ఆధునిక కాలంలో CIBIL స్కోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సిబిల్ స్కోర్ అనేది లోన్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ స్కోర్ మీద ఆధారపడే మనకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి. అలాంటి సిబిల్ స్కోర్ ఏవిధంగా పెంచుకోవాలి? పెంచుకోవడానికి ఏవైనా మార్గాలున్నాయా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సిబిల్ స్కోర్ సాధారణంగా 300 నుంచి 900 వరకు ఉంటుంది. అయితే 300 వద్ద ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని, 900 వరకు ఉంటే మంచి స్కోర్ అని పరిగణిస్తారు. తక్కువ వడ్డీతో లోన్ కావాలనుకునేవారికి సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండాలి. లేదంటే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది.
ఆర్థికపరమైన విషయాల్లో లావాదేవీలు సరిగ్గా నిర్వహించే వ్యక్తి సిబిల్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా వున్న వ్యక్తులకు బ్యాంకులు లోన్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ స్కోర్ ఎక్కువగా ఉండే వ్యక్తుల డాక్యుమెంట్స్ కూడా పరిశీలించకుండా బ్యాంకు లోన్ వెంటనే అందిస్తుంది. ఒక వేళా సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు వడ్డీ రేటు ఎక్కువతో లోన్ అందించే అవకాశం ఉంటుంది.
సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి?
నిర్దిష్ట సమయంలో బకాయిలు చెల్లించడం
మీరు బకాయిలను తప్పకుండా సకాలంలో క్లియర్ చేసుకోవాలి. ఒక వేళా గడువు తేదీలను మర్చిపోయినప్పుడు, రిమైండర్ వంటివి సెట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడు మీరు ఆలస్యంగా బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది మీ సిబిల్ స్కోర్ పెంచడంలో సహాయపడుతుంది.
క్రెడిట్ కార్డు రిజెక్ట్ అయితే మళ్ళీ మళ్ళీ అప్లై చేయకూడదు
మీకు లోన్ లేదా క్రెడిట్ కార్డు కావాలనుకున్నప్పుడు అప్లై చేసుకోవచ్చు. అయితే అది రిజెక్ట్ అయితే దాని కోసం పదే పదే అప్లై చేసుకోకూడదు. ఒక బ్యాంకు రిజెక్ట్ చేసిన తరువాత వేరే బ్యాంకులో అప్లై చేసుకుంటే అక్కడ మీ స్కోర్ తగ్గుతుంది, కావున ఒకసారి రిజెక్ట్ అయిన తరువాత స్కోర్ మళ్ళీ పెరిగే వరకు వేచి చూడాలి.
(ఇదీ చదవండి: మారుతి కారు కొనాలా? ఇంతకంటే మంచి సమయం రాదు!)
క్రెడిట్ కార్డు రేషియో గమనించండి
మీ క్రెడిట్ కార్డుని అన్ని లావాదేవీలకు ఉపయోగించకుండా చూసుకోవాలి. అంతే కాకుండా క్రెడిట్ కార్డు రేషియో 30 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇలా చేసినప్పుడు సిబిల్ స్కోర్ పెరుగుతుంది.
ఒకే సమయంలో రకరకాల లోన్స్ తీసుకోవడం మానుకోండి
మీరు ఒక లోన్ తీసుకున్నప్పుడు అది పూర్తయిన తరువాత తీసుకోవడం మంచిది. అలా కాకుండా లోన్ పూర్తికాకముందే మరో లోన్ తీసుకుంటే సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. దీనిని తప్పకుండా గమనించాలి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment