సాక్షి,వెబ్ డెస్క్: మన అవసరాల్ని తీర్చుకునేందుకు క్రెడిట్ కార్డ్ ను వినియోగిస్తుంటాం. డబ్బులు చేతికి వచ్చాకా వాటిని తీర్చేస్తుంటాం. అయితే ఇప్పుడున్న ఆర్ధిక మాంద్యంలో డబ్బులు సరిపోక ఎక్కువ మంది పర్సనల్ లోన్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎక‍్కువ మంది లోన్లు రిజెక్ట్ అవుతున్నాయి. దీంతో సిబిల్ స్కోర్ బాగున్నా పర్సనల్ లోన్ ఎందుకు రిజెక్ట్ అయ్యిందని ఆలోచిస్తున్నారు. అందుకు కొన్ని కారణాలున్నాయని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనం సిబిల్ స్కోర్ బాగున్నా బ్యాంక్ లోన్ ఎందుకు రిజెక్ట్ అవుతుందో తెలుసుకుందాం. చదవండి: సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా బ్యాంక్ లోన్ ?!
1. అప్పు చాలా ఉంది
మీరు బ్యాంక్‌లో లోన్ కోసం ప్రయత్నించే సమయంలో అధికారులు క్రెడిట్ కార్డ్ హిస్టరీని చెక్ చేస‍్తారు. మీ క్రెడిట్ కార్డ్ స్కోర్ బాగున్నా. క్రమం తప్పకుండా రుణం చెల్లిస్తున్నా. మీకున్న అప్పుల వల్ల బ్యాంకులు పర్సనల్ లోన్ ఇచ్చేందుకు ఇంట్రస్ట్ చూపించవు. అన్నీ బాగుండి మీకున్న అప్పులు ఎక్కువగా ఉంటే లోన్ రావడం చాలా కష్టం. ఆ విషయంలో జాగ‍్రత్త వహించాల్సిన అవసరం ఉంది.
2. ఆదాయం బాగుండాలి
మీకు వచ్చే ఆదాయం తక్కువగా ఉంటే బ్యాంక్‌లు రుణాలు ఇవ్వవు. మీ ఆదాయం తగిన విధంగా లేకపోతే.. లోన్ ఇచ్చినా భవిష్యత్ లో తీసుకున్న రుణాన్ని తీర్చలేరేమోనన్న భావనతో లోన్ ఇవ్వడం పై విముఖత వ్యక్తం చేస్తుంటాయి. కాబట్టి ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టిసారిస్తే మంచిది.
3.క్రెడిట్ స్కోర్ అప్ డేట్
మీరు క్రెడిట్ కార్డ్ పేమెంట్ నిర్ణీత గడువులోపు చెల్లించినా బ్యాంక్ లోన్ రిజెక్ట్ అవ్వడానికి మరో కారణం సిబిల్ స్కోర్ ను అప్ డేట్ చేయించుకోపోవడమే. సిబిల్ స్కోర్ అప్ డేట్ చేయించుకోకపోయినా, క్రెడిట్ కార్డ్‌లు వినియోగంలో లేకపోయినా లోన్ తిరస్కరించబడుతుంది.
4. మూడు నెలల సమయం
చాలా మంది ఉద్యోగంలో జాయిన్ అయిన వెంటనే బ్యాంక్ లో లోన్ కోసం ట్రై చేస్తుంటారు. కానీ జాబ్ ఉన్నా బ్యాంక్ లు లోన్లను రిజెక్ట్ చేస్తుంటాయి. అందుకు కారణం మూడునెలల గడువులోపే బ్యాంక్ లోన్లకు అప్లై చేయడం. బ్యాంక్ లోన్ అప్లై చేసే ముందు ప్రస్తుతం మనం ఎన్నినెలల జాబ్ చేశామనేది పరిగణలోకి తీసుకోవాలి. కొన్ని బ్యాంక్ లు సదరు రుణ గ్రహిత మూడు నెలలు, లేదా ఆరునెలలు ఏదైనా ఒక సంస్థలు ఉద్యోగం కొనసాగించాలి. అలాంటి వారికి బ్యాంకులు రుణాలిస్తాయి.
5. క్రెడిట్ కార్డ్‌తో పాటు లోన్ అంటే సాధ్యం కాదు
కొత్తగా ఎవరైనా క్రెడిట్ కార్డ్ తీసుకున్న వెంటనే పర్సనల్ లోన్ కు అప్లై చేస్తుంటారు. అలా చేయడం వల్ల లోన్ రిజెక్ట్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ తీసుకొని కొన్ని నెలల పాటు వినియోగించాలి. టైం టూ టైం క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలి. ఆ తర్వాత సిబిల్ స్కోర్ బాగుండే బ్యాంక్ లోన్ త్వరగా వస్తుంది. లేదంటే బ్యాంకర్లు లోన్‌ను రిజెక్ట్ చేస్తారు.
6. రెండు కంటే ఎక్కువ ఉండకూడదు.
క్రెడిట్ కార్డ్ తో డబ్బుల‍్ని ఆదా చేయాలని ఎక్కువ క్రెడిట్ కార్డ్ లను వినియోగిస్తుంటారు. అలా చేయడం వల్ల బ్యాంక్ లోన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని, కాబట్టే ఎక్కవ క్రెడిట్ కార్డ్ లను వినియోగిస్తున్నారని బ్యాంక్ అధికారులు భావిస్తారు. ఒకవేళ రిఫరెన్స్ తో బ్యాంక్ అధికారుల్ని సంపద్రించినా విచారణ చేపట్టి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందని, అందుకే లోన్ రిజెక్ట్ అయ్యిందని తప్పించుకుంటారు.
7. ధరఖాస్తులో పొరపాటు
మీరు లోన్ అప్లై చేసే సమయంలో సంబంధిత డాక్యుమెంట్లపై జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు అందించే మీ పర్సనల్ డాక్యుమెంట్స్, బ్యాంక్ అధికారులు లోన్ ప్రాసెస్ కోసం ఇచ్చే ఫాం లలో వ‍్యక్తిగత వివరాలు తప్పులు లేకుండా చూసుకోవాలి.
8. ఐటీ రిటర్న్స్ పే చేయడంలో విఫలం
ఐటీ రిటర్న్స్ పేచేయడంలో అలసత్వం ప్రదర్శించినా బ్యాంక్ లోన్ రిజెక్ట్ అవుతుంది. సమయానికి ఐటీ రిటర్న్స్ పే చేయడం ఉత్తమం
9. హామీ ఇచ్చిన వాళ్లు కట్టలేకపోవడం
మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు హామీ ఇచ్చి కట్టకపోతే బ్యాంక్ లోన్ రిజెక్ట్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment