నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. భోజ్ పురి ఫేమస్ నటి అయిన ఆకాంక్ష వారణాసిలోని ఓ హోటల్ రూంలో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. షూటింగ్‌లో భాగంగా ఓ హోటల్‌లో బస చేసిన ఆమె అక్కడే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది.చనిపోయే ముందు కూడా ఫాలోవర్స్‌తో ఇన్‌స్టా లైవ్‌లో ముచ్చటించిన ఆమె సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజాగా ఆకాంక్ష దుబే పోస్టుమార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆమె కడుపులో 20 మీ.లీ. గుర్తు తెలియని లిక్విడ్‌ని గుర్తించారు. అలాగే ఆమె మణికట్టుపై కూడా గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఆకాంక్ష దుబేది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
కాగా ఆకాంక్ష కొంతకాలంగా సహనటుడు సమర్ సింగ్‌తో ప్రేమలో ఉంది. ఆకాంక్ష మరణానంతరం సమర్ సింగ్‌తో పాటు అతని సోదరుడు సంజయ్ సింగ్ పరారీలో ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment