
నువ్వు నాకు కొండంత బలం
నటుడు సిద్ధార్థ్, సమంత మధ్య ఏదో ఉందన్న విషయాన్ని మీడియా కోడై కూస్తు న్నా, తమ మధ్య స్నేహం మినహా మరేమీ లేదని ఈ జంట పేర్కొంటోంది. నిప్పు లేని దే పొగరాదన్న విషయం వీరికి తెలిసినా తెలి యనట్లు ప్రవర్తిస్తున్నారని సినీ పండితులు అంటున్నారు. సిద్ధార్థ్ గురువారం తన పుట్టి న రోజును జరుపుకున్నారు. ఈ సందర్భం గా ఈ ప్రేమజంట గంటల తరబడి పోన్‌లో ప్రేమ ముచ్చట్లు వల్లె వేసుకున్నారట. అంతేకాదు.
సిద్ధార్థ్ పుట్టిన రోజు ముందు అర్ధరాత్రి రెండు గంటలకు సమంత తన ట్విట్టర్‌లో సిద్ధార్థ్‌కు తనను మంత్రముగ్దురాలిని చేసే నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. నువ్వే నాకు కొండంత బలం, అందుకు థ్యాంక్స్ అని కూడా పోస్ట్ చేశారు. సిద్ధార్థ్ బదులిస్తూ తనకు 35 ఏళ్లు నిండిన సందర్భంగా ట్విట్టర్‌లో ముద్దుల వర్షం కురి పించిన వారికి, ఆశీస్సులు అందించిన వారి కి ధన్యవాదాలు అని తెలిపారు. దీంతో సిద్ధార్థ్, సమంత ప్రేమ వ్యవహారం గురించి చిత్ర పరిశ్రమలో ఆసక్తికర చర్చ మొదలైంది.