Samantha Cryptic Comments On Love And Hate In Fans Q&A Session, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha: సమంతకు ప్రేమపై నమ్మకం పోయిందా? ఆమె ట్వీట్‌ అర్థం ఏంటి?

Published Sat, Apr 30 2022 4:46 PM | Last Updated on Sat, Apr 30 2022 6:19 PM

Samantha Intresting Comments On Love And Hate - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత తాజాగా నటించిన సినిమా కాతువాక్కుల రెండు కాదల్‌. ఈ సినిమాని తెలుగులో ‘కణ్మణి ర్యాంబో ఖతీజా’ పేరుతో విడుదల చేశారు. విజయ్‌ సేతుపతి, నయనతారతో పాటు సమంత నటించిన ఈ సినిమా ఏప్రిల్‌28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించిన సమంత వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.చదవండి: ఎప్పటికీ కృతజ్ఞురాలినే,మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా : సమంత

ప్రేక్షకులను నవ్వించడం కోసమే ఖతీజా పాత్రలో నటించానని చెప్పిన సమంత ప్రతి ఒక్కరు వారి జీవితంలో కాస్త విరామం ఇచ్చి ఈ సినిమా చూసి హాయిగా నవ్వుకోమని కోరింది. ఇక ఈ సినిమాలో తనకు ‘డిప్పం డిప్పం’ పాట అంటే ఎంతో ఇష్టమని సమంత ఈ సందర్భంగా పేర్కొంది. నయనతార గురించి చెబుతూ..తాను కలిసిన వాళ్లలో  మోస్ట్ హార్డ్ వ‌ర్కింగ్ ప‌ర్స‌న్ న‌యన‌తార అని ఆమెలాంటి వ్యక్తి మరొకరు ఉండరు అని పేర్కొంది.

ఇక ఓ నెటిజన్‌ ఒకే సమయంలో ప్రేక్షకుల నుంచి ప్రేమ, విపరీతమైన ద్వేషం రావడం ఎలా అనిపిస్తుంది అని అడగ్గా.. ఆ రెండింటికి దూరంగా ఉంటానని, అయితే అభిమానులు తనపై చూపించే ప్రేమకు కృతఙ్ఞతతో ఉంటానని సామ్‌ చెప్పుకొచ్చింది. దీంతో ప్రేమ‌పై కూడా త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని ఈ సమాధానం ద్వారా సమంత చెప్ప‌క‌నే చెప్పింది అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. చదవండి: సమంతపై ప్రాంక్‌.. విజయ్‌ సర్‌ప్రైజ్‌ మామూలుగా లేదుగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement