మీ క్రెడిట్ స్కోరు 620 దాటిందా? | 620 crosses your credit score? | Sakshi
Sakshi News home page

మీ క్రెడిట్ స్కోరు 620 దాటిందా?

Published Mon, Dec 14 2015 4:15 AM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM

మీ క్రెడిట్ స్కోరు  620 దాటిందా?

మీ క్రెడిట్ స్కోరు 620 దాటిందా?

మంచి స్కోరున్న వారికే బ్యాంకుల గృహ రుణాలు   
ఆర్థిక క్రమశిక్షణతోనే క్రెడిట్ స్కోరు మెరుగ

 
 ఇల్లు కట్టడమంటే అంత ఈజీ కాదు. మన సంస్కృతిలో ‘ఇంటి’ చుట్టూ ఎన్నెన్నో సామెతలు పుట్టుకొచ్చింది కూడా అందుకే. ఇల్లు కట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఇల్లు ఇన్వెస్ట్‌మెంట్ లాంటిదే కానీ... నిర్మాణానికి వెచ్చించిన డబ్బులు తిరిగి రావు. పెపైచ్చు ఎక్కువ మొత్తం కావాలి. పేద, సాధారణ ఉద్యోగులకు, మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి నిర్మాణం సవాలే. అయినా కూడా నిరాశపడకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల దగ్గర రుణం తీసుకొనైనా ఇల్లు కట్టాలని భావిస్తారు చాలా మంది. ఇక రుణాలివ్వటానికి బ్యాంకులు సవాలక్ష నిబంధనలు పెడతాయి. అలాంటి నిబంధనల్లో క్రెడిట్ స్కోరుదీ కీలకపాత్రే. తక్కువ క్రెడిట్ స్కోరుంటే డాక్యుమెంట్లన్నీ ఉన్నా రుణం పొందడటం కష్టం. ఒకవేళ పొందినా... వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అందుకే క్రెడిట్ స్కోరును పెంచుకోవాలి.
 
క్రెడిట్ లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు

ప్రతి క్రెడిట్ కార్డుకూ ఒక లిమిట్ ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక క్రెడిట్ కార్డు తీసుకుంటే.. దాని లిమిట్ రూ.2 లక్షల వరకు ఉందనుకోండి. అప్పుడు మీరు రూ.2 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చని అర్ధం. మీకు రూ.2 లక్షల లిమిట్ ఉన్నప్పటికీ కూడా మీరు ఆ మొత్తాన్ని వాడుకోవద్దు. క్రెడిట్ లిమిట్‌లో 40 శాతానికి మించి ఉపయోగించకపోవడం ఉత్తమం. ఆర్థిక క్రమశిక్షణకు ఇది దోహదపడుతుంది.

మంచి ట్రాక్ రికార్డును నిర్మించుకోండి
గతంలో ఎప్పుడూ రుణం తీసుకోకుండా ఉంటే సాధారణంగా క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటుందని అందరూ భావిస్తూ ఉంటారు. అది నిజం కాదు. మనం గతంలో ఎలాంటి క్రెడిట్ కార్డును ఉపయోగించి ఉండకపోతే.. మీకు సంబంధించి క్రెడిట్ స్కోరు వివరాలు క్రె డిట్ బ్యూరోల వద్ద ఉండవు. అప్పుడు అవి మీ గురించి ఒక అంచనాలకు రాలేవు. ఇలాంటి తప్పులను చేయకుండా ఉండాలంటే.. మీరు సంపాదన ప్రారంభించినప్పటి నుంచే క్రెడిట్ కార్డులను ఉపయోగించడం, వ్యక్తిగత రుణాలను తీసుకోవడం వంటి పనులకు శ్రీకారం చుట్టాలి. వాటిని సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి. అలా చేస్తూ మంచి ట్రాక్ రికార్డును ఏర్పాటు చేసుకుంటూ.. ఇంటి రుణం వంటి పెద్ద రుణాలను చెల్లించగలను అనే ధీమాను బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు కలిగేలా చేయాలి.
 
క్రెడిట్ మిక్సింగ్‌తో జాగ్రత్త
 సాధారణంగా సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ అనే రెండు రకాల రుణాలుంటాయి. అన్‌సెక్యూర్డ్ రుణాల కిందకు క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు వస్తాయి. సెక్యూర్డ్ రుణాల కిందకు ఇంటి రుణాలు సహా ఇతర రుణాలు వస్తాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సెక్యూర్డ్ రుణాలతో పోలిస్తే ఆన్‌సెక్యూర్డ్ రుణాలను ప్రమాదకరంగా భావిస్తాయి. ఎందుకంటే సెక్యూర్డ్ రుణాల్లో ఇళ్లు, తదితర భౌతిక వస్తువులు తనఖాగా ఉంటాయి. అన్‌సెక్యూర్డ్ రుణాల్లో ఈ పరిస్థితి ఉండదు. అందుకే రెండు రుణాలు తీసుకొని, రెండింటినీ సమపాళ్లలో సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఇతర రుణ  చెల్లింపులు లేవు. క్రెడిట్ కార్డు మాత్రమే ఉంది. అతను తన క్రెడిట్ చెల్లింపులను సక్రమంగానే చెల్లిస్తున్నాడు. అయినప్పటికీ అతని క్రెడిట్ స్కోర్ బాగుంటుందని అనుకోలేం. ఎందుకంటే అతని స్కోర్‌ను నిర్ణయించడానికి కావాలసిన సమాచారం క్రెడిట్ బ్యూరోల వద్ద ఉండదు.

ఇంటి రుణం తీసుకోవడానికి ముందు మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను సమీక్షించుకోండి. ఈ సమీక్ష ప్రతి నెలా జరగాలి. ఇలా సమీక్షించుకోవడం వల్ల మన బలహీనతలు ఎక్కడున్నాయనేది మనకు తెలుస్తుంది. వాటిని సరిచేసుకుంటే చాలు.  తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు. వాటిని సరిచేసుకున్నవాళ్లే ముందుకెళ్తారు. క్రెడిట్ రిపోర్ట్‌లో ఇబ్బందులుంటాయి. ఉదాహరణకు మీరు ఒక లావాదేవీకి సంబంధించి చెల్లింపులు జరిపారు. కానీ మీ రిపోర్ట్‌లో అది చెల్లించలేదని ఉంటుంది. బ్యాంకుల వల్లో, మీ వల్లో... రిపోర్ట్‌లో తప్పులు రావటానికైతే అవకాశాలుంటాయి. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. అందుకు బ్యాంకులతో, ఆర్థిక సంస్థలతో మాట్లాడాలి. అవసరమైన సమాచారాన్ని వాటికివ్వటమో, మీరు తీసుకోవడమో చేయాలి. తప్పులు సరిచేయాలంటే మీకు క్రెడిట్ కార్డులను జారీ చేసిన ఆర్థిక సంస్థల కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు నెంబర్‌ను నోట్ చేసుకొని ఉంచుకోండి. సమస్య వివరాలను, ఫిర్యాదు నెంబర్‌తో ఒక ఈ-మెయిల్‌ను సంస్థ ఫిర్యాదుల పరిష్కార విభాగానికి పంపించండి. అదే ఈ-మెయిల్ నఖలును క్రెడిట్ బ్యూరోకు కూడా పంపించండి. ఆ ఆర్థిక సంస్థ మీ ఫిర్యాదుకు నెల రోజుల్లో సమాధానమిస్తుంది. దాన్ని క్రెడిట్ బ్యూరోకు తెలియజేయండి.
     
ఒకవేళ ఆర్థిక సంస్థలు నెల రోజుల్లోగా మీకు సమాధానం ఇవ్వకపోయినా, సమస్యను పరిష్కరించకపోయినా అంబుడ్స్‌మన్‌ను సంప్రదించండి. అక్కడ కూడా మీ సమస్య పరిష్కారం కాకపోతే ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌కు అపీల్ చేసుకోండి. చివరి మార్గంగా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించండి. {Mెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోవడంలో సక్రమమైన చెల్లింపులదే కీలకపాత్ర. రుణం తీసుకున్న వ్యక్తి తన క్రెడిట్ కార్డుల బిల్లును, ఈఎంఐలను క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉంటే అతని క్రెడిట్ స్కోర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. క్రెడిట్ స్కోర్ రాత్రికి రాత్రే మెరుగుపడదు. ఇదో దీర్ఘకాల ప్రక్రియ.ఫెయిర్ ఐజాక్ కార్పొరేషన్ (ఫికో) రూపొందించిన ఫార్ములా ఆధారంగా క్రెడిట్ స్కోరును లెక్కిస్తారు. క్రెడిట్ స్కోరు 300-850 పాయింట్ల మధ్యలో ఉంటుంది. దీన్ని ఈక్విఫాక్స్, ఎక్స్‌పీరియన్, ట్రాన్స్‌యూనియన్ అనే మూడు క్రెడిట్ బ్యూరోలు ఇష్యూ చేస్తాయి. క్రెడిట్ స్కోరు 620 పాయింట్ల పైన ఉంటే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇంటి రుణాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. అంతకన్నా తక్కువగా ఉంటే రుణం రావడం కష్టమౌతుంది.
 
ఉన్నవి చాలు.. ఎక్కువ వద్దు..

కొందరు ఎక్కువ క్రెడిట్ కార్డులను తీసుకుంటే క్రెడిట్ స్కోరు మెరుగుపడుతుందని భావిస్తుంటారు. అది నిజం కాదు. మన క్రెడిట్ చెల్లింపులు క్రమం తప్పకుండా ఉంటే క్రెడిట్ స్కోరు పెరుగుతుంది. అంతే తప్ప ఎక్కువ క్రెడిట్‌కార్డుల వల్ల కాదు. పైగా కొత్త క్రెడిట్ కార్డుల చెల్లింపుల్లో జాప్యాలొస్తే అది మీకు కొత్త సమస్యను తీసుకువస్తుంది. ఇది వరకు ఉన్న క్రెడిట్ కార్డులనే బాగా ఉపయోగించుకోవడం ఉత్తమం. అలాగే పాత ఖాతాలను క్లోజ్ చేయడం మంచిది కాదు. క్రెడిట్ స్కోర్ అనేది గత చెల్లింపుల సమాచారం పైన ఆధారపడి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement