
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవవారికి, కంటెంట్ క్రియేటర్స్‌కు, స్మార్ట్ హోమ్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది తప్పనిసరి. ఇందుకోసం వినియోగించే వైఫై కాలం గడిచేకొద్దీ స్పీడ్ తగ్గుతుంటుంది. దీంతో యూజర్స్‌లో అసహనం తలెత్తుతుంది. ఇలా జరగకూడదంటే కొన్ని ట్రిక్కులను, స్టెప్స్‌ను ఫాలో చేయడం ద్వారా Wi-Fiని పరిగెత్తించవచ్చు.
మన ఇంటిలోని కొన్ని ఉపకరణాలను వినియోగించి Wi-Fi సిగ్నల్స్‌ను రిఫ్లక్ట్ లేదా రీడెరెక్ట్ చేయవచ్చు. ఫలితంగా ఇంటర్నెట్ స్పీడందుకుంటుంది. రూటర్ వెనుక భాగాన అల్యూమినియం ఫాయిల్‌ను అమర్చడం ద్వారా దానిని ఒక షిఫ్ట్ రిఫ్లెక్టర్‌గా మార్చవచ్చు. ఫలితంగా దాని సిగ్నల్‌ను ఇంప్రూవ్ చేయవచ్చు. ఇందుకోసం అల్యూమినియం ఫాయిల్‌ను ఒక అట్టకు అతికించాల్సి ఉంటుంది. తరువాత దానిని రూటర్ వెనుక భాగాన ఉంచాలి. అయితే దీనిని అమర్చేటప్పుడు ఫాయిల్ రూటర్‌లోని ఏ భాగానికీ టచ్ కాకుండా చూసుకోవాలి. ఇది Wi-Fi రూటర్‌కు సిగ్నల్ అవాంతరాలను నివారిస్తుంది.
Wi-Fi రూటర్ ఓవర్ హీటింగ్‌కు గురికాకుండా చూసుకోవడం మరొక ముఖ్యమైన పని. ఇందుకోసం Wi-Fi రూటర్‌ను ఎండ తగలని లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం నుంచి వేడి వెలువడని ప్రాంతంలో ఉంచడం తప్పనిసరి. Wi-Fi రూటర్‌ను చల్లని ప్రాంతంలో ఉంచడం ద్వారా అది వేడెక్కకుండా చూడగలుగుతాం. Wi-Fi స్పీడ్ స్లో అయినప్పుడు దానిని రోజుకు ఒక్కసారైనా స్విచ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వలన Wi-Fi కనెక్టివిటీ రిఫ్రెష్ అవుతుంది. ఇంప్రూవ్ కూడా అవుతుంది. ఈ ఉపాయాలను అనుసరించి మీ Wi-Fi సిగ్నల్‌ను మెరుగుపరుచుకోండి.
ఇది కూడా చదవండి: పలు కుంభమేళా రైళ్లు రద్దు.. టిక్కెట్ బుక్ చేసుకుంటే నగదు వాపస్
Comments
Please login to add a commentAdd a comment