Wi-Fi
-
రీఛార్జ్ లేకుండానే.. ఫ్రీగా కాల్స్ మాట్లాడొచ్చు: సింపుల్ ట్రిక్ ఇదే..
సాధారణంగా కాల్స్ చేయాలన్నా.. స్వీకరించన్నా తప్పకుండా రీఛార్జ్ చేసుకోవాల్సిందే. రీఛార్జ్ ప్లాన్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో కొందరు సమయానికి రీఛార్జ్ చేసుకోలేరు. అలాంటి వారికి ఇప్పుడొక శుభవార్త. ఒక సింపుల్ ట్రిక్ పాటిస్తే.. రీఛార్జ్ చేసుకోకుండానే ఫ్రీగా కాల్స్ మాటాడొచ్చు. అదెలాగో ఇక్కడ చూసేద్దాం..ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న చాలా స్మార్ట్ఫోన్లు వైఫై కాలింగ్ ఫీచర్‌తో వస్తున్నాయి. ఈ ఫీచర్ ఉన్న మొబైల్ ఉపయోగించే వినియోగదారు మొబైల్ నెట్వర్క్ అవసరం లేకుండానే కాల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. వైఫై కనెక్షన్ ఉన్నంత వరకు మాత్రమే కాల్స్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ యాక్టివేషన్ ఎలా?➤మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేసి, నెట్వర్క్ & ఇంటర్నెట్ సెట్టింగ్‌లకు వెళ్లండి.➤అక్కడ సిమ్ కార్డ్ & మొబైల్ నెట్‌వర్క్‌ను ఎంచుకోండి.➤మీరు కాల్ చేయడానికి ఉపయోగించే సిమ్ కార్డును సెలక్ట్ చేసుకోండి.➤క్రిందికి స్క్రోల్ చేసి వైఫై కాలింగ్ టోగుల్ను ఎంచుకోవాలి.➤ఆ తరువాత వైఫై కాలింగ్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.వైఫై కాలింగ్ యాక్టివేట్ అయిన తర్వాత.. మొబైల్ నెట్వర్క్ సరిగ్గా లేనప్పుడు లేదా రీఛార్జ్ ప్లాన్ ముగిసినప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ కాల్ల కోసం ఆటోమాటిక్‌గా వైఫై ఉపయోగిస్తుంది. వైఫై కాలింగ్ ఫీచర్ ఉన్న స్మార్ట్ఫోన్లలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది.ఇదీ చదవండి: కొత్త బిజినెస్‌లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!? -
విమానాల్లో వైఫై.. ఫ్రీగా ఇంటర్నెట్
విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) దేశీ, విదేశీ రూట్లలో నడిపే ఫ్లయిట్స్‌లో వైఫై (Wi-Fi) ఇంటర్నెట్ కనెక్టివిటీ సర్వీసులను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఎయిర్‌బస్ ఏ350, బోయింగ్ 787–9 రకం విమానాలతో పాటు నిర్దిష్ట ఎయిర్‌బస్ ఏ321నియో ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.దేశీయంగా ఫ్లయిట్స్‌లో వైఫై సర్వీసులను ప్రవేశపెట్టిన తొలి విమానయాన సంస్థ తమదేనని ఈ సందర్భంగా కంపెనీ తెలిపింది. దేశీ రూట్లలో ప్రస్తుతానికి వీటిని కాంప్లిమెంటరీగా అందిస్తున్నట్లు వివరించింది. క్రమంగా అన్ని విమానాల్లోనూ ఈ సేవలు ప్రవేశపెడతామని పేర్కొంది.విమానాలు 10,000 అడుగుల ఎత్తు దాటాకా ప్రయాణికులు తమ ల్యాప్ టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను వైఫైకి కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ సేవలు ఆస్వాదించవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని ఉచితంగానే అందుబాటులోకి తెచ్చినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించించింది.ఎయిర్ ఇండియా అంతర్జాతీయ రూట్లలో పైలట్ ప్రోగ్రామ్‌గా గతంలో ఈ సర్వీసును ప్రారంభించింది. వీటిలో న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వంటి ప్రధాన గమ్యస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు దేశీయ రూట్లలో కూడా దీన్ని అమలు చేస్తున్నారు. వై-ఫై సేవలను క్రమంగా ఇతర విమానాలకు కూడా విస్తరిస్తారు. -
విస్తార కీలక ప్రకటన.. 20 నిమిషాలు ఫ్రీ వై-ఫై
అంతర్జాతీయ విమానాల్లో 20 నిమిషాల ఫ్రీ వై-ఫై అందజేస్తామని విస్తారా ప్రకటించింది. ఈ సర్వీస్ అందిస్తున్న మొదటి భారతీయ విమానయాన సంస్థగా విస్తారా రికార్డ్ క్రియేట్ చేసింది. టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ ఎయిర్‌లైన్ అన్ని క్యాబిన్లలో ప్రయాణీకులకు 20 నిమిషాల వై-ఫై యాక్సెస్ అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.ఈ ఫ్రీ వై-ఫై సర్వీస్ బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్, ఎయిర్‌బస్ ఏ321 నియో విమానాల్లో మాత్రమే లభించనున్నాయి. ఈ వై-ఫై మరింత సమయం కావాలనుకున్నప్పుడు ప్లాన్స్ పొందాల్సి ఉంటుంది. విస్టారా ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఈ సర్వీస్ అందిస్తున్నట్లు కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్, దీపక్ రజావత్ వెల్లడించారు.బిజినెస్ క్లాస్, ప్లాటినం క్లబ్ విస్తార సభ్యులకు మరో 50 ఎంబీ డేటాను పొందవచ్చు. అన్లిమిటెడ్ వాట్సప్, ఫేస్బుక్ సేవల కోసం రూ. 372.74 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా రూ.1577.54 + జీఎస్టీ చెల్లిస్తే వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లలో అన్లిమిటెడ్ డేటా యాక్సెస్ లభిస్తుంది. రూ.2707.05 + జీఎస్టీ చెల్లిస్తే అన్లిమిటెడ్ డేటా పొందవచ్చు.Don’t miss out on important updates even at 35000 ft. ! Get 20 minutes of complimentary in-flight Wi-Fi, a first in Indian Aviation. Now you can purchase the selected plans using Indian credit/debit card in addition to internationally issued credit cards. pic.twitter.com/NTYCOJFY5N— Vistara (@airvistara) July 27, 2024 -
ఇక కిలోమీటరు దూరంలో ఉన్న వై-ఫై కనెక్ట్ అవ్వొచ్చు!
ప్రస్తుత ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకి వేగంగా పెరుగుతుంది. ఇప్పుడు అంతా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT) టెక్నాలజీ మాయం అయిపోయింది. అయితే, చాలా దూరంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను కనెక్ట్ చేయాలంటే వైర్ ద్వారా చేయాల్సి వస్తుంది. అయితే, ఇక ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. తక్కువ విద్యుత్ వినియోగంతో 1 కిలోమీటరు దూరం వరకు సిగ్నల్ వచ్చే Wi-Fi HaLow టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్త కంపెనీల నెట్వర్క్ Wi-Fi కూటమి ఈ విషయాన్ని దృవీకరించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పరికరాల వినియోగం భారీగా పెరుగుతున్న తరుణంలో Wi-Fi HaLow రూపొందించబడింది. పరిశ్రమలు, గృహాలలో IoT అప్లికేషన్లు పెరుగుతున్నందున మరిన్ని ఎక్కువ పరికరాలకి ఇంటర్నెట్ నిరంతరం కనెక్ట్ అయి ఉండాలి. Wi-Fi కూటమి తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ Wi-Fi కొత్త రూపం ప్రస్తుత Wi-Fiతో పోలిస్తే విద్యుత్ శక్తిని భారీగా ఆదా చేస్తుంది. వై-ఫై ఉన్న స్థానం నుంచి 1 కిలోమీటరు దూరంలో మీ కనెక్షన్లకు కనెక్ట్ అవ్వవచ్చు. అలాగే, Wi-Fi HaLow ఇప్పటికే ఉన్న వై-ఫై ప్రోటోకాల్‌ల ఆధారంగా రూపొందించబడింది. ప్రస్తుత వై-ఫై పరికరాలతో కూడా పనిచేస్తుంది. Wi-Fi HaLow ఎలా పని చేస్తుంది? సాధారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలను ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడానికి ఎక్కువగా 2.4GHz నుంచి 5GHz రేడియో ఫ్రీక్వెన్సీ గల వై-ఫై వాడుతాము. ఇవి తక్కువ సమయంలో అధిక మొత్తంలో డేటాను ప్రసారం చేస్తాయి. Wi-Fi HaLow భారీ రేడియో ఫ్రీక్వెన్సీ బదులుగా సబ్-1 గిగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో పని చేస్తుంది. తక్కువ-ఫ్రీక్వెన్సీ వేవ్ ఎక్కువ తరంగదైర్ఘ్యాన్ని అనుమతిస్తుంది. అంటే సిగ్నల్లు సాధారణంగా స్పెక్ట్రమ్‌లతో పోలిస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అందుకే, ఒక Wi-Fi HaLow యాక్సెస్ పాయింట్ నుంచి 1 కిలోమీటరు వ్యాసార్ధం వరకు విస్తరిస్తుంది. అయితే, దీని వల్ల కలిగే ప్రధాన నష్టం డేటా స్పీడ్ అనేది తగ్గిపోతుంది. అయినప్పటికీ, అటువంటి అప్లికేషన్ IoT పరికరాలకు ఖచ్చితంగా సరిపోతుంది. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ఎక్కువగా స్పీడ్ వచ్చే ఇంటర్నెట్ అవసరం. స్మార్ట్ డోర్ లాక్‌లు, కెమెరాలు, ఎయిర్ కండిషనర్లు మొదలైన వాటిని ఎక్కడ ఉన్న ఆపరేట్ చేయాలంటే IoT అప్లికేషన్ అవసరం. వీటికి తక్కువ ఇంటర్నెట్ అవసరం. ఈ Wi-Fi HaLow కిలోమీటరు దూరంలో ఉన్న 80 ఎంబీపీస్ వరకు వస్తుంది. (చదవండి: ఎక్కువ మైలేజ్ ఇచ్చే మారుతి కారు.. ధర ఎంతో తెలుసా?) -
భారత్‌లో గూగుల్ పబ్లిక్ వై–ఫై!
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో వై–ఫై సర్వీసులు అందించే దిశగా టెలికం ఆపరేటర్లు సహా ఇతరత్రా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. భారత్‌లో కొన్ని రైల్వే స్టేషన్స్‌లో వై–ఫై సేవలు ప్రారంభించిన స్ఫూర్తితో ఇండోనేషియా, మెక్సికో దేశాల్లో కూడా ’గూగుల్ స్టేషన్’ను ప్రవేశపెట్టినట్లు సంస్థ భారత విభాగం డైరెక్టర్ కె. సూరి తెలిపారు. రైల్‌టెల్ భాగస్వామ్యంతో ప్రారంభించిన వై–ఫై సేవలతో యూజర్లు సగటున 300 ఎంబీ మేర డేటాను వినియోగించుకున్నట్లు ఆయన వివరించారు. వైజాగ్, విజయవాడ, అలహాబాద్, గోరఖ్‌పూర్ మొద లైన స్టేషన్స్‌లో అత్యధికంగా డేటా వినియోగం ఉంటోందన్నారు. రిలయన్స్ జియో సర్వీసులు ప్రారంభమైనప్పటికీ డేటా వినియోగం గణనీయంగానే ఉందన్నారు. వాస్తవానికి పబ్లిక్ వై–ఫై సర్వీసుల వల్ల.. టెల్కోలపై డేటా ట్రాఫిక్ భారం తగ్గుతుందని చెప్పారు. పబ్లిక్ వై–ఫైతో 2019 నాటికి 4 కోట్ల మంది పైగా కొత్త యూజర్లు.. ఇంటర్నెట్కు చేరువ కాగలరని, జీడీపీ మరో 20 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందేందుకు ఇది తోడ్పడగలదని నివేదికలు చెబుతున్నాయని సూరి వివరించారు. -
శ్మశానంలో ఉచిత వైఫై
కొరుక్కుపేట(చెన్నై): చెన్నై అన్నానగర్, న్యూ ఆవడి రోడ్డులోని వేలాంగాడు శ్మశాన వాటికలో శనివారం నుంచి ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు శ్మశానవాటికలో శనివారం జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్(ఐసీడబ్ల్యూవో), గ్రేటర్ చైన్నై కార్పొరేషన్, రోటరీ క్లబ్ ఆఫ్ మీనంబాక్కం సంయుక్త ఆధ్వర్యంలో ఈ వైఫై సేవలను కల్పిస్తున్నట్టు తెలిపారు. ఉచిత వైఫై ద్వారా అంత్యక్రియలను విదేశాల్లోని ఆప్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం కలుగుతుందని చెప్పారు. అంత్యక్రియలకు రాలేని వారికి ఈ సదుపాయం ఉపయోగపడుతుందని వివరించారు. -
చౌక పబ్లిక్ వై–ఫైకి బూస్ట్!
⇒ కేంద్రానికి ట్రాయ్ ప్రతిపాదనలు ⇒ పీడీవో, పీడీవోఏలు ఏర్పాటు చేయాలని సూచన ⇒ వై–ఫై ఉపకరణాలపై దిగుమతి సుంకం తగ్గించాలని విజ్ఞప్తి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వై–ఫై సేవలను అందుబాటులోకి తీసుకురావాలని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ భావిస్తోంది. దీనికోసం పలు ప్రతిపాదనలు చేసింది. ఇవి అమల్లోకి వస్తే మాత్రం అతి తక్కువ ధరలకే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. వై–ఫై ఉపకరణాలపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ట్రాయ్ సూచించింది. అలాగే చౌక ధరలకే పబ్లిక్ వై–ఫై సర్వీసులను అందించేలా ‘పీడీవో’, ‘పీడీవోఏ’లకు వెసులుబాటు కల్పించాలని కోరింది. ‘పబ్లిక్ డేటా ఆఫీస్’ (పీడీవో)ల ఏర్పాటుకు నియమ నిబంధనలను రూపొందించాలి. పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్స్ (పీడీవోఏ)తో భాగస్వామ్యమైన పీడీవోలను పబ్లిక్ వై–ఫై సేవలను అందించడానికి అనుమతించాలి’ అని పేర్కొంది. ఇలాంటి చర్యల వల్ల కేవలం పబ్లిక్ హాట్‌స్పాట్స్ సంఖ్య పెరుగడమే కాకుండా దేశంలో ఇంటర్నెట్ సర్వీసులు మరింత అందుబాటులోకి వస్తాయని తెలిపింది. వై–ఫై యాక్సెస్ పాయింట్ ఉపకరణాలపై దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల ఇంటర్నెట్ సర్వీసులను అందించడానికి అయ్యే వ్యయాలు తగ్గుతాయని పేర్కొంది. ‘ఎలాంటి ప్రత్యేకమైన లైసెన్స్ అవసరం లేకుండానే పీవోడీఏలను వై–ఫై సర్వీసులను అందించడానికి అనుమతించే అవకాశముంది. అయితే ఇవి టెలికం డిపార్ట్మెంట్ సూచించిన రిజిస్ట్రేషన్ నియమాలను పాటించాల్సి ఉంటుంది’ అని తెలిపింది. దీంతో గ్రామీణ స్థాయి ఎంట్రప్రెన్యూర్షిప్కి ఊతమిచ్చినట్లు అవుతుందని, గ్రామాల్లో బలమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. వై–ఫై నెట్‌వర్క్‌లో ఒక ఎంబీ డేటా ఖర్చు 2 పైసల కన్నా తక్కువగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేసిన ట్రాయ్.. 2జీ, 3జీ, 4జీ వంటి సెల్యులర్ నెట్‌వర్క్స్‌లో యూజర్లు ఒక ఎంబీ డేటా కోసం సగటున 23 పైసలు వెచ్చిస్తున్నారని పేర్కొంది. పీడీవో, పీడీవోఏ అంటే.. ట్రాయ్ ఒక విధానాన్ని సూచించింది. ఇక్కడ చిన్న ఎంట్రప్రెన్యూర్లు, దుకాణం యజమానులు మల్టీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎస్పీ) నుంచి బ్యాండ్‌విడ్త్‌ను తీసుకుంటారు. దీన్ని తిరిగి వై–ఫై హాట్‌స్పాట్స్ ద్వారా డేటా రూపంలో చౌక ధరకు యూజర్లకు విక్రయిస్తారు. అంటే పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లను (పీడీవోఏ) ఏర్పాటు చేయాలని ట్రాయ్ సూచించింది. వీళ్లు ఐఎస్పీల నుంచి బ్యాండ్‌విడ్త్‌ను తీసుకొని దాన్ని పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీవో–హాట్‌స్పాట్ ఏర్పాటు చేసేవారు) యజమానులకు అందిస్తారు. -
విమానంలో వై-ఫైకు అనుమతి!!
న్యూఢిల్లీ : విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు ఫేస్బుక్లో సమయాన్ని వెచ్చించడం, ట్వీట్ చేయడం మిస్ అవుతున్నారా.? అయితే ప్రయాణికులకు త్వరలోనే ఓ గుడ్‌న్యూస్ అందనుంది. విమానాలు భారత గగనతలంలో ఎగురుతున్నప్పుడు వై-ఫై వాడుకునే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పించాలని పౌరవిమానయాన శాఖ నిర్ణయించిందట. 10 రోజుల్లో దీనిపై ఓ శుభవార్తను అందించనున్నట్టు పౌర విమానయాన కార్యదర్శి ఆర్ఎన్ చౌబే తెలిపారు. భారత గగనతలంలో వై-ఫై ఆపరేట్‌కు అనుమతి ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు విమాన ప్రయాణంలో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వాడకాన్ని అనుమతించేవారు కాదు. ఎవరైనా ఫోన్‌ను వాడితే అది నేరంగా పరిగణించేవారు. ప్రస్తుతం పౌర విమానయానం తీసుకునే ఈ నిర్ణయంతో కాల్స్ చేసుకునే అవకాశం కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. సివిల్ ఏవియేషన్ సెక్రటరీ వాగ్దానంతో, 'అచ్చే దిన్' ఫైనల్‌గా విమాన ప్రయాణికుల ముందుకు విచ్చేస్తుందట. ఈ ప్రతిపాదన అమలుకు కేబినెట్ అనుమతి అవసరం లేదని, 10 రోజుల్లో ప్రయాణికుల ముందుకు ఈ అవకాశాన్ని తీసుకురానున్నట్ట చౌబే తెలిపారు. భారత గగనతలంలో ఎగిరే భారత, విదేశీ విమనాలన్నింటికీ ఈ సౌకర్యం అనుమతించనున్నట్టు వెల్లడించారు. ఎయిర్ ప్యాసెంజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏపీఏఐ) నిర్వహించిన అవార్డు ఫంక్షన్లో చౌబే ఈ విషయాన్ని తెలిపారు. -
సీఎం నివాసంలో వైఫై ఏర్పాటు
ఉండవల్లి (తాడేపల్లి రూరల్): కృష్ణాతీరంలోని ఉండవల్లి కరకట్ట సమీపంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి సోమవారం అధికారులు ప్రసార సాధనాలకు సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ ఫోన్, ఇంటర్ నెట్, వైఫై ప్యాకేజీకి సంబంధించిన సేవలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రకాశం బ్యారేజీ నుంచి ముఖ్యమంత్రి నివాసం వరకు సుమారు కిలోమీటరు మేర ఫైబర్ కేబుల్ సోమవారం ఏర్పాటు చేశారు. అనంతరం కేబుల్‌తోపాటు అవసరమైన కమ్యూనికేషన్ యంత్రాలు అమర్చేందుకు పది మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. -
ఢిల్లీ మెట్రో రైల్లో ఉచిత హైస్పీడ్ వై-ఫై!
