ప్రేమ అంటేనే త్యాగం.. అవతలి వైపు ఆశించొద్దు: సమంత పోస్ట్ వైరల్ | Tollywood Actress Samantha Shares Cryptic Post On Love, Sacrifice And Friendship Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Samantha Viral Post: త్యాగానికి ప్రతిరూపమే ప్రేమ, బంధం: సమంత పోస్ట్ వైరల్

Aug 26 2024 12:27 PM | Updated on Aug 26 2024 3:06 PM

Tollywood Actress Samantha Shares Cryptic Post On Love and Friendship

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. రాజ్ నిడిమోరు, డీకే డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన కనిపించనుంది. ఆ తర్వాత  బంగారం అనే మరో మూవీలో కనిపించనుంది. అయితే ఇటీవల నాగచైతన్య  ఎంగేజ్‌మెంట్‌ తర్వాత సోషల్ మీడియాలో పలురకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. డైరెక్టర్‌ రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్‌లో ఉందంటూ వార్తలొచ్చాయి. ‍అయితే తాజాగా ప్రేమ, స్నేహం, బంధం గురించి సమంత చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 
 

తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. "చాలా మంది వ్యక్తులు స్నేహాలు, సంబంధాలను పరస్పరం కొనసాగిస్తారు. వీటిని నేను కూడా అంగీకరిస్తున్నాను. మీరు ప్రేమను పంచుతారు. నేను కూడా తిరిగి ఇస్తాను. కానీ కొన్నేళ్లుగా నేను నేర్చుకున్నది ఏంటంటే.. మనం ప్రేమను పంచే ఎదుటి వ్యక్తి తిరిగి ఇచ్చే స్థితిలో లేనప్పుడు కూడా ప్రేమను అందజేస్తాం. ఎందుకంటే ప్రేమ అనేది ఓ త్యాగం. మనకు అవతలి వైపు నుంచి ప్రేమ, ‍అప్యాయతలు అందకపోయినా.. ఇప్పటికీ తమ ప్రేమను ధారపోస్తున్న వ్యక్తులకు కృతజ్ఞతలు." అంటూ పోస్ట్ చేసింది. నాగ చైతన్య నిశ్చితార్థం తర్వాత ప్రేమ, త్యాగం అంటూ సమంత పోస్ట్ చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. samantha

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement