cibil
-
అపోహలు వీడితేనే మంచి స్కోరు
ఆర్థిక అవసరాలు నిత్యం పెరుగుతున్నాయి. వాటిని తీర్చుకునేందుకు చాలామంది రుణాలు తీసుకుంటున్నారు. ఆర్థిక సంస్థలు రుణాలపై విధించే వడ్డీరేట్లు కూడా భారీగా ఉన్నాయి. మంచి క్రెడిట్ స్కోరు సొంతం చేసుకుంటే తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి స్కోరు(CIBIL score)ను సాధించాలంటే దీనిపై ఉన్న అపోహలు వీడాలని సూచిస్తున్నారు.ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకు సాలరీ ఆధారంగా క్రెడిట్ కార్డు(Credit Card) ఆఫర్ ఉందని ఫోన్లు వస్తుంటాయి. దాంతో చాలామంది క్రెడిట్‌కార్డును తీసుకుంటున్నారు. తొలి కార్డును సంపాదించడమే కొంత కష్టం. ఆ తర్వాత కార్డు బిల్లులు సకాలంలో చెల్లిస్తే, ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోరును ఆధారంగా చేసుకుని తమ క్రెడిట్ కార్డులు ఇస్తామంటూ ముందుకు వస్తాయి. అయితే క్రెడిట్ స్కోరును పెంచుకునే దశలో చాలామందికి కొన్ని సందేహాలున్నాయి. వాటిపై స్పష్టత ఉంటే స్కోరు దూసుకెళ్లేలా చేయవచ్చు.ఆదాయం అవసరమా..?క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండాలంటే రాబడి బావుండాలని అనుకుంటారు. కానీ, ఆదాయంతో సంబంధం ఉండదు. ఏటా రూ.6 లక్షలు ఆదాయం ఉన్నవారికి మంచి క్రెడిట్ స్కోరు ఉండొచ్చు. ఏటా రూ.20 లక్షల ఆదాయం(Income) ఉన్నవారి స్కోరు పేలవంగా ఉండొచ్చు. వారు గతంలో తీసుకున్న రుణాలు, వాటి చెల్లింపులు సరళి ఎలా ఉందనే దానిపై ఇది ఆధారపడుతుంది. ఆదాయంతో సంబంధం లేకుండా సకాలంలో బిల్లులు చెల్లించడం, తక్కువ క్రెడిట్ వినియోగం వంటివి స్కోరు పెరిగేందుకు దోహదపడుతాయి.కార్డును పూర్తిగా వాడవచ్చా..?క్రెడిట్ కార్డు పరిమితి పూర్తిగా వాడలేదు కదా, స్కోరు పడిపోయిందనే సందేహం వ్యక్తం చేస్తారు. నిజానికి కార్డు మొత్తం పరిమితి మేరకు వినియోగిస్తే స్కోరుపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్(Card Limit) రూ.1 లక్ష అనుకుందాం. మీరు అందులో సుమారు 40 శాతం అంటే రూ.40,000 వినియోగిస్తే మేలు. లిమిట్ ఉందని రూ.90,000 వరకు లిమిట్ వినియోగిస్తే మొదటికే మోసం వస్తుంది. ఏకమొత్తంలో అధికంగా క్రెడిట్ కార్డు వాడితే స్కోరు తగ్గే ప్రమాదం ఉంది.పాత కార్డులను క్లోజ్ చేయాలా..?గతంలో వాడి, ప్రస్తుతం వాడకుండా ఉన్న కార్డులను క్లోజ్ చేస్తే స్కోరు పెరుగుతుందనే వాదనలున్నాయి. ఇందులో నిజం లేదు. గతంలో మీరు వాడిన కార్డులపై క్రెడిట్ హిస్టరీ జనరేట్ అవుతుంది. మీరు కార్డు క్లోజ్ చేస్తే ఆ హిస్టరీ కూడా డెలిట్ అవుతుంది. సుధీర్ఘ క్రెడిట్ హిస్టరీ ఉంటే స్కోరు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ‘పెండింగ్ సబ్సిడీలను విడుదల చేయాలి’స్కోరు పెరగాలంటే..గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి.సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కారు లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్గా పరిగణిస్తారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్(Loans)ను అన్సెక్యూర్డ్ లోన్స్గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.క్రెడిట్ కార్డు లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. కార్డు లిమిట్లో కేవలం 30-40 శాతం మాత్రమే ఉపయోగించాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.ఎదుటివారు తీసుకునే రుణాలకు గ్యారెంటీగా ఉండకూడదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డీఫాల్ట్ అయితే గ్యారెంటీ మీరు కాబట్టి మిమ్మల్ని చెల్లించమంటారు. ఆ సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది.క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించేప్పుడు వీలైతే రెండు దఫాలుగా పే చేయండి. ఉదాహరణకు మీ బిల్లు రూ.12000 అనుకుందాం. పేమెంట్ తేదీ 15 నుంచి 30వ తేదీ వరకు ఉందనుకుందాం. ఈ 15 రోజుల్లో ఒకసారి రూ.6000 మరోసారి మిగిలిన రూ.6000 చెల్లించండి. దాంతో మీ పేమెంట్ రెండుసార్లు రికార్డు అవుతుంది. ఫలితంగా క్రెడిట్‌స్కోరు పెరిగే అవకాశం ఉంటుంది. -
సిబిల్ స్కోర్ తగ్గిందా?.. ఇలా చేస్తే రాకెట్లా దూసుకెళ్తుంది
డెబిట్ కార్డు వినియోగం కంటే.. క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగిపోయింది. వేల రూపాయల జీతం తీసుకునే ఉద్యోగుల దగ్గర నుంచి లక్షల శాలరీ తీసుకునే ఉద్యోగుల వరకు, అందరూ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. అవసరానికి క్రెడిట్ కార్డును వాడుకోవడం మంచిదే.. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే సిబిల్ స్కోర్ పడిపోయే అవకాశం ఉంది. ఈ స్కోర్ పెంచుకోవడానికి ఐదు ఉత్తమ మార్గాలను ఈ కథనంలో చూసేద్దాం..సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?సిబిల్ స్కోర్ అనే పదాన్ని ఎప్పుడూ వినేవారికి కూడా.. బహుశా సిబిల్ స్కోర్ అంటే ఏమిటో తెలిసుండకపోవచ్చు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(CIBIL) అనే క్రెడిట్ బ్యూరో.. మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకుని మీకు ఇచ్చే రేటింగ్‌నే సిబిల్ స్కోర్ అంటారు.సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఈ స్కోర్ అనేది 900కి దగ్గరగా ఉంటె మంచి సిబిల్ స్కోర్ అంటారు. 750 కంటే తక్కువ ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని చెబుతారు. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే.. కొంత తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్ ఇస్తాయి. తక్కువ స్కోర్ ఉంటే.. కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వవు. ఒకవేళా ఇచ్చినా.. వడ్డీ రేటు భారీగా ఉంటుంది.సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి ఐదు మార్గాలు➤క్రెడిట్ కార్డు బిల్స్, ఈఎంఐ వంటివి సకాలంలో చెల్లించాలి. ఇది మీ సిబిల్ స్కోరును పెంచడంలో సహాయపడుతుంది. బిల్స్, ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ.. గడువుకు ముందే చెల్లింపులు పూర్తి చేయాలి.➤లోన్ కోసం మళ్ళీ మళ్ళీ వెంట వెంటనే అప్లై చేయడం మానుకోవాలి. తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయడం ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. ఇది మీ సిబిల్ స్కోర్‌ను తగ్గిస్తుంది.➤మీ పేరుతో లేదా మీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఎవరికైనా లోన్ తీసి ఇవ్వడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే లోన్ తీసుకున్న వ్యక్తి సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే.. ఆ ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద చూపిస్తుంది. రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మీరు విశ్వసిస్తే మాత్రమే.. హామీదారుగా ఉండటానికి అంగీకరించండి.➤క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుకున్నప్పటికీ.. ఖర్చులను కొంత ఆచితూచి చేయాల్సి. ఖర్చులు పెరిగితే.. మీ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది.➤సిబిల్ స్కోరును పెంచుకోవడానికి సరైన మార్గం.. క్రెడిట్ కార్డును ఉపయోగించడం మాత్రమే కాదు. సకాలంలో తిరిగి చెల్లించడం. ఇవన్నీ సరిగ్గా పాటిస్తే మీరు ఉత్తమ సిబిల్ స్కోర్ తప్పకుండా పొందుతారు. -
ప్రైవేట్ సంస్థ చేతిలో ‘సిబిల్’.. వ్యవస్థపై ఆందోళన
సిబిల్ స్కోర్ విశ్వసనీయతపై రాజకీయ రంగంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో సిబిల్ స్కోర్ వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్ యూనియన్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించే సిబిల్ స్కోర్ల విశ్వసనీయత, జవాబుదారీతనంపై ప్రశ్నలొస్తున్నాయని తెలిపారు. వ్యవస్థ పారదర్శకత, నిష్పాక్షికతపై అనుమానం వ్యక్తం చేశారు. సిబిల్ స్కోర్ నిర్వహణకు మెరుగైన యంత్రాంగం లేకపోవడాన్ని చిదంబరం నొక్కిచెప్పారు. ప్రస్తుతం అమలవుతున్న సిబిల్ నిర్వహణ చాలా మంది భారతీయులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తుందని అభిప్రాయపడ్డారు.అసలు సిబిల్ అంటే ఏమిటి? ప్రభుత్వ నిబంధనల ప్రకారం అది ఎంత ఉండాలి? దాన్ని మెరుగుపరుచుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.. అనే అంశాల గురించి తెలుసుకుందాం.సిబిల్ స్కోర్సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(సిబిల్) వారిచే ఇవ్వబడే మూడంకెల సంఖ్య. ఇది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు వాటికి సంబంధించిన చెల్లింపుల వివరాలను పరిగణలోకి తీసుకుని సిబిల్ స్కోర్ ఇస్తారు. క్రెడిట్ బ్యూరో దగ్గర వ్యక్తులు తీసుకున్న రుణాలు వాటి చెల్లింపుల వివరాలు అన్నీ ఉంటాయి. ఒక వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు? తీసుకున్న లోన్‌ను తిరిగి సకాలంలో చెల్లిస్తున్నాడా లేదా? అతనికి సంబంధించిన క్రెడిట్ కార్డు లావాదేవీలు ఇవన్నీ సిబిల్లో రికార్డు అవుతాయి. ఈ స్కోర్ 750-900 మధ్య ఉంటే మంచి రికార్డు ఉందని అర్థం.ఎక్కువగా ఉంటే..సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే త్వరగా లోన్ పొందే వీలుంటుంది. మనం కోరుకున్న రుణం మొత్తాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణం రాదని కాదు. ఒక బ్యాంకులో లోన్ ఇవ్వకయినా మరో బ్యాంకు లోన్ ఇవ్వొచ్చు. అది ఆయా బ్యాంకుల పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తక్కువ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు అప్పు ఇచ్చినా ఎక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇస్తాయి.సిబిల్ 750-900: సిబిల్ స్కోర్ 750 నుంచి 900 మధ్యలో ఉంటే ఎటువంటి లోన్ అయినా సులభంగా పొందవచ్చు. అది కూడా తక్కువ వడ్డీరేటుతో పొందే అవకాశం ఉంటుంది.స్కోర్ పెరగాలంటే..గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి.సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కారు లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్గా పరిగణిస్తారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్సెక్యూర్డ్ లోన్స్గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.క్రెడిట్ కార్డు లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. కార్డు లిమిట్లో కేవలం 30 శాతం మాత్రమే ఉపయోగించాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.ఎదుటివారు తీసుకునే రుణాలకు గ్యారెంటీగా ఉండకూడదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డీఫాల్ట్ అయితే గ్యారెంటీ మీరు కాబట్టి మిమ్మల్ని చెల్లించమంటారు. ఆ సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది.క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించేప్పుడు వీలైతే రెండు దఫాలుగా పే చేయండి. ఉదాహరణకు మీ బిల్లు రూ.12000 అనుకుందాం. పేమెంట్ తేదీ 15 నుంచి 30వ తేదీ వరకు ఉందనుకుందాం. ఈ 15 రోజుల్లో ఒకసారి రూ.6000 మరోసారి మిగిలిన రూ.6000 చెల్లించండి. దాంతో మీ పేమెంట్ రెండుసార్లు రికార్డు అవుతుంది. ఫలితంగా క్రెడిట్స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ఎయిర్టెల్, జియో పరస్పరం విరుద్ధ వాదనలుస్కోర్ తెలుసుకోవడం ఎలా?క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దానికోసం సిబిల్‌కు సంబందించిన అధికారక వెబ్సైట్ www.cibil.comలోకి వెళ్లాలి. ఆన్లైన్లో ఫారం పూర్తి చేయాలి. వ్యక్తిగత వివరాలు, పాన్ కార్డు, బ్యాంకుకు సంబందించిన వివరాలను ఇవ్వాలి. అన్ని వివరాలు ఇచ్చి సబ్మిట్ చేస్తే క్రెడిట్ రిపోర్ట్ మెయిల్ ద్వారా పంపిస్తారు. -
ఇలా చేస్తే మీ సిబిల్ స్కోర్ దూసుకెళ్లడం ఖాయం!
మీరు ఏదైన లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? లేదంటే కొత్తగా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు ముందుగా సిబిల్ స్కోర్ గురించి తెలియాల్సిందే. పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ ఇలా ఏ తరహా రుణం తీసుకోవాలన్నా బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తాయి. అలాగే, క్రెడిట్ కార్డును జారీ చేయాలన్నా కచ్చితంగా క్రెడిట్ స్కోర్‌ను చూస్తాయి. స్కోర్ బాగుంటే పర్వాలేదు. లేదంటే మీ దరఖాస్తు తిరస్కరించేందుకు వీలుంటుంది.సిబిల్ స్కోరు అంటే ఏమిటి?ప్రభుత్వం ఆధీనంలోని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(సిబిల్) సంస్థ మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకుని మీకు ఇచ్చే రేటింగ్‌నే సిబిల్ స్కోర్ అంటారు. మీరు గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన తీరు, మీ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు వంటివి రికార్డు చేస్తుంది. గతంలో మీరు తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడంలో ఎప్పుడైనా విఫలమయ్యారా? మీరు ఇచ్చిన చెక్ ఎప్పుడైనా బౌన్స్ అయిందా ? అనే అంశాల ఆధారంగా ఈ సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. ప్రతి బ్యాంక్ రుణాలు ఇచ్చే ముందు ఈ సిబిల్ స్కోర్‌ను తప్పకుండా పరిశీలిస్తుంది.ఈ స్కోర్ 300-900 వరకు ఉంటుంది. అధిక స్కోర్(750 కంటే ఎక్కువ) ఉంటే మీకు రుణాలు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు సిద్ధంగా ఉంటాయి. నిబంధనల ప్రకారం తదుపరి ధ్రువపత్రాలు పరిశీలించి రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ 600 కంటే తక్కువగా ఉంటే రుణాల కోసం చేసుకున్న దరఖాస్తును రద్దు చేసే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!స్కోర్ పెరగాలంటే..గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి.సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కారు లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్గా పరిగణిస్తారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్సెక్యూర్డ్ లోన్స్గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.క్రెడిట్ కార్డు లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. కార్డు లిమిట్లో కేవలం 30 శాతం మాత్రమే ఉపయోగించాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.ఎదుటివారు తీసుకునే రుణాలకు గ్యారెంటీగా ఉండకూడదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డీఫాల్ట్ అయితే గ్యారెంటీ మీరు కాబట్టి మిమ్మల్ని చెల్లించమంటారు. ఆ సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది.క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించేప్పుడు వీలైతే రెండు దఫాలుగా పే చేయండి. ఉదాహరణకు మీ బిల్లు రూ.12000 అనుకుందాం. పేమెంట్ తేదీ 15 నుంచి 30వ తేదీ వరకు ఉందనుకుందాం. ఈ 15 రోజుల్లో ఒకసారి రూ.6000 మరోసారి మిగిలిన రూ.6000 చెల్లించండి. దాంతో మీ పేమెంట్ రెండుసార్లు రికార్డు అవుతుంది. ఫలితంగా క్రెడిట్స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. -
సిబిల్ అప్డేట్ @ 15
సాక్షి, అమరావతి: రుణం తీసుకుని సకాలంలో చెల్లిస్తున్న వారు సిబిల్ స్కోర్ వేగంగా పెంచుకునే అవకాశంతో పాటు సిబిల్ స్కోర్ వివాదాలు సత్వరం పరిష్కరించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అడుగు ముందుకు వేసింది. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి సిబిల్ స్కోర్‌ను అప్డేట్ చేయాల్సిందిగా అటు సిబిల్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలతో పాటు, రుణాలిచ్చే సంస్థలనూ ఆదేశించింది.ఈ నిర్ణయం జనవరి1, 2025 నుంచి అమల్లోకి వస్తుందని, తదనుగుణంగా బ్యాంకులు, ఇతర ఆరి్థక సంస్థలు 15 రోజులకోసారి రుణాల మంజూరు చెల్లింపుల వివరాలను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ప్రస్తుతం నెలకోసారి బ్యాంకులు సమాచారం ఇస్తున్నాయి. ఈ సమాచారం కూడా లోపభూయిష్టంగా ఉంటుండటంతో సిబిల్ స్కోర్‌పై పలు వివాదాలు తలెత్తుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పలు సంస్థలు రోజుల వ్యవధికి కూడా రుణాలిస్తున్నాయని, ఇలా 15 రోజులకోసారి సమాచారం అప్డేట్ చేయడం ద్వారా అటు రుణ గ్రహీతలతో పాటు రుణాలిచ్చే సంస్థలు కూడా ప్రయోజనం పొందుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తప్పుల సవరణ 30 నుంచి 45 రోజుల్లో అధునాతన టెక్నాలజీ అందుబాటులోకొచి్చన ఈ రోజుల్లో 15 రోజులకోసారి సమాచారం అప్డేట్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులుండవంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా రానున్న రోజుల్లో రియల్ టైమ్‌లో అంటే ఎప్పుడు రుణం చెల్లిస్తే అప్పుడే సిబిల్ స్కోర్ అప్డేట్ చేసేలా ఆర్బీఐ అడుగులు వేస్తోందనడానికి ఇది ఉదాహరణగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం సిబిల్ స్కోర్‌లో ఏదైనా తప్పు జరిగితే దాని సవరణకు 60 నుంచి 90 రోజుల సమయం పట్టేదని అది ఇప్పుడు 30 నుంచి 45 రోజులకు తగ్గనుండటంతో సిబిల్ స్కోర్ వివాదాలు వేగంగా పరిష్కారమవుతాయంటున్నారు. అదే విధంగా సకాలంలో చెల్లించే వారికి స్కోర్ పెరగడం ద్వారా రానున్న కాలంలో తీసుకునే రుణాలపై తక్షణ ప్రయోజనం పొందే వెసులుబాటు కలుగుతుందని, అదే విధంగా రుణ గ్రహీత ఆరి్థక పరిస్థితి కూడా తెలిసి దానికి అనుగుణంగా బ్యాంకులు నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని చెబుతున్నారు. -
ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండిలా..!
సిబిల్ స్కోరు నివేదిక చూసి, ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి ఒక అంచనాకు రావచ్చు. బ్యాంకులూ కొత్తగా అప్పు ఇచ్చేటప్పుడు దీన్ని నిశితంగా పరిశీలిస్తాయి. సిబిల్ స్కోరు 750 పాయింట్లకు మించి ఉందంటే ఆర్థిక క్రమశిక్షణ బాగుందని అర్థం. చాలా వెబ్సైట్లు, యాప్‌లు సిబిల్ స్కోర్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. అందులో ఒకటి చాలా మంది తరచుగా ఉపయోగించే గూగుల్ పే ద్వారా ఈ స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం. భారత్‌లో కోట్లాది మంది గూగుల్ పే యాప్‌ను వివిధ రకాల చెల్లింపుల కోసం వాడుతున్నారు. తొలుత దీంట్లో కేవలం నగదు బదిలీకి మాత్రమే అవకాశం ఉండేది. దశలవారీగా అనేక సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లకూ దీన్ని విస్తరించారు. ఇటీవల సిబిల్ స్కోర్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఎలా చెక్ చేసుకోవాలంటే.. గూగుల్ పే యాప్ ఓపెన్ చేయాలి ‘మేనేజ్ యువర్ మనీ’ సెక్షన్ వచ్చే వరకు స్క్రోల్ చేయాలి. అక్కడ కనిపించే ‘చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ‘Your CIBIL score does not decrease after you check it. Google Pay does not share credit report data with any 3rd party’ అనే పాప్అప్ కనిపిస్తుంది. దాని కింద సబ్మిట్ బటన్ వస్తుంది. అది క్లిక్ చేయాలి. క్షణాల్లో మీ సిబిల్ స్కోర్ తెరపై కింద కనిపిస్తుంది. ఇదీ చదవండి: రూ.20 వేలతో రూ.100 కోట్లు సంపాదించొచ్చా..? సిబిల్ స్కోర్ అంటే.. సిబిల్ అంటే ‘క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఇండియా) లిమిటెడ్’. ఇంకా సులువుగా చెప్పాలంటే రుణ హిస్టరీను అందించే సంస్థ. ఇది ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఆర్బీఐ) ఆధ్వర్యంలోని క్రెడిట్ ఏజెన్సీ. సిబిల్.. వ్యక్తులకు చెందిన రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపు వ్యవహారాలు వంటి సమాచారాన్ని సేకరించి నివేదికలు తయారుచేస్తుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతర ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందజేస్తాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి సిబిల్ రుణ చరిత్ర నివేదిక, సిబిల్ స్కోర్‌ను తయారుచేస్తుంది. సిబిల్ స్కోర్ 300-900 మధ్య ఉంటుంది. 600 కంటే తక్కువ ఉంటే ‘బ్యాడ్ సిబిల్ స్కోర్’గా పరిగణిస్తారు. అలాంటి వారికి రుణం ఇవ్వడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అని అర్థం. 750 కంటే ఎక్కువ ఉంటే మెరుగైన స్కోర్‌గా పరిగణిస్తారు. -
సిబిల్ స్కోర్ సింపుల్‌గా చెక్ చేసుకోవాలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
CIBIL Score Checking: ఆధునిక కాలంలో సిబిల్ స్కోర్ మీద ప్రజల్లో అవగాహనా బాగా పెరిగింది. ఈ స్కోర్ మీద ఆధారపడి లోన్ ఇంట్రెస్ట్ ఉంటుందని ప్రస్తుతం అందరికి తెలిసింది. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి కృషి చేస్తుంటారు. అయితే సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. ఇది క్రెడిట్ హిస్టరీ సమాచారాన్ని మొత్తం సేకరించి వినియోగదారునికి సిబిల్ స్కోర్ రూపంలో తెలియజేస్తుంది. సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉన్నప్పుడు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ స్కోర్ 300 లేదా అంతకంటే తక్కువ ఉంటే దాదాపు లోన్ లభించే అవకాశం ఉండదు, ఒక వేళ లోన్ అందించినా ఎక్కువ వడ్డీ రేటుతో అందించడం జరిగుంతుంది. సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి మార్గం సరైన సమయంలో మీరు తీసుకునే లోన్ ఈఎమ్ఐ లేదా క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించడం. ఇవే మీ సిబిల్ స్కోర్ పెంచడంలో సహాయపడతాయి. (ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ పెంచుకోవాలా? ఈ తప్పులు అస్సలు చేయవద్దు..) సిబిస్ స్కోర్ చెక్ చేసుకోవడం.. సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలనుకునేనారు ముందుకి సిబిల్ అధికారిక వెబ్సైట్ లాగిన్ చేసి 'గెట్ యువర్ సిబిల్ స్కోర్' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అందులో పేరు, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత పాన్ లేదా ఆధార్ నెంబర్ వంటి ఐడీ ప్రూఫ్‌లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత పిన్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి 'యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇవన్నీ జరిగిన తరువాత రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ టైప్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత 'గో టు డాష్‌బోర్డ్' మీద క్లిక్ చేసిన తరువాత 'మైస్కోర్.సిబిల్.కమ్' కు మీ పేజ్ రీ-డైరక్ట్ అవుతుంది. 'మెంబర్ లాగిన్'పై క్లిక్ చేసిన తరువాత సిబిల్ స్కోర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అధికారిక వెబ్సైట్ ద్వారా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం కష్టం అనుకునే వారు, గూగుల్ పే యాప్ యూజర్స్ అయితే ఆ యాప్‌లో 'చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ' అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కూడా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైన పద్దది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
సిబిల్ స్కోర్ పెంచుకోవాలా? ఈ తప్పులు అస్సలు చేయవద్దు..
ఆధునిక కాలంలో CIBIL స్కోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సిబిల్ స్కోర్ అనేది లోన్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ స్కోర్ మీద ఆధారపడే మనకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి. అలాంటి సిబిల్ స్కోర్ ఏవిధంగా పెంచుకోవాలి? పెంచుకోవడానికి ఏవైనా మార్గాలున్నాయా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సిబిల్ స్కోర్ సాధారణంగా 300 నుంచి 900 వరకు ఉంటుంది. అయితే 300 వద్ద ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని, 900 వరకు ఉంటే మంచి స్కోర్ అని పరిగణిస్తారు. తక్కువ వడ్డీతో లోన్ కావాలనుకునేవారికి సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండాలి. లేదంటే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో లావాదేవీలు సరిగ్గా నిర్వహించే వ్యక్తి సిబిల్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా వున్న వ్యక్తులకు బ్యాంకులు లోన్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ స్కోర్ ఎక్కువగా ఉండే వ్యక్తుల డాక్యుమెంట్స్ కూడా పరిశీలించకుండా బ్యాంకు లోన్ వెంటనే అందిస్తుంది. ఒక వేళా సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు వడ్డీ రేటు ఎక్కువతో లోన్ అందించే అవకాశం ఉంటుంది. సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి? నిర్దిష్ట సమయంలో బకాయిలు చెల్లించడం మీరు బకాయిలను తప్పకుండా సకాలంలో క్లియర్ చేసుకోవాలి. ఒక వేళా గడువు తేదీలను మర్చిపోయినప్పుడు, రిమైండర్ వంటివి సెట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడు మీరు ఆలస్యంగా బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది మీ సిబిల్ స్కోర్ పెంచడంలో సహాయపడుతుంది. క్రెడిట్ కార్డు రిజెక్ట్ అయితే మళ్ళీ మళ్ళీ అప్లై చేయకూడదు మీకు లోన్ లేదా క్రెడిట్ కార్డు కావాలనుకున్నప్పుడు అప్లై చేసుకోవచ్చు. అయితే అది రిజెక్ట్ అయితే దాని కోసం పదే పదే అప్లై చేసుకోకూడదు. ఒక బ్యాంకు రిజెక్ట్ చేసిన తరువాత వేరే బ్యాంకులో అప్లై చేసుకుంటే అక్కడ మీ స్కోర్ తగ్గుతుంది, కావున ఒకసారి రిజెక్ట్ అయిన తరువాత స్కోర్ మళ్ళీ పెరిగే వరకు వేచి చూడాలి. (ఇదీ చదవండి: మారుతి కారు కొనాలా? ఇంతకంటే మంచి సమయం రాదు!) క్రెడిట్ కార్డు రేషియో గమనించండి మీ క్రెడిట్ కార్డుని అన్ని లావాదేవీలకు ఉపయోగించకుండా చూసుకోవాలి. అంతే కాకుండా క్రెడిట్ కార్డు రేషియో 30 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇలా చేసినప్పుడు సిబిల్ స్కోర్ పెరుగుతుంది. ఒకే సమయంలో రకరకాల లోన్స్ తీసుకోవడం మానుకోండి మీరు ఒక లోన్ తీసుకున్నప్పుడు అది పూర్తయిన తరువాత తీసుకోవడం మంచిది. అలా కాకుండా లోన్ పూర్తికాకముందే మరో లోన్ తీసుకుంటే సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. దీనిని తప్పకుండా గమనించాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
InternationalWomen's Day 2023: మహిళల నిజాయితీపై సంచలన రిపోర్ట్
సాక్షి,ముంబై: రుణాలు చెల్లింపులో మహిళలే ముందు ఉన్నారని తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. రుణాలను తిరిగి చెల్లించడంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ నిజాయితీగా ఉన్నారని క్రెడిట్ డేటా సంస్థ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజా నివేదిక వెల్లడించింది. స్త్రీలకు రుణాలు ఇవ్వడం పురుషుల కంటే తక్కువ ప్రమాదకరమని ఈ డేటా వెల్లడించింది. అందుకే గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య బాగా పెరిగిందని వ్యాఖ్యానించింది. ప్రతి ఏటా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన నివేదికను ప్రకటిస్తుంది తన రుణ చెల్లింపుపై ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల నుండి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో భారతదేశంలోని స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ మనస్సాక్షిగా ఉంటారని వెల్లడించింది. గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య పెరగడానికి వారి మరింత నిజాయితీగా తిరిగి చెల్లించే ప్రవర్తనే కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం గత ఐదేళ్లలో భారతదేశంలో మహిళా రుణగ్రహీతల సంఖ్య వార్షిక రేటు 15 శాతం పెరిగింది, పురుషులతో పోలిస్తే ఇది 11 శాతం. 2017లో 25 శాతం మంది మహిళలు రుణాలు తీసుకోగా, 2022లో ఈ సంఖ్య 28 శాతానికి పెరిగింది. దేశ ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది ఈ గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం, దేశీయ అంచనా జనాభా 1.4 బిలియన్లలో దాదాపు 454 మిలియన్ల వయోజన మహిళలు ఉన్నారు. వీరిలో 2022 వరకు దాదాపు 6.3 కోట్ల మంది మహిళలు రుణాలు తీసుకున్నారు. మహిళలకు రుణ సదుపాయం 2017లో 7 శాతంగా ఉంది, ఇది 2022లో 14 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు సాధించిన పురోగతి ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ ఇంకా మెరుగు పడాల్సి ఉందనికూడా తెలిపింది. మహిళా రుణగ్రహీతల సంఖ్య పెరగడం ప్రభుత్వ ఆర్థిక సమ్మేళనానికి సానుకూల సంకేతమని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సీవోవో హర్షలా చందోర్కర్ అభిప్రాయపడ్డారు. వివిధ సామాజిక-ఆర్థిక వర్గాలు, ఏజ్ గ్రూపులు,, భౌగోళిక ప్రాంతాలలో మహిళలకు అనుగుణంగా రుణాలను అందించడం వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి సహాయపడుతుందని కూడా ఆమె సూచిస్తున్నారు. దీని వల్ల మహిళలకే కాకుండా సంప్రదాయంగా వెనుకబడిన రంగాలకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. -
సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా బ్యాంకు లోన్ పొందండిలా..!
-
క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి ఈజీ టిప్స్
-
మీకే రుణాలిస్తాం..చిరు వ్యాపారులకు జై కొట్టిన బ్యాంకులు!
ముంబై: మహమ్మారి కరోనా ముందటి స్థాయిలతో పోలిస్తే చిన్న వ్యాపారాలకు రుణ పంపిణీ రెట్టింపు అయ్యింది. అయితే బ్యాంకర్లు రుణ పంపిణీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఇప్పటికే ఖాతాలు కలిగి ఉన్న రుణ గ్రహీతలకే తిరిగి రుణాలు ఇవ్వడానికి బ్యాంకింగ్ మొగ్గు చూపింది. రుణ సమాచార కంపెనీ– సిబిల్ వెల్లడించిన అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి.. ► సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నుండి రుణాల కోసం డిమాండ్ (వాణిజ్య క్రెడిట్ విచారణల సంఖ్య ప్రాతిపదికన) కరోనా ముందస్తు స్థాయితో పోల్చితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో 1.6 రెట్లు పెరిగింది. ►మొత్తం ప్రత్యక్ష ఎంఎస్ఎంఈ రుణగ్రహీతల సంఖ్య మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందు ఆర్థిక సంవత్సరం కంటే 6 శాతం వృద్ధి రేటుతో 7 మిలియన్లకు చేరుకుంది. ►ఎంఎస్ఎంఈ విభాగంలో ఎన్పీఏలు మార్చి 2021 నుండి పెరుగుతున్నాయి. మహమ్మారి వల్ల సూక్ష్మ పరిశ్రమ విభాగం ఎక్కువగా దెబ్బతింది. ►వర్కింగ్ క్యాపిటల్ లోన్ల కంటే టర్మ్ లోన్ విషయంలో ఎక్కువగా పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇది సానుకూల సంకేతంగా పేర్కొనవచ్చు. ►ఎంఎస్ఎంఈలు క్యాష్ క్రెడిట్, ఓవర్‌డ్రాఫ్ట్ (సీసీ, ఓడీ) రుణాల ద్వారా తమ లిక్విడిటీ (ద్రవ్య లభ్యతను) అవసరాలను నిర్వహిస్తున్నాయి. చదవండి👉 మరింత తగ్గనున్న మొండిబాకీల భారం -
నా క్రెడిట్ స్కోర్ ఎంత?
ముంబై: తమ క్రెడిట్ స్కోర్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ఎక్కవ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలకు సంబంధించి క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం గత కొన్నేళ్లలో భారీగా పెరిగినట్టు క్రెడిట్ సమాచార కంపెనీ ట్రాన్స్ యూనియన్ సిబిల్ తెలిపింది. 2017తో పోలిస్తే 2020లో రూ.25,000 దిగువన వ్యక్తిగత రుణాల్లో 23 రెట్ల వృద్ధి నమోదు కాగా.. 2020లో క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం అన్నది మూడు రెట్లు పెరిగినట్టు పేర్కొంది. అన్ని క్రెడిట్ సమాచార సంస్థలు (క్రెడిట్ బ్యూరోలు) ఏడాదికి ఒక్కసారి ఉచితంగా ప్రతీ వ్యక్తి క్రెడిట్ స్కోర్/రిపోర్ట్ తెలుసుకునే అవకాశం కల్పించాలంటూ ఆర్బీఐ 2016 సెపె్టంబర్లో ఆదేశాలు తీసుకురావడం గమనార్హం. ఆ తర్వాత నుంచి వ్యక్తులు ఉచితంగా క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోవడం పెరిగినట్టు గమనించొచ్చు. పరపతికి సంబంధించి వ్యక్తుల్లో అవగాహన పెరిగిందని.. క్రెడిట్‌స్కోర్‌ను ఎక్కువ పర్యాయాలు తెలుసుకునే వారి సంఖ్య రెట్టింపైనట్టు సిబిల్ నివేదిక తెలియజేసింది. -
మున్ముందు ఎన్పీఏలు మిలీనియల్స్‌వేనా?
ముంబై: మిలీనియల్స్ (1980– 2000 మధ్య జన్మించినవారు) తీసుకుంటున్న రుణాలు బ్యాంకులకు భవిష్యత్తు మొండి బకాయిలుగా (ఎన్పీఏలు) మారనున్నాయా..? గత రెండేళ్లుగా బ్యాంకులకు మిలీనియల్స్ రుణాలే పెద్ద వ్యాపారంగా ఉండడంతో ఈ ప్రశ్న తలెత్తుతోంది. మిలీనియల్స్‌లో అత్యధికులు అన్సెక్యూర్డ్ రుణాలనే తీసుకుంటుండడం బ్యాంకులకు ఆందోళన కలిగించేదేనని ట్రాన్స్ యూనియన్ సిబిల్ పేర్కొంది. కొత్తగా రుణాలు తీసుకునే మిలీనియల్స్ సంఖ్య 58% పెరగ్గా, ఇతర విభాగంలో ఈ వృద్ధి 14%గానే ఉందని సిబిల్ నివేదిక తెలిపింది. కార్పొరేట్ రుణాల్లో భారీ ఎన్పీఏల నేపథ్యంలో బ్యాంకులు రిటైల్ రుణాలపై ఎక్కువ గా ఆధారపడడం తెలిసిందే. అన్ సెక్యూర్డ్ రుణాల కింద క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, కన్జ్యూమర్ రుణాలు ఇస్తున్నారు. మిలీనియల్స్ రుణాల్లో 72% ఇవే ఉంటున్నాయని సిబిల్ నివేదించింది. ఇక మిలీనియల్స్ తీసుకుంటున్న రుణాల్లో సురక్షిత (సెక్యూర్డ్) రుణాల కిందకు వచ్చే వాహన రుణాలు 9% ఉన్నట్లు సిబిల్ వెల్లడించింది. తమ క్రెడిట్ స్కోరుపై మిలీనియల్స్ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని, స్కోరును పర్యవేక్షించుకుంటున్నారని పేర్కొంది. 700 కంటే తక్కువ స్కోరు కలిగిన వారిలో 51% మంది 6 నెలల్లోనే క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకున్నారని వివరించింది. -
నోట్ల రద్దుతోరుణ డిమాండ్ డౌన్
ద్విచక్ర, కన్సూమర్ రుణాలపై ప్రభావం: సిబిల్ ముంబై: ద్విచక్ర, వినియోగ వస్తు(టూవీలర్, కన్సూమర్ డ్యూరబుల్స్) రుణాలపై డీమోనిటైజేషన్(నోట్ల రద్దు) ప్రభావం తీవ్రంగా పడిందని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ పేర్కొంది. ‘టూవీలర్, కన్సూమర్ డ్యూరబుల్స్ రుణాల్లో సాధ్యమైనంత వరకు ప్రైవేట్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వాటానే ఎక్కువ. వీటిపై నోట్ల రద్దు చాలా ప్రతికూల ప్రభావం చూపింది’ అని సిబిల్ వైస్ ప్రెసిడెంట్ అమృత మిత్ర తెలిపారు. ప్రాంతాలల్లో వారీగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు. క్రెడిట్ కార్డులు, ఇతర వాహన రుణాలు సహా పలు కన్సూమర్ డ్యూరబుల్ ప్రొడక్టుల డిమాండ్ కూడా నవంబర్ 8 తర్వాత పడిపోయిందని చెప్పారు. 2015 జనవరి–సెప్టెంబర్ మధ్యకాలంతో పోలిస్తే 2016 ఇదే సమయంలో వినియోగ వస్తు రుణాల డిమాండ్ 35 శాతంమేర ఎగసిందని అమృత మిత్ర తెలిపారు. అయితే నవంబర్, డిసెంబర్ నెలల్లో మాత్రం పలు విభాగాల్లోని పరిస్థితులు తారుమారు అయ్యాయని, డిమాండ్ తగ్గిందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహన రుణ దరఖాస్తులు ఆశించిన (14 లక్షలు) స్థాయి కన్నా 43 శాతంమేర తక్కువగా వచ్చాయని తెలిపారు. వినియోగ వస్తు విభాగపు రుణ దరఖాస్తుల్లో 60 శాతం క్షీణత నమోదయ్యిందని పేర్కొన్నారు. -
బ్యాంకు మేనేజర్లకు రిజర్వు బ్యాంకు చెక్
-
స్కోరుంటేనే రుణం!
బ్యాంకు మేనేజర్ల విచక్షణాధికారాలకు రిజర్వు బ్యాంకు చెక్ ♦ సిబిల్ నివేదిక, స్కోరు ఆధారంగానే అన్ని రుణాలు ♦ రూ. 50 వేలపైన ప్రతి రుణ మంజూరుకు 700 స్కోరైనా ఉండాలి ♦ వచ్చే ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా అమలు ♦ అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం ♦ నిరర్థక ఆస్తుల అడ్డుకట్టకు ఇదే మార్గమని స్పష్టీకరణ ♦ ఖాతాదారులకు ఏడాదికి మూడుసార్లు ఉచితంగా సిబిల్ నివేదిక! సాక్షి, హైదరాబాద్: క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (సిబిల్) స్కోరుతో నిమిత్తం లేకుండా రుణాలు మంజూరు చేస్తున్న బ్యాంకు మేనేజర్ల విచక్షణాధికారాలకు రిజర్వు బ్యాంకు అడ్డుకట్ట వేసింది. రూ. 50 వేలకు పైన రుణ మంజూరుకు సంబంధించి తప్పనిసరిగా సిబిల్ స్కోరును పరిగణనలోకి తీసుకోవాలని, కనీసం 700 పైన స్కోరు ఉన్న వారికే రుణాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక సిబిల్ పరిధిలోకి రావాలని అన్ని రకాల సహకార బ్యాంకులకూ సూచించింది. రైతులు తీసుకునే స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాల మంజూరు, చెల్లింపు ప్రక్రియను సిబిల్లో నమోదు చేసేలా చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులను ఆదేశించింది. ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా.. అన్ని వాణిజ్య బ్యాంకుల్లో ఇప్పటికే రుణాలకు సంబంధించిన సమాచారాన్ని సిబిల్‌తో అనుసంధానం చేశారు. రుణాల మంజూరుకు సిబిల్ స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రైవేటు బ్యాంకులు దీనిని నూరు శాతం అమలు చేస్తున్నా... ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం ఎక్కువసార్లు మేనేజర్ల విచక్షణాధికారం మేరకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. అయితే వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి కచ్చితంగా సిబిల్ స్కోరును ప్రామాణికంగా తీసుకోవాల్సిందే. ఈ స్కోరు 700లోపు ఉన్న ఖాతాదారులు బ్యాంకుకు ఎంత ప్రాధాన్యత కలిగిన వారైనా.. రుణ దరఖాస్తును తదుపరి పరిశీలనకు తీసుకోరు. నోట్ల రద్దుతో బ్యాంకులకు భారీగా నగదు వచ్చి చేరడంతో రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. బ్యాంకులకు వచ్చిన నగదును పరపతి సరిగా లేని ఖాతాదారులు, రుణాలు తీసుకుని తరచూ ఎగవేసేవారికి ఇచ్చే అవకాశం లేకుండా త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేయనుంది. అన్ని రుణాల మంజూరుకూ.. వ్యక్తిగత అవసరాలకు తీసుకునే రుణాలతో పాటు ఇంటి, వాహన, విద్య, ఆస్తి తాకట్టు రుణాలకు కూడా సిబిల్ స్కోరే ప్రామాణికం కానుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం... ఏ ఖాతాదారుడైనా రుణానికి దరఖాస్తు చేసినప్పుడు ముందుగా వారి సిబిల్ స్కోరును పరిశీలిస్తారు. స్కోరు 700 కంటే తక్కువగా ఉంటే దరఖాస్తును ప్రారంభ దశలోనే తిరస్కరిస్తారు. 700 దాటి ఉంటే రుణ మంజూరుకు అవసరమైన ఇతర పరిశీలన నిమిత్తం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ విషయంలో బ్రాంచ్ మేనేజర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. ప్రస్తుతమున్నట్లుగా దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవడానికి బ్యాంకు మేనేజ్మెంట్ సిస్టమ్ అంగీకరించదు. స్కోరు ఎక్కువగా ఉన్నా.. సిబిల్ స్కోరు 700–750 మధ్య ఉన్న ఖాతాదారులకు సంబంధించి అన్ని లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. రుణాలు ఎగవేయడం, వన్‌టైమ్ సెటిల్మెంట్లు చేసుకోవడం వంటివి కనిపిస్తే.. అర్హతలున్నా అడిగినంత రుణం ఇవ్వరు. కొంత రుణమిచ్చి తరువాత వారు చెల్లించే విధానాన్ని బట్టి అదనపు రుణం ఇస్తారు. స్కోరు 750–850 మధ్య ఉంటే దరఖాస్తుదారు అర్హతలను బట్టి 48 గంటల్లో రుణం మంజూరు చేస్తారు. ఏవైనా కంపెనీలు నిరర్థక ఆస్తుల జాబితాలో ఉంటే.. ఆ కంపెనీని నిర్వహిస్తున్న వారికి కూడా రుణం ఇవ్వరు. ఆ కంపెనీ డైరెక్టర్లు, ఉన్నత హోదాల్లో ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుంది. విదేశాల్లో తమ పిల్లలను చదివించాలనుకునేవారు వ్యక్తిగత ఆస్తులను తాకట్టు పెట్టి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే వీలుంది. అయితే సదరు విద్యార్థి తల్లి లేదా తండ్రి సిబిల్ స్కోరు సరిగా లేనిపక్షంలో రుణ దరఖాస్తును ప్రారంభ దశలోనే తిరస్కరిస్తారు. పరిచయమున్న బ్యాంకు మేనేజర్ లేదా సీనియర్ అధికారి తెలిస్తే ఇప్పటిదాకా ఈ నిబంధనను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ‘రియల్’కు ఇబ్బందిగా మారిన సిబిల్ తెలిసీ తెలియక క్రెడిట్ కార్డులు ఎడాపెడా వాడేసి సకాలంలో తిరిగి చెల్లించకపోతే సిబిల్ స్కోరు 500–600 మధ్య ఉంటుంది. ఇంటి రుణాలకు సంబంధించి బ్యాంకులు ఇప్పటికే 75 శాతం సిబిల్ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. దీంతో 40 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. నెలకు రూ.లక్ష వేతనం సంపాదించే ఉద్యోగులు సైతం సిబిల్ స్కోరు లేకపోవడం వల్ల ఇంటిరుణాలు పొందలేకపోతున్నారు. ‘‘మా బ్యాంకుకు నిత్యం 250 నుంచి 300 రుణ దరఖాస్తులు వస్తాయి. వారంతా ఐటీ కంపెనీల్లో మంచి వేతనానికి పని చేసేవారే. కానీ వారి సిబిల్ స్కోరు సరిగా లేని కారణంగా 40 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి..’’అని హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఎస్బీఐ సీనియర్ మేనేజర్ ఒకరు చెప్పారు. ప్రస్తుతం సిబిల్ స్కోరు ఆశించిన స్థాయిలో లేకపోయినా తమ విచక్షణాధికారంతో కొంతమందికి రుణం ఇప్పించగలుగుతున్నామని.. ఇకపై అలాంటి అవకాశం ఉండదని ఆయన వెల్లడించారు. వచ్చే ఏప్రిల్ నుంచి దీనిని కచ్చితంగా అమలు చేస్తే దాని ప్రభావం రియల్ ఎస్టేట్‌పై పడుతుందని నిపుణులు అంటున్నారు. ఎడాపెడా క్రెడిట్ కార్డులు ఇవ్వడం, అత్యధిక మొత్తంలో వడ్డీలు విధించడంతో వినియోగదారులు బ్యాంకులతో వన్‌టైమ్ సెటిల్మెంట్లకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డుల విషయంలో సిబిల్ స్కోరు ప్రభావితం కాకుండా చూడాలని బ్యాంకర్లే కోరుతున్నారు. వ్యక్తిగత రుణం మరేదైనా రుణం తీసుకుని ఎగవేసిన వారు, ఎన్‌పీఏల్లో చేరిన వారి విషయంలో తాము ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు సిబిల్ స్కోరును కచ్చితంగా పాటించాల్సి వస్తే రుణ దరఖాస్తుల తిరస్కరణ భారీగా పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఏడాదికోసారి ఉచితంగా..! ఏ బ్యాంకు నుంచైనా రుణం లేదా క్రెడిట్ కార్డు తీసుకున్న వారికి ఏడాదిలో మూడు సార్లు ఉచితంగా సిబిల్ నివేదిక ఇవ్వాలని రిజర్వు బ్యాంకు గతంలోనే సూచించింది. అది అమల్లోకి రాలేదు. ప్రస్తుతానికి ఏడాదిలో ఒకసారైనా ఉచితంగా ఇవ్వాలన్న నిబంధనను కూడా సిబిల్ అమలు చేయడం లేదు. సిబిల్ నివేదిక కావాలనుకునేవారు రూ.550 చెల్లించాల్సిందే, అదీ ఒక్కసారికే. సాధారణంగా సిబిల్ నివేదికను చూస్తే తప్ప వినియోగదారుడు తన తప్పునుగానీ, ఆర్థిక సేవల సంస్థ చేసే పొరపాట్లనుగానీ సరిదిద్దుకోవడానికి వీలుండదు. ఈ నేపథ్యంలో రుణాలు తీసుకోవడానికి సిబిల్ స్కోరును ప్రామాణికం చేయాలనుకుంటే... దీనిపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరముందని బ్యాంకర్లు చెబుతున్నారు. లేకపోతే రుణాల జారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బంది అవుతుందన్నది వారి ఆందోళన. ‘నోట్ల రద్దు’నేపథ్యంలో బ్యాంకులకు భారీ ఎత్తున నగదు రావడంతో ప్రస్తుతం రుణాలివ్వడానికి అవకాశముంది. అయితే ఈ రుణాలు నిరర్థక ఆస్తులుగా మారకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నట్లు ఆర్బీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. సిబిల్ అంటే.. దేశంలో వ్యక్తులు, సంస్థల రుణ చరిత్ర (రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లింపులు)ను నమోదు చేసి... బ్యాంకులు సహా వివిధ ఆర్థిక సేవల సంస్థలకు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసినదే ‘క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్’. దీనినే క్లుప్తంగా సిబిల్ అని పిలుస్తారు. దేశంలోని చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు దీనితో అనుసంధానమై ఉంటాయి. ఎవరు ఏ బ్యాంకులో, ఏ ఫైనాన్షియల్ సంస్థలో.. ఎలాంటి రుణం తీసుకున్నా సిబిల్ రికార్డుల్లోకి చేరుతుంది. ఎంత రుణం తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, తిరిగి సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా తదితర వివరాలను బ్యాంకులు సిబిల్‌కు పంపిస్తుంటాయి. ఆ సమాచారం ఆధారంగా సిబిల్ వారికి సంబంధించిన నివేదికలను, స్కోరును అప్డేట్ చేస్తుంది. తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డులు, తిరిగి చెల్లిస్తున్న విధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సిబిల్ స్కోరును నిర్ణయిస్తారు. ఏ ఖాతాదారుడైనా క్రెడిట్ కార్డులు, ఇంటి రుణం, వ్యక్తిగత, వాహన రుణాలు, బంగారంపై రుణాల వంటివి తీసుకుని.. సక్రమంగా వాయిదాల చెల్లింపులు చేస్తుంటే సిబిల్ స్కోరు పెరుగుతుంది. లేకపోతే స్కోరు తగ్గుతుంది. -
కొన్ని రాష్ట్రాలపైనే బ్యాంకుల దృష్టి : సిబిల్
అందుకే ఎన్పీఏలు ముంబై: బ్యాంకులు కొన్ని రాష్ట్రాలపైనే దృష్టి పెట్టడం వల్ల రుణ ఎగవేతలు, మైక్రో, ఎస్ఎంఈ వాణిజ్య రంగాల్లో చెల్లింపుల్లో వైఫల్యాలు చోటు చేసు కున్నాయని ట్రాన్స యూనియన్ సిబిల్ సంస్థ పేర్కొంది. ‘‘కేవలం కొన్ని రాష్ట్రాలపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల బ్యాంకులు వాటి రుణ వృద్ధికి ఉన్న అవకాశాలను కోల్పోతున్నారుు. కొన్ని బ్యాంకుల వ్యూహాత్మక దృష్టి ఐదు రాష్ట్రాలు లేదా పది రాష్ట్రాలపైనే ఉంటోంది’’ అని ట్రాన్‌సయూనియన్ సిబిల్ ఇండియా ఎండీ సతీష్ పిళ్లై చెప్పారు. ఉదాహరణకు రాజస్థాన్ రాష్ట్రాన్ని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ వాణిజ్య రుణాలకు సంబంధించిన మొండి బకారుులు (ఎన్పీఏ) అతి తక్కువగా ఉన్నాయని, అవి రెండు శాతమని, అదే సమయంలో రుణాల జారీ కూడా తక్కువగా ఉందన్న విషయాన్ని ఆయన తెలిపారు. సూక్ష్మ సంస్థలకు సంబంధించి ఎన్పీఏలు 6-6.5 శాతం స్థారుులో ఆగిపోగా... ఎస్ఎంఈ విభాగంలో మాత్రం ఆస్తుల నాణ్యత ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్టు పిళ్లై పేర్కొన్నారు. ఈ విభాగంలో ఎన్పీఏల రేటు లోగడ 8 శాతంగా ఉంటే అది 11 శాతానికి పెరిగినట్టు చెప్పారు. -
బిల్లులతో రేటింగ్‌కు సంబంధం లేదు
► చెల్లింపుల్ని రేటింగ్‌లో చేర్చటం ఇంకా చర్చల్లోనే ఉంది ► క్రెడిట్ కార్డులు, గృహ రుణాలకు డి మాండ్ పెరిగింది ► సిబిల్ రిపోర్ట్‌తో రిటైల్ రుణాల్లో డిఫాల్టర్స్ తగ్గారు ► సిబిల్ సీనియర్ వీపీ హర్షలా చందోర్కర్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : క్రెడిట్ స్కోర్ లెక్కించడంలో టెలిఫోన్, మొబైల్, విద్యుత్, బీమా, వాటర్ వంటి బిల్లుల చెల్లింపులను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదని క్రెడిట్ రేటింగ్ సంస్థ సిబిల్ స్పష్టం చేసింది. ఈ చెల్లింపులను పరిగణనలోకి తీసుకోవాలన్న అంశం ఇంకా చర్చల దశలోనే ఉందని, దీనికి ఇంకా నియంత్రణ సంస్థల నుంచి అనుమతి రావాల్సి ఉందని సిబిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హర్షలా చందోర్కర్ తెలిపారు. క్రెడిట్ రేటింగ్ ఇవ్వడంలో కేవలం క్రెడిట్ కార్డులు, రుణాల చెల్లింపులను మాత్రమే ప్రస్తుతం పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. వ్యక్తిగత సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, బీమా పథకాలు క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయలేవని తెలియజేశారు. ‘‘ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు గానీ, ఏ రకమైన రుణాలను గానీ తీసుకోకపోయి ఉంటే వారి గురించి సిబిల్ ఎలాంటి నివేదికా ఇవ్వదు’’ అని చందోర్కర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశీయ రుణాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించే నిమిత్తం గురువారమిక్కడ విలేకరులతో ఆమె మాట్లాడారు. గత నాలుగేళ్ళుగా గృహ, ఆటో రుణాలతో పాటు క్రెడిట్ కార్డుల వినియోగం కూడా దేశంలో పెరుగుతోందన్నారు. ‘గతేడాది తొలి 3 నెలల్లో 8 లక్షల క్రెడిట్‌కార్డులు జారీ అయ్యాయి. ఈ ఏడాది అదే సమయంలో 10.8 లక్షల కార్డులు జారీ అయ్యాయి. డిమాండ్ వృద్ధికి ఇదే నిదర్శనం’ అని చెప్పారామె. క్రెడిట్ కార్డులకు ముంబైలో డిమాండ్ అధికంగా ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్లున్నాయని తెలియజేశారు. తగ్గుతున్న ఎన్పీఏలు బ్యాంకులు సిబిల్ రిపోర్ట్ ఆధారంగా రుణాలు ఇస్తుండటంతో ఎన్పీఏలు గణనీయంగా తగ్గుతున్నట్లు చందోర్కర్ చెప్పారు. బ్యాంకులు ఇస్తున్న రుణాల్లో 80 శాతం క్రెడిట్ స్కోర్ 750 దాటినవే ఉండటంతో రుణ ఎగవేతలు బాగా తగ్గాయన్నారు. 2010లో క్రెడిట్ కార్డుల డిఫాల్టర్స్ శాతం 3.27 శాతం నుంచి 1.06 శాతానికి, గృహ రుణాల్లో డిఫాల్టర్లు 1.06 శాతం నుంచి 0.57 శాతానికి తగ్గినట్లు చెప్పారు. ఇప్పటి వరకు సిబిల్లో 22 కోట్లమంది ఖాతాదారులు ఉంటే, వీరు తీసుకున్న రుణాల సంఖ్య 40.6 కోట్లుగా ఉందన్నారు. ప్రస్తుతం సిబిల్ క్రెడిట్ డేటాను 1,400 సంస్థలు వినియోగించుకుంటున్నాయని ఆమె వెల్లడించారు.