మనం ఏదైనా బ్యాంక్ నుంచి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మొదట ఆ బ్యాంక్ చూసేది మన క్రెడిట్ స్కోర్‌నే. క్రెడిట్ స్కోరు బాగున్న వ్యక్తులకే బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. అదే మీ క్రెడిట్ స్కోరు గనుక తక్కువగా ఉంటే రుణం ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకాడతాయి. ఒకవేళ రుణం ఇచ్చినా ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి రావొచ్చు. గృహ, వాహన, వ్యక్తిగత రుణాల విషయంలో క్రెడిట్ స్కోరు చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే, భవిష్యత్‌లో మనం రుణాలు తీసుకోవాలంటే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి.
అందుకే, మన క్రెడిట్ స్కోర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ఉత్తమం. గతంలో ఈ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలంటే కొంత మొత్తం చెల్లించాల్సి వచ్చేది. కానీ, ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉచితంగా క్రెడిట్ స్కోర్ అందిస్తున్నాయి. ఏలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా పేటీఎం తన యూజర్ల కోసం క్రెడిట్‌స్కోర్‌ను ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పేటీఎం తెచ్చిన ఈ సదుపాయంతో యాక్టివ్ క్రెడిట్ కార్డ్, రుణ ఖాతా వివరాలతో సహా వివరణాత్మక క్రెడిట్ నివేదికలను కూడా చూడవచ్చును.
అలాగే వినియోగదారులు సిబిల్ స్కోర్‌ను ఎలా మెరుగుపరచాలి, క్రెడిట్ రిపోర్ట్‌ను ఏవిధంగా అర్థం చేసుకోవాలి, రుణం పొందటానికి మంచి సిబిల్ స్కోరు కలిగి ఉండటం వంటి విషయాలను కూడా పేటియం అందిస్తోంది. ఇప్పుడు పేటీఎం ద్వారా ఫ్రీగా క్రెడిట్ స్కోర్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్రీగా క్రెడిట్‌స్కోర్‌ను పేటీఎంలో తెలుసుకోండి ఇలా:
- ముందుగా మీ పేటియం యాప్‌ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి.
- ఆ తర్వాత హోమ్ స్క్రీన్‌లో కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి.
- లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ విభాగంలో ఉన్న ఫ్రీ క్రెడిట్ స్కోర్ మీద క్లిక్ చేయండి.
- మీకు మీ సమాచారం ఉన్న ఒక విండో ఓపెన్ అవుతుంది.
- అందులో మీ పాన్‌కార్డ్ నంబర్, పుట్టినతేదీని ఎంటర్ చేయండి.
- మీరు మొదటిసారిగా చెక్ చేసుకుంటున్నట్లు ఉంటే మీ ప్రొఫైల్ ధృవీకరణ కోసం ఓటిపీ వస్తోంది.
- ఓటీపీను ఎంటర్ చేసిన కొద్ది నిమిషాలకే మీకు మీ క్రెడిట్ స్కోర్ మీ కళ్ల ముందు కనిపిస్తోంది.
- అంతేగాకుండా మీరు ఇంకా డిటైల్‌గా రిపోర్ట్‌ను తెలుసుకోవాలంటే వ్యూ డిటేల్ఢ్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు పూర్తి సమాచారం కన్పిస్తుంది.
- క్లిక్ చేసిన వెంటనే మీకు మీరు జాతీయ, రాష్ట్ర, జిల్లా వారిగా మీ క్రెడిట్ స్కోర్ ఎక్కడ ఉందో చూపిస్తోంది.
- వాటితో పాటుగా ఫ్యాక్టర్స్ ఇంపాక్టింగ్ యువర్ క్రెడిట్ స్కోర్‌ను కూడా చూపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment