credit cards
-
త్వరలో ప్రభుత్వ క్రెడిట్ కార్డులు..
కేంద్ర ప్రభుత్వం నుంచి క్రెడిట్ కార్డులను (Credit Cards) సూక్ష్మ పరిశ్రమ వ్యవస్థాపకులు త్వరలో అందుకోనున్నారు. 2025 కేంద్ర బడ్జెట్లో (Union Budget 2025-26) హామీ ఇచ్చినట్లుగా మైక్రో ఎంట్రాప్రెన్యూర్లకు రూ. 5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులను ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం జారీ చేయనుంది.ఈ సౌకర్యం రాబోయే కొన్నేళ్లలో సూక్ష్మ-యూనిట్లకు అదనంగా రూ. 30,000 కోట్ల నిధులను అందించగలదు. ఇది వ్యాపార విస్తరణ కోసం ఇతర రుణ ఎంపికలకు అనుబంధంగా ఉంటుంది. ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి, క్రెడిట్ కార్డు అందుకునేందుకు చిరు వ్యాపారులు నమోదు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో రూ. 5 లక్షల పరిమితితో ఈ క్రెడిట్ కార్డును పొందడానికి అర్హత ప్రమాణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..క్రెడిట్ కార్డు లిమిట్, షరతులురూ. 5 లక్షల లిమిట్ కలిగిన ఈ క్రెడిట్ కార్డ్.. చిరు దుకాణాలను, చిన్న తరహా తయారీ పరిశ్రమలను నిర్వహించేవారికి అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారుల యూపీఐ లావాదేవీలు, బ్యాంక్ స్టేట్మెంట్లు వ్యాపార పరిస్థితులు అంచనా వేసిన తర్వాత ఈ క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తారు. కార్డుకు ఒక సంవత్సరం చెల్లుబాటు వ్యవధి ఉంటుంది. రూ. 10-25 లక్షల మధ్య వార్షిక టర్నోవర్ ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ మైక్రో-క్రెడిట్ కార్డుకు అర్హులు.దరఖాస్తు ప్రక్రియప్రభుత్వం జారీ చేసే ఈ క్రెడిట్ కార్డును పొందడానికి, దేశవ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారులు ముందుగా ఉద్యమ్ (Udyam) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డును పొందవచ్చు. పోర్టల్‌లో నమోదుకు ఈ దశలు పాటించండి..» అధికారిక ఉద్యమ్ పోర్టల్ msme.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. » 'క్విక్ లింక్స్' పై క్లిక్ చేయండి.» 'ఉద్యమ్ రిజిస్ట్రేషన్' ఎంచుకోండి.» రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి తదుపరి సూచనలను అనుసరించండి. -
రుణబంధం పెరుగుతోంది
నూగూరి మహేందర్, సాక్షి ప్రతినిధి : ఒకప్పుడు చేబదులు కావాలంటే బంధువునో, స్నేహితులనో అడగాల్సిందే. లేదంటే తెలిసినవారి నుంచి వడ్డీకి అప్పు తీసుకోవాల్సిందే. వ్యక్తులు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. ఇప్పుడు ఒకరి ముందు నిలబడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఛాయ్ తాగేలోపు అప్పు పుడుతోంది. డబ్బులు పడ్డాయహో అంటూ ఫోన్ మెసేజ్ మోగుతుంది. ఏదైనా వస్తువు కొనాలన్నా, పేమెంట్స్ చేయాలన్నా ఖాతాలో, జేబులో డబ్బులు ఉండక్కర్లేదు. క్రెడిట్ కార్డు(Credit Card) ఉంటే చాలు. అంతే కాదు యూపీఐ యాప్‌ల ద్వారా చేసే లావాదేవీలను బట్టి ఇన్స్టంట్ రుణం(Instant Loan) ఇచ్చేందుకూ బ్యాంకులు క్యూ కడుతున్నాయి. సిబిల్ స్కోర్(CIBIL Score) లేకున్నా పర్వాలేదంటున్నాయి. అప్పు సరే.. తీర్చేదెలా అన్న సందేహమూ అక్కర్లేదు. సింపుల్‌గా సులభ వాయిదాల్లో (ఈఎంఐ) తీర్చేసే వెసులుబా టూ కల్పిస్తున్నాయి. కొన్నేళ్లుగా భారత్‌లో క్రెడిట్ కార్డులు, రుణాల వృద్ధి చూస్తుంటే ఆశ్చర్యం వేయక మానదు. ఈ రుణాల జోరు అభివృద్ధికి సూచికగా నిపుణులు చెబుతున్నారు. మెరుగైన జీవితం కోసం..: దిగువ–మధ్యతరగతి వినియోగదారులలో రుణాలు తీసుకునే విధానంలో గణనీయ మార్పు వచ్చి0ది. గతంలో మనుగడ కోసమైతే ఇప్పుడు ఆకాంక్షలు, వ్యాపారం, దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం రుణాలు తీసుకుంటున్నారు. ఈ మార్పు దేశంలో అభివృద్ధి చెందుతున్న సామాజిక–ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తోందని బ్యాంకింగ్ రంగ సంస్థలు అంటున్నాయి. కస్టమర్లు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయని చెబుతున్నాయి. రుణ లభ్యత, డిజిటల్ ఆధారిత బ్యాంకింగ్ మారుమూల పల్లెలకూ చొచ్చుకుపోవడం లోన్ పోర్ట్‌ఫోలియో పెరుగుదలకు దోహదం చేస్తోంది. నడిపిస్తున్న ధోరణులు..: కోవిడ్–19 మహమ్మారి రాక షాపింగ్ తీరుతెన్నులను మార్చేసింది. కన్జ్సూమర్ ఫైనాన్స్ రంగంలో ఉన్న హోమ్ క్రెడిట్ అధ్యయనం ప్రకారం.. ఆన్లైన్ షాపింగ్ వాటా 2021లో 69% ఉంటే.. 2023లో ఇది 48%కి, 2024 నాటికి 53%కి చేరింది. మహిళా కస్టమర్లలో 60%, మిలీనియల్స్ 59%, జనరేషన్ జెడ్ 58%, మెట్రోలు, టైర్–2 నగరాల్లో 56% మంది ఆన్లైన్ ట్రెండ్‌ను నడిపిస్తున్నారు. యాప్–ఆధారిత బ్యాంకింగ్‌కు మిలీనియల్స్‌లో 69% శాతం సై అంటున్నారు. జెన్ జెడ్ 65%, జెన్ ఎక్స్‌లో 58% యాప్ బేస్ట్ బ్యాంకింగ్ కోరుకుంటున్నారు. దిగువ–మధ్యతరగతి రుణగ్రహీతలలో 43% మందికి ఈఎంఐ కార్డ్‌లు అత్యంత ప్రజాదరణ పొందిన క్రెడిట్ సాధనంగా మారాయి. క్రెడిట్ కార్డ్‌లను 24%, డిజిటల్ లెండింగ్ యాప్‌లను 12% మంది ఎంచుకుంటున్నారు. వృద్ధిలోనూ ‘క్రెడిట్’ వాటికే..: 2024 డిసెంబర్ నాటికి దేశంలో జారీ అయిన క్రెడిట్ కార్డుల సంఖ్య 10.8 కోట్లు.. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం ఐదేళ్లలో క్రెడిట్ కార్డులు దాదాపు రెండింతలు అయ్యాయి. డెబిట్ కార్డులు ఐదేళ్లలో 80.53 కోట్ల నుంచి 2024 డిసెంబర్ నాటికి 99.09 కోట్లకు చేరాయి. ఏడాదిలో క్రెడిట్ కార్డుల వృద్ధి 10.31 శాతం ఉంటే డెబిట్ కార్డుల విషయంలో ఇది 3.13 శాతమే. క్రెడిట్ కార్డులతో జరిపిన చెల్లింపులు 2024 డిసెంబర్లో రూ.1,88,086 కోట్లుగా నమోదయ్యాయి. 2023 డిసెంబర్‌తో పోలిస్తే ఇది 13.9 శాతం ఎక్కువ. 2024 డిసెంబర్లో కార్డులతో చేసిన మొత్తం చెల్లింపుల విలువలో క్రెడిట్ కార్డుల వాటా 82.22 శాతం ఉండటం గమనార్హం. 2023 డిసెంబర్లో ఇది 77.5 శాతం. క్రెడిట్ కార్డుల విభాగంలో మొత్తం పోర్ట్‌ఫోలియోలో ప్రైవేటు బ్యాంకుల వాటానే 69.8 శాతంగా ఉంది. క్రెడిట్ కార్డు వినియోగదారులు 2024 మార్చి నాటికి చెల్లించాల్సిన మొత్తం 27.7 శాతం పెరిగి రూ.3 లక్షల కోట్లకు చేరింది. రుణాల వృద్ధి అభివృద్ధికి సూచికరుణాలు పెరుగుతుండటం అభివృద్ధికి సూచిక. బ్యాంకుల మద్దతు ఉంటేనే అభివృద్ధి సాధ్యం. బ్యాంకింగ్ లేకుండా వ్యవస్థ లేదు. వ్యవస్థ తదుపరి స్థాయికి చేరితేనే ప్రభుత్వానికి పన్నుల ఆదాయం పెరుగుతుంది. బ్యాంకులు లాభాల్లో ఉన్నాయంటే అందుకు కారణం అర్హతగల వారికి రుణాలు జారీ చేయడమే. రుణ మార్కెట్లో మొండి బాకీలు సహజం. అయితే సానుకూల ధోరణితోనే రికవరీ చేయాలి. ఆర్థిక స్థోమత చూసి క్రెడిట్ కార్డులు ఇచి్చనంత వరకు ఎటువంటి సమస్య లేదు. – వి.ఎస్.రాంబాబు, జాతీయ కార్యదర్శి, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా..వ్యాపార రుణాలు 2020లో 5 శాతమైతే.. 2024లో 21% ఎగిశాయివాహన రుణాలువ్యక్తిగత వాహనాల వినియోగం బాగా పెరుగుతోంది. ఈఎంఐలతో వాహనాలను కొనుగోలు చేసే వారే ఎక్కువబంగారంపై రుణం పెట్టుబడికే కాదు అత్యవసర సమయాల్లో ఆదుకునే సాధనంగా పుత్తడి నిలుస్తోంది. 2024 మార్చి నాటికి బంగారంపై రుణాలు రూ.7.1 లక్షల కోట్లుగా నమోదయ్యాయికన్జ్యూమర్ డ్యూరబుల్స్స్మార్ట్ఫోన్స్, గృహోపకరణాల కోసం తీసుకునే రుణాలు 2024లో 37% పెరిగాయిగృహ రుణాలు ఈ రుణాలు 2022లో 9% పెరిగితే.. 2024లో 15% దూసుకెళ్లాయివివాహాల కోసం రుణాలు ఇవి 2021లో 3%, 2024లో 5% వృద్ధి చెందాయిఅత్యవసర వైద్యం ఈ రుణాల వృద్ధి 2020లో 7% నుంచి 2024లో 3%కి తగ్గింది. ఆర్థిక ప్రణాళిక, బీమా పట్ల అవగాహన, అందుబాటు వ్యయాల్లో ఆరోగ్య సంరక్షణను ఇది సూచిస్తోందివిద్యా రుణాలు2022 నుంచి 2024 వరకు 4% వృద్ధి కొనసాగింది. పిల్లల విద్యకు ఉన్న నిరంతర ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతోంది -
భారత్‌లో క్రెడిట్ కార్డుల జోరు
ముంబై: క్రెడిట్ కార్డుల సంఖ్య భారత్‌లో సుమారు 10.8 కోట్లకు చేరింది. అయిదేళ్లలో వీటి సంఖ్య రెండింతలకుపైగా దూసుకెళ్లిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. 2019 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా కస్టమర్లకు జారీ అయిన క్రెడిట్ కార్డుల సంఖ్య 5.53 కోట్లు నమోదైంది. అయితే డెబిట్ కార్డుల సంఖ్య క్రెడిట్ కార్డుల స్థాయిలో పెరగకపోవడం గమనార్హం. డెబిట్ కార్డులు అయిదేళ్లలో 80.53 కోట్ల నుంచి 2024 డిసెంబర్ నాటికి 99.09 కోట్లకు చేరాయి. అంతా డిజిటల్‌మయం.. దశాబ్ద కాలంలో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. 2013లో రూ.772 లక్షల కోట్ల విలువైన 222 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. 2024లో ఈ లావాదేవీలు పరిమాణంలో 94 రెట్లు, విలువలో 3.5 రెట్లు పెరిగి రూ.2,758 లక్షల కోట్ల విలువైన 20,787 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అయిదేళ్లలో డిజిటల్ చెల్లింపులు పరిమాణంలో 6.7 రెట్లు, విలువలో 1.6 రెట్లు ఎగశాయి. అయిదేళ్లలో వార్షిక వృద్ధి ఏటా సగటున పరిమాణంలో 45.9 శాతం, విలువలో 10.2 శాతం పెరిగింది. రిటైల్ డిజిటల్ చెల్లింపులు 12 ఏళ్లలో సుమారు 100 రెట్లు దూసుకుపోయాయి. ఇవి 2012–13లో 162 కోట్ల లావాదేవీలు నమోదు కాగా.. 2023–24లో వీటి సంఖ్య ఏకంగా 16,416 కోట్లను తాకిందని నివేదిక తెలిపింది. విదేశాల్లోనూ యూపీఐ.. ఇతర దేశాల ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్‌తో యూపీఐని అనుసంధానించడం ద్వారా విదేశీ చెల్లింపులను మెరుగుపరిచేందుకు ఆర్బీఐ కృషి చేస్తోందని నివేదిక పేర్కొంది. అధిక వ్యయం, తక్కువ వేగం, సేవలు పరిమితంగా ఉండడం, విదేశాలకు చెల్లింపులలో పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడంలో ఇటువంటి అనుసంధానాలు సహాయపడతాయని పేర్కొంది. క్యూఆర్ కోడ్ల ద్వారా భారతీయ యూపీఐ యాప్‌లను ఉపయోగించి భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, యూఏఈలోని వ్యాపారులకు చెల్లింపులు చేయవచ్చు. చెల్లింపుల మౌలిక వసతులు, పనితీరులో చెప్పుకోదగ్గ వృద్ధి ఆర్బీఐ ప్రచురించిన డిజిటల్ పేమెంట్ ఇండెక్స్‌లో స్పష్టంగా కనిపిస్తుందని నివేదిక వివరించింది. -
నెలలో 8.2 లక్షల క్రెడిట్ కార్డులు జారీ
దేశంలోని బ్యాంకులు 2024 డిసెంబర్ నెలలో సుమారు 8,20,000 కొత్త క్రెడిట్ కార్డు(Credit Cards)లను జారీ చేశాయి. ఇది గడిచిన నాలుగు నెలల్లో అత్యధిక సంఖ్యలో కార్డుల జారీని సూచిస్తుంది. పెళ్లిళ్ల సీజన్, ఇయర్ ఎండ్ ఫెస్టివల్స్ సమయంలో ఖర్చులు అధికమవడం ఈ కార్డుల పెరుగుదలకు కారణమైందని నిపుణులు చెబుతున్నారు.బ్యాంకుల వారీగా కార్డుల జారీ ఇలా..హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్ కార్డుల జారీలో అగ్రస్థానంలో నిలిచాయి. మొత్తం జారీ చేసిన కార్డుల్లో ఈ రెండు సంస్థలే సగానికిపైగా వాటా ఆక్రమించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3,12,000 కార్డులను జోడించగా, ఎస్బీఐ కార్డ్స్ 2,09,000 కార్డులను జారీ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ 1,50,000 కొత్త కార్డులు విడుదల చేసింది.దేనికి ఖర్చు చేస్తున్నారంటే..క్రెడిట్ కార్డు వ్యయం గతంలో కంటే దాదాపు 11 శాతం పెరిగి 2024 డిసెంబర్ నాటికి రూ.1.9 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అందించే ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, డీల్స్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లకు ఆదరణ లభించడం ఈ వ్యయం పెరగడానికి కారణం.ఇదీ చదవండి: ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు అప్‌మార్కెట్ వాటా, వృద్ధిచలామణిలో ఉన్న మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 2024 నవంబర్‌లో 107.2 మిలియన్ల నుంచి 2024 డిసెంబర్ చివరి నాటికి 108 మిలియన్లకు చేరుకుంది. అన్ సెక్యూర్డ్ లోన్ల విభాగంలో సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత వివాహ సీజన్, రాబోయే వేసవి సెలవులను అందిపుచ్చుకోవడానికి బ్యాంకులు వ్యూహాత్మకంగా కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేస్తూ కస్టమర్లను పెంచుకుంటున్నారు. -
క్రెడిట్‌కార్డుతో పొరపాటున కూడా ఈ లావాదేవీలు చేయొద్దు..
ఆదాయపన్ను శాఖ (Income tax) ప్రతిఒక్కరినీ ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. అన్ని లావాదేవీలపైనా నిఘా ఉంచుతుంది. ప్రస్తుతం క్రెడిట్‌కార్డుల వినియోగం పెరిగింది. అన్ని రకాల చెల్లింపులకూ క్రెడిట్ కార్డులే (Credit cards) వినియోగిస్తున్నారు. అయితే ఆదాయపు పన్ను నోటీసు రాకుండా నివారించాలనుకుంటే పొరపాటున కూడా చేయని లావాదేవీలు కొన్ని ఉన్నాయి.క్రెడిట్ కార్డులతో చేసే కొన్ని లావాదేవీలు నేరుగా ఆదాయపు పన్ను శాఖ దృష్టికి రావచ్చు. మీకు నోటీసు పంపవచ్చు. ఇవి అలాంటి లావాదేవీలైతే, సీఏలు కూడా మిమ్మల్ని రక్షించలేరు. అందుకే ఈ సమాచారం క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు చాలా ముఖ్యమైనది. ఎటాంటి లావాదేవీలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయో ఇక్కడ తెలుసుకోండి.ఒక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలకు రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లయితే దాని డేటా ఆదాయపు పన్ను శాఖకు వెళుతుంది.క్రెడిట్ కార్డ్‌పై సంవత్సరానికి రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, ఆదాయపు పన్ను శాఖ మీపై నిఘా ఉంచుతుంది. రూ. 1 లక్ష కంటే ఎక్కువ నగదు రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు వంటి పెద్ద లావాదేవీలు శాఖ దృష్టిని ఆకర్షించవచ్చు.ఒక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్, షేర్లు లేదా బాండ్లలో రూ.10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినట్లయితే, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపవచ్చు.రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే, దాని సమాచారం ఆటోమేటిక్‌గా ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది.బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు జమ చేయడం ఆదాయపు పన్ను శాఖ దృష్టిని ఆకర్షిస్తుంది. రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే నోటీసు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.నగదు రూపంలో జరిగే వ్యాపార లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ నిఘా ఉంచుతుంది. రూ.50,000 కంటే ఎక్కువ వ్యాపార లావాదేవీల సమాచారం కోసం డిపార్ట్మెంట్ మిమ్మల్ని అడగవచ్చు. -
క్రెడిట్ కార్డ్.. గీత దాటొద్దు..!
క్రెడిట్ కార్డు యూజర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి యాక్టివ్ కార్డులు 10 కోట్ల మార్క్‌ను దాటగా.. వచ్చే ఐదేళ్లలో (2029 మార్చి నాటికి) 20 కోట్లకు పెరుగుతాయని పీడబ్ల్యూసీ అంచనా. యూపీఐ దెబ్బకు డెబిట్ కార్డుల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. చెల్లింపులకు వచ్చే సరికి యూపీఐ తర్వాత క్రెడిట్ కార్డుల హవాయే నడుస్తోంది. బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్ ఉంటేనే యూపీఐ. బ్యాలన్స్ లేకపోయినా క్రెడిట్ (అరువు)తో కొనుగోళ్లకు క్రెడిట్ కార్డులు వీలు కల్పిస్తాయి. అందుకే వీటి వినియోగం పట్ల ఆసక్తి పెరుగుతూ పోతోంది. కానీ, క్రెడిట్ కార్డ్‌లను ఇష్టారీతిన వాడేయడం సరికాదు. ఇది క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. భవిష్యత్‌లో రుణాల అర్హతకు గీటురాయిగా మారుతుంది. రుణ ఊబిలోకి నెట్టేసే ప్రమాదం లేకపోలేదు. క్రెడిట్ కార్డుపై లిమిట్ ఎంత? ఎంత వ్యయం చేయాలి? గీత దాటితే ఏమవుతుంది? తదితర అంశాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఇప్పడంతా డిజిటల్ చెల్లింపులే. కరోనా విపత్తు తర్వాత నుంచి నగదు చెల్లింపులు గణనీయంగా తగ్గిపోయాయి. వినియోగదారులు నగదుకు బదులు క్రెడిట్ కార్డుతో షాపింగ్‌కు వెళితే మరింత ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. పైగా గతంతో పోలిస్తే జీనవశైలి ఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో క్రెడిట్ కార్డుల స్వైపింగ్ మితిమీరుతోంది. పండుగల సందర్భంగా ఆకర్షించే ఆఫర్లు కూడా ఇందుకు ఒక కారణం. కార్డు ఉంది కదా అని చెప్పి ఇష్టారీతిన ఖర్చు చేస్తే.. తిరిగి చెల్లించేటప్పుడు ఆ భారం మోయాల్సి వస్తుంది. పైగా క్రెడిట్ స్కోర్‌ను ఇది ప్రతికూలంగా ప్రభావితం చేయగలదు. అందుకే క్రెడిట్ కార్డు వినియోగం విషయమై ప్రతి ఒక్కరూ అవగాహనతో, బాధ్యతతో వ్యవహరించాలి. క్రెడిట్ లిమిట్ కార్డుపై ఉన్న గరిష్ట వ్యయ పరిమితి ఇది. ఏ కాలంలో అయినా ఈ మేరకు గరిష్టంగా వినియోగించుకోవచ్చు. వినియోగించుకున్న మేర తదుపరి గడువు నాటికి పూర్తిగా చెల్లించేస్తే ఎలాంటి వడ్డీ భారం పడదు. ఆదాయం, వ్యక్తిగత ఆర్థిక చరిత్ర, రిస్క్ ఆధారంగా క్రెడిట్ లిమిట్‌ను కార్డు జారీ సమయంలోనే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు నిర్ణయిస్తుంటాయి. సాధారణంగా ఆరంభంలో తక్కువ లిమిట్‌తో కార్డులు జారీ చేస్తుంటాయి. కార్డుపై వినియోగం, చెల్లింపుల తీరు ఆధారంగా తర్వాతి కాలంలో ఈ లిమిట్‌ను సవరించుకునే అవకాశం ఉంటుంది. వినియోగం కార్డుపై క్రెడిట్ లిమిట్ రూ.లక్ష ఉందనుకుంటే.. గరిష్టంగా రూ.లక్ష వరకు వినియోగించుకోవచ్చని అర్థం. ఇలా పూర్తి పరిమితి మేర ప్రతి నెలా కార్డు ఖర్చు చేస్తుంటే అది క్రెడిట్ స్కోర్‌కు ఏ మాత్రం మంచిది కాదు. క్రెడిట్ వినియోగ నిష్పత్తి (సీయూఆర్) అని ఒకటి ఉంటుంది. రూ.లక్ష క్రెడిట్ లిమిట్ ఉన్నప్పుడు ఒక నెలలో రూ.90,000 ఖర్చు పెట్టారని అనుకుందాం. అప్పుడు సీయూఆర్ 90 శాతం అవుతుంది. ‘‘అధిక క్రెడిట్ వినియోగ నిష్పత్తి రుణ దాహార్తిని తెలియజేస్తుంది. ఇది క్రెడిట్ స్కోర్‌ను తగ్గించేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో సీయూఆర్ దాటి ఖర్చు చేయడం తప్పు కాదు. కానీ అది అరుదుగానే ఉండాలి. సీయూఆర్ 30 శాతం మించకుండా చూసుకుంటేనే మంచిది. కార్డుపై బకాయి మొత్తాన్ని గడువులోపు పూర్తిగా చెల్లించేయాలి. ఇలా చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. దీనివల్ల తర్వాతి కాలంలో క్రెడిట్ లిమిట్‌ను సులభంగా పెంచుకోవచ్చు. రుణాలను తక్కువ వడ్డీ రేటుకు పొందొచ్చు’’అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి సూచించారు. సాధారణంగా సీయూఆర్ 70 శాతం మించితే అది క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఖర్చులపై నియంత్రణలేమిని, బలహీన ఆర్థిక పరిస్థితులను ఇది తెలియజేస్తుంది. క్రెడిట్ స్కోర్‌పై రిమార్క్ కార్డు బకాయిల తిరిగి చెల్లింపులు తీరు క్రెడిట్ స్కోర్‌పై 35 శాతం మేర ప్రభావం చూపిస్తుందని బ్యాంక్ బజార్ చెబుతోంది. మెరుగైన క్రెడిట్ స్కోర్ కొనసాగాలంటే సకాలంలో బకాయిలు చెల్లించడం ఎంతో అవసరం. లేదంటే అధిక వడ్డీలకుతోడు, ఆలస్య రుసుములు చెల్లించాల్సి వస్తుంది. క్రెడిట్ స్కోర్ కూడా తగ్గిపోతుంది. క్రెడిట్ వినియోగ రేషియో అధికంగా ఉన్నా, క్రెడిట్ ఓవర్ లిమిట్‌కు వెళ్లినా కానీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రెడిట్ స్కోరును లెక్కించే సందర్భంగా తక్కువ సీయూఆర్‌ను సానుకూలంగా చూస్తామని క్రిఫ్ హైమార్క్ (క్రెడిట్ బ్యూరో) మాజీ ఎండీ సంజీత్ దావర్ తెలిపారు.క్రెడిట్ ఓవర్ లిమిట్ ఒక బిల్లు సైకిల్ పరిధిలో క్రెడిట్ లిమిట్‌ను మొత్తం వాడేస్తే.. తదుపరి చెల్లింపులకు అవకాశం ఉండదు. కానీ, క్రెడిట్ స్కోర్ అధికంగా ఉన్న వారికి ఇందులో వెసులుబాటు ఉంది. క్రెడిట్ ఓవర్ లిమిట్ సదుపాయం వినియోగించుకోవచ్చు. కార్డు లిమిట్ పూర్తయినప్పటికీ.. అదే కార్డుపై మరింత లిమిట్ తీసుకోవచ్చు. ఇందుకు అదనపు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ‘‘కొన్ని సందర్భాల్లో మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న కస్టమర్లకు తాత్కాలికంగా క్రెడిట్ లిమిట్‌ను బ్యాంక్‌లు పెంచుతాయి. ఇందుకోసం ముందుగానే సంప్రదించాలి. కొన్ని కార్డు సంస్థలు క్రెడిట్ లిమిట్ మించిపోయినప్పటికీ, లావాదేవీలను అనుమతిస్తుంటాయి. కాకపోతే అందుకు ఓవర్ లిమిట్ ఫీజు వడ్డిస్తాయి. పెనాల్టీ వడ్డీ రేట్లను కొన్ని అమలు చేస్తాయి. ఇవి సాధారణ రేట్ల కంటే అధికంగా ఉంటాయి’’అని ఆదిల్ శెట్టి వివరించారు. క్రెడిట్ ఓవర్ లిమిట్‌పై చార్జీలు అన్ని క్రెడిట్ కార్డు సంస్థల్లో ఒకే విధంగా ఉండవు. కొన్ని బ్యాంక్‌లు 2.5 శాతం లేదా కనీసం రూ.550, కొన్ని సంస్థలు 3 శాతం చొప్పున చార్జీ వసూలు చేస్తున్నాయి. క్రెడిట్ ఓవర్ లిమిట్ ఆప్షన్‌తో కొన్ని ప్రత్యేక కార్డులు కూడా ఉన్నాయి. లేని వారు బ్యాంక్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఏదైనా అసాధారణ పరిస్థితుల్లో తప్పించి, దీన్నొక అలవాటుగా మార్చుకోకూడదు. ఒకరికి ఎన్ని కార్డులు ‘‘అందరికీ ఒక్కటే సూత్రం వర్తించదు. ఆర్థిక పరిస్థితులు, ఖర్చు చేసే అలవాట్లపై ఎన్ని క్రెడిట్ కార్డులు అన్నది ఆధారపడి ఉంటుంది. బాధ్యతాయుతంగా వినియోగిస్తూ, సకాలంలో చెల్లింపులు చేసే వారు ఎన్ని కార్డులు అయినా కలిగి ఉండొచ్చు. కాకపోతే ఒకరికి రెండు లేదా మూడు కార్డులు మించి ఉండరాదన్నది సాధారణ సూత్రం’’అని మై మనీ మంత్ర వ్యవస్థాపకుడు రాజ్‌ఖోస్లా వివరించారు. ఆన్లైన్ చెల్లింపులకు వినియోగించేందుకు తక్కువ లిమిట్‌తో ఒక కార్డు, ఇతర ముఖ్యమైన, అత్యవసరాల కోసం మరొక కార్డు కలిగి ఉండొచ్చని ప్లాన్ అహెడ్ వెల్త్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు విశాల్ ధావన్ సూచించారు. మినిమం డ్యూ ఒక నెలలో కార్డుపై చేసిన వ్యయం మొత్తాన్ని బిల్లు జారీ చేసిన నాటి నుంచి 20 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. అంత మొత్తం చెల్లించే వెసులుబాటు లేకపోతే, మినిమం డ్యూ అమౌంట్ అని ఉంటుంది. అంత చెల్లించినా సరిపోతుంది. మొత్తం బిల్లులో ఇది సుమారు 5 శాతంగా ఉంటుంది. అప్పుడు మిగిలిన బకాయిపై నెలవారీ 3 శాతానికి పైనే వడ్డీ రేటు పడిపోతుంది. ఇతర చార్జీలు కూడా చెల్లించుకోవాలి. మినిమం డ్యూ అమౌంట్ చెల్లించడం చెల్లింపుల వైఫల్యం కిందకు రాదు. బకాయి మొత్తాన్ని వెంటనే చెల్లించలేని వారు పెద్ద లావాదేవీలను ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. లేదంటే లోన్ ఎగైనెస్ట్ క్రెడిట్ కార్డ్ (కార్డుపై రుణం) ఆఫర్‌ను వినియోగించుకోవడం ద్వారా రుణం పొంది సత్వర చెల్లింపుల నుంచి గట్టెక్కొచ్చు. క్రెడిట్ లిమిట్ కార్డుపై ఉన్న గరిష్ట వ్యయ పరిమితి ఇది. ఏ కాలంలో అయినా ఈ మేరకు గరిష్టంగా వినియోగించుకోవచ్చు. వినియోగించుకున్న మేర తదుపరి గడువు నాటికి పూర్తిగా చెల్లించేస్తే ఎలాంటి వడ్డీ భారం పడదు. ఆదాయం, వ్యక్తిగత ఆర్థిక చరిత్ర, రిస్క్ ఆధారంగా క్రెడిట్ లిమిట్‌ను కార్డు జారీ సమయంలోనే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు నిర్ణయిస్తుంటాయి. సాధారణంగా ఆరంభంలో తక్కువ లిమిట్‌తో కార్డులు జారీ చేస్తుంటాయి. కార్డుపై వినియోగం, చెల్లింపుల తీరు ఆధారంగా తర్వాతి కాలంలో ఈ లిమిట్‌ను సవరించుకునే అవకాశం ఉంటుంది. లిమిట్ పెంచుకోవచ్చు.. క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండి, కార్డుపై అధిక వ్యయం చేసే వారికి ఉచితంగా లిమిట్‌ను పెంచుకునేందుకు బ్యాంక్‌లు ఆఫర్లు ఇస్తుంటాయి. లేదంటే ఎవరికి వారే స్వచ్ఛందంగా కార్డు సంస్థను సంప్రదించి లిమిట్ పెంచాలని కోరొచ్చు. వినియోగం 70–80 శాతం దాటుతున్న వారు ప్రస్తుత కార్డుపైనే లిమిట్‌ను పెంచుకోవడం లేదంటే మరో కార్డు తీసుకుని వ్యయాలను రెండు కార్డుల మధ్య వైవిధ్యం చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. దీనివల్ల క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (సీయూఆర్)ను తగ్గించుకోవచ్చు. స్వీయ నియంత్రణ క్రెడిట్ కార్డుపై వాస్తవ రుణ పరిమితి (క్రెడిట్ లిమిట్) కంటే తక్కువ లిమిట్‌ను ఎవరికి వారే విధించుకోవచ్చు. దీనివల్ల వ్యయాలపై నియంత్రణ సాధ్యపడుతుంది. బ్యాంక్/ఎన్బీఎఫ్సీ యాప్ ద్వారా క్రెడిట్ లిమిట్లో మార్పులు చేసుకోవచ్చు. ఉదాహరణకు రూ.3 లక్షల క్రెడిట్ లిమిట్ ఉన్నప్పుడు రూ.లక్ష పరిమితిని సొంతంగా నిర్ణయించుకోవచ్చు. అటువంటప్పుడు కార్డుపై ఒక నెలలో వ్యయం రూ.లక్షకు చేరగానే తదుపరి చెల్లింపులు తిరస్కరణకు గురవుతాయి. ఎలాంటి పెనాల్టీ చార్జీలు పడవు. ఖర్చులు చేయిదాటిపోకుండా, గుర్తు చేసేందుకు ఈ సదుపాయం అక్కరకు వస్తుంది. యాప్‌లోకి వెళ్లి ఈ పరిమితిలో ఎప్పుడైనా మార్పులు చేసుకోవచ్చు. లాభ–నష్టాలు.. → అధిక లిమిట్ అత్యవసర వైద్యం, ప్రయాణాలప్పుడు ఆదుకుంటుంది. → కార్డులు పెరిగేకొద్దీ వాటిపై వ్యయాలు కూడా ఇతోధికం అవుతుంటాయి. అన్నీ కలసి రుణ భారాన్ని పెంచేస్తాయి. → స్వీయ నియంత్రణ లేనట్టయితే, అధిక క్రెడిట్ లిమిట్ విషయంలో హద్దులేనట్టుగా వ్యవహరించినట్టయితే రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఎదురవుతుంది. → కార్డులు ఎక్కువైనప్పుడు వాటి వేర్వేరు గడువు తేదీలను గుర్తు పెట్టుకుని, సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. → చెల్లింపుల వైఫల్యాలు, అధిక క్రెడిట్ వినియోగం క్రెడిట్ స్కోర్‌ను తగ్గించేస్తాయి. → బాధ్యతతో, వివేకంతో వినియోగిస్తే క్రెడిట్ కార్డు ద్వారా తగ్గింపు ఆఫర్లు పొందొచ్చు. వినియోగంపై రివార్డు పాయింట్లను కూడా పొందొచ్చు. క్రెడిట్ స్కోరును బలోపేతం చేసుకోవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
హెచ్డీఎఫ్సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులు
పండుగ సీజన్ నేపథ్యంలో హోచ్డీఎఫ్సీ బ్యాంక్ వార్షిక రుసుము లేదా ఇతర ఛార్జీలు లేకుండా కొన్ని క్రెడిట్ కార్డ్‌లు అందిస్తోంది. స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, టాటా న్యూ ప్లస్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, టాటా న్యూఇన్ఫినిటీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు ఇందులో ఉన్నాయి. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.అయితే వీటికి వార్షిక/జాయినింగ్ రుసుము మాత్రమే ఉచితం. ఇతర చార్జీలు ఉండకూడదంటే అది మీరు చేసే ఖర్చుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఆఫర్‌ను పొందే ముందు నిబంధనలు, షరతులు తెలుసుకోవాల్సి ఉంటుంది. పేర్కొన్న మొత్తాన్ని ఏటా ఖర్చు చేయకపోతే రెన్యూవల్ ఫీజుతోపాటు ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.వార్షిక రుసుము ఎంత?వార్షిక రుసుము అనేది కార్డు జారీ చేసే బ్యాంకులు విధించే అతి ముఖ్యమైన ఛార్జీలలో ఒకటి. పేరు సూచించినట్లుగా ప్రతి సంవత్సరం చెల్లించవలసి ఉంటుంది. ఇది ఒక్కో కార్డుకు ఒక్కో రకంగా ఉంటుంది. టాటా న్యూ ప్లస్ వార్షిక రుసుము రూ.499. అదే టాటా న్యూ ఇన్ఫినిటీ కోసం రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. ఇక స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ.500 ఉంది. ప్రస్తుత ఆఫర్లో వీటిని ఎటువంటి ఫీజులు లేకుండానే పొందవచ్చు. -
క్రెడిట్ కార్డులపై దీపావళి ఆఫర్లు
దేశీయ కన్స్యూమర్ క్రెడిట్ మార్కెట్‌ప్లేస్ పైసాబజార్ పలు క్రెడిట్ కార్డ్‌లపై ప్రత్యేక పండుగ ఆఫర్లను వెల్లడించింది. పైసాబజార్ ద్వారా కొత్త క్రెడిట్ కార్డ్‌లను తీసుకునేవారికి గిఫ్ట్ కార్డ్‌లను అందిస్తోంది.నిర్దిష్ట అమెరికన్ ఎక్స్‌ప్రెస్, హెచ్ఎస్బీసీ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్లు రూ.1,500 విలువైన అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌ని అందుకుంటారు. హచ్ఎస్బీసీ వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్లాటినం ట్రావెల్ క్రెడిట్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ మెంబర్షిప్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్, హెచ్ఎస్బీసీ లైవ్+ క్రెడిట్ కార్డ్ వంటివి వాటిలో ఉన్నాయి.హెచ్డీఎఫ్సీ బిజినెస్ రెగాలియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డైనర్స్ క్లబ్ బ్లాక్ మెటల్ ఎడిషన్ క్రెడిట్ కార్డ్, మర్రియోట్ బన్వాయ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, హెచ్డీఎఫ్సీ రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్, అట్లాస్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ వంటివాటిపై పైసాబజార్ అదనంగా రూ. 1,000 అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌ను అందిస్తోంది.అమెజాన్‌లో వివిధ రకాల కొనుగోళ్ల కోసం ఉపయోగించగల ఈ వోచర్లను క్రెడిట్ కార్డ్‌లు యాక్టివేట్ అయినప్పుడు అందుకోవచ్చు.పైసాబజార్ ప్రకారం.. ఈ ఆఫర్లు పండుగ సీజన్లో కొద్దికాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. పైసాబజార్ ప్రస్తుతం పదికిపైగా బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా 60కిపైగా క్రెడిట్ కార్డులను అందిస్తోంది. -
క్రెడిట్ కార్డ్ వసూళ్లకూ ఓ పద్ధతుంది
ప్రస్తుత కాలంలో వివిధ అవసరాల రీత్యా ఒకే వ్యక్తి సగటున నాలుగైదు క్రెడిట్ కార్డులు ఉండడం సర్వసాధారణం అయిపోయింది. ఒకటే జీతం మీద పరిమితి కలిగిన ఒక కార్డు వరకు అయితే ఇబ్బంది లేకుండా చెల్లించగలరు. కానీ అదే వ్యక్తికి నాలుగయిదు కార్డులు ఉంటే తన జీతానికి – స్థోమతకి మించి ఎన్నో రెట్లు పరిమితి కలిగిన కార్డులు ఉన్నట్టే! అయితే ఉద్యోగాలు పోవడం, వ్యాపారాలు దెబ్బ తినడం వలన క్రెడిట్ కార్డు వాడిన బకాయిలు తిరిగి చెల్లించలేని పరిస్థితులలోకి వెళ్లిపోతుంటారు చాలామంది. దాంతో ఆ బకాయిల వసూలు కోసం బ్యాంకులు చాలా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతుంటాయి.మరీ ముఖ్యంగా ప్రైవేట్ రికవరీ ఏజెంట్లను నియమించి వారి ద్వారా వినియోగదారులను తీవ్రంగా వేధించడం, పీడించడం, ఇంటి చుట్టుపక్కల వాళ్ల దగ్గరికి వెళ్లి పరువు తీయడం వంటివి. ఈ మధ్య అయితే మొబైల్ ఫోన్ లో ఓ యాప్ ద్వారా వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేసి మరీ తెలిసిన వారందరికీ వీడియోలు ఫోటోలు మెసేజ్‌లు పంపడం వంటి చట్టవ్యతిరేక పనులకి పాల్పడుతున్నారు. అయితే బ్యాంకు వారికి అలా వేధించే హక్కు లేదు. ఎటువంటి లోను బకాయి అయినప్పటికీ నోటీసుల ద్వారా, కోర్టు కేసు ద్వారా మాత్రమే రికవరీ చేయాల్సి ఉంటుంది. అంతేకానీ పైన చెప్పిన విధమైన చట్ట వ్యతిరేక చర్యలు తీసుకోవడానికి వీలు లేదు. అలా చేసిన బ్యాంకు వారిపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడమే కాకుండా సివిల్ కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. సివిల్ కోర్టులో ఇంజక్షన్ సూట్ వేయడం ద్వారా ఆ బ్యాంకు వారు వినియోగదారుని వేధించడానికి వీల్లేదు అని కోర్టు నుండి రక్షణ పోందవచ్చు . వివిధ బ్యాంకులు వినియోగదారులను వేధిస్తుంటే డైనమిక్ ఇంజక్షన్ ద్వారా కూడా సివిల్ కోర్టు నుండి రక్షణ పోందవచ్చు. క్రెడిట్ కార్డు వసూళ్లకు కానీ, మరి ఏ విధమైన లోన్ రికవరీ కోసం కానీ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకూడదు అని ఆర్.బి.ఐ నిబంధనలు సైతం సూచిస్తున్నాయి. ఎవరైనా బ్యాంకు వారు మిమ్మల్ని వేధింపులకు గురిచేస్తుంటే, వెంటనే పోలీసు వారిని ఆశ్రయించటం మంచిది. కొత్త చట్టం ద్వారా ఆన్లైన్లో కూడా ఎఫ్.ఐ.ఆర్. చేయవచ్చు. అయితే అలా చేసిన మూడు రోజులలోగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఆ ఫిర్యాదును ధ్రువీకరించవలసి ఉంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వొకేట్ -
క్రెడిట్ కార్డుల్లో హెచ్డీఎఫ్సీ రికార్డు!
దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డుల విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. వినియోగంలో ఉన్న రెండు కోట్ల క్రెడిట్ కార్డుల మైలురాయిని సాధించిన తొలి బ్యాంక్‌గా నిలిచింది. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ డేటా ప్రకారం.. అన్ని బ్యాంకులు మొత్తంగా జారీ చేసిన 9.6 కోట్ల క్రెడిట్ కార్డులలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దాదాపు 21 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక కార్డు వ్యయాల్లో 2023 మార్చి 31 నాటికి తమ వాటా 28.6 శాతం ఉన్నట్లు బ్యాంక్ తెలిపింది. లేటుగా ప్రారంభించినా.. క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించిన ప్రధాన బ్యాంకులలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చివరిది కావడం గమనార్హం. ఎస్బీఐ తన కార్డ్ వ్యాపారాన్ని 1997లో ప్రారంభించగా ఐసీఐసీఐ బ్యాంక్ 2000లో క్రెడిట్ కార్డులు తీసుకొచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2001లో తన కార్డ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇతర బ్యాంకులు మందగించినప్పటికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రం ఓ వైపు కస్టమర్లతోపాటు మరోవైపు వ్యాపారులపైనా దృష్టి పెడుతూ స్థిరంగా దాని పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేసుకోగలిగింది. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వ్యాపారంలో 90లలో సిటీ బ్యాంక్ ఆధిపత్యం ఉండేది. ఆ తర్వాత దేశీయ ప్రైవేట్ బ్యాంకులు విస్తరించడంతో విదేశీ బ్యాంకులు మార్కెట్ వాటాను కోల్పోయాయి. -
క్రెడిట్ కార్డులు ఎన్ని రకాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు
భారతదేశంలో చాలా బ్యాంకులు (ప్రభుత్వ & ప్రైవేట్) తమ కస్టమర్లకు కేవలం డెబిట్ కార్డులు మాత్రమే కాకుండా.. క్రెడిట్ కార్డులను కూడా అందిస్తున్నాయి. ఈ కథనంలో ప్రస్తుతం మార్కెట్లో ఎన్ని రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి, వాటి ఫీచర్స్ ఏంటి? బెనిఫిట్స్ ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రెగ్యులర్ క్రెడిట్ కార్డులు రెగ్యులర్ క్రెడిట్ కార్డులనేవి రివార్డ్ పాయింట్స్, ఫ్యూయెల్ సర్ఛార్జ్ మినహాయింపుల వంటి అదనపు సౌకర్యాలను అందిస్తాయి. జీవిత భాగస్వామి, పెద్ద పిల్లలు, తల్లిదండ్రులు, సోదరులు లేదా సోదరీమణులతో పంచుకోవడానికి మూడు ఫ్రీ యాడ్-ఆన్ కార్డ్‌లను కూడా పొందవచ్చు. ఇవి అన్ని విధాలుగా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డ్‌లు ఈ కార్డ్‌లు మీకు ఫ్యాన్సీ లాంజ్‌లకు ఫ్రీ యాక్సెస్, గోల్ఫ్ ఫ్రీ రౌండ్లు, రివార్డ్‌లు, పెద్ద రెస్టారెంట్లలో కూల్ డిస్కౌంట్లు వంటి ప్రత్యేక సౌకర్యాలను అందిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలనుకునే వారికి ఇలాంటి కార్డులు ఉపయోగపడతాయి. కో-బ్రాండెడ్ కార్డ్‌లు కో-బ్రాండెడ్ కార్డ్‌లు కొన్ని రకాల అంశాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. విమాన టికెట్లు, ప్రయాణాల మీద కొన్ని డిస్కౌంట్స్, స్పెషల్ చెక్-ఇన్ కౌంటర్స్, ఎక్స్ట్రా లగేజీ అలవెన్స్, లాంజ్‌లకు ఫ్రీ యాక్సెస్ వంటి అద్భుతమైన సదుపాయాలు ఈ కార్డుల ద్వారా పొందవచ్చు. కమర్షియల్ లేదా బిజినెస్ కార్డులు మీ అవసరాల కోసం ఖర్చు చేసే సమయంలో కమర్షియల్ లేదా బిజినెస్ కార్డులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వ్యాపార పర్యటనలు, కొనుగోళ్ల సమయంలో డబ్బు ఆదా చేసుకోవడంలో ఇది మీకు చాలా సహాయపడుతుంది. మీ చెల్లింపులను సైతం సులభంగా ట్రాక్ చేయవచ్చు. వీటిలో అదనపు ప్రోత్సాహకాలను కూడా పొందవచ్చు. ప్రీపెయిడ్ క్రెడిట్ కార్డ్‌లు ప్రీపెయిడ్ కార్డలనేవి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగపడతాయి. లిమిటెడ్ క్రెడిట్‌తో లభించే ఈ కార్డులు మీ పిల్లలకు కూడా ఇవ్వవచ్చు, వారు ఎంత ఖర్చు చేయాలో దీని ద్వారా నిర్దారించుకోవచ్చు. రోజువారీ ఖర్చులను కవర్ చేయడానికి కంపెనీలు కూడా ఇలాంటి కార్డులను ఉపయోగిస్తుంటాయి. ఇదీ చదవండి: ఆ ఒక్క సలహా రోజుకి రూ.5 కోట్లు సంపాదించేలా.. భర్త సక్సెస్ వెనుక భార్య.. ప్రీమియం క్రెడిట్ కార్డులు ఎక్కువ డబ్బు సంపాదించి, ఎక్కువ పనుల కోసం కారు పొందాలనుకునే వినియోగదారులు ఇలాంటి ప్రీమియం క్రెడిట్ కార్డులను పొందవచ్చు. మెరుగైన రివార్డ్స్, అదనపు ప్రయోజనాల కోసం కూడా ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు అత్యవసర సమయంలో క్రెడిట్ కార్డులు చాలా ఉపయోగపడతాయి. క్రెడిట్ స్కోర్ ఎక్కువలేనివారు కూడా ఇలాంటి కార్డులను పొందవచ్చు. అయితే బిల్లులు సకాలంలో చెల్లిస్తామని బ్యాంకుకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సదరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో జమ చేసిన డబ్బు క్రెడిట్ కార్డుకు కొలేటరల్‌గా పనిచేస్తుంది. -
