improve
-
Wi-Fi.. Slow?.. ఈ ట్రిక్‌తో పరుగు ఖాయం
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవవారికి, కంటెంట్ క్రియేటర్స్‌కు, స్మార్ట్ హోమ్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది తప్పనిసరి. ఇందుకోసం వినియోగించే వైఫై కాలం గడిచేకొద్దీ స్పీడ్ తగ్గుతుంటుంది. దీంతో యూజర్స్‌లో అసహనం తలెత్తుతుంది. ఇలా జరగకూడదంటే కొన్ని ట్రిక్కులను, స్టెప్స్‌ను ఫాలో చేయడం ద్వారా Wi-Fiని పరిగెత్తించవచ్చు.మన ఇంటిలోని కొన్ని ఉపకరణాలను వినియోగించి Wi-Fi సిగ్నల్స్‌ను రిఫ్లక్ట్ లేదా రీడెరెక్ట్ చేయవచ్చు. ఫలితంగా ఇంటర్నెట్ స్పీడందుకుంటుంది. రూటర్ వెనుక భాగాన అల్యూమినియం ఫాయిల్‌ను అమర్చడం ద్వారా దానిని ఒక షిఫ్ట్ రిఫ్లెక్టర్‌గా మార్చవచ్చు. ఫలితంగా దాని సిగ్నల్‌ను ఇంప్రూవ్ చేయవచ్చు. ఇందుకోసం అల్యూమినియం ఫాయిల్‌ను ఒక అట్టకు అతికించాల్సి ఉంటుంది. తరువాత దానిని రూటర్ వెనుక భాగాన ఉంచాలి. అయితే దీనిని అమర్చేటప్పుడు ఫాయిల్ రూటర్‌లోని ఏ భాగానికీ టచ్ కాకుండా చూసుకోవాలి. ఇది Wi-Fi రూటర్‌కు సిగ్నల్ అవాంతరాలను నివారిస్తుంది.Wi-Fi రూటర్ ఓవర్ హీటింగ్‌కు గురికాకుండా చూసుకోవడం మరొక ముఖ్యమైన పని. ఇందుకోసం Wi-Fi రూటర్‌ను ఎండ తగలని లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం నుంచి వేడి వెలువడని ప్రాంతంలో ఉంచడం తప్పనిసరి. Wi-Fi రూటర్‌ను చల్లని ప్రాంతంలో ఉంచడం ద్వారా అది వేడెక్కకుండా చూడగలుగుతాం. Wi-Fi స్పీడ్ స్లో అయినప్పుడు దానిని రోజుకు ఒక్కసారైనా స్విచ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వలన Wi-Fi కనెక్టివిటీ రిఫ్రెష్ అవుతుంది. ఇంప్రూవ్ కూడా అవుతుంది. ఈ ఉపాయాలను అనుసరించి మీ Wi-Fi సిగ్నల్‌ను మెరుగుపరుచుకోండి.ఇది కూడా చదవండి: పలు కుంభమేళా రైళ్లు రద్దు.. టిక్కెట్ బుక్ చేసుకుంటే నగదు వాపస్ -
కుండలినీ యోగాతో అల్జీమర్స్‌కు చెక్: తాజా పరిశోధన
యోగాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఇది కేవలం శారీరకదృఢత్వానికి మాత్రమే కాదు, మేధాశక్తి, ఆత్మశక్తి పెంపులో కూడా సహాయపడుతుంది. యోగా ప్రయోజనాలపై ఒక ఆసక్తికరమైన అధ్యయనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కుండలిని యోగాతో మెదడుకు చాలా మంచిదని ఇది వెల్లడించింది. అల్జీమర్స్‌లాంటి భయంకరమైన వ్యాధికి చెక్ చెప్పవచ్చని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ అధ్యయనం ప్రాథమికంగా కనుగొంది. ఆ వివరాలు.. మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు, దీర్ఘకాలిక ఆయుర్దాయం, జీన్స్ తదితర కారణాలతో పురుషులతో పోలిస్తే మహిళలకు అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువ. అందుకే అల్జీమర్స్ ముప్పున్న 50 అంతకంటే ఎక్కువ వయస్సున్న 79 మహిళలపై కుండలిని యోగా, జ్ఞాపకశక్తికి సంబంధించి అధ్యయనం చేశారు. వీరంతా జ్ఞాపకశక్తి క్షీణత (మునుపటి సంవత్సరం పనితీరుతో పోలిస్తే), గుండెపోటు చరిత్ర, చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటుకు, గుండెలోని రక్తనాళాల సమస్య, అధిక కొలెస్ట్రాల్ కోసం ప్రస్తుత మందులు తీసుకుంటున్నవారే. 12 వారాల పాటు యోగా శిక్షణ, మెమరీ ట్రైనింగ్ రెండు గ్రూపులుగా వీరిపై పరిశోధన సాగింది. వీరిలో 40 మందికి యోగా, 39 మందికి మెమరీ ట్రైనింగ్ ఇచ్చారు. యోగా టీంలో వారానికి 60 నిమిషాలు చొప్పున 12 వారాలు కుండలిని యోగాను నిష్ణాతుడి ద్వారా వ్యక్తిగతంగా శిక్షణ ఇప్పించారు. 39 మందికి మెమరీ శిక్షణ నిచ్చారు. మెమరీ ట్రైనింగ్‌లో కొన్నిపేర్లను, ముఖాలను గుర్తించుకోవడం, తలుపులు తాళం వేయడం లాంటి రోజవారీ కార్యక్రమాలను గుర్తుంచుకొనే పద్దతులపై శిక్షణనిచ్చారు. తరువాత మరో 24 వారాలు వీరి మెమరీ బేస్‌లైన్ కూడా పరీక్షించారు. అలాగే వారి రక్తంలోని సైటోకిన్లనూ విశ్లేషించారు. రోగ నిరోధక వ్యవస్తలోని కీలకమైన, ప్రోటీన్లు , జన్యు వ్యక్తీకరణలో మార్పులను గమనించారు. అయితే కుండలిని యోగా టీంలో మాత్రమే ఆత్మాశ్రయ జ్ఞాపకశక్తిలో మెరుగుదల ఉందని పరిశోధకులు కనుగొన్నారు. జ్ఞాపకశక్తి శిక్షణతో పోలిస్తే, యోగాద్వారా హిప్పోకాంపస్ వాల్యూమ్‌లో పెరుగుదల గమనించామనీ, ఫంక్షనల్ కనెక్టివిటీ, స్వల్పకాలిక జ్ఞాపకాలను గుర్తుపెట్టుకొని వాటిని మెదడులోని దీర్ఘకాలిక నిల్వకు బదిలీ అనేది బాగా మెరుగుపడిందని గుర్తించారు. ఇంకా కుండలిని యోగా ద్వారా మెరుగైన జ్ఞాపకశక్తి, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్‌లతో సహా మెదడుకు సంబంధించి అనేక ప్రయోజనాలను గమనించారు. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుందని తెలిపింది. "ఒత్తిడిని తగ్గించడానికి, మెదడు ఆరోగ్యం, ఆత్మాశ్రయ జ్ఞాపకశక్తి పనితీరును మెరుగు పర్చేందుకు, ఇన్ఫ్లమేషను, న్యూరోప్లాస్టిసిటీని మెరుగుపరచడానికి" యోగా చాలా మంచిదని దీని రచయిత హెలెన్ లావ్రెట్స్కీ చెప్పారు. మెమరీ ట్రైనింగ్‌లో దీర్థకాలిక జ్ఞాపకశక్తిలోనూ మెరుగుదల కనిపించిందట. అయితే కుండలిని యోగాతో అల్జీమర్స్ వ్యాధిని నివారణ, వాయిదా వేయడం లేదా దీర్ఘకాలిక మెరుగుదల కనిపిస్తుందో లేదో నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని వ్యాఖ్యానించారు. కుండలిని యోగ కుండలిని అనేది మానవ శరీరంలో వెన్నుపాములో ఉంటుంది. దీంట్లో దాగివున్న శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ అంటారు. కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడని యోగ నిపుణులు, గురువులు చెబుతారు. ఇతర యోగాలా కాకుండా,ఇదొక శక్తివంతమైన అభ్యాసం. మనలో నిద్రాణమైన శక్తిని మేల్కొల్పడం, దాని పరివర్తన శక్తిని ఉపయోగించడంపై దృష్టి పెడుతుంది. ఇతర రకాల యోగాల మాదిరిగా కాకుండా, కుండలిని యోగా అనేది శరీరంలోని శక్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని, కుండలిని శక్తి ప్రవాహాన్ని ప్రేరేపించే నిర్దిష్ట భంగిమలను కుండలిని యోగా భంగిమలు అని పిలుస్తారు శ్వాసమీద, ఉచ్ఛరణ, గానం, శారీరక భంగిమలపై దృష్టి పెడుతుంది. -
పారిశ్రామిక రంగం పరపతి మెరుగుపడుతుంది
న్యూఢిల్లీ: భారత పరిశ్రమల పరపతి డిసెంబర్ త్రైమాసికంలో మెరుగుపడుతుందని, రుణాలపై వడ్డీ చెల్లింపుల కవరేజీ 4.5–5 రెట్లు పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. కార్పొరేట్ ఇండియా ఆదాయాలు మెరుగుపడడాన్ని ఇందుకు అనుకూలించే అంశంగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంత్సరం ద్వితీయ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) 601 లిస్టెడ్ కంపెనీల (ఫైనాన్షియల్ సరీ్వసులు మినహా) బ్యాలన్స్ షీట్లను విశ్లేíÙంచిన అనంతరం ఇక్రా ఈ వివరాలు వెల్లడించింది. కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 3.98 శాతం, అంతకుముందు త్రైమాసికంతో పోల్చిచూస్తే 0.64 శాతం మెరుగుపడినట్టు తెలిపింది. కమోడిటీల ధరలు శాంతించడాన్ని సానుకూలంగా పేర్కొంది. ముడి పదార్థాల ధరలు ఇటీవలి కాలంలో తగ్గడాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ ఇవి చారిత్రకంగా చూస్తే, ఇంకా ఎగువ స్థాయిల్లోనే ఉన్నట్టు పేర్కొంది. భారత కంపెనీల నిర్వహణ మార్జిన్లు ఇంకా చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకోవాల్సి ఉందని వివరించింది. -
వ్యాపార విధానాలను స్టార్టప్స్ మెరుగుపర్చుకోవాలి
న్యూఢిల్లీ: నిధుల లభ్యత తగ్గిపోయిన నేపథ్యంలో అంకుర సంస్థలు ఆర్థికంగా మరింత మెరుగైన వ్యాపార విధానాలను పాటించాల్సిన అవసరం నెలకొందని, ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంటుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆర్థిక పరిస్థితులు, వేల్యుయేషన్ల ప్రభావంతో పెట్టుబడుల ప్రవాహం మందగించడంతో స్టార్టప్‌లు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని బిజ్2క్రెడిట్ వ్యవస్థాపకుడు రోహిత్ ఆరోరా తెలిపారు. 2023లో దేశీ స్టార్టప్‌లలోకి విదేశీ పెట్టుబడులు 72 శాతం పడిపోయాయని ఆయన వివరించారు. అయితే, ఆర్థికంగా నిలదొక్కుకుని, ఈ పరిస్థితి నుంచి బైటపడటంపై అంకుర సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉందని ఆరోరా తెలిపారు. అంతర్జాతీయంగా గత కొంతకాలంగా ఎదురైన చేదు అనుభవాల కారణంగా వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు నమ్మకం కాస్త దెబ్బతిందని ప్రాప్‌టెక్ సంస్థ రెలాయ్ వ్యవస్థాపకుడు అఖిల్ సరాఫ్ అభిప్రాయపడ్డారు. దీంతో డీల్స్ విషయంలో వారు ఆచి తూచి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా ఇటీవలి నివేదిక ప్రకారం భారతీయ స్టార్టప్ వ్యవస్థలోకి ఈ ఏడాది పెట్టుబడులు 36 శాతం క్షీణించాయి. గతేడాది ప్రథమార్ధంలో 5.9 బిలియన్ డాలర్లు రాగా ఈసారి 298 డీల్స్ ద్వారా రూ. 3.8 బిలియన్ డాలర్లు వచ్చాయి. -
సిబిల్ స్కోర్ పెంచుకోవాలా? ఈ తప్పులు అస్సలు చేయవద్దు..
ఆధునిక కాలంలో CIBIL స్కోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సిబిల్ స్కోర్ అనేది లోన్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ స్కోర్ మీద ఆధారపడే మనకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి. అలాంటి సిబిల్ స్కోర్ ఏవిధంగా పెంచుకోవాలి? పెంచుకోవడానికి ఏవైనా మార్గాలున్నాయా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సిబిల్ స్కోర్ సాధారణంగా 300 నుంచి 900 వరకు ఉంటుంది. అయితే 300 వద్ద ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని, 900 వరకు ఉంటే మంచి స్కోర్ అని పరిగణిస్తారు. తక్కువ వడ్డీతో లోన్ కావాలనుకునేవారికి సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండాలి. లేదంటే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో లావాదేవీలు సరిగ్గా నిర్వహించే వ్యక్తి సిబిల్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా వున్న వ్యక్తులకు బ్యాంకులు లోన్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ స్కోర్ ఎక్కువగా ఉండే వ్యక్తుల డాక్యుమెంట్స్ కూడా పరిశీలించకుండా బ్యాంకు లోన్ వెంటనే అందిస్తుంది. ఒక వేళా సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు వడ్డీ రేటు ఎక్కువతో లోన్ అందించే అవకాశం ఉంటుంది. సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి? నిర్దిష్ట సమయంలో బకాయిలు చెల్లించడం మీరు బకాయిలను తప్పకుండా సకాలంలో క్లియర్ చేసుకోవాలి. ఒక వేళా గడువు తేదీలను మర్చిపోయినప్పుడు, రిమైండర్ వంటివి సెట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడు మీరు ఆలస్యంగా బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది మీ సిబిల్ స్కోర్ పెంచడంలో సహాయపడుతుంది. క్రెడిట్ కార్డు రిజెక్ట్ అయితే మళ్ళీ మళ్ళీ అప్లై చేయకూడదు మీకు లోన్ లేదా క్రెడిట్ కార్డు కావాలనుకున్నప్పుడు అప్లై చేసుకోవచ్చు. అయితే అది రిజెక్ట్ అయితే దాని కోసం పదే పదే అప్లై చేసుకోకూడదు. ఒక బ్యాంకు రిజెక్ట్ చేసిన తరువాత వేరే బ్యాంకులో అప్లై చేసుకుంటే అక్కడ మీ స్కోర్ తగ్గుతుంది, కావున ఒకసారి రిజెక్ట్ అయిన తరువాత స్కోర్ మళ్ళీ పెరిగే వరకు వేచి చూడాలి. (ఇదీ చదవండి: మారుతి కారు కొనాలా? ఇంతకంటే మంచి సమయం రాదు!) క్రెడిట్ కార్డు రేషియో గమనించండి మీ క్రెడిట్ కార్డుని అన్ని లావాదేవీలకు ఉపయోగించకుండా చూసుకోవాలి. అంతే కాకుండా క్రెడిట్ కార్డు రేషియో 30 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇలా చేసినప్పుడు సిబిల్ స్కోర్ పెరుగుతుంది. ఒకే సమయంలో రకరకాల లోన్స్ తీసుకోవడం మానుకోండి మీరు ఒక లోన్ తీసుకున్నప్పుడు అది పూర్తయిన తరువాత తీసుకోవడం మంచిది. అలా కాకుండా లోన్ పూర్తికాకముందే మరో లోన్ తీసుకుంటే సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. దీనిని తప్పకుండా గమనించాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
అస్సలు శారీరక శ్రమ చేయడం లేదా? అయితే లాన్సెట్ స్టడీ తెలుసుకోండి!
ప్రతిఒక్కరూ రోజులో కనీస శారీరక శ్రమ ఎంతసేపు చేయాలో తెలుసా.. అసలు శారీరక శ్రమ చేయకపోతే ఏమవుతుందో తెలుసా.. ఈ విషయాల గురించి పరిశోధన చేసిన అంతర్జాతీయ హెల్త్ జర్నల్ లాన్సెట్ ఏం చెబుతుందో ఓసారి చూద్దాం. మారుతున్న జీవన విధానంలో ప్రతి నలుగురిలో ఒకరు కనీస శారీరక శ్రమ చేయడంలేదని లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాక్షి, హైదరాబాద్: ప్రధానంగా యువత రోజూ కనీసంగా రెండు గంటలపాటు ఆన్‌స్క్రీన్‌పై ఉంటుండగా, అందులో పావువంతు సమయాన్ని కూడా వ్యాయామానికి కేటాయించడం లేదు. దీని వల్ల తలెత్తే దుష్ప్రభావం వారి తదుపరి జీవనంతోపాటు రాబోయే తరంపైనా పడనుందని పేర్కొంది. ఆరోగ్యంపై శారీరక శ్రమ, క్రీడల ప్రభావం అనే అంశంపై ప్రతి నాలుగేళ్లకోసారి లాన్సెట్ పరిశోధన చేస్తోంది. 2012 నుంచి ప్రతిసారి ఒలింపిక్స్ సమయంలో చేసే ఈ పరిశోధన తాలూకూ నివేదికను జర్నల్‌లో ప్రచురిస్తోంది. తాజాగా మూడో పరిశోధన సిరీస్‌ను విడుదల చేసింది. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి. శారీరక శ్రమకు పావువంతు మంది దూరం ప్రస్తుత జనాభాలో పావువంతు (25 శాతం) మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. వ్యాయామంపై అవగాహన పెరుగుతున్న క్రమంలోనే కోవిడ్ అడ్డంకిగా మారింది. శారీరక శ్రమ చేయనివ్యక్తి త్వరగా జీవనశైలి వ్యాధులకు గురయ్యే అవకాశాలెక్కువ. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాయామాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయిస్తూ ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉన్న 25 శాతాన్ని 15 శాతానికి కుదించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒకదానికొకటి అనుసంధానం నడక, సైక్లింగ్ లాంటి వాటితో వాహనాల వినియోగం తగ్గిస్తే వాతావరణ కాలుష్య మూ తగ్గుతుంది. గాడ్జెట్లు, ఇతర సాంకేతిక పరికరాల వినియోగాన్ని కాస్త తగ్గించడంతో గ్లోబల్ వార్మింగ్‌పై ప్రభావం చూపుతుంది. ఇలాంటి అంశాలన్నీ వాతావరణ పరిస్థితులను మారుస్తాయని డబ్ల్యూహెచ్‌వో చెప్పుకొచి్చంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ విస్తృతం చేయాలి. ప్రతి బడి, కళాశాలలో వ్యాయా మం ఒక సబ్జెక్టుగా నిర్దేశించి క్లాస్‌వర్క్, హోమ్‌వర్క్ ఇవ్వాలి. యాక్టివ్ ట్రావెల్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించింది. పరిశోధనలో వెలుగు చూసిన మరికొన్ని అంశాలు ♦ శారీరక శ్రమకు దూరంగా ఉన్న 25 శాతంలో 80 శాతం మంది మధ్య ఆదాయ, దిగువ ఆదాయాలున్న దేశాలకు చెందినవాళ్లే. ♦ ప్రపంచ జనాభాలో 20 శాతం మంది వ్యాయామం సరిగ్గా చేయకపోవడంతో జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారు. ♦ రోజుకు సగటున 20-30 నిమిషాలు, వారానికి కనీసం 150 నిమిషాలపాటు వ్యాయామం చేస్తే బీపీ, మధుమేహం, గుండె, కండరాల సంబంధిత వ్యాధుల నుంచి బయటపడొచ్చు. ♦ దివ్యాంగుల్లో 62 శాతం మంది అవసరమైన దానికన్నా తక్కువగా శారీరక శ్రమ ఉన్నట్లు పరిశోధన చెబుతోంది. ♦ ప్రపంచవ్యాప్తంగా 10-24 సంవత్సరాల మధ్య వయసువాళ్లు 24 శాతం ఉన్నారు. వీరిలో 80 శాతం ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉన్నారు. ♦ 2008 నుంచి గూగుల్‌లో క్రీడలు, వ్యాయామం పదాల సెర్చింగ్ పెరుగుతూ వస్తోంది. చిన్నప్పటి నుంచే అవగాహన పెంచాలి 2020 ప్రొజెక్టెడ్ సెన్సెస్ ప్రకారం చైల్డ్‌హుడ్ ఒబిసిటీ 19.3 శాతంగా ఉంది. దీంతో పిల్లల్లో బీపీ, కొలెస్ట్రాల్, గ్రోత్, ప్రీ డయాబెటిక్ సమస్యలు అత్యధికంగా వస్తాయి. వీటి నుంచి బయటపడాలంటే చిన్నప్పటి నుంచే శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. -డాక్టర్ కిషోర్ ఈగ, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ కోవిడ్‌తో మారిన జీవనశైలి ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చే వాళ్లలో సగం మందికి ఆర్థో సమస్యలుంటున్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో జీవనశైలిలో చాలా మార్పు వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ తరగతులు తదితరాలతో ఎక్కువ సమయం ఒకే చోట, ఒకే విధంగా గడుపుతున్నారు. ఎక్కువ సమయం ఒకేవిధంగా కూర్చోకుండా అటుఇటు తిరగడం లాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ సురేశ్ చీకట్ల, స్పైన్ సర్జన్, కిమ్స్ ముందస్తు వ్యూహం అవసరం వ్యాయామం చేయకుంటే తలెత్తే అనర్థాలను ముందస్తు వ్యూహాలతో అరికట్టాలి. వైద్య చికిత్సలపై ప్రభుత్వాలు భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నాయి. అనారోగ్యం బారిన పడకుండా సరైన అవగాహన కల్పించడం, తప్పనిసరి చర్యల కింద వ్యాయామాన్ని ఎంపిక చేయడం వంటివాటిపై కార్యాచరణ రూపొందించి పక్కాగా అమలు చేయాలి. – డాక్టర్ కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, నిజామాబాద్ వైద్య కళాశాల -
విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ‘గెట్ సెట్ గో’
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉద్యోగార్హత సాధించేలా నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు నేషనల్ హెచ్ఆర్డీ నెట్వర్క్ (ఎన్హెచ్ఆర్డీ) హైదరాబాద్ ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. శ్రీని ఉడుముల నాయకత్వంలో చాప్టర్ మేనేజ్మెంట్లో తాజా ధోరణులపై ఫ్యాకల్టీకి అవగాహన కల్పించడం, పరిశ్రమలతో సమన్వయం కలిగించడం ద్వారా విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. రెజ్యూమ్ తీర్చిదిద్దడం, ఇంటర్న్‌షిప్‌కు అందుబాటులో ఉండటం, ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యే విద్యార్థులకు తగిన సహాయం అవసరమయ్యే నేపథ్యంలో ‘గెట్ సెట్‌గో-మెంటార్@క్యాంపస్’ ద్వారా పరిష్కరించే ప్రయత్నాన్ని ఎన్హెచ్ఆర్డీ చేస్తోంది. సుప్రసిద్ధ సంస్థలలో నాయకత్వ బాధ్యతలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దాదాపు 100 ప్రాక్టీసింగ్ నిపుణులు.. ఎంపిక చేసిన ప్రీమియర్ బీ– స్కూల్ విద్యార్థులతో నేరుగా గానీ, వర్చువల్గానీ సంభాషిస్తూ మార్గనిర్దేశనం చేయనున్నారు. బీ–స్కూల్స్‌లో లెర్నింగ్ సర్కిల్స్ లేదా క్లబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు.. ఈ క్లబ్స్‌ను విద్యార్థులే నిర్వహించేలా తీర్చిదిద్దాలని ఎన్హెచ్ఆర్డీ భావిస్తోంది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్డీ హైదరాబాద్ క్యాంపస్ కనెక్ట్ అండ్ అకడమిక్ బోర్డు ఛైర్ సూరంపూడి శ్రీకాంత్ మాట్లాడుతూ పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య బలమైన బంధాన్ని ‘‘గెట్-సెట్-గో’ ఏర్పరచగలదని నమ్ముతున్నామని తెలిపారు. అత్యంత క్లిష్టమైన, జీవితాన్ని మార్చే నైపుణ్యాలను విద్యార్థులు సాధించేందుకు , సమకాలీన అంశాలపై పరిశోధనలను చేసేలా ఫ్యాకల్టీని ఉత్సాహపర్చడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడే వారిని ఒడిసిపట్టుకోవాలనేది తమ విధానం అని, రేపటి పరిశ్రమ నిపుణులుగా నిలిచే విద్యార్థులను తీర్చిదిద్దడం కర్తవ్యంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. -
కుదుటపడిన అమ్మ ఆరోగ్యం
-
కోలుకుంటున్న అమ్మ!
-
కోలుకుంటున్న అమ్మ!
► స్వదేశానికి తిరిగివెళ్లిన లండన్ వైద్యుడు రిచర్డ్ ► ఇక సింగపూర్ నిపుణుల ఆధ్వర్యంలో జయకు కొనసాగనున్న చికిత్స ► పన్నీరు నేతృత్వంలో తొలిసారి కేబినెట్ భేటీ ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే సాక్షి, చెన్నై: లండన్ నుంచి వచ్చిన ప్రముఖ వైద్య నిపు ణుడు డాక్టర్ రిచర్డ్, అపోలో, ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో వారానికి పైగా జరిగిన చికిత్సకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కొంత మేర మెరుగుపడినట్లు సమాచారం. వీరికితోడు సింగపూర్ నుంచి వచ్చిన ఫిజియోథెరపీ నిపుణులు అందిస్తున్న చికిత్సకు జయలలిత స్పందిస్తున్నట్లు అన్నాడీఎంకే వర్గాలు ప్రకటించాయి. రోజురోజుకు అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతుండడంతో ఎయిమ్స్ వైద్యులు ఢిల్లీకి తిరిగివెళ్లారు. అలాగే లండన్ వైద్యుడు రిచర్డ్ కూడా బుధవారం ఇక్కడి నుంచి స్వదేశానికి బయల్దేరారు. ఈ నేపథ్యంలో రిచర్డ్ సూచనల మేరకు సింగపూర్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఏపీ మంత్రి శిద్ధా రాఘవరావు బుధవారం అపోలోకు వచ్చినా, ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చినట్టు సమాచారం. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తున్నాడనే ఆరోపణపై తమిళనాడు పోలీసులు బుధవారం సహాయం(తంజావూరు) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పన్నీర్‌సెల్వం అధ్యక్షతన కేబినెట్ భేటీ రాష్ట్రంలో ఒకవైపు స్థానిక ఎన్నికల రద్దు, మరోవైపు కావేరి బోర్డు కోసం పట్టుబడుతూ తమిళనాడులో నిరసనలు హోరెత్తుతుండడంతో బుధవారం మంత్రి పన్నీర్‌సెల్వం అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. కావేరి బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికల రద్దు కారణంగా ఆయా సంస్థల్లో ప్రత్యేక అధికారులకు విధుల్ని అప్పగించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయా స్థానాలకు అన్నాడీఎంకే అభ్యర్థులను ప్రకటించింది. అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాలకు సెంథిల్ బాలాజీ, రంగస్వామికి మళ్లీ అవకాశం కల్పించారు. తిరుప్పర గుండ్రం సీటును మాజీ ఎమ్మెల్యే ఏకే బోసుకు, పుదుచ్చేరి నెల్లితోప్పు స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే ఓం శక్తి శేఖర్‌కు అప్పగించారు. -
పొదుపు సంఘాలను బలోపేతం చేయాలి
మోతె: మండల మహిళా పొదుపు సంఘాలను బలోపేతం చేయాలని క్లస్టర్ ఏపీఎం మైసయ్య అన్నారు. గురువారం మండల సమాఖ్య కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు నెల సరి సంపాదించే డబ్బును పొదుపు చేసుకోవాలన్నారు. నెల నెల సంఘాలతో జరిగే సమావేశాలల్లో ఆర్థిక లావాదేవీలు బైలా ఆమోదం పొందాలన్నారు. అనంతరం మండల ఏపీఎం వెంకయ్య మాట్లాడుతూ ప్రతి మహిళా సంఘం నుంచి నిల్వ చే సిన డబ్బుతో మహిళలు స్వయం ఉపాధికి ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. సీసీలు ప్రతి గ్రామంలో నెలవారి మీటింగ్‌లు నిర్వహించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి లోన్లు అధికంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు కాంపాటి రాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీజీఎం మల్లేష్, సీసీలు నందు, సత్యం, శ్రీనివాస్, అకౌంటెంట్ వెంకటలక్ష్మి, కంప్యూటర్ ఆపరేటర్ శేఖర్, ఆయా గ్రామాల మహిళా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
విద్యార్థుల వికాసానికి ‘ఎర్త్’
విద్యా, కళలు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ మారుమూల గ్రామాలే దత్తత నిరాక్షరాస్యత, డ్రాప్ అవుట్స్ వద్దు సుల్తానాబాద్ : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఎర్త్ ఫౌండేషన్ ముందుకు సాగుతోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుతున్న విద్యలో సమూలమైన మార్పులు తేవడానికి తమవంతు ప్రయత్నం చేస్తోంది. కరీంనగర్, నల్గొండ జిల్లాలోని పాఠశాలలను దత్తత తీసుకుని విద్యార్థులకు చేయూతనందిస్తోంది. డ్రాప్ అవుట్స్, నిరాక్షరాస్యత, పేదరికంతో బడులకు వెళ్లకుండా ఉన్నవారిని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించే బాధ్యత తీసుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. 2012 ఏప్రిల్ 18న అమెరికాలో స్థిరపడ్డ కరీంనగర్‌కు చెందిన ప్రమోద్‌కుమార్‌రెడ్డి ఎర్త్ ఫౌండేషన్‌ను స్థాపించారు. తానుచేసిన సహాయం స్వచ్ఛంద సంస్థల ద్వారా విద్యార్థులకు అందడంలేదని భావించి ఆయన ఈ ఫౌండేషన్ ఏర్పాటుకు శ్రీకారంచుట్టారు. పేదరికంలో ఉండి చదువుకోలేని పిల్లలకు సాయమందించడమే ప్రధాన ఉద్దేశం. పిల్లలకు జిల్లాలో సుల్తానాబాద్ మండలం భూపతిపూర్, గర్రెపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీకాలనీ, పెద్దరాతుపల్లి, ముత్తారం మండలకేంద్రం, మల్యాల మండలం లంబాడిపల్లెలోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు నల్గొండ జిల్లా భీమ్‌నగర్ మండలం రాఘవపూర్, చౌట్పల్లి మండలం మల్కాపూర్ గ్రామాల్లో పాఠశాలలను ఫౌండేషన్ దత్తత తీసుకుంది. విద్యావలంటీర్లతో బోధన చేయిస్తున్నారు. 70 మంది స్వచ్ఛందంగా సేవ చేస్తుండగా.. 38 మంది వలంటీర్లకు గౌరవవేతనం సంస్థ ఇస్తోంది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, టైలు, బెల్టులు, బ్యాడ్జీలు అందిస్తోంది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. పాఠశాలల్లో నెలకోసారి వైద్యశిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తున్నారు. తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వీరిసేవల ద్వారా 570 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అమెరికాలో ఉంటున్నఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రమోద్‌కుమార్‌రెడ్డి అందిస్తున్నారు. నైపుణ్యాన్ని వెలికితీసేందుకే... విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యత వెలికితీసి విద్యావంతులను చేయడమే ఎర్త్ ఫౌండేషన్ ఉద్దేశం. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు మావంతు ప్రయత్నం చేస్తున్నాం. దత్తత తీసుకున్న పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన దుస్తులు, పాఠ్యపుస్తకాలు, బెల్టులు అందిస్తున్నాం. –కలవేని శ్రీనివాస్, రాష్ట్ర కోఫౌండర్, కరీంనగర్ తల్లిదండ్రులతో సమావేశాలు పాఠశాలల అభివృద్ధికి చేయూతనిస్తున్నాం. తల్లిదండ్రులను చైతన్యవంతం చేసేందుకు ఎస్ఎంసీ సమావేశాలు నెలవారీగా నిర్వహిస్తున్నాం. పిల్లలకు వైద్యపరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్, మొక్కలపెంపకం వంటి కార్యక్రమాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వెన్నెల, కోఆర్డినేటర్, భూపతిపూర్ గోడలపై పెయింటింగ్.. ఎర్త్ ఫౌండేషన్ దత్తత తీసుకున్న పాఠశాలలో గోడలపై విద్యార్థులకు అర్థమయ్యేలా ఆకర్షణీయమైన రంగులతో పలు బొమ్మలు వేస్తున్నాం. జాతీయ చిహ్నాలు, మానవ ఆకృతులు, అక్షరమాలలు, శరీరంలోని విడివిభాగాలను వేసి అవగాహన కల్పిస్తున్నాం. –హేమవతి, వాలంటీర్, భూపతిపూర్ ప్రైవేటుకు దీటుగా బోధన ప్రైవేటు పాఠశాలల మాదిరిగా మాకు దుస్తులు ఇచ్చారు. ఆంగ్లంలో విద్యా బోధన చేస్తున్నారు. నెలకు ఒకసారి పేయింటింగ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ప్రభుత్వ పాఠశాలలో చెబుతున్నారు. –చిట్టి, అయిదో తరగతి విద్యార్థిని, భూపతిపూర్ -
చైనాలో కనిపిస్తున్న వెరైటీ వైద్యం!
గ్జియాన్ః ఆరోగ్యంకోసం ప్రకృతి వైద్యాన్ని ఆశ్రయించడం ఆధునిక కాలంలోనూ చూస్తూనే ఉన్నాం. చెట్ల బెరళ్ళు, మూలికలు, కషాయాలను వాడి వ్యాధులు తగ్గించుకునే పాత పద్ధతులు పెద్దగా కనిపించకపోయినా... ఆయుర్వేదం, హోమియో, అలోపతితోపాటు.. అనేక ప్రకృతి వైద్యాలను ఆశ్రయిస్తున్నవారు లేకపోలేదు. సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందిన చైనా దేశం కూడా అటువంటి వైద్యాలను ఆశ్రయించడంలో ముందే ఉంది. ఇప్పుడక్కడ కనిపిస్తున్న దృశ్యాలే అందుకు పెద్ద నిదర్శనం. ఎండలో కాలే కాలే రాళ్ళపై పడుకుంటే ఎన్నో రకాల రోగాలు నయమౌతాయంటున్నారు అక్కడి మహిళలు. చైనా నగరం గ్జియాన్ కు చెందిన మహిళలు ఇప్పుడు ప్రకృతి వైద్యం బాట పట్టారు. తీక్షణమైన ఎండలో.. కాలే కాలే రాళ్ళపై పడుకొనే వెరైటీ వైద్యం చేసుకుంటున్నారు. అంతేకాదు అదో కొత్త హెల్గ్ ట్రెండ్ గా చెప్తున్నారు. ముఖాలపై చిన్నపాటి టవల్ నో, గుడ్డనో కప్పుకొని, ఎండలో ఉన్న అతిపెద్ద రాళ్ళను కౌగలించుకునో, వెల్లకిలానో పడుకొన్న మహిళలు కనిపించడం గ్జియాన్ ప్రాంతంలో ఇప్పుడు మామూలైపోయింది. వారికోసం పార్కుల్లోనూ, ఎండ తగిలే ఖాళీ ప్రదేశాల్లోనూ ప్రత్యేకంగా పెద్ద పెద్ద రాళ్ళను ఏర్పాటు చేస్తున్నారు. మొదట్లో అలా రాళ్ళపై పడుకున్న మహిళలను చూసి, అంతా అదో వ్యాయామం అనుకున్నారు. కానీ స్థానిక రిపోర్టర్లు వారిని కలిసిన తర్వాతే అసలు విషయం తెలిసింది. అదో ప్రాచీన వైద్య పద్ధతి అని, ముఖ్యంగా మహిళల్లో అనేక రోగాలను నయం చేస్తుందని చెప్పారు. సైనోవిటిస్, కండరాలు గట్టిపడటం వంటి వ్యాధులు వచ్చిన తన బంధువు ఒకరు ఇలా రాళ్ళ వైద్యాన్ని పాటించారని, కొన్నాళ్ళకు ఆమెకు పూర్తిగా నయం అయిపోవడంతో తాను కూడ ఈ వైద్యాన్ని అనుసరిస్తున్నట్లు 'లో' అనే మహిళ చెప్పింది. సుమారు సాయంత్రం 3, 4 గంటల మధ్య ప్రాంతంలో ఇలా రాళ్ళపై పడుకుంటే ఎంతో ఉపయోగం అని తెలిపింది. అలాగే లైంగిక శక్తి లోపించినవారికి సైతం ఈ వైద్యం అత్యంత ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే గ్జియాన్ లో కనిపిస్తున్న వేడి రాళ్ళ వైద్యాన్ని డాక్టర్లు ఎంతమాత్రం సమర్థించడం లేదు. పైగా ఈ ప్రయత్నం అనేక ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంటుందంటున్నారు. అధిక ఉష్ణోగ్రత శరీరానికి తగలడంవల్ల ప్రమాదాలు తలెత్తుతాయంటున్నారు. చర్మం బొబ్బలెక్కడం నుంచీ వడదెబ్బ తగలడం వరకూ ఏదైనా ప్రమాదమేనంటున్నారు. వైద్యులు వారించిన అనంతరం ఓ 70 ఏళ్ళ మహిళ తనకు అటువంటి అనుభవమే అయినట్టు స్థానిక మీడియాకు తెలిపింది. అలా రాళ్ళపై పడుకున్న తర్వాత, కాలిన వేడికి కడుపులో తీవ్రమైన నొప్పి ప్రారంభమైనట్లు చెప్పింది. అయితే చాలాశాతం మంది మీడియా చెప్పిన మాటలనూ వినడం లేదు. ఇప్పటికీ గ్జియాన్ నగరంలో రాళ్ళపై మహిళలు కనిపిస్తూనే ఉన్నారు. రాళ్ళపై పడుకోవడం ఒక్కటే కాదు.. అనేక వైద్యాలకు రాళ్ళను వినియోగించడం ఇటీవలి కాలంలో తరచుగా చూస్తున్నాం. ఓ వ్యక్తి తన ఒంట్లో అధికంగా ఉన్న 30 కేజీల బరువును తగ్గించుకునేందుకు తలపై 40 కేజీల బరువు రాయిని పెట్టుకొని వాకింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అనుకొని ఊరుకోవడం తప్పించి వినని మనుషులకు ఎవరు మాత్రం ఏం చెప్తారు? -
వ్యక్తిగత ప్రశంసలతో టీం వర్క్ కు ప్రోత్సాహం
మనిషికి ఇచ్చే వ్యక్తిగత గుర్తింపు.. ప్రశంసలు... వారిని టీం వర్క్ చేయడానికి ప్రోత్సహిస్తుందని, వారిలో మంచి శక్తినిస్తుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. చైనాలోని ఓ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లో పనిచేసేవారిపైనా, కొందరు విద్యార్థులపైనా జరిపిన అధ్యయనాల్లో ఈ కొత్త వివరాలు వెల్లడయ్యాయి. ప్రయోగశాలలు, ఫీల్డ్ ప్రయోగాల ద్వారా అధ్యయనాల్లో... వ్యక్తిగత గుర్తింపు.. టీమ్ వర్క్ కు ఎంతగానో సహకరిస్తుందని కనుగొన్నారు. వ్యక్తి పని తీరుపై అతడికి ఇచ్చే ప్రశంసల ప్రభావం ఉంటుందని చైనాలో జరిపిన కొత్త పరిశోధనల్లో తెలుసుకున్నారు. ఒక్కొక్కరి పనిని వ్యక్తిగతంగా గుర్తించడం, ప్రశంసలు తెలియజేయడం టీం వర్క్ ను ప్రోత్సహిస్తుందని అమెరికా నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పూలే కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ సహ అధ్యయనకారుడు ప్రొఫెసర్ బ్రాడ్లీ కిర్క్ మాన్ తెలిపారు. అధ్యయనకారులు చైనా విశ్వవిద్యాలయానికి చెందిన 256 మంది విద్యార్థులపై జరిపిన అధ్యయనాల్లో ఒక్కొక్కరి పనులను విడివిడిగా గుర్తించడంతోపాటు, సమూహాలతో కలసికూడ గుర్తించారు. వ్యక్తిగత పనుల్లో ప్రశంసలు పొందిన వారే సమూహాల్లో శక్తివంతంగా పనిచేసినట్లు గుర్తించామని తమ అధ్యయనాల వివరాలను అప్లైడ్ సైకాలజీ జర్నల్ లో ప్రచురించారు. రెండవ రౌండ్ లోనూ వ్యక్తిగత ప్రశంసలు పొందిన వ్యక్తి... ఇటు వ్యక్తిగతంగానూ, సమూహాలతో కలసి కూడా పనిలో గణనీయమైన మెరుగును కనబరచినట్లు అధ్యయనకారులు గుర్తించారు. అంతేకాక వ్యక్తిగత గుర్తింపులేని వ్యక్తి టీమ్ మెంబర్ గా కూడ ఎటువంటి మెరుగుదలను చూపించలేకపోయినట్లు తెలుసుకున్నారు. ఉత్తర చైనాలోని ఓ ఉత్సత్తి సంస్థ కూలీలపై కూడ పరిశోధకులు ఈ కొత్త ప్రయోగాలను నిర్వహించారు. కంపెనీలోని కొన్ని విభాగాల్లో 'ఎంప్లాయీ ఆఫ్ ద మంత్' పేరుతో టీమ్ లోని అత్యధిక పనిమంతులను గుర్తించి మిగిలిన విభాగాల్లో గుర్తించకుండా వదిలేశారు. అయితే ఇక్కడకూడా ప్రత్యేక గుర్తింపునివ్వకుండా వదిలేసిన టీమ్ లలో అటు వ్యక్తిగతంగా గాని, టీమ్ వర్క్ లో గాని పనిలో ఎటువంటి ప్రత్యేక ఫలితాలూ కనిపించకపోవడాన్ని తెలుసుకున్నారు. -
హైదరాబాద్‌కు మరిన్ని హంగులు
ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు పెట్టుబడులకు ఆకర్షణీయమైన రాబడిపై హామీ ప్రవాసి భారతీయ దివస్‌లో మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నగరానికి మరిన్ని హంగులు, అదనపు మౌలిక సౌకర్యాలను కల్పిస్తామని పేర్కొన్నారు. అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో రెండోరోజు ఆదివారం జరిగిన తొమ్మిదో ప్రాంతీయ ప్రవాసి భారతీయ దివస్‌లో మంత్రి జూపల్లి మాట్లాడారు. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు, మెట్రో రైలు తదితర ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలున్నాయన్నారు. ఫార్మా, ఫిల్మ్ సిటీ, మెడికల్ డివెజైస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలంటూ ప్రవాస భారతీయులను మంత్రి ఆహ్వానించారు. ‘మీరు పెట్టే పెట్టుబడులకు ఆకర్షణీయమైన రాబడి ఉండేలా ప్రభుత్వ విధానాలు ఉంటాయి.’ అని హామీ ఇచ్చారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులతోపాటు తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, మౌలిక సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. మాతృభూమి రుణం తీర్చుకునేందుకు ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో అత్యంత అనువైన పరిస్థితులున్నాయని మంత్రి జూపల్లి అన్నారు. వేయి మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్, శాన్ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ వెంకటేశన్ అశోక్, అమెరికాలో భారత రాయబారి అరుణ్.కె.సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీని తాకనున్న పవర్ పాలిటిక్స్
-
గురువులకు దిశానిర్దేశం
సమాజానికి దిశానిర్దేశం చేసే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు ఎప్పటికప్పుడు మరింతగా నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉందంటోంది హైదరాబాద్ సహోదయ స్కూళ్ల బృందం. మారుతున్న ప్రపంచానికి తగినట్లుగా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకతను పెంపొందించాల్సిన బాధ్యత గురువులపై ఉందని స్పష్టం చేసింది. శనివారం నగరంలోని పర్యాటకభవన్‌లో సీబీఎస్ఈ పాఠశాలల సంఘం.. హైదరాబాద్ సహోదయ స్కూల్స్ కాంప్లెక్స్ (హెచ్.ఎస్.ఎస్.సి) పాఠశాలలను నడిపించే ప్రిన్సిపాళ్లకు ప్రత్యేకంగా సదస్సు జరిపింది. మీట్, టాక్, స్పీక్, లిజన్, షేర్, డిస్కస్ అంశాలతో మూడు విభాగాలుగా కార్యక్రమాలు నిర్వహించారు. సదస్సులో హెచ్ఎస్ఎస్సీ అధ్యక్షుడు, తక్షశిల పబ్లిక్‌స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్.నవీన్‌రెడ్డి; కార్యదర్శి, సిల్వర్‌ఓక్స్ స్కూల్ ప్రిన్సిపాల్ సీతామూర్తి; ట్రెజరర్, మెరిడియన్ స్కూల్ (బంజారాహిల్స్) ప్రిన్సిపాల్ ప్రతిమాసిన్హా తదితరులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ప్రిన్సిపాళ్లు జ్ఞానాన్ని సముపార్జించినప్పుడే వారు ఉపాధ్యాయులకు మార్గనిర్దేశనం చేయగలరని సీతామూర్తి పేర్కొన్నారు. -
నా ఆరోగ్యం మెరుగుపడుతోంది: అమితాబ్
ముంబై: ఇటీవల అస్వస్థతకు గురైన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. 71 ఏళ్ల అమితాబ్ ఈ విషయాన్ని తన బ్లాగ్‌లో వెల్లడించారు. తన శ్రేయస్సు కోరిన అభిమానులకు ధన్యవాదాలు తెలియాజేశారు. 'నా ఆరోగ్యం గురించి వాకబు చేసి, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ ధన్యవాదాలు. నా ఆరోగ్యం మెరుగవుతోంది' అని అమితాబ్ పోస్ట్ చేశారు. రికార్డింగ్ సెషన్ సందర్భంగా దగ్గు సమస్యతో అమితాబ్ బాధపడ్డారు.