cctv
-
ఓ వీడియో విడుదల చేసిన మంత్రి కొల్లు రవీంద్ర
-
ఇంటర్ పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో అత్యాధునిక సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ఇంటరీ్మడియట్ విద్యామండలి (టీజీబీఐఈ) ఓ విప్లవాత్మక అడుగు ముందుకేసింది.రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సిస్టంతో అనుసంధానించారు. టీజీబీఐఈ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ పనితీరును శుక్రవారం విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు, జ్యోత్స్నరెడ్డిలతో కలిసి పరిశీలించారు.తెలంగాణ విద్యావ్యవస్థలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థతో పరీక్ష కేంద్రాలను రియల్‌టైంలో పర్యవేక్షించడంతోపాటు న్యాయమైన పరీక్ష వాతావరణాన్ని ఏర్పాటు చేయొచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో ఏర్పాటు చేసిన 8,000 కంటే ఎక్కువ హైరిజల్యూషన్ కెమెరాలతో అనుసంధానం చేసిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పనితీరును బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య వివరించారు. ఈ నూతన వ్యవస్థతో పరీక్షల నిర్వహణను ఏకకాలంలో పర్యవేక్షించడానికి, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చేయడంతోపాటు ఏవైనా అవకతవకలను నివారించడానికి వీలు ఉంటుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడంపై అధికారులను మురళి ప్రశంసించారు. ఇది విద్యారంగంలో ఒక మైలురాయిగా, పరీక్ష సంస్కరణలకు కొత్త ప్రమాణంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ములుగు జిల్లాలోని ఒక ప్రభుత్వ కళాశాలను సీసీటీవీ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థపై నమ్మకం, విశ్వాసాన్ని ఈ వ్యవస్థ బలోపేతం చేస్తుందని, ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఇతర విద్యా బోర్డులకు ఆదర్శప్రాయమైన నమూనాగా పనిచేస్తుందని చెప్పారు. -
పోలీసులకు మా ఆదేశాలంటే.. గౌరవం లేదు: హైకోర్టు
-
సైఫ్ అలీ ఖాన్ కేసులో కీలక పరిణామం.. సీసీటీవీల్లో నిందితుడి దృశ్యాలు
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోని సీసీ ఫుటేజ్‌ను పోలీసులు రిలీజ్ చేశారు. అందులో నిందితుడు మెట్లపై నుంచి దిగుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇవాళ తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే..బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై ఇవాళ తెల్లవారుజామున దాడి జరిగింది. ముంబయిలోని ఆయన నివాసంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సైఫ్.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. ఆయనకు సర్జరీ చేయగా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.ముంబై పోలీసుల కథనం ప్రకారం.. తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించగా.. ఆయన సిబ్బంది గట్టిగా అరవడంతో మేల్కొన్న సైఫ్.. ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ దొంగ సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాడపడ్డ సైఫ్‌ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. -
నల్లగొండ జిల్లా కేతేపల్లిలో రోడ్డు ప్రమాదం
-
"అన్న మోసం చేశాడని.." తిరుపతిలో దారుణం
-
ఎద్దులను ఎత్తుకెళ్లిన దొంగలు
-
నేను గీతాంజలిలా కాదు.. ఒక్కొక్కరి అంతు తేల్చేస్తా
-
పరారీలో టీడీపీ నేతలు
-
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్పై మహిళా ఉద్యోగి వేధింపుల అభియోగం మోపిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ, ఆమె పోలీసులు మినహా 100 మందికి సంబంధిత సీసీటీవీ ఫుటేజీని చూపుతామని రాజ్ భవన్ అధికారిక ప్రకటన చేసింది.రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రజలు తమ అభ్యర్థనలు ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా పంపాలని కోరింది. మొదటి 100 మంది వ్యక్తులు గురువారం ఉదయం గవర్నర్ హౌస్ లోపల ఫుటేజీని చూడటానికి అనుమతిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్గవర్నర్సీవీ ఆనందబోస్ తననువేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. ఈ మేరకు అక్కడి రాజ్ అక్కడి రాజ్‌భవన్‌లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై బోస్ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ రెండు సందర్భాల్లోనూ వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది. -
ఇనుపరేకు బాక్సులో యువతి మృతదేహం.. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు!
ఉత్తరప్రదేశ్‌లోని బదోహీ జిల్లాలో ఇటీవల పోలీసులకు ఒక ఇనుపరేకు బాక్సులో 16 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమయ్యింది. దీంతో ఆమె ఎవరు? ఆమెను హత్య చేసింది ఎవరు? అనేదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక మల్టీనేషనల్ కంపెనీలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్న ఉపేంద్ర శ్రీవాస్తవ ఈ యువతిని హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. మృతురాలితో గతంలో ఉపేంద్రకు అఫైర్ నడిచిందని, అయితే ఆమె మరొక యువకునితో సన్నిహితంగా ఉంటుండంతో ఉపేంద్ర ఆమెను హెచ్చరించాడని పోలీసుల విచారణలో తేలింది. ఆమె ఉపేంద్ర మాటలను పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపధ్యంలో ఉపేంద్ర ఆమెను హత్య చేశాడు. తరువాత బజారుకు వెళ్లి, ఒక ఐరన్ బాక్సు కొనుగోలు చేశాడు. ఆమె మృతదేహాన్ని ఆ బాక్సులో ఉంచి, దానిని బైక్‌కు కట్టి 40 కిలోమీటర్ల దూరంలోని అడవిలో ఆ బాక్సును వదిలేసి వచ్చాడు. ఈ సంగతి ఇక పోలీసులకు తెలియదని ఉపేంద్ర భావించాడు. అయితే అతను ఊహించని విధంగా పోలీసులు అతనిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉపేంద్ర శ్రీవాస్తవ తాను ఉంటున్న ఇంటికి సమీపంలోని 16 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. తరువాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపధ్యంలో ఉపేంద్ర వారణాసిలోని మహామాన్పురి కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. దానిలో వారిద్దరూ ఉండసాగారు. సాయంత్రం కాగానే ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయేవారు. ఇంతలో ఉపేంద్రకు ఆ యువతి ఎవరితోనే మాట్లాడుతున్నదనే అనుమానం వచ్చింది. ఆమెను ఈ విషయమై నిలదీశాడు. దీంతో ఇద్దరిమధ్య వివాదం నెలకొంది. ఈ నేపధ్యంలో ఆగ్రహానికి గురైన ఉపేంద్ర ఆమెను గొంతునొక్కి హత్య చేశాడు. తరువాత ఆమె మృతదేహాన్ని బాక్సులో పెట్టి, దానిని బైక్‌కు కట్టి వారణాసికి 40 కిలోమీటర్ల దూరంలోని బదోహీ నేషనల్ హైవే మీదుగా లాలానగర్ సమీపంలోని అడవులలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాక్సును కిందకు దించి, బైక్ ట్యాకులోని పెట్రోల్ బయటకు తీసి, దానితో బాక్సుకు నిప్పంటించాడు. ఇలా చేయడం ద్వారా తన నేరాన్ని ఎవరూ గ్రహించలేరని ఉపేంద్ర భావించాడు. అయితే స్థానికులు ఈ అనుమానాస్పద బాక్సును గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించి, కేసు దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా పోలీసులు హైవేలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు. వాటిలో నిందితుడు తన బైక్‌కు ఈ బాక్సును కట్టి ప్రయాణిస్తున్న దృశ్యం కనిపించింది. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడు ఉపేంద్ర శ్రీవాస్తవ్‌ను అరెస్టు చేశారు. అతని దగ్గరి నుంచి బైక్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు తదపరి చర్యలు చేపడుతున్నారు. ఇది కూడా చదవండి: ఆ భారత యువరాణి బ్రిటన్‌లో మహిళల కోసం ఎందుకు పోరాడారు? -
సీసీటీవీ కెమెరాలతో మెరుగైన భద్రత
సాక్షి, అమరావతి : నేరాల నియంత్రణ, మెరుగైన భద్రతకు సీసీటీవీ కెమెరాలు అత్యావశ్యకమని దేశంలోని పట్టణ ప్రాంత ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నారు. కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇతర నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవడం ఐదేళ్లుగా భారీగా పెరుగుతోందని ఫోర్బ్స్ సంస్థ ‘పోలీసింగ్ ఇన్ ఇండియా–2023’ నివేదిక వెల్లడించింది. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తతితో భద్రత, వ్యక్తిగత ప్రైవసీ అనే రెండింటిలో ఎటువైపు మొగ్గుచూపాలి అనే అంశంపై ఐదేళ్ల క్రితం వరకు దేశ ప్రజల్లో ఓ సందిగ్థత ఉండేదని ఆ నివేదిక పేర్కొంది. కాలనీలు, నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరమని భావించేవారు. బహిరంగ ప్రదేశాల్లో పోలీసు, మున్సిపల్ శాఖలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. కాబట్టి తమ నివాస ప్రాంతాల్లో ఇవి వద్దనే భావన ఉండేది. కానీ, నగర, పట్టణ ప్రాంత ప్రజల్లో ఆలోచనా దృక్పథం ఐదేళ్లలో మారిందని ఆ నివేదిక వెల్లడించింది. ప్రజలు తమ నివాసాలకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకుంటున్నారని తెలిపింది. నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ.. దేశంలో నగరాలు, ప్రధాన పట్టణ ప్రాంతాల్లో 51 శాతం మంది ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసుకున్నారు. నగరాల్లో 61 శాతం, ప్రధాన పట్టణాల్లో 46 శాతం ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో కర్ణాటక మొదటిస్థానంలో ఉండగా రెండు, మూడు స్థానాల్లో హరియాణా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కర్ణాటకలో 68శాతం, హరియాణాలో 67శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 33శాతం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేసుకున్నారు. ప్రభుత్వం అత్యధికంగా ఈ కెమెరాలు ఏర్పాటుచేసిన వాటిలో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ 54 శాతం ప్రాంతాల్లో ప్రభుత్వమే వీటిని ఏర్పాటుచేసింది. అలాగే, అత్యధిక ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 73 శాతం, ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రాంతాల్లో 63 శాతం, మధ్య తరగతి వర్గాలుండే చోట 45 శాతం, అంతకంటే తక్కువ ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 28శాతం వరకు ఈ కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలతో ‘ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ) పోలీసులకు అందుబాటులోకి వస్తోంది. దాంతో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు ఆ శాఖకు ఇది ఉపయోగపడుతోంది. ఈ కెమెరాలు లేని ప్రాంతాల్లో కంటే ఉన్న ప్రాంతాల్లో నేరాలు 30 శాతం తగ్గినట్లు.. కేసుల ఛేదన 28 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 110 ఏళ్ల తర్వాత కన్పించిన పులి.. ఫొటో వైరల్..
చండీగడ్: హరియాణా యుమునానగర్ జిల్లాలోని కలెసర్ నేషనల్ పార్కులో 110 ఏళ్ల తర్వాత పులి కన్పించింది. పార్కులో ఏర్పాటు చేసిన కెమెరాలో పులి దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో హరియాణా అటవీ శాఖ మంత్రి, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. చివరిసారిగా ఈ పార్కులో 1913లో పులి కన్పించదని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కన్పించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ఈ పులి కాలి గుర్తులను పరిశీలించి దాని వయసు, లింగం వంటి ఇతర విషయాలు తెలుసుకోవాలని అటవీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. ఈ పులి ఏప్రిల్ 18, 19 తేదీల్లో ఈ పార్కులో కన్పించింది. అయితే వన్యమృగం ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లోని రాజాజీ నేషనల్ పార్కు నుంచి కలెసర్ పార్కులోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే హిమాచల్ సింబల్బరా నేషల్ పార్కు కూడా కలెసర్ పార్కు పక్కనే ఉంది. దీంతో ఈ మూడు పార్కుల్లో పులి సంచరిస్తోందని, కానీ కలెసర్ పార్కులోనే నివాసముంటుందని అధికారులు భావిస్తున్నారు. కొద్ది రోజుల పాటు దీని కదలికలు పరిశీలిస్తే దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు. కాగా.. కలెసర్ నేషనల్ పార్కు ఎన్నో వన్యమృగాలకు నిలయంగా ఉంటోంది. 11,570 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో చిరుత పులులు, ఏనుగులు, ఇతర రకాల అడవీ జంతువులు నివసిస్తున్నాయి. అయితే పులి కన్పించండం మాత్రం 110 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చదవండి: ఆవు కడుపున సింహం పిల్ల! చూసేందుకు క్యూ కడుతున్న జనాలు -
నటి అనుమానాస్పద మృతి కేసు.. పోలీసుల అదుపులో సింగర్
ప్రముఖ బుల్లితెర నటి ఆకాంక్ష దూబే మృతి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు ప్రముఖ సింగర్ సమర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో హోటల్లోని సీసీటీవీ దృశ్యాలు మరింత కీలకంగా మారాయి. చనిపోయే కొన్ని నిమిషాల ముందు ఆమె ఓ వ్యక్తితో ఉన్న దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలేం జరిగిందంటే? భోజ్‌పురి నటి ఆకాంక్ష ఓ సినిమా షూటింగ్ కోసం వారణాసి వెళ్లారు. అక్కడే ఆమె ఓ హోటల్లో ఉంటూ షూటింగ్లో పాల్గొన్నారు. మార్చి 26న షూటింగ్ ముగిసిన వెంటనే హోటల్‌కు తిరిగొచ్చిన ఆకాంక్ష దూబే అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. చనిపోవటానికి కొన్ని నిమిషాల ముందు ఓ గుర్తు తెలియని వ్యక్తితో ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది. సీసీటీవీలో ఆకాంక్షతో పాటు కనిపించిన ఆ వ్యక్తి ఎవరో ఇంకా వివరాలు తెలియరాలేదు. ఆకాంక్ష మరణంతో అతడికి ఏదైనా సంబంధముందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆకాంక్ష మరణం హత్య అని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రముఖ సింగర్ సమర్ సింగ్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఆమెకు గతంలో సమర్ సింగ్ అనే సింగర్‌తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. -
నటి సూసైడ్ కేసు.. ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు?
