వచ్చే జనవరి 1 నుంచి 15 రోజులకోసారి సిబిల్ అప్‌డేట్
బ్యాంకులు, సిబిల్‌కు ఆర్‌బీఐ ఆదేశం
ప్రస్తుతం నెలకోసారే అప్‌డేట్
సాక్షి, అమరావతి: రుణం తీసుకుని సకాలంలో చెల్లిస్తున్న వారు సిబిల్ స్కోర్ వేగంగా పెంచుకునే అవకాశంతో పాటు సిబిల్ స్కోర్ వివాదాలు సత్వరం పరిష్కరించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అడుగు ముందుకు వేసింది. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి సిబిల్ స్కోర్‌ను అప్‌డేట్ చేయాల్సిందిగా అటు సిబిల్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలతో పాటు, రుణాలిచ్చే సంస్థలనూ ఆదేశించింది.
ఈ నిర్ణయం జనవరి1, 2025 నుంచి అమల్లోకి వస్తుందని, తదనుగుణంగా బ్యాంకులు, ఇతర ఆరి్థక సంస్థలు 15 రోజులకోసారి రుణాల మంజూరు చెల్లింపుల వివరాలను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ప్రస్తుతం నెలకోసారి బ్యాంకులు సమాచారం ఇస్తున్నాయి. ఈ సమాచారం కూడా లోపభూయిష్టంగా ఉంటుండటంతో సిబిల్ స్కోర్‌పై పలు వివాదాలు తలెత్తుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పలు సంస్థలు రోజుల వ్యవధికి కూడా రుణాలిస్తున్నాయని, ఇలా 15 రోజులకోసారి సమాచారం అప్‌డేట్ చేయడం ద్వారా అటు రుణ గ్రహీతలతో పాటు రుణాలిచ్చే సంస్థలు కూడా ప్రయోజనం పొందుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తప్పుల సవరణ 30 నుంచి 45 రోజుల్లో
అధునాతన టెక్నాలజీ అందుబాటులోకొచి్చన ఈ రోజుల్లో 15 రోజులకోసారి సమాచారం అప్‌డేట్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులుండవంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా రానున్న రోజుల్లో రియల్ టైమ్‌లో అంటే ఎప్పుడు రుణం చెల్లిస్తే అప్పుడే సిబిల్ స్కోర్ అప్‌డేట్ చేసేలా ఆర్‌బీఐ అడుగులు వేస్తోందనడానికి ఇది ఉదాహరణగా పేర్కొంటున్నారు.
ప్రస్తుతం సిబిల్ స్కోర్‌లో ఏదైనా తప్పు జరిగితే దాని సవరణకు 60 నుంచి 90 రోజుల సమయం పట్టేదని అది ఇప్పుడు 30 నుంచి 45 రోజులకు తగ్గనుండటంతో సిబిల్ స్కోర్ వివాదాలు వేగంగా పరిష్కారమవుతాయంటున్నారు. అదే విధంగా సకాలంలో చెల్లించే వారికి స్కోర్ పెరగడం ద్వారా రానున్న కాలంలో తీసుకునే రుణాలపై తక్షణ ప్రయోజనం పొందే వెసులుబాటు కలుగుతుందని, అదే విధంగా రుణ గ్రహీత ఆరి్థక పరిస్థితి కూడా తెలిసి దానికి అనుగుణంగా బ్యాంకులు నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment