
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో వై–ఫై సర్వీసులు అందించే దిశగా టెలికం ఆపరేటర్లు సహా ఇతరత్రా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. భారత్‌లో కొన్ని రైల్వే స్టేషన్స్‌లో వై–ఫై సేవలు ప్రారంభించిన స్ఫూర్తితో ఇండోనేషియా, మెక్సికో దేశాల్లో కూడా ’గూగుల్ స్టేషన్’ను ప్రవేశపెట్టినట్లు సంస్థ భారత విభాగం డైరెక్టర్ కె. సూరి తెలిపారు. రైల్‌టెల్ భాగస్వామ్యంతో ప్రారంభించిన వై–ఫై సేవలతో యూజర్లు సగటున 300 ఎంబీ మేర డేటాను వినియోగించుకున్నట్లు ఆయన వివరించారు.
వైజాగ్, విజయవాడ, అలహాబాద్, గోరఖ్‌పూర్ మొద లైన స్టేషన్స్‌లో అత్యధికంగా డేటా వినియోగం ఉంటోందన్నారు. రిలయన్స్ జియో సర్వీసులు ప్రారంభమైనప్పటికీ డేటా వినియోగం గణనీయంగానే ఉందన్నారు. వాస్తవానికి పబ్లిక్ వై–ఫై సర్వీసుల వల్ల.. టెల్కోలపై డేటా ట్రాఫిక్ భారం తగ్గుతుందని చెప్పారు. పబ్లిక్ వై–ఫైతో 2019 నాటికి 4 కోట్ల మంది పైగా కొత్త యూజర్లు.. ఇంటర్నెట్‌కు చేరువ కాగలరని, జీడీపీ మరో 20 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందేందుకు ఇది తోడ్పడగలదని నివేదికలు చెబుతున్నాయని సూరి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment