Samantha Sends Best Wishes To Akhil Akkineni For Agent Movie - Sakshi
Sakshi News home page

Samantha : చైతో విడిపోయినా అక్కినేని ఫ్యామిలీతో ఇంకా టచ్‌లో ఉన్న సమంత

Published Sat, Feb 4 2023 5:50 PM | Last Updated on Sat, Feb 4 2023 6:25 PM

Samantha Reply To Akkineni Akhil Latest Post About Agent Movie - Sakshi

సమంత-నాగచైతన్య ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్‌ క్యూటెస్ట్‌ కపుల్‌గా వీరికి పేరుంది. 'ఏ మాయ చేశావే' సినిమాతో తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న వీరు 2017లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఆన్‌ స్క్రీన్‌ అయినా, ఆఫ్‌ స్క్రీన్‌లో అయినా వీరి కెమిస్ట్రీ చూస్తే ముచ్చటేసేది. కానీ ఏమైందో ఏమో కానీ వీరి వివాహ బంధం బీటలు వారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే చై-సామ్‌లు 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనికి గల కారణాలు ఏంటన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.

ఇదిలా ఉంటే నాగ చైతన్యతో విడిపోయినా అక్కినేని కుటుంబంతో మాత్రం సమంతకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉందన్నది పలుమార్లు రుజువైంది. తాజాగా అక్కినేని అఖిల్‌, షేర్‌ చేసిన ఓ పోస్ట్‌కు సైతం సమంత స్పందించింది. స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ఏజెంట్‌. 

స్పై యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు.దీనికి సంబంధించి ఓ పవర్‌ఫుల్‌ వీడియోను కూడా వదిలారు. తాజాగా ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ అఖిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకోగా దీనికి సమంత లైక్‌ కొట్టడంతో పాటు 'బీస్ట్‌ మోడ్‌' అంటూ కామెంట్‌ చేసింది. 

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కూడా గతేడాది అఖిల్‌ బర్త్‌డేకు సామ్‌ విష్‌ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా సమంత శాకుంతలం పోస్ట్‌ను హీరో సుశాంత్‌ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే చైతో డివోర్స్‌ అయినా అక్కినేని కుటుంబంతో సమంతకు మంచి రిలేషనే ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement