ఇటీవల క్రెడిట్ కార్డ్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి కొత్త కొత్త పేర్లతో క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే రివార్డ్‌లు, తక్కువ వడ్డీలు, ఆఫర్లను అందించేవి బోలెడు ఉన్నా పూర్తిగా తెలుసుకోకుండా వాటిని ఉపయోగిస్తే అవి మన జేబులకు చిల్లు పెట్టే అవకాశం కూడా ఉందండోయ్.
అందుకే కేవలం కంపెనీలు అందిస్తున్న ప్రయోజనాలు మాత్రమే కాకుండా మీ అవసరాలకు ఎలాంటి క్రెడిట్ కార్డు సరిపోతుందో తెలుసుకోవాలి. ఆపై వాటిని తీసుకోవడం ఉత్తమం. సాధారణంగా ఒక వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోరు ఆధారంగా క్రెడిట్ కార్డు అర్హత లభిస్తుంది. ఇవి తీసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుందాం!
వినియోగం బట్టి కార్డు ఎంపిక ఉత్తమం
ముఖ్యంగా మీరు కార్డుని ఎలా వాడుకుంటారు అనేది క్రెడిట్ కార్డు ఎంపికలో కీలకం. ఉదాహరణకు కొందరు ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తుంటారు. అలాంటప్పుడు షాపింగ్ వెబ్‌సైట్లు,బ్రాండ్‌లపై డిస్కౌంట్లు అందించే కార్డును ఎంచుకుంటే మంచిది. లేదా మార్కెటింగ్ పని చేస్తున్నవారు ద్విచక్రవాహనంపై ఎక్కువగా తిరిగే అవకాశం ఉన్నందున.. పెట్రోలుపై క్యాష్ బ్యాక్, అధిక రివార్డు పాయింట్లు అందించే కార్డును పరిశీలించాల్సి ఉంటుంది.
మీ వాడకం బట్టి ఏ తరహా కార్డు కావాలో ఎంపిక చేసుకోండి. అంతేకాకుండా
,డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, రివార్డ్ వంటి ప్రయోజనాలు ఎలా పనిచేస్తాయన్న విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోని అనంతరం అవగాహనతో మీ కార్డును వినియోగించడం ఉత్తమం.
►మీ ఆదాయం, క్రెడిట్ స్కోరు ఆధారంగా బ్యాంకులు మీ క్రెడిట్ కార్డుకి పరిమితిని నిర్ణయిస్తాయి. పరిమితిలో 50 శాతానికి మించి ఉపయోగించకపోవడమే ఉత్తమం. లేదంటే అది క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
► కొన్ని బ్యాంకులు వాటి కార్డులపై వార్షిక రుసుములు వసూలు చేయడం లేదు. అయితే ఆ నిబంధన కూడా కొన్ని పరిమితులకు లోబడి ఉంటాయి. సంవత్సరంలో కస్టమర్ ఒక నిర్ణీత మొత్తం ఖర్చు చేసినప్పుడే ఈ రకమైన బెనిఫిట్ పొందగలరు. అన్నింటికంటే ముఖ్యమైనది కార్డు బిల్లుని గడువు తేది లోపు చెల్లించాలి.
చదవండి: బడ్జెట్ 2023: కేంద్రం ఫోకస్ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా!
Comments
Please login to add a commentAdd a comment