cibil score
-
సిబిల్ స్కోర్ తగ్గిందా?.. ఇలా చేస్తే రాకెట్లా దూసుకెళ్తుంది
డెబిట్ కార్డు వినియోగం కంటే.. క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగిపోయింది. వేల రూపాయల జీతం తీసుకునే ఉద్యోగుల దగ్గర నుంచి లక్షల శాలరీ తీసుకునే ఉద్యోగుల వరకు, అందరూ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. అవసరానికి క్రెడిట్ కార్డును వాడుకోవడం మంచిదే.. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే సిబిల్ స్కోర్ పడిపోయే అవకాశం ఉంది. ఈ స్కోర్ పెంచుకోవడానికి ఐదు ఉత్తమ మార్గాలను ఈ కథనంలో చూసేద్దాం..సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?సిబిల్ స్కోర్ అనే పదాన్ని ఎప్పుడూ వినేవారికి కూడా.. బహుశా సిబిల్ స్కోర్ అంటే ఏమిటో తెలిసుండకపోవచ్చు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(CIBIL) అనే క్రెడిట్ బ్యూరో.. మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకుని మీకు ఇచ్చే రేటింగ్‌నే సిబిల్ స్కోర్ అంటారు.సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఈ స్కోర్ అనేది 900కి దగ్గరగా ఉంటె మంచి సిబిల్ స్కోర్ అంటారు. 750 కంటే తక్కువ ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని చెబుతారు. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే.. కొంత తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్ ఇస్తాయి. తక్కువ స్కోర్ ఉంటే.. కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వవు. ఒకవేళా ఇచ్చినా.. వడ్డీ రేటు భారీగా ఉంటుంది.సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి ఐదు మార్గాలు➤క్రెడిట్ కార్డు బిల్స్, ఈఎంఐ వంటివి సకాలంలో చెల్లించాలి. ఇది మీ సిబిల్ స్కోరును పెంచడంలో సహాయపడుతుంది. బిల్స్, ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ.. గడువుకు ముందే చెల్లింపులు పూర్తి చేయాలి.➤లోన్ కోసం మళ్ళీ మళ్ళీ వెంట వెంటనే అప్లై చేయడం మానుకోవాలి. తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయడం ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. ఇది మీ సిబిల్ స్కోర్‌ను తగ్గిస్తుంది.➤మీ పేరుతో లేదా మీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఎవరికైనా లోన్ తీసి ఇవ్వడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే లోన్ తీసుకున్న వ్యక్తి సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే.. ఆ ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద చూపిస్తుంది. రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మీరు విశ్వసిస్తే మాత్రమే.. హామీదారుగా ఉండటానికి అంగీకరించండి.➤క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుకున్నప్పటికీ.. ఖర్చులను కొంత ఆచితూచి చేయాల్సి. ఖర్చులు పెరిగితే.. మీ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది.➤సిబిల్ స్కోరును పెంచుకోవడానికి సరైన మార్గం.. క్రెడిట్ కార్డును ఉపయోగించడం మాత్రమే కాదు. సకాలంలో తిరిగి చెల్లించడం. ఇవన్నీ సరిగ్గా పాటిస్తే మీరు ఉత్తమ సిబిల్ స్కోర్ తప్పకుండా పొందుతారు. -
ప్రైవేట్ సంస్థ చేతిలో ‘సిబిల్’.. వ్యవస్థపై ఆందోళన
సిబిల్ స్కోర్ విశ్వసనీయతపై రాజకీయ రంగంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో సిబిల్ స్కోర్ వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్ యూనియన్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించే సిబిల్ స్కోర్ల విశ్వసనీయత, జవాబుదారీతనంపై ప్రశ్నలొస్తున్నాయని తెలిపారు. వ్యవస్థ పారదర్శకత, నిష్పాక్షికతపై అనుమానం వ్యక్తం చేశారు. సిబిల్ స్కోర్ నిర్వహణకు మెరుగైన యంత్రాంగం లేకపోవడాన్ని చిదంబరం నొక్కిచెప్పారు. ప్రస్తుతం అమలవుతున్న సిబిల్ నిర్వహణ చాలా మంది భారతీయులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తుందని అభిప్రాయపడ్డారు.అసలు సిబిల్ అంటే ఏమిటి? ప్రభుత్వ నిబంధనల ప్రకారం అది ఎంత ఉండాలి? దాన్ని మెరుగుపరుచుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.. అనే అంశాల గురించి తెలుసుకుందాం.సిబిల్ స్కోర్సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(సిబిల్) వారిచే ఇవ్వబడే మూడంకెల సంఖ్య. ఇది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు వాటికి సంబంధించిన చెల్లింపుల వివరాలను పరిగణలోకి తీసుకుని సిబిల్ స్కోర్ ఇస్తారు. క్రెడిట్ బ్యూరో దగ్గర వ్యక్తులు తీసుకున్న రుణాలు వాటి చెల్లింపుల వివరాలు అన్నీ ఉంటాయి. ఒక వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు? తీసుకున్న లోన్‌ను తిరిగి సకాలంలో చెల్లిస్తున్నాడా లేదా? అతనికి సంబంధించిన క్రెడిట్ కార్డు లావాదేవీలు ఇవన్నీ సిబిల్లో రికార్డు అవుతాయి. ఈ స్కోర్ 750-900 మధ్య ఉంటే మంచి రికార్డు ఉందని అర్థం.ఎక్కువగా ఉంటే..సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే త్వరగా లోన్ పొందే వీలుంటుంది. మనం కోరుకున్న రుణం మొత్తాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణం రాదని కాదు. ఒక బ్యాంకులో లోన్ ఇవ్వకయినా మరో బ్యాంకు లోన్ ఇవ్వొచ్చు. అది ఆయా బ్యాంకుల పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తక్కువ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు అప్పు ఇచ్చినా ఎక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇస్తాయి.సిబిల్ 750-900: సిబిల్ స్కోర్ 750 నుంచి 900 మధ్యలో ఉంటే ఎటువంటి లోన్ అయినా సులభంగా పొందవచ్చు. అది కూడా తక్కువ వడ్డీరేటుతో పొందే అవకాశం ఉంటుంది.స్కోర్ పెరగాలంటే..గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి.సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కారు లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్గా పరిగణిస్తారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్సెక్యూర్డ్ లోన్స్గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.క్రెడిట్ కార్డు లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. కార్డు లిమిట్లో కేవలం 30 శాతం మాత్రమే ఉపయోగించాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.ఎదుటివారు తీసుకునే రుణాలకు గ్యారెంటీగా ఉండకూడదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డీఫాల్ట్ అయితే గ్యారెంటీ మీరు కాబట్టి మిమ్మల్ని చెల్లించమంటారు. ఆ సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది.క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించేప్పుడు వీలైతే రెండు దఫాలుగా పే చేయండి. ఉదాహరణకు మీ బిల్లు రూ.12000 అనుకుందాం. పేమెంట్ తేదీ 15 నుంచి 30వ తేదీ వరకు ఉందనుకుందాం. ఈ 15 రోజుల్లో ఒకసారి రూ.6000 మరోసారి మిగిలిన రూ.6000 చెల్లించండి. దాంతో మీ పేమెంట్ రెండుసార్లు రికార్డు అవుతుంది. ఫలితంగా క్రెడిట్స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ఎయిర్టెల్, జియో పరస్పరం విరుద్ధ వాదనలుస్కోర్ తెలుసుకోవడం ఎలా?క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దానికోసం సిబిల్‌కు సంబందించిన అధికారక వెబ్సైట్ www.cibil.comలోకి వెళ్లాలి. ఆన్లైన్లో ఫారం పూర్తి చేయాలి. వ్యక్తిగత వివరాలు, పాన్ కార్డు, బ్యాంకుకు సంబందించిన వివరాలను ఇవ్వాలి. అన్ని వివరాలు ఇచ్చి సబ్మిట్ చేస్తే క్రెడిట్ రిపోర్ట్ మెయిల్ ద్వారా పంపిస్తారు. -
డబ్బు కావాలంటే ఇది చాలా కీలకం..
నెల్లూరు నగరానికి చెందిన కిశోర్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వివిధ వస్తువుల కొనుగోలు కోసం అతను ఆన్లైన్ యాప్‌లో రూ.20 వేలు రుణం తీసుకున్నాడు. సకాలంలో చెల్లించలేకపోయాడు. యాప్ నిర్వాహకులు చాలా వడ్డీ వేశారు. దీనికితోడు సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోయింది.నెల్లూరులో నివాసం ఉంటున్న సంతోష్ ఓ షోరూంలో ఏడునెలల క్రితం ఏసీ కొన్నాడు. ఐదునెలలపాటు ఈఎంఐలు సమయానికి చెల్లించాడు. వివిధ కారణాలతో ఆ తర్వాత కట్టలేకపోయాడు. దీంతో రూ.750 అపరాధ రుసుము చెల్లించాలని బ్యాంక్ వారు పేర్కొన్నారు. అదనపు చెల్లింపుల భారంతోపాటు సిబిల్ స్కోర్ సైతం తగ్గిపోయింది.నెల్లూరు సిటీ: కాలం మారిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతోంది. దీంతో జీవనశైలిలో అనేక మార్పులొచ్చాయి. నాడు ఎంతో నెమ్మదిగా జరిగిన పనులు నేడు నిమిషాల్లోనే అయిపోతున్న పరిస్థితి. ఒకప్పుడు బ్యాంక్ రుణం కావాలంటే కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. పొలం, ఇళ్ల డాక్యుమెంట్లు ఉన్నా డబ్బు ఇచ్చేందుకు బ్యాంక్‌లు ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవి. నేడు స్మార్ట్ ఫోన్లోని యాప్ నుంచి రూ.5వేల నుంచి రూ.లక్షల్లో రుణాలు పొందొచ్చు. ఇక్కడే ఒక మెలిక ఉంది. అదే సిబిల్ క్రెడిట్ స్కోర్. డబ్బు కావాలంటే ఇది చాలా కీలకం. దీని ఆధారంగా ఇప్పుడు బ్యాంక్‌లు, ఆన్లైన్ యాప్‌లు రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్కోర్‌ను 750 కంటే తగ్గకుండా చూసుకోవాల్సి బాధ్యత ఏర్పడింది. ఈఎంఐల్లోనే.. నేడు బ్యాంక్‌లు ఈఎంఐల పద్ధతిలో రుణ సౌకర్యం కల్పించాయి. చేతికి పెట్టుకునే వాచ్ నుంచి సెల్‌ఫోన్, కారు, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, ఇళ్లు కొనుగోలుకు నెల వాయిదాల విధానంలో రుణాలు తీసుకుంటున్నారు. చిన్నచిన్న వస్తువుల కోసం ఈ–కామర్స్ యాప్‌లో క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈఎంఐలు పెడుతున్నారు. అయితే కొందరు నిర్దేశిత తేదీల్లోగా ఈఎంఐ చెల్లించకపోతున్నారు. దీంతో భారీగా ఆలస్య రుసుము చెల్లించాల్సి వస్తోంది. లోన్ యాప్‌లు, ఒక్కోసారి కొన్ని బ్యాంక్‌ల ప్రతినిధుల బెదిరింపులూ తప్పడం లేదు. సులువుగా.. యాప్‌లు వచ్చిన నాటి నుంచి రుణం తీసుకోవడం సులభంగా మారిపోయింది. కేవలం పాన్‌కార్డు నంబర్ ఉంటే చాలు. సంబంధిత వెబ్సైట్ లేదా యాప్‌లో నమోదు చేయగానే కొద్ది నిమిషాల్లోనే రుణం వచ్చేది, రానిదీ తెలిసిపోతుంది. అలాగే వివిధ ఎలక్ట్రానిక్ దుకాణాలు, షాపుల్లోనూ పాన్‌కార్డు నంబర్‌ను నమోదు చేసి వెంటనే ఎంతవరకు రుణం వస్తుందో చెబుతున్నారు. దీంతో తమకు అవసరమున్నా, లేకున్నా చాలామంది ఎల్రక్టానిక్స్ వస్తువులపై ఆసక్తి చూపుతున్నారు. జీరో వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు లేదంటూ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు చెప్పే మాటలకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. ఏ ప్రయోజనం లేకుండా ఆయా సంస్థలు ఎందుకు ఇలా చేస్తాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. కనీస అవగాహన కూడా లేకుండా వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వస్తువులు తీసుకుని సకాలంలో చెల్లించలేకపోవడంతో సిబిల్ స్కోర్ గణనీయంగా పడిపోతోంది. దీనివల్ల భవిష్యత్‌లో అత్యవసరమైనప్పుడు రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతోంది.ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ.. కొత్త కొత్త లోన్ యాప్‌లు పుట్టుకుని రావడంతో యువత, విద్యార్థులు ఆ ఉచ్చులో ఇరుక్కుని పోతున్నారు. సరదాల కోసం రుణం తీసుకోవడం మొదలుపెట్టి, చివరికి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. యాప్‌లలో ఇష్టారాజ్యంగా లోన్లు తీసుకుని బెట్టింగ్‌లు, మద్యంకు బానిసవుతున్నారు. రుణాలు సమయానికి చెల్లించకపోవడంతో నిర్వాహకులు వారిని బ్లాక్మెయిల్ చేయడం, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాగా ఉన్నత చదువులకు రుణాలు తీసుకునే సమయంలో సమస్యలు త లెత్తే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. సిబిల్‌ను కాపాడుకుంటేనే.. రానున్న రోజుల్లో సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. ఇప్పటికే బ్యాంక్ రుణాలు తీసుకోవాలంటే ఇది కచ్చితంగా బాగుండాలి. రుణ చెల్లింపుల్లో ఆలస్యం చేస్తే చెక్»ౌన్స్తోపాటు సిబిల్ స్కోర్ కూడా తగ్గుతుంది. భవిష్యత్‌లో తీసుకునే రుణాలపై కూడా ప్రభావం పడుతుంది. బ్యాంక్ రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులు ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. – సీహెచ్ వెంకటసందీప్, సీఏ తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి. బ్యాంక్ స్టేట్మెంట్లు, రుణాలు తీసుకోవడంపై దృష్టి సారించాలి. ముఖ్యంగా వారి అలవాట్లను నిత్యం గమనిస్తుండాలి. చెడు మార్గంలో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – వేణు, సీఐ, నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్ -
ఇలా చేస్తే మీ సిబిల్ స్కోర్ దూసుకెళ్లడం ఖాయం!
మీరు ఏదైన లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? లేదంటే కొత్తగా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు ముందుగా సిబిల్ స్కోర్ గురించి తెలియాల్సిందే. పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ ఇలా ఏ తరహా రుణం తీసుకోవాలన్నా బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తాయి. అలాగే, క్రెడిట్ కార్డును జారీ చేయాలన్నా కచ్చితంగా క్రెడిట్ స్కోర్‌ను చూస్తాయి. స్కోర్ బాగుంటే పర్వాలేదు. లేదంటే మీ దరఖాస్తు తిరస్కరించేందుకు వీలుంటుంది.సిబిల్ స్కోరు అంటే ఏమిటి?ప్రభుత్వం ఆధీనంలోని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(సిబిల్) సంస్థ మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకుని మీకు ఇచ్చే రేటింగ్‌నే సిబిల్ స్కోర్ అంటారు. మీరు గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన తీరు, మీ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు వంటివి రికార్డు చేస్తుంది. గతంలో మీరు తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడంలో ఎప్పుడైనా విఫలమయ్యారా? మీరు ఇచ్చిన చెక్ ఎప్పుడైనా బౌన్స్ అయిందా ? అనే అంశాల ఆధారంగా ఈ సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. ప్రతి బ్యాంక్ రుణాలు ఇచ్చే ముందు ఈ సిబిల్ స్కోర్‌ను తప్పకుండా పరిశీలిస్తుంది.ఈ స్కోర్ 300-900 వరకు ఉంటుంది. అధిక స్కోర్(750 కంటే ఎక్కువ) ఉంటే మీకు రుణాలు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు సిద్ధంగా ఉంటాయి. నిబంధనల ప్రకారం తదుపరి ధ్రువపత్రాలు పరిశీలించి రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ 600 కంటే తక్కువగా ఉంటే రుణాల కోసం చేసుకున్న దరఖాస్తును రద్దు చేసే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!స్కోర్ పెరగాలంటే..గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి.సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కారు లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్గా పరిగణిస్తారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్సెక్యూర్డ్ లోన్స్గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.క్రెడిట్ కార్డు లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. కార్డు లిమిట్లో కేవలం 30 శాతం మాత్రమే ఉపయోగించాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.ఎదుటివారు తీసుకునే రుణాలకు గ్యారెంటీగా ఉండకూడదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డీఫాల్ట్ అయితే గ్యారెంటీ మీరు కాబట్టి మిమ్మల్ని చెల్లించమంటారు. ఆ సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది.క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించేప్పుడు వీలైతే రెండు దఫాలుగా పే చేయండి. ఉదాహరణకు మీ బిల్లు రూ.12000 అనుకుందాం. పేమెంట్ తేదీ 15 నుంచి 30వ తేదీ వరకు ఉందనుకుందాం. ఈ 15 రోజుల్లో ఒకసారి రూ.6000 మరోసారి మిగిలిన రూ.6000 చెల్లించండి. దాంతో మీ పేమెంట్ రెండుసార్లు రికార్డు అవుతుంది. ఫలితంగా క్రెడిట్స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. -
చిన్న కిటుకుతో సిబిల్ స్కోర్ పెంపు
సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో ఏదైనా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అందించే లోన్లు మరింత సులభంగా లభించే వీలుంటుంది. అప్పు ఇచ్చే ముందు ప్రతి ఆర్థిక సంస్థ సిబిల్‌ను చెక్ చేస్తుంది. సిబిల్ 750 కంటే ఎక్కువ ఉంటే లోన్లు జారీ చేయడం సులభం. మరి ఈ సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలుసా.. ప్రస్తుతం చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. కార్డు బకాయిలు చెల్లించే సమయంలో చిన్న కిటుకు ఉపయోగిస్తే సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘ఆరేళ్లలో 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి’క్రెడిట్‌కార్డు బిల్లు జనరేట్ అయ్యాక చెల్లింపు కోసం కొన్నిరోజులు గడువు ఇస్తారు కదా. అయితే కార్డు బిల్లును గడువులోపు ఒకేసారి పూర్తిగా చెల్లించకుండా, రెండు లేదా మూడు సార్లు చెల్లిస్తే సిబిల్ పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ఈ నెల 15వ తేదీన రూ.10,000 కార్డు బిల్లు వచ్చిందనుకుందాం. చెల్లింపు గడువు తేదీ 30 అనుకుందాం. అయితే ఈ 15 రోజుల్లో రెండుసార్లు అంటే ఒకసారి రూ.6000, మరో 5-6 రోజులకు మిగతా రూ.4000 చెల్లించాలి. దీనివల్ల పేమెంట్ రికార్డు పెరుగుతుంది. దాంతో సిబిల్ అధికమయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం గుర్తించుకోవాలి. గడువులోపు కచ్చితంగా పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. -
సిబిల్ అప్డేట్ @ 15
సాక్షి, అమరావతి: రుణం తీసుకుని సకాలంలో చెల్లిస్తున్న వారు సిబిల్ స్కోర్ వేగంగా పెంచుకునే అవకాశంతో పాటు సిబిల్ స్కోర్ వివాదాలు సత్వరం పరిష్కరించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అడుగు ముందుకు వేసింది. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి సిబిల్ స్కోర్‌ను అప్డేట్ చేయాల్సిందిగా అటు సిబిల్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలతో పాటు, రుణాలిచ్చే సంస్థలనూ ఆదేశించింది.ఈ నిర్ణయం జనవరి1, 2025 నుంచి అమల్లోకి వస్తుందని, తదనుగుణంగా బ్యాంకులు, ఇతర ఆరి్థక సంస్థలు 15 రోజులకోసారి రుణాల మంజూరు చెల్లింపుల వివరాలను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ప్రస్తుతం నెలకోసారి బ్యాంకులు సమాచారం ఇస్తున్నాయి. ఈ సమాచారం కూడా లోపభూయిష్టంగా ఉంటుండటంతో సిబిల్ స్కోర్‌పై పలు వివాదాలు తలెత్తుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పలు సంస్థలు రోజుల వ్యవధికి కూడా రుణాలిస్తున్నాయని, ఇలా 15 రోజులకోసారి సమాచారం అప్డేట్ చేయడం ద్వారా అటు రుణ గ్రహీతలతో పాటు రుణాలిచ్చే సంస్థలు కూడా ప్రయోజనం పొందుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తప్పుల సవరణ 30 నుంచి 45 రోజుల్లో అధునాతన టెక్నాలజీ అందుబాటులోకొచి్చన ఈ రోజుల్లో 15 రోజులకోసారి సమాచారం అప్డేట్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులుండవంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా రానున్న రోజుల్లో రియల్ టైమ్‌లో అంటే ఎప్పుడు రుణం చెల్లిస్తే అప్పుడే సిబిల్ స్కోర్ అప్డేట్ చేసేలా ఆర్బీఐ అడుగులు వేస్తోందనడానికి ఇది ఉదాహరణగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం సిబిల్ స్కోర్‌లో ఏదైనా తప్పు జరిగితే దాని సవరణకు 60 నుంచి 90 రోజుల సమయం పట్టేదని అది ఇప్పుడు 30 నుంచి 45 రోజులకు తగ్గనుండటంతో సిబిల్ స్కోర్ వివాదాలు వేగంగా పరిష్కారమవుతాయంటున్నారు. అదే విధంగా సకాలంలో చెల్లించే వారికి స్కోర్ పెరగడం ద్వారా రానున్న కాలంలో తీసుకునే రుణాలపై తక్షణ ప్రయోజనం పొందే వెసులుబాటు కలుగుతుందని, అదే విధంగా రుణ గ్రహీత ఆరి్థక పరిస్థితి కూడా తెలిసి దానికి అనుగుణంగా బ్యాంకులు నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని చెబుతున్నారు. -
చిన్న పేమెంట్ ఆలస్యం.. ఎంత పెద్ద నష్టం..!!
ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు అన్నది ప్రతిఒక్కరికీ అనివార్యంగా మారింది. చిన్నా, పెద్ద అన్ని పేమెంట్లకు క్రెడిట్ కార్డునే వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డులను సక్రమంగా వినియోగించపోతే పెద్ద నష్టమే ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘ది బీ, ది బీటిల్ అండ్ ది మనీ బగ్’ అనే పుస్తకంలో 844 క్రెడిట్ స్కోర్ ఉన్న సయ్యద్ అనే వ్యక్తి గురించి ఒక కేస్ స్టడీ ఉంది.ఒకసారి విదేశాలకు వెళ్తుండగా సయ్యద్ తన క్రెడిట్ కార్డుతో ఎయిర్‌పోర్టులోని స్టోర్ నుంచి ఓ పుస్తకం కొన్నాడు. అతను విదేశాల్లో ఉన్నప్పుడు, క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేట్ అయింది. అంతలోనే చెల్లింపు గడువు వచ్చింది. విదేశాల్లో ఉన్న సయ్యద్ సాంకేతిక కారణాల వల్ల నిర్ణీత తేదీకి పేమెంట్ గేట్ వేను యాక్సెస్ చేయలేకపోయాడు. దీంతో అతడు పేమెంట్ మిస్ అయ్యాడు. దీని తీవ్ర పరిణామాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి..పేమెంట్ చేయాల్సిన మొత్తం రూ.250లే అయినప్పటికీ, క్రెడిట్ స్కోర్ నష్టం ఎక్కువగా ఉంది. మొదటి నెలలో అతని స్కోరు 776 కు పడిపోయింది. సయ్యద్ భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, అతను తన బకాయిలను ఆలస్య చెల్లింపు రుసుముతో పాటు రూ.300 + వడ్డీ, జీఎస్టీ చెల్లించాడు. పూర్తి మొత్తం చెల్లించినప్పటికీ, అతని స్కోరు రెండవ నెలలో మరో 49 పాయింట్లు పడిపోయి 727 కు పడిపోయింది.దీంతోనే అయిపోలేదు. ఇంకా ఉంది.. సరిగ్గా ఇదే సమయంలో సయ్యద్ హోమ్ లోన్ ప్రయత్నాల్లో ఉన్నాడు. అతని క్రెడిట్ స్కోర్ గణనీయంగా క్షీణించినందున, ఇకపై మార్కెట్లో తక్కువ వడ్డీ రేట్లకు అర్హుడు కాదు. గతంలో ఉన్న 844 క్రెడిట్ స్కోరు ఉంటే 8.60 శాతం వడ్డీతో ఆఫర్ వచ్చేది. కానీ 727 స్కోర్‌కు 9.30 శాతం కంటే తక్కువ వడ్డీ రేటు పొందలేడు.ఆయన మొత్తం రూ .50 లక్షలు అప్పు తీసుకుంటున్నందున, అధిక రేటుకు రుణంపై వడ్డీ వ్యత్యాసం 20 సంవత్సరాలలో రూ .5.40 లక్షలు. కేవలం రూ.250 ఒక్క క్రెడిట్ కార్డు పేమెంట్ మిస్ కావడం వల్ల జరిగిన నష్టమిది. వడ్డీ రేట్లు, రుణ ఆఫర్లు మీ క్రెడిట్ స్కోర్‌తో ముడిపడి ఉన్నందున, మీ స్కోరును తెలుసుకోవడం, దానిని ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచడం చాలా ముఖ్యం. -
సిబిల్ స్కోర్ తక్కువుంటే ఏకంగా ఇంత నష్టమా?
ఒక వ్యక్తి రుణ అర్హతను నిర్ణయించడంలో క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ కీలకం. సరళంగా చెప్పాలంటే, ఇది రుణగ్రహీత ఆర్థిక ఆరోగ్యం గురించి తెలియజేస్తుంది. బ్యాంకులు, రుణదాతలు ఈ స్కోరును బట్టి కస్టమర్‌కు రుణం, క్రెడిట్ కార్డు లేదా ఇతర సేవలను ఇవ్వవచ్చో లేదో నిర్ణయించడానికి ఉపయోగిస్తారు.సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోరును మంచిగా పరిగణిస్తారు. ఈ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేటుతో సులభంగా క్రెడిట్ కార్డు లేదా రుణాన్ని పొందవచ్చు. 600 కంటే తక్కువ స్కోరు ఉంటే అప్పు పొందడాన్ని కష్టతరంగా, ఖరీదైనదిగా చేస్తుంది.రూ.19 లక్షలు అదనంగా చెల్లించాలి..మీరు రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారనుకుంటే తక్కువ క్రెడిట్ స్కోర్ కారణంగా రూ.19 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదెలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం..మీకు క్రెడిట్ స్కోర్ 820 అనుకుంటే రూ.50 లక్షల గృహ రుణం 20 ఏళ్ల కాలానికి 8.35 శాతం వడ్డీ రేటుతో పొందొచ్చు. ఈ కాల వ్యవధి పూర్తయ్యేలోపు నెలవారీ ఈఎంఐ రూ.42,918 చొప్పున మీరు తిరిగి చెల్లించే మొత్తం రూ.1.03 కోట్లు (రూ.50 లక్షల అసలు, రూ.53 లక్షల వడ్డీ) అవుతుంది.అదే మీ క్రెడిట్ స్కోర్ 580 అయితే అదే మొత్తంపై వడ్డీ రేటు 10.75 శాతం వరకు ఉంటుంది. 20 ఏళ్లలో రూ.1.21 కోట్లు (రూ.50 లక్షల అసలు, రూ.71.82 లక్షల వడ్డీ) రుణదాతకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న కారణంగా రూ .18.82 లక్షలు అదనంగా చెల్లించాలి.మంచి క్రెడిట్ స్కోరు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలుమీ క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ ఈఎంఐలు, ఇతర ఆర్థిక బాధ్యతలను సకాలంలో చెల్లించేలా చూసుకోండి. ఆలస్యంగా చెల్లింపులు లేదా డిఫాల్ట్‌లు మీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని (మీరు ఉపయోగిస్తున్న మీ క్రెడిట్ లిమిట్ శాతం) 30 శాతం కంటే తక్కువగా ఉంచుకోండి. అధిక వినియోగం అధిక క్రెడిట్ రిస్క్‌ను సూచిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.మీ క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించుకోండి. తప్పులను వెంటనే సరిదిద్దుకోవడం వల్ల మీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్‌కు అనవసరమైన నష్టాన్ని నివారించవచ్చు.రుణాలు వంటి క్రెడిట్ కోసం తరచుగా వచ్చే దరఖాస్తులు మీ నివేదికపై అనేక కఠినమైన విచారణలకు దారితీస్తాయి. ఇది మీ స్కోరును తగ్గిస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే కొత్త క్రెడిట్ కోసం దరఖాస్తు చేసుకోండి. -
లోన్ కావాలా..? సిబిల్ స్కోర్ ఎంత ఉండాలంటే..
అత్యవసర సమయంలో రుణం కావలసినపుడు బ్యాంకులను ఆశ్రయిస్తాం. ఆ సమయంలో బ్యాంకు సిబ్బంది ముందుగా మన సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తారు. ఒకవేళ మన సిబిల్ స్కోర్ బాగుంటే మనకు లోన్ ఇస్తారు. లేదంటే లోన్ ఇవ్వకపోవచ్చు. దాదాపుగా ఏ బ్యాంకు అయినా ఈ సిబిల్‌స్కోర్ ఆధారంగానే లోన్ ఇస్తుంటాయి. కాబట్టి దీని గురించి అందరికీ అవగాహన ఉండాలి. సిబిల్స్కోర్కు సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.సిబిల్ స్కోర్సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(సిబిల్) వారిచే ఇవ్వబడే మూడంకెల సంఖ్య. ఇది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు వాటికి సంబంధించిన చెల్లింపుల వివరాలను పరిగణలోకి తీసుకుని సిబిల్ స్కోర్ ఇస్తారు. క్రెడిట్ బ్యూరో దగ్గర వ్యక్తులు తీసుకున్న రుణాలు వాటి చెల్లింపుల వివరాలు అన్నీ ఉంటాయి. ఒక వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు? తీసుకున్న లోన్‌ను తిరిగి సకాలంలో చెల్లిస్తున్నాడా లేదా? అతనికి సంబంధించిన క్రెడిట్ కార్డు లావాదేవీలు ఇవన్నీ సిబిల్లో రికార్డు అవుతాయి. ఈ స్కోర్ 750-900 మధ్య ఉంటే మంచి రికార్డు ఉందని అర్థం.స్కోర్ ఎక్కువగా ఉంటే..సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే త్వరగా లోన్ పొందే వీలుంది. మనం కోరుకున్న రుణం మొత్తాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణం రాదని కాదు. ఒక బ్యాంకులో లోన్ ఇవ్వకయినా మరో బ్యాంకు లోన్ ఇవ్వొచ్చు. అది ఆయా బ్యాంకుల పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తక్కువ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు అప్పు ఇచ్చినా ఎక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇస్తాయి.సిబిల్ 750-900: సిబిల్ స్కోర్ 750 నుంచి 900 మధ్యలో ఉంటే ఎటువంటి లోన్ అయినా సులభంగా పొందవచ్చు. అది కూడా తక్కువ వడ్డీరేటుతో పొందే అవకాశం ఉంటుంది.సిబిల్ 700-749: స్కోర్ 700 నుంచి 749 మధ్యలో ఉంటే ఎలాంటి లోన్ అయినా పొందుతారు. కానీ ఎక్కువ వడ్డీ చెల్లించవలసి రావొచ్చు.సిబిల్ 650-699: ఒకవేళ మీ స్కోర్ 650 నుంచి 699 మధ్యలో ఉంటే సెక్యూర్డ్ లోన్లు పొందగలరు. అంటే కారు లేదా ఇల్లు వంటి వాటి కోసం తీసుకునే లోన్. కానీ అన్సెక్యూర్డ్ లోన్ పొందలేరు. అంటే వ్యక్తిగత అవసరాల కోసం, చదువుల కోసం తీసుకునే లోన్లు, క్రెడిట్ కార్డు లోన్లు.సిబిల్ 550 కంటే తక్కువ: ఒకవేళ మీ స్కోర్ 550 కన్నా తక్కువగా ఉంటే బ్యాంకులు మీకు లోన్ ఇవ్వడానికి అంతగా ఆసక్తిచూపవు.సిబిల్ స్కోర్ తెలుసుకోవడం ఎలా?క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దానికోసం సిబిల్‌కు సంబందించిన అధికారక వెబ్సైట్ www.cibil.comలోకి వెళ్లాలి. ఆన్లైన్లో ఫారం పూర్తి చేయాలి. వ్యక్తిగత వివరాలు, పాన్ కార్డు, బ్యాంకుకు సంబందించిన వివరాలను ఇవ్వాలి. అన్ని వివరాలు ఇచ్చి సబ్మిట్ చేస్తే క్రెడిట్ రిపోర్ట్ మెయిల్ ద్వారా పంపిస్తారు. -
ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండిలా..!
సిబిల్ స్కోరు నివేదిక చూసి, ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి ఒక అంచనాకు రావచ్చు. బ్యాంకులూ కొత్తగా అప్పు ఇచ్చేటప్పుడు దీన్ని నిశితంగా పరిశీలిస్తాయి. సిబిల్ స్కోరు 750 పాయింట్లకు మించి ఉందంటే ఆర్థిక క్రమశిక్షణ బాగుందని అర్థం. చాలా వెబ్సైట్లు, యాప్‌లు సిబిల్ స్కోర్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. అందులో ఒకటి చాలా మంది తరచుగా ఉపయోగించే గూగుల్ పే ద్వారా ఈ స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం. భారత్‌లో కోట్లాది మంది గూగుల్ పే యాప్‌ను వివిధ రకాల చెల్లింపుల కోసం వాడుతున్నారు. తొలుత దీంట్లో కేవలం నగదు బదిలీకి మాత్రమే అవకాశం ఉండేది. దశలవారీగా అనేక సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లకూ దీన్ని విస్తరించారు. ఇటీవల సిబిల్ స్కోర్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఎలా చెక్ చేసుకోవాలంటే.. గూగుల్ పే యాప్ ఓపెన్ చేయాలి ‘మేనేజ్ యువర్ మనీ’ సెక్షన్ వచ్చే వరకు స్క్రోల్ చేయాలి. అక్కడ కనిపించే ‘చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ‘Your CIBIL score does not decrease after you check it. Google Pay does not share credit report data with any 3rd party’ అనే పాప్అప్ కనిపిస్తుంది. దాని కింద సబ్మిట్ బటన్ వస్తుంది. అది క్లిక్ చేయాలి. క్షణాల్లో మీ సిబిల్ స్కోర్ తెరపై కింద కనిపిస్తుంది. ఇదీ చదవండి: రూ.20 వేలతో రూ.100 కోట్లు సంపాదించొచ్చా..? సిబిల్ స్కోర్ అంటే.. సిబిల్ అంటే ‘క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఇండియా) లిమిటెడ్’. ఇంకా సులువుగా చెప్పాలంటే రుణ హిస్టరీను అందించే సంస్థ. ఇది ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఆర్బీఐ) ఆధ్వర్యంలోని క్రెడిట్ ఏజెన్సీ. సిబిల్.. వ్యక్తులకు చెందిన రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపు వ్యవహారాలు వంటి సమాచారాన్ని సేకరించి నివేదికలు తయారుచేస్తుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతర ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందజేస్తాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి సిబిల్ రుణ చరిత్ర నివేదిక, సిబిల్ స్కోర్‌ను తయారుచేస్తుంది. సిబిల్ స్కోర్ 300-900 మధ్య ఉంటుంది. 600 కంటే తక్కువ ఉంటే ‘బ్యాడ్ సిబిల్ స్కోర్’గా పరిగణిస్తారు. అలాంటి వారికి రుణం ఇవ్వడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అని అర్థం. 750 కంటే ఎక్కువ ఉంటే మెరుగైన స్కోర్‌గా పరిగణిస్తారు. -
ఏడాది నుంచి ఇదే తంతు.. సిబిల్ స్కోర్ పడిపోతోంది, సారూ.. జీతాలు ప్లీజ్!
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది కాలంగా విద్యుత్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయూస్ జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పెద్దసంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు బ్యాంకుల నుంచి గృహ, వాహన, వ్యక్తిగత, విద్యారుణాలను తీసుకున్నారని, ప్రతి నెలా 1 నుంచి 10వ తేదీలోగా బ్యాంకులకు కిస్తీలు చెల్లించాల్సి ఉండగా, జీతాలు ఆలస్యం కావడంతో గడువులోగా చెల్లించలేకపోతున్నారని పేర్కొంది. దీంతో ఉద్యోగుల సిబిల్ స్కోర్ పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ నెల జీతాలు 11వ తేదీనాటికి కూడా చెల్లించలేదని వాపోయింది. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్‌రావు మంగళవారం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. బ్యాంకులకు కిస్తీలు చెల్లించేందుకు విద్యుత్ ఉద్యోగులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నారని వారు వాపోయారు. జీతాల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంతో ఉద్యోగులు మానసిక స్థైర్యం కోల్పోతున్నారని తెలిపారు. -
మంచి స్కోర్ ఉంటేనే బ్యాంక్ జాబ్! స్కోర్ అంటే ఎగ్జామ్‌లో కాదు..
మంచి స్కోర్ ఉంటేనే బ్యాంక్ జాబ్‌కు అర్హత సాధించగలరు. స్కోర్ అంటే ఎగ్జామ్‌లో వచ్చే స్కోర్ కాదు. ఎస్బీఐ మినహా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల భర్తీ నిర్వహించే ఉమ్మడి రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) అభ్యర్థులకు కొత్త నిబంధన విధించింది. దీని ప్రకారం అభ్యర్థులు ఆరోగ్యకరమైన సిబిల్ స్కోర్ కలిగి ఉండాలి. ఐబీపీఎస్ ఇటీవల విడుదల చేసిన భారీ క్లరికల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో అభ్యర్థులు ఆరోగ్యకరమైన క్రెడిట్ హిస్టరీని కలిగి ఉండాలని, ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ముందు కనీసం 650 సిబిల్ స్కోర్ కలిగి ఉండాలని పేర్కొంది. అయితే బ్యాంకు ఖాతా లేని అభ్యర్థులు తమ సిబిల్ స్టేటస్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని ది హిందూ పత్రిక నివేదించింది. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరే నాటికి సిబిల్ స్టేటస్‌ను అప్డేట్ చేయించుకోవాలి లేదా ప్రతికూలంగా ప్రతిబింబించే అకౌంట్లకు సంబంధించి ఎటువంటి బాకీ లేదని బ్యాంకు, రుణదాత నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌ను సమర్పించాలని నోటిఫికేషన్ స్పష్టం చేస్తోంది. సిబిల్ విఫలమైతే, అర్హత ప్రమాణాల మేరకు ఆఫర్ లెటర్‌ను ఉపసంహరిస్తామని, లేదా రద్దు చేస్తామని ఐబీపీఎస్ పేర్కొంది. సిబిల్ స్కోర్ అంటే.. సిబిల్ నివేదిక అనేది బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల వివరాలకు సంబంధించిన ఆర్థిక నివేదిక. వ్యక్తిగత క్రెడిట్ స్కోర్ అనేది వారి క్రెడిట్ హిస్టరీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల విశ్లేషణ ఆధారంగా లెక్కిస్తారు. సిబిల్తోపాటు ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్, సీఆర్ఐఎఫ్ హైమార్క్ వంటివి భారతదేశంలో క్రెడిట్ స్కోర్లను గణించే క్రెడిట్ బ్యూరోలు. సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 మధ్య ఉండే మూడు అంకెల సంఖ్య. ఇది మీ క్రెడిట్ యోగ్యతను సూచిస్తుంది. సిబిల్ నివేదికలో ఉన్న క్రెడిట్ హిస్టరీ ఆధారంగా సిబిల్ స్కోర్ రూపొందిస్తారు. హోమ్ లోన్లు, క్రెడిట్ కార్డ్‌లు, పర్సనల్ లోన్లు, ఆటోమొబైల్ లోన్లు, ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీస్‌తో పాటు ఇతర రుణాలు, వాటి చెల్లింపు చరిత్ర వంటి అన్ని వివరాలు ఈ క్రెడిట్ ప్రొఫైల్‌లో ఉంటాయి. కాగా ఐబీపీఎస్ ఈ సంవత్సరం 4,045 క్లరికల్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత మళ్లీ 500 పోస్టులను అదనంగా చేర్చింది. అంటే మొత్తం 4,545 ఖాళీలకు భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 1న ప్రారంభమైన దరఖాస్తు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జూలై 21న ముగియనుంది. ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీలో చేరినప్పుడు దీపక్ పరేఖ్ జీతం.. ఆన్లైన్లో 1978 నాటి ఆఫర్ లెటర్ -
సిబిల్ స్కోర్ సింపుల్‌గా చెక్ చేసుకోవాలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
CIBIL Score Checking: ఆధునిక కాలంలో సిబిల్ స్కోర్ మీద ప్రజల్లో అవగాహనా బాగా పెరిగింది. ఈ స్కోర్ మీద ఆధారపడి లోన్ ఇంట్రెస్ట్ ఉంటుందని ప్రస్తుతం అందరికి తెలిసింది. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి కృషి చేస్తుంటారు. అయితే సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. ఇది క్రెడిట్ హిస్టరీ సమాచారాన్ని మొత్తం సేకరించి వినియోగదారునికి సిబిల్ స్కోర్ రూపంలో తెలియజేస్తుంది. సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉన్నప్పుడు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ స్కోర్ 300 లేదా అంతకంటే తక్కువ ఉంటే దాదాపు లోన్ లభించే అవకాశం ఉండదు, ఒక వేళ లోన్ అందించినా ఎక్కువ వడ్డీ రేటుతో అందించడం జరిగుంతుంది. సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి మార్గం సరైన సమయంలో మీరు తీసుకునే లోన్ ఈఎమ్ఐ లేదా క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించడం. ఇవే మీ సిబిల్ స్కోర్ పెంచడంలో సహాయపడతాయి. (ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ పెంచుకోవాలా? ఈ తప్పులు అస్సలు చేయవద్దు..) సిబిస్ స్కోర్ చెక్ చేసుకోవడం.. సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలనుకునేనారు ముందుకి సిబిల్ అధికారిక వెబ్సైట్ లాగిన్ చేసి 'గెట్ యువర్ సిబిల్ స్కోర్' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అందులో పేరు, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత పాన్ లేదా ఆధార్ నెంబర్ వంటి ఐడీ ప్రూఫ్‌లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత పిన్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి 'యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇవన్నీ జరిగిన తరువాత రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ టైప్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత 'గో టు డాష్‌బోర్డ్' మీద క్లిక్ చేసిన తరువాత 'మైస్కోర్.సిబిల్.కమ్' కు మీ పేజ్ రీ-డైరక్ట్ అవుతుంది. 'మెంబర్ లాగిన్'పై క్లిక్ చేసిన తరువాత సిబిల్ స్కోర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అధికారిక వెబ్సైట్ ద్వారా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం కష్టం అనుకునే వారు, గూగుల్ పే యాప్ యూజర్స్ అయితే ఆ యాప్‌లో 'చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ' అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కూడా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైన పద్దది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
సిబిల్ స్కోర్ పెంచుకోవాలా? ఈ తప్పులు అస్సలు చేయవద్దు..
ఆధునిక కాలంలో CIBIL స్కోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సిబిల్ స్కోర్ అనేది లోన్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ స్కోర్ మీద ఆధారపడే మనకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి. అలాంటి సిబిల్ స్కోర్ ఏవిధంగా పెంచుకోవాలి? పెంచుకోవడానికి ఏవైనా మార్గాలున్నాయా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సిబిల్ స్కోర్ సాధారణంగా 300 నుంచి 900 వరకు ఉంటుంది. అయితే 300 వద్ద ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని, 900 వరకు ఉంటే మంచి స్కోర్ అని పరిగణిస్తారు. తక్కువ వడ్డీతో లోన్ కావాలనుకునేవారికి సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండాలి. లేదంటే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో లావాదేవీలు సరిగ్గా నిర్వహించే వ్యక్తి సిబిల్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా వున్న వ్యక్తులకు బ్యాంకులు లోన్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ స్కోర్ ఎక్కువగా ఉండే వ్యక్తుల డాక్యుమెంట్స్ కూడా పరిశీలించకుండా బ్యాంకు లోన్ వెంటనే అందిస్తుంది. ఒక వేళా సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు వడ్డీ రేటు ఎక్కువతో లోన్ అందించే అవకాశం ఉంటుంది. సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి? నిర్దిష్ట సమయంలో బకాయిలు చెల్లించడం మీరు బకాయిలను తప్పకుండా సకాలంలో క్లియర్ చేసుకోవాలి. ఒక వేళా గడువు తేదీలను మర్చిపోయినప్పుడు, రిమైండర్ వంటివి సెట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడు మీరు ఆలస్యంగా బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది మీ సిబిల్ స్కోర్ పెంచడంలో సహాయపడుతుంది. క్రెడిట్ కార్డు రిజెక్ట్ అయితే మళ్ళీ మళ్ళీ అప్లై చేయకూడదు మీకు లోన్ లేదా క్రెడిట్ కార్డు కావాలనుకున్నప్పుడు అప్లై చేసుకోవచ్చు. అయితే అది రిజెక్ట్ అయితే దాని కోసం పదే పదే అప్లై చేసుకోకూడదు. ఒక బ్యాంకు రిజెక్ట్ చేసిన తరువాత వేరే బ్యాంకులో అప్లై చేసుకుంటే అక్కడ మీ స్కోర్ తగ్గుతుంది, కావున ఒకసారి రిజెక్ట్ అయిన తరువాత స్కోర్ మళ్ళీ పెరిగే వరకు వేచి చూడాలి. (ఇదీ చదవండి: మారుతి కారు కొనాలా? ఇంతకంటే మంచి సమయం రాదు!) క్రెడిట్ కార్డు రేషియో గమనించండి మీ క్రెడిట్ కార్డుని అన్ని లావాదేవీలకు ఉపయోగించకుండా చూసుకోవాలి. అంతే కాకుండా క్రెడిట్ కార్డు రేషియో 30 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇలా చేసినప్పుడు సిబిల్ స్కోర్ పెరుగుతుంది. ఒకే సమయంలో రకరకాల లోన్స్ తీసుకోవడం మానుకోండి మీరు ఒక లోన్ తీసుకున్నప్పుడు అది పూర్తయిన తరువాత తీసుకోవడం మంచిది. అలా కాకుండా లోన్ పూర్తికాకముందే మరో లోన్ తీసుకుంటే సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. దీనిని తప్పకుండా గమనించాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
గూగుల్‌పే యూజర్లకు సర్ప్రైజ్.. ఫ్రీగా సిబిల్ స్కోర్
యూజర్లకు గూగుల్‌పే (Google pay) సర్ప్రైజ్ సర్వీస్ అందిస్తోంది. బ్యాంక్ లోన్లకు దరఖాస్తు చేసుకునేందుకు కీలకమైన సిబిల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్) స్కోరు (CIBIL Score)ను ఉచితంగా ఇస్తోంది. ఈ సిబిల్ స్కోరు వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఈ స్కోరు ఆధారంగానే బ్యాంకులు అప్పులు ఇస్తాయి. అనేక వెబ్సైట్లు, యాప్‌లు సిబిల్ స్కోర్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. ఇప్పడు గూగుల్‌పే కూడా సిబిల్ స్కోరును ఉచితంగా ఇస్తోంది. (కష్టపడ్డాడు.. వీధుల్లో పుస్తకాలు అమ్మాడు.. నేడు రూ.18 వేల కోట్లకు అధిపతి!) సిబిల్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధీకృత క్రెడిట్ ఏజెన్సీ. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందిస్తాయి. ఈ సమాచారం ఆధారంగా సిబిల్ స్కోరును తయారు చేస్తుంది. సిబిల్ స్కోర్ 300- 900 మధ్య ఉంటుంది. 600 కంటే తక్కువ ఉంటే ‘బ్యాడ్ సిబిల్ స్కోర్’గా, 750 కంటే ఎక్కువ ఉంటే మెరుగైన స్కోర్‌గా పరిగణిస్తారు. (ఫోన్‌పే దూకుడు.. కొత్త వ్యాపారాలకు నిధుల సమీకరణ) గూగుల్ పే ద్వారా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలంటే యాప్ ఓపెన్ చేసి ‘మేనేజ్ యువర్ మనీ’ సెక్షన్లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ‘చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ‘A good CIBIL score gets you better interest rates on loans. Wonder if you will have a good score?’ అనే ప్రశ్న కనిపిస్తుంది. దాని కింద కనిపించే మూడు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకొని ‘Let’s check’ ట్యాబ్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ కార్డ్‌పై ఉన్న విధంగా పేరు నమోదు చేసి కంటిన్యూ ట్యాబ్‌పై క్లిక్ చేయగానే మీ సిబిల్ స్కోర్ కనిపిస్తుంది. (గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..) -
సిబిల్ స్కోరు గురించి ఈ విషయాలు తెలియక.. తిప్పలు పడుతున్న ప్రజలు!
ప్రస్తుత రోజుల్లో రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే లోన్లు ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించేది సిబిల్ స్కోరు. ఇందులో మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు వీటితో పాటు పాత, లేదా ప్రస్తుత రుణ వివరాలు వంటి సమాచారం మొత్తం ఉంటుంది. అందుకే బ్యాంకులు, లోన్లు మంజూరు చేసే ప్రైవేటు కంపెనీలు సిబిల్ స్కోరును ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటాయి. అంతేకాదు మనకు రుణాలు మంజూరు కావడంతో సిబిల్ స్కోరు కీలకంగా కూడా వ్యవహరిస్తుంది. సాధారణంగా సిబిల్ స్కోర్ 0 నుంచి 900 వరకు ఉంటుంది. మనం లోన్లు పొందాలంటే ఈ స్కోరు 700 కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు రుణాల మంజూరు సులభంగా జరుగుతాయి. కొన్ని కారణంగా వల్ల ఒక్కోసారి ప్రజలకు తెలియకుండానే ఈ సిబిల్ స్కోరు తగ్గుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సిబిల్ స్కోరును పెంచుకోవచ్చు. ప్రస్తుతం ఆ అవేంటో చూద్దాం. స్కోరు ఇలా పెంచుకోండి క్రెడిట్ కార్డ్ యూజర్లు, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.. ఆ కార్డు పూర్తి క్రెడిట్ పరిమితిని వాడకూడదు. మీ మొత్తం క్రెడిట్ పరిమితిలో 30% కంటే ఎక్కువ లోన్ తీసుకోకూడదు. ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. వీటితో పాటు మీరు లోన్ రీపేమెంట్ తక్కువ కాలం ఎంచుకోకండి. సరైన సమయంలో చెల్లంచని పక్షంలో స్కోరు తగ్గే అవకాశం ఉంది. మీరు ఎక్కువ కాల వ్యవధిని ఎంచుకుంటే, తక్కువ EMIలను చెల్లించాలి. ఇంకా అలాగే, దాని సాధారణ చెల్లింపు మీకు చాలా సులభం అవుతుంది. మీ ఆదాయంలో క్రెడిట్ రీపేమెంట్ వాటా అనేది తక్కువగా ఉంటుంది. ఇక మీ ఆదాయం లోన్ మొత్తం కంటే ఎక్కువ కానట్లయితే, మీరు దీర్ఘకాలిక లోన్ చెల్లింపు ఎంపికను ఎంచుకోవడం ద్వారా మీ సిబిల్ రేటింగ్‌ను పెంచుకోవచ్చు. ఒకేసారి చాలా రుణాలు తీసుకోవడం మీ క్రెడిట్ రేటింగ్‌పై నెగిటివ్ మార్క్ పడుతుంది. ఎక్కువ రుణాలు తీసుకుంటే వాటి వాయిదాలను సకాలంలో చెల్లించడం చాలా కష్టమవుతుంది. ఇది మీ CIBIL స్కోర్‌పై ఖచ్చితంగా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ నేపథ్యంలో మీరు సులభంగా తిరిగి పేమెంట్ చేయగల రుణం మాత్రమే తీసుకోవాలి. ఇక మీరు కొత్త రుణం తీసుకోబోతున్నట్లయితే, దానికి ముందు ఏదైనా బకాయిలు ఉంటే చెల్లించడం ఉత్తమం. ఎందుకంటే ఇది మీ మొత్తం ఆదాయంలో రుణ చెల్లింపు వాటాను తగ్గిస్తుంది. మీ ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడంలో కనుక ఖర్చు చేస్తుంటే, బ్యాంకు మీకు కొత్త లోన్ ని సులభంగా ఇవ్వడానికి ఇష్టపడదు. చదవండి: అమెజాన్ ఆఫర్: ఇలా చేస్తే రెడ్మీ ఏ1 స్మార్ట్‌ఫోన్ రూ.1000లోపు సొంతం చేసుకోవచ్చు! -
సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా బ్యాంకు లోన్ పొందండిలా..!
-
కొత్త రూల్.. ఇకపై ఎంఎస్ఎంఈలకూ సిబిల్ స్కోరు
ముంబై: ఇప్పటివరకూ వ్యక్తులకు మాత్రమే క్రెడిట్ స్కోరు ఇస్తున్న ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజాగా చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) కూడా ర్యాంకింగ్ వ్యవస్థను ఆవిష్కరించింది. ఆన్లైన్ పీఎస్బీ లోన్స్‌తో కలిసి ’ఫిట్ ర్యాంక్’ను ప్రవేశపెట్టింది. కరెంటు అకౌంట్లు, ఆదాయపు పన్ను రిటర్నులు, జీఎస్టీ రిటర్నుల ఆధారంగా 6 కోట్ల పైచిలుకు ఎంఎస్ఎంఈలకు 1–10 స్కోరును ఇవ్వనుంది. చిన్న వ్యాపారాలకూ రుణ సదుపాయాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, అలాగే ఆర్థిక సంస్థలు మొండిబాకీల వల్ల నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న సంస్థ చెల్లింపు సామర్థ్యాలపై ఆర్థిక సంస్థ ఒక అవగాహనకు వచ్చేందుకు ర్యాంకింగ్ సహాయపడగలదని సిబిల్ ఎండీ రాజేశ్ కుమార్ తెలిపారు. కొత్తగా ఆవిష్కరించిన సాధనాన్ని ఉపయోగించి బ్యాంకులు రూ. 1 కోటి వరకూ రుణాలు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. చదవండి: న్యూ ఇయర్ ముందు.. కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ! -
సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా బ్యాంక్ లోన్ వస్తుందా!
బ్యాంక్ నుంచి పొందే లోన్ ఎటువంటిదైనా సిబిల్ స్కోర్ బాగుండాలి. సిబిల్ స్కోర్ బాగుంటేనే మనం బ్యాంక్ నుంచి అవసరమైన రుణం పొందవచ్చు. కానీ క్రెడిట్ పేమెంట్ చేయక పోవడం వల్ల బ్యాంక్‌లు రుణాల్ని ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. కానీ సిబిల్ స్కోర్ బాగాలేకపోయినా కేవలం ఒక్క పద్దతిలోనే పర్సనల్ లోన్ పొందవచ్చు. కాకపోతే అది ఎంతవరకు సాధ్యమనేది బ్యాంక్ అధికారుల నిర్ణయంపై ఆదారపడి ఉంది. వడ్డీ రేటు ఎక్కువే పర్సనల్ లోన్‌కి సిబిల్ స్కోర్ చాలా అవసరం. కాబట్టి సిబిల్ స్కోర్ తగ్గకుండా టైం టూ టైం పేమెంట్ చేసేలా చూసుకోవాలి. మనలో చాలామంది క్రెడిట్ కార్డ్ స్కోర్ తక్కువగా ఉన్నా బ్యాంక్ లోన్ల కోసం ట్రై చేస్తుంటారు. అయతే బ్యాంక్ లు లోన్లను రిజెక్ట్ చేస్తుంటాయి. అయితే ఒక్క పద్దతిలో మాత్రమే సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా లోన్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు సిబిల్ స్కోర్ సరిగ్గా లేకుండా మన లోన్ మొత్తం రూ.10లక్షలు అవసరం ఉంటే బ్యాంకులు రూ.5లక్షలు ఇచ్చేందుకు మొగ్గుచూపుతాయి. అంతకంటే ఎక్కువ రుణం ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గిపోతుంది ►క్రెడిట్ కార్డ్ విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు క్రెడిట్ కార్డ్ స్కోర్ పై ప్రభావితం చూపిస్తాయి. వాటిలో సమయానికి లోన్, ఈఎంఐ చెల్లించకపోవడం ►నాలుగైదు నెలల ఈఎంఐని ఒకేసారి కట్టడం ►తక్కువ సమయంలో ఎక్కువ క్రెడిట్ కార్డ్‌ల కోసం అప్లయి చేయడం ►క్రెడిట్ కార్డ్ ను లిమిట్‌గా వాడుకోకపోవడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. మీ క్రెడిట్ కార్డ్ స్కోర్ కనీసం 750లు అంతకంటే ఎక్కువ ఉండేలా చూసువాలి. -
క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి ఈజీ టిప్స్
-
క్రెడిట్ స్కోరు పెంచుకోవాలా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!
ప్రస్తుత రోజుల్లో అవసరాల కోసం ప్రజలు రుణాలు తీసుకోవడం తప్పనిసరిగా మారింది. అయితే బ్యాంకులు ఈ విషయంలో ముఖ్యంగా క్రెడిట్ స్కోరును పరిశీలిస్తాయి. అయితే, రుణం తీసుకోవాలనుకున్న చాలామంది ఈ క్రెడిట్ స్కోర్ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కార్డు బిల్లులను సరైన సమయానికి చెల్లించకపోయినా, క్రెడిట్ కార్డు పరిమితిని ఎక్కువసార్లు గరిష్ఠంగా వాడుకున్నా.. ఇలాంటి పనులు మన క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. దీని ద్వారా లోన్లు రాకపోగా ఒక్కోసారి తిరస్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే మీ క్రెడిట్ స్కోరు పెంచుకోవాలంటే ఈ విషయాలు తెలుసుకోవడం ఉత్తమం. పాత కార్డులతో ఇలా స్కోరు పెంచుకోవచ్చు.. మీరు పాత క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తుంటే, మీ బిల్లులను పూర్తిగా సమయానికి చెల్లిస్తూ ఉండాలి. ఈ ప్రక్రియ దీర్ఘకాలంగా కొనసాగిస్తూ ఉండాలి. దీని ద్వారా చాలం కాలంగా వాడుకలో కార్డ్ ఉండడం, దీంతో పాటు సమయానికి చెల్లింపులు కారణంగా అది మీకు మెరుగైన క్రెడిట్ స్కోరును అందిస్తుంది. అందుకే క్తొత కార్డ్‌ల కంటే పాత కార్డులతో స్కోరును సులభంగా పెంచుకోవచ్చు. పరిమితికి మించి వాడకండి మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కస్టమర్లకు కేటాయించిన పరిమితి ప్రకారం క్రెడిట్ కార్డు వినియోగం ఉండాలి. ఈ క్రమంలో కార్డ్ వాడకం లిమిట్ దాటకుండా చూసుకోవాలి. అది మీ క్రెడిట్ స్కోర్‌కు పెంచుతుంది. కానీ కార్డులో ఉన్న మొత్తం నగదుని ఉపయోగించడంతో ద్వారా క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. లోన్ తీసుకుంటే.. ఇలా చేయండి రుణం తీసుకున్నప్పుడు, తిరిగి చెల్లింపు కోసం కాల వ్యవధిని ఎక్కువ ఉండేలా చూసుకోండి. దీంతో మీ ఈఎంఐ(EMI) చెల్లింపు నగదు తక్కువగా ఉంటుంది. తద్వారా మీరు సమయానికి చెల్లింపులు చేసే వీలు ఉంటుంది. ఇది క్రెడిట్ స్కోర్‌ను పెంచుతుంది. రుణ విచారణల్లో జాగ్రత్త మీరు బ్యాంకుల్లో లోన్ల కోసం ప్రయత్నిస్తే, అవి మీ ప్రొఫైల్ గురించి క్రెడిట్ స్కోరు అందించే సంస్థల వద్ద విచారణలు మొదలుపెడతాయి. ఇక్కడ గమనించాల్సి విషయం ఏంటంటే.. కొందరు అవసరం లేకపోయినా ఎక్కువ క్రెడిట్ కార్డులు లేదా వివిధ బ్యాంకుల్లో రుణాల కోసం ప్రయత్నిస్తుంటారు. అది క్రెడిట్ స్కోరుపై రుణాత్మక ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఎక్కువ సార్లు రుణ విచారణలు చేసినా, అది కూడా వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొన్నిసార్లు రుణదరఖాస్తు తిరస్కరణకు గరవుతుంటాయి. ఇది మీరు క్రెడిట్ స్కోరు మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. చదవండి: యూకే నూతన ప్రధానిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు -
పరేషాన్ వద్దు.. లోన్ మోసాలను గుర్తించండి ఇలా!
ఆన్లైన్లో నగదు లావాదేవీలు ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరిగాయి. నగదు లావాదేవీలకు సంబంధించిన యాప్‌లు విరివిగా అందుబాటులోకి రావడంతో స్మార్ట్ఫోన్లతోనే ఆర్థిక కార్యకలాపాలు సులువుగా చక్కబెట్టుస్తున్నారు. ఇదే సమయంలో ఆన్లైన్ మోసాలు కూడా పెరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మోసగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు పాన్‌కార్డును దుర్వినియోగం చేసి రుణ మోసాలకు పాల్పడ్డారు దుండగులు. గతంలో సన్నీలియోన్ కూడా ఇదే తరహాలో మోసగాళ్ల బారిన పడ్డారు. దీంతో వారిద్దరి సిబిల్ స్కోర్ తగ్గిపోయింది. సిబిల్ స్కోర్ అంటే..? బ్యాంకులు వ్యక్తిగత రుణాలు మంజూరు చేయడానికి సిబిల్ ఇచ్చే స్కోర్(క్రెడిట్ స్కోర్)ను ప్రామాణికంగా తీసుకుంటాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ ఇచ్చే మూడంకెల సంఖ్యనే సిబిల్ స్కోర్‌గా పరిగణిస్తారు. ఈ సంఖ్య 300 నుంచి 900 వరకు ఉంటుంది. వ్యక్తిగత రుణ చరిత్ర ఆధారంగా ఈ స్కోర్ ఉంటుంది. 900 పాయింట్ల దగ్గరగా మీ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకి ఎక్కువ రుణం లభించే అవకాశాలు ఉంటాయి. ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ లేదా సీఆర్ఐఎఫ్ వంటి క్రెడిట్ బ్యూరోలు కూడా స్కోర్ అందిస్తుంటాయి. జాగ్రత్తలు పాటించాలి రుణ మోసాల నుంచి తప్పించుకోవాలంటే వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. క్రెడిట్ స్కోర్‌ను రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలి. కనీసం నెలకు ఒకసారైనా క్రెడిట్ స్కోరు చూసుకోవడం మంచిది. సిబిల్ వెబ్సైట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ స్కోరు చూసుకోవచ్చు. మీ పేరు మీద ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎంత మొత్తంలో రుణం తీసుకున్నారనే వివరాలు ఇందులో వెల్లడవుతాయి. (క్లిక్: మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారో తెలుసుకోండి ఇలా..!) ఇలా చేయొద్దు! ► ఐడీ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ► ఆధార్, పాన్‌కార్డ్ నంబర్లను మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేయొద్దు. ► స్కాన్ చేసిన ఆధార్, పాన్‌కార్డ్ కాపీలను మీ ఈ-మెయిల్లో పెట్టుకోవద్దు. ► ఈ-మెయిల్లో మీ పాన్‌కార్డ్‌ను షేర్ చేయాల్సివస్తే incognito మోడ్‌లో బ్రౌజర్‌ను వాడాలి. ► గుర్తింపు పత్రాల ఫొటో కాపీలను అటెస్ట్ చేసి మాత్రమే వాడాలి. ► ప్లబిక్ వై-ఫై వినియోగించి ఆన్లైన్ ట్రాన్టాక్షన్స్ చేయొద్దు. ► పాన్‌కార్డ్ ఇమేజ్ మీ ఫోన్లో సేవ్ చేసివుంటే.. లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఫొటోగ్యాలరీ యాక్సెస్ ఇవ్వొద్దు. వెంటనే స్పందించండి మీకు తెలియకుండా మీ పేరు ఎవరైనా రుణాలు తీసుకున్నట్టు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. క్రెడిట్ బ్యూరో వైబ్‌సైట్ ద్వారా మీ ఫిర్యాదును ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లాలి. ఆన్లైన్లో cms.rbi.org.inకు ఫిర్యాదు చేయవచ్చు. crpc@rbi..org.inకు ఈ-మెయిల్ పంపవచ్చు. (క్లిక్: మీ సిబిల్ స్కోర్ పెరగాలంటే..) -
మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారో తెలుసుకోండి ఇలా..!
గతంలో వ్యక్తిగత రుణాలు మంజూరు కావాలంటే, చాలా పెద్ద విధానం ఉండేది. కానీ, ఇప్పుడు ఈ స్మార్ట్ యుగంలో అలా కాదు. చిటికిలో రుణాలు మంజూరు అవుతున్నాయి. ప్రస్తుతం అనేక ఫిన్‌టెక్ సంస్థలు తమ మొబైల్ యాప్ ద్వారా క్షణాలలో రుణాలను మంజూరు చేస్తున్నాయి. అయితే, ఈ రుణాల మంజూరు కోసం కేవల ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే సరిపోతుంది. అయితే, ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నం అవుతుంది. భౌతిక తనిఖీ లేకుండా కేవలం ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలతో రుణం మంజూరు కావడంతో కేటుగాళ్లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని రుణాలు తీసుకుంటారు. ఈ రుణం తీసుకొని చెల్లించకపోవడంతో నిజమైన వ్యక్తికి చెందిన సీబీల్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. కొద్ది కాలం క్రితం సినీ నటి సన్నీ లియోన్ పాన్ కార్డు సహాయంతో గుర్తుతెలియని వ్యక్తులు లోన్ తీసుకున్నారని తను పేర్కొంది. లోన్ తీసుకున్న విషయం కూడా తనకు తెలియదని ఆమె తెలిపింది. దీని వల్ల తన సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడిందని ట్విట్టర్లో వివరించింది. ముఖ్యంగా ఇండియా బుల్స్‌కు చెందిన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ అయిన ధని స్టాక్స్ లిమిటెడ్‌పై ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. సన్నీలియోన్ ట్వీట్ తర్వాత అనేక మంది బాధితులు ట్విట్టర్లో తాము ఎలా మోసపోయామో వివరించారు. అయితే, ఇతరులు ఎవరైనా మన వివరాలతో దేశ వ్యాప్తంగా లోన్ తీసుకుంటే మనం తెలుసుకునే వీలు ఉంది. పేటీఎమ్, బ్యాంక్ బజార్ వంటి ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థలు వినియోగదారులకు వీటికి సంబంధించిన ఈ రిపోర్ట్స్ అందిస్తున్నాయి. ముందుగా వీటిలో మన పాన్ కార్డు, ఆధార కార్డు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు మీ క్రెడిట్ రిపోర్ట్ ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. ప్రతి నెల మనం మన క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకోవడం వల్ల ఇలాంటి మోసాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. (చదవండి: టెక్ మహీంద్రా భారీ స్కెచ్.. వెయ్యి మందితో అదిరిపోయే ప్లాన్!) -
ఫ్రీగా మీ క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోండి ఇలా..!
మనం ఏదైనా బ్యాంక్ నుంచి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మొదట ఆ బ్యాంక్ చూసేది మన క్రెడిట్ స్కోర్‌నే. క్రెడిట్ స్కోరు బాగున్న వ్యక్తులకే బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. అదే మీ క్రెడిట్ స్కోరు గనుక తక్కువగా ఉంటే రుణం ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకాడతాయి. ఒకవేళ రుణం ఇచ్చినా ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి రావొచ్చు. గృహ, వాహన, వ్యక్తిగత రుణాల విషయంలో క్రెడిట్ స్కోరు చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే, భవిష్యత్‌లో మనం రుణాలు తీసుకోవాలంటే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. అందుకే, మన క్రెడిట్ స్కోర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ఉత్తమం. గతంలో ఈ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలంటే కొంత మొత్తం చెల్లించాల్సి వచ్చేది. కానీ, ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉచితంగా క్రెడిట్ స్కోర్ అందిస్తున్నాయి. ఏలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా పేటీఎం తన యూజర్ల కోసం క్రెడిట్‌స్కోర్‌ను ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పేటీఎం తెచ్చిన ఈ సదుపాయంతో యాక్టివ్ క్రెడిట్ కార్డ్, రుణ ఖాతా వివరాలతో సహా వివరణాత్మక క్రెడిట్ నివేదికలను కూడా చూడవచ్చును. అలాగే వినియోగదారులు సిబిల్ స్కోర్‌ను ఎలా మెరుగుపరచాలి, క్రెడిట్ రిపోర్ట్‌ను ఏవిధంగా అర్థం చేసుకోవాలి, రుణం పొందటానికి మంచి సిబిల్ స్కోరు కలిగి ఉండటం వంటి విషయాలను కూడా పేటియం అందిస్తోంది. ఇప్పుడు పేటీఎం ద్వారా ఫ్రీగా క్రెడిట్ స్కోర్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫ్రీగా క్రెడిట్‌స్కోర్‌ను పేటీఎంలో తెలుసుకోండి ఇలా: ముందుగా మీ పేటియం యాప్‌ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత హోమ్ స్క్రీన్‌లో కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ విభాగంలో ఉన్న ఫ్రీ క్రెడిట్ స్కోర్ మీద క్లిక్ చేయండి. మీకు మీ సమాచారం ఉన్న ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ పాన్‌కార్డ్ నంబర్, పుట్టినతేదీని ఎంటర్ చేయండి. మీరు మొదటిసారిగా చెక్ చేసుకుంటున్నట్లు ఉంటే మీ ప్రొఫైల్ ధృవీకరణ కోసం ఓటిపీ వస్తోంది. ఓటీపీను ఎంటర్ చేసిన కొద్ది నిమిషాలకే మీకు మీ క్రెడిట్ స్కోర్ మీ కళ్ల ముందు కనిపిస్తోంది. అంతేగాకుండా మీరు ఇంకా డిటైల్‌గా రిపోర్ట్‌ను తెలుసుకోవాలంటే వ్యూ డిటేల్ఢ్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు పూర్తి సమాచారం కన్పిస్తుంది. క్లిక్ చేసిన వెంటనే మీకు మీరు జాతీయ, రాష్ట్ర, జిల్లా వారిగా మీ క్రెడిట్ స్కోర్ ఎక్కడ ఉందో చూపిస్తోంది. వాటితో పాటుగా ఫ్యాక్టర్స్ ఇంపాక్టింగ్ యువర్ క్రెడిట్ స్కోర్‌ను కూడా చూపిస్తోంది. (చదవండి: 2021లో తెగ వెతికిన టాప్-5 ఎస్యువీ కార్లు ఇవే..!) -
హోం లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు, ఇళ్లకు డిమాండ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగల కాలంలో (దీపావళి వరకు కొనసాగే సీజన్) ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంటుందని రియల్ ఎస్టేట్ డెవలపర్లు, కన్సల్టెంట్లు అంచనా వేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ అన్ని రకాల గృహ రుణాలను 6.7 శాతానికే ఇస్తున్నట్టు ప్రకటించడం, పలు ఇతర బ్యాంకులు సైతం గృహ రేట్లను గణనీయంగా తగ్గించడం డిమాండ్‌కు ఊతమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కోటక్ బ్యాంకు సైతం గృహ రుణ రేట్లను గణనీయంగా తగ్గించగా.. మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కూడా ఇదే విధమైన నిర్ణయాలు ప్రకటించొచ్చని రియల్ ఎస్టేట్ పరిశ్రమ అంచనా వేస్తోంది. చదవండి : లోన్ తీసుకునేవారికి బ్యాంకులు బంపర్ ఆఫర్స్ సానుకూల నిర్ణయం.. రుణం ఎంతనే దానితో సంబంధం లేకుండా క్రెడిట్ స్కోరు ఆధారితంగా గృహ రుణాలను 6.70 శాతం నుంచి ఆఫర్ చేస్తున్నట్టు ఎస్బీఐ గురువారం ప్రకటించడం గమనార్హం. అంతకుముందు వరకు రూ.75 లక్షల వరకు రుణాలపై 7.15 శాతం వడ్డీ రేటు అమల్లో ఉండేది. దీనిపై అనరాక్ గ్రూపు చైర్మన్ అనుజ్‌పురి స్పందిస్తూ.. ‘‘ఎస్బీఐ నిర్ణయం నిజంగా పోటీనిస్తుంది. ఈ కొత్త రేటు ప్రజాస్వామ్యయుతంగా ఉంది. ఏ బడ్జెట్లో కొనుగోలు చేసే వారైనా ప్రయోజనం పొందొచ్చు’’ అని చెప్పారు. ఎస్బీఐ సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ సీజన్లో గృహ నిర్మాణ రంగం మంచిగా పుంజుకుంటుందన్నారు. ప్రాసెసింగ్ ఫీజుల మాఫీ కూడా సానుకూల నిర్ణయంగా పేర్కొన్నారు. హౌసింగ్ డాట్ కామ్, మకాన్, ప్రాప్‌టైగర్ పోర్టళ్ల గ్రూపు సీఈవో వికాస్ వాధ్వాన్ సైతం ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇప్పటికే డిమాండ్ ఊపందుకున్న గృహ నిర్మాణ రంగానికి మరింత ప్రోత్సాహాన్నిస్తుందన్నారు. ధరలు స్తబ్ధుగా ఉన్నందున కొనుగోలుదారులకు కొంత ఆదా కూడా అవుతుందన్నారు.ప్రముఖ బ్యాంకులు రుణ రేట్లను తగ్గించడం ప్రేరణనిస్తుందని సోతెబీ ఇంటర్నేషనల్ రియాలిటీ సీఈవో అమిత్ గోయల్ అన్నారు. చదవండి: లోన్ ఇవ్వనందుకు ఎస్బీఐకి మొట్టికాయ