
సమంత-నాగచైతన్య విడిపోయి 10నెలలు కావొస్తున్నా వీరి విడాకులపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది.ఇక లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. అయితే ఇందులో సినిమాకు సంబంధించిన విషయాలే కాకుండా పర్సనల్ లైఫ్‌పై కూడా చై ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇప్పటికే సమంతతో భవిష్యత్తులో నటించే అవకాశం ఉందా అని అడగ్గా అలా జరిగితే క్రేజీగా ఉంటుందని బదులిచ్చిన చై తాజాగా మరోసారి సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
చదవండి: సమంతను గుర్తుచేసే ఆ టాటూని నాగ చైతన్య తొలగిస్తాడా?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూకు ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో భాగంగా సమంత మీకు ఎదురు పడితే ఏం చేస్తారు అని అడగ్గా.. ఆమెకు హాయ్ చెప్పి హగ్ ఇస్తానంటూ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో చై చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో ఇదే ప్రశ్న సమంతకు కూడా ఎదురైన సంగతి తెలిసిందే.
అందుకు బదులుగా సమాధానమిస్తూ.. మా ఇద్దరిని ఒకే గదిలో ఉంచితే అక్కడ పదునైన వస్తులేవీ లేకుండా చూసుకోవాలి అంటూ సామ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ చై మాత్రం హాయ్ చెప్పడమే కాకుండా హగ్ ఇస్తానంటూ షాకింగ్ ఆన్సర్ ఇవ్వడంతో వీరిద్దరి ఆలోచనలకు ఎంత తేడా ఉంది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: 'ఇన్‌స్టాలో బ్లాక్ చేసుకున్నాం.. కలిసుండటం ఇక జరగదు'
Comments
Please login to add a commentAdd a comment