దేశంలోని బ్యాంకులు 2024 డిసెంబర్ నెలలో సుమారు 8,20,000 కొత్త క్రెడిట్ కార్డు(Credit Cards)లను జారీ చేశాయి. ఇది గడిచిన నాలుగు నెలల్లో అత్యధిక సంఖ్యలో కార్డుల జారీని సూచిస్తుంది. పెళ్లిళ్ల సీజన్, ఇయర్ ఎండ్ ఫెస్టివల్స్ సమయంలో ఖర్చులు అధికమవడం ఈ కార్డుల పెరుగుదలకు కారణమైందని నిపుణులు చెబుతున్నారు.
బ్యాంకుల వారీగా కార్డుల జారీ ఇలా..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్స్ కార్డుల జారీలో అగ్రస్థానంలో నిలిచాయి. మొత్తం జారీ చేసిన కార్డుల్లో ఈ రెండు సంస్థలే సగానికిపైగా వాటా ఆక్రమించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 3,12,000 కార్డులను జోడించగా, ఎస్‌బీఐ కార్డ్స్ 2,09,000 కార్డులను జారీ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ 1,50,000 కొత్త కార్డులు విడుదల చేసింది.
దేనికి ఖర్చు చేస్తున్నారంటే..
క్రెడిట్ కార్డు వ్యయం గతంలో కంటే దాదాపు 11 శాతం పెరిగి 2024 డిసెంబర్ నాటికి రూ.1.9 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అందించే ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, డీల్స్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లకు ఆదరణ లభించడం ఈ వ్యయం పెరగడానికి కారణం.
ఇదీ చదవండి: ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు అప్
మార్కెట్ వాటా, వృద్ధి
చలామణిలో ఉన్న మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 2024 నవంబర్‌లో 107.2 మిలియన్ల నుంచి 2024 డిసెంబర్ చివరి నాటికి 108 మిలియన్లకు చేరుకుంది. అన్ సెక్యూర్డ్ లోన్ల విభాగంలో సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత వివాహ సీజన్, రాబోయే వేసవి సెలవులను అందిపుచ్చుకోవడానికి బ్యాంకులు వ్యూహాత్మకంగా కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేస్తూ కస్టమర్లను పెంచుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment