్కరణ
-
సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా యాక్షన్ డ్రామా
'పిజ్జా'తో దర్శకునిగా తన ప్రతిభ నిరూపించుకున్న కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'జిగర్తండా'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా నటిస్తున్నారు. ఎస్.కె. పిక్చర్స్, వి.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్నితెలుగులో అందిస్తున్నాయి. ఒక షెడ్యూల్ మినహా ఈ చిత్రం పూర్తయ్యింది. తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే అద్భుతమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, సిద్ధార్ధ్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని, ఓ ప్రముఖ తెలుగు హీరో ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్నారని చిత్ర నిర్మాతల్లో ఒకరైన వి.ఎస్. రామిరెడ్డి చెప్పారు. 'తొలి చిత్రం 'పిజ్జా'తో కార్తీక్ సుబ్బరాజ్ మంచి దర్శకునిగా నిరూపించుకున్నారని, మలి ప్రయత్నంగా ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సురేష్ కొండేటి తెలిపారు. వేసవి కానుకగా విడుదల చేయబోతున్న ఈ చిత్రం కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందన్నారు. బాబీ సింహా, కరుణ, గురు సోమసుందరం, ప్రతాప్ పోతన్, సౌందర రాజా, వినోధిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: గేవ్ మిక్ యు యారీ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్. -
సమంత రహస్య వివాహమా?
నిత్యం వార్తల్లో ఉంటోన్న హీరోయిన్లలో సమంత ఒకరు. ఈ చెన్నై బ్యూటీపై పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా సిద్ధార్థ్‌తో ప్రేమాయణం సాగిస్తోందని, త్వరలోనే రహస్యంగా వివాహం చేసుకోనుందని ప్రచారం సాగుతోంది. ఈ వదంతులపై సమంత స్పందించింది. తన వివాహం గురించి రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఒకరితో సహజీనం చేస్తున్నానని, రహస్యంగా వివాహం చేసుకోనున్నానని అంటున్నారని పేర్కొంది. ఇవన్నీ అబద్ధాలని స్పష్టం చేసింది. అసలు తానెందుకు రహస్యంగా వివాహం చేసుకోవాలని ప్రశ్నించింది. ప్రస్తుతానికి తనకు పెళ్లి ఆలోచన లేదని, కొన్నేళ్ల తర్వాతే దీని గురించి ఆలోచిస్తానని వివరించింది. తాను వివాహం చేసుకునే ముందు అందరికీ తెలియజేస్తానని పేర్కొంది. వచ్చే ఏడాది తమిళ చిత్రాలపైనే పూర్తిగా దృష్టి సారిస్తానని స్పష్టం చేసింది. తాను నటించిన తెలుగు చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందని చెప్పింది. తర్వాత తెలుగు చిత్రం ఏదీ అంగీకరించేది లేదని తెలిపింది. ఇటీవలి ఆమెను ఇంతకీ మీ ప్రేమ ప్రయాణం ఎలా సాగుతోందని మీడియా అడిగిన ప్రశ్నకు 'చాలా బలంగా సాగుతోంది. మా ప్రేమకు ‘బ్రేకప్’ ఉండదు. అంత అవగాహనతో ముందుకెళుతున్నాం'అని చెప్పింది కూడా.