ఎక్కడ వై-ఫై ఉంటే అక్కడ వాలిపోతున్న యువత
నల్గొండ: రాత్రి 11 గంటలు అవుతుంది భువనగిరి బస్టాండ్‌లో ఒక యువకుడు ఆటు ఇటు తచ్చాడు తున్నాడు. అక్కడే ఉన్న మరొకతను ఎందుకలా తచ్చాడుతున్నావంటే ఇక్కడ రోజు ఉచిత వైఫై వచ్చేది ఈరోజు రావడంలేదు అని సమాధానం ఇచ్చాడు. దీంతో వైఫై కనెక్షన్ ఉన్న యజమానిని అడిగితే పాస్ వర్డ్ మార్చాడని తెలియడంతో ఉసూరుమంటూ వెళ్లిపోయాడు. ఇప్పుడు వైఫై అనేది కేవలం నగరాలకు మాత్రమే పరిమితం కావడం లేదు.. చిన్న చిన్న పట్టణాలకు కూడా ఇంటర్‌నెట్ పాకడంతో ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలే కనిపిస్తున్నాయి.ఇది ఒక్క భువనగిరి బస్టాండ్‌లో మాత్రమే పరిమితమైన విషయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో వైఫై సేవలు ట్యాంక్ బండ్ ఏరియాలో విస్తరించిన విషయం తెలిసిందే. తాజాగా యాదగిరిగుట్ట దేవస్థానం సన్నిదిలో 100 మీటర్ల పరిధిలో వైఫై సేవలు త్వరలో అందనున్నాయి.
ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలుః వైఫై కనెక్షన్ కోసం ఇప్పుడు యువత ఆండ్రాయిడ్ పోన్‌లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.అతి తక్కువ ధర 2500 నుంచి ఆండ్రాయిడ్ పోన్‌లు లభిస్తుండడంతో యువత ఎప్పటికప్పుడు పాత ఫోన్‌లకు టాటా చెప్పి ఆండ్రాయిడ్ పోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇంటర్నేట్ సౌకర్యం కోసం వివిధ కంపెనీలు రకరకాల టారీఫ్‌లు ఇస్తున్నాయి,.
వైఫై ఉన్నవారి అవస్థలు: తమ అవసరాల కోసం వైఫై కనెక్షన్ తీసుకున్న వారు ఔత్సాహికులతో అవస్థలు పడుతున్నారు. పదుల సంఖ్యలో తమ పరిధిలో వైఫైవాడుతుండడంతో వారిసేవలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఏరోజు కారోజు తమ వైఫై కోడ్‌ను మార్చుకుంటున్నారు. మరి కొందరికి ఈ విషయం తెలియక ఇబ్బందులు పడుతున్నారు.