జస్ట్ 'లైట్'తో...లై-ఫే
లైట్ ద్వారా ఇంటర్నెట్ వస్తే ఎలా ఉంటుంది... అవును మీరు విన్నది నిజమే... ఇంతకుముందు వై-ఫై ద్వారా ఇంటర్నెట్ పొందేవాళ్లం. అయితే ఇప్పుడు జస్ట్ 'లైట్' ఉంటే చాలు... దాని ద్వారా ఇంటర్నెట్ పొందవచ్చని చైనా సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించడమే ఇప్పుడు కష్టం కదా. అదే విధంగా ఇంటర్నెట్ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు...ఆ ఇంటర్నెట్‌కు మధ్యమంగా వ్యవహరిస్తున్న వై-ఫై టెక్నాలజీ కంటే కూడా ఇప్పుడు మరింత సులువైన టెక్నాలజీని చైనాకు చెందిన సైంటిస్ట్‌లు కనిపెట్టారు.
బల్బు ఉంటే చాలు దాన్నే ఇంటర్నెట్ మాధ్యమంగా వినియోగించుకో వచ్చంటున్నారు. ఒక్క కంప్యూటర్కు మాత్రమే కాకుండా కొన్ని సిస్టమ్స్‌కు కనెక్ట్ చేయాలంటే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఉపయోగించుకునే వై-ఫై రూటర్ ద్వారా నెట్ ప్రసారాలు చేయాల్సి వచ్చేది. పైగా వాటి పరికరాల ఖర్చు కూడా ఎక్కువే.దాంతో చైనా సైంటిస్ట్‌లు ఎల్‌ఇడి బల్బ్ ద్వారా ఈ ప్రసారాలు చేసి అబ్బుర పరుస్తున్నారు. దీనివల్ల వై-ఫై కంటే కూడా రేడియేషన్ లెవల్స్ తక్కువగా ఉండటమే కాదు ఎనర్జీ వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుందని సైంటిస్ట్‌లు చెపుతున్నారు.
అంతేకాదు లైట్ ఉపయోగించి ఈ టెక్నాలజీని పనిచేసేలా చేస్తున్నారు.కాబట్టి దానికి లై-ఫే అని పేరు పెట్టారు చైనాకు చెందిన షాంగై ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఫిజిక్స్ వారు. నవంబర్ 5న చైనాలోని షాంగైలో దీన్ని ప్రదర్శనకు పెట్టనున్నారు. ఒకవేళ లైట్ ఆపివేస్తే సిగ్నల్ ఆగిపోయి నెట్ వర్క్ కూడా నిలిచిపోతుందని సైంటిస్ట్లు చెపుతున్నారు. త్వరలోనే దీన్ని కమర్షియల్‌గా వాడనున్నట్లు వారు తెలియ చేశారు.మరి ఈ టెక్నాలజీ మనదేశంలోకి రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.