
సమంత- నాగచైతన్య విడిపోయి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. అయితే ఇప్పటివరకు తన విడాకులపై మాట్లాడని నాగచైతన్య తొలిసారిగా తాము విడాకులు తీసుకోవడానికి వెనకున్న కారణాలను బయటపెట్టాడు. సమంతతో గడిపిన రోజుల్ని చాలా గౌరవిస్తానని, ఆమె చాలా లవ్లీ పర్సన్ అంటూ మాజీ భార్యపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా సమంత ఎప్పటికీ సంతోషంగా ఉండాలని, అన్ని ఆనందాలకు ఆమె అర్హురాలు అంటూ కామెంట్స్ చేశాడు.
చదవండి: అందుకే విడాకులు తీసుకున్నా, సమంత సంతోషంగా ఉండాలి: చై
దీంతో నాగచైతన్య వ్యాఖ్యలు క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారాయి. విడిపోయినా వీరికి ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం ఉందని, చై-సామ్‌లు మళ్లీ కలిసుంటే బాగుంటుందంటూ పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
మనమంతా ఒక్కటే. కేవలం అహంకారం, భయాలు మనల్ని దూరం చేస్తాయి అంటూ ఓ కొటేషన్‌ను సమంత ఇన్‌స్టాలో షేర్ చేసింది. చై కామెంట్స్ అనంతరం సామ్ ఇలా పోస్ట్ చేయడంతో వీరు ఈగోలకు పోయి విడిపోయారా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నాగచైతన్య కూడా సోషల్ మీడియాలో వచ్చిన పుకార్ల వల్లే తమ మధ్య దూరం పెరిగిందని, ఆ గొడవలు విడిపోయేవరకు వచ్చిందని స్వయంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment