Li-Fi
-
వైఫై కన్నా వందరెట్లు వేగంతో లైఫై..
లైఫై ఇప్పుడు వైఫై కి దీటుగా మార్కెట్లోకి రాబోతోంది. 2011 లో లాబ్ లో కొత్తగా ఆవిష్కృతమై... 224 గిగాబైట్స్ వేగంతో పలు పరీక్షల అనంతరం ప్రపంచానికి పరిచయం కాబోతోంది. కార్యాలయాలు, పారిశ్రామిక వాతావరణంలో శాస్త్రవేత్తలు లైఫై పై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎల్ ఈ డీ లైట్ల కాంతి తరంగాలతో ఈ కొత్త వ్యవస్థ.. కమ్యూనికేషన్ కు ఎంతో ఉపయోగంగా ఉండటంతోపాటు.. సురక్షితంగా కూడ ఉంటుందని భావిస్తున్నారు. 'విజిబుల్ లైట్ కమ్యూనికేషన్' తో పనిచేసే కొత్త లైఫై... వైఫై కన్నా వంద రెట్టు వేగంగా పనిచేస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. కాంతిని ఉపయోగించి సమాచారాన్ని డేటాగా ప్రసారం చేసేందుకు ఇప్పుడు ట్వాలిన్, ఎస్టోనియాలోని కార్యాలయాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో దీన్ని పరీక్షించారు. ఈ లైఫై...లో ఇంటర్నెట్ వినియోగంలోనే విప్లవాత్మక మార్పును తెచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ కొత్త వైర్ లెస్ వ్యవస్థలో 400 నుంచి 800 టెరాహెడ్జ్ స్పీడ్ తో (సెకనుకు 1.5 గిగా బైట్ల వేగంతో) కాంతి.. బైనరీ కోడ్ లో సందేశాలను బదిలీ చేస్తుంది. ఈ విజిబుల్ లైట్ గోడలనుంచి ప్రసారం కాదు. పైగా సురక్షితంగా ఉండటంతోపాటు ఎటుపడితే అటు ప్రసరించేందుకు వీలుగా ఉంటుంది. ఈ వ్యవస్థ ఇప్పటికిప్పుడు వైఫైని భర్తీ చేయకపోయినా.. కొద్ది రోజుల్లో దానికి దీటుగా పనిచేసే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. స్కాట్ ల్యాండ్ ఎడిన్ బర్గ్ విశ్వ విద్యాలయానికి చెందిన హెరాల్డ్ హాస్ 2011 లో లైఫైని కొత్తగా కనుగొన్నారు. ఒకే ఎల్ ఈ డీ నుంచి ప్రసారమయ్యే మినుకు మినుకుమనే కాంతి ద్వారా సెల్యులార్ టవర్ కంటే ఎక్కువగా డేటా ప్రసారం అవుతుందని హాస్ ప్రదర్శించారు. మోర్స్ కోడ్ మాదిరిగానే ఈ వ్యవస్థ కాంతిని ఉపయోగించి ప్రసారం చేసినా.. కంటితో గుర్తించలేనంత వేగంతో కమ్యూనికేషన్ నడుస్తుందని చెప్తున్నారు. ఈ విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో పలు పైలట్ ప్రాజెక్ట్ లను నిర్వహించిన పరిశోధకులు...ప్రస్తుతం పారిశ్రామిక ప్రాంతంలో సులభంగా ప్రసారాలకోసం ఓ స్మార్ట్ లైట్ సొల్యూషన్ ను డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఈ సురక్షిత వైర్ లెస్ యాక్సిస్ కోసం హాస్ టీమ్ ఓ ప్లే ప్లగ్ ను, అప్లికేషన్ ను రూపొందించారు. 'ఒలెడ్ కాం' అనే ఓ ఫ్రెంచ్ సంస్థ లైఫై వాడకంతోపాటు.. ఈ వ్యవస్థను స్థానిక ఆసుపత్రుల్లో కూడ ఇన్ స్టాల్ చేసింది. ఈ లైఫై వైర్ లెస్ డేటా ట్రాన్స్ మిషన్ భవిష్యత్తును మరింత కాంతివంతంగా, ప్రకాశవంతంగా చేస్తుందని సైంటిస్ట్ హాస్ ఆశిస్తున్నారు. -
జస్ట్ 'లైట్'తో...లై-ఫే
లైట్ ద్వారా ఇంటర్నెట్ వస్తే ఎలా ఉంటుంది... అవును మీరు విన్నది నిజమే... ఇంతకుముందు వై-ఫై ద్వారా ఇంటర్నెట్ పొందేవాళ్లం. అయితే ఇప్పుడు జస్ట్ 'లైట్' ఉంటే చాలు... దాని ద్వారా ఇంటర్నెట్ పొందవచ్చని చైనా సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించడమే ఇప్పుడు కష్టం కదా. అదే విధంగా ఇంటర్నెట్ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు...ఆ ఇంటర్నెట్కు మధ్యమంగా వ్యవహరిస్తున్న వై-ఫై టెక్నాలజీ కంటే కూడా ఇప్పుడు మరింత సులువైన టెక్నాలజీని చైనాకు చెందిన సైంటిస్ట్‌లు కనిపెట్టారు. బల్బు ఉంటే చాలు దాన్నే ఇంటర్నెట్ మాధ్యమంగా వినియోగించుకో వచ్చంటున్నారు. ఒక్క కంప్యూటర్‌కు మాత్రమే కాకుండా కొన్ని సిస్టమ్స్‌కు కనెక్ట్ చేయాలంటే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఉపయోగించుకునే వై-ఫై రూటర్ ద్వారా నెట్ ప్రసారాలు చేయాల్సి వచ్చేది. పైగా వాటి పరికరాల ఖర్చు కూడా ఎక్కువే.దాంతో చైనా సైంటిస్ట్‌లు ఎల్ఇడి బల్బ్ ద్వారా ఈ ప్రసారాలు చేసి అబ్బుర పరుస్తున్నారు. దీనివల్ల వై-ఫై కంటే కూడా రేడియేషన్ లెవల్స్ తక్కువగా ఉండటమే కాదు ఎనర్జీ వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుందని సైంటిస్ట్‌లు చెపుతున్నారు. అంతేకాదు లైట్ ఉపయోగించి ఈ టెక్నాలజీని పనిచేసేలా చేస్తున్నారు.కాబట్టి దానికి లై-ఫే అని పేరు పెట్టారు చైనాకు చెందిన షాంగై ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఫిజిక్స్ వారు. నవంబర్ 5న చైనాలోని షాంగైలో దీన్ని ప్రదర్శనకు పెట్టనున్నారు. ఒకవేళ లైట్ ఆపివేస్తే సిగ్నల్ ఆగిపోయి నెట్ వర్క్ కూడా నిలిచిపోతుందని సైంటిస్ట్‌లు చెపుతున్నారు. త్వరలోనే దీన్ని కమర్షియల్‌గా వాడనున్నట్లు వారు తెలియ చేశారు.మరి ఈ టెక్నాలజీ మనదేశంలోకి రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
కాంతితో ఇంటర్నెట్
* ఎల్ఈడీ బల్బులతో సమాచారాన్ని ప్రసారం చేసే ‘లైఫై’ టెక్నాలజీని అభివృద్ధి చేసిన చైనా శాస్త్రవేత్తలు * వ్యయం తక్కువ.. భద్రత ఎక్కువ * కేవలం ఒక వాట్ బల్బుతో నాలుగు కంప్యూటర్లకు నెట్ బీజింగ్: కేవలం కాంతి (లైట్)తో వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య సమాచారాన్ని ప్రసారం చేయగల సరికొత్త సాంకేతికతను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘వైఫై’ను పోలిన ఈ టెక్నాలజీని ‘లైఫై’గా పిలుస్తున్నారు. వైఫైలో రేడియో తరంగాలను ఉపయోగిస్తే.. ఈ ‘లైఫై’లో కేవలం కాంతిని మాత్రమే వినియోగిస్తారు. వైఫైలో వాడే పరికరాల ధర ఎక్కువ, వాటి విద్యుత్ వినియోగమూ ఎక్కువే. అదే ‘లైఫై’కి అయ్యే వ్యయం, విద్యుత్ వినియోగం చాలా తక్కువ. ‘లైఫై’ టెక్నాలజీ ద్వారా కేవలం ఒక వాట్ సామర్థ్యమున్న చిన్న ఎల్ఈడీ బల్బుతో ఏకంగా సెకనుకు 150 మెగాబిట్స్ వేగంతో నాలుగు కంప్యూటర్లకు ఇంటర్నెట్ను అందించవచ్చు. ఇందులో సమాచార భద్రత, ఇతర సౌకర్యాలూ ఎక్కువే. దీనితో నెట్‌ను అందుకోవడమే కాదు.. ప్రింటర్లు, స్కానర్లు, మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటి మధ్యా సమాచార మార్పిడి చేయవచ్చు.దీనిలో రేడియో తరంగాల వాడకం లేకపోవడంతో.. విమానాల్లోనూ, రేడియేషన్ ఉండే సున్నిత ప్రదేశాల్లోనూ ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. అయితే, ఈ టెక్నాలజీకి కొన్ని పరిమితులూ ఉన్నాయి. కేవలం లైట్ ఆపేస్తే ఇంటర్నెట్ నిలిచిపోతుంది. గోడలు అడ్డుగా ఉండడం, ఎక్కువ దూరం లో ఉంటే పనిచేయకపోవడం దీనిలో లోపాలు. ‘లైఫై’ టెక్నాలజీని తొలుత బ్రిట న్కు చెందిన ఎడిన్బర్గ్ వర్సిటీ శాస్త్రవేత్త హరాల్డ్ హాస్ ప్రతిపాదించారు. దానిని తాజాగా చైనాకు చెందిన షాంఘై ఫుడాన్ వర్సిటీ ప్రొఫెసర్ చి నాన్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే, ఈ ‘లైఫై’ టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని ప్రొఫెసర్ చి నాన్ చెప్పారు. చైనాలోని షాంఘైలో వచ్చే నెల 5న జరగనున్న అంతర్జాతీయ ఇండస్ట్రీ ఫెయిర్‌లో పది ‘లైఫై’ కిట్లను ప్రదర్శనకు పెట్టనున్నట్లు తెలిపారు.