CCTV Footage of Bhojpuri Actress Akanksha Dubey Entering Hotel Room - Sakshi
Sakshi News home page

Akanksha Dubey: హోటల్‌లో నటి సూసైడ్.. సీసీటీవీలో మిస్టరీ మ్యాన్?

Published Sun, Apr 2 2023 1:41 PM | Last Updated on Sun, Apr 2 2023 3:42 PM

CCTV footage of Bhojpuri actress Akanksha Dubey entering hotel room  - Sakshi

భోజ్‌పురి నటి ఇటీవల వారణాసి ఓ హోటల్‌లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్యకు ముందే ఓ వీడియో సాంగ్‌ను కూడా రిలీజ్ చేసింది. అయితే నటి ఆత్మహత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సూసైడ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారణాలపై ఆరా తీస్తున్నారు. తాజాగా బయటకొచ్చిన హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌లో మరో వ్యక్తి కూడా నటితో కనిపించడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అతను ఎవరన్నదానిపై ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. మార్చి 26న ఆకాంక్ష తన హోటల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. 

ఇప్పటికే ఆమె సూసైడ్ చేసుకున్న రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆమె హోటల్ గదిలో  17 నిమిషాల పాటు ఉన్నట్లు  పోలీసులు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న మిస్టరీ మ్యాన్‌ ఆకాంక్షతో పాటే ఉన్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కానీ అతని ముఖం ఆ వీడియో ఫుటేజీలో తగినంత స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో ఆ మిస్టరీ మ్యాన్ ఎవరనేది పోలీసులు  గుర్తించలేకపోతున్నారు. కాగా.. ఆకాంక్ష దుబే 'లైక్ హూన్ మై నాలైక్ నహిన్' చిత్రం షూటింగ్ కోసం వారణాసిలోని ఒక హోటల్‌లో బస చేసింది.

ప్రియుడిపై కేసు నమోదు

ఆకాంక్ష మరణానంతరం ఆమె ప్రియుడు సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్‌  వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె తల్లి కేసు పెట్టింది. సమర్ సింగ్ తన కుమార్తెను కొట్టేవాడని, అతని సోదరుడు చంపేస్తానని బెదిరించాడని ఆకాంక్ష తల్లి తన పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆకాంక్ష మరణించినప్పటి నుంచి సింగ్ సోదరులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement