
కోయంబత్తూరు : విద్యుత్ బల్బు దొంగిలించడం కోసం ఓ వ్యక్తి నానా ఫీట్లు చేశాడు. తనను ఎవరు చూడకూడదనే ఉద్దేశంతో వ్యాయామం చేస్తున్నట్టు నటించి.. చివరికి బల్బును దొంగిలించాడు. కానీ అక్కడ జరిగిందంతా సీసీటీవీల్లో రికార్డయింది. వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూరులోని చెరన్ మా నగర్‌లోని దుకాణల ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై నిల్చున్న ఆ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న వాహనాలను గమనిస్తూ వ్యాయామం చేస్తున్నట్టు నటించసాగాడు.
తొలుత అటుగా ఎవరు రావడం లేదని నిర్ణయించుకుని బల్బు తీసేందుకు ప్రయత్నించి ఆగిపోయాడు. మరికొద్దిసేపు వేచి చూసిన తర్వాత మరోసారి ప్రయత్నించి.. బల్బును దొంగిలించి.. దానిని జేబులో పెట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు మాత్రం అతనిపై జాలి చూపెడుతూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment