స్టార్ హీరోయిన్ సమంత పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆమె విడాకులు. ఎందుకంటే లవ్ చేసి మరీ హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం ఎన్నాళ్లు నిలబడలేదు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సింగిల్గానే ఉంటున్న సామ్.. మరోసారి ప్రేమలో పడిందా అనే డౌట్ కొడుతోంది. ఎందుకంటే పరిస్థితులు అలా కనిపిస్తున్నాయ్ మరి!
స్టార్ హీరోయిన్‌గా సమంత అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. దక్షిణాదిలో చాలామంది స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. అయితే ఈ మధ్య సమంత పెద్దగా కలిసి రాలేదు. గతేడాది చివర్లో వచ్చిన యశోద, ఈ ఏప్రిల్‌లో రిలీజైన 'శాకుంతలం'.. రెండు నిరాశపరిచాయి. ఇక సామ్ నటించిన 'ఖుషి', 'సిటాడెల్' వెబ్ సిరీస్ ఈ ఏడాదిలో రిలీజ్ కాబోతున్నాయి.
(ఇదీ చదవండి: ధోనీ తొలి సినిమా టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?)
మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సామ్.. దానికి చికిత్స తీసుకునేందుకు ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఓ ఏడాది పాటు షూటింగ్స్, సినిమాలకు దూరం అనమాట. ఈ విషయం పక్కనబెడితే ఈ మధ్య ప్రేమ గురించి ఇన్ స్టా స్టోరీలు తెగ పోస్ట్ చేస్తోంది. ఇప్పుడు కూడా.. 'ఎక్కువ ద్వేషించే మనుషులు, మాటలు చూసి ఉంటావేమో కానీ ఈ ప్రపంచంలో మనం ఊహించిన దానికంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది' అని ఓ కొటేషన్ పిక్ షేర్ చేసింది.
గతంలో ఇలాంటి ప్రేమకు సంబంధించిన స్టేటస్లని అప్పుడప్పుడు సామ్ పోస్ట్ చేస్తూనే ఉంది. అయితే ఇదేదో ఒకటో రెండుసార్లు అంటే అనుకోవచ్చు. అప్పుడప్పుడు ఇలాంటి పిక్స్ చూస్తున్న సామ్ ఫ్యాన్స్‌కి.. ఈమె మరోసారి ప్రేమలో పడిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ పడితే ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు అయ్యుంటారా అని కామెంట్స్ చేస్తున్నారు. దీని గురించి సామ్ క్లారిటీ ఇస్తే తప్ప అసలు విషయం బయటపడదు.
(ఇదీ చదవండి: 'కల్కి' టీమ్ ముందు జాగ్రత్త.. దానికి భయపడి!)
Comments
Please login to add a commentAdd a comment