
భర్త సిద్ధార్థ్‌తో స్మిరిజా (ఫైల్)
పెరంబూరు: పిల్లలు పుట్టలేదని మనస్తాపం చెంది నటుడి భార్య ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. మధురవాయిల్‌లో సిద్ధార్థ్ అనే సహాయ నటుడు నివశిస్తున్నాడు. ఇతను ఆది హీరోగా నటించిన యాగవరాయనుమ్, నాకాక్క చిత్రాల్లో సహాయ నటుడిగా నటించాడు. సిద్ధార్థ్ భార్య స్మిరిజ. వీరికి వివాహమై మూడేళ్లు అయ్యింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇదిలాఉండగా సోమవారం రాత్రి సిద్ధార్థ్ భార్యతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేసి ఇంటికి వచ్చారు.
అనంతరం దంపతులు గొడవపడినట్లు తెలుస్తోంది. దీంతో స్మిరిజా కోపంగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. సిద్ధార్థ్ హాలులోనే పడుకున్నాడు. ఉదయం నిద్రలేచిన సిద్ధార్థ్ 8.30 గంటలు అవుతున్నా భార్య గది నుంచి బయటకు రాకపోవడంతో తలుపు తట్టి పిలిచాడు. ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే మధురవాయిల్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా స్మిరిజా ఫ్యాన్‌కు ఉరివేసుకుని శవంగా వేలాడుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్మిరిజా మృతదేహాన్ని శవపరిక్ష కోసం కీల్‌పాక్కం ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment