credit score
-
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే!
ఆర్థిక పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. నెలకు లక్షల రూపాయలు సంపాదించేవారు కూడా క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు, కావలసినప్పుడు లోన్స్ కూడా తీసుకుంటున్నారు. అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత లోన్స్ తీసుకోవచ్చు. కానీ పర్సనల్ లోన్ తీసుకునే ముందు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. లేకుంటే తీసుకున్న అసలు కంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.సిబిల్ స్కోర్బ్యాంకు లోన్ ఇవ్వాలంటే సిబిల్ స్కోర్ చూస్తుంది. మంచి సిబిల్ స్కోర్ ఉంటే ఎక్కువ బ్యాంక్స్ మీకు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి. లేకుంటే లోన్ లభించడం కొంత కష్టమనే చెప్పాలి. ఒకవేళా మీకు లోన్ లభించినా వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.వడ్డీ రేటులోన్ తీసుకునే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన మరో విషయం వడ్డీ రేటు. ఎందుకంటే ఒక్కో బ్యాంక్ ఒక్కో వడ్డీ రేటుతో లోన్ అందిస్తుంది. కాబట్టి తక్కువ వడ్డీతో లోన్ ఇచ్చే బ్యాంకుల వద్ద నుంచి లోన్ తీసుకోవడం ఉత్తమం. ఇది మీరు తిరిగీ చెల్లించాల్సిన ఈఎమ్ఐలను సులభతరం చేస్తుంది. ఏ బ్యాంక్ ఎంత వడ్డీకి లోన్ ఇస్తుందనే విషయాలను అధికారిక వెబ్సైట్లలో లేదా బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవచ్చు.లోన్ వ్యవధిలోన్ తీసుకునే వ్యక్తి.. తిరిగి ఎన్ని నెలల్లో చెల్లచగలుగుతాడో, సంపాదన ఎంత వంటి వాటిని బేరీజు వేసుకుని వ్యవధిని ఎంచుకోవచ్చు. పర్సనల్ లోన్ వ్యవధి 12 నెలల నుంచి 60 నెలల మధ్య ఉంటుంది. అయితే 36 నెలలు లేదా మూడు సంవత్సరాలకు మించి ఎక్కువ టైమ్ తీసుకోకపోవడం మీకే మంచిది. అయితే ఇది ఖచ్చితంగా అందరూ పాటించాల్సిన అవసరం లేదు.లోన్ ఎక్కడ నుంచి తీసుకోవాలి (బ్యాంకు/ఎన్బీఎఫ్సీ)పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వ్యక్తి.. బ్యాంకు నుంచి తీసుకోవాలా? లేదా ఎన్బీఎఫ్సీ నుంచి తీసుకోవాలా? అని సొంతంగా నిర్దారించుకోవాలి. బ్యాంకు నుంచి తీసుకోవడం చాలా ఉత్తమం అని నిపుణులు చెబుతారు. లోన్ తీసుకోవడానికి కొంత ఆలస్యమైనా బ్యాంకు నుంచే తీసుకోవడం మంచిది. ఇందులో ఎలాంటి అవకతవకలకు తావుండదు.ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంక్ ఫైనాన్సియల్ కంపెనీలు) నుంచి కూడా లోన్ తీసుకోవచ్చు. కానీ ఇందులో కొన్నిసార్లు మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో డాక్యుమెంట్స్ ఎక్కువ అవసరం లేదు. ఎన్బీఎఫ్సీలో లోన్ తీసుకోవాలనుకునే వారు ముందుగా ఆ సంస్థ గురించి తెలుసుకోవాలి. -
చిన్న పేమెంట్ ఆలస్యం.. ఎంత పెద్ద నష్టం..!!
ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు అన్నది ప్రతిఒక్కరికీ అనివార్యంగా మారింది. చిన్నా, పెద్ద అన్ని పేమెంట్లకు క్రెడిట్ కార్డునే వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డులను సక్రమంగా వినియోగించపోతే పెద్ద నష్టమే ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘ది బీ, ది బీటిల్ అండ్ ది మనీ బగ్’ అనే పుస్తకంలో 844 క్రెడిట్ స్కోర్ ఉన్న సయ్యద్ అనే వ్యక్తి గురించి ఒక కేస్ స్టడీ ఉంది.ఒకసారి విదేశాలకు వెళ్తుండగా సయ్యద్ తన క్రెడిట్ కార్డుతో ఎయిర్‌పోర్టులోని స్టోర్ నుంచి ఓ పుస్తకం కొన్నాడు. అతను విదేశాల్లో ఉన్నప్పుడు, క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేట్ అయింది. అంతలోనే చెల్లింపు గడువు వచ్చింది. విదేశాల్లో ఉన్న సయ్యద్ సాంకేతిక కారణాల వల్ల నిర్ణీత తేదీకి పేమెంట్ గేట్ వేను యాక్సెస్ చేయలేకపోయాడు. దీంతో అతడు పేమెంట్ మిస్ అయ్యాడు. దీని తీవ్ర పరిణామాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి..పేమెంట్ చేయాల్సిన మొత్తం రూ.250లే అయినప్పటికీ, క్రెడిట్ స్కోర్ నష్టం ఎక్కువగా ఉంది. మొదటి నెలలో అతని స్కోరు 776 కు పడిపోయింది. సయ్యద్ భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, అతను తన బకాయిలను ఆలస్య చెల్లింపు రుసుముతో పాటు రూ.300 + వడ్డీ, జీఎస్టీ చెల్లించాడు. పూర్తి మొత్తం చెల్లించినప్పటికీ, అతని స్కోరు రెండవ నెలలో మరో 49 పాయింట్లు పడిపోయి 727 కు పడిపోయింది.దీంతోనే అయిపోలేదు. ఇంకా ఉంది.. సరిగ్గా ఇదే సమయంలో సయ్యద్ హోమ్ లోన్ ప్రయత్నాల్లో ఉన్నాడు. అతని క్రెడిట్ స్కోర్ గణనీయంగా క్షీణించినందున, ఇకపై మార్కెట్లో తక్కువ వడ్డీ రేట్లకు అర్హుడు కాదు. గతంలో ఉన్న 844 క్రెడిట్ స్కోరు ఉంటే 8.60 శాతం వడ్డీతో ఆఫర్ వచ్చేది. కానీ 727 స్కోర్‌కు 9.30 శాతం కంటే తక్కువ వడ్డీ రేటు పొందలేడు.ఆయన మొత్తం రూ .50 లక్షలు అప్పు తీసుకుంటున్నందున, అధిక రేటుకు రుణంపై వడ్డీ వ్యత్యాసం 20 సంవత్సరాలలో రూ .5.40 లక్షలు. కేవలం రూ.250 ఒక్క క్రెడిట్ కార్డు పేమెంట్ మిస్ కావడం వల్ల జరిగిన నష్టమిది. వడ్డీ రేట్లు, రుణ ఆఫర్లు మీ క్రెడిట్ స్కోర్‌తో ముడిపడి ఉన్నందున, మీ స్కోరును తెలుసుకోవడం, దానిని ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచడం చాలా ముఖ్యం. -
సిబిల్ స్కోర్ తక్కువుంటే ఏకంగా ఇంత నష్టమా?
ఒక వ్యక్తి రుణ అర్హతను నిర్ణయించడంలో క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ కీలకం. సరళంగా చెప్పాలంటే, ఇది రుణగ్రహీత ఆర్థిక ఆరోగ్యం గురించి తెలియజేస్తుంది. బ్యాంకులు, రుణదాతలు ఈ స్కోరును బట్టి కస్టమర్‌కు రుణం, క్రెడిట్ కార్డు లేదా ఇతర సేవలను ఇవ్వవచ్చో లేదో నిర్ణయించడానికి ఉపయోగిస్తారు.సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోరును మంచిగా పరిగణిస్తారు. ఈ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేటుతో సులభంగా క్రెడిట్ కార్డు లేదా రుణాన్ని పొందవచ్చు. 600 కంటే తక్కువ స్కోరు ఉంటే అప్పు పొందడాన్ని కష్టతరంగా, ఖరీదైనదిగా చేస్తుంది.రూ.19 లక్షలు అదనంగా చెల్లించాలి..మీరు రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారనుకుంటే తక్కువ క్రెడిట్ స్కోర్ కారణంగా రూ.19 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదెలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం..మీకు క్రెడిట్ స్కోర్ 820 అనుకుంటే రూ.50 లక్షల గృహ రుణం 20 ఏళ్ల కాలానికి 8.35 శాతం వడ్డీ రేటుతో పొందొచ్చు. ఈ కాల వ్యవధి పూర్తయ్యేలోపు నెలవారీ ఈఎంఐ రూ.42,918 చొప్పున మీరు తిరిగి చెల్లించే మొత్తం రూ.1.03 కోట్లు (రూ.50 లక్షల అసలు, రూ.53 లక్షల వడ్డీ) అవుతుంది.అదే మీ క్రెడిట్ స్కోర్ 580 అయితే అదే మొత్తంపై వడ్డీ రేటు 10.75 శాతం వరకు ఉంటుంది. 20 ఏళ్లలో రూ.1.21 కోట్లు (రూ.50 లక్షల అసలు, రూ.71.82 లక్షల వడ్డీ) రుణదాతకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న కారణంగా రూ .18.82 లక్షలు అదనంగా చెల్లించాలి.మంచి క్రెడిట్ స్కోరు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలుమీ క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ ఈఎంఐలు, ఇతర ఆర్థిక బాధ్యతలను సకాలంలో చెల్లించేలా చూసుకోండి. ఆలస్యంగా చెల్లింపులు లేదా డిఫాల్ట్‌లు మీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని (మీరు ఉపయోగిస్తున్న మీ క్రెడిట్ లిమిట్ శాతం) 30 శాతం కంటే తక్కువగా ఉంచుకోండి. అధిక వినియోగం అధిక క్రెడిట్ రిస్క్‌ను సూచిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.మీ క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించుకోండి. తప్పులను వెంటనే సరిదిద్దుకోవడం వల్ల మీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్‌కు అనవసరమైన నష్టాన్ని నివారించవచ్చు.రుణాలు వంటి క్రెడిట్ కోసం తరచుగా వచ్చే దరఖాస్తులు మీ నివేదికపై అనేక కఠినమైన విచారణలకు దారితీస్తాయి. ఇది మీ స్కోరును తగ్గిస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే కొత్త క్రెడిట్ కోసం దరఖాస్తు చేసుకోండి. -
అద్భుతమైన క్రెడిట్ స్కోర్.. ఈ ఆరు తప్పులు అస్సలు చేయొద్దు!
క్రెడిట్ స్కోర్ అనేది ఆర్థిక ఆరోగ్యానికి కీలకమైన అంశం. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే అధిక రుణాలు వేగంగా పొందవచ్చు. అలాగే అనుకూలమైన వడ్డీ రేట్లు కూడా లభిస్తాయి. అయితే మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడానికి శ్రద్ధ, తెలివైన ఆర్థిక నిర్ణయాలు అవసరం. సాధారణంగా చేసే కొన్ని తప్పుల కారణంగా క్రెడిట్ తగ్గిపోతుంది. క్రెడిట్ స్కోర్‌ను 700 కంటే ఎక్కువగా ఉండాలంటే సరిదిద్దుకోవాల్సిన ఆరు తప్పుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. క్రెడిట్ రిపోర్ట్‌లో లోపాలు క్రెడిట్ నిర్వహణలో అత్యంత కీలకమైన అంశాలలో ఒకటి క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించడం. ఇందులో ఏవైనా లోపాలుంటే వెంటనే పరిష్కరించుకోవడంలో విఫలమైతే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకావశం ఉంటుంది. చెల్లింపులు విస్మరించడం ఆలస్యంగా చేసిన లేదా విస్మరించిన చెల్లింపులు క్రెడిట్ స్కోర్‌పై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అది క్రెడిట్ కార్డ్ అయినా, తనఖా అయినా లేదా మరేదైనా రుణమైనా, సకాలంలో చెల్లింపులు చాలా కీలకం. గడువు తేదీలు దాటిపోకుండా రిమైండర్లు లేదా ఆటోమేటిక్ చెల్లింపులను సెటప్ చేసుకోండి. హైరిస్క్ లోన్లలో సహ సంతకం చేయడం తెలిసిన వారి ఎవరైనా రుణాలు తీసుకుంటున్నప్పుడు చాలా మంది సహ సంతకాలు చేస్తుంటారు. ఇది సహాయకమైన చర్యగా అనిపించినా సహ సంతకం చేసిన వ్యక్తి చెల్లింపుల్లో విఫలమైతే అది మీ క్రెడిట్ స్కోర్ నేరుగా ప్రభావితమవుతుంది. సహ సంతకం చేయడానికి ముందు, రుణగ్రహీత ఆర్థిక బాధ్యత, రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పూర్తిగా అంచనా వేయండి. క్రెడిట్ కార్డ్ పరిమితిని దాటడం క్రెడిట్ కార్డ్ పరిమితిని దాటడం లేదా అధిక బ్యాలెన్స్‌ని కలిగి ఉండటం మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. బాధ్యతాయుతమైన క్రెడిట్ వినియోగాన్ని ప్రదర్శించడానికి మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లను పరిమితి కంటే తక్కువగా ఉంచడం, ఆదర్శంగా 30% కంటే తక్కువగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకోండి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌కు సానుకూలంగా దోహదపడుతుంది. ఏకకాలంలో ఎక్కువ దరఖాస్తులు రుణాలు లేదా క్రెడిట్ కార్డ్‌ల కోసం ఏకకాలంలో ఎక్కువ దరఖాస్తులు చేస్తే రుణదాతలు ఆర్థిక అస్థిరతగా భావించవచ్చు. ప్రతి అప్లికేషన్ కోసం మీ క్రెడిట్ రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గిస్తుంది. పాత క్రెడిట్ ఖాతాలను మూసివేయడం పాత క్రెడిట్ ఖాతాలను మూసివేయడం అనేది వివేకవంతమైన చర్యగా అనిపించవచ్చు. అయితే ఇది మీ క్రెడిట్ స్కోర్‌కు హాని కలిగించే అవకాశం ఉంది. ఎక్కువ క్రెడిట్ హిస్టరీ ఉండటం అనేది క్రెడిట్ స్కోర్‌ను లెక్కించడంలో ఒక అంశం. పాత ఖాతాలను మూసివేయడం వల్ల క్రెడిట్ హిస్టరీ తగ్గిపోయే అవకాశం ఉంది. -
పసిడి విలువను అర్థం చేసుకోవడం ఎలా? గోల్డ్ లోన్ గురించి తెలుసుకుందామా..
శతాబ్దాలుగా అనేక సంస్కృతుల్లో సమృద్ధి, సంపదకు పర్యాయపదంగా పసిడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆర్థిక భద్రతకు విశ్వసనీయమైన సాధనంగా కూడా ఉంటోంది. పసిడితో ప్రయోజనాలు పొందే మార్గాల్లో బంగారం రుణం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో బంగారం రుణాలను డీకోడ్ చేసేందుకు, పసిడి విలువను తెలియజెప్పేందుకు ప్రయత్నమే ఈ కథనం. పసిడి ఆభరణాలను (18–24 క్యారట్ల స్వచ్ఛత కలిగినవి) తనఖా పెట్టి తీసుకునే రుణాలను గోల్డ్ లోన్‌గా వ్యవహరిస్తారు. సురక్షితమైన గ్యారంటీగా పరిగణిస్తారు కాబట్టి మిగతా అన్సెక్యూర్డ్ రుణాలతో పోలిస్తే గోల్డ్ లోన్‌ను వేగవంతంగా, సులభతరంగా పొందవచ్చు. పసిడి విలువను అర్థం చేసుకోవడం.. తక్షణ లిక్విడిటీ: ఇతర అసెట్లతో పోలిస్తే బంగారాన్ని వేగంగా లిక్విడేట్ చేయొచ్చు. అంటే దాన్ని సత్వరం విక్రయించి నగదు పొందవచ్చు లేదా తనఖా ఉంచి రుణాన్నీ తీసుకోవచ్చు. ఈ లిక్విడిటీ కారణంగానే బంగారాన్ని తనఖా పెట్టినప్పుడు ఆర్థిక సంస్థలు రుణ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తుంటాయి. రుణ పరిమాణం విషయంలో సౌలభ్యత: సాధారణంగా బంగారం విలువలో నిర్దిష్ట శాతంగా రుణ మొత్తం ఉంటుంది. బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి మీ పసిడి క్రెడిట్ విలువ కూడా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మీ దగ్గరున్న బంగారం విలువను తరచుగా మదింపు చేసుకుంటూ ఉంటే వాటిపై ఎంత రుణం లభించే అవకాశం ఉంటుందనేది తెలుసుకోవచ్చు. వడ్డీ రేటు తక్కువ: బంగారం రుణాలు సురక్షితమైనవి కావడంతో రుణదాతలకు రిస్కు తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తక్కువ వడ్డీకే ఇచ్చేందుకు వీలుంటుంది. అయితే, ఇది రుణమిచ్చే సంస్థ, లోన్–టు–వేల్యూ నిష్పత్తి ప్రకారం మారుతుంటుంది. క్రెడిట్ స్కోరుపరమైన ప్రయోజనాలు: క్రెడిట్ హిస్టరీ లేనివారికి లేక క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నవారికి బంగారం రుణాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. క్రెడిట్ హిస్టరీ పెద్దగా లేకపోయినా బంగారంపై రుణాలిచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. సకాలంలో తిరిగి చెల్లించేస్తే మీ క్రెడిట్ స్కోరుపైనా సానుకూల ప్రభావం ఉండగలదు. రీపేమెంటులో సౌలభ్యం: చాలా మటుకు సంస్థలు నెలావారీగా చెల్లింపులు, వడ్డీని ముందస్తుగా కట్టి.. అసలును ఆఖర్లో కట్టడం లాంటి వివిధ రకాల రీపేమెంట్ ఆప్షన్స్ ఇస్తున్నాయి. గుర్తుంచుకోవాల్సిన అంశాలు .. బంగారంపై రుణాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశాలూ కొన్ని ఉన్నాయి. అవేమిటంటే... ధరల్లో హెచ్చుతగ్గులు: బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. రేటు భారీగా పడిపోయిందంటే రుణాలిచ్చిన సంస్థలు మరింత ఎక్కువ విలువైన వాటిని తనఖా పెట్టాలని అడగొచ్చు లేదా వ్యత్యాసాన్ని చెల్లించమని అడగొచ్చు. విలువ–రుణ నిష్పత్తి: బంగారం పూర్తి రేటుపై బ్యాంకులు రుణాలివ్వవు. పసిడి విలువలో నిర్దిష్ట శాతం మాత్రమే ఇస్తాయి. ఇది బ్యాంకు, నియంత్రణ నిబంధనలను బట్టి 60–90 శాతంగా ఉండొచ్చు. భద్రత: మీ బంగారాన్ని సురక్షితంగా ఉంచేలా రుణాలిచ్చే సంస్థ తగిన భద్రతా చర్యలు తీసుకుంటోందా లేదా చూసుకోవాలి. చివరిగా చెప్పేదేమిటంటే బంగారమనేది అలంకారానికి, ఏళ్లకు ఏళ్లు లాకర్లలో భద్రపర్చుకునేందుకు మాత్రమే పరిమితమైనది కాదు. సరిగ్గా వాడుకుంటే ఆర్థిక సమస్యల వేళ ఎంతగానో ఉపయోగపడగలదు. అయితే, మిగతా అన్ని ఆర్థిక సాధనాల్లాగే బంగారం రుణాల షరతులను పూర్తిగా అర్థం చేసుకోవడం, మెరుగైన డీల్ లభించేలా చూసుకోవడం ముఖ్యం. -
స్కోర్ కొట్టు... లోన్ పట్టు!
అనుకోకుండా ఖర్చు వచ్చి పడితే ఏం చేయాలో తోచదు. వైద్యం, ఇంటి మరమ్మతులు, వేతనంలో కోత, ఉద్యోగం కోల్పోవడం, స్కూల్ ఫీజు.. అవసరం ఏదైనా వెంటనే డబ్బు కావాల్సి వస్తే.. క్రెడిట్ కార్డు నుంచి పరిమితి మేరకు డ్రా చేసుకుని గట్టె్టక్కేస్తుంటారు. ఇది కాకుండా అందుబాటులో ఉన్న మరో మార్గం వ్యక్తిగత రుణం (పర్సనల్ లోన్). హామీతో పని లేకుండా ఆదాయ వనరు ఉన్న ప్రతి ఒక్కరూ సులభంగా పొందగలిగి రుణం ఇది. దాదాపు అన్ని బ్యాంకులు మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న కస్టమర్లకు పర్సనల్ లోన్ ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తుంటాయి. వేగంగా ఒకటి రెండు రోజుల్లోనే రుణం మొత్తం చేతికి అందుతుంది. ప్రక్రియ ఎంతో సులభం, అందుకే నేటి రోజుల్లో పర్సనల్ లోన్ సాధనాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకుంటున్నారు. అయితే, వ్యక్తిగత రుణం అయినా, గృహ రుణం అయినా వడ్డీ రేటు విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. దీనివల్ల పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. కనీసం ఐదారేళ్ల కాలానికి వ్యక్తిగత రుణాలను బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అన్నేళ్లలో వడ్డీ రూపేణా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల్సి వస్తుంది. అందుకని వీలైనంత తక్కువ వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణాన్ని పొందే మార్గాలను అన్వేషించాలి. వీటిపై అవగాహన కల్పించే కథనమే ఇది. వ్యక్తిగత రుణం తీసుకునే వారు ముందు పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రాసెసింగ్ ఫీజును పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే, వడ్డీ రేటు ఆధారంగా బ్యాంక్‌ను ఖరారు చేసుకోవాలి. ఖాతా ఉన్న బ్యాంకులోనే వ్యక్తిగత రుణం పొందాలనేమీ లేదు. తక్కువ రేటుకు వస్తుంటే ఇతర బ్యాంకుల ఆఫర్లను అయినా పరిశీలించొచ్చు. అయితే తక్కువ రేటుకు వ్యక్తిగత రుణం పొందేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ఇందులో ముందుగా వ్యక్తిగత క్రెడిట్ స్కోరును పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఒకవైపు మన వ్యక్తిగత రుణ చరిత్ర బలంగా ఉండేలా (మెరుగైన స్కోర్) చూసుకోవాలి. మరోవైపు తక్కువ రేటుకు వ్యక్తిగత రుణాన్ని ఆఫర్ చేసే బ్యాంక్‌లను గుర్తించాలి. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు కొంచెం తక్కువ రేటుకు రుణాన్నిచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి. ఎందుకంటే ఆ రుణం నమ్మకంగా తిరిగి వస్తుంది. డిఫాల్ట్ అవకాశాలు ఉండవు. రిస్క్ దాదాపుగా ఉండదు కనుక తక్కువ రేటుకు ఇస్తాయి. ‘‘వ్యక్తిగత రుణాన్ని ఎలాంటి తనఖా లేదా హామీ లేకుండా బ్యాంకులు ఇస్తాయి. కనుక బ్యాంకులు ఎంత రుణం ఇవ్వాలి, ఎంత కాలానికి ఇవ్వాలి, ఎంత వడ్డీ రేటుకు ఇవ్వాలనే అంశాలను నిర్ణయించే విషయంలో రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు కీలక పాత్ర పోషిస్తుంది. అధిక క్రెడిట్ స్కోరు ఉన్న వారు వడ్డీ రేటు తగ్గించాలంటూ బ్యాంకులను డిమాండ్ చేయవచ్చు’’అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, సహజ్‌మనీ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ సూచించారు. (పెళ్లికొడుకు లుక్‌లో జబర్దస్త్‌గా..మస్క్: ఫోటోలు వైరల్) క్రెడిట్ కార్డు బ్యాలెన్స్‌ను ఉపయోగించుకునే వారు సకాలంలో బిల్లులను చెల్లించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డిఫాల్ట్ కాకూడదు. అలాగే, రుణం ఏదైనా కానీయండి ఈఎంఐల చెల్లింపుల విషయంలో బాధ్యతగా, క్రమశిక్షణగా వ్యవహరించాలి. వీలుంటే ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరిగే ఆప్షన్ నమోదు చేసుకోవాలి. వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావిస్తుంటే, అప్పటికే ఉన్న ఇతర రుణాలను తీర్చివేయడం వల్ల కూడా క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. ‘‘మీ క్రెడిట్ కార్డ్ వినియోగ చరిత్ర చాలా సాఫీగా ఉండాలి. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను కొన్ని రోజులు కూడా ఆలస్యం చేయొద్దు. ఒకటి రెండు సార్లు సకాలంలో చెల్లింపులు చేయకపోయినా, అది క్రెడిట్ చరిత్రలో మచ్చగా చేరొచ్చు. అప్పుడు రుణాలిచ్చే సంస్థలు దీన్ని రిస్క్‌గా భావిస్తాయి. రుణ వడ్డీ రేటును ప్రభావితం చేస్తుంది’’ అని ఇన్‌క్రెడ్ రిస్క్ అండ్ అనలైటిక్స్ ప్రెసిడెంట్ పృథ్వీ చంద్రశేఖర్ తెలిపారు. అవగాహన లేక క్రెడిట్ కార్డ్, వాహన, ఇతర రుణ వాయిదాల చెల్లింపుల్లో వైఫల్యం చోటుచేసుకుంటే అది భవిష్యత్తులో వారు తీసుకోబోయే రుణాలపై అధిక రేట్లకు దారితీస్తుందని గమనించాలి. అందుకే బ్యాంక్‌లు రుణ చరిత్రలో మచ్చలు ఉండి, రిస్క్ ఖాతాలుగా భావిస్తే అటువంటి వారికి సాధారణం కంటే అధిక వడ్డీ రేటుకే రుణాలు మంజూరు చేస్తాయి. అదే సమయంలో చెల్లింపుల్లో ఎలాంటి వైఫల్యం లేని, మెరుగైన రుణ చరిత్ర ఉన్న వారికి తక్కువ రేటుకు ఆఫర్ చేస్తాయి. ఆఫర్లు.. వ్యక్తిగత రుణం తీసుకునే ముందు వివిధ బ్యాంకుల ఆఫర్లను, రుణ రేట్లు, నియమ, నిబంధనలు, షరతులు అన్నీ చూడాలి. ఆ తర్వాతే ఆకర్షణీయమైన ఆఫర్‌ను వినియోగించుకోవాలి. ముందుగా వేతన ఖాతా, డిపాజిట్లు ఉన్న బ్యాంకును అడిగి చూడాలి. ఆ తర్వాత వివిధ బ్యాంకుల రుణ రేట్లు, ఇతర ఆఫర్ల సమాచారం పొందొచ్చు. సాధారణంగా బ్యాంకుల వెబ్సైట్లో వ్యక్తిగత రుణాలపై ఫిక్స్డ్ రేటు ప్రదర్శించరు. కనిష్టం నుంచి గరిష్టం రేటును ప్రదర్శిస్తాయి. మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి అందులో కనిష్ట రేటుకే రుణం లభించే అవకాశాలున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ‘‘రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు ఒక్కటే కాకుండా, కోరుకుంటున్న రుణం మొత్తం, లోన్ టు వ్యాల్యూ రేషియో, నెలవారీ ఆదాయం, ఉద్యోగ స్వరూపం, ఇతర అంశాలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి’’ అని పైసా బజార్ సీనియర్ డైరెక్టర్ సని అరోరా తెలిపారు. కొన్ని బ్యాంకులు పండుగలు, ఇతర సమయాల్లో ప్రత్యేక రుణ మేళాలను నిర్వహిస్తుంటాయి. ఆ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, వడ్డీ రేటుపై రాయితీలు ఇస్తుంటాయి. కనుక వాటిని పరిశీలించొచ్చు. వీలైనన్ని రుణ సంస్థల మధ్య వ్యక్తిగత రుణ ఆఫర్లను పోల్చుకోవాలని అరోరా సూచించారు. ప్రముఖ సంస్థల ఉద్యోగులకు కొన్ని బ్యాంకులు కార్పొరేట్ డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అలాంటివి ఏవైనా ఉన్నాయేమో చూడాలి. (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు) మార్గాలు.. రుణ చెల్లింపులు సకాలంలో చేయడం వల్ల క్రెడిట్ స్కోరుపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. రుణ వినియోగ రేషియో కూడా క్రెడిట్ స్కోరు లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంటే మీకు అందుబాటులో ఉన్న రుణం పరిమితిలో ఎంత వినియోగించుకున్నారనేది. రుణంపై మీరు ఏ మేరకు ఆధారపడుతున్నారో ఇది తెలియజేస్తుంది. నిపుణుల సూచన ప్రకారం.. క్రెడిట్ యూసేజ్ రేషియో 30 శాతం లోపు కొనసాగించాలి. ఉదాహరణకు క్రెడిట్ కార్డుపై రూ.1 లక్ష క్రెడిట్ లిమిట్ ఉందని అనుకుందాం. అప్పుడు మీ వినియోగం రూ.30 వేల వరకు ఉండాలి. ఒకటికి మించి క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఒకే సమయంలో ఎక్కువ రుణాలకు దరఖాస్తు చేస్తుండడం కూ డా క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభా వం చూపి స్తుంది. అందుకే ఒకేసారి వెంటవెంట ఒక టికి మించిన క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవద్దు. అంతేకాదు ఒకటికి మించిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద వ్యక్తిగత రుణానికి అభ్యర్థనలు ఇవ్వొ ద్దు. దీనివల్ల ఏకకాలంలో ఒకటికి మించిన క్రెడిట్ అ భ్యర్థనల సమాచారం క్రెడిట్ బ్యూరోలకు చేరుతుంది. అది క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. (అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్‌వర్త్ గురించి తెలుసా?) వేతన ఖాతా.. ఉద్యోగులకు పర్సనల్ లోన్ విషయంలో బ్యాంకుల నుంచి మంచి ఆఫర్లు లభిస్తుంటాయి. వేతన ఖాతా ఉన్న బ్యాంకు నుంచి తీసుకోవడం అనుకూలమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ నెలవారీ వేతన జమ, మీ ఖర్చులు, ఉపసంహరణ వివరాలు ఖాతాలో నమోదై ఉంటాయి. కనుక రుణానికి ముందు బ్యాంక్ అధికారి వాటిని చూసి ఓ అంచనాకు రాగలరు. అందుకే వేతన ఖాతాలున్న వారికి ఇన్స్టంట్ పర్సనల్ లోన్‌ను చాలా బ్యాంకులు డిజిటల్‌గా ఆఫర్ చేస్తుంటాయి. బ్యాంకు సిబ్బందితో మాట్లాడి తక్కువ రేటుకు రుణం పొందొచ్చు. ‘‘బ్యాంకులు సాధారణంగా తమ ఖాతాదారులకు సంబంధించి నియమ నిబంధనలు, షరతుల విషయంలో కొంచెం అనుకూలంగానే వ్యవహరిస్తుంటాయి. అంటే వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు తగ్గించడం, వేగంగా మంజూరు చేస్తాయి. సంబంధిత ఖాతాదారుకు సంబంధించి వేతనం, ఇతర వ్యయాల సమాచారం అందుబాటులో ఉండడం వల్ల ఆర్థిక స్థిరత్వం, సామర్థ్యాన్ని బ్యాంకులు అంచనా వేయగలవు’’అని అప్నా పైసా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వీ స్వామినాథన్ పేర్కొన్నారు. ఇతర చార్జీలనూ చూడాలి.. వ్యక్తిగత రుణంలో ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇతర చార్జీలను పరిగణనలోకి తీసుకోవాలి. రుణంపై వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ముందుగా తీర్చేస్తే పడే చార్జీలు తెలుసుకుని నిర్ణయానికి రావాలి. కొన్ని బ్యాంకులు ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇతర బ్యాంకులు రుణం మొత్తంపై 1–3 శాతం మధ్య ప్రాసెసింగ్ ఫీజు విధిస్తున్నాయి. రుణం ముందుగా చెల్లిస్తే విధించే చార్జీలు కూడా బ్యాంకుల మధ్య వేర్వేరుగా ఉంటాయి. అందుకే భవిష్యత్తులో ముందుగా తీర్చివేసే ఉద్దేశం ఉందా అని చూడాలి. వడ్డీ రేటుపై అవగాహన... తక్కువ రేటుపై వ్యక్తిగత రుణాన్ని తీసుకున్నా.. రుణం కాల వ్యవధిలో వడ్డీ రూపంలో పెద్ద మొత్తమే చెల్లిస్తుంటారు. ముందుగా బ్యాంకులు రుణంపై వడ్డీ రేటును ఎలా లెక్కిస్తాయన్నది తెలుసుకోవాలి. ఫ్లాట్ రేటు, లేదా తగ్గింపు రేటును బ్యాంకులు ఆఫర్ చేయొచ్చు. ఫ్లాట్ వడ్డీ రేటు అయితే రుణం కాల వ్యవధి అంతటా అసలు మొత్తం (ప్రిన్సిపల్)పైనే వడ్డీ రేటు అమలవుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షల రుణాన్ని 12 శాతం రేటుపై మూడేళ్లకు తీసుకున్నారనుకోండి. మొత్తం మీద రూ.1,80,000ను వడ్డీ కింద చెల్లించాలి. నెలవారీ ఈఎంఐ రూ.18,889 అవుతుంది. అదే తగ్గింపు వడ్డీ రేటు విధానంలో.. ప్రతీ వాయిదాకు ముందు మిగిలిన ఉన్న బకాయిపైనే వడ్డీ రేటును బ్యాంకులు లెక్కిస్తాయి. రూ. 5 లక్షల రుణాన్ని తగ్గింపు రేటు విధానంలో 12 శాతం రేటుపై మూడేళ్లకు తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు మూడేళ్లలో వడ్డీ రూపేణా రూ.97,858 చెల్లించాల్సి వస్తుంది. నెలవారీ ఈఎంఐ రూ.16,607 అవుతుంది. దీంతో మొత్తం మీద ఈ విధానం వల్ల రూ.82,142 ఆదా అవుతుంది. అందుకే రెడ్యూసింగ్ ఇంటరెస్ట్ రేట్ విధానంలోనే వ్యక్తిగత రుణాన్ని తీసుకోవాలి. పర్సనల్ లోన్‌పై తక్కువ రేటుకు ఇస్తామంటే బుట్టలో పడిపోకుండా.. రుణంపై వడ్డీ రేటును నెలవారీ ఎలా లెక్కిస్తారో అడిగి స్పష్టత తెచ్చుకోవాలి. -
గూగుల్‌పే యూజర్లకు సర్ప్రైజ్.. ఫ్రీగా సిబిల్ స్కోర్
యూజర్లకు గూగుల్‌పే (Google pay) సర్ప్రైజ్ సర్వీస్ అందిస్తోంది. బ్యాంక్ లోన్లకు దరఖాస్తు చేసుకునేందుకు కీలకమైన సిబిల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్) స్కోరు (CIBIL Score)ను ఉచితంగా ఇస్తోంది. ఈ సిబిల్ స్కోరు వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఈ స్కోరు ఆధారంగానే బ్యాంకులు అప్పులు ఇస్తాయి. అనేక వెబ్సైట్లు, యాప్‌లు సిబిల్ స్కోర్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. ఇప్పడు గూగుల్‌పే కూడా సిబిల్ స్కోరును ఉచితంగా ఇస్తోంది. (కష్టపడ్డాడు.. వీధుల్లో పుస్తకాలు అమ్మాడు.. నేడు రూ.18 వేల కోట్లకు అధిపతి!) సిబిల్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధీకృత క్రెడిట్ ఏజెన్సీ. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందిస్తాయి. ఈ సమాచారం ఆధారంగా సిబిల్ స్కోరును తయారు చేస్తుంది. సిబిల్ స్కోర్ 300- 900 మధ్య ఉంటుంది. 600 కంటే తక్కువ ఉంటే ‘బ్యాడ్ సిబిల్ స్కోర్’గా, 750 కంటే ఎక్కువ ఉంటే మెరుగైన స్కోర్‌గా పరిగణిస్తారు. (ఫోన్‌పే దూకుడు.. కొత్త వ్యాపారాలకు నిధుల సమీకరణ) గూగుల్ పే ద్వారా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలంటే యాప్ ఓపెన్ చేసి ‘మేనేజ్ యువర్ మనీ’ సెక్షన్లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ‘చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ‘A good CIBIL score gets you better interest rates on loans. Wonder if you will have a good score?’ అనే ప్రశ్న కనిపిస్తుంది. దాని కింద కనిపించే మూడు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకొని ‘Let’s check’ ట్యాబ్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ కార్డ్‌పై ఉన్న విధంగా పేరు నమోదు చేసి కంటిన్యూ ట్యాబ్‌పై క్లిక్ చేయగానే మీ సిబిల్ స్కోర్ కనిపిస్తుంది. (గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..) -
క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఇవి పాటించకపోతే మీ జేబుకు చిల్లు ఖాయం!
ఇటీవల క్రెడిట్ కార్డ్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి కొత్త కొత్త పేర్లతో క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే రివార్డ్‌లు, తక్కువ వడ్డీలు, ఆఫర్లను అందించేవి బోలెడు ఉన్నా పూర్తిగా తెలుసుకోకుండా వాటిని ఉపయోగిస్తే అవి మన జేబులకు చిల్లు పెట్టే అవకాశం కూడా ఉందండోయ్. అందుకే కేవలం కంపెనీలు అందిస్తున్న ప్రయోజనాలు మాత్రమే కాకుండా మీ అవసరాలకు ఎలాంటి క్రెడిట్ కార్డు సరిపోతుందో తెలుసుకోవాలి. ఆపై వాటిని తీసుకోవడం ఉత్తమం. సాధారణంగా ఒక వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోరు ఆధారంగా క్రెడిట్ కార్డు అర్హత లభిస్తుంది. ఇవి తీసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుందాం! వినియోగం బట్టి కార్డు ఎంపిక ఉత్తమం ముఖ్యంగా మీరు కార్డుని ఎలా వాడుకుంటారు అనేది క్రెడిట్ కార్డు ఎంపికలో కీలకం. ఉదాహరణకు కొందరు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తుంటారు. అలాంటప్పుడు షాపింగ్ వెబ్సైట్లు,బ్రాండ్లపై డిస్కౌంట్లు అందించే కార్డును ఎంచుకుంటే మంచిది. లేదా మార్కెటింగ్ పని చేస్తున్నవారు ద్విచక్రవాహనంపై ఎక్కువగా తిరిగే అవకాశం ఉన్నందున.. పెట్రోలుపై క్యాష్ బ్యాక్, అధిక రివార్డు పాయింట్లు అందించే కార్డును పరిశీలించాల్సి ఉంటుంది. మీ వాడకం బట్టి ఏ తరహా కార్డు కావాలో ఎంపిక చేసుకోండి. అంతేకాకుండా ,డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, రివార్డ్ వంటి ప్రయోజనాలు ఎలా పనిచేస్తాయన్న విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోని అనంతరం అవగాహనతో మీ కార్డును వినియోగించడం ఉత్తమం. ►మీ ఆదాయం, క్రెడిట్ స్కోరు ఆధారంగా బ్యాంకులు మీ క్రెడిట్ కార్డుకి పరిమితిని నిర్ణయిస్తాయి. పరిమితిలో 50 శాతానికి మించి ఉపయోగించకపోవడమే ఉత్తమం. లేదంటే అది క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ► కొన్ని బ్యాంకులు వాటి కార్డులపై వార్షిక రుసుములు వసూలు చేయడం లేదు. అయితే ఆ నిబంధన కూడా కొన్ని పరిమితులకు లోబడి ఉంటాయి. సంవత్సరంలో కస్టమర్ ఒక నిర్ణీత మొత్తం ఖర్చు చేసినప్పుడే ఈ రకమైన బెనిఫిట్ పొందగలరు. అన్నింటికంటే ముఖ్యమైనది కార్డు బిల్లుని గడువు తేది లోపు చెల్లించాలి. చదవండి: బడ్జెట్ 2023: కేంద్రం ఫోకస్ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా! -
కొత్త రూల్.. ఇకపై ఎంఎస్ఎంఈలకూ సిబిల్ స్కోరు
ముంబై: ఇప్పటివరకూ వ్యక్తులకు మాత్రమే క్రెడిట్ స్కోరు ఇస్తున్న ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజాగా చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) కూడా ర్యాంకింగ్ వ్యవస్థను ఆవిష్కరించింది. ఆన్లైన్ పీఎస్బీ లోన్స్‌తో కలిసి ’ఫిట్ ర్యాంక్’ను ప్రవేశపెట్టింది. కరెంటు అకౌంట్లు, ఆదాయపు పన్ను రిటర్నులు, జీఎస్టీ రిటర్నుల ఆధారంగా 6 కోట్ల పైచిలుకు ఎంఎస్ఎంఈలకు 1–10 స్కోరును ఇవ్వనుంది. చిన్న వ్యాపారాలకూ రుణ సదుపాయాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, అలాగే ఆర్థిక సంస్థలు మొండిబాకీల వల్ల నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న సంస్థ చెల్లింపు సామర్థ్యాలపై ఆర్థిక సంస్థ ఒక అవగాహనకు వచ్చేందుకు ర్యాంకింగ్ సహాయపడగలదని సిబిల్ ఎండీ రాజేశ్ కుమార్ తెలిపారు. కొత్తగా ఆవిష్కరించిన సాధనాన్ని ఉపయోగించి బ్యాంకులు రూ. 1 కోటి వరకూ రుణాలు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. చదవండి: న్యూ ఇయర్ ముందు.. కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ! -
క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి ఈజీ టిప్స్
-
బ్యాంకుకు వెళ్లిన సాగర్‌కు మతి పోయినంతపనైంది.. భద్రం బ్రదరూ! ఇంతకూ ఏమైంది?
సాగర్‌కు రెండు క్రెడిట్ కార్డులున్నాయి. పరిమితి కూడా ఎక్కువ. దేనికైనా వీటినే వాడుతూ ఉంటాడు. క్రెడిట్ స్కోరుకు ఢోకా లేకుండా బిల్లు కరెక్టుగా చెల్లిస్తుంటాడు. కానీ ఈ మధ్య ఓ లోన్కోసం వెళితే... తన క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందన్నారు. రిపోర్టు చూసి అదిరిపడ్డాడు సాగర్. ఎందుకంటే తన పేరిట 5 క్రెడిట్ కార్డులున్నాయి. వాటిలో కొన్నింటికి బకాయిలున్నాయి. మరికొన్నిటి చెల్లింపులు ఆలస్యమయ్యాయి. దానివల్లే క్రెడిట్ స్కోరు తగ్గింది. బ్యాంకుకు వెళ్లి ఇదేంటని అడిగిన సాగర్‌కి... విషయం తెలిసి మతి పోయినంతపనైంది. ఇంతకీ ఏంటది? సాధారణంగా షాపింగ్‌కో, ఆన్లైన్ పేమెంట్లకో క్రెడిట్ కార్డు వాడటం సాగర్‌కు అలవాటు. కానీ ఈ మధ్య ఆన్లైన్లో అత్యంత సౌకర్యంగా ఉండటంతో ఇన్స్టంట్ లోన్/పేమెంట్ యాప్‌లను ఎడాపెడా వాడటం మొదలెట్టాడు. తరువాత చెల్లింవచ్చు కదా (పోస్ట్ పెయిడ్) అనే ఉద్దేశంతో చాలా యాప్‌లలో కొంత మొత్తం చొప్పున వాడేశాడు. వాటిలో కొన్నింటి గడువు తేదీ వారం రోజులే!. మరికొన్నింటికి 10 రోజులు– 15 రోజులు ఇలా బిల్లింగ్ సైకిల్స్ ఉన్నాయి. అంత తక్కువ వ్యవధి కావటంతో వాటిని తిరిగి చెల్లించటంలో కిరణ్ అంత శ్రద్ధ పెట్టలేకపోయాడు. ఇవిగో... ఇవే సిబిల్ రిపోర్టులో కొంప ముంచాయి. పోస్ట్‌పెయిడ్–లోన్ యాప్స్ వేరువేరు కస్టమర్లను ఆకట్టుకోవటానికి కొన్ని... వ్యాపారాన్ని పెంచుకోవటానికి కొన్ని. కారణమేదైనా ఇపుడు చాలా కంపెనీలు పోస్ట్‌పెయిడ్ మొదలెట్టేశాయి. అంటే... ‘ఇప్పుడు కొను–తరువాత చెల్లించు’ (బీఎన్‌పీఎల్) అన్నమాట. షాపింగ్ యాప్‌లతో పాటు సర్వీసులందించే యాప్‌లు కూడా వీటిని అందిస్తున్నాయి. ఉదాహరణకు క్యాబ్ అగ్రిగేటర్ ‘ఓలా’నే తీసుకుంటే... క్యాబ్ బుక్ చేసిన వెంటనే చెల్లించాల్సిన పనిలేదు. కొంత మొత్తం పరిమితికి లోబడి... ఓలా పోస్ట్ పెయిడ్ సేవలందిస్తోంది. ఆ మొత్తం వరకూ సర్వీసులు వాడుకోవచ్చు. ఈలోపు బిల్లింగ్ తేదీ వస్తే బిల్లు అందుతుంది. చెల్లిస్తే సరి. మరిచిపోతే కాస్త జరిమానాలూ ఉంటాయి. ఓలాతో పాటు ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి కూడా కొంత పరిమితి వరకూ ‘పే లేటర్’ సేవలందిస్తున్నాయి. ఇదంతా పోస్ట్‌పెయిడ్ వ్యవహారం. లోన్‌యాప్స్ కూడా ఇంచుమించుగా... మారుతున్న కాలానికి తగ్గట్టుగా క్రెడిట్ కార్డుల్లానే ఆన్లైన్ లోన్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. కార్డులు లేకున్నా, వాలెట్లలో డబ్బులు లేకున్నా సరే... ఈ యాప్స్‌తో అప్పటికప్పుడు ఈజీగా పే చేసేయొచ్చు. లేజీ పే, సింపుల్, బుల్లెట్, పేటీఎం పోస్ట్‌పెయిడ్, ఫ్రీచార్చ్ పే లేటర్, మొబిక్విక్ జిప్ పేలేటర్, పే లేటర్ బై ఐసీఐసీఐ... ఇవన్నీ అలాంటివే. ఆన్లైన్లో కొన్న వస్తువుకో, అందుకున్న సర్వీసుకో దీనిద్వారా తక్షణం చెల్లించేయొచ్చు. బిల్లులు కూడా. వీటన్నిటినీ కూడా క్రెడిట్కార్డుల్లానే భావించాల్సి ఉంటుంది. అందించేవన్నీ ఆర్థిక సేవల కంపెనీలే కాబట్టి... సిబిల్ జాబితాలో వీటిని కూడా క్రెడిట్ కార్డుల్లానే చూడాల్సి వస్తుంది. చిన్నచిన్న పేమెంట్లే కనక వీటి చెల్లింపు గడువు కూడా తక్కువే. జరిమానాలూ ఎక్కువే. ఉదాహరణకు 100 రూపాయల బిల్లు గనక చెల్లించకపోతే... మరో 100 ఫైన్ కట్టాల్సి రావచ్చు. ఎందుకంటే చాలా సంస్థలు కనీస ఫైన్ మొత్తాన్ని ఈ రకంగా నిర్ధారిస్తున్నాయి. శాతంలోనైతే ఇది 100. చాలామందికి రూ.100 అనేది చిన్న మొత్తంగానే కనిపిస్తుంది కాబట్టి పెద్ద సమస్య ఉండదు. కాకపోతే వీటిని విస్మరిస్తే సిబిల్ రిపోర్టులో స్కోరుపై మాత్రం ప్రభావం చూపిస్తాయని మరిచిపోకూడదు. పోస్ట్‌పెయిడ్–లోన్ యాప్స్‌కు తేడా ఏంటి? పోస్ట్‌పెయిడ్‌లో సదరు సంస్థ తమ దగ్గర కొన్న వస్తువుకో, అందుకున్న సర్వీ సుకో దీన్ని అందిస్తుంది. కానీ లోన్‌యాప్స్ అయితే ఏ కంపెనీలో కొన్న వస్తువుకైనా, ఎక్కడ తీసుకున్న సర్వీసుకైనా వీటి నుంచి చెల్లింపులు చేయొ చ్చు. నిజానికిప్పుడు లేజీ పే వంటి చాలా లోన్‌యాప్స్ అస్సలు వడ్డీలు వసూలు చేయటం లేదు. మరి వాటి మనుగడ ఎలా? అనే సందేహం సహజం. ప్రస్తుతానికైతే ఆలస్య రుసుములే వీటికి ప్రధాన ఆదాయ వనరు. పైపెచ్చు ఇవన్నీ యూజర్ బేస్‌ను (కస్టమర్ల సంఖ్య) పెంచుకోవటంపైనే దృష్టిపెడుతున్నాయి. అక్కడ సక్సెస్ అయితే పెట్టుబడులొస్తాయి. ఏదో ఒక దశలో ఆ పెట్టుబడులపై లాభాన్ని అందించాల్సిన బాధ్యత ప్రమోటర్‌కు ఉంటుంది. కాబట్టి మున్ముందు ఇవన్నీ వడ్డీల రూపంలోనో... నెలవారీ ఫీజుల రూపంలోనో యూజర్ల నుంచి చార్జీలు వసూలు చేయక తప్పదు కూడా. ఇంతకీ వీటిని వాడొచ్చా? క్రెడిట్ కార్డుల్ని సైతం ఎడాపెడా వాడితే ఆ తరువాత ఇబ్బందులు తప్పవన్నది చాలామందికి అనుభవంలోకి వచ్చిన వాస్తవం. అలాంటిది అందుబాటులో ఉన్నాయి కదా అని ఎడాపెడా లోన్ యాప్స్ నుంచి రుణాలు తీసుకుంటే?. వీటి బిల్లింగ్‌ను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ అప్డేటెడ్గా ఉండటం అంత తేలికేమీ కాదు. బిల్లుకు సంబంధించిన మెసేజ్ వచ్చాక... ఏ కాస్త నిర్లక్ష్యం చేసినా మరిచిపోయి ఫైన్ పడే ప్రమాదం ఎక్కువ. అందుకని వీటికి దూరంగా ఉండటమే మంచిదని చెప్పాలి. సిబిల్ రిపోర్టులో సైతం మీరు ఉపయోగించిన ఒక్కో లోన్ యాప్ ఒక్కో క్రెడిట్లైన్ మాదిరి కనిపిస్తుంది. వాటిలో జరిమానాలు, ఆలస్యపు చెల్లింపులు ఉంటే స్కోరు దెబ్బతినే అవకాశం తప్పకుండా ఉంటుంది. మరో ముఖ్యమైన అంశమేంటంటే కొన్ని యాప్‌లు తమ బకాయిల వసూలుకు రకరకాల అనైతిక మార్గాలు కూడా అనుసరిస్తున్నాయి. రుణం తీసుకున్న వారి కాంటాక్టు లిస్టులో ఉన్నవారందరికీ ఫోన్లు చేయటం... భయపెట్టడం... వారి దగ్గర ఈ వ్యక్తిని అవమానించటం వంటివన్నీ చేస్తున్నాయి. కాబట్టి వీలైనంతవరకూ వీటికి దూరంగా ఉండటమే మంచిదని చెప్పాలి. -మంథా రమణమూర్తి -
ఎడ్యుకేషన్‌లోన్ కావాలా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
విదేశాల్లో చదువుకుని, కెరీర్‌ను గ్రాండ్‌గా మొదలు పెట్టాలన్నది చైతన్య (24) డ్రీమ్. బీటెక్ చేసిన తర్వాత రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేశాడు. ఫ్రాన్స్‌లోని మాంట్పెల్లియర్ బిజినెస్ స్కూల్లో ఎంఎస్సీ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నాడు. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోర్సుకు పాక్షికంగా స్కాలర్ షిప్ రావడంతో అతడు ఎంతో సంతోషించాడు. కానీ, అప్పుడే అసలు సవాలు ఎదురైంది. వచ్చిన స్కాలర్షిప్ కొద్ది మొత్తమే, మిగిలిన మొత్తాన్ని రుణం ద్వారా సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. విద్యా రుణం సులభంగా లభిస్తుందని అనుకోవచ్చు. కానీ, ఆచరణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. నెల రోజుల పాటు ప్రశాంతత కోల్పోయి అతడు చేసిన ప్రయత్నం ఫలించింది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో సీటు కావడంతో బ్యాంకు విద్యా రుణానికి ఓకే చెప్పింది. అందుకే, విద్యా రుణం పొందడం అనుకున్నంత సులభం కాదు. రుణం ఇచ్చే సంస్థ అన్ని విషయాలను స్పృశిస్తుంది. ఎలా వ్యవహరిస్తే సులభంగా రుణం లభిస్తుంది? ఈ విషయంలో ఉన్న సవాళ్లు, వాటిని అధిగమించడంపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఏటా వేలాది మంది భారత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు. విదేశాంగ శాఖ వద్దనున్న తాజా సమాచారం మేరకు.. కరోనా తర్వాత కూడా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. 2021లో 11 లక్షల మంది భారత విద్యార్థులు విదేశీ చదువుల కోసం వెళ్లారు. 2024లో భారత్ నుంచి సుమారు 18 లక్షల మంది విదేశాల్లో ఉన్నత విద్యను ఎంపిక చేసుకోవచ్చని కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ అంచనా. వారు చేసే ఖర్చు వార్షికంగా 80 బిలియన్ డాలర్లు (రూ.6.16 లక్షల కోట్లు) ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది. విద్యా రుణాన్ని నమ్ముకుని విదేశీ విద్యకు ప్లాన్ చేసుకునే వారు ముందుగానే ఇందుకు సంబంధించి వాస్తవ అంశాలను, పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా విచారించుకోవాలి. ‘‘ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం విద్యా రుణాలను పరిమితంగానే మంజూరు చేస్తోంది. వచ్చిన ప్రతి దరఖాస్తుకు ఆమోదం చెప్పడం లేదు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, విద్యా సంస్థల పూర్తి జాబితానే చాలా బ్యాంకుల వద్ద లేదంటే విద్యా రుణాల విషయంలో వాటికి ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు’’అని లాంచ్మైకెరీర్ అనే కెరీర్ కౌన్సెలింగ్ ప్లాట్‌ఫామ్ గ్లోబల్ లీడర్ సుష్మాశర్మ తెలిపారు. బ్యాంకును గుర్తించడం.. విద్యా సంస్థలు, దేశాలకు సంబంధించి పరిమితులు ఉన్నాయి. తమ ముందుకు వచ్చే ప్రతి విదేశీ విద్యా రుణ దరఖాస్తును బ్యాంకులు ఆమోదించవు. పైగా ఒక బ్యాంకుకు సంబంధించి కూడా అన్ని శాఖలు ఈ వ్యాపారం చూడడం లేదు. చైతన్య ముందుగా ఎన్బీఎఫ్సీ నుంచి రుణం తీసుకుందామని అనుకున్నాడు. సులభంగా, వేగంగా వస్తుందని అనుకుని కొన్ని ఎన్బీఎఫ్సీలను సంప్రదించాడు. కానీ, ఒక్కటంటే ఒక్కటీ చైతన్య సీటు సంపాదించిన యూనివర్సిటీ కోర్సులకు రుణాలను ఆఫర్ చేయడం లేదని తెలిసి ఆశ్చర్యపోయాడు. చివరికి ఎస్బీఐని సంప్రదించగా అతడి ప్రయత్నం ఫలించింది. అదీ మెయిన్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి వచ్చింది. కావాల్సినంత రుణం.. విదేశీ విద్యా కోర్సు అంటే ఫీజులకే బోలెడు ఖర్చు అవుతుంది. ఇదే పెద్ద సవాలు. విదేశీ విద్యా సంస్థల్లో సీటు కోసం దరఖాస్తు చేసుకునే ముందే ట్యూషన్ పీజులతోపాటు అక్కడ నివసించేందుకు అయ్యే వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుష్మాశర్మ సూచించారు. ఇక కావాల్సినంత రుణం లభించక, తాము సొం తంగా సమకూర్చుకోలేని సందర్భాల్లో విద్యార్థులు రాజీమార్గాలను అనుసరించడాన్ని గమనించొచ్చు. కావాల్సి నంత రుణం/నిధులు సమకూరని సందర్భంలో అవసరమైతే కోర్సును లేదంటే విద్యా సంస్థను మార్చే వారు కూడా ఉన్నట్టు ఫ్లై మాస్టర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఎండీ రాజేష్ వర్మ తెలిపారు. ఉద్యోగ అవకాశాలు.. రుణం ఇచ్చే ముందు ఏ బ్యాంకు అయినా, మరో సంస్థ అయినా ఏం చూస్తుంది..? రుణం తీసుకున్న వ్యక్తికి తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా..? అనే కదా.. అలాగే, విద్యా రుణం విషయంలో బ్యాంకులు అభ్యర్థి చేస్తున్న కోర్సు, ఉద్యోగ మార్కెట్లో ఆ కోర్సుకు ఉన్న డిమాండ్‌ను పరిశీలిస్తాయి. ఇందులో భాగంగా విద్యార్థి చదవబోయే విద్యాసంస్థకు ఉన్న పేరు, గుర్తింపు, అందులో చదివిన వారికి ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ‘‘విద్యార్థి కేంబ్రిడ్జ్ లేదా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వంటి విద్యా సంస్థలకు వెళ్లొచ్చు. కానీ, ఈ తరహా ప్రతిష్టాత్మక, పేరొందిన ఇనిస్టిట్యూషన్స్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవడానికి బదులు విద్యార్థులు ఏజెన్సీలను ఆశ్రయిస్తుంటారు. దాంతో చివరికి పెద్దగా తెలియని యూనివర్సిటీలో అడ్మిషన్‌తో వారు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అటువంటప్పుడు విద్యా రుణం కష్టంగా మారుతుంది’’ అని విద్యా రుణాల మార్కెట్‌ప్లేస్ అయిన విమేక్స్కాలర్స్ సహ వ్యవస్థాపకుడు అర్జున్ ఆర్ కృష్ణ తెలిపారు. పేపర్ వర్క్ కావాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం ముఖ్యమైన కార్యక్రమం. డాక్యుమెంట్ ప్రక్రియ ఎంత క్లిష్టమో ఇప్పటికే రుణం తీసుకుని విదేశీ విద్యా కోర్సు చేస్తున్న వారిని అడిగితేనే తెలుస్తుంది. విభా షణ్ముఖ్ (33) యూఎస్‌లోని రైస్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్నారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఎంత క్లిష్టతరమో తన అనుభవాన్ని వెల్లడించారు. డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివేందుకు 2013లో ఆయన ఓ ప్రభుత్వ రంగ బ్యాం కులో రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. ‘‘బ్యాంకు అడిగిన అన్ని పత్రాలను తీసుకెళ్లి ఇచ్చాను. అయినా కానీ, కోర్సుకు అయ్యే ఖర్చు, ఇతర వ్యయాలకు సంబంధించి యూనివర్సిటీ నుంచి ధ్రువీకరణ పత్రం కావాలని బ్యాంకు అడిగింది. కానీ యూనివర్సిటీల నుంచి ఈ తరహా పత్రాలు పొందడం అదిపెద్ద సవాలు’’అని షణ్ముఖ్ తెలిపారు. తాకట్టు.. దేశీ యూనివర్సిటీల్లో కోర్సుల కోసం రుణాలు తీసుకునేట్టు అయితే బ్యాంకులు తనఖా కోరవు. కానీ, విదేశీ వర్సిటీల్లో విద్య కోసం తీసుకునే రుణాలకు సంబంధించి తనఖా పెట్టాలని బ్యాంకులు అడుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు తనఖా కోరుతున్నాయి. తనఖా కింద స్తిరాస్థి, ప్రావిడెంట్ ఫండ్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ ఇస్తే సరిపోతుంది. చాలా ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులు తనఖా అడగడం లేదు. మాస్టర్స్ కోర్సులకు తనఖా లేకుండానే ఇవి రుణాలు ఇస్తున్నాయి. వివరాలు సమగ్రంగా తెలుసుకుని ముందడుగు వేయాలి. అధిక వ్యయాలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణానికి డాక్యుమెంట్లు సమర్పణ, ఆమోదం ప్రక్రియ కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అదే ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకుల నుంచి విద్యా రుణం సులభంగానే లభిస్తుంది. కాకపోతే ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే వీటిల్లో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ చార్జీలు ఎక్కువగా ఉంటుంటాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణాలపై రేట్లు 6.9 శాతం నుంచి 12.5 శాతం మధ్య ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో 10.5 శాతం నుంచి 13 శాతం మధ్య ఉన్నాయి. ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులు (ఎక్కువ శాతం) ఇచ్చే విద్యా రుణాలకు మారటోరియం ఉండడం లేదు. దీంతో రుణం మంజూరు చేసిన మరుసటి నెల నుంచే చెల్లింపులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. మారటోరియం అంటే.. కోర్సు కాల వ్యవధికి ముగిసిన తర్వాత ఆరు నెలల వరకు రుణానికి చెల్లింపులు చేయక్కర్లేదు. కోర్సు అనంతరం ఉద్యోగం పొందేందుకు వీలుగా ఆరు నెలల వ్యవధి ఉంటుంది. దీనివల్ల విద్యార్థి కుటుంబానికి ఎంతో ఉపశమనం ఉంటుంది. అందుకుని రుణానికి వెంటనే చెల్లింపులు చేయలేని వారు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మారటోరియంతో కూడిన విద్యా రుణానికే ప్రయత్నించాలి. రుణానికి ముందే ప్రణాళిక ఉండాలి.. సాధారణంగా విద్యార్థులు తమ బడ్జెట్ కోణం నుంచి విదేశాల్లో ప్రవేశాలకు ప్రయత్నిస్తుంటారు. అంటే తక్కువ వ్యయాలు అయ్యే ప్రాంతాలను ఎంపిక చేసుకుంటుంటారు. దీనివల్ల అంతగా ప్రాచుర్యం లేని దేశం లేదా విద్యా సంస్థలో చేరాల్సి వస్తుంది. అందుబాటు ధరలు ఏ దేశంలో ఉన్నాయో విచారించుకుని అక్కడ విద్యాసంస్థను ఎంపిక చేసుకుంటున్నారు. ‘‘ఉదాహరణకు ఒక విద్యార్థి రూ.20లక్షలు ఖర్చు చేయగలనని అనుకుంటే ఆమె లేదా అతడు జర్మనీలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నారు. అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టుకోగలిగితే యూఎస్ లేదా యూకేలో ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. విద్యా రుణం పొందే విషయంలో పేరున్న యూనివర్సిటీయే కాకుండా, దేశానికీ ప్రాధాన్యం ఉంటుంది’’అని కృష్ణ వివరించారు. విద్యా సంస్థలు పేరున్నవి, ప్రతిష్టాత్మకమైనవి అయితే బ్యాంకులు తనఖా కోరడం లేదు. ప్రభుత్వరంగ బ్యాంకులు అయితే యూనివర్సిటీలు, కోర్సులతో జాబితాను నిర్వహిస్తున్నాయి. ఏఏ వర్సిటీలు, ఏ కోర్సులకు తక్కువ వడ్డీ రేటు రుణాలు, తక్కువ తనఖాతో మంజూరు చేయాలో ఈ జాబితానే వాటికి ప్రామాణికంగా ఉంటోంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతోపాటు ప్రొడిగీ ఫైనాన్స్, ఎంపవర్ ఫైనాన్సింగ్ తదితర అంతర్జాతీయ సంస్థలు సైతం విద్యా రుణాలు ఇస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు విద్యారుణాల పరంగా సాయాన్ని అందిస్తున్నాయి. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నవారు, సరైన పత్రాలను అందించలేని వారికి విద్యా రుణం పరంగా ప్రైవేటు బ్యాంకులు సౌకర్యం’’అని కృష్ణ తెలిపారు. స్కాలర్షిప్ ‘‘విదేశీ విద్య కోసం వెళ్లే వారిలో కోర్సుకు అయ్యే వ్యయం మేర పూర్తి స్కాలర్షిప్ పొందే అవకాశం 2–3 శాతం మందికే ఉంటుంది. కానీ, పాక్షిక స్కాలర్షిప్ను అందించే విద్యా మండళ్లు, ఇనిస్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి’’అని కృష్ణ తెలిపారు. దరఖాస్తు సమయంలోనే స్కాలర్షిప్ కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ఎన్నో పథకాలు అవకాశాలున్నట్టు చెప్పారు. సున్నా వడ్డీ రుణాలు, విరాళాలు కూడా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. టాటా ఫౌండేషన్, అగాఖాన్ ఫౌండేషన్ తదితర సంస్థలు సాయం అందిస్తున్నాయి. స్కాలర్షిప్ పొందడంలో సాయపడే జ్ఞాన్‌ధన్, విమేక్ సొల్యూషన్స్ తదితర సంస్థలు కూడా ఉన్నాయి. క్రెడిట్ స్కోరు విద్యా రుణం విషయంలోనూ మంచి క్రెడిట్ స్కోరు సాయపడుతుంది. దరఖాస్తు ఆమోదానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలనుకునే వారు మంచి క్రెడిట్ స్కోరు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాలేజీకి వచ్చిన పిల్లలు ‘బై నౌ పే లేటర్’ సదుపాయాలను విచ్చలవిడిగా ఉపయోగించుకుని చెల్లించకుండా వదిలేస్తున్నారు. ఈ తరహా చర్యలు రుణాలకు అడ్డంకిగా మారతాయి. విదేశ విద్య ప్రణాళిక ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ హిస్టరీలో మచ్చ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులూ ఈ విషయంలో పిల్లల వ్యయాల పట్ల శ్రద్ధ చూపాలి. డాక్యుమెంట్లు విద్యా రుణానికి కేవైసీ డాక్యుమెంట్లు అన్నీ సిద్ధం చేసుకోవాలి. కేవైసీ అంటే గుర్తింపు, వయసు, చిరునామాను ధ్రువీకరించేవి. వీటితోపాటు గ్రాడ్యుయేషన్ మార్కుల మెమో షీటు, సెకండరీ స్కూల్, హైస్కూల్ ఇలా విద్యకు సంబంధించి అన్ని మెమో పత్రాలను దగ్గర ఉంచుకోవాలి. తల్లిదండ్రులు లేదంటే సంరక్షకుల ఆదాయ రుజువు సర్టిఫికెట్ అవసరం. తనఖా కోసం ఉంచతగిన ఇల్లు, పొలం, ప్లాట్, ఫిక్స్డ్ డిపాజిట్ లేదంటే పీపీఎఫ్ ఖాతా పాస్ బుక్, యూనివర్సిటీలో ప్రవేశాన్ని ధ్రువీకరిస్తూ మంజూరు చేసే లేఖ, కోర్సు ఫీజుల చెల్లింపుల షెడ్యూల్, స్కాలర్షిప్ లెటర్, రుణ గ్రహీత బ్యాంకు స్టేట్మెంట్ (చివరి ఆరు నెలలు), తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు, తల్లిదండ్రుల ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు సిద్ధం చేసుకోవాలి. కొన్ని బ్యాంకులు రుణ దరఖాస్తుదారుడి వాటా కింద చెల్లించే మొత్తానికి మూలాన్ని అడుగుతాయి. అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు చూడాలి రుణం సాయంతో విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారు చూడాల్సిన ముఖ్యమైన వాటిల్లో.. కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు ఒకటి. దీనివల్ల తీసుకునే రుణాన్ని తిరిగి తీర్చివేసే సామర్థ్యాలపై స్పష్టత తెచ్చుకోవచ్చు. విద్యా రుణాల్లో పెరుగుతున్న ఎగవేతలు ఈ విషయంలో ముందు జాగ్రత్త అవసరమని తెలియజేస్తన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ఇచ్చిన విద్యా రుణాల్లో 9.55 శాతం నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏలు) 2020లో వర్గీకరించినట్టు 2021 పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం స్వయంగా తెలిపింది. కోర్సు అనంతరం అక్కడే కొంతకాలంపాటు ఉండి ఉపాధి అవకాశాన్ని సొంతం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘గతంలో అయితే కొన్ని దేశాలు కోర్సు అనంతరం కేవలం కొన్ని నెలల పాటే ఉపాధి అవకాశాల అన్వేషణకు వీలుగా ఉండనిచ్చేవి. కానీ, ఇప్పుడు బ్రిటన్ సహా చాలా దేశాలు గ్రాడ్యుయేట్ రూట్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టాయి. వీటి కింద ఉన్నతవిద్య అనంతరం అక్కడే కొన్నేళ్లపాటు ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు’’అని ఓ కన్సల్టెన్సీ అధినేత తెలిపారు. -
కొంటే ఖర్సయిపోతారు..!
ఆన్లైన్ షాపింగ్. ముందు రూపాయి కట్టక్కర్లేదు. వడ్డీ కూడా లేదు. తీరిగ్గా తర్వాత ఇద్దురు. ఏంటి ఇదంతా.. అనుకుంటున్నారా..? అదే బై నౌ పే లేటర్. లేదా స్పెండ్ నౌ పే లేటర్. అమెజాన్ వంటి దిగ్గజాలు, బడా బ్యాంకుల నుంచి, చిన్న ఎన్బీఎఫ్సీ సంస్థల వరకు క్రెడిట్ ఇచ్చేందుకు బారులు తీరాయి. వినియోగం ఆధారంగా అవి అరువు ఇచ్చేస్తాయి. కాకపోతే వాడేసుకోవడమా.. లేక వేరే మార్గం చూసుకోవడమా? అన్న విచక్షణ వినియోగదారులదే. బీఎన్‌పీఎల్ రూపంలో లభించే క్రెడిట్ స్వల్ప మొత్తమే. కానీ, వీటిని సరిగ్గా నిర్వహించకపోతే తెలియకుండానే బ్యాలన్స్ కరిగిపోతుంది. 15–30 రోజుల వరకు వడ్డీ ఉండదు. మర్చిపోయారా..? అరువు ఇచ్చిన కంపెనీలకు అవకాశం ఇచ్చినట్టే. అవి తమకు నచ్చిన వడ్డీ బాదుడు షురూ చేస్తాయి. పెనాల్టీ అంటాయి. చెల్లించాల్సింది రూ.200 అయినా.. రూ.50–100 వరకు పిండేస్తాయి. కొరివితో తలగోక్కున్నట్టు కోరి క్రెడిట్ స్కోరును దెబ్బతీసుకున్నట్టు అవుతుంది. ∙ బ్యాంకు ఖాతాలో రూపాయి లేకపోయినా కొనుగోళ్లకు వీలు కల్పించేది క్రెడిట్ కార్డు. అయితే, ఇప్పటికీ దేశంలో క్రెడిట్ కార్డు విస్తరణ చాలా పరిమితంగానే ఉంది. ఇదే చక్కటి అవకాశంగా భావించి ఫిన్‌టెక్ సంస్థలు బీఎన్‌పీఎల్ రూపంలో మార్కెట్లో చొచ్చుకుపోయే క్రమంలో ఉన్నాయి. క్రెడిట్ కార్డుపై లభించేది రుణమే. బై నౌ పే లేటర్ రూపంలో వచ్చేదీ కూడా రుణమే. రెండింటిపైనా నిర్ణీత కాలం పాటు వడ్డీ ఉండదు. సారూప్యతలు అంతవరకే. కంటికి కనిపించని అంశాలు బీఎన్‌పీఎల్ సదుపాయంలో ఎన్నో ఉన్నాయి. ∙ ఇప్పుడు కొను, తర్వాత చెల్లించు (బై నౌ.. పే లేటర్/బీఎన్‌పీఎల్) చాలా మందిని ఆకర్షిస్తున్న సదుపాయం. క్రెడిట్ కార్డు మాదిరి ముందు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ సంస్థలు, ఆన్లైన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్‌లతో జతకట్టి ఎన్బీఎఫ్సీ సంస్థలు ఇస్తున్న ముందస్తు రుణ సదుపాయం. దీనికి పాన్ నంబర్ ఉంటే సరిపోతుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య పోటీ వల్ల పుట్టుకొచ్చిన కొత్త సాధనమే ఇది. చార్జీలు/ఫీజులు 15–30 రోజుల పాటు వడ్డీ లేని రుణ సదుపాయమే బీఎన్‌పీఎల్. ఇచ్చిన గడువులోపు చెల్లిస్తే రూపాయి అదనంగా కట్టాల్సిన పరిస్థితి ఉండదు. రుణం కనుక అశ్రద్ధ చూపినా, సకాలంలో చెల్లింపులు చేయకపోయినా తర్వాత భారాన్ని మోయాల్సి రావచ్చు. గడువు దాటితే మిగిలిన బ్యాలన్స్ మొత్తంపై 10–30 శాతం మేర వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. గడువు తర్వాత చెల్లించేవారు వడ్డీకి అదనంగా లేట్ ఫీజు కూడా కట్టాలి. కన్వినియన్స్ ఫీజు పేరుతో నెలవారీ వ్యయంపై 1–3 శాతం మధ్య వసూలు చేసే సంస్థలు కూడా ఉన్నాయి. బీఎన్‌పీఎల్ సంస్థలు ఓలా పోస్ట్‌పెయిడ్, జెస్ట్‌మనీ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పే లేటర్, యూని, పేటీఎం పోస్ట్‌పెయిడ్, స్లైస్, యూనికార్డ్స్ ఇలా ఎన్నో సంస్థలు బై నౌ పే లేటర్ పేరుతో క్రెడిట్‌ను ఆఫర్ చేస్తున్నాయి. రుణ సదుపాయం ఆన్లైన్లో వస్తువులు లేదా సేవల కోసం బీఎన్‌పీఎల్‌తో ఆర్డర్ చేసేయవచ్చు. నిర్ణీత కాలంలోపు వడ్డీ లేకుండా తీర్చేయాలి. ఇది అన్సెక్యూర్డ్ రుణం. దీంతో ఆన్లైన్ మార్కెట్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వారు పెరుగుతున్నారు. క్రెడిట్ కార్డుపై రూ.లక్షల రుణ సదుపాయం లభిస్తుంది. కానీ, బీఎన్‌పీఎల్ అలా కాదు. ఇవి చిన్న రుణాలు. ఎక్కువ శాతం రూ.2,000 నుంచి రూ.15,000 మధ్య రుణ సదుపాయం (క్రెడిట్లైన్) ఉంటుంది. స్మాల్ టికెట్ లోన్స్గా చెబుతారు. పేమెంట్ ఆప్షన్ పేజీలో బీఎన్‌పీఎల్ ఫీచర్ కనిపిస్తుంది. ఈ సదుపాయం కోసం కస్టమర్ ఆయా ప్లాట్‌ఫామ్‌లపై ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఒక్కసారి యాక్టివేట్ అయితే అది మీ క్రెడిట్ రిపోర్ట్‌లో రుణ సదుపాయంగానే ప్రతిఫలిస్తుంది. రుణ గ్రహీతలు బీఎన్‌పీఎల్ కింద పొందిన రుణ సదుపాయాన్ని ఒకే సారి తీర్చే వెసులుబాటు లేకపోతే అప్పుడు ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణం కనుక గడువులోపు తీర్చేయడమే మంచిది. లేదంటే క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. కొన్ని సంస్థలు ఎటువంటి వడ్డీ విధించకుండా బిల్లు మొత్తాన్ని మూడు, నాలుగు నెలల సమాన వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. బీఎన్‌పీఎల్ రూపంలో వచ్చే రుణాన్ని ఎన్బీఎఫ్సీలు లేదా బ్యాంకులు అందిస్తుంటాయి. ఉదాహరణకు పేటీఎం బీఎన్‌పీఎల్ అన్నది ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌తో ఒప్పందంపై అందిస్తున్న సదుపాయం. అమెజాన్ బీఎన్‌పీఎల్ అన్నది అమెజాన్ ఇండియా అందిస్తున్న సదుపాయం. ఇక ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ సదుపాయాన్ని ఆ సంస్థతో ఒప్పందంపై ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు సమకూరుస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం ఇలా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్/ఈకామర్స్ సంస్థ ఏదైనా కావచ్చు.. రుణ గ్రహీత, రుణదాతలను కలిపే వేదికలుగానే పనిచేస్తాయి. రుణ సదుపాయంతో వాటికి ప్రత్యక్ష సంబంధం ఉండదు. చెల్లింపుల్లో విఫలమైతే.. మొదట లేట్ ఫీజు పడుతుంది. ఫ్లిప్‌కార్ట్ అయితే తీర్చాల్సిన బ్యాలన్స్ రూ.100–500 మధ్య ఉంటే, విఫలమైన రుణగ్రహీతలకు రూ.60 చార్జీ విధిస్తోంది. రూ.5,000 అంతకుమించి మొత్తం చెల్లించడంలో విఫలమైతే అప్పుడు రూ.600 వరకు చార్జీ పడుతుంది. అమెజాన్ పే లేటర్ అయితే చెల్లించని మొత్తం రూ.200లోపు ఉంటే ఆలస్యపు రుసుం అమలు చేయడం లేదు. కానీ, పెనాల్టీ రూపంలో రూ.100–600 వరకు రాబడుతోంది. జీఎస్టీ అదనం చెల్లించాల్సి రావచ్చు. దీనికితోడు రుణం ఇచ్చిన సంస్థ వసూలుకు చర్యలు ప్రారంభించొచ్చు. రుణ గ్రహీత వివరాలను అవి క్రెడిట్ బ్యూరోలకు పంపిస్తాయి. ఇది క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుంది. దీంతో భవిష్యత్తు రుణాలు మరింత భారంగా మారతాయి. క్రెడిట్ డీలింక్వెన్సీగా క్రెడిట్ బ్యూరోలకు రుణ సంస్థలు సమాచారం ఇస్తాయి. కనీస బ్యాలన్స్ చెల్లించి మిగిలిన రుణాన్ని క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. అయినప్పటికీ అది కూడా క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి. కస్టమర్ రిజిస్టర్ చేసుకున్న, వినియోగించుకున్న ప్రతీ బీఎన్‌పీఎల్ కూడా ఒక రుణం కింద వారి క్రెడిట్ రిపోర్ట్‌లో చేరుతుంది. కొద్ది బ్యాలన్స్ కోసం బీఎన్పీఎల్ను వాడేసుకుని మర్చిపోయారనుకోండి. ఇలా ఒకటికి మించిన రుణ సదుపాయాలు అన్నీ కలసి తలనొప్పిగా మారొచ్చు. క్రెడిట్ స్కోరు క్షీణిస్తుంది. దీనికంటే క్రెడిట్‌కార్డు మెరుగైన సాధనం అవుతుంది. 30–45 రోజుల క్రెడిట్ పీరియడ్‌తో వస్తుంది. కావాలంటే ఈఎంఐ కిందకు బ్యాలన్స్‌ను మార్చుకోవచ్చు. రుణ పరిమితి అధికంగా ఉంటుంది. యాక్టివేట్ అయినట్టే.. శ్రీరామ్ ఏప్రిల్ నెల క్రెడిట్ స్కోరు క్షీణించడాన్ని గమనించాడు. కారణం ఏంటా అని క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించగా.. ఆశ్చర్యపోవడం అతని వంతు అయింది. ‘‘క్యాపిటల్ ఫ్లోట్, కరూర్ వైశ్యా బ్యాంకు (కేవీబీ) నుంచి రెండు రుణాలు అతడి రిపోర్ట్‌లో యాక్టివ్‌గా కనిపించాయి. ఆయా సంస్థల నుంచి శ్రీరామ్ రుణాలు తీసుకోలేదు. దాంతో అవి ఎందుకు తన రిపోర్ట్‌లో వచ్చాయో మొదట అర్థం కాలేదు. క్రెడిట్ కార్డు తప్పించి అతడి పేరిట మరే రుణం లేదు. ఈ రెండూ బీఎన్‌పీఎల్ రుణాలని అతడికి తర్వాత తెలిసింది. అమెజాన్ పే లేటర్ సదుపాయం కోసం ఒకటి రెండు సార్లు అతడు లాగిన్ అయ్యాడు కానీ, బ్యాంకు ఖాతాను లింక్ చేయలేదు. అయినా కానీ, క్రెడిట్ సదుపాయాన్ని యాక్టివేస్ చేసేసింది సదరు సంస్థ. ఇది శ్రీరామ్ ఒక్కడి విషయంలోనే కాదు. చాలా మందికి ఎదురవుతున్న అనుభవం. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాలపై ప్రస్తావిస్తున్నారు. తమ తరఫున బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణ సదుపాయాన్ని పలు ప్లాట్‌ఫామ్‌లు పొందుతున్నట్టు ఆరోపిస్తున్నారు. తమ అనుమతి లేకుండా రుణ సదుపాయాన్ని పొందినట్టు చేస్తున్న ఆరోపణ నిజం కాదు. ‘‘వినియోగదారులు తాము క్రెడిట్లైన్ కోసం సైనప్ చేసుకున్నామే కానీ, రుణం కోసం కాదని భావిస్తుంటారు. క్రెడిట్లైన్ అన్నది ఒక రుణ పరిమితి. వినియోగదారులు దీన్ని వినియోగించుకోవచ్చు. వినియోగించుకోకపోవచ్చు. కానీ, దీన్ని బుక్స్‌లో రుణంగానే పేర్కొంటారు’’ అని ‘యూని’ సంస్థ సీఈవో, వ్యవస్థాపకుడు నితిన్ గుప్తా తెలిపారు. అందుకే వీటిని క్రెడిట్ నివేదికల్లో పేర్కొనడం జరుగుతుందన్నారు. ఆయా అంశాల నేపథ్యంలో ఈ కొత్త వ్యవస్థ పట్ల తస్మాత్ జాగ్రత్త. -
ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేస్తామంటూ బెదిరింపులు.. ఆపై
హరిత స్నేహితురాలికి ఫోన్ చేస్తే వాళ్ల అమ్మ ఫోన్ ఎత్తింది. ‘భవ్యను ఆసుపత్రిలో చేర్చాం’ అని ఏడుస్తూ చెప్పడంతో కంగారుగా హాస్పిటల్‌కి చేరుకుంది హరిత. ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు. భవ్య మాట్లాడుతుందని డాక్టర్లు చెప్పడంతో స్నేహితురాలి దగ్గరకు వెళ్లింది హరిత. ‘ఏమైంద’ని అడిగితే చాలాసేపటి వరకు ఏడుస్తూనే ఉండిపోయింది. యాప్ ద్వారా తీసుకున్న లోన్ గురించి చెప్పి, బ్లాక్మెయిల్ చేస్తున్నారని, తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశానని చెప్పింది భవ్య,. (పేర్లు మార్చడమైనది) నెల రోజుల క్రితం... ‘ఇంతమందికి పార్టీ అంటే బాగానే ఖర్చు అవుతుంది. మీ నాన్న ఎన్ని డబ్బులు ఇచ్చారు?’ భవ్యను అడిగింది హరిత. ‘నాన్న అంత మనీ ఎందుకు ఇస్తారు. యాప్ నుంచి లోన్ తీసుకున్నాను. పాకెట్ మనీ ఇస్తారుగా, కొంత కొంత కట్టేస్తే సరిపోతుంది’ అని చెప్పింది భవ్య. ‘ఈ యాప్ మనీ ఏంటో ఈజీగా ఉంది. నాక్కూడా చెప్పవా!’ అనడంతో ఆ వివరాలన్నీ హరితకూ చెప్పింది. యాప్ ద్వారా తీసుకున్న ఇన్స్టంట్ మనీ తమ జీవితాలతో ఎలా ఆడుకుంటుందో అర్థమయ్యాక స్నేహితులిద్దరూ ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. కాలేజీకి వెళ్లే యువత మాత్రమే కాదు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు కూడా ఇలాంటి ‘యాప్’ ఆధారిత లోన్ల పట్ల ఆకర్షితులవుతున్నారు. రుణం ఇచ్చేవారెవరో తెలియకుండా తీసుకునే లోన్ల కారణంగా రకరకాల సమస్యల్లో చిక్కుకుంటున్నారు. నేరాలకు సులువైన మార్గం ఇటీవల యాప్‌ల ద్వారా రూ.500 నుంచి 50,000 వేల వరకు తక్షణ రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. వీటి రికవరీ వ్యూహాల కారణంగా ఆరుగురు ఆత్మహత్య చేసుకున్న కేసులు అధికారికంగా నమోదు అయ్యాయి. రుణమాఫీ కోసం యాప్ నిర్వాహకులు ఎంచుకుంటున్న నేర మార్గాలు కూడా ప్రధాన కారణం అవుతున్నాయి. లోన్ అంటూ ఇలాంటి తక్షణ రుణం ఇచ్చే యాప్‌లకు ఎలాంటి వెబ్సైట్ ఉండదు. ఈ యాప్‌లు ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. వాటిలో కంపెనీకి సంబంధించిన సమాచారం, లైసెన్స్.. వంటి ఇతర వివరాలేవీ ఉండవు. ఇ–మెయిల్, ఫోన్ నెంబర్ మాత్రమే ఉంటాయి. వాటిలో శాలరీ అడ్వాన్స్ లోన్, ఇన్స్టంట్ పర్సనల్ లోన్ అనే రెండు వేర్వేరు పేర్లతో ఉంటాయి. నిజానికి గూగుల్‌ప్లే స్టోర్ 60 రోజులకంటే తక్కువ కాలవ్యవధితో రుణాలను అందించే యాప్‌లను అనుమతించదు. ఉల్లంఘన కారణంగా చాలా యాప్‌లను ప్లే స్టోర్ తొలగించింది కూడా. అయితే, అవి మళ్లీ వేరే పేర్లతో ప్రత్యక్షమవుతున్నాయి. వేధింపులకు తెర తీస్తారు.. ఒక సెల్ఫీ, ఆధార్ నెంబర్‌తో రుణాలను ఇవ్వడానికి కొన్ని రకాల ‘యాప్’లు ఆమోదిస్తుంటాయి. ఇది పూర్తి చట్ట విరుద్ధం. ఒకేసారి కాకుండా వివిధ దశలలో రుణం మంజూరు చేస్తుంటారు. విపరీతమైన వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు, జిఎస్టీ.. ఇతర రుసుముల కింద మరింత మొత్తం ముందే చెల్లింపుల కింద కట్ చేస్తారు. వారం సమయం ఇచ్చి, వడ్డీ చెల్లించమని వేధిస్తుంటారు. ►లోన్ చెల్లించనట్లయితే దూకుడు వ్యూహాలను అమలు చేస్తారు. మీ ఫోన్ జాబితాలో కాంటాక్ట్స్‌ను ఉపయోగించి, ‘మీ పేరు గ్యారెంటీగా ఇచ్చార’ని నకిలీ సాకును చూపుతారు. ►మీ ఫోన్ కాంటాక్ట్ జాబితాలో అమ్మ, నాన్న, జీవిత భాగస్వామి, సోదరుడు, సహోద్యోగులు, స్నేహితులు .. వంటి సేవ్ చేసిన అన్ని నంబర్లకు కూడా ఫోన్ చేసి వేధిస్తారు. ►అర్థరాత్రి కూడా ఫోన్ చేస్తారు. ఒకే రోజులో వివిధ ఫోన్ నెంబర్ల నుంచి దాదాపు 100 కాల్స్ చేసి, మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు. ►బాధితుల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి, అశ్లీల వెబ్సైట్లలో అప్లోడ్ చేసిన ప్రమాదకర ఘటనలూ జరిగాయి. బాధిత కుటుంబ సభ్యులకూ వాటిని పంపే అవకాశం ఉంది. ►నకిలీ లాయర్ నోటీసులు పంపుతారు. ∙సిబిల్ స్కోర్ సున్నా, భవిష్యత్తులో ఎలాంటి రుణం పొందలేరు అని బెదిరిస్తారు. ►ఒక్క రోజు ఆలస్యం అయినా కేవలం ఐదు నిమిషాల్లో రుణం చెల్లించాలని బాధితులపై ఒత్తిడి తెచ్చి, తిరిగి చెల్లించేందుకు మరో రుణం ఇస్తారు. హెచ్చరిక సంకేతాలివి... ►మీ క్రెడిట్ స్కోర్ చెక్ ఎంత అనే పట్టింపులేవీ ఉండవు. మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడంపై ఎక్కువ దృష్టి పెడతారు కాబట్టి ఇది ప్రధాన హెచ్చరికగా గుర్తించాలి. ►వారి చిరునామా ఎక్కడా ఉండదు. వారిని సంప్రదించే సమాచారాన్నీ ఇవ్వరు. ►నకిలీ రుణదాతలు జీఎస్టీ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులతో ముందస్తు చెల్లింపు లేదా రుసుమును డిమాండ్ చేయచ్చు. ►లోన్ ఆఫర్ కొన్ని గంటలు లేదా రోజుల్లో ముగుస్తుందని చెబుతారు. స్కామర్లు పరిమిత గడువు ఆఫర్లతో ముందుకు వస్తారు. ఆకర్షణీయమైన వ్యూహాలను ఉపయోగించి, తక్షణ నిర్ణయం తీసుకునేలా చేస్తారు. ఇలా జరుగుతున్నప్పుడు మీరు దానిని ముందే కనిపెట్టి, అలాంటి వారి వలలో పడకుండా దూరంగా ఉండటం మంచిది. అనుమతి తప్పనిసరి... ►మీకు రుణం ఇచ్చే బ్యాంక్‌కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఉండాలి. ఫైనాన్షియల్ కంపెనీ అయితే ఎన్బిఎఫ్సి లైసెన్స్ ఉండాలి. ►రుణం ఇచ్చే వారితో సంప్రదింపులు చేయడానికి ఫోన్ నెంబర్, ఇ–మెయిల్‌తో పాటు వారి పూర్తి చిరునామా అందుబాటులో ఉండాలి. అదేవిధంగా పైన సూచించిన అనుమతులు కూడా ఉండాలి. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
గృహ రుణం కోసం అప్లై చేసే ముందు.. ఇవీ తప్పక తెలుసుకోండి!
మన దేశంలో ఇప్పటికీ ఇల్లు లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. వారి కలల గృహం త్వరగా కట్టుకోవడం కోసం ఎంతో ఆరాట పడుతుంటారు. తమ దగ్గర ఉన్న కొంత సొమ్ముతో పాటు గృహ రుణం కోసం చాలా మంది దరఖాస్తు చేసుకుంటారు. గృహ రుణం అనేది ఒక అతిపెద్ద రుణం. గృహ రుణం తీసుకొనే ముందు ఒకసారి భవిష్యత్ గురుంచి ఆలోచించాలి. ఎందుకంటే, ఈ రుణం తీసుకున్న తర్వాత ఏదైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే కష్టాల్లోకి కూరుకొని పోవాల్సి వస్తుంది. అందుకే, గృహ రుణం తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ దరఖాస్తుదారులు గృహ రుణం కోసం అప్లై చేసే ముందు ఈ విషయాలు తప్పక గుర్తు పెట్టుకోండి. డౌన్ పేమెంట్: గృహ రుణం అనేది ఆ ఇంటి ఆస్తి విలువలో 60 శాతం కంటే ఎక్కువ మించకూడదు. వాస్తవానికి దరఖాస్తుదారులకు 70-80 శాతం ఆర్థిక సహాయం చేయడానికి బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. కానీ, గృహ కొనుగోలుదారాలు 60 శాతం లోపు రుణం తీసుకుంటే మంచిది. మిగతా 40 శాతం మొత్తాన్ని డౌన్ పేమెంట్ రూపంలో చెల్లించాలి. ఇలా చేయడం వల్ల త్వరగా గృహ రుణం రావడంతో పాటు వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అలాగే, భవిష్యత్‌లో ఏదైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే, తట్టుకునే సామర్ధ్యం మన దగ్గర ఉంటుంది. క్రెడిట్ స్కోరు: ఏదైనా బ్యాంక్ ఒక వ్యక్తికి రుణం మంజూరు చేయాలి అనుకున్నప్పుడు, మొదటగా రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు చెక్ చేస్తాయి. అధిక క్రెడిట్ స్కోర్లు ఉన్నవారికి(ఉదా:750 పైన) సాధారణంగా రుణ ఆమోదానికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువ ఉన్న వ్యక్తులకు బ్యాంకులు తక్కువ వడ్డీకె రుణాలను ఇచ్చిన సందర్భాలు ఎక్కువ. ఇల్లు కొనడానికి ముందు మన క్రెడిట్ స్కోరు మెరుగు పరుచుకోవడం మంచిది. (చదవండి: ఎలన్ మస్క్‌పై దుమ్మెతిపోస్తున్న చైనా పౌరులు! ఎందుకంటే..) ఈఎమ్ఐ: రుణగ్రహీత నెలవారీ ఆదాయంలో కొత్త గృహ రుణం కోసం తీసుకునే ఈఎమ్ఐ 50-60 శాతం లోపు గల దరఖాస్తుదారులకు బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ఇష్టపడతారు. ఒకవేల మీకు ఇతర రుణాలు ఉంటే అవి పూర్తిగా చెల్లించిన తర్వాత లేదా కొంత మేరకు(50 శాతం వరకు) చెల్లించి గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. అలాగే, మీకు ఇతర ఖర్చులు గనుక ఉంటే సుదీర్ఘ రుణ కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. అత్యవసర నిధి: గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఒక ఆర్ధిక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే, భవిష్యత్‌లో ఎలాంటి ఊహించని కరోనా మహమ్మారి ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఎదురైనా కావచ్చు. అందుకే, ఈ నిదిలో ఎల్లపుడూ 6-12 నెలల ఈఎమ్ఐలకు సరిసమానమైన నగదు ఉంటే మంచిది. మీరు గనుక ఒక ఈఎమ్ఐను చెల్లించకపోయిన అది మిమ్మల్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ అత్యవసర నిధి వల్ల అటువంటి తీవ్రమైన పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది. (చదవండి: ఆహా ఏమి అదృష్టం!.. లక్షకు రూ.55 లక్షలు లాభం) -
ఫ్రీగా మీ క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోండి ఇలా..!
మనం ఏదైనా బ్యాంక్ నుంచి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మొదట ఆ బ్యాంక్ చూసేది మన క్రెడిట్ స్కోర్‌నే. క్రెడిట్ స్కోరు బాగున్న వ్యక్తులకే బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. అదే మీ క్రెడిట్ స్కోరు గనుక తక్కువగా ఉంటే రుణం ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకాడతాయి. ఒకవేళ రుణం ఇచ్చినా ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి రావొచ్చు. గృహ, వాహన, వ్యక్తిగత రుణాల విషయంలో క్రెడిట్ స్కోరు చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే, భవిష్యత్‌లో మనం రుణాలు తీసుకోవాలంటే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. అందుకే, మన క్రెడిట్ స్కోర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ఉత్తమం. గతంలో ఈ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలంటే కొంత మొత్తం చెల్లించాల్సి వచ్చేది. కానీ, ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉచితంగా క్రెడిట్ స్కోర్ అందిస్తున్నాయి. ఏలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా పేటీఎం తన యూజర్ల కోసం క్రెడిట్‌స్కోర్‌ను ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పేటీఎం తెచ్చిన ఈ సదుపాయంతో యాక్టివ్ క్రెడిట్ కార్డ్, రుణ ఖాతా వివరాలతో సహా వివరణాత్మక క్రెడిట్ నివేదికలను కూడా చూడవచ్చును. అలాగే వినియోగదారులు సిబిల్ స్కోర్‌ను ఎలా మెరుగుపరచాలి, క్రెడిట్ రిపోర్ట్‌ను ఏవిధంగా అర్థం చేసుకోవాలి, రుణం పొందటానికి మంచి సిబిల్ స్కోరు కలిగి ఉండటం వంటి విషయాలను కూడా పేటియం అందిస్తోంది. ఇప్పుడు పేటీఎం ద్వారా ఫ్రీగా క్రెడిట్ స్కోర్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫ్రీగా క్రెడిట్‌స్కోర్‌ను పేటీఎంలో తెలుసుకోండి ఇలా: ముందుగా మీ పేటియం యాప్‌ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత హోమ్ స్క్రీన్‌లో కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ విభాగంలో ఉన్న ఫ్రీ క్రెడిట్ స్కోర్ మీద క్లిక్ చేయండి. మీకు మీ సమాచారం ఉన్న ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ పాన్‌కార్డ్ నంబర్, పుట్టినతేదీని ఎంటర్ చేయండి. మీరు మొదటిసారిగా చెక్ చేసుకుంటున్నట్లు ఉంటే మీ ప్రొఫైల్ ధృవీకరణ కోసం ఓటిపీ వస్తోంది. ఓటీపీను ఎంటర్ చేసిన కొద్ది నిమిషాలకే మీకు మీ క్రెడిట్ స్కోర్ మీ కళ్ల ముందు కనిపిస్తోంది. అంతేగాకుండా మీరు ఇంకా డిటైల్‌గా రిపోర్ట్‌ను తెలుసుకోవాలంటే వ్యూ డిటేల్ఢ్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు పూర్తి సమాచారం కన్పిస్తుంది. క్లిక్ చేసిన వెంటనే మీకు మీరు జాతీయ, రాష్ట్ర, జిల్లా వారిగా మీ క్రెడిట్ స్కోర్ ఎక్కడ ఉందో చూపిస్తోంది. వాటితో పాటుగా ఫ్యాక్టర్స్ ఇంపాక్టింగ్ యువర్ క్రెడిట్ స్కోర్‌ను కూడా చూపిస్తోంది. (చదవండి: 2021లో తెగ వెతికిన టాప్-5 ఎస్యువీ కార్లు ఇవే..!) -
పండుగ సీజన్ రాకముందే ఎస్బీఐ ఆఫర్ల వర్షం
ముంబై: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ పండుగ రాకముందే ఖాతాదారులకు ఆఫర్ల వర్షం కురిపించింది. త్వరలో రాబోయే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తుంది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా క్రెడిట్ స్కోరు ఆధారంగా జీరో ప్రాసెసింగ్ ఫీజుతో కేవలం 6.70 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలను అందిస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. ఇంతకు ముందు రూ.75 లక్షల కంటే ఎక్కువ రుణాన్ని పొందాలంటే రుణగ్రహీత 7.15% వడ్డీ రేటు చెల్లించాల్సి వచ్చేది. పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టడంతో రుణగ్రహీత ఇప్పుడు 6.70% కంటే తక్కువ రేటుతో గృహ రుణాన్ని పొందవచ్చు. రూ.8 లక్షలు ఆదా.. ఈ ఆఫర్ వల్ల 45 బీపీఎస్ పాయింట్లు ఆదా అవుతుంది. దీని వల్ల పరోక్షంగా రుణగ్రహీతకు రూ.8 లక్షలకు పైగా భారీ వడ్డీ ఆదా కానున్నట్లు సంస్థ పేర్కొంది. 30 సంవత్సరాల కాలానికి రూ.75 లక్షల రుణం అందించే అవకాశం ఉంటుంది. అలాగే, గతంలో వేతనేతర రుణగ్రహీతలకు వర్తించే వడ్డీ రేటు వేతన రుణగ్రహీతలకు వర్తించే వడ్డీ రేటు మధ్య 15 బీపీఎస్ వ్యత్యాసం ఉండేది. వేతన, వేతనేతర రుణగ్రహీతల మధ్య ఈ వ్యత్యాసాన్ని ఎస్బీఐ తాజాగా తొలగించింది. ఇక వేతనేతర రుణగ్రహీతలకు 15 బీపీఎస్ వడ్డీ ఆదా అవుతుంది. (చదవండి: Gpay: గూగుల్ పే భారీ అవకతవకలు!) ఈ కొత్త ఆఫర్ల వల్ల పండుగ సీజన్లో ఖాతాదారులు, రుణగ్రహితలు మరింత సంతోషంగా పండుగలు జరుపుకుంటారు అని ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్(రిటైల్ & డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ సెట్టీ మాట్లాడుతూ.. "ఈసారి, మేము ఆఫర్లను మరింత సమ్మిళితంగా చేసాము. రుణ మొత్తం అనేది రుణగ్రహీత వృత్తితో సంబంధం లేకుండా అందిరికి ఒకేవిధంగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 6.70% వడ్డీరేటు, జీరో ప్రాసెసింగ్ ఫీజులు, రాయితీ వడ్డీ రేట్లు గృహ రుణాలను మరింత చౌకగా చేస్తాయని మేము నమ్ముతున్నాము. ఈ మహమ్మారి సమయంలో మన దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తుంది. ప్రతి భారతీయుడికీ బ్యాంకర్ గా అందరికీ గృహవసతి కల్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో మా వంతు కృషి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని ఆయన అన్నారు. -
‘స్కోర్’ బాగుంటే రుణం ఈజీ!
మీరు తీసుకున్న రుణమే మీ అర్హతలను నిర్దేశిస్తుంది. భవిష్యత్తులో మీకు అవసరం ఏర్పడితే రుణదాతలు క్యూ కట్టి ‘బాబ్బాబు మేము ఇస్తాం’ అనే విధంగా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. నేటి రోజుల్లో రుణం లభించడం ఎంత సులభమో.. అంత కష్టం కూడా. ఎందుకంటే ఓ వ్యక్తి రుణ చరిత్ర అంతా క్రెడిట్ బ్యూరోల రికార్డుల్లో వివరంగా నమోదవుతుంటుంది. రుణాల మంజూరుకు ముందు బ్యాంకు అయినా ఎన్బీఎఫ్సీ అయినా దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోరును కచి్చతంగా పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోరు మీ రుణ అర్హతను నిర్ణయించడమే కాదు.. ఎంత వడ్డీ రేటు వసూలు చేయాలనే విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే.. మీకు అంత ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు, కోరుకున్నంత రుణం లభిస్తుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే మీ రుణ దరఖాస్తు స్వీకరణ లేదా తిరస్కరణ అనేది మీ క్రెడిట్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు? మీ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలన్నది ఓసారి చూద్దాం... ఎలా లెక్కిస్తారంటే.. రుణ గ్రహీతల విశ్వసనీయతను.. చెల్లింపుల సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణాల్లో క్రెడిట్ స్కోర్ ఒకటి. దరఖాస్తుదారుల రుణ అర్హతను అంచనా వేయడానికి, రుణ మొత్తాన్ని నిర్ణయించడానికి బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తుంటాయి. దీనికితోడు, ఇతర సమాచారం ఆధారంగా రుణాలకు అర్హులా, కాదా? అన్నది నిర్ణయిస్తారు. వడ్డీ రేటుకూ ఇదే ప్రామాణికం అవుతుంది. రుణాల మంజూరు, తిరిగి చెల్లింపుల సమాచారాన్ని రుణ గ్రహీతల పాన్ నంబర్ ఆధారంగా.. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) క్రమం తప్పకుండా నిరీ్ణత కాలానికోసారి క్రెడిట్ బ్యూరో సంస్థలకు (సిబిల్ తదితర) అందిస్తుంటాయి. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ స్కోరును నిర్ణయిస్తుంటాయి బ్యూరోలు. సాధారణంగా గత 36 నెలల రుణ చరిత్ర ఆధారంగా క్రెడిట్ స్కోర్ ఉంటుంది. చెల్లింపుల తీరు, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మిశ్రమం ఎలా ఉంది, రుణాల కోసం విచారణలు, రుణాల వినియోగం.. ఈ నాలుగు అంశాలు మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంటాయి. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆల్గోరిథమ్‌ల సాయంతో.. రుణ చరిత్రతోపాటు వినియోగదారుల దీర్ఘకాలిక ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ (చెల్లించాల్సిన బకాయిలు), క్రెడిట్ కార్డ్‌ల లావాదేవీల చరిత్ర, కొత్త ఖాతాల ప్రారంభం లేదా తొలగింపులు, తిరిగి చెల్లింపుల నిష్పత్తి వంటివి కూడా క్రెడిట్ బ్యూరోలకు ప్రామాణికంగా మారాయి. సాధారణంగా.. 300 నుంచి 900 వరకు క్రెడిట్ స్కోర్ ఉంటుంది. రుణదాతలకు వ్యక్తిగత రుణాలు లభించాలంటే.. కనీస సిబిల్ స్కోర్ 720 నుంచి 750 మధ్య అయినా ఉండాలి. ఇంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే రుణాన్ని అధిక మొత్తంలో పొందే అర్హత ఉంటుంది. స్కోర్ తక్కువగా ఉంటే రుణం కూడా తక్కువే వస్తుంది. స్కోర్‌ను చెక్ చేసుకోవచ్చు.. క్రెడిట్ బ్యూరో సంస్థలు ఏటా ఒక్కసారి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ పొందే సౌకర్యాన్ని కలి్పస్తున్నాయి. ఇక వివిధ రకాల ఆర్థిక సేవల సంస్థలు సైతం తమ పోర్టళ్ల నుంచి, యాప్స్ నుంచి క్రెడిట్ స్కోరును ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని కలి్పస్తుంటాయి. తద్వారా రుణాల ఆఫర్లను అందించొచ్చన్న ప్రయోజనం అందులో దాగుంటుంది. మీకు రుణ అవసరం ఉన్నా, లేకపోయినా క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా తెలుసుకునే సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. పాన్ నంబర్ సాయంతో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. మొబైల్ నంబరుకు వచ్చే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా మీ గుర్తింపును ధ్రువీకరించిన అనంతరం క్షణాల్లో ఉచితంగా మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్‌ను అందుకుంటారు. స్కోర్‌ను మెరుగుపరుచుకోవాలంటే.. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించడమే స్కోర్‌ను పెంచుకోవడానికి ప్రాథమిక సూత్రం. రుణ వాయిదాల చెల్లింపుల్లో డిఫాల్ట్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు వల్ల, మర్చిపోవడం కారణంగానే వాయిదా రోజున చెల్లింపులు చేయలేకపోతే.. కంపెనీ నుంచి మీ కాల్ వచ్చిన తర్వాత అయినా వెంటనే ఆ వాయిదాను చెల్లించేయాలి. రీపేమెంట్లో ఎలాంటి జాప్యం చేసినా సరే రుణదాతలు దీన్ని ప్రతికూల అంశంగా పరిగణిస్తుంటారు. గృహ, వాహన రుణాలు సెక్యూర్డ్ రుణాల కిందకు వస్తాయి. వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్ రుణాలు అన్‌సెక్యూర్డ్‌గా ఉంటాయి. సెక్యూర్డ్ రుణాల్లో రుణదాత విఫలమైనా, రుణమిచి్చన సంస్థలకు రిస్క్ పెద్దగా ఉండదు. ఎందుకంటే హామీగా ఆస్తులు ఉంటాయి. వాటిని విక్రయించి సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణాలను ఎగ్గొడితే.. వసూలు చేసుకోవడం రుణమిచి్చన సంస్థలకు తలనొప్పిగా పరిణమిస్తుంది. అందుకే రుణదాతలు అన్సెక్యూర్డ్స్ రుణాలు, వాటిని తిరిగి ఏ విధంగా చెల్లిస్తున్నారన్న చరిత్ర గురించి లోతైన విశ్లేషణ చేస్తుంటారు. మీ సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించేవి కూడా ఈ అన్సెక్యూర్డ్ రుణాలే. ముఖ్యంగా..జాయింట్ బ్యాంక్ అకౌంట్‌ను కలిగి ఉన్న వారికి హామీ ఇవ్వటంలో జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఆయా ఖాతా చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులెదురైనా ఆ బాధ్యత జాయింట్ ఖాతాదారులైన మీ మీద కూడా పడుతుంది. అంతిమంగా దీని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద కూడా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా మీ స్కోర్‌ను పెంచుకోవాలంటే.. వ్యక్తిగత రుణం, క్రెడిట్‌కార్డు వినియోగం, వాహన రుణం, గృహ రుణం ఇలా రుణ పోర్ట్‌ఫోలియో వైవిధ్యంగా ఉండడం కూడా ప్రభావం చూపిస్తుంది. క్రెడిట్‌కార్డు లేకపోతే దాన్ని తీసుకుని పరిమిత వినియోగంతోపాటు సకాలంలో చెల్లింపులతోనూ స్కోర్‌ను పెంచుకోవచ్చు. -
మన క్రెడిట్ స్కోరును వేగంగా ఎలా పెంచుకోవాలి..?
మనం ఏదైనా బ్యాంకు నుంచి రుణాన్ని పొందాలంటే ముందుగా క్రెడిట్ స్కోర్/ సిబిల్ స్కోర్ ఏంత ఉందని కచ్చితంగా చూస్తారు. మన క్రెడిట్ స్కోర్ బాగుంటేనే బ్యాంకులు మనకు రుణాలు ఇవ్వడానికి ముందుకువస్తాయి. మీ సిబిల్ స్కోరు అనేది మీ క్రెడిట్ చరిత్రను చూపిస్తుంది. అందుకే మన సిబిల్ స్కోరు ఎంత మంచిగా ఉంటే అంత మంచిది. మన క్రెడిట్స్కోర్/సిబిల్ స్కోరు గనుక 650 కంటే తక్కువ ఉంటే లోన్ ఆమోదం పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే మనం మన సిబిల్ స్కోర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే మంచిది. అయితే, మన సిబిల్ స్కోరు గనుక తక్కువగా గనుక ఉంటే ఎలా పెంచుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..(చదవండి: బ్యాటరీతో నడవనున్న హీరో స్ప్లెండర్ బైక్) క్రెడిట్ కార్డు బకాయిలను సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోరు మెరుగుపరుచుకోవచ్చు. సకాలంలో బకాయిలు చెల్లించడం వల్ల వడ్డీ పెరగకపోవడమే కాకుండా, దీర్ఘకాలంలో మన క్రెడిట్ స్కోరు మెరుగుపడే ఉంటుంది. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ లో 30% కంటే తక్కువ ఉపయోగించడం వల్ల మీ క్రెడిట్ స్కోరు దెబ్బతినకుండా ఉంటుంది. మరోవైపు, మీ క్రెడిట్ కార్డు లిమిట్ కంటే ఎక్కువగా ఉపయోగించకపోవడం వల్ల మీ క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎక్కువ రుణాల కోసం ధరఖాస్తు చేసుకోకపోవడం కూడా మంచిదే. క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసేటప్పుడు తెలివిగా ఆలోచించండి. రుణాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు క్రెడిట్ కార్డులు సహాయకారిగా ఉన్నప్పటికీ, అధిక సంఖ్యలో క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం, ఎక్కువ మొత్తంలో కొనుగోళ్లు చేయడం మంచిది కాదు. 2012లో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ చేసిన అధ్యయనంలో సుమారు 20 శాతం మంది వినియోగదారులు వారి క్రెడిట్ నివేదికలో లోపం ఉన్నట్లు కనుగొన్నారు. మీ క్రెడిట్ కార్డులో రిపోర్టులో లోపం లేకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మంచిది. ఎటువంటి రుణం/క్రెడిట్ కార్డు తీసుకొని వ్యక్తి సిబిల్ స్కోరు సాధారణంగా తక్కువ ఉంటుంది. కాబట్టి వారికి రుణాలు త్వరగా పొందడం కష్టతరం అవుతుంది. అందువల్ల, మీ క్రెడిట్ చరిత్ర పెంచుకోవడం కొరకు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక రుణాలు తీసుకుంటే మంచిది. క్రెడిట్ కార్డు బకాయిలను సకాలంలో చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ లిమిట్ అనేది పెరుగుతుంది. కాబట్టి, క్రెడిట్ లిమిట్ అనేది క్రెడిట్ స్కోరు మీద కొంత ప్రభావం చూపిస్తుంది. అందుకోసమే క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకుంటే మంచిది. మీ క్రెడిట్ స్కోరు మీ గత క్రెడిట్ చరిత్రకు ప్రతిబింబం. దాని ఆధారంగా, రుణదాత రుణ దరఖాస్తును ఆమోదిస్తారు. అందువల్ల, మీ పాత మంచి రుణ ఖాతా రికార్డులను మీ క్రెడిట్ రిపోర్ట్ లో ఉంచడం మీ క్రెడిట్ స్కోరుకు మంచి చేకూరుస్తుంది. మీరు ఇతర వ్యక్తులకు పూచికత్తుగా ఉండటం వల్ల ఒక్కోసారి మీ క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. అందుకని, అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. ఎక్కువ క్రెడిట్ కార్డుల కోసం, ఎక్కువ రుణాల కోసం ధరఖాస్తు చేసుకోవద్దు. దీనివల్ల మీ క్రెడిట్ స్కోరు కచ్చితంగా దెబ్బతింటుంది. కాబట్టి, ఒక రుణం తీసుకున్న తర్వాత మరొక రుణం తీసుకోవడం మంచిది. క్రెడిట్ స్కోరు రాత్రికి రాత్రే మెరుగుపడదు. కాబట్టి, క్రెడిట్ రిపోర్ట్ పెరగడానికి కొంచెం ఓపిక అవసరం. అందుకని, మీరు సహనంగా ఉండాలి. -
Credit Score: ఉచితంగా మీ క్రెడిట్‌స్కోర్‌ను ఇలా తెలుసుకోండి..
ఏదైనా బ్యాంకు నుంచి రుణాన్ని పొందాలంటే ముందుగా క్రెడిట్స్కోర్ ఏంత ఉందని కచ్చితంగా అడుగుతారు. క్రెడిట్స్కోర్ బాగుంటేనే బ్యాంకుల నుంచి రుణాలను తీసుకోవడానికి అర్హులమవుతాం. క్రెడిట్‌స్కోర్‌ను కొన్ని వాణిజ్య వెబ్సైట్లు కొంత రుసమును తీసుకొని మీ క్రెడిట్‌స్కోర్‌ను తెలుపుతాయి. కాగా ఏలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా పేటియం తన యూజర్ల కోసం క్రెడిట్‌స్కోర్‌ను తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పేటియం తెచ్చిన సదుపాయంతో క్రియాశీల క్రెడిట్ కార్డ్, రుణ ఖాతా వివరాలతో సహా వివరణాత్మక క్రెడిట్ నివేదికలను కూడా చూడవచ్చును. అంతేకాకుండా యూజర్లు తమ క్రెడిట్ రేటింగ్లను నగరం,రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇతరులతో పోల్చకోవచ్చును. దాంతో పాటుగా వినియోగదారుల సిబిల్ స్కోర్‌ను ఎలా మెరుగుపరచాలి, క్రెడిట్ రిపోర్ట్‌ను ఏవిధంగా అర్థం చేసుకోవాలి, రుణం పొందటానికి మంచి సిబిల్ స్కోరు కలిగి ఉండటం వంటి విషయాలను కూడా పేటియం అందిస్తోంది.అధిక క్రెడిట్స్కోర్ ఉండటంతో మీరు సులువుగా రుణాన్ని పొందవచ్చును.పేటియంతో వినియోగదారుల తమ క్రెడిట్‌స్కోర్‌ను కేవలం నిమిషం లోపు అందిస్తోంది. క్రెడిట్‌స్కోర్‌ను పేటియం నుంచి ఇలా తెలుసుకోండి. ముందుగా మీ పేటియం యాప్‌ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. తరువాత హోమ్ స్క్రీన్‌లో కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ విభాగంలో ఉన్న ఫ్రీ క్రెడిట్ స్కోర్ పై క్లిక్ చేయండి. మీకు మీ సమాచారం ఉన్న విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ పాన్‌కార్డ్ నంబర్, పుట్టినతేదీని ఎంటర్ చేయండి. మీరు మొదటిసారిగా చెక్ చేసుకుంటున్నట్లు ఉంటే మీ ప్రొఫైల్ ధృవీకరణ కోసం ఓటిపీ వస్తోంది. ఓటీపీను ఎంటర్ చేసిన కొద్ది నిమిషాలకే మీకు మీ క్రెడిట్ స్కోర్ మీ కళ్ల ముందు కనిపిస్తోంది. అంతేకాకుండా మీరు ఇంకా డిటైల్‌గా రిపోర్ట్‌ను తెలుసుకోవాలంటే వ్యూ డిటేల్ఢ్ రిపోర్ట్ మీద క్లిక్ మీకు పూర్తి సమాచారం వస్తోంది. క్లిక్ చేసిన వెంటనే మీకు మీరు జాతీయ, రాష్ట్ర, జిల్లా వారిగా మీ క్రెడిట్ స్కోర్ ఎక్కడ ఉందో చూపిస్తోంది. వాటితో పాటుగా ఫ్యాక్టర్స్ ఇంపాక్టింగ్ యువర్ క్రెడిట్ స్కోర్‌ను కూడా చూపిస్తోంది. ఫ్యాక్టర్స్ ఇంపాక్టింగ్ యువర్ క్రెడిట్ స్కోర్: క్రెడిట్ కార్డ్ వినియోగం చెల్లింపుల హిస్టరీ ఎజ్ ఆఫ్ అకౌంట్స్ మీకు ఉన్న మొత్తం అకౌంట్లను చూపిస్తుంది. క్రెడిట్ ఎంక్వైరీలో మీరు ఎన్ని సార్లు ఎంక్వైరీ చేశారనే విషయాన్ని తెలుపుతుంది. చదవండి: కొత్తగా బ్యాంక్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ -
సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా బ్యాంక్ లోన్ ?!
సాక్షి,వెబ్‌డెస్క్: బ్యాంక్ నుంచి పొందే లోన్ ఎటువంటిదైనా సిబిల్ స్కోర్ బాగుండాలి. సిబిల్ స్కోర్ బాగుంటేనే మనం బ్యాంక్ నుంచి అవసరమైన రుణం పొందవచ్చు. కానీ క్రెడిట్ పేమెంట్ చేయక పోవడం వల్ల బ్యాంక్‌లు రుణాల్ని ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. కానీ సిబిల్ స్కోర్ బాగాలేకపోయినా కేవలం ఒక్క పద్దతిలోనే పర్సనల్ లోన్ పొందవచ్చు. కాకపోతే అది ఎంతవరకు సాధ్యమనేది బ్యాంక్ అధికారుల నిర్ణయంపై ఆదారపడి ఉంది. ఒకే ఒక్క పద్ధతి : అయితే వడ్డీ రేటు ఎక్కువే పర్సనల్ లోన్‌కి సిబిల్ స్కోర్ చాలా అవసరం. కాబట్టి సిబిల్ స్కోర్ తగ్గకుండా టైం టూ టైం పేమెంట్ చేసేలా చూసుకోవాలి. మనలో చాలామంది క్రెడిట్ కార్డ్ స్కోర్ తక్కువగా ఉన్నా బ్యాంక్ లోన్ల కోసం ట్రై చేస్తుంటారు. అయతే బ్యాంక్ లు లోన్లను రిజెక్ట్ చేస్తుంటాయి. అయితే ఒక్క పద్దతిలో మాత్రమే సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా లోన్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు సిబిల్ స్కోర్ సరిగ్గా లేకుండా మన లోన్ మొత్తం రూ.10లక్షలు అవసరం ఉంటే బ్యాంకులు రూ.5లక్షలు ఇచ్చేందుకు మొగ్గుచూపుతాయి. అంతకంటే ఎక్కువ రుణం ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గిపోతుంది క్రెడిట్ కార్డ్ విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు క్రెడిట్ కార్డ్ స్కోర్ పై ప్రభావితం చూపిస్తాయి. వాటిలో సమయానికి లోన్, ఈఎంఐ చెల్లించకపోవడం నాలుగైదు నెలల ఈఎంఐని ఒకేసారి కట్టడం తక్కువ సమయంలో ఎక్కువ క్రెడిట్ కార్డ్‌ల కోసం అప్లయి చేయడం క్రెడిట్ కార్డ్ ను లిమిట్‌గా వాడుకోకపోవడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. మీ క్రెడిట్ కార్డ్ స్కోర్ కనీసం 700లు అంతకంటే ఎక్కువ ఉండేలా చూసువాలి. -
క్రెడిట్ స్కోర్ బాగున్నా, లోన్ ఎందుకు రిజెక్ట్ అవుతుందో తెలుసా?
సాక్షి,వెబ్ డెస్క్: మన అవసరాల్ని తీర్చుకునేందుకు క్రెడిట్ కార్డ్ ను వినియోగిస్తుంటాం. డబ్బులు చేతికి వచ్చాకా వాటిని తీర్చేస్తుంటాం. అయితే ఇప్పుడున్న ఆర్ధిక మాంద్యంలో డబ్బులు సరిపోక ఎక్కువ మంది పర్సనల్ లోన్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎక్కువ మంది లోన్లు రిజెక్ట్ అవుతున్నాయి. దీంతో సిబిల్ స్కోర్ బాగున్నా పర్సనల్ లోన్ ఎందుకు రిజెక్ట్ అయ్యిందని ఆలోచిస్తున్నారు. అందుకు కొన్ని కారణాలున్నాయని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనం సిబిల్ స్కోర్ బాగున్నా బ్యాంక్ లోన్ ఎందుకు రిజెక్ట్ అవుతుందో తెలుసుకుందాం. చదవండి: సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా బ్యాంక్ లోన్ ?! 1. అప్పు చాలా ఉంది మీరు బ్యాంక్‌లో లోన్ కోసం ప్రయత్నించే సమయంలో అధికారులు క్రెడిట్ కార్డ్ హిస్టరీని చెక్ చేస్తారు. మీ క్రెడిట్ కార్డ్ స్కోర్ బాగున్నా. క్రమం తప్పకుండా రుణం చెల్లిస్తున్నా. మీకున్న అప్పుల వల్ల బ్యాంకులు పర్సనల్ లోన్ ఇచ్చేందుకు ఇంట్రస్ట్ చూపించవు. అన్నీ బాగుండి మీకున్న అప్పులు ఎక్కువగా ఉంటే లోన్ రావడం చాలా కష్టం. ఆ విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. 2. ఆదాయం బాగుండాలి మీకు వచ్చే ఆదాయం తక్కువగా ఉంటే బ్యాంక్‌లు రుణాలు ఇవ్వవు. మీ ఆదాయం తగిన విధంగా లేకపోతే.. లోన్ ఇచ్చినా భవిష్యత్ లో తీసుకున్న రుణాన్ని తీర్చలేరేమోనన్న భావనతో లోన్ ఇవ్వడం పై విముఖత వ్యక్తం చేస్తుంటాయి. కాబట్టి ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టిసారిస్తే మంచిది. 3.క్రెడిట్ స్కోర్ అప్ డేట్ మీరు క్రెడిట్ కార్డ్ పేమెంట్ నిర్ణీత గడువులోపు చెల్లించినా బ్యాంక్ లోన్ రిజెక్ట్ అవ్వడానికి మరో కారణం సిబిల్ స్కోర్ ను అప్ డేట్ చేయించుకోపోవడమే. సిబిల్ స్కోర్ అప్ డేట్ చేయించుకోకపోయినా, క్రెడిట్ కార్డ్‌లు వినియోగంలో లేకపోయినా లోన్ తిరస్కరించబడుతుంది. 4. మూడు నెలల సమయం చాలా మంది ఉద్యోగంలో జాయిన్ అయిన వెంటనే బ్యాంక్ లో లోన్ కోసం ట్రై చేస్తుంటారు. కానీ జాబ్ ఉన్నా బ్యాంక్ లు లోన్లను రిజెక్ట్ చేస్తుంటాయి. అందుకు కారణం మూడునెలల గడువులోపే బ్యాంక్ లోన్లకు అప్లై చేయడం. బ్యాంక్ లోన్ అప్లై చేసే ముందు ప్రస్తుతం మనం ఎన్నినెలల జాబ్ చేశామనేది పరిగణలోకి తీసుకోవాలి. కొన్ని బ్యాంక్ లు సదరు రుణ గ్రహిత మూడు నెలలు, లేదా ఆరునెలలు ఏదైనా ఒక సంస్థలు ఉద్యోగం కొనసాగించాలి. అలాంటి వారికి బ్యాంకులు రుణాలిస్తాయి. 5. క్రెడిట్ కార్డ్‌తో పాటు లోన్ అంటే సాధ్యం కాదు కొత్తగా ఎవరైనా క్రెడిట్ కార్డ్ తీసుకున్న వెంటనే పర్సనల్ లోన్ కు అప్లై చేస్తుంటారు. అలా చేయడం వల్ల లోన్ రిజెక్ట్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ తీసుకొని కొన్ని నెలల పాటు వినియోగించాలి. టైం టూ టైం క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలి. ఆ తర్వాత సిబిల్ స్కోర్ బాగుండే బ్యాంక్ లోన్ త్వరగా వస్తుంది. లేదంటే బ్యాంకర్లు లోన్‌ను రిజెక్ట్ చేస్తారు. 6. రెండు కంటే ఎక్కువ ఉండకూడదు. క్రెడిట్ కార్డ్ తో డబ్బుల్ని ఆదా చేయాలని ఎక్కువ క్రెడిట్ కార్డ్ లను వినియోగిస్తుంటారు. అలా చేయడం వల్ల బ్యాంక్ లోన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని, కాబట్టే ఎక్కవ క్రెడిట్ కార్డ్ లను వినియోగిస్తున్నారని బ్యాంక్ అధికారులు భావిస్తారు. ఒకవేళ రిఫరెన్స్ తో బ్యాంక్ అధికారుల్ని సంపద్రించినా విచారణ చేపట్టి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందని, అందుకే లోన్ రిజెక్ట్ అయ్యిందని తప్పించుకుంటారు. 7. ధరఖాస్తులో పొరపాటు మీరు లోన్ అప్లై చేసే సమయంలో సంబంధిత డాక్యుమెంట్లపై జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు అందించే మీ పర్సనల్ డాక్యుమెంట్స్, బ్యాంక్ అధికారులు లోన్ ప్రాసెస్ కోసం ఇచ్చే ఫాం లలో వ్యక్తిగత వివరాలు తప్పులు లేకుండా చూసుకోవాలి. 8. ఐటీ రిటర్న్స్ పే చేయడంలో విఫలం ఐటీ రిటర్న్స్ పేచేయడంలో అలసత్వం ప్రదర్శించినా బ్యాంక్ లోన్ రిజెక్ట్ అవుతుంది. సమయానికి ఐటీ రిటర్న్స్ పే చేయడం ఉత్తమం 9. హామీ ఇచ్చిన వాళ్లు కట్టలేకపోవడం మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు హామీ ఇచ్చి కట్టకపోతే బ్యాంక్ లోన్ రిజెక్ట్ చేస్తుంది. -
నా క్రెడిట్ స్కోర్ ఎంత?
ముంబై: తమ క్రెడిట్ స్కోర్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ఎక్కవ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలకు సంబంధించి క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం గత కొన్నేళ్లలో భారీగా పెరిగినట్టు క్రెడిట్ సమాచార కంపెనీ ట్రాన్స్ యూనియన్ సిబిల్ తెలిపింది. 2017తో పోలిస్తే 2020లో రూ.25,000 దిగువన వ్యక్తిగత రుణాల్లో 23 రెట్ల వృద్ధి నమోదు కాగా.. 2020లో క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం అన్నది మూడు రెట్లు పెరిగినట్టు పేర్కొంది. అన్ని క్రెడిట్ సమాచార సంస్థలు (క్రెడిట్ బ్యూరోలు) ఏడాదికి ఒక్కసారి ఉచితంగా ప్రతీ వ్యక్తి క్రెడిట్ స్కోర్/రిపోర్ట్ తెలుసుకునే అవకాశం కల్పించాలంటూ ఆర్బీఐ 2016 సెపె్టంబర్లో ఆదేశాలు తీసుకురావడం గమనార్హం. ఆ తర్వాత నుంచి వ్యక్తులు ఉచితంగా క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోవడం పెరిగినట్టు గమనించొచ్చు. పరపతికి సంబంధించి వ్యక్తుల్లో అవగాహన పెరిగిందని.. క్రెడిట్‌స్కోర్‌ను ఎక్కువ పర్యాయాలు తెలుసుకునే వారి సంఖ్య రెట్టింపైనట్టు సిబిల్ నివేదిక తెలియజేసింది. -
వ్యక్తిగత రుణాలు వెంటనే ఆమోదించాలంటే?
కరోనా వైరస్ మహమ్మారి ప్రతి ఒక్కరికి ఎన్నోపాఠాలు నేర్పింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్ధిక వంటి విషయాలలో ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలియజేసింది. భవిష్యత్ అవసరాల కోసం ముందస్తు జాగ్రత్తలు అవసరం అని తెలిపింది. ఈ మహమ్మరి కాలంలో ఎక్కువ శాతం వ్యక్తిగత ప్రజలు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ పరిస్థితులలో తీసుకోవడం అంత మంచి ఆప్షన్ కాదు. ఎందుకంటే, వారి ఆదాయం విషయంలో ఎటువంటి గ్యారెంటీ ఉండదు. కానీ, వ్యక్తిగత రుణాలు తీసుకోవడం తప్పేలా లేదు. అయితే, ఈ రుణాల కోసం బ్యాంకుల నుంచి ఆమోదం పొందడం అంత సులభం కాదు ప్రధానంగా ఎవరికి అయితే అత్యంత అవసరం ఉంటుందో వారు తీసుకోవడం మంచిది. చాలా మంది ఎంచుకునే ఋణాలలో వ్యక్తిగత రుణం ఒకటి. వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాక వారు మీ ప్రతి వివరాలను పరీక్షిస్తారు. కానీ, చాలా మంది చిన్న చిన్న కారణాల వల్ల వారి ధరఖాస్తులు రద్దు చేయబడుతున్నాయి. వ్యక్తిగత రుణం కోసం ఆమోదం పొందే అవకాశాలను మీరు ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోండి క్రెడిట్ స్కోరు అనేది మూడు అంకెల సంఖ్య, ఇది దరఖాస్తుదారుడి క్రెడిట్ చరిత్రను సూచిస్తుంది. దీని వల్ల గతంలో మీరు తీసుకున్న రుణాలకు సంబందించిన చరిత్ర మొత్తం ఇక్కడ ఉంటుంది. గతంలో మీరు ఎప్పుడైనా తీసుకున్న ఋణాల ఈఎంఐ సకాలంలో చెల్లించరా? లేదా? అనే ప్రతి విషయం వారి దగ్గర ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటే తొందరగా రుణాలు మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. మొదట, మీ క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోండి? అవసరమైతే, ప్రస్తుత ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి తగినంత సంపాదిస్తున్నారని వారికి తెలియాలి. తక్కువగా ఉద్యోగాలు మారే వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సహ దరఖాస్తుదారు మీకు తగినంత ఆదాయం లేకపోతే, తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న లేదా బ్యాంకులు నిర్దేశించిన ఇతర అర్హత ప్రమాణాలు లేకపోయిన, మీరు మంచి ఆదాయం, క్రెడిట్ స్కోర్ గల వ్యక్తితో కలిసి ఉమ్మడిగా రుణం కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ లేకపోతే మీకు ఇది సహాయపడుతుంది. ఎందుకంటే సహ దరఖాస్తుదారుడు కూడా రుణం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఉమ్మడి ధరఖాస్తు వల్ల ఎక్కువ మొత్తం రుణం లభించే అవకాశం ఉంది. ఉద్యోగ చరిత్ర ఉద్యోగ చరిత్ర మీ ఆదాయంతో సహా అందులో స్థిరత్వాన్ని చూపిస్తుంది. దరఖాస్తు దారులు తరచూ ఉద్యోగాలు మారుతున్నట్లయితే లేదా స్థిర ఆదాయం లేనట్లయితే వారి విషయంలో రిస్కు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఒకే తరహా ఉద్యోగంలో ఎక్కువ రోజులు కొనసాగినట్లయితే కంపెనీని ఎక్కువ స్థిరత్వంగా పరిగణిస్తాయి. అంటే ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పనిచేయాలని కూడా అనుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా రుణాలు కోసం ధరఖాస్తు చేయకండి అనేక బ్యాంకులలో రుణాలు ధరఖాస్తు చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ క్షీణించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో బ్యాంకులు రుణం ఆమోదించే అవకాశం తక్కువగా ఉంటుంది. రుణ దరఖాస్తును తిరస్కరిస్తే మళ్లీ ఆరు నెలల తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి ప్రయతించండి. అలాగే, మీకు ఆదాయం తక్కువగా ఉంటే ఎక్కువ ఈఎంఐలు తీసుకుంటే మంచిది. దీని వల్ల మీరు తక్కువ ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. చదవండి: బిగ్ బజార్ బంపర్ ఆఫర్ -
క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాంకులు షాక్!
కరోనా మహమ్మారి తర్వాత క్రెడిట్ కార్డు వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుతం నగదు లావాదేవీల కంటే ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దింతో వారి వ్యక్తిగత అవసరాల కోసం క్రెడిట్ కార్డును విపరీతంగా వాడుతున్నారు. దీనికి తగ్గట్లే షాపింగ్ మాల్స్, ఈ-కామర్స్, బ్యాంకులు క్రెడిట్ కార్డుల మీద వివిధ ఆఫర్లు అందిస్తున్నారు. దీనివల్ల అవసరం లేకున్నా కూడా వస్తువులు కొని తర్వాత లోన్ కట్టలేక పోతున్నారు. దీని వల్ల అటు బ్యాంకులకు కూడా దీర్ఘకాలంలో నష్ట్టం వాటిల్లుతుంది. అయితే ఇటువంటి సమయంలో బ్యాంకులు క్రెడిట్ కార్డు విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇక నుంచి వినియోగదారులు క్రెడిట్ కార్డులను పొందడం ఈజీ కాకపోవచ్చు. ప్రస్తుతం క్రెడిట్ కార్డు హోల్డర్లు ఉండటంతో క్రెడిట్ లావాదేవీలపై లిమిట్ తగ్గించడంతో పాటు కొత్త కార్డు తీసుకొనాలనుకునే వారి సిబిల్ స్కోర్ ను పక్కాగా చూడనున్నాయి. సిబిల్ స్కోర్ బాగున్నవారికి మాత్రమే ఇక నుంచి క్రెడిట్ కార్డులను ఇవ్వాలని తాజాగా బ్యాంక్ లు నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంక్ లో రుణాలు మంజూరు చేసే ముందు వినియోగదారుల క్రెడిట్ స్కోర్ ను బ్యాంకులు పరిగణనలోకి తీసుకోనున్నాయి. గత ఏడాది మొండిబాకీలు పెరగడంతో ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. చదవండి: తిరుమల సందర్శకులకు తీపికబురు!