bulb
-
‘పవర్’ఫుల్ ఐపీయస్ ఆఫీసర్
మనం సాంకేతికంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా, కొన్ని ప్రాంతాలలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 70 సంవత్సరాల నూర్జహాన్ ఇంట్లో ఒక్కసారి కూడా బల్బ్ వెలగలేదు. ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ లేదు. విషయం తెలిసిన ఐపీయస్ ఆఫీసర్ అనుకృతిశర్మ వ్యక్తిగత చొరవ తీసుకొని ఆ ఇంటికి కరెంట్ తీసుకు వచ్చింది. బామ్మ కళ్లలో వెలుగులు నింపింది. ఆ ఇంట్లో బల్బ్ వెలగడమే కాదు ‘మీరు చల్లగా ఉండాలి’ అంటున్నట్లుగా ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది. దీంతో బామ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అనుకృతిని ఆలింగనం చేసుకొని స్వీట్లు పంచింది. ‘ఆమె ముఖంలో కనిపించిన సంతోషం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది’ అంటూ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది అనుకృతి. అనుకృతి శర్మ దయాహృదయానికి నెటిజనులు జేజేలు చెప్పారు. ‘బామ్మ ఇంట్లోనే కాదు జీవితంలోనూ వెలుగులు నిండాలి’ అంటూ కామెంట్స్ పెట్టారు. -
పోలీసే దొంగలా కొట్టేస్తే ఏం చేసేది సామీ!
లక్నో: పోలీసే దొంగలా ఒక షాపు నుంచి ఎలక్ట్రిక్ బల్బ్‌ని కొట్టేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వీడియోలో పోలీస్ కానిస్టేబుల్ రాజేష్ వర్మ మూసేసి ఉన్న షాపు వద్ద బల్బుని తీసేసి జేబులో పెట్టకుని వెళ్లిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి రాజేష్‌కి అక్టోబర్ 6న దసరా సంబరాలు జరుగుతున్న రోజు ఆ ప్రాంతంలో నైట్ డ్యూటీ పడింది. అప్పుడే అతను ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఐతే మరసటి రోజు షాప్ యజమాని వచ్చి చూడగా..బల్బు కనిపించకపోవడంతో సీసీఫుటేజ్ చెక్ చేసి చూశాడు. ఆ వీడియో ఫుటేజ్ చూసి ఆ షాపు యజమాని ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఈ ఘటన తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు సదరు కానిస్టేబుల్ని విధుల నుంచి తొలగించారు. అతను ఈ మధ్యే ఫుల్పూర్ పోలీస్టేషన్‌కి బదిలిపై వచ్చాడు. ఐతే కానిస్టేబుల్ రాజేష్ మాత్రం తాను బల్బు దొంగలించ లేదని బల్బు ఊడిపోతుండటంతో తీసి మళ్లీ సరిచేసి పెట్టానంటూ సమర్థించుకనే యత్నం చేస్తున్నాడు. పైగా చీకటి కాబట్టి ఫుటేజ్ అలా కనిపిస్తుందని వాదిస్తున్నాడు. గతంలో యూపీలో ఇలానే ఒక పోలీసు మొబైల్ ఫోన్‌ని కొట్టేస్తూ పట్టుబడిన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. (చదవండి: కేరళ తరహా మరో నరబలి కలకలం.. మూడు రోజులుగా తాంత్రిక పూజలు చేస్తూ..) -
బల్బులో భారతదేశం
సాక్షి, వజ్రపుకొత్తూరు : వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి గ్రామానికి చెందిన యువకుడు తామాడ జోగారావు భారత దేశ చిత్ర పటం, జాతీయ జెండా చిత్రాలను విద్యుత్ బల్బులో నిక్షిప్తం చేసి దేశ భక్తిని చాటుకున్నాడు. తన చేతి నైపుణ్యంతో రూపొందించిన అపురూప క్రాఫ్ట్ అందరికీ ఆకట్టుకుంది. పలాస ప్రభుత్వ కళాశాలలో ఐఐటీ చదువుకున్న యువకుడు వినూత్న రీతిలో ఆలోచిస్తూ ఆకట్టుకుంటున్నాడు. -
బల్బు పేలి చిన్నారికి తీవ్ర గాయాలు
సాక్షి, చర్ల(ఖమ్మం) : స్థానిక విజయకాలనీకి చెందిన ఓ చిన్నారి ఆడుకుంటుండగా కరెంట్ బల్బు పేలి తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. విజయకాలనీకి చెందిన పలకా రమేష్–పుష్పావతిల కుమారుడు శ్రీనివాస్ ఉదయం ఆరుబయట పిల్లలతో ఆడుకుంటూ..తీసేసిన బల్బు, హోల్డర్‌తో కూడిన వైర్లు దొరకగా సరదాగా తీసుకువచ్చి ఇంట్లో ఉన్న విద్యుత్ స్విచ్‌బోర్డులో పెట్టాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బల్బు పేలిపోయి..ఆ గాజు ముక్కలు చిన్నారి చేతులకు, ముఖానికి తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు బాలుడిని తొలుత చర్లలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం భద్రాచలం తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
బల్బు దొంగ.. భలే ఫీట్లు
కోయంబత్తూరు : విద్యుత్ బల్బు దొంగిలించడం కోసం ఓ వ్యక్తి నానా ఫీట్లు చేశాడు. తనను ఎవరు చూడకూడదనే ఉద్దేశంతో వ్యాయామం చేస్తున్నట్టు నటించి.. చివరికి బల్బును దొంగిలించాడు. కానీ అక్కడ జరిగిందంతా సీసీటీవీల్లో రికార్డయింది. వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూరులోని చెరన్ మా నగర్‌లోని దుకాణల ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై నిల్చున్న ఆ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న వాహనాలను గమనిస్తూ వ్యాయామం చేస్తున్నట్టు నటించసాగాడు. తొలుత అటుగా ఎవరు రావడం లేదని నిర్ణయించుకుని బల్బు తీసేందుకు ప్రయత్నించి ఆగిపోయాడు. మరికొద్దిసేపు వేచి చూసిన తర్వాత మరోసారి ప్రయత్నించి.. బల్బును దొంగిలించి.. దానిని జేబులో పెట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు మాత్రం అతనిపై జాలి చూపెడుతూ కామెంట్లు చేస్తున్నారు. -
వ్యాయామం చేస్తున్నట్టు నటిస్తూ..దొంగతనం!
-
పరి పరిశోధన
బ్యాగ్ భుజాన వేసుకుంటే బల్బు వెలుగుతుంది... భుజాన బ్యాగ్ వేసుకుని వెళుతూంటే కాసేపట్లో చెమట్లు పట్టడం ఖాయం. ఇది కాస్తా మనల్ని చీకాకు పెడుతుంది గానీ.. ఛాల్మర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన సరికొత్త ఎలక్ట్రిక్ వస్త్రం మాత్రం చెమటతోపాటు కొంత కరెంటూ పుట్టిస్తుంది. బరువు ఎంత ఎక్కువైతే స్వేదంతోపాటు విద్యుత్తు కూడా ఎక్కువ అవుతుందన్నమాట. ఇంకోలా చెప్పాలంటే ఒత్తిడి ఎక్కువైనా... ఎక్కువగా లాగినాసరే... ఈ వస్త్రంతో విద్యుత్తు పుడుతుందన్నమాట. ప్రస్తుతానికైతే బ్యాగ్‌ను భుజానికి తగిలించుకునే స్ట్రాప్‌లో కొంతభాగంలో మాత్రమే ఈ వస్త్రాన్ని వాడారు. దీంతో ఒక ఎల్ఈడీ బల్బును వెలిగించేంత కరెంటు మాత్రమే పుడుతోందనీ, ఇది డిజిటల్ వాచీలూ, పాకెట్ కాలిక్యులేటర్, వంటి చిన్న చిన్న గాడ్జెట్లను నడిపేందుకు సరిపోతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అంజా తెలిపారు. పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే భౌతిక శాస్త్ర ధర్మం ఆధారంగా ఈ వస్త్రం పనిచేస్తుందని ఇందులోని పదార్థం రూపురేఖలు మారినప్పుడల్లా విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని వివరించారు. విద్యుత్తును ప్రసారం చేయగల నూలుపోగులు, పీజో ఎలక్ట్రిక్ పదార్థాలను కలిపి దీన్ని తయారు చేసినట్లు తెలిపారు. మూడు కిలోల బరువును బ్యాగ్‌లో ఉంచినప్పుడు నాలుగు మైక్రోవాట్ల విద్యుత్తు పుట్టిందన్నీ... బ్యాగ్ మొత్తాన్ని పీజో ఎలక్ట్రిక్ పదార్థాంతో తయారు చేస్తే వైర్లెస్ సిగ్నళ్లను ప్రసారం చేయగలిగేంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అంజా తెలిపారు. మూలకణాలతో మళ్లీ చూపు! శరీరంలోని ఏ కణంగానైనా మారిపోగల సామర్థ్యం మూలకణాల సొంతం. బ్రిటిష్ వైద్యులు ఈ లక్షణం ఆధారంగా కండరాలు బలహీనమవడం వల్ల క్రమేపీ చూపు కోల్పోతున్న ఇద్దరు మళ్లీ చూడగలిగేలా చేశారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో ఐదేళ్లలోనే ఈ రకమైన చికిత్స ద్వారా వయసుతోపాటు వచ్చే దృష్టి లోపాలను సరిచేయగలమని శాస్త్రవేత్తలు అంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ కళ్లలోని కండరాలు బలహీన పడుతుంటాయి. ఈ క్రమంలో ఒక పొర కణాలు నాశనమవుతాయి. రెటీనల్ పిగ్మెంట్ ఎపిథీలియం అని పిలిచే ఈ పొర కళ్లను శుభ్రం చేసేందుకు, కంటి బయటి పొరకు పోషకాలను అందించేందుకూ ఉపయోగపడుతుంది. ఈ రకమైన సమస్యతో బాధపడుతున్న ఇద్దరికి బ్రిటిష్ వైద్యులు ఏడాది క్రితం శస్త్రచికిత్స చేసి మూలకణాలు ఎక్కించారు. ఆ తరువాత జరిపిన పరిశీలనల్లో ఈ మూలకణాలు అక్కడే పెరగడంతోపాటు రెటీనల్ పిగ్మెంట్ ఎపిథీలియం కణాలుగా ఎదిగినట్లు గుర్తించారు. రోగ నిరోధక వ్యవస్థ ఈ కొత్త కణాలను తిరస్కరించే అవకాశం ఉందా? లేదా? మూలకణాలు కాస్తా కేన్సర్ కణాలుగా మారతాయా? వంటి విషయాలను మరిన్ని పరిశోధనల ద్వారా రూఢి చేసుకున్న తరువాత ఈ పద్ధతిని అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
బల్బ్‌లలో రహస్య కెమేరాలు
-
జస్ట్ 'లైట్'తో...లై-ఫే
లైట్ ద్వారా ఇంటర్నెట్ వస్తే ఎలా ఉంటుంది... అవును మీరు విన్నది నిజమే... ఇంతకుముందు వై-ఫై ద్వారా ఇంటర్నెట్ పొందేవాళ్లం. అయితే ఇప్పుడు జస్ట్ 'లైట్' ఉంటే చాలు... దాని ద్వారా ఇంటర్నెట్ పొందవచ్చని చైనా సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించడమే ఇప్పుడు కష్టం కదా. అదే విధంగా ఇంటర్నెట్ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు...ఆ ఇంటర్నెట్కు మధ్యమంగా వ్యవహరిస్తున్న వై-ఫై టెక్నాలజీ కంటే కూడా ఇప్పుడు మరింత సులువైన టెక్నాలజీని చైనాకు చెందిన సైంటిస్ట్‌లు కనిపెట్టారు. బల్బు ఉంటే చాలు దాన్నే ఇంటర్నెట్ మాధ్యమంగా వినియోగించుకో వచ్చంటున్నారు. ఒక్క కంప్యూటర్‌కు మాత్రమే కాకుండా కొన్ని సిస్టమ్స్‌కు కనెక్ట్ చేయాలంటే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఉపయోగించుకునే వై-ఫై రూటర్ ద్వారా నెట్ ప్రసారాలు చేయాల్సి వచ్చేది. పైగా వాటి పరికరాల ఖర్చు కూడా ఎక్కువే.దాంతో చైనా సైంటిస్ట్‌లు ఎల్ఇడి బల్బ్ ద్వారా ఈ ప్రసారాలు చేసి అబ్బుర పరుస్తున్నారు. దీనివల్ల వై-ఫై కంటే కూడా రేడియేషన్ లెవల్స్ తక్కువగా ఉండటమే కాదు ఎనర్జీ వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుందని సైంటిస్ట్‌లు చెపుతున్నారు. అంతేకాదు లైట్ ఉపయోగించి ఈ టెక్నాలజీని పనిచేసేలా చేస్తున్నారు.కాబట్టి దానికి లై-ఫే అని పేరు పెట్టారు చైనాకు చెందిన షాంగై ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఫిజిక్స్ వారు. నవంబర్ 5న చైనాలోని షాంగైలో దీన్ని ప్రదర్శనకు పెట్టనున్నారు. ఒకవేళ లైట్ ఆపివేస్తే సిగ్నల్ ఆగిపోయి నెట్ వర్క్ కూడా నిలిచిపోతుందని సైంటిస్ట్‌లు చెపుతున్నారు. త్వరలోనే దీన్ని కమర్షియల్‌గా వాడనున్నట్లు వారు తెలియ చేశారు.మరి ఈ టెక్నాలజీ మనదేశంలోకి రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.