న్యూ ఢిల్లీ: ఢిల్లీ మెట్రో ప్రయాణీకులకు శుభవార్త! ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) రోజువారీ ప్రయాణీకుల కోసం మరో ప్రత్యేక సౌకర్యం కల్పించనుంది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో వంద శాతం ఉచిత వైఫై సేవలతో రవాణా వ్యవస్థ ఉండాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. అందులో భాగంగా దేశంలోని అతి పెద్ద వీడియో నెట్ వర్క్ సంస్థలైన టెక్నోశాట్ కాం, పింగ్ నెట్ వర్క్ ల తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిరోజూ ఢిల్లీ మెట్రోను వినియోగించే సుమారు 35 లక్షలమంది ప్రయాణీకులకు కావలసిన కంటెంట్ ను సమర్థవంతంగా అందించేందుకు ప్రస్తుతం ఆ సంస్థలు ప్రకటన దారులతో కలసి ఆసక్తిగా ముందుకొస్తున్నాయి. ఇకపై ఢిల్లీ నగరంలో మెట్రోలో ప్రయాణించే వారంతా ఉచిత వైఫై వినియోగించుకునే సౌకర్యాన్ని డీఎంఆర్సీ కల్పించనుంది. ఓ ప్రత్యేక యాప్ ద్వారా ఇంటర్నెట్ లో లాగిన్ అయ్యి, హైస్పీడ్ బ్రాడ్ బాండ్ సౌకర్యాన్ని పొందే అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు ఈ యాప్ ప్రయాణీకులకు అదనపు సౌకర్యాల్లో భాగంగా సమయం ప్రకారం ఆయా ప్రదేశాలను, గమ్యస్థానాలను సూచించడంతోపాటు వివిధ మార్గాల మధ్య నావిగేషన్ గా సహాయపడుతుంది. ఇప్పటికే ఢిల్లీ-హౌరా రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులో వైఫై సేవలను టెక్నో శాట్ కామ్ అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన యూరప్ లోని థాలిస్, ఎస్ఎన్సీఎఫ్, ఎన్ టీవీ వంటి సూపర్ ఫాస్ట్ రైళ్ళలో ఉపయోగించే హై స్పీడ్ బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ సేవలను అందించే 'టి ట్రాక్ 2.0 వేవ్ టు సొల్యూషన్' నెట్ వర్క్ ను ఇక్కడ వినియోగించనున్నారు. 4 జీ కన్నా మూడు రెట్టు అధికమైన 50 ఎంబిపీఎస్ వైఫై సర్వీస్ ను ప్రస్తుతం ఢిల్లీ మెట్రో ప్రయాణీకులకు అందించనున్నట్లు కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. ప్రతిరోజూ సుమారు 35 లక్షల మంది ప్రాయాణీకులతో నడుస్తున్న ఢిల్లీ మెట్రో నెట్ వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద నెట్ వర్క్ గా గుర్తింపు పొందింది. ఈ ఏడాది ప్రారంభించే కొత్త మార్గాలతోపాటు, ఇంటర్ కనెక్ట్ మార్గాల ఆరంభంతో ప్రయాణీకుల సంఖ్య మరింత గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తోంది. -
జెట్ ఎయిర్వేస్ విమానాల్లో వై-ఫై సేవలు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ కొత్తగా ఇన్-ఫ్లయిట్ స్ట్రీమింగ్ సేవలు అందించనుంది. విమానంలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు తమ వ్యక్తిగత వై-ఫై ఆధారిత స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు తదితర పరికరాల ద్వారా ఈ సర్వీసులను పొందవచ్చు. వివిధ భాషల్లోని వినోదప్రధాన కంటెంట్‌ను జెట్ అందుబాటులో ఉంచుతుంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి బోయింగ్ 737 నెక్ట్స్ జనరేషన్ విమానాల్లో స్ట్రీమింగ్ సేవలు ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ తెలిపింది. త్వరలో పూర్తి స్థాయి బ్రాడ్‌బ్యాండ్ సేవలు కూడా ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నామని పేర్కొంది. దీనితో ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఈ-మెయిల్, సోషల్ మీడియా మొదలైనవి కూడా అందుబాటులోకి రాగలవు. -
వైఫై కన్నా వందరెట్లు వేగంతో లైఫై..
లైఫై ఇప్పుడు వైఫై కి దీటుగా మార్కెట్లోకి రాబోతోంది. 2011 లో లాబ్ లో కొత్తగా ఆవిష్కృతమై... 224 గిగాబైట్స్ వేగంతో పలు పరీక్షల అనంతరం ప్రపంచానికి పరిచయం కాబోతోంది. కార్యాలయాలు, పారిశ్రామిక వాతావరణంలో శాస్త్రవేత్తలు లైఫై పై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎల్ ఈ డీ లైట్ల కాంతి తరంగాలతో ఈ కొత్త వ్యవస్థ.. కమ్యూనికేషన్ కు ఎంతో ఉపయోగంగా ఉండటంతోపాటు.. సురక్షితంగా కూడ ఉంటుందని భావిస్తున్నారు. 'విజిబుల్ లైట్ కమ్యూనికేషన్' తో పనిచేసే కొత్త లైఫై... వైఫై కన్నా వంద రెట్టు వేగంగా పనిచేస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. కాంతిని ఉపయోగించి సమాచారాన్ని డేటాగా ప్రసారం చేసేందుకు ఇప్పుడు ట్వాలిన్, ఎస్టోనియాలోని కార్యాలయాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో దీన్ని పరీక్షించారు. ఈ లైఫై...లో ఇంటర్నెట్ వినియోగంలోనే విప్లవాత్మక మార్పును తెచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ కొత్త వైర్ లెస్ వ్యవస్థలో 400 నుంచి 800 టెరాహెడ్జ్ స్పీడ్ తో (సెకనుకు 1.5 గిగా బైట్ల వేగంతో) కాంతి.. బైనరీ కోడ్ లో సందేశాలను బదిలీ చేస్తుంది. ఈ విజిబుల్ లైట్ గోడలనుంచి ప్రసారం కాదు. పైగా సురక్షితంగా ఉండటంతోపాటు ఎటుపడితే అటు ప్రసరించేందుకు వీలుగా ఉంటుంది. ఈ వ్యవస్థ ఇప్పటికిప్పుడు వైఫైని భర్తీ చేయకపోయినా.. కొద్ది రోజుల్లో దానికి దీటుగా పనిచేసే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. స్కాట్ ల్యాండ్ ఎడిన్ బర్గ్ విశ్వ విద్యాలయానికి చెందిన హెరాల్డ్ హాస్ 2011 లో లైఫైని కొత్తగా కనుగొన్నారు. ఒకే ఎల్ ఈ డీ నుంచి ప్రసారమయ్యే మినుకు మినుకుమనే కాంతి ద్వారా సెల్యులార్ టవర్ కంటే ఎక్కువగా డేటా ప్రసారం అవుతుందని హాస్ ప్రదర్శించారు. మోర్స్ కోడ్ మాదిరిగానే ఈ వ్యవస్థ కాంతిని ఉపయోగించి ప్రసారం చేసినా.. కంటితో గుర్తించలేనంత వేగంతో కమ్యూనికేషన్ నడుస్తుందని చెప్తున్నారు. ఈ విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో పలు పైలట్ ప్రాజెక్ట్ లను నిర్వహించిన పరిశోధకులు...ప్రస్తుతం పారిశ్రామిక ప్రాంతంలో సులభంగా ప్రసారాలకోసం ఓ స్మార్ట్ లైట్ సొల్యూషన్ ను డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఈ సురక్షిత వైర్ లెస్ యాక్సిస్ కోసం హాస్ టీమ్ ఓ ప్లే ప్లగ్ ను, అప్లికేషన్ ను రూపొందించారు. 'ఒలెడ్ కాం' అనే ఓ ఫ్రెంచ్ సంస్థ లైఫై వాడకంతోపాటు.. ఈ వ్యవస్థను స్థానిక ఆసుపత్రుల్లో కూడ ఇన్ స్టాల్ చేసింది. ఈ లైఫై వైర్ లెస్ డేటా ట్రాన్స్ మిషన్ భవిష్యత్తును మరింత కాంతివంతంగా, ప్రకాశవంతంగా చేస్తుందని సైంటిస్ట్ హాస్ ఆశిస్తున్నారు. -
తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్లలో వైఫై!
హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయాణీకులకు వై-ఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం క్వార్డ్‌జన్ కంపెనీతో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. క్వార్డ్‌జన్ కంపెనీ బీఎస్ఎన్ఎల్తో కలిసి వైఫై సేవలు అందించనుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల బస్టాండుల్లో ఈ వైఫై సేవలు అందించనున్నారు. ఈ రెండు సంస్థలు కలిసి తొమ్మిది రాష్ట్రాలో వై ఫై సేవలు అందించనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లోని మహాత్మగాంధీ బస్‌స్టేషన్‌లో, సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్‌లో వై-ఫై సేవలు వినియోగంలోకి వచ్చాయి. హన్మకొండలోని జిల్లా బస్‌స్టేషన్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, పటాన్చెరువు, మహబూబ్‌నగర్ బస్స్టేషన్లలో వైఫై సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన పరికరాలను బిగిస్తున్నారు. హన్మకొండ బస్‌స్టేషన్‌లో క్వార్డ్‌జెన్ కంపెనీ వైఫై సేవలు అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది. బీఎస్ఎన్ఎల్ సంస్థ నెట్ కనెక్షన్ ఇవ్వగానే, రెండు మూడు రోజుల్లో బీఎస్ఎన్ఎల్ వై ఫై సేవలు వినియోగంలోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తుంది. ప్రయాణీకులకు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినా..వీటిని చెల్లింపు ఆధారంగా సేవలు అందించనున్నారు. నెలకు 15 నిమిషాలు మాత్రమే ఉచితంగా అందించనున్నారు. 30 నిమిషాలకు లేదా 300 ఎంబీకి రూ.30లు చార్జీ చేయనున్నారు. 50 నిమిషాలు లేదా 500 ఎంబీకి రూ.50లు, రూ.124లకు 24 గంటలు వైఫై సేవలు అందించనున్నారు. దీనిని 24 గంటల లోపు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ సేవలు వినియోగించుకునేవారు కూపన్లు, ఆన్లైన్ పేమెంట్ పద్దతిలో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. -
వై-ఫైతో సెల్‌ఫోన్ చార్జింగ్!
మీకు అత్యవసరంగా మీ సెల్‌ఫోన్ నుంచి మరొకరికి మెసేజి పంపాల్సిన అవసరం వచ్చిందా? కానీ మీ సెల్ఫోన్లో ఛార్జింగ్ అస్సలు లేదా? సిగ్నల్స్ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయా? ఇప్పుడెలా అని కంగారు పడుతున్నారా? మీ కంగారును దూరం చేసేందుకు త్వరలోనే సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. మీకు వై-ఫై సదుపాయం ఉంటే చాలు...దాంతో బ్యాటరీలు చార్జి చేసుకోవచ్చు. అసలు బ్యాటరీలే అవసరం లేకుండా సెల్ఫోన్లు, కెమేరాలను వినియోగించుకోవచ్చు. దీని కోసం వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు ‘వై-ఫై బ్యాక్‌స్కాటర్’ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దాన్ని ఉపయోగించేందుకు ప్రత్యేకమైన రూటర్లను కూడా తయారుచేశారు. ఈ టెక్నాలజీ మన చుట్టూ ఉండే రేడియో తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చగలదు. బ్యాటరీలు లేని ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య సందేశాలను పంపించగలదు. శ్యామ్ గొల్లకోట అనే ఇంజనీరింగ్ విద్యార్థి నాయకత్వంలోని ఓ బృందం ఇటీవల అమెరికాలోని ఆరు ఇళ్లలో ప్రత్యక్షంగా వై-ఫై బ్యాక్‌స్కాటర్ పనిచేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించి విజయం సాధించారు. ఓ పక్క వై-ఫై ద్వారా 24 గంటల పాటు నెట్‌ను ఉపయోగిస్తూనే మరోపక్క స్కాటర్ ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య సమాచార మార్పిడిని పరీక్షించారు. ఈ ప్రయోగం వల్ల నెట్ బ్రౌజింగ్‌కు కూడా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదని బృందం తెలిపింది. సూర్య కిరణాలను విద్యుత్ శక్తిగా మారుస్తున్నట్లుగానే ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా తాము రేడియో తరంగాలను విద్యుత్ శక్తిగా మార్చగలిగామని, అలాగే అవే తరంగాలను ఉపయోగించి విద్యుత్ అవసరం లేకుండానే ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య సందేశాల మార్పిడి చేయగలిగామని వారు ఇటీవల ఇక్కడ జరిగిన ఎంటెక్ డిజిటల్ సదస్సులో వివరించారు. తాము ప్రయోగాత్మకంగా సృష్టించిన విద్యుత్ స్థాయిని ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ఇంకా ప్రయోగాలు నిర్వహిస్తామని, త్వరలోనే ఈ టెక్నాలజీని మార్కెట్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. -
ఎక్కడ వై-ఫై ఉంటే అక్కడ వాలిపోతున్న యువత
నల్గొండ: రాత్రి 11 గంటలు అవుతుంది భువనగిరి బస్టాండ్‌లో ఒక యువకుడు ఆటు ఇటు తచ్చాడు తున్నాడు. అక్కడే ఉన్న మరొకతను ఎందుకలా తచ్చాడుతున్నావంటే ఇక్కడ రోజు ఉచిత వైఫై వచ్చేది ఈరోజు రావడంలేదు అని సమాధానం ఇచ్చాడు. దీంతో వైఫై కనెక్షన్ ఉన్న యజమానిని అడిగితే పాస్ వర్డ్ మార్చాడని తెలియడంతో ఉసూరుమంటూ వెళ్లిపోయాడు. ఇప్పుడు వైఫై అనేది కేవలం నగరాలకు మాత్రమే పరిమితం కావడం లేదు.. చిన్న చిన్న పట్టణాలకు కూడా ఇంటర్నెట్ పాకడంతో ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలే కనిపిస్తున్నాయి.ఇది ఒక్క భువనగిరి బస్టాండ్‌లో మాత్రమే పరిమితమైన విషయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో వైఫై సేవలు ట్యాంక్ బండ్ ఏరియాలో విస్తరించిన విషయం తెలిసిందే. తాజాగా యాదగిరిగుట్ట దేవస్థానం సన్నిదిలో 100 మీటర్ల పరిధిలో వైఫై సేవలు త్వరలో అందనున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలుః వైఫై కనెక్షన్ కోసం ఇప్పుడు యువత ఆండ్రాయిడ్ పోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.అతి తక్కువ ధర 2500 నుంచి ఆండ్రాయిడ్ పోన్లు లభిస్తుండడంతో యువత ఎప్పటికప్పుడు పాత ఫోన్లకు టాటా చెప్పి ఆండ్రాయిడ్ పోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఇంటర్నేట్ సౌకర్యం కోసం వివిధ కంపెనీలు రకరకాల టారీఫ్‌లు ఇస్తున్నాయి,. వైఫై ఉన్నవారి అవస్థలు: తమ అవసరాల కోసం వైఫై కనెక్షన్ తీసుకున్న వారు ఔత్సాహికులతో అవస్థలు పడుతున్నారు. పదుల సంఖ్యలో తమ పరిధిలో వైఫైవాడుతుండడంతో వారిసేవలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఏరోజు కారోజు తమ వైఫై కోడ్‌ను మార్చుకుంటున్నారు. మరి కొందరికి ఈ విషయం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. -
‘గుట్ట’లో రిలయన్స్ ఉచిత వై-ఫై
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం (యాదాద్రి)లో రిలయన్స్ సంస్థ వారు ఉచిత వై-ఫై సౌకర్యం కల్పించనున్నారు. ఈ మేరకు ఈ సంస్థ మేనేజర్ వంగ మల్లేష్ సోమవారం దేవస్థానాన్ని సందర్శించి ఈవో గీతారెడ్డితో సమావేశమయ్యారు. కేబుల్ కనెక్షన్లను ఎలా ఇవ్వాలి? రూటర్లు, వస్తు సామగ్రి ఎక్కడ భద్ర పరచాలి? తదితర విషయాలపై చర్చించారు. వైటీడీఏలో భాగంగా వై-ఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు దేవస్థానం ఈఓ తెలిపారు. ముకేశ్ అంబానీకి గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 15 రోజుల్లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని ఈఓ తెలిపారు. ప్రధాన దేవాలయం మినహాయించి చుట్టుపక్కల ప్రాంతాలలోని 100 మీటర్ల వరకు ఈ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు ఆమె చెప్పారు. -
యాదగిరిగుట్టపై వైఫై సౌకర్యం
యాదగిరిగుట్ట (నల్లగొండ జిల్లా) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరిధిలో అతి తర్వరలో వై-ఫై సౌకర్యం అందుబాటులోకి రానుంది. రిలయన్స్ సంస్థ (ముఖేష్ అంబానీ గ్రూప్) ఆధ్వర్యంలో ఈ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు దేవస్థానం ఈవో గీతారెడ్డి తెలిపారు. రిలయన్స్ సంస్థకు చెందిన మేనేజర్ వంగ మల్లేష్ ఈ విషయమై దేవస్థానం ఈవో గీతారెడ్డితో సోమవారం చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... దేవాలయం మినహా చుట్టు పక్కల ప్రాంతాలలో 100 మీటర్ల వరకు ఈ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
రెండు నెలల్లో ఆ నగరమంతా వై ఫై
కోల్‌కతా: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడుతుంటే.. ఉచిత వై ఫై సేవలు అందించడానికి మెట్రో నగరాలు సై అంటున్నాయి. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా.. దేశంలో తొలి వై ఫై నగరంగా మారనుంది. రెండు నెలల్లోపు కోల్‌కతాను పూర్తిగా వై ఫై నగరంగా మార్చనున్నారు. కోల్‌కతాలోని మొత్తం 144 మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లలో వై ఫై సేవలు అందించనున్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫిబ్రవరి 5 నుంచి కోల్‌కోతా పార్క్ స్ట్రీట్ నుంచి సర్వీసులను ప్రారంభించనున్నారు. ఏప్రిల్ నాటికి ఈ సేవలు నగరమంతటా అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, లాప్‌ట్యాప్స్ యూజర్లు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయాన్ని ప్రకటించారు. వై ఫై సేవలు అందించేందుకు ముంబై కార్పొరేషన్ నడుంబిగించగా.. బెంగళూరులో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వై ఫై సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. -
కన్నాట్‌ప్లేస్‌లో వైఫై ప్రారంభం
న్యూఢిల్లీ: కన్నాట్‌ప్లేస్‌లో ఆదివారం పబ్లిక్ వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి ఈ సేవలను ప్రారంభించారు. టాటా టెలీసర్వీసెస్ భాగస్వామ్యంతో పరిపాలనా విభాగం ఈ సేవలను ప్రజలకు అందజేస్తున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) తెలియజేసింది. వినియోగదారులు మొదటి 20 నిమిషాలపాటు ఈ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చని, ఆ తర్వాత నుంచి కొంత చార్జి పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. రీచార్జీ కార్డులు వివిధ షాపుల్లో అందుబాటులో ఉంటాయని వారు వివరించారు. వైఫై సదుపాయమున్న అన్ని ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు ఈ వసతి అందుబాటులో ఉంటుందన్నారు. అంతేకాక ఇతర ఏమైనా సమాచారం కావాలంటే వైఫై కాల్ సెంటర్ నం. +9111 60607070కు ఫోన్ చేసి సేవలను పొందవచ్చు. ఈ ప్రాంతంలో ఒకేసారి ఐదువేల మంది వినియోగదారులు వైఫై సేవలను వినియోగించుకోవచ్చని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో రెండు రోజుల్లో వైఫై
హైదరాబాద్: హైదరాబాద్‌ను వైఫై సిటీ చేసేందుకు మరో రెండు రోజుల్లో శ్రీకారం చుట్టనున్నారు. మొదటగా గాంధీ ఆస్పత్రి, నెక్లెస్ రోడ్లో వైఫై సౌకర్యం కల్పిస్తారు. హైదరాబాద్ నగరమంతా వైఫై సౌకర్యం విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 4జీ, వైఫై సేవలు అందుబాటులోకి వస్తే ఒకే బిల్లుతో ఇంటర్నెట్, టీవీ, సెల్‌ఫోన్ సేవలన్నీ పొందవచ్చునని చెబుతున్నారు. వైఫై(వైర్లెస్ ఫిడెలిటీ- Wireless Fidelity(Wi-Fi) అంటే ఎటువంటి వైర్లు లేకుండా ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రావడం. ఇంక్యుబేటర్ ఏర్పాటుకు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటి), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బి) వంటి ప్రముఖ విద్యాసంస్థలను భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఈ పనులను అధికారులు వేగవంతం చేశారు. -
జైల్లో వైఫై, వీడియో కాన్ఫరెన్స్ కావాలట!
న్యూఢిల్లీ: ఆర్ధిక నేరాల ఆరోపణలతో గత మూడు నెలలుగా తీహార్ జైల్లో గడుపుతున్న సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ వైఫై, కాన్ఫరెన్స్ రూమ్ కావాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుబ్రతో దాఖలు చేసిన పిటిషన్ పై ఆయన తరపు లాయర్లను, జైలు అధికారులతో సుప్రీం న్యాయమూర్తి విచారించారు. అయితే సుబ్రతో విజ్క్షప్తిపై సమీక్ష నిర్వహిస్తామని సుప్రీం కోర్టు న్యాయమూర్తికి జైలు సీనియర్ అధికారులు తెలిపారు. అయితే కొనుగోలుదారులతో, ఇతర ప్రతినిధులను కలుసుకోవడానికి, చర్చలు జరపడానికి వీడియో కాన్ఫరెన్స్ సేవలు అవసరముందని సుబ్రతో న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఒకవేళ సుప్రీం కోర్టు అనుమతిస్తే.. వైఫై, వీడియో కాన్ఫరెన్స్, లాప్ టాప్ లకు అవసరమయ్యే ఖర్చును సహారా భరించాల్సి ఉంటుందన్నారు. సుబ్రతోను ఎంతమంది సందర్శకులు, ఎన్ని ఎలక్ట్రానికి వస్తువులు, సిబ్బంది సంఖ్యపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా ఓ సమీక్ష నిర్వహించనున్నారు. -
హైదరాబాద్.. ఇంటింటా ఇంటర్నెట్
► ఇక హై(వై)ఫై ► తొలి విడతగా వైఫై వచ్చే ప్రాంతాలు ► హైటెక్ సిటీ ► మాదాపూర్ ► గచ్చిబౌలి ► వీటితో పాటు వెస్ట్ జోన్‌లోని కొన్ని ప్రాంతాలు ► మెట్రోపోలీస్ సదస్సుకు హాజరయ్యే విదేశీ ప్రతినిధులు విడిది చేసే హోటళ్లు, పర్యాటక ప్రాంతాలు వైఫై పనితీరు ఇలా.. ‘వెర్లైస్ ఫెడిలిటీ’(వైఫై)... ఇప్పటివరకు లగ్జరీ హోటళ్లు, కార్పొరేట్ ఆఫీసులు, షాపింగ్ మాళ్లకే పరిమితమైన వైఫై సేవలు.. త్వరలో నగరం నడిబొడ్డున పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఉంటే చాలు.. వైర్లతో పనిలేకుండా ఆన్లైన్లో ఉచితంగా విహరించొచ్చు. సెప్టెంబర్ కల్లా హైదరాబాద్‌లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైఫై కథాకమామిషేంటో ఓ లుక్కేద్దాం రండి! ఇప్పటికే ప్రపంచదేశాల్లో గుర్తింపు పొందిన భాగ్యనగరం మరో మైలురాయిని దాటనుంది. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌ను కూడా వైఫై ఆధారిత నగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. దేశవ్యాప్తంగా 4జీ సేవల లెసైన్స్ పొందిన రిలయెన్స్ సంస్థ చేతికి పగ్గాలప్పగించింది. తొలి విడతలో.. హైదరాబాద్‌తో పాటు 6 కార్పొరేషన్లు, 37 మున్సిపాలిటీల్లో, రెండో విడతలో.. ఇతర పట్టణాలు, 220 మండల కేంద్రాల్లో, మూడో విడతలో రాష్ట్రమంతటా 4జీ సేవలు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వై -ఫై అంటే.. వైఫై అంటే.. వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ (డబ్ల్యూఎల్ఏఎన్). ఇది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (ఐఈఈఈ) 802.11 స్టాండర్స్‌పై ఆధారపడి ఉంటుంది. వైఫై అంటే ైవెర్లైస్ ఫెడిలిటీ అన్నమాట. ఒక్క వైఫై టవర్ సిగ్నల్స్ ఇండోర్‌లో అయితే 20 మీటర్లు, ఔట్‌డోర్‌లో అయితే 100 మీటర్లు వరకు అందుతాయి. వైఫై సేవలను పొందాలంటే ఫోర్త్ జనరేషన్ (4జీ) ఉండాల్సిందే. సిగ్నల్స్ ఇలా.. తీగల అవసరం లేకుండా నిర్ణీత పరిధిలో హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందడమే వైఫై. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న తర్వాత వైఫై రౌటర్ పరికరాన్ని అమర్చుతారు. ఈ పరికరం బ్రాడ్ బ్యాండ్ ద్వారా అందే ఇంటర్నెట్ను నిర్ణీత పరిధిలో వైఫై ఉన్న ఫోన్లు, కంప్యూటర్ల వంటి వాటికి ఇంటర్నెట్ సిగ్నల్‌ను అందిస్తా యి. మనం బ్లూటూత్ ద్వారా ఫోటోలు, పాటలు పంపినట్లే వై-ఫై ఇంటర్నెట్ సేవలను అందిస్తుందన్నమాట. తొలి 6 నెలలు ఉచితం.. ఆపై నెలకు రూ.1,200 తొలి విడతగా వైఫై సేవలను సచివాలయం, అసెంబ్లీ, జీహెచ్ఎంసీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని కొన్ని ప్రాంతాలు, సైబరాబాద్ పరిధిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాల్లో ఆరునెలల పాటు వైఫై ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మామూలుగా అయితే 4జీ కనెక్షన్‌కు చుట్టూ 4 కి.మీ. వరకు వైఫై అందుబాటులో ఉండే వీలున్నా.. పాస్వర్డ్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. అయితే ముందుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందరికీ ఉచితంగా వైఫై సేవల్ని అందిస్తారు. ఆ తర్వాత కనెక్షన్‌కు ప్రతినెలా రూ.1,200 వరకు చార్జీ వసూలు చేస్తారు. ప్రయోజనాలనేకం.. - ఇంటి పన్ను, విద్యుత్ బిల్లులు, లే-అవుట్ల అనుమతులు, జనన, మరణ ధృవీకరణ పత్రాల వంటి స్థానిక సర్టిఫికేట్లు వంటి సుమారు 15 రకాల ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తారు. దీంతో వినియోగదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే ఉచితంగా పొందవచ్చు. దీంతో డబ్బుకు డబ్బు.. సమయానికి సమయం ఆదా అవుతుంది. ట్రాఫిక్ చిక్కులూ తప్పుతాయండోయ్. - వైఫై సేవలతో ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న దానికంటే ఇంటర్నెట్, ఫోన్ల పనితీరు ఎన్నో రెట్లు మెరుగవుతుంది. - వైఫై సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ ఉంటేచాలు.. మొబైల్ డేటా నెట్వర్క్ లేకున్నా, వైఫై కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్ను బ్రౌజింగ్ చేసే వీలుంటుంది. గల్లీ గల్లీల్లో నిలబడి కూడా ఈ-మెయిల్స్, ఫేస్బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్‌ల్లో సర్ఫింగ్ చేయొచ్చు. - 4జీతో కేబుల్ కనెక్షన్లతో అవసరముండదు. ఆన్లైన్ ద్వారా ఒకే టీవీలో అన్ని చానళ్లు వీక్షించే వీలుంటుంది. - మొబైల్ ఫోన్లో మనం మాట్లాడే వ్యక్తులను చూసే వీలుంటుంది. దీనివల్ల ఒకరికొకరు దగ్గరగా ఉండి మాట్లాడుతున్నామనే అనుభూతి కలుగుతుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ తప్పనిసరి.. వైఫై సేవలకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉండాల్సిందే. ముందుగా వినియోగదారులు మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలు నమో దుచేసిన వెంటనే మొబైల్‌కు ఓటీపీ (వన్‌టైమ్ పాస్వర్డ్) వస్తుంది. ఈ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ కావచ్చు. ఇప్పటికే 500 కి.మీ. పూర్తి.. నగరంలో పూర్తి స్థాయి వైఫై సేవలకు 1,700 కి.మీ. మేర ఆప్లిక్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్సీ) లైన్లు అవసరముంటుందని నిపుణు ల అంచనా. ఇప్పటికే రిలయెన్స్ 500 కి.మీ. మేర లైన్ల నిర్మాణం పూర్తి చేసింది. అయితే అక్టోబర్‌లో నగరంలో జరగనున్న మెట్రోపోలీస్ సదస్సు నాటికి కొన్ని ప్రాంతాల్లోనైనా వైఫై సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రోజుకు 3 గంటలు.. 50 ఎంబీ డేటా.. రోజుకు 3 గంటల చొప్పున 50 ఎంబీ డేటా వరకు ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. కచ్చితమైన డేటాలోని ఐఎంఈఐ నంబర్లున్న మొబైల్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లకు మాత్రమే వైఫై సేవలు పొందే వీలుంటుంది. ఒక రోజులో 3 గంటల సమయం దాటితే వైఫై కనెక్టివిటీ ఉండదు. దృష్టి పెట్టాల్సిందిక్కడే: టీ ఐటీ ఎంప్లాయిస్ జేఏసీసీ లక్ష్మారెడ్డి - ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న వైఫై విధి, విధానాలు, లోటు పాట్లను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయాలి. ఇందుకోసం ప్రత్యేకమైన సాంకేతిక నిపుణుల్ని నియమించాలి. - వైఫై కింద ప్రభుత్వ సేవలను ఉచితంగా అందించి, ప్రైవేటు సేవలను కొంత మొత్తంతో అందించాలి. దీంతో నగదు భారం కాసింత తగ్గుతుంది. - వైఫై ఉపయోగించుకునే వ్యక్తి ఎలాంటి మొబైల్, ల్యాప్‌టాప్ వాడుతున్నాడు, ఇంటర్నెట్లో ఏం చెక్ చేస్తున్నాడు, ఏం డౌన్లోడ్ చేస్తున్నాడు.. వంటి అనేక అంశాలపై సర్వీసు ప్రొవైడర్లు ఎప్పటిక ప్పుడు నిఘా వేయాలి. - సంఘ విద్రోహక శక్తుల చేతుల్లోకి వైఫై కనెక్టివిటీ వెళ్లకుండా సైబర్ క్రైమ్ టీంను బలోపేతం చేయాలి. నేరస్థులను కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి. - కేవలం సమాచారాన్ని తెలుసుకునేందుకు, బ్రౌజింగ్, ఈ-మెయిల్స్ పంపించేందుకు మాత్రమే వైఫైని ఉచితంగా అందించాలి. వీడియో, ఆడియో స్ట్రీమింగ్, డౌన్లోడ్లను నియంత్రించాలి. - ఒకే సర్వర్‌పై ఎక్కువ గంటలు బ్రౌజింగ్ చేస్తే అక్కడి ఇంటర్నెట్ స్పీడ్ తగ్గడంతో పాటు, సర్వర్ కుప్పకూలే ప్రమాదముంది. పైగా స్థానిక వ్యాపారులు అపరిమితంగా వాడుకుని దుర్వినియోగం చేసే అవకాశముంది. ఈ అంశంపై దృష్టి సారించాలి. - సిటీ ఫ్లస్ ప్రతినిధి -
వైఫై...హైఫై
-
త్వరలో సెంట్రల్ ఢిల్లీ అంతా వైఫై ప్రాంతం
-
టాటా డొకొమో నుంచి ఫోటాన్ మ్యాక్స్ వైఫై
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా డొకొమో సీడీఎంఏ కస్టమర్ల కోసం ‘ఫోటాన్ మ్యాక్స్’ పేరుతో డాంగిల్ వంటి వైఫై ఉపకరణాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్.. ఇలా ఏదేని అయిదు ఉపకరణాల్లో దీని ద్వారా ఒకే సమయంలో ఇంటర్నెట్ వినియోగించవ చ్చు. 6.2 ఎంబీపీఎస్ వేగంతో ఇది పనిచేస్తుందని కంపెనీ ఆంధ్రప్రదేశ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ హెడ్ ఎస్.రామకృష్ణ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. రూ.650 నుంచి రూ.1,500 విలువ గల వైఫై ప్లాన్లలో దేనినైనా కస్టమర్లు ఎంచుకోవచ్చని చెప్పారు. క్వాల్కామ్ కంపెనీ ఈ ఉపకరణాన్ని తయారు చేసింది. డ్యూయల్ ప్రాసెసర్‌ను ఇందులో పొందుపరిచారు. ధర రూ.1,999. దేశవ్యాప్తంగా రోమింగ్ ఉచితం.