భోజ్‌పురి నటి ఇటీవల వారణాసి ఓ హోటల్లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్యకు ముందే ఓ వీడియో సాంగ్‌ను కూడా రిలీజ్ చేసింది. అయితే నటి ఆత్మహత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సూసైడ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారణాలపై ఆరా తీస్తున్నారు. తాజాగా బయటకొచ్చిన హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌లో మరో వ్యక్తి కూడా నటితో కనిపించడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అతను ఎవరన్నదానిపై ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. మార్చి 26న ఆకాంక్ష తన హోటల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఇప్పటికే ఆమె సూసైడ్ చేసుకున్న రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆమె హోటల్ గదిలో 17 నిమిషాల పాటు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న మిస్టరీ మ్యాన్ ఆకాంక్షతో పాటే ఉన్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కానీ అతని ముఖం ఆ వీడియో ఫుటేజీలో తగినంత స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో ఆ మిస్టరీ మ్యాన్ ఎవరనేది పోలీసులు గుర్తించలేకపోతున్నారు. కాగా.. ఆకాంక్ష దుబే 'లైక్ హూన్ మై నాలైక్ నహిన్' చిత్రం షూటింగ్ కోసం వారణాసిలోని ఒక హోటల్లో బస చేసింది. ప్రియుడిపై కేసు నమోదు ఆకాంక్ష మరణానంతరం ఆమె ప్రియుడు సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్ వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె తల్లి కేసు పెట్టింది. సమర్ సింగ్ తన కుమార్తెను కొట్టేవాడని, అతని సోదరుడు చంపేస్తానని బెదిరించాడని ఆకాంక్ష తల్లి తన పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆకాంక్ష మరణించినప్పటి నుంచి సింగ్ సోదరులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Exclusive CCTV footage of Bhojpuri actress Akanksha Dubey surfaced, in the video the actress is seen with Sandeep Singh. Look #AkanshaDubey #AkanshaDubeySuicide #CCTVFootage #bhojpuriactress https://t.co/b9kotfX75c pic.twitter.com/fbtQzCitSr — Siraj Noorani (@sirajnoorani) March 31, 2023 -
దొంగతనం చేస్తూ దొరికిపోయిన సన్నీ
-
పోలీస్ స్టేషన్లలో ‘మూడో కన్ను’.. ఒక్కో స్టేషన్లో 10 సీసీ టీవీ కెమెరాలు
సాక్షి, అమరావతి: పోలీసు వ్యవస్థ పనితీరులో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. పోలీసులు, ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందించి పోలీసు శాఖ ప్రతిష్టను పెంచడం లక్ష్యంగా పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పోలీస్ స్టేషన్లలోని అన్ని ముఖ్యమైన విభాగాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలను ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈమేరకు రెండు దశల్లో వాటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. మూడు నెలల్లో 600 పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ఏపీ పోలీస్ టెక్నికల్ సర్వీసెస్ విభాగం టెండర్లను పిలిచింది. ఆ సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించిన తర్వాత మిగతా స్టేషన్లలో కూడా ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. అక్రమ నిర్భందాలను నిరోధించేందుకు.. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020లో 500 పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అప్పట్లో పురుషులు, మహిళల లాకప్ రూమ్‌లలో వాటిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో అక్రమ నిర్బంధాలను నిరోధించి మానవ హక్కుల పరిరక్షించడం, సిటిజన్ చార్టర్‌కు అనుగుణంగా పోలీసు సిబ్బంది ప్రవర్తిస్తున్నారా? లేదా అనేది పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వ్యక్తుల పట్ల ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకంగాగానీ, అనుకూలంగాగానీ వ్యవహరించకుండా పోలీసు అధికారులను కట్టడి చేసేందుకు కూడా సీసీ కెమెరాల ఏర్పాటు దోహదపడుతుందని భావిస్తున్నారు. అధునాతన సీసీ కెమెరాలు రాష్ట్రంలోని మొత్తం 900 పోలీస్స్టేషన్లలో రెండు దశల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. నేరాల రేటు గణాంకాలను బట్టి మొదటి దశలో 600 స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. రెండో దశలో మిగిలిన పోలీస్ స్టేషన్లలో కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతి పోలీస్ స్టేషన్లో 10 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ప్రధాన ప్రవేశద్వారం, ప్రధాన హాలు, రిసెప్షన్ రూమ్, స్టేషన్ ఆఫీసర్ రూమ్, రైటర్ రూమ్, ఆయుధాలు/సాక్ష్యాధారాల రూమ్, పురుషుల లాకప్, మహిళల లాకప్, కంప్యూటర్ రూమ్, పార్కింగ్ ఏరియాలలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో లాకప్ రూమ్‌లలో ఒక్కో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన చోట ప్రస్తుతం 8 చొప్పున ఏర్పాటు చేయనున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఆడియో, వీడియో ఫుటేజీలతో పాటు రాత్రివేళల్లో కూడా స్పష్టంగా రికార్డ్ చేసేలా నైట్ విజన్ ఫీచర్లతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫుటేజీ కనీసం 18 నెలలపాటు స్టోరేజీలో ఉంటుంది. పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను సక్రమంగా నిర్వహించేందుకు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశారు. స్టేషన్లలో కెమెరాల నిర్వహణ బాధ్యత ఆ స్టేషన్ హౌస్ అధికారిదే. నిర్వహణలో ఇబ్బందులుంటే జిల్లా పర్యవేక్షక కమిటీలను సంప్రదించి సరి చేయించాలి. చదవండి: పరిశ్రమలకు ప్రోత్సాహంలో ముందెన్నడూ చూపనంత చొరవ -
విధ్వంసాన్ని పసిగట్టే వీడియో వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన ‘అగ్నిపథ్’ ఆందోళనలు, రైళ్ల దహనం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వేస్టేషన్లలో అధునాతన సీసీటీవీ భద్రతా వ్యవస్థను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకు రానుంది. ఇప్పటివరకు ఉన్న సాధారణ సీసీ కెమెరాల స్థానంలో హైటెక్ కెమెరా లతో కూడిన వీడియో నిఘా వ్యవస్థ–వీఎస్ఎస్ (సీసీటీవీ కెమెరాల నెట్వర్క్)ను ఏర్పాటు చేయనుంది. కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో పనిచేసే వీడియో విశ్లేషణ సాఫ్ట్‌వేర్‌తోపాటు స్టేషన్ల ఆవరణ లోకి పాత నేరస్తులు ప్రవే శించిన వెంటనే గుర్తించి అధికారులను అప్రమత్తం చేయ గల ముఖాల గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) సాఫ్ట్ వేర్‌ను వినియోగించనుంది. అలాగే రైల్వే సిబ్బంది ఏ ప్రాంతంలో ఉన్న వెబ్ బ్రౌజర్ నుంచైనా స్టేషన్లలోని సీసీ కెమె రాలు, సర్వర్, యూపీఎస్, స్విచ్‌లను వీక్షిస్తూ పర్యవేక్షించేలా నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను వాడనుంది. తొలి దశలో భాగంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలోని 76 స్టేషన్లు సహా దేశవ్యాప్తంగా 756 స్టేషన్లను వీడియో నిఘా వ్యవస్థ కోసం ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించి 39 స్టేషన్లు ఉన్నాయి. రైల్వే అనుబంధ సంస్థ రైల్‌టెల్ ఆధ్వర్య ంలో ఈ వ్యవస్థ ఏర్పాటు పనులు జరగను న్నాయి. మలి దశల్లో ఇతర స్టేషన్ లలో హైటెక్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ‘నిర్భయ నిధుల’తో చేపడు తున్న ఈ ప్రాజెక్టును 2023 జనవరి లోగా పూర్తి చేసే అవకాశం ఉందని రైల్‌టెల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు? రైల్వేస్టేషన్లలోకి వచ్చే/వెళ్లే మార్గాలు, ప్లాట్ ఫామ్‌లు, వెయిటింగ్ హాళ్లు, ప్రయాణి కుల వంతెనలు, బుకింగ్ కార్యాలయాలు, పార్కింగ్ ప్రాంతాలు, ఇతర కీలక స్థలాల్లో ఇవి ఏర్పటవుతాయి. రైల్వే ఆవరణలను వీలైనంత మేర నిఘా పరిధిలోకి తెచ్చేలా డోమ్, బుల్లెట్, పాన్ టిల్ట్, అల్ట్రా హెచ్డీ–4కే రకాల ఐపీ కెమెరాలను వినియోగిస్తారు. ఉపయోగం ఏమిటి? ఈ సీసీటీవీ కెమెరా వ్యవస్థ ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ద్వారా అనుసంధానమై ఉంటుంది. వాటి నుంచి అధీకృత సిబ్బంది ఫోన్ నంబర్లకు కూడా లింక్ ఉంటుంది. అలారంతో ఈ వ్యవస్థను జోడిస్తారు. సీసీ కెమెరాలు రికార్డు చేసే ఆయా చిత్రాలలోని వ్యక్తులు ఇప్పటికే పోలీసుల బ్లాక్‌లిస్టులో ఉన్న వారి చిత్రాలతో సరిపోలితే సంబంధిత అధికారుల ఫోన్లకు (లింక్ అయినవాటికి), అధీకృత కేంద్రాలకు హెచ్చ రికలు వెళ్తాయి. అలాగే ప్రతి ప్లాట్‌ఫామ్ వద్ద రెండు ప్యానిక్ బటన్లను ఏర్పాటు చేస్తారు. ఆపదలో ఉన్న వారు/అవసరమైన వారు ఈ బటన్ నొక్కగానే వారి మొహాన్ని సీసీ కెమెరాలు క్లోజ్అప్లో బంధిస్తాయి. అక్కడి పరిసరాలను కూడా వీడియో తీస్తాయి. సంబంధిత అధి కారుల ఫోన్లకు, కేంద్రాలకు హెచ్చ రికలు, పంపుతాయి. అలా రం మోగటం ద్వారా స్టేషన్లలోని సిబ్బంది సులభంగా అప్రమత్త మయ్యేందుకు వీలు కలుగుతుంది. అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటే వాటిని ఎదుర్కోవడంలో రైల్వే పోలీసులు, ఇతర సిబ్బంది మరింత సన్నద్ధంగా ఉండేందుకు అవకాశం లభిస్తుంది. సంబంధిత ఆర్పీఎఫ్, కంట్రోల్ రూమ్‌లలో వీడియో ఫుటేజీని 30 రోజుల వరకు భద్రపరచవచ్చు. ఒక స్టేషన్లో రికార్డయిన దృశ్యాలను ఆ స్టేషన్లోనే కాకుండా డివిజినల్, జోనల్ స్థాయిలోని సీసీటీవీ కంట్రోల్ రూమ్‌లలో కూడా విశ్లేషించొచ్చు. రాష్ట్రంలో హైటెక్ కెమెరాల నిఘా ఉండే స్టేషన్లు ఇవే.. ఓయూఆర్ట్స్ కాలేజీ, డబీర్‌పురా, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, జామియా ఉస్మానియా, మలక్‌పేట, సీతాఫల్మండి, విద్యానగర్, యాఖుత్పురా, భరత్‌నగర్, బోరబండ, చందానగర్, ఫతేనగర్, హఫీజ్‌పేట, హైటెక్ సిటీ, జేమ్స్‌స్ట్రీట్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నేచర్‌క్యూర్ హాస్పిటల్, నెక్లెస్‌రోడ్, సంజీవయ్య పార్క్, లింగంపల్లి, కాచిగూడ, బేగంపేట, వరంగల్, భద్రాచలం రోడ్, కాజీపేట, ఖమ్మం, మహబూబాద్, మంచిర్యాల, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్, తాండూరు, వికారాబాద్, బాసర, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్. -
ఐదేళ్ల చిన్నారిని ఢీకొన్న ఆటో
-
మూడో నేత్రం..!
-
బల్బు దొంగ.. భలే ఫీట్లు
కోయంబత్తూరు : విద్యుత్ బల్బు దొంగిలించడం కోసం ఓ వ్యక్తి నానా ఫీట్లు చేశాడు. తనను ఎవరు చూడకూడదనే ఉద్దేశంతో వ్యాయామం చేస్తున్నట్టు నటించి.. చివరికి బల్బును దొంగిలించాడు. కానీ అక్కడ జరిగిందంతా సీసీటీవీల్లో రికార్డయింది. వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూరులోని చెరన్ మా నగర్‌లోని దుకాణల ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై నిల్చున్న ఆ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న వాహనాలను గమనిస్తూ వ్యాయామం చేస్తున్నట్టు నటించసాగాడు. తొలుత అటుగా ఎవరు రావడం లేదని నిర్ణయించుకుని బల్బు తీసేందుకు ప్రయత్నించి ఆగిపోయాడు. మరికొద్దిసేపు వేచి చూసిన తర్వాత మరోసారి ప్రయత్నించి.. బల్బును దొంగిలించి.. దానిని జేబులో పెట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు మాత్రం అతనిపై జాలి చూపెడుతూ కామెంట్లు చేస్తున్నారు. -
వ్యాయామం చేస్తున్నట్టు నటిస్తూ..దొంగతనం!
-
మహిళలు దుస్తులు మార్చుకునే చోట కెమెరాలు
-
హైదరాబాద్‌లో చెడ్డి గ్యాంగ్ హల్చల్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హైదరాబాద్‌లో హల్చల్ చేస్తోంది. తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడతోంది. గొల్కొండ, ఆల్ కరీం కాలనిల్లోకి ఈ నెల 15న రాత్రి చెడ్డి గ్యాంగ్ చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ పుటేజ్ సాయంతో దొంగలను గుర్తించారు. చెడ్డి గ్యాంగ్‌పై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు బనియన్, నిక్కరు ధరించి రాత్రి వేళల్లో దొంగతనం చేయడం చెడ్డిగ్యాంగ్ ప్రత్యేకత. చోరీ సమయంలో ఎవరికీ పట్టుబడకుండా చెడ్డీ గ్యాంగ్ సభ్యులు ఒళ్లంతా నూనె రాసుకుంటారు. దొంగతనానికి పాల్పడే సమయంలో అవసరమైతే హత్యకు కూడా చెడ్డీగ్యాంగ్ వెనుకాడదు. -
నడుస్తు నడుస్తూనే కిందపడి వ్యక్తి మృతి
-
1400 సీసీ కెమెరాలతో తిరుమలకు భద్రత
సాక్షి, తిరుమల: ధార్మిక క్షేత్రమైన తిరుమలలో మొత్తం 1400 సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత కల్పిస్తామని టీటీడీ సీవీఎస్వో ఆకే.రవికృష్ణ అన్నారు. గురువారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ఇందుకోసం నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్‌ఎన్‌ఐసి) సహకారం తీసుకుంటున్నామన్నారు. మొదటి దశలో హైసెక్యూరిటీ జోన్‌లోని శ్రీవారి ఆలయం, పరకామణి, మాడ వీధుల్లో 175 ఫిక్స్డ్ కెమెరాలు, 87 పీటీజె కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం నుంచి సీసీ కెమెరాల ఏర్పాటు పనులు ప్రారంభిస్తామన్నారు. అగ్ని ప్రమాదాలు గుర్తించేందుకు స్మోక్ డిటెక్టర్, అసాంఘిక శక్తులను గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్, భక్తుల రద్దీని తెలుసుకునేందుకు క్రౌడ్ కంట్రోల్ కెమెరాలు వినియోగిస్తామన్నారు. కామన్ కమాండ్ కంట్రోల్ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. తిరుమలలో ఏర్పాటుచేయబోయే సీసీ కెమెరాల పనితీరును సీవీఎస్వో లాబ్‌టాప్‌లో స్వయంగా చూపించారు. -
ప్రధానోపాధ్యాయురాలిపై బీజేపీ నేత దాడి
-
రాజధానిలో వ్యక్తి దారుణ హత్య
-
బుల్లెట్ తగలగానే ఇంట్లోకి పరుగెత్తబోయి..
బెంగళూరు: ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. ఆమె ఇంటి వద్ద ఉన్న రెండు సీసీ టీవీ కెమెరాల ఆధారంగా ఈ హత్యకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించినట్టు సమాచారం. కాల్పులు జరుపుతుండగా ఆమె ఇంటిలోపలికి పరుగెత్తేందుకు ప్రయత్నించారని, అప్పటికే బుల్లెట్లు తగలడంతో ఇంటి బయటే కుప్పకూలినట్లు సీసీటీవీల ఆధారంగా తెలుస్తోంది. ఆమె తన పని ముగించుకొని టోయోటా ఇటియోస్ కారులో ఇంట్లోకి రాగానే హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి నేరుగా ఆమెకు సమీపంగా వచ్చి కాల్పులు జరిపాడు. మూడు బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకెళ్లగా ఒక బుల్లెట్ మాత్రం నుదుటి భాగంలోకి వెళ్లింది. లంకేష్ నివాసంలో మొత్తం నాలుగు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అందులో నుంచి పాస్వర్డ్ ప్రొటెక్షన్ కల్గిన రెండు డీవీఆర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ నిపుణుల సాయంతో వాటిని తెరచి పరిశీలిస్తున్నారు. బాధితురాలితోపాటు నిందితులు కూడా ఒకే ఫ్రేమ్‌లో ఉండే ఫొటోలు కొన్ని లభ్యమైనట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగా ఆమెను దగ్గర నుంచే షూట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. పూర్తిస్థాయిలో నిర్థారించేందుకు ఈ ఆధారాలను ఫోరెన్సిక్ లేబోరేటరీకి పంపించారు. లభ్యమైన ఆధారాలను బట్టి నిందితుల్లో ఇద్దరు నల్ల రంగు జాకెట్‌తో పూర్తిగా మాస్క్ ధరించి హెల్మెట్‌తో ద్విచక్రవాహనంపై వేచి వుండగా, మరో వ్యక్తి ఆమె ఇంటి ప్రాంగణంలోకి నడుచుకుంటూ వెళ్లి ఈ కాల్పులు జరిపినట్టు సమాచారం. సీసీటీవీలో కనిపించిన బైక్‌లు రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తించలేని విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఉన్మాది ఘాతుకం: యువతి మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఉన్మాది కత్తిపోట్లకు గురైన యువతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతిచెందింది. యువతి చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి సమీపంలోని ఇంట్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఈశాన్య ఢిల్లీకి చెందిన ఓ యువతి(21) మరికొన్ని రోజుల్లో ఎయిర్ హోస్టెస్ గా విధుల్లో చేరనుంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తన ఇంటి వరండాలో నిలుచుండగా.. అదిల్ అనే యువకుడు అక్కడికి వచ్చాడు. నిందితుడు అదిల్ పిలవడంతో ఆమె వరండా నుంచి బయటకు వచ్చింది. యువతితో మాట్లాడుతూ ఒక్కసారిగా ఆవేశానికి లోనైన ఉన్మాది.. తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతిని పలుమార్లు కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన యువతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గురువారం ఉదయం ఆస్పత్రిలోనే కన్నుమూసింది. నిందితుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కారు చోరీ కేసులో అతడు నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. యువతిపై కత్తితో దాడి చేస్తుండగా కొందరు స్థానికులు వీడియో తీశారని సమాచారం. నిందితుడు అదిల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
బతికుండగానే పులుల బోనులో విసిరేశారు
బీజింగ్: చైనాలో ఓ వన్యమృగ పరిరక్షణ కేంద్రంలోని వాటాదారుల మధ్య ఏర్పడిన వివాదం మూగజీవుల పాలిట శాపంగా మారింది. తనను మూగజీవాలు తీసుకెళ్లేందుకు అడ్డుకున్నారని కోపంతో ఏకంగా బతికి ఉన్న ఓ గాడిదను నేరుగా కొంతమంది వ్యక్తుల సహాయంతో పులుల ఎన్‌క్లోజర్‌లో పడేశాడు. రెండు నిమిషాల్లోనే ఆ గాడిదపై పులులు దాడి చేసి చంపేశాయి. ఈ సంఘటన జూకు వచ్చిన వారిని కంటతడిపెట్టించింది. అతడు మరోసారి గొర్రెలను వేసే ప్రయత్నం చేయడంతో అతడిని అడ్డుకున్నారు. ఈ ఘటన చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని చాంగ్‌జౌలోని జూపార్క్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చైనాలో ఓ జూపార్క్‌ను కొంతమంది పెట్టుబడిదారులు కలిసి నిర్వహిస్తున్నారు. అయితే, కొద్ది కాలంగా అది నష్టాల్లో నడుస్తోంది. దీంతో అందులో తన వాటాగా ఉన్న కొన్ని జంతువులను అమ్మేసుకుంటానని మిగితా వాటాదారులకు ఆ వ్యక్తి చెప్పగా అందుకు వారు నిరాకరించారు. దీంతో కోపంలో కొంతమంది మనుషులని పెట్టి ఈ పనిచేయించాడు. దీనిపట్ల పలువురు నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఇకపై స్కూల్ బస్సుల్లో సీసీటీవీ, జీపీఎస్
న్యూఢిల్లీ: ఇకపై స్కూలు బస్సుల్లో సీసీటీవీల ఏర్పాటు, జీపీఎస్‌తో అనుసంధానం చేయాలని, వేగనియంత్రణ కలిగి ఉండాలని సీబీఎస్ఈ మార్గదర్శకాలను జారీచేసింది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న స్కూలు బస్సు ప్రమాద సంఘటన నేపథ్యంలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి జవదేకర్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవాలని జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలని సీబీఎస్ఈ పేర్కొంది. ఇక బస్సు సిబ్బంది వ్యవహార శైలిని పరిశీలించేందుకు ప్రతీ బస్సుకు కనీసం ఒక విద్యార్థి తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండేలా చూడాలంది. బస్సుల్లో అలారం, సైరన్ ల వంటి ఏర్పాటు ఉండాలని, ఒక మొబైల్ ఫోను అందుబాటులో ఉంచాలంది. -
‘మేం షాక్.. ఆరుబయట నగ్నంగా తిప్పుతున్నారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ హయాంలో నడుస్తోన్న ఓ మానసిక వికలాంగుల ఆశ్రమం గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి అధికారుల నిర్లక్ష్యం, నిర్లజ్జ వ్యవహారాలు బయటకొచ్చాయి. కనీసం ఉండాల్సిన మానవతా విలువలు కూడా ఆ ఆశ్రమంలో లేకపోవడంపట్ల ఢిల్లీ మహిళా కమిషన్ విస్తుపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతుందంటే.. ఢిల్లీలో ఆశా కిరణ్ అనే ఓ సంస్థ ఉంది. ఇందులో మానసిక వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తారు. దీని బాధ్యతలు ప్రభుత్వం చూసుకుంటుంది. అయితే, గత రెండు నెలల్లోనే దాదాపు 11మంది ప్రాణాలుకోల్పోయారు. ఈ అంశాన్ని పరిశీలించేందుకు అక్కడికి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్, మరో సభ్యురాలు ప్రమీలా గుప్తా వెళ్లారు. శనివారం రాత్రంతా అక్కడే ఉండి అక్కడి పరిస్థితులు చూసి అవాక్కయ్యారు. ఎలాంటి పరిస్థితులు ఆ సంస్థలో ఉన్నాయో వారి మాటల్లోనే చూస్తే.. ‘స్నానం చేసేందుకు ఆరు బయటే మహిళలను వివస్త్రలను చేసి వరుసగా నిలబెడుతున్నారు. పూర్తి నగ్నంగా ఉన్న స్త్రీలు కారిడార్‌లో అటు ఇటూ తిరుగుతున్నారు. అదే కారిడార్లలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. వాటిని ఆపరేట్ చేస్తున్న వ్యక్తులు పురుషులు. ఈ దృశ్యాలు చూసి మేం దిగ్భ్రాంతి చెందాం. పరిశుభ్రత కొరవడింది. సరిపోయే ఉద్యోగులు లేరు. మానసిక వికలాంగులకు కనీస హక్కులు లేవు. పెద్ద మొత్తంలో అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. 350మందికి మాత్రమే సరిపోయే చోటులో 450 మందిని ఉంచారు. దీనిపై ఇప్పటికే మేం సాంఘిక సంక్షేమ శాఖకు నోటీసులు ఇచ్చాం. 72గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించాం. అలాగే మేం కూడా ఒక ప్రత్యేక కమిటీని వేశాం. శర వేగంగా అది దర్యాప్తు పూర్తి చేస్తుంది. ఆ కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాం’ అని స్వాతి మాలివాల్ తెలిపారు. -
యువతిపై గ్యాంగ్ షాకింగ్ అటాక్..!
-
హైటెక్ హంగులతో మెట్రో రైలు
మన మెట్రో రైలు ప్రాజెక్టులో విశేషాలెన్నో... హైటెక్ హంగులు...అత్యాధునిక వసతులు ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా రూపకల్పన సిటీజనుల కలల మెట్రో రైలు ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది. ఆధునిక సాంకేతికత, అత్యాధునిక వసతులతో పట్టాలెక్కనున్న నగర మెట్రో ప్రాజెక్టులో ప్రతిదీ ఒక విశేషమే. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 మహానగరాల్లో మెట్రో ప్రాజెక్టులుండగా...వాటిలోని విశిష్టతలన్నింటినీ ఒక్కచోట చేర్చినట్లుగా మన ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. సింగపూర్, హాంకాంగ్, షాంఘై, లండన్ వంటి విశ్వనగరాల మెట్రో ప్రాజెక్టులకు తీసిపోని విధంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. స్టేషన్లు, కోచ్‌లు, పట్టాలు, పార్కింగ్ వసతులు, మెట్రో మాల్స్, అందులోని సకల సదుపాయాలు.. ఒకటేమిటీ అన్నింటా ప్రత్యేకమే. ఉగ్రపంజా నేపథ్యంలో అత్యాధునిక భద్రతా ప్రమాణాలు, సీసీటీవీల నిఘా, బ్యాగేజి తనిఖీ యంత్రాలు ప్రతి స్టేషన్లోనూ ఉండనున్నాయి. స్టేషన్‌కు చేరుకునేందుకు ఎస్కలేటర్లు, లిఫ్టులు, దివ్యాంగులకు ప్రత్యేకమైన ఏర్పాట్లున్నాయి. ఆధునిక టికెట్ విక్రయ యంత్రాలు, నగదురహిత ప్రయాణానికి ఉపయోగపడే మెట్రో కార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తం మూడు కారిడార్ల పరిధిలో తొలివిడత నాలుగు చోట్ల బడా మెట్రో మాల్స్ నిర్మించనున్నారు. హైటెక్‌సిటీ, పంజగుట్ట, ఎర్రగడ్డ, మూసారాంబాగ్ ప్రాంతాల్లో వీటి నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం పనులు ఊపందుకున్నాయి. మొత్తం మూడు కారిడార్లలో 73 కి.మీ మార్గంలో ఏర్పాటుకానున్న మెట్రో ప్రాజెక్టులో విశేషాలపై ‘సాక్షి’ ఫోకస్... సాక్షి, సిటీబ్యూరో: మెట్రో స్టేషన్లకు వచ్చే ప్రయాణికులకు పార్కింగ్ సమస్య లేకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ద్విచక్రవాహనాలు, కార్లను మెట్రో స్టేషన్లకు సమీపంలో హెచ్ఎంఆర్ సంస్థ ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో నిలిపి అక్కడి నుంచి స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లి మెట్రో రైళ్లలో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు. ముందుగా 57 ఎకరాల విస్తీర్ణంలో 17 చోట్ల పార్కింగ్ స్థలాలను ఖరారు చేసినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ప్రయాణికుల రద్దీ అధికమైతే మూడు కారిడార్లలో మొత్తం 72 కి.మీ మెట్రో మార్గంలో మరో 14 చోట్ల ప్రైవేటు స్థలాలను లీజు లేదా శాశ్వత ప్రాతిపదికన తీసుకొనైనా ప్రయాణికులకు పార్కింగ్ వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఇబ్బంది పడకూడని విధంగా మరిన్ని పార్కింగ్ స్థలాల సేకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మినీ బస్సుల కొనుగోలు ఎప్పుడో.. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం,నగరంలో ట్రాఫిక్ జాంఝాటం లేకుండా చేయాలన్న సంకల్పంతోనే మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కిన విషయం విదితమే. ప్రయాణికులు తమ ఇళ్లలోనే సొంత వాహనాలను నిలిపి హెచ్ఎంఆర్ నడిపే మెర్రీ గో అరౌండ్ మినీ బస్సుల్లో స్టేషన్లకు చేరుకునే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. కానీ ప్రారంభం తేదీ ఖరారైనా బస్సుల కొనుగోలు ప్రక్రియ మాత్రం పూర్తికాలేదు. ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమైనట్లు అధికారులు తెలిపారు. త్వరలో ఈ విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. కాగా మెట్రో స్టేషన్ల నుంచి మినీ బస్సులు అందుబాటులో లేని పక్షంలో ఆటోలు,వ్యక్తిగత వాహనాలను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంటుంది. దీంతో ప్రయాణీకులు ఇటు ఆటో ఛార్జీలు,పార్కింగ్ ఛార్జీలు,ఇంధనం ఖర్చుల రూపేణా జేబులు గుల్ల చేసుకునే దుస్థితి ఏర్పడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాణ ఛార్జీలు, పార్కింగ్ ధరలపై నిర్ణయం మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభానికి ముందే ప్రయాణీకుల ఛార్జీలు,పార్కింగ్ ఫీజులు నిర్ణయించారు. ప్రభుత్వం ప్రకటించే టోకు ధరల సూచీ ఆధారంగా ఈ ఛార్జీల్లో మార్పులు చేర్పులుంటాయని నిర్మాణ ఒప్పందంలో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ప్రారంభం అయ్యే నాటికి టిక్కెట్ ధరలు,పార్కింగ్ ఛార్జీల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఛార్జీల పెంపు అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. లగేజి: పది కేజీల వరకు ఉచితం. ఆపైన ప్రతి కిలోమీటర్‌కు ఒక రూపాయి. పార్కింగ్ బాదుడే... కార్లు: రెండు గంటల వరకు రూ.10, ప్రతి అదనపు గంటకు రూ.5 ద్విచక్రవాహనాలు: రెండు గంటల వరకు రూ.4. ప్రతిఅదనపు గంటకు రూ.2 మెట్రో రైళ్ల వేగం: గరిష్ఠం: గంటలకు 80 కిలోమీటర్లు. సగటు వేగం: 34 కి.మీ. భద్రతా ప్రమాణాలివే.. మెట్రో రైలు స్టేషన్లలో సీసీటీవీలతో నిరంతర నిఘా మెట్రో రైళ్లు పట్టాలు తప్పకుండా ఉండేందుకు అధునాతన చెక్రైల్ సాంకేతికతను వినియోగించి పట్టాలను పరీక్షించారు. మెట్రో రైలు కోచ్, డ్రైవర్ క్యాబిన్లలో అగ్ని నిరోధక సాధనాలు, ఆక్సిజన్ సిలిండర్లుంటాయి. ఊహించని ప్రమాదాలు జరిగినపుడు రైళ్లు వాటంతట అవే ఆగుతాయి. వసతులు ఇవే.. ప్రతి మెట్రో కోచ్‌లో 40 మంది కూర్చునేందుకు, మరో 300 మంది సౌకర్యవంతంగా పట్టుకొని నిల్చునేందుకు గ్రాబ్పోల్స్ ఉంటాయి. చ్ లోపలి భాగం స్టార్‌హోటళ్లలోని ఏసీ రూమ్‌ను తలపిస్తుంది. బయటి వాతావరణానికి తగినట్లుగా కోచ్‌లో ఏసీ పనిచేస్తుంది. బయట వేడిగాఉంటే ఏసీ పెరుగుతుంది. వేడి తగ్గితే కోచ్‌లో చల్లదనం ఆమేర ఉంటుంది. మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లుంటాయి. ప్రతి కోచ్‌లో ఎల్సీడీ తెరలుంటాయి. ఇందులో సినిమాపాటలు, వ్యాపార, వాణిజ్య ప్రకటనలను వీక్షించవచ్చు. ప్రతి స్టేషన్ రాగానే కోచ్‌లో అందరికీ వినిపించేలా అనౌన్స్మెంట్ ఉంటుంది. ప్రతి కోచ్‌లో రైలు ప్రయాణించే మార్గాన్ని ఎల్సీడీ తెరల్లో కనిపించేలా ప్రదర్శిస్తారు. ‘మెట్రో’ మాల్స్ ఇక్కడే.. ఏర్పాటుచేసే ప్రాంతం ఎకరాలు విస్తీర్ణం సుమారుగా 1.హైటెక్‌సిటీ ఎదురుగా 2 2 లక్షల చదరపు అడుగులు 2.పంజగుట్ట మెట్రోజంక్షన్ 4 4 లక్షల చదరపు అడుగులు 3. ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ 4 4 లక్షల చదరపు అడుగులు 4.మూసారాంబాగ్ మెట్రోస్టేషన్ 4 4 లక్షల చదరపు అడుగులు మాల్స్‌లో ప్రత్యేకతలు ఇవీ... ఆఫీసు, వాణిజ్య స్థలాలు ఫుడ్‌కోర్టులు, చాట్‌బండార్స్, బేకరీలు, కన్ఫెక్షనరీలు దేశ, విదేశీ హోటళ్లు,కెఫెటేరియాలు, ఐస్‌క్రీం పార్లర్లు డ్యూటీ ఫ్రీ షాప్‌లు బ్రాండెడ్ దుస్తుల దుకాణాలు, ఫ్యాక్టరీ ఔట్లెట్లు సుగుంధ ద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్, పెర్ఫ్యూమ్స్ కేంద్రాలు ట్రామాకేర్, డయాగ్నోస్టిక్స్ సెంటర్లు, ఆక్సిజన్ సెంటర్స్ బ్యాంకులు, ఏటీఎంలు, బుక్ స్టోర్స్ గేమింగ్ జోన్స్, స్కేటింగ్, స్నూకర్, వీడియో గేమ్స్ అన్ని నిత్యావసరాలు దొరికే ఏ టు జడ్ స్టోర్స్ -
దారిదోపిడీ దొంగలు చిక్కారు
- 10 మంది నిందితుల అరెస్ట్ - పరారీలో నలుగురు - రూ.30 వేల నగదు, ఐదు మోటర్‌సైకిళ్లు, ఐదు సెల్ఫోన్లు, ట్యాబ్, ఆటో స్వాధీనం కర్నూలు: కర్నూలు శివారులో దారిదోపిడీకి పాల్పడిన దొంగలు పోలీసులకు చిక్కారు. శరీన్‌నగర్‌కు చెందిన పఠాన్ ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు తొమ్మిది మంది మైనర్లను తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.30 వేల నగదు, ఐదు మోటర్‌సైకిళ్లు, ఐదు సెల్ఫోన్లు, శ్యామ్‌సంగ్ ట్యాబ్, ఆటో, నేరానికి ఉపయోగించిన కత్తి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. సోమవారం సాయంత్రం ఓఎస్డీ రవిప్రకాష్, కర్నూలు డీఎస్పీ రమణమూర్తితో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా విజిలెన్స్ డీఎస్పీ రాజేశ్వరరెడ్డికి సంబంధించిన శుభకార్యం హైదరబాదులో జరిగింది. సమీప బంధువులు కార్యక్రమానికి హాజరై ఈనెల 17వ తేదీ రాత్రి ఏపీ02 ఏటీ1111 వాహనంలో అనంతపురం వెళ్తుండగా కర్నూలు కార్బైడ్ ఫ్యాక్టరీ సమీపంలోని మానస డాబా వద్ద టైర్ పంక్చర్ అయింది. డ్రైవర్ గోపాల్‌రెడ్డి టైరు పంక్చర్ చేస్తుండగా మద్యం సేవించిన దొంగలు డ్రైవర్‌ను డబ్బు ఇవ్వాలని బెదిరించారు. అతను నిరాకరించడంతో మూడు కత్తి పోట్లు పొడిచి గాయపరిచారు. కారులో ఉన్న ముగ్గురు మహిళలను కూడా బెదిరించి డ్యాష్‌బోర్డుపై ఉన్న ట్యాబ్‌ను దొంగలించారు. అక్కడి నుంచి మోటర్‌సైకిల్‌పై దూపాడు వద్దకు చేరుకుని కల్పన డాబా నిర్వాహకుడు బోయ సతీష్‌ను గొంతు నులిమి బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. నగదుతో పాటు సిగరెట్ ప్యాకులను దొంగలించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి, రూరల్ సీఐ నాగరాజ యాదవ్, ఎస్ఐలు సుబ్రహ్మణ్యంరెడ్డి, గిరిబాబు, వెంకటేశ్వరరావు వారి సిబ్బందితో టీములుగా ఏర్పడి కేసు మిస్టరీని ఛేదించారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులు గుర్తింపు: కల్పనా డాబాలో ఉన్న సీసీ ఫుటేజీలలో ఉన్న నిందితుల ఫొటోల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. కర్నూలు శివారులోని జగన్నాథగట్టు వద్దనున్న ఇందిరమ్మ గృహాల్లోని పాతబడిన ఇంట్లో దాచుకుని ఉన్నట్లు సమాచారం అందడంతో వలపన్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు పల్సర్ మోటర్‌సైకిళ్లు, రెండు ట్విస్టర్ బైకులు, ఒక ఎఫ్‌జడ్ మోటర్‌సైకిల్, ఒక ప్లాటినా మోటర్ సైకిల్, ఒక ఆటో, శ్యామ్‌సంగ్ ట్యాబ్, ఐదు సెల్ఫోన్లు, నేరానికి ఉపయోగించిన కత్తి, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి వీరు పలు నేరాలకు పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. వీరితో పాటు నేరంలో పాల్గొన్న మరో నలుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసినందుకు సీఐలు మహేశ్వరరెడ్డి, నాగరాజు యాదవ్, ఎస్ఐలు సుబ్రహ్మణ్యం రెడ్డి, గిరి బాబు, వెంకటేశ్వరరావు, వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వీరి నేరాల చిట్టా... – కర్నూలు శివారులోని నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఇదే నిందితులు ఆగస్టు మొదటి వారంలో దారి దోపిడీకి పాల్పడ్డారు. పాండిచ్చేరికి చెందిన లారీలను నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఆపి డ్రైవర్, క్లీనర్లను చితకబాది వారి దగ్గర డబ్బును దోచుకున్నారు. రెండు దోపిడీ కేసులలో వీరు ముద్దాయిలు. – పంచలింగాల వద్ద జరిగిన దారిదోపిడీ, కట్టమంచి స్కూల్ దగ్గర చోరీ కేసులో వీరు నిందితులు. – ఉలిందకొండ, సల్కాపురం ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. – నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆటోను దొంగలించి దోపిడీ దొంగతనాలకు పాల్పడ్డారు. – కర్నూలు నగరం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఒక వ్యక్తిని హత్య చేయడానికి రూ.1.40 లక్షలు కాంట్రాక్టు కుదుర్చుకుని ప్రయత్నించారు. సమాచారం లీక్ కావడంతో ఆ వ్యక్తి అప్రమత్తమై తప్పించుకున్నాడు. – మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. – ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో వీరిపై బైండోవర్ కేసులు ఉన్నాయి. -
‘ర్యాగింగ్‌పై చర్యలు తీసుకోండి’
సాక్షి, హైదరాబాద్: ర్యాగింగ్‌ను అరికట్టేందుకు యూనివర్సిటీలు, కళాశాలల యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ఆదేశించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు ప్రతి విద్యా సంస్థలో ర్యాగింగ్ నిరోధక కేంద్రాలు తెరవాలని శనివారం పేర్కొన్నారు. ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి, తనిఖీ బృందాలన ు ఏర్పాటు చేయాలని సూచించారు. కమిటీలు క్రమం తప్పకుండా సమావేశమై పరిస్థితిని సమీక్షించాలని చెప్పారు. సహాయ కేంద్రాలు, అత్యవసర సర్వీసులు ఏర్పాటు చేయాలని, క్యాంపస్‌లోని ముఖ్య ప్రాంతాల్లో సీసీటీవీలు అమర్చి, అలారం బెల్స్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్‌పై తీసుకుంటున్న చర్యలకు సంబంధించి కార్యాచరణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని వైస్ చాన్స్లర్లను ఆదేశించారు. -
గర్భిణీ నర్సుపై అకాలీదళ్ నేత దాడి
-
గర్భిణీ నర్సుపై అకాలీదళ్ నేత దాడి
మోగా: పంజాబ్‌లో అకాలీదళ్ పార్టీకి చెందిననేత రెచ్చిపోయాడు. కన్నుమిన్నుకానక ఓ గర్భవతి అయిన నర్సుపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. ఈ ఘటన పంజాబ్ లోని మోగాలో గల ఓ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతానికి ఆ నాయకుడు పరారీలో ఉన్నాడు. అతడిపై నేరం చేసే ఉద్దేశంతో పరిమితులున్న ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించిన కేసు, ఉద్దేశ పూర్వకంగా గాయపరిచినట్లు ఆరోపణలు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరమ్‌జిత్ సింగ్ అతడి కుమారుడు గుర్జిత్ సింగ్ మోగాలోని గుప్తా ఆస్పత్రికి ఓ రోగిని తీసుకొని వెళ్లారు. కొద్ది సేపు ఎదురుచూడండని చెప్పినందుకు రమణదీప అనే నర్సుతో గొడవకు దిగారు. ఆమె ఎనిమిది వారాల గర్బిణీ. ఆ విషయం చెప్పినప్పటికీ ఆ తండ్రి కొడుకులు ఆమె విజ్ఞప్తిని పట్టించుకోకుండా తీవ్ర దుర్భాషలాడారు. అనంతరం లాగిపెట్టి కొట్టి కిందపడేశారు. 'మేం సర్పంచ్ ఇంటి వాళ్లం. మమ్మల్నే వెయిట్ చేయిస్తావా' అంటూ కన్నెర్ర చేశారు. పరమ్ జిత్ భార్య దల్జిత్ కౌర్ సర్పంచ్ గా పనిచేస్తుందట. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం వారికోసం గాలిస్తున్నారు. -
ఈ ఆరేళ్ల చిన్నారి ధైర్యం చూశారో అవాక్కే..
-
ఈ ఆరేళ్ల చిన్నారి ధైర్యం చూశారో అవాక్కే..
మెల్బోర్న్: న్యూజిలాండ్‌లోని ఓ స్టోర్‌లో ఓ భారతీయ బాలిక గొప్ప సాహసం చేసింది. పట్టుమని ఆరేళ్లు కూడా ఉండని ఆ బాలిక ఏకంగా గొడ్డలితో తమ సంస్థలోని ఉద్యోగిపై దాడికి వచ్చిన దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. దాడి చేయబోతున్న అతడిని కాలుపట్టి లాగి కిందపడేయబోయింది. సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యం ఇప్పుడు పెద్ద వైరల్‌గా మారింది. ఆ పాప తల్లిదండ్రులు తమ కూతురు గొప్ప సాహసం చేసిందని మురిసిపోతూ ఆ సంఘటనకు సంబంధించి ఆమెలో పేరుకుపోయిన భయాన్ని తగ్గిస్తున్నారు. న్యూజిలాండ్‌లోని అక్లాండ్లో ఓ ఇండియన్ దంపతులకు ఎలక్ట్రికల్ షాపు ఉంది. అందులో కొంతమంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. అనుకోకుండా ఓ ఆరుగురు దోపిడీ దారులు ముఖాలకు ముసుగులు వేసుకొని చేతుల్లో గొడ్డళ్లతో దాడి చేసేందుకు వచ్చారు. ఆ క్రమంలో అందులో పనిచేసే ఉద్యోగులను గొడ్డల్లతో నరికేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో తన తల్లిదండ్రులతోపాటే ఆ షాపులో ఉన్న సారా పటేల్ అనే ఆరేళ్ల చిన్నారి తన తండ్రి కంగారు పడుతూ అటుఇటు పరుగెడుతున్నప్పటికీ ఏమాత్రం జంకకుండా నేరుగా ఆ దొంగ కాలుపట్టి కిందపడేసేందుకు యత్నించింది. అనంతరం పోలీసులు రాక గమనించి వారంతా పరారయ్యారు. పోతూపోతూ వేల డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎత్తుకెళ్లారు. కొన్నింటిని ధ్వంసం చేశారు. అయితే, వీరిని కుటుంబ సభ్యులు కార్లో వెంబడించడంతోపాటు పోలీసులు కూడా వెంటపడి అదుపులోకి తీసుకున్నారు. -
నిఘా నేత్రం..ఉద్యమ రూపం
– ప్రచారం కోసం పదివేల పోస్టర్లు – వ్యాస్ ఆడిటోరియంలో ఆవిష్కరణ – ప్రజాచైతన్యం కోసం త్వరలో పాటపాడనున్న ఎస్పీ ఆకె రవికృష్ణ – సీసీ టీవీ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ కర్నూలు – ఆగస్టు 17వ తేదీ పాతబస్తీకి చెందిన శ్యామలమ్మ బంగారునగలు రిపేరు చేసుకునేందుకు కాలి నడకన వెళ్తుండగా, సూపర్ స్వీట్స్ పమీపంలో పర్సు జారిపడి పోయింది. అదేమార్గం గుండా వెళ్తున్న ఒక వ్యక్తి పర్సు గుర్తించి, తెరిచి చూడగా అందులో బంగారు నగలు ఉన్నాయి. అతను జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడు. ఆలస్యంగా తేరుకున్న బాధితురాలు తిరిగి అదే మార్గం గుండా గాలించినా పర్సు దొరకలేదు. ఈ మేరకు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా,అదే మార్గంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో ఉన్న సీసీ పుటేజీలో నిందితున్ని గుర్తించి రెండున్నర్ర రోజుల వ్యవధిలోనే బంగారు నగలును రికవరీ చేశారు. – జనవరి 18వ తేదీన సరస్వతి నగర్లో ఉదయం 10.30 గంటల సమయంలో ఉపాధ్యాయురాలు ధనలక్ష్మి నడుచుకుంటూ విధులకు వెళ్తుండగా, దార్వాడ ప్రాంతానికి చెందిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు మోటర్ సైకిల్‌పై ఆమెను సమీపించి, రెండు తులాల బంగారు నగలు లాక్కొని ఉడాయించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, సమీపంలో బాలాజి హాస్టల్లో ఉన్న సీసీ పుటేజీ ద్వారా మూడో పట్టణ పోలీసులు.. నిందితులు సలీమ్, మహ్మద్ అలీగా గుర్తించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయని, నేర నియంత్రణే కాకుండా, దర్యాప్తులోనూ ఆలస్యం జరగకుండా ఉపయోగకరంగా ఉంటుందని ఎస్పీ ఆకె రవికృష్ణ వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీసీ కెమెరాల ఆవశ్యకతను గురించి వివరించారు. బంగారు నగలు పోగొట్టుకున్న పాతబస్తీ మహిళ శ్యామలను అక్కడికి రప్పించి ఆమె అనుభవాన్ని చెప్పించారు. మహిళల భద్రత, సమాజ రక్షణ కోసం సీసీ టీవీలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉద్యమ రూపంలో తీసుకెళ్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రచారం కోసం పదివేల పోస్టర్లు సీసీ టీవీల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దాదాపు పదివేల వాల్ పోస్టర్లను సిద్ధం చేశారు. నేర రహిత సమాజ స్థాపన కోసం పోలీసులు తీసుకునే చర్యలకు జిల్లా ప్రజలు సహకరించాలంటూ పోస్టర్లలో ముద్రించారు. కళాశాల, స్కూల్ బస్సులు, ఆటోలు, జనం రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే ప్రాంతాల్లో వాటిని అతికించి అవగాహన కల్పించేందుకు కార్యచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఎస్పీ స్వయంగా ఆటోలకు వాల్‌పోస్టర్లను అతికించి, కింది స్థాయి సిబ్బందికి ఆ బాధ్యతలను అప్పగించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీలు రమణమూర్తి, రామచంద్ర, సీఐలు కష్ణయ్య, ములకన్న, నాగరాజురావు, నాగరాజు యాదవ్, మధుసూదన్‌రావు, ఆర్ఐ జార్జ్, ఎస్ఐ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సీసీటీవీల ఏర్పాటుపై త్వరలో పాప్గీతం నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చెయ్... చెయ్... నేత్రదానం అంటూ పాప్సాంగ్ పాడిన ఎస్పీ ఆకె రవికష్ణ తనలోని కళను మరోసారి ఆవిష్కరించేందుకు ఆల్బమ్‌ను రూపొందిస్తున్నారు. పెట్టు.. పెట్టు.. సీసీ టీవీ పెట్టు.. తల్లికి.. చెల్లికి.. సమాజ రక్షణ కోసం.. సీసీ టీవీ పెట్టు... అంటూ త్వరలోనే సీసీ టీవీలపై పాప్గీతం పాడి వీడియో, ఆడియో రూపంలో విడుదల చేయనున్నారు. వ్యాపార వాణిజ్య వర్గాలు, అపార్టుమెంటు వాసులు, శివారు కాలనీల ప్రజలకు అవగాహన కల్పించాలన్న సంకల్పంతో ఎస్పీ స్వీయ రచన చేశారు. పాతబస్తీకి చెందిన ముగ్గురు యువకులు ఈ పాప్గీతానికి సంగీతం సమకూర్చనున్నారు. -
మహారాష్ట్రలో దుండగుల కాల్పులు
-
డబ్బు రాలేదని ఏటీఎంను ఏం చేశాడంటే..
చెన్నై: ఏటీఎంలో డబ్బులు రావడంలేదనే కోపంతో ఓ వ్యక్తి దాన్ని పగలగొట్టడమే కాకుండా.. సీసీటీవీ కెమెరా ధ్వంసం చేశాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కుడలోర్ అనే గ్రామంలోని అమన్ కోయిల్ స్ట్రీట్ కు చెందిన వీరన్(30) అనే వ్యక్తి తన సోదరిని చూసేందుకు పెరుంగుడి వచ్చాడు. రాత్రి వాడపలానీలో సినిమా చూసిన తర్వాత తిరిగొస్తూ తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో డబ్బు తీసుకునేందుకు ఒక ఏటీఎం వద్దకు వెళ్లాడు. డబ్బు తీసేందుకు చాలా సేపు ప్రయత్నించినా అది మొరాయించింది. దీంతో ఇక కోపంతో ఆ ఏటీఎంపై ఆగ్రహం చూపించడం మొదలుపెట్టాడు. సీసీటీవీ, ఏటీఎం పగలగొట్టడమే కాకుండా అక్కడ ఉన్న అద్దాలను కూడా ధ్వంసం చేశాడు. అదే సమయంలో పెట్రోలింగ్ కు వచ్చిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించినా పారపోయాడు. చివరికి అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. -
ఘోరంగా తిడుతూ నన్ను ఎత్తుకెళ్లాడు!
బెంగళూరు: పెయింగ్ గెస్ట్ గది ఎదురుగా ఫోన్లో మాట్లాడుతున్న తనను అమాంతం ఎత్తుకెళ్లి.. అత్యాచారం చేసేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడని, తనను అనరాని మాటలంటూ, 'వేశ్య' అని ఘోరంగా తిడుతూ అతడు తనపై అఘాయిత్యం చేయబోయాడని బెంగళూరు బాధితురాలు వెల్లడించింది. బెంగళూరులోని కట్రిగుప్ప వద్ద గత నెల 23న తనపై జరిగిన అత్యాచార యత్నం గురించి తాజాగా ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి ఎవరో ఇంతవరకు పోలీసులు గుర్తించలేదు. ఈ కేసులో నత్తనడకన విచారణ జరుగుతుండటంతో మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు తనపై అత్యాచార యత్నం చేయబోయిన వ్యక్తిని తాను గుర్తిస్తానని స్పష్టం చేసింది. ఆ సమయంలో తాను కేకలు పెట్టిన ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ' నా పెయింగ్ గెస్ట్ గది ఎదురుగా నేను ఫోన్లో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి వెనుకవైపు నుంచి వచ్చి అమాంతం నన్ను ఎత్తుకున్నాడు. నన్ను ఓ జంతువులా పట్టుకొని దగ్గర్లో నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు తీసుకెళ్లాడు. నాకు ఏం జరుగుతుందో కూడా కొంతసేపు అర్థం కాలేదు. నన్ను కిందపడేసి నాపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అతనితో పోరాడాను. అతన్ని వెనక్కినెట్టి పరిగెత్తాను. నా జట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి మళ్లీ నేలపై పడేశాడు. నేను గట్టిగా అరుస్తూ ఏడ్చాను. ఎవరూ నన్ను రక్షించేందుకు ముందుకురాలేదు. చివరకు అతని చేయి గట్టిగా కోరికి.. అతన్ని నుంచి తప్పించుకొని నా గదివైపు పరిగెత్తాను' అని బాధితురాలు వివరించింది. బాధితురాలి కుటుంబసభ్యులు మణిపూర్‌కు చెందినవారు. బెంగళూరులోనే పుట్టిన పెరిగిన ఆమె ప్రస్తుతం ఓ బ్యూటీ క్లినిక్‌లో పనిచేస్తోంది. -
సీసీటీవీ షాకింగ్: యువతిని ఎత్తుకెళ్లి..
బెంగళూరు నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తన పేయింగ్ గెస్ట్‌హౌస్ ఎదురుగా 25 ఏళ్ల యువతి ఫోన్లో మాట్లాడుతుండగా ఆమెను ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్దకు తీసుకెళ్లి ఆమెపై బలత్కారం చేసేందుకు ప్రయత్నించాడు. దక్షిణ బెంగళూరులోని కట్రిగుప్పెలో ఏప్రిల్ 23న రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని బాధితురాలు బలంగా ప్రతిఘటించింది. అతని చేతిని గట్టిగా కొరికి.. అతని బారి నుంచి తప్పించుకుంది. అనంతరం తన పెయింగ్ గెస్ట్ గదికి వచ్చి తనపై జరిగిన అకృత్యాన్ని వివరించింది. బాధితురాలు కల్యాణ్ నగర్‌లోని బ్యూటీ క్లినిక్‌లో పనిచేస్తోంది. గత నెల 23న రాత్రి ఆమె స్నేహితుడు తన పెయింగ్ గెస్ట్ రూమ్ సమీపంలోని మారెమ్మ ఆలయం వద్ద బాధితురాలిని దిగబెట్టాడు. ఆ తర్వాత ఫోన్ రావడంతో అక్కడే తచ్చాడుతూ ఆమె ఫోన్లో మాట్లాడింది. ఇదే అదనుగా భావించిన దుండగుడు వెనుక వైపునుంచి ఆమెను చుట్టేసుకొని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. సమీపంలో ఉన్న పాదచారులు ఆమెకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. దుండగుడి నుంచి తప్పించుకున్న ఆమె అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేయకుండా పెయింగ్ గెస్ట్ రూమ్ యాజమాని తనను ఒత్తిడి చేశాడని, ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు చెప్తున్నది. -
సీసీటీవీలో పనిమనిషి అడ్డంగా దొరికింది!
కువైట్: ఎంతో నమ్మకంగా ఇంట్లో పని చేయాల్సిన ఓ మహిళ చేయకూడని తప్పుచేసి అడ్డంగా దొరికిపోయింది. సీసీ టీవీలో అసలు విషయాన్ని గమనించిన యజమాని షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ వివరాలిలా ఉన్నాయి.. కువైట్ లో ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు హౌస్ మెయిడ్స్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటి యజమాని తనకు జ్యూస్ కావాలని అడిగాడు. ఇంతలో ఓ మహిళ జ్యూస్ తయారు చేసి ఏదో పనిమీద కాస్త పక్కకువెళ్లింది. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. మరో మహిళ యజమాని కోసం సిద్ధం చేసిన జ్యూస్ లో తన యూరిన్ ను పోసింది. ఈ దృశ్యాలు వంటింట్లో ఏర్పాటుచేసిన సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ వీడియోను గమనిస్తే ఆ మహిళ ఆ పనికి ముందే సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అయితే ఆ పుటేజ్ ఎలాగో బయటకు లీక్ అయింది. ఈ విషయం ఆనోటా ఈనోటా మీడియాకు చేరింది. మీడియా ఆ కుటుంబాన్ని సంప్రదించగా, కెమెరాలో ఆ దృశ్యాన్ని చూసి షాక్ తిన్నానని యజమాని చెప్పాడు. కానీ, ఆ ఘాతుకానికి పాల్పడ్డ పనిమనిషి పేరు, వివరాలు వెల్లడించేందుకు ఇంటి యజమాని నిరాకరించాడు. అయితే చుట్టుపక్కల ఇళ్లవారిని మాత్రం పనివారి చేష్టలపై కన్నేసి నిఘా పెట్టాలని సూచన చేయటం విశేషం. -
క్షణాల్లో దేహం రెండుగా చీలిపోయింది..!
ఫ్రాన్స్: ప్యారిస్ రెస్టారెంట్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది బ్రహీం అబ్దేస్లామ్ (31) ఆత్మాహుతి దాడి ఘటన లైవ్ సీసీటీవీ ఫుటేజీని తొలిసారి ఫ్రాన్స్ విడుదల చేసింది. ఈ వీడియోలో అబ్దెస్లామ్ శరీరం రెండు ముక్కలు కావడం కనిపించింది. గత ఏడాది నవంబర్ 13న కాంప్టాయిర్ వోల్టేయిర్ బ్రస్సేరిలో అబ్దెస్లామ్ ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాదాపు 130 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వీడియోలో చూపిన ప్రకారం తొలుత బ్రహీం ఓ కారులో దిగాడు. అనంతరం రెస్టారెంటులోపలికి అడుగుపెట్టి ఓ ఖాళీ టేబుల్ వద్దకు వచ్చాడు. మరోసారి టేబుల్ నుంచి లేచి డోర్ వద్దకు వెళ్లి నిల్చున్నాడు. ఏదో ఆలోచించి కొంత కలత చెందుతున్నట్లుగా కలత చెందాడు. ఆ తర్వాత తిరిగి అదే టేబుల్ వద్దకు వచ్చికి తన ఎడమ చేత్తో ముఖాన్ని కవర్ చేస్తూ.. కిందికి చూశాడు. అనంతరం స్యూసైడ్ బెల్ట్ బటన్ నొక్కాడు. క్షణాల్లో భారీ శబ్ధం రావడంతోపాటు రెస్టారెంటుమొత్తం పొగలు కమ్మింది. అతడి దేహం రెండు ముక్కలుగా చీలిపోయింది. -
8 దాటితే ఏటీఎంలలో నగదు నింపరు
ఎటీఎం మెషీన్లో రాత్రి ఎనిమిది గంటలు దాటాక నగదు అయిపోతే ఇక మరుసటి రోజు వరకు ఆగాల్సిందే. ఎటీఎం యంత్రాల్లో నగదును భర్తీ చేసేటపుడు జరుగుతున్న అక్రమాలను అరికట్టి మరింత భద్రతా ప్రమాణాలను చేపట్టడానికి కేంద్రం నడుం బిగించింది. ఇందులో భాగంగా పట్టణాల్లో రాత్రి ఎనిమిది దాటిన తర్వాత ఎటీఎం మెషీన్లలో నగదును భర్తీ చేయకూడదన్న ప్రతిపాదన ఒకటి ఆలోచనలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఐదు గంటల లోపు, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటల లోపే నగదు భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలంటోంది. ప్రైవేటు క్యాష్ ట్రాన్స్‌పోర్టేషన్ ఏజెన్సీలు బ్యాంకుల నుంచి మధ్యాహ్నంలోగా నగదును తీసుకెళ్ళి ఏటీఎంలలో భర్తీ చేయాలని కేంద్రం చెబుతోంది. అంతే కాదు ఈ నగదును తీసుకేళ్లే వాహనాలకు సీసీటీవీ, జీపీఎస్‌లతో అనుసంధానం చేయనున్నారు. ఈ వ్యాన్‌లో గరిష్టంగా రూ. 5 కోట్లకు మించి నగదు తీసుకెళ్లరాదని, అలాగే కాపలాగా ఆయుధాలతో కూడిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉండాలని కేంద్రం పేర్కొంది. భద్రతాపరంగా తీసుకున్న ఈ నిర్ణయాలు బాగానే ఉన్నా అత్యవసర సమయాల్లో నగదు తీసుకోవడం కష్టమవుతుందని మరికొంతమంది నిపుణులు అంటున్నారు. ఈ నిబంధనలు త్వరలోనే అమల్లోకి తీసుకువచ్చే ఆలోచనలో కేంద్రం ఉంది. పర్సనల్ ఫైనాన్స్ బ్రీఫ్స్.. ఎస్బీఐ ‘నో క్యూ’ ఇక నుంచి ఎస్బీఐ బ్రాంచీల్లో సేవల కోసం గంటల తరబడి క్యూలో నుంచోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర్లోని ఎస్బీఐ బ్రాంచిలో సేవలకు సంబంధించి టోకెన్ నెంబర్‌ను ఇంటి దగ్గర నుంచే తీసుకోవచ్చు. ఇందుకోసం ఎస్బీఐ ‘నో క్యూ’పేరుతో మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. మీరు ఉన్న చోట నుంచి 15 కి.మీ పరిధిలోని బ్యాంకులో కావాల్సిన సేవకు సంబంధించి టోకెన్ తీసుకోవచ్చు. మీ టోకెన్ నెంబర్ రావడానికి ఎంత సమయం పడుతుంది, మీరు ఉన్న చోట నుంచి బ్యాంకుకి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందన్న సమాచారం ఈ యాప్ అందిస్తుంది. దీనివల్ల బ్యాంకుల్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదని ఎస్బీఐ పేర్కొంది. ఆన్లైన్లో ఫండ్స్.. డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ సౌత్ ఏషియన్ స్టాక్ (ఎస్ఏఎస్) ఆన్లైన్ మ్యూచువల్ ఫండ్ సేవలను ప్రారంభించింది. ఇందుకోసం వెల్త్ఫోర్స్ డాట్‌కామ్ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఎటువంటి చార్జీలు లేకుండా నేరుగా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేసి అమ్ముకోవచ్చని, అలాగే నెలవారి సిప్ ఖాతాలను ప్రారంభించుకోవచ్చని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఎన్సీఎంఎస్ఎల్ నేషనల్ కోల్లేటరల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఎన్సీఎంఎస్ఎల్) గ్రామీణ ప్రాంత రుణ మార్కెట్‌పై దృష్టి సారించింది. ఇందుకోసం ఎన్‌సీఎంఎస్ ఎల్ ఫైనాన్స్ పేరుతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీని ఏర్పాటు చేసింది. రూ. 335 కోట్ల మూలధనంతో ఏర్పాటు చేసిన ఎన్‌సీఎంఎల్ ఫైనాన్స్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రుణాలను అందించనున్నట్లు తెలిపింది. -
ఇక సిటీ రైళ్లలో సీసీటీవీ కెమెరాలు!
ముంబై: ఇక నుంచి మహిళా ప్రయాణికులు రైళ్లలో అభద్రతా భావంతో ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి రక్షణగా రైళ్లలో ఇక సీసీటీవీ కెమెరాలు రానున్నాయి. ముంబయిలోని సిటీ సబర్బన్ రైళ్లలో మహిళ బోగీల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. అందుకుగల సాధ్యసాధ్యాలను పరిశీలించాలని రైల్వే శాఖను కోరింది. ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుమోటోగా స్వీకరించిన కోర్టు అందుకు తగిన ఆదేశాలిచ్చింది. స్థానిక రైళ్లలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక బోగీలు కేటాయించాలని, పశ్చిమ, మధ్య, హార్బర్ మార్గాల్లో రోజు దాదాపు 50 లక్షల మంది ప్రయాణిస్తారని వారికోసం భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. స్థానికులు ఇష్టమొచ్చినట్లు పట్టాలు దాటకుండా కంచె నిర్మించాలని సూచించింది. -
అమ్మో.. రెప్పపాటులో కత్తి పోటు తప్పింది
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ దొంగ దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఓ షాపు ముందు కాపలాగా నిద్రిస్తున్న వ్యక్తిని అమాంతం పొడిచిచంపేందుకు ప్రయత్నించాడు. దొంగ అలికిడిని రెప్పపాటులో గమనించిన కాపలా వ్యక్తి స్వల్పగాయంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ తప్పించుకున్నాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో ప్రకారం ఢిల్లీలోని చాందీ చౌక్ ఏరియాలో ఓ స్టేర్ పై దుకాణం ఉంది. దాని ముందే సెక్యూరిటీ గార్డు నిద్రపోయాడు. రాత్రి సమయం కావడంతో అక్కడి మెట్లు ఎక్కి దొంగతనానికి మంకీ టీ షర్ట్ లో వచ్చిన దొంగ అక్కడ గార్డును చూసి తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తిని బయటకు తీశాడు. రెండు చేతులతో దాని పిడిని గట్టిగా పట్టుకున్నాడు. రెండుమూడుసార్లు కిందికి వంగి చూసి కాళ్లు, తల భాగం ఎటువైపు ఉందా అని పరిశీలించాడు. ఆ తర్వాత పైకి లేచి ఊపిరి బిగబట్టి గట్టిగా పొడిచేసే ప్రయత్నం చేశాడు. రెప్పపాటు ఆ గార్డు ఆ పోటు నుంచి తప్పించుకుని స్వల్పగాయాలతో మెట్లపై నుంచి దొర్లుతూ ఆ ప్రాంతం నుంచి పరుగెత్తాడు. దీంతో దొంగ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. టీనేజీ యువకుడిలాగే ఉన్న ఆ దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సీసీటీవీలో కోడలి దాష్టీకం
-
రహస్య కెమెరాతో బయటపడ్డ కోడలి దాష్టీకం
బిజ్నూర్: ఆమె విద్యాధికురాలు. నాగరికురాలిగా కనిపిస్తుంది కూడా. కానీ కాళ్లు చచ్చుపడిపోయిన అత్త పట్ల మాత్రం అత్యంత దారుణంగా ప్రవర్తించింది. కనీసం మనిషని.. ముసలావిడనే కనికరం కూడా లేకుండా జుట్టుపట్టి ఈడ్చి, తలపై బండరాయితో మోది హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఈ దాష్టీకంలో నిందితురాలైన కోడలిని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూర్ కు చెందిన సంగీతా జైన్ అనే వివాహితకు కొన్నేళ్లుగా భర్తతో విబేధాలున్నాయి. విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. వేధింపులు, లైంగికదాడి సహా భర్త సందీప్ జైన్ పై పలు అక్రమ కేసులు బనాయించిన సంగీత.. బెదిరించిమరీ అత్తింట్లోనే ఉంటోంది. భర్తను జైలుకు పంపి, అత్త రాజ్ రానీ జైన్ ను హతమార్చితే ఆస్తి సొంతమవుతుందనుకున్న సంగీత.. ఆమేరకు పథకం రచించుకుంది. ఇంట్లో ఎవరూలేనప్పుడు అత్తను తీవ్రంగా హింసించేది. చున్నీ మెడకు బిగించి ఊపిరాడకుండా చేసేంది. బండరాయితో తలపై బాదేది. అయితే భార్య ప్రవర్తనపై ఎప్పటినుంచో అనుమానమున్న సందీప్.. ఇంట్లో రహస్యంగా సీసీటీవీ కెమెరాను ఏర్పాటుచేశాడు. ఆ సంగతి తెలియని సంగీత ఎప్పటిలాగే అత్తపై క్రౌర్యాన్ని ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయింది. జనవరి 5 నాటి దృశ్యాలను సాక్షాధారాలుగా భార్యపై పోలీసులకు ఫిర్యాదుచేశాడు సందీప్ జైన్. రంగంలోకి దిగిన పోలీసులు సంగీతను అదుపులోకి తీసుకుని, బాధిత అత్తను ఆసుపత్రికి తరలించారు. -
ఈ పిల్లాడు అదృష్ట జాతకుడే..
ముంబయి: అదృష్టమనేది ఉందా అనే అనుమానంలోకి జారుకోగానే.. నిజంగానే అది ఉందనిపించేలాగా కొన్ని సంఘటన ఆవిష్కృతమవుతుంటాయి. దీంతో తిరిగి మనిషి అనుమానం నుంచి నమ్మకంలోకి మారిపోతుంటాడు. ఈ సంఘటన గురించి తెలిసిన తర్వాత నిజంగా అదృష్టం ఉందని అనుకుంటారేమో. థానేలోని అంబర్ నాథ్ అనే రైల్వే స్టేషన్ జనాలతో కిక్కిరిసి ఉంది. అటునుంచి లోకల్ రైలు వేగంగా దూసుకొస్తుంది. అది గమనించని ఓ పిల్లాడు అవతలి ప్లాట్ ఫాం నుంచి ఇవతలి వైపు దూసుకొచ్చాడు. సరిగ్గా ప్లాట్ ఫాం కంటే కొద్ది ఎత్తు మాత్రమే ఆ పిల్లాడు ఉన్నాడు. రైలు వేగంగా వస్తోంది. ప్రయాణీకులంతా ఏం జరుగుతుందో అని కంగారు పడిపోతున్నారు. ఇంతలో రైల్వే పోలీసు ఎంతో సాహసంతో ఆ పిల్లాడికి చేయందించాడు. అదే సమయంలో మిగితా ప్రయాణీకులు కూడా అతడిని రక్షించేందుకు కానిస్టేబుల్ కు తోడయ్యాడు. సరిగ్గా అతడిని రైలు సమీపించే సమయానికి పైకి లాగారు. దీంతో రెప్పపాటులో ఆ పిల్లాడి ప్రాణం ప్రమాదం నుంచి బయటపడింది. రైల్వే కానిస్టేబుల్ సాహసాన్ని అక్కడి ప్రయాణీకులు అభినందించారు. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డయి ఉంది. -
'ఏ తప్పూ చేయలేదు.. సీసీటీవీ చూసుకోండి'
న్యూఢిల్లీ: ఢిల్లీ వీధుల్లో మరోసారి బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య వివాదం చోటుచేసుకుంది. తమ పార్టీ నేత ఆల్కా లాంబ విషయంలో అసభ్యకరంగా ప్రవర్తించారని, అనకూడని మాటలు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత ఓపీ శర్మ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో ఆప్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన ఇంటి వద్ద ఆందోళన నిర్వహిస్తూ ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు బారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓపీ శర్మ మీడియాతో మాట్లాడుతూ తన తప్పు ఉంటే ఆప్ ఎలాంటి ఫిర్యాదునైనా పోలీసులకు చేసుకోవచ్చని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో తనను ఆల్కా లాంబ అవమానించిందని, తిట్టిందని, అవన్నీ కూడా సీసీటీవీలో రికార్డయి ఉందని, వాటని పరిశీలిస్తే అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు. ఆప్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పారు. తాను ఒక్క మాట కూడా ఆల్కాను అనలేదని చెప్పారు. -
'ఆఫీసర్ భార్య రివర్స్ డ్రైవ్ చేసి చంపేసింది'
రాయ్‌పూర్: ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఓ సీనియర్ అధికారి భార్య నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ సెక్యూరిటీ ప్రాణాలు బలిగొంది. రాయ్ పూర్ లోని రాజేంద్ర నగర్ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన సీసీటీవీలో రికార్డయి.. చూసేవారి ఒళ్లు జలదరించేలా ఉంది. పూర్తి వివారాల్లోకి వెళితే సోమవారం రాత్రి 8.30గంటల ప్రాంతంలో రాయ్ పూర్ లోని రాజేంద్ర నగర్ కాలనీలో ఓ సెక్యూరిటీ గార్డు విధుల్లో ఉండగా ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన సీనియర్ అధికారి భార్య నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసింది. అది కూడా రివర్స్‌లో వెనుకాల ఎవరు ఉన్నారో అని కూడా చూసుకోకుండా చాలా వేగంతో. దీంతో ఆ కారు సరాసరి వెళ్లి సెక్యూరిటీగార్డును ఢీకొట్టడంతోపాటు అతడిని కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ అధికారి భార్యపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. -
'తాగి కన్నుమిన్ను కానక సెక్యూరిటీని తన్నింది'
జంషెడ్ పూర్: తాగితే కన్నూమిన్ను కానరాదని అంటారు. ఏం చేస్తున్నామో.. ఎలా ప్రవర్తిస్తున్నామనే కనీస సోయి ఉండదని చెప్తుంటారు. ఈ వీడియో చూస్తే అది నిజమే అనిపిస్తుంది కూడా. జంషెడ్ పూర్లో ఫుల్లుగా తాగిన అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఓ హోటల్ వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వారు ఎంత వారిస్తున్నా వినకుండా పిడిగుద్దులతో, కాలితన్నులతో చుట్టుపక్కలవారిని అవాక్కయ్యేలా చేసింది. ఆమెకు తన బాయ్ ఫ్రెండ్ కూడా తోడై అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నవారిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో కళ్లొప్పగించి చూడటం అక్కడి చుట్టుపక్కల ఉన్నవారి, రహదారిపై వాహనాల్లో వెళ్లేవారి వంతయింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ వీడియో ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తోంది. -
గుర్గావ్లో రియల్టర్ దారుణ హత్య
-
'రాత్రికి రాత్రే హీరోలయ్యారు'
న్యూఢిల్లీ: వారంతా ఓ పార్క్‌లో సాయంత్రం పూట సరదాగా ఫుట్ బాల్ ఆడుకునే పిల్లలు. వారి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు కూడా. కానీ అనుకోకుండా రాత్రికి రాత్రే పెద్ద హీరోలయ్యారు. ఢిల్లీ అంతటా శబాష్ యువత అనిపించుకుంటున్నారు. ఓ విదేశీయురాలిని రక్షించడమే వారికి హీరోలు అనే బిరుదును ఇచ్చేలా చేసింది. గత ఆగస్టులో ఢిల్లీలో ఓ రాత్రి పూట ఓ విదేశీయురాలు నడుచుకుంటూ వెళుతోంది. రోడ్డుకు ఇరువైపుల కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అనూహ్యంగా ఓ యువకుడు కొంత దూరం ఆమెను అనుసరించి చుట్టూ ఎవరూ లేరనుకోని ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగాడు. ఆమె సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించే క్రమంలో పిడిగుద్దులు గుప్పించాడు. దీంతో ఆ మహిళ రక్షించండంటూ కేకలు పెట్టింది. ఈ కేకలు విన్న కుర్రాళ్లు వెంటనే ఫెన్సింగ్ గోడ దూకి వచ్చారు. వారు వస్తున్నది గమనించి ఫోన్ దొంగతనానికి ప్రయత్నించిన యువకుడు పారిపోయాడు. అయితే, అతడు దూరంగా పారిపోయినట్లు నటించి ఓ కారు వెనకాలే దాక్కున్నాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు అదే గుంపులో కలిశాడు. అయిన పసిగట్టిన యువకులు అతడిని కొట్టి బందించి పోలీసులకు అప్పగించారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఈ వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. -
'ఇదొక యువకుల పైశాచికత్వం'
-
ప్రాణాలకు తెగించిన కస్టమర్
ముంబయి: ఆర్ధిక రాజధాని ముంబయి నగర వీధిలో దారుణం చోటుచేసుకోబోయింది. వికలాంగుడైన రజ్నీష్ సింగ్ ఠాకూర్ అనే ఓ మొబైల్ షాప్ యజమానిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అదే సమయంలో షాపులో ఫోన్ కొనేందుకు వచ్చిన ఒక వినియోగదారుడు ఎంతో ధైర్యం చేసి ఆ వ్యక్తిని అడ్డుకోవడమే కాకుండా తన చేతుల్లో బంధించి పక్కన ఉన్న వ్యక్తులకు అప్పజెప్పాడు. ఆ వినియోగ దారుడు సాహసం చేసి ఉండకపోతే ఆ యజమాని చనిపోయేవాడు. అప్పటికే హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి రెండుసార్లు కత్తితో దాడి చేయడంతో చేతికి, మెడకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ దృశ్యం అంతా కూడా ఆ షాపులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటన వెనుక మొత్తం ఆరుగురు వ్యక్తుల హస్తం ఉందని పోలీసులు తేల్చారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసి మరో ఇద్దరి కోసం గాలింపులు ప్రారంభించారు. అసలేం జరిగిందంటే.. ఈ మధ్య రౌడీయిజం చేస్తూ కొందరు వ్యక్తులు రోజుకు వెయ్యి రూపాయలు తమకు చెల్లించాలని బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండాలని, ఎవరైనా మాముళ్లు ఇస్తే వారి షాపులు తగులబెడతామని కూడా ఆ పోస్టర్లో హెచ్చరించారు. దీంతోపాటు ఎవరైనా వసూళ్లకు పాల్పడేవారు వస్తే తనకుగానీ, తన సోదరుడికిగానీ ఫోన్ చేయవచ్చని కూడా అందులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే వసూళ్లకు పాల్పడేవారు మొత్తం ఆరుగురు కలిసి రజ్నీష్ సింగ్ అనే వ్యక్తిని హత్య చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. మొత్తం ఆరుగురిలో ఐదుగురు కారులో కూర్చోగా ఒకరు మాత్రం కత్తితో వచ్చి సింగ్ పై దాడి చేయగా ఓ వినియోగదారుడు ధైర్యంగా అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి సింగ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఆ కస్టమర్ లేకుంటే తన సోదరుడు చనిపోయేవాడని సింగ్ సోదరుడు తెలిపాడు. -
కుక్కముందు తోకముడిచిన చిరుత
ముంబయి: సరిగ్గా అర్థరాత్రి రెండు గంటల ప్రాంతం. ఆ బంగ్లాలో ఉన్నవారంతా నిద్రపోతున్నారు. ఇంటికి కాపలా కాసే కుక్క కూడా గుర్రు పెట్టి నిద్రతీస్తుంది. ఈలోపు ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ఆ ఇంటి ప్రాంగణంలోకి చిరుత పులి ప్రవేశించింది. బాగా ఆకలితో ఉన్నదనుకుంటా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కసిగా కుక్కపై దాడి చేయాలనుకుంది. కాని, ఆ కుక్క ఇంటిలోపలికి వెళ్లే ప్రవేశ ద్వారానికి ముందున్న గదిలో ఉంది. లోపలికి దూరిపోదామంటే మొత్తం ఇనుపచువ్వలు పెట్టి కట్టారు. దీంతో ఆ గది చుట్టే అటూ ఇటూ తిరుగుతూ చివరికి తన పంజాను ఇనుపచువ్వల నుంచే దూర్చే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలోనే గాండ్రుమంటూ శబ్దం చేసింది. ఇంతలో కుక్కకు మెలకువ వచ్చి విశ్వాస విశ్వరూపాన్ని చిరుతకు చూపించింది. ఏమాత్రం జంకూబొంకూ లేకుండా చెవులు చిల్లులుపడేలా దానికి ఎదురపడి అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులకు చిరుత జంకి అక్కడి నుంచి తోకముడిచి పారిపోయింది. ఇదంతా ముంబయి శివారు ప్రాంతంలోని ఓ బంగ్లాలో చోటు చేసుకుంది. ఆ బంగ్లాకు వెలుపల బిగించిన సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యం నమోదైంది. రోజువారి తనిఖీలో భాగంగా చూసిన ఇంటి యజమానులు ఆ సీన్ చూసి అదిరిపడ్డారు. ఒక వేళ నిజంగా చిరుత ఇంట్లోకి వచ్చినట్లయితే అనుకుని భయపడిపోయారు. ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టగా అది నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది. -
కెమెరా నిఘాలో హౌసింగ్‌బోర్డు
-
‘సేఫ్’ సిటీకి సీసీటీవీలు కీలకం
- దాతల సహకారంతో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ - సీసీ కెమెరాల కోసం రూ. 50 కోట్లు కేటాయించిన ప్రభుత్వం - అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలు - సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ గచ్చిబౌలి: ‘సేఫ్ ఆండ్ స్మార్ట్ సిటీ’ సాకారం కావాలంటే సీసీటీవీలు అమర్చడం తప్పనిసరి అని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. నేరాలను ఛేదించడంలో సీసీటీవీల పాత్ర కీలకంగా మారిందన్నారు. గురువారం సైబరాబాద్ కమిషనరేట్‌లో ‘కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్-2015తో పాటు మరో మూడు సీసీటీవీ ప్రాజెక్టుల గురించి ఆయన వివరించారు. నేరాలు జరిగే కాలనీలు, ముఖ్యమైన అంతర్గత కూడళ్లు, జనసమర్థ ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఆరు నెలలుగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ (సీజీజీ) సంస్థ సహకారంతో కసరత్తు చేస్తున్నామన్నారు. సీసీటీవీల ఏర్పాటుకు మాత్రమే కాలనీవారిపై భారం పడుతుందని, ఎక్కువ మొత్తాన్ని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, సంపన్న వర్గాల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నామని చెప్పారు. 11 సబ్ డివిజన్ల పరిధిలో కమ్యూనిటీ సీసీటీవీలను ఏసీపీలు డివిజన్లో, డీసీపీలు జోన్లు, కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్లో వి జువల్స్ చూసేందుకు వీలుంటుందన్నారు. బాలానగర్ డివిజన్లో ఇప్పటికే కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కోసం ఆయా సంస్థలు, వ్యక్తుల నుంచి రూ.1.34 కోట్ల విరాళాలు ఇచ్చేందుకు మందుకు వచ్చాయన్నారు. ఈ నిధులతో బాలానగర్ జోన్ పరిధిలో 250 సీసీటీవీలు అమర్చేందుకు వీలుంటుందన్నారు. ఇప్పటికే రూ.28 లక్షల చెక్కులను ఆయా సంస్థల ప్రతినిధులు తమకు అందించారన్నారు. ఐటీ కారిడార్‌లో... ఐటీ కారిడార్‌లో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ఇప్పటికే 47 సీసీ కెమెరాలు అమర్చామని, టీఎస్ఐఐసీ కేటాయించిన రూ. 5 కోట్లతో, మరో 85 కెమెరాలను,75 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ పనులు రక్షా సెక్యూరిటీ సంస్థ చేపట్టనుందన్నారు. 70 ఫిక్స్డ్ కెమెరాలు, 15 పీటీజెడ్ కెమెరాలు అమర్చనున్నారన్నారు. వీటిలో 2 మెగా ఫిక్సెల్, నైట్ విజన్ కెమెరాలుంటాయని, సోలార్ బ్యాక్అప్, 30 రోజుల స్టోరేజీ, 5 ఏళ్ల వారంటీ ఉంటుందన్నారు. రూ. 50 కోట్ల నిధులు.. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీలో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్‌లో సీసీ కెమెరాలు అమర్చేందుకు 2014-15, 2015-16 లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు మంజూరు చేసిందని కమిషనర్ తెలిపారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో సైబరాబాద్ కమిషనరేట్‌లో 1000 ప్రధాన జంక్షన్లు, 5 జాతీయ రహదారులు, 10 రాష్ట్ర రహదారులపై 800 నుంచి 1000 సీసీటీవీలు అమర్చేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. వీటికి తర్వలోనే టెండర్లు పిలుస్తామన్నారు. సైబరాబాద్ కమిషన రేట్ కార్యాలయంపై మరో రెండు అంతస్తులు నిర్మించేందుకు రూ.7 కోట్లు మంజూరు అయ్యాయని కమిషనర్ చెప్పారు. ఇక్కడ కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 44 పోలీస్ స్టేషన్లలో 6-12 సీసీటీవీలు అమర్చనున్నారు. సబ్ డివిజన్, జోన్, కమిషనరేట్‌లో వాటిని అనుసంధానం చేస్తారు. ఇందుకు రూ. 60 లక్షలు మంజూరయ్యాయని కమిషనర్ తెలిపారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత... నేరాలు ఛేదించడంలో సీసీ కెమెరాల విజువల్స్ ఎంతో కీలకంగా మారుతున్నాయని కమిషనర్ ఆనంద్ అన్నారు. కొల్లూరులోని ఓ పాఠశాల ద్వారం ముందు అమర్చిన సీసీ కెమెరా విజువల్స్ ద్వారా మాదాపూర్‌లో అభయ రేప్ కేసును ఛేదించామన్నారు. మహేష్ బ్యాంక్‌లోని కెమెరా విజువల్స్ ఆధారంగా బంగారం దొంగిలించిన ఇంటి దొంగను పట్టుకున్నారు. పెద్దింటి గొల్ల దోపిడీ గ్యాంగ్, బైక్‌లు తగలబెట్టిన నిందితులను సీసీ కెమెరాలే పట్టించాయన్నారు. సీసీటీవీ టెక్నికల్ కన్సల్టెన్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జూబ్లీహిల్స్‌లో కమాండ్ సెంటర్ ఉంటుందని, సైబరాబాద్ కమిషనరేట్‌లో మరో కమాండ్ సెంటర్ ఉంటుందన్నారు. ఈ రెండింటినీ అనుసంధానం చేసి సేవలు అందిస్తారని చెప్పారు. కార్యక్రమంలో సీజీజీ ప్రతినిధి షబ్బీర్, మాదాపూర్ అడిషనల్ డీసీపీ మద్దిపాటి శ్రీనివాస్, బాలానగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'ఆ రోజు బస్సును అడ్డగోలుగా నడిపారు'
చండీగఢ్: పంజాబ్‌లో బస్సులోంచి తోయడంవల్ల పద్నాలుగేళ్ల బాలిక ప్రాణాలు పోయిన ఘటన గురించి పోలీసులు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. బస్సు ప్రయాణించిన రూట్లోని సీసీటీవీ కెమెరాల వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో ప్రకారం ఆరోజు బస్సును వారు అడ్డగోలిగా ఇష్టం వచ్చినట్లు నడిపినట్లు తెలిసింది. పూర్తిగా నియమనిబంధనలు భేఖాతరు చేసినట్లు కూడా స్పష్టమైంది. నాలుగు లేన్ల రోడ్డులో వాహనాలకు ఎదురుగా నడపడంతోపాటు రెప్పపాటులో ట్రాక్టర్‌ను ఢీకొట్టే ప్రమాదం తప్పించుకున్నారని వీడియో ద్వారా తెలిసింది. నాలుగు రోజుల కిందట పంజాబ్‌లోని మోగా జిల్లాలో బస్సు ఎక్కిన తల్లి కూతుర్లపై లైంగిక వేధింపులకు పాల్పడి వారు అడ్డుకోవడంతో బస్సు వేగంగా కదులుతుండగానే వారిని కిందికి తోసేసిన విషయం తెలిసిందే. ఆ చర్యతో కూతురు చనిపోగా.. తల్లికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై ఒక్కసారిగా తీవ్ర నిరసన రావడంతో పోలీసులు కేసు దర్యాప్తును వేగం చేశారు. ఈ నేపథ్యంలోనే సీసీటీవీ ఫుటేజీ సేకరించి పరిశీలించగా ఈ తాజా వాస్తవాలు బయటపడ్డాయి. -
ఏకంగా దేవుడి హుండీనే కొల్లగొట్టారు
హైదరాబాద్: హైదరాబాద్‌లో దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. ఏకంగా ఆలయ హుండినే కొల్లగొట్టారు. దేవుడి హుండీలనైతే కొల్లగొట్టారు కానీ.. గుడిలోని నిఘానేత్రం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో హుండీలు చోరీకి గురయ్యాయి. ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు.. హుండీ చోరీ అయినట్టు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. అంతే రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలో రికార్డయిన రీల్‌ను రివర్స్ చేశారు. ఉదయం ఆలయ ఆవరణను శుభ్రంచేసేందుకు వచ్చిన వ్యక్తితో పాటు మరో వ్యక్తి చోరీకి పాల్పడినట్టు తేలింది. వీరిద్దరు కలసి ఆలయంలో వేసిన ప్రతిఅడుగు రికార్డయింది. అయితే దొంగలు తమబండారం బయటపడకుండా ఉండేందుకు సీసీ కెమెరా వైర్లను కట్ చేశారు. మానిటర్‌ను ఎత్తుకెళ్లారు. ఇదొక్కటే కాదు.. ఇటీవల దొంగలు వరుసగా ఆలయాలనే టార్గెట్ చేస్తున్నారు. -
‘జరిమానా’ సొమ్ములో సగం మాకివ్వండి..
ప్రభుత్వానికి ట్రాఫిక్ విభాగం విజ్ఞప్తి సాక్షి, ముంబై : తమ విభాగం గత ఏడాది వాహనదారుల నుంచి వసూలు చేసిన సొమ్ములో సగం డబ్బును తమకు ఇవ్వాల్సిందిగా ట్రాఫిక్ విభాగం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసింది. గత ఏడాది ముంబై ట్రాఫిక్ విభాగం దాదాపు రూ. 20 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేసింది. ఇందులో సగం డబ్బు తమకు ఇస్తే బ్రీత్ అనలైజర్లు, స్పీడ్గన్లు, క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ (సీసీటీవీ) తదితర మెరుగైన సౌకర్యాలను సమకూర్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ట్రాఫిక్ విభాగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిని పరీక్షించేందుకు సరిపడినంత పరికరాలు కొరవడ్డాయన్నారు. గత ఏడాది ట్రాఫిక్ విభాగం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 16 బ్రీత్ అనలైజర్లను అందుకుంది. అవేకాకుండా మొత్తంగా 90 బ్రీత్ అనలైజర్లు ఉన్నాయనీ, అయితే ఇవి సరిపడినంతగా లేవని అధికారి తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం ‘జరిమానా’ సొమ్ములో సగం తమ విభాగానికి బదలాయించేందుకు అంగీకరిస్తే, తాము నిబంధనలను మరింత కఠినంగా అమలుచేసి ఆదాయం పెంపునకు కృషిచేసేందుకు వీలుపడుతుందని ట్రాఫిక్ విభాగ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డాక్టర్.బి.కె.ఉపాధ్యాయ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనకు అనుమతి లభిస్తే ట్రాఫిక్ విభాగానికి ఎంతో లాభపడుతోందన్నారు. ఇతర నిధులను ఆశించకుండా ఉండేందుకు ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ట్రాఫిక్‌ను పర్యవేక్షించేందుకు తమకు అత్యవసరంగా చాలా పరికరాలు అవసరం ఉంటాయని ఆయన వివరించారు. ఈ-చలాన్‌తో ‘ట్రాఫిక్’కు పనిభారం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-చలాన్ వ్యవస్థ ట్రాఫిక్ విభాగానికి మరింత పని భారాన్ని తెచ్చిపెట్టింది. నవీముంబై ట్రాఫిక్ విభాగం రాష్ట్రంలోనే మొదటిసారిగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు ఈ-చలాన్ వ్యవస్థను గత ఏడాది ప్రారంభించింది. అయితే ట్రాఫిక్ విభాగం సమయం ఆదా చేసేందుకు ఈ-చలాన్ వ్యవస్థను ప్రారంభించినప్పుటీ తమకు పని భారం ఎక్కువవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. నగరంలో 15 ట్రాఫిక్ యూనిట్లు ఉన్నాయి. వీటికి ఈ-చలాన్ పరికరాన్ని అందజేశారు. 30 మంది ట్రాఫిక్ సిబ్బందికి ఈ పరికరాన్ని ఎలా ఉపయోగించాలో శిక్షణ కూడా ఇచ్చారు. కొత్త ఈ-చలాన్ వ్యవస్థలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారి పూర్తి సమచారాన్ని ఘటనా స్థలంలోనే ఫీడ్ చేసి ప్రింట్ అవుట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఒకోసారి కొత్త ఈ-చలాన్ వ్యవస్థ పనిచేయకుంటే తిరిగి వీరి వివరాలను మాన్యువల్‌గానే చేయాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో కొత్త ఈ-చలాన్ వ్యవస్థలో వాహనదారులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉండడంతో ఇది కొంత మేర సులభంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి ఈ పరికరాలు పని చేయకుంటే పాత వ్యవస్థనే ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో దీనిని తీసివేయవద్దని ట్రాఫిక్ విభాగం కోరుతోంది. అయితే ఒక వేళ ట్రాఫిక్ పోలీసులు ఒకేసారి 20 మంది వాహన దారులను పట్టుకున్నట్లుయితే వీరి వివరాలను వేర్వేరు రిజిస్టర్లలో నమోదు చేయాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీస్ తెలిపారు. దీంతో తమకు మరింత పని భారం పెరుగుతోందని ట్రాఫిక్ అధికారి తెలిపారు. -
వంశీచంద్ vs విష్ణు ఫైట్: సిసిటివి విజవల్స్
-
‘మంత్రిమండలి సమావేశంలోనే నిర్ణయించండి’
సాక్షి, ముంబై: రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం మంత్రివర్గంలో తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఠాణాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలంటూ రాష్ర్ట ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించిన సంగతి విదితమే. అయితే ఆ దిశగా ఇప్పటివరకూ ఓ అడుగు కూడా పడలేదు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పారంభించాలని, ఇదే ఆఖరు అవకాశమని ధర్మాసనం పేర్కొంది. ఆయా పోలీస్ స్టేషన్లలో లాకప్ మరణాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వడాల రైల్వే పోలీస్ స్టేషన్లో పోలీసులు తీవ్రంగా కొట్టడంవల్ల ఓ బాలుడు చనిపోయాడు. దీంతో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు అంశం మరోసారి తెర పైకి వచ్చింది. బాలుడి తండ్రి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఇందుకు కారకులైన పోలీసులపై చర్యలు మొదలయ్యాయి. తమ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని బాధిత తండ్రి కోర్టును వేడుకున్నాడు. ఇలా అనేక లాకప్ మరణాల కేసులు పెండింగులో ఉన్నాయి. వారికి న్యాయం జరగడం లేదు. సరైన ఆధారాలు లేకపోవడంవల్ల దోషులైన పోలీసులకు శిక్ష పడడం లేదు. దీంతో అన్ని పోలీసు స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని హైకోర్టు అదేశించింది. గతంలోనే ఈ ఆదేశాలు జారీచేసినప్పటికీ ఇంతవరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. -
సినీఫక్కీలో గోల్డ్ బిస్కెట్ చోరీ
-
నయా కల్చర్
టాంగ్ రాజవంశం కాలం సాహిత్యానికి, కళలకు స్వర్ణ యుగం అని చైనీయులు చెబుతుంటారు. ఆ కాలం నాటి 40 వేలకు పైగా పద్యాలు పదిల పరుస్తూ... వాటిని నేటి తరానికి అందిస్తున్నాయి సీసీటీవీ, చైనా సెంట్రల్ న్యూరీల్స్ కార్పొరేషన్లు. అంతేకాదు.. ఆ పద్యాలలో కొన్నింటిని షార్ట్ ఫిలింస్‌గా రూపొందించి జనబాహుళ్యానికి మరింత చేరువ చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. 1100 ఏళ్ల క్రితం చైనా రచయిత వెయ్ జువాంగ్ రాసిన పుసుమన్ విషాద ప్రేమకథతో కూడిన గేయాలతో పాటు సాంగ్ ఆఫ్ ఏ వాండరర్ తల్లీకొడుకుల మధ్య ఉన్న ప్రేమను వివరించే కథలు కూడా ఉన్నాయి. - కళ చైనా కవితా సంపదను, ట్రెడిషనల్ కల్చర్‌ని ప్రభావవంతంగా యువతరానికి చెప్పేందుకు ఈ బుల్లి సినిమాలే చక్కటి మాధ్యమమని బీజింగ్ ఫిలిం అకాడమీ ప్రెసిడెంట్ జాంగ్ హుజున్ అన్నారు. ఈ క్రమంలో 108 పద్యాలను షార్ట్ఫిలింస్గా మలిచేందుకు ఎంపిక చేశారు. దీని ద్వారా ఆ పద్యాలతో చక్కని కథను, నాటి జ్ఞాపకాలను తెరపై చూపించటం వీలవుతుందని ఈ ఫిలిం మేకర్స్ అభిప్రాయం. 15 నిమిషాల ఈ చిత్రాల్లో చైనా ప్రముఖ నటులు, దర్శకులు పాలుపంచుకోబోతున్నారు. ఓన్లీ బెస్ట్ ‘బెస్ట్పోయెమ్స్ని ఎంచుకోవడమే కాదు, వాటితో మంచి కథ ప్రెజెంట్ చేయటానికీ అవకాశం ఉందో లేదో కూడా చూసి అలాంటి వాటినే తీసుకున్నాం. చైనా చారిత్రక సాహిత్యాన్ని నేటి తరానికి పరిచయం చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో రూపొందిస్తున్న 108 షార్ట్ ఫిలింస్‌లో 70 ఇప్పటికే పూర్తయ్యాయి. టాంగ్ రాజ వంశం కాలం నాటి పద్యాలను ప్రమోట్ చెయ్యటం దీని ఉద్దేశం’ అన్నారు జాంగ్ హుజున్. షార్ట్ ఫిలింస్ ద్వారా సాహిత్యాన్ని, చరిత్రను, సంస్కృతిని నేటి తరానికి పరిచయం చేయాలంటూ చైనాలో మొదలైన ఈ ట్రెండ్ క్రమంగా అన్ని దేశాలకూ విస్తరించే అవకాశం ఉందనేది విస్తరించే అవకాశం లేకపోలేదు. -
పరిశుభ్రతపై సీసీటీవీ నిఘా
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేలోని 32 ప్రధాన రైల్వేస్టేషన్లలో 450 ఇంటర్నెట్ ఆధారిత సీసీటీవీల ద్వారా స్టేషన్ల పరిశుభ్రతను పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ తెలిపారు. ఆన్లైన్ వీడియోలో వీ క్షించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా గురువా రం జోన్ అంతటా భారీ ఎత్తున మహాశ్రమదానం నిర్వహిం చారు. ఈ సందర్భంగా రైల్‌నిలయంలో సీసీటీవీల పనితీరును ఆయన పరిశీలించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, విజయవాడ, తిరుపతి, కాకినాడ, గుంతకల్, గుంటూరు, అనంతపురం, కడప, నెల్లూరు, రాజమండ్రి, ఒంగోలు, రేణిగుంట, నిజామాబాద్, మహబూబ్‌నగర్, తదితర స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దశలవారీగా అన్ని ప్రధాన స్టేషన్లకు విస్తరిస్తామన్నారు. -
ఆ ముద్దు నేను పెట్టలేదు
నటుడు శింబుకు ముద్దు పెట్టింది తాను కాదంటోంది కన్నడ నటి హర్షిక. శింబు ఒక నటిని గాఢంగా ముద్దుపెట్టుకుంటున్న సన్నివేశాలు ఇంటర్నెట్లో ప్రచారమై కలకలం సృష్టిస్తున్నాయి. ఒక నక్షత్ర హోటల్లో ఈ చుంబనాల దృశ్యాలను చిత్రీకరించారు. ఇటీవల పలువురు నటీనటులు మలేషియాలో జరిగిన స్టార్‌నైట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు అక్కడి నక్షత్ర హోటల్లో ఈ ముద్దు సన్నివేశాల వీడియోను చిత్రీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సన్నివేశాల్లో శింబుపై ముద్దుల వర్షం కురిపించింది కన్నడ నటి హర్షిక అనే కథనాలు వెలువడుతున్నయి. అయితే ఈ ప్రచారాన్ని నటి హర్షిక ఖండించింది. దీని గురించి ఆమె స్పందిస్తూ వీడియోలో ఉన్న నటిని తాను కాదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తన పేరును పొరపాటుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. నటుడు శింబు కూడా ఆ వీడియోలో ఉన్న నటుడిని తాను కాదని వెల్లడించారు. -
ప్రైవేట్ భద్రత కట్టుదిట్టం
నోయిడా: నగరంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ప్రజలు అభద్రతాభావంలో జీవించాల్సి వస్తోంది. ఈ విషయాన్ని ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు స్థానికులు మొరపెట్టుకొన్నా ప్రయోజనం లేకుండా పోయింది. జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగాలు నేరాలను అదుపు చేయలేకపోతున్నాయి. సంఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప ఆ రెండు యంత్రాంగాలు ఏమీ చేయలేకపోతున్నాయి. మహా అయితే కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం అధికారులకు పరిపాటిగా మారింది. దీన్ని అధిగమించేందుకు స్వీయ భద్రతా చర్యలకు నగరవాసులు నడుం బిగించారు. సెక్టార్ 39 పరిధిలో స్వీయ రక్షణ చర్యలు ఆర్డబ్ల్యూఏ పరిధిలోని 39వ సెక్టర్లోని కొన్ని గృహసముదాయాలకు చెందిన ప్రజలు గ్రూపుగా ఏర్పడి, తమకు అవసరమైన భద్రతా చర్యలను తీసుకొన్నారు. ఇందుకు సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేట్ భద్రతా సిబ్బందిని నియమించుకోవడంతోపాటు రక్షణ చర్యలు తీసుకొన్నారు. గేట్ల ఎదుట సీసీటీవీలు, అపరిచిత వాహనాలు లోపలికి ప్రవే శం లేదనే బోర్డులు, ప్రవేశ, బయటి ద్వారాల వద్ద స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసుకొన్నారు. ఇంటి చుట్టూ ఇనుపవైర్లతోపాటు గేటు ముందు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దొంగతనాలు జరగకుండా నివారించేందుకు ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆలోచించకుండా సొంతంగా సెక్యూరిటీ వ్యవస్థను కట్టుదిట్టం చేసుకొన్నామని పలువురు నగర వాసులు పేర్కొన్నారు. ప్రతినెలా రూ. 2లక్షలు ఖర్చు చేస్తున్నాం: అధ్యక్షురాలు ఆర్డబ్ల్యూఏ 39వ సెక్టర్ సంఘం అధ్యక్షురాలు సుమిత్రా చోప్రా మాట్లాడుతూ.. మా సెక్టర్ భద్రత కోసం ప్రతి నెలా రూ.2.లక్షలను వెచ్చిస్తున్నాం. ఫలితంగా చైన్‌స్నాచింగ్‌లు, కార్ జాకింగ్స్లాంటి ఘటనలు తగ్గుముఖం పట్టాయి. సెక్టార్ భద్రత కోసం వైర్ కంచెను ఏర్పాటు చేశాం. దీని విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుంది. ఈ కంచెను ఒక వ్యక్తి తొలగించడం సులువుకాదు. అంత పటిష్టంగా ఉంటుందని చెప్పారు. అన్నింటికీ పోలీసులపై ఆధారపడొద్దనే.. అదేవిధంగా ‘సురక్షితమైన జీవనం కోసమే మా సెక్టర్లో ప్రైవేట్ భద్రతా చర్యలు తీసుకొన్నాం. నగరంలో పోలీసు సిబ్బంది కొరత కూడా ఉంది. అందుకే సెక్టార్లో పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోలేకపోతున్నారు. ప్రతి చిన్న విషయానికి పోలీసుల మీద ఆధారపడడం కూడా సముచితం కాదు. కాలనీ ప్రజలంతా కలిసి నవరాత్రులు, తదితర పండుగలను నిర్వహిస్తుంటాం. ఇలాంటి సమయంలో భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు, శాంతియుతంగా పండుగలు జరుపుకోవడానికి అవసరమైన చర్యలను అందరం కలిసే తీసుకొన్నామని మరో సభ్యురాలు చెప్పారు. కాలనీ అభివృద్ధికి సహకరించాలి మా పరిసరాలను శుభ్రంగా, భద్రంగా ఇతర కాల నీల ప్రజలకు ఆదర్శంగా తీర్చిదిద్దుకొంటున్నాం.. కాలనీ ప్రజలు సురక్షితంగా జీవించడానికి అవసరమైన అన్ని చర్యలు మేమే తీసుకొంటున్నాం. మా కాలనీలోని పార్కులను చూసుకోవడానికి తోటమాలీలు, స్వీపర్లను అధికారుల కేటాయించారు అని చెప్పారు. మా కాలనీ అభివృద్ధికి అధికారులు సహకరించాలని పలువురు నగరవాసులు కోరుతున్నారు. -
డీటీసీ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు
న్యూఢిల్లీ: మహిళలకు భద్రత కల్పించే ప్రక్రియలో భాగంగా ఢిల్లీ రవాణా సంస్థకుచెందిన బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసే పనులు ప్రారంభమయ్యాయి. తొలి దశలో 200 బస్సులో సీసీటీవీ కెమెరాలు అమర్చుతున్నామని డీటీసీ సోమవారం తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన సంస్థ ఈ పనులను ప్రారంభించిందని తెలిపింది. ఒక్కో బస్సులో మూడు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఏడు రోజుల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని డీటీసీ ప్రతినిధి ఆర్ఎస్ మిన్హాస్ చెప్పారు. బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చటం డీటీసీ చరిత్రలో మొదటిసారి అని పేర్కొన్నారు. మహిళలు ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇక నిర్భయంగా తమ బస్సుల్లో ప్రయాణించవచ్చని అన్నారు. సీసీటీవీ కెమెరాలను అమర్చుతున్న సంస్థనే వచ్చే ఐదేళ్ల పాటు వాటి నిర్వహణను కూడా పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఒక్కో సీసీటీవీ నిరాటంకంగా 15 రోజుల పాటు రికార్డు చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయని అన్నారు. అయినప్పటికీ ప్రతిరోజు వాటి ఫుటేజీని చూస్తామని మిన్హాస్ చెప్పారు. -
పట్టపగలు ఢిల్లీ నడిరోడ్డుపై హత్య
-
ఏడడుగులు... ఏడంతస్తులు... ఒక ప్రేమ చావు
ప్రేమలో ఉన్నవాడు ప్రపంచాన్నే దాటేస్తాడు. ఈ మేడ ఒక లెక్కా అనుకుంది ఓ అమాయకపు అమ్మాయి. తన మేడ నుంచి, ప్రియుడి మేడ మీదకి దూకేయాలనుకుంది. కానీ కాలు జారి, ఏడంతస్తుల ఎత్తు మీద నుంచి కిందకి పడిపోయింది. అంతే.....ఏడడుగులు నడవాల్సిన ఆమె ఏడంతస్తుల నుంచి ఏడో లోకానికి వెళ్లిపోయింది. ఈ సంఘటన మహారాష్ట్ర లోని ఠాణే పట్టణంలో జరిగింది. ఠాణే లోకి కాసర్ వాడావలిలో ఇంటర్ ఫైనల్ చదువుతున్న అమ్మాయి పొరుగింటి అబ్బాయిని ప్రేమించింది. అయితే ఈ మేడ నుంచి ఆ మేడకు వెళ్తే ఎంట్రన్స్ సీసీటీవీల్లో దొరికిపోతానన్న భయంతో డాబా మీదకి వెళ్లింది. ప్రియుడికి 'నేనిక్కడ. నువ్వెక్కడ?' అని మేసేజ్ చేసింది. అతగాడు దూకెయ్య మన్నాడు. ఈమె దూకేసింది. పొరుగు మేడకు వెళ్లాల్సిన అమ్మాయి ఏకంగా పరలోకానికే వెళ్లిపోయింది. ఇప్పుడు పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. -
అనూహ్య కేసులో ‘ఆధార’ం!
సాక్షి ముంబై: ముంబైలో దారుణ హత్యకు గురైన ఎస్తేర్ అనూహ్య కేసులో ‘ఆధార్’ చిక్కుముడి విప్పనుందా? కుర్లా రైల్వే స్టేషన్లో అనూహ్యతోపాటు సీసీటీవీలో కన్పించిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ఆధార్ కార్డు సాయం తీసుకోనున్నట్టు తెలిసింది. సీసీటీవీలో కన్పించిన ఆ వ్యక్తి కళ్లను సాధ్యమైనంత వరకు జూమ్ చేసి ఆధార్ కార్డు పరిజ్ఞానంతో పోల్చి చూస్తే అతడు ఎవరనేది తెలుసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కానీ కెమెరాల్లో ఆ వ్యక్తి ముఖమే సరిగ్గా కన్పించనప్పుడు కళ్లను గుర్తించి, ఆయనెవరో తెలుసుకోవడం కష్టమని కొందరు అంటున్నారు. -
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో పురోగతి