క్రెడిట్ కార్డు.. కొంచెం కష్టమే!
ముంబై: క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణ మంజూరీల వంటి అన్సెక్యూర్డ్ రుణాలు ఇకపై మరింత కఠినతరం కానున్నాయి. ఈ విషయమై బ్యాంకులకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) నిబంధనలను కఠినతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణ మంజూరీలు ఇటీవలి కాలంలో పెరుగుతుండడం, ఈ నేపథ్యంలో ఆయా రుణ మంజూరీ పట్ల బ్యాంకింగ్ జాగరూకత పాటించడం ఆర్బీఐ తాజా ఆదేశాల లక్ష్యం. హై రిస్క్ వెయిటేజ్ అన్సెక్యూర్డ్ వినియోగ రుణాలపై 25 శాతం పెంచాలన్నది ఈ ఆదేశాల ప్రధానాంశం. అంటే కొన్ని వ్యక్తిగత రుణాల విషయంలో బ్యాంకింగ్ కేటాయింపులు మరింత పెంచాల్సి ఉంటుందన్నమాట. అటువంటి క్రెడిట్ మరింత ఖరీదైనదిగా మారడంతో ఇది బ్యాంకుల రుణ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. తాజా నిర్ణయం వల్ల క్రెడిట్ కార్డ్ రుణాలపై రిస్క్ వెయిటేజ్ బ్యాంకులపై 150 శాతానికి, ఎన్బీఎఫ్సీలపై 125 శాతానికి పెరుగుతుంది. కాగా గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, బంగారం, బంగారు ఆభరణాల ద్వారా పొందే రుణాలపై కొత్త నిబంధనలు వర్తించవని రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. 2023 సెపె్టంబర్ చివరి నాటికి పర్సనల్ లోన్ల విభాగంలో బ్యాంక్ రుణ బకాయిలు రూ. 48,26,833 కోట్లు. ఇది 2022 అదే నెలతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరిగింది. -
షాపింగ్ చేస్తున్నారా? బెస్ట్ క్యాష్ బ్యాక్ ఆఫర్లున్న క్రెడిట్‌కార్డులు ఇవే..
Best Credit Card Cashback Offers: దేశవ్యాప్తంగా ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తోంది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా చాలా మంది షాపింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో చాలా ఆఫ్‌లైన్, ఆన్లైన్ సంస్థలు పలు రకాల ఆఫర్లను ప్రకటించాయి. వీటితోపాటు వివిధ బ్యాంకులు తమ క్రెడిట్‌కార్డులతో షాపింగ్ చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఇతర ప్రయోజనాలు అందిస్తున్న కొన్ని క్రెడిట్ కార్డుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ క్రెడిట్‌కార్డ్‌తో ఎటువంటి ఇబ్బందికరమైన వ్యాపారి పరిమితులు లేకుండా ఆన్లైన్ షాపింగ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అదే ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేస్తే అదనంగా మరో 1 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇక డిజిటల్ లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయి. అయితే, క్యాష్‌బ్యాక్ నెలకు రూ. 5,000 మాత్రమే ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ యుటిలిటీ బిల్లుల చెల్లింపులకు అనువైనది. గూగుల్‌పే ద్వారా బిల్లు చెల్లింపులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. అలాగే స్విగ్గీ, జొమాటో, ఓలా వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లపై 4 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఈ క్రెడిట్ కార్డుతో పొందవచ్చు. అయితే, ఈ క్యాష్‌బ్యాక్‌ల గరిష్ట మొత్తం నెలకు రూ. 500 మాత్రమే. అదనంగా ఈ కార్డ్ ఇతర అన్ని చెల్లింపులపైనా 2 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ఈ క్రెడిట్ కార్డ్‌ను తీసుకొచ్చాయి. ఈ క్రెడిట్ కార్డ్ ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. దీంతోపాటు స్విగ్గీ, క్లయర్ట్రిప్, కల్ట్‌ఫిట్, పీవీఆర్, టాటా ప్లే, ఉబెర్ వంటి ఫ్లాట్‌ఫామ్స్‌లో చెల్లింపులపై 4 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో విమాన, హోటల్ చెల్లింపులపై 1.5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్‌లను ఎలాంటి పరిమితి లేకుండా నెలంతా వినియోగించుకోవచ్చు. -
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్‌కు రూ.4.33 కోట్లు టోకరా
హైదరాబాద్: తాను పని చేస్తున్న సంస్థ ద్వారా పొందిన కార్పొరేట్ క్రెడిట్ కార్డుతో ఓ వ్యక్తి అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్‌కు రూ.4.33 కోట్లు టోకరా వేశాడు. దీనికోసం అతగాడు బ్యాంక్ సెక్యూరిటీ అలెర్ట్ సిస్టంను తప్పుదోవ పట్టించినట్లు గుర్తించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమాజిగూడలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకులో నగరానికి చెందిన కిండ్రిల్ సొల్యూషన్స్ సంస్థ కార్పొరేట్ క్రెడిట్ కార్డు సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకుంది. దీన్ని పరిశీలించిన బ్యాంకు అధికారులు 2022లో అనుమతి ఇచ్చారు. దీంతో ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఈ బ్యాంకు నుంచి కార్పొరేట్ క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా ఆ సంస్థలో పనిచేసే యార్లగడ్డ ప్రదీప్‌కు కార్డు జారీ అయ్యింది. ఈ కార్డు వినియోగదారుడికి బ్యాంకు ఎలాంటి లిమిట్ నిర్దేశించదు. నిబంధనలకు లోబడి కంపెనీనే దీన్ని నిర్దేశిస్తుంటుంది. ఈ సంస్థలో పని చేసిన ప్రదీప్ భారీ కుట్ర చేశాడు. బ్యాంకింగ్ అలర్ట్స్ సిస్టమ్‌ను తప్పుదోవ పట్టిస్తూ, సీఆర్ఈడీ అప్లికేషన్‌ను ఉపయోగించి దఫదఫాలుగా రూ. 4,33,52,612 లావాదేవీలు చేశాడు. ఈ ఏడాది మార్చి–ఆగస్టు మధ్య చేసిన ఈ లావాదేవీలకు సంబంధించిన మొత్తం అతడి బ్యాంక్ ఖాతాతో పాటు మరికొన్నింటిలోకీ వెళ్లింది. ఈ మొత్తం రీ పేమెంట్ జరగకపోవడంతో బ్యాంకు అధికారులు ఆరా తీశారు. దీంతో అతడు కొన్నాళ్లుగా విధులకు హాజరు కావట్లేదని తేలింది. ఇతడు ఎక్కువ లావాదేవీలు మేక్ మై ట్రిప్ యాప్ ద్వారా జరిపినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు అసలు ఈ మోసం ఎలా జరిగింది? ప్రదీప్ నగదు ఎలా కొట్టేశాడు? తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. -
జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు క్రెడిట్ కార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాడి రైతుల అభ్యున్నతికి అనేక చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారికి మరింత మేలు చేకూర్చనున్నారు. జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయించి, వారి వ్యాపారానికి అవసరమైన రుణాలను మంజూరు చేయించేందుకు చర్యలు చేపట్టారు. వైఎస్సార్ ఆసరా, చేయూత మహిళా లబ్దిదారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు పాడి పశువుల కొనుగోళ్లకు బ్యాంకుల ద్వారా ఇప్పటికే రుణాలు మంజూరు చేయిస్తున్నారు. వీరి నుంచి అమూల్ ద్వారా పాల సేకరణ చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా జగనన్న పాల వెల్లువ లబ్దిదారులు వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కార్డుల ద్వారా లబ్దిదారులకు అవసరమైన వర్కింగ్ కేపిటల్ కోసం రుణాలు మంజూరు చేయించనుంది. ఇందుకోసం జిల్లాలవారీగా బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించింది. ఇటీవల జరిగిన బ్యాంకర్ల సబ్ కమిటీ సమావేశంలో 18 జిల్లాల్లోని 2.28 లక్షల మంది జగనన్న పాల వెల్లువ లబ్దిదారుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. వీరందరికి పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చి, రుణాలు మంజూరు చేయాలని ఆ సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ క్రెడిట్ కార్డుల ద్వారా పశు, మత్స్యకార రైతులకు ప్రత్యేకంగా కార్డులు ఇచ్చి, వారికి అవసరమైన రుణాలు మంజూరు చేస్తారు. అర్హులైన వారందరికి ఈ కార్డులు ఇవ్వడానికి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అర్హులైన పశు, మత్స్యకార రైతులకు ఈ కార్డులు ఇవ్వాలని, ఇందుకోసం జిల్లాలవారీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నోడల్ అధికారులతో శిబిరాలు నిర్వహించాలని బ్యాంకర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ కార్డులపై వర్కింగ్ క్యాపిటల్‌గా లబ్దిదారులకు రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు బ్యాంకులు రుణాలిస్తాయి. ఈ రుణాలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇస్తారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారు వార్షిక వడ్డీలో 3 శాతం సత్వర రీపేమెంట్ ప్రోత్సాహకానికి అర్హులవుతారు. ప్రతి శుక్రవారం శిబిరాలు ఈ కార్డులతో పాటు రుణాల మంజూరుకు ప్రతి శుక్రవారం బ్యాంకులు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తాయి. అక్కడికక్కడే అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, వెంటనే ప్రాసెస్ చేస్తాయి. సూత్రప్రాయ మంజూరు కూడా ఈ శిబిరాల్లోనే చేస్తారు. వైఎస్సార్ చేయూత, ఆసరా లబ్దిదారులు ఇప్పటికే బ్యాంకుల్లో ఖాతాదారులగా ఉన్నారని, అలాగే ఇప్పటికే జగనన్న పాల వెల్లువ కింద పాడి పశువులను కొనుగోలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వీరికి క్రెడిట్ కార్డులు, రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టం చేసింది. -
వాట్సాప్ పేమెంట్స్ సేవల విస్తరణ
ముంబై: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా భారత మార్కెట్లో తమ చెల్లింపుల సేవలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వ్యాపార సంస్థలకు కొనుగోలుదారులు చేసే పేమెంట్స్ ప్రక్రియను సులభతరం చేసింది. ‘వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే భారతీయ వ్యాపార సంస్థలన్నింటికీ మా పేమెంట్స్ సర్వీసును విస్తరిస్తున్నాం. కొనుగోలుదారులు తమకు కావాల్సిన ఉత్పత్తులను వాట్సాప్‌లోనే కార్ట్‌కి జోడించుకోవడంతో పాటు తమకు నచ్చిన పేమెంట్ విధానం ద్వారా .. అంటే వాట్సాప్ లేదా యూపీఐ యాప్‌లు, డెబిట్ .. క్రెడిట్ కార్డులతో కూడా చెల్లించవచ్చు. ఇందుకోసం ఇతర వెబ్‌సైట్‌కి గానీ, మరో యాప్‌కి గానీ వెళ్లనక్కర్లేదు. వ్యక్తిగతంగా వెళ్లి చెల్లించనక్కర్లేదు‘ అని సంస్థ తెలిపింది. ఈ ఫీచర్ ఇప్పటికే సింగపూర్, బ్రెజిల్లో చిన్న వ్యాపార సంస్థల కోసం కంపెనీ అమలు చేస్తోంది. వ్యాపార సంస్థలు, కొనుగోలుదారులు మెసేజింగ్ ఫీచర్‌ను సమర్ధంగా వినియోగించుకునే విషయంలో ప్రపంచానికి భారత్ సారథ్యం వహిస్తోందని బిజినెస్ మెసేజింగ్ సదస్సు ’కన్వర్సేషన్స్’ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న వాట్సాప్ మాతృసంస్థ మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. వాట్సాప్ ఫ్లోస్, వెరిఫైడ్ బ్యాడ్జ్ .. మెసేజింగ్ ఫార్మాట్లు, గ్రూప్ చాట్స్, బ్రాడ్కాస్ట్ చానల్స్ విషయంలో మెటా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ఆవిష్కరిస్తోందని జుకర్‌బర్గ్ చెప్పారు. ఇందులో భాగంగా వ్యాపార సంస్థల కోసం వాట్సాప్ ఫ్లోస్, మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను విస్తృతంగా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ బుకింగ్, ఉత్పత్తులను ఆర్డర్ చేయడం, ఫ్లయిట్స్‌లో చెకిన్ చేయడం వంటి అంశాల్లో కస్టమర్లకు వెసులు బాటు కల్పించేలా వాట్సాప్ ఫ్లోస్‌ను వ్యాపార సంస్థలు ఉపయోగించుకోవచ్చు. మరోవైపు, మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లకు విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
కొంపముంచుతున్న క్రెడిట్ కార్డు బకాయిలు: డిఫాల్ట్ అయితే ఏం చేయాలో తెలుసా?
ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగింది. దాదాపు ప్రతీ బ్యాంకు ఖాతాదారుడికి క్రెడిట్ కార్డు ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే అకౌంట్లో తగినంత డబ్బు లేకపోయినా, క్రెడిట్ ద్వారా సులువుగా కొనుగోళ్లు చేసుకునే వెసులుబాటుతోపాటు, క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్ల , డిస్కౌంట్ల వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాదు క్రెడిట్ స్కోరుతో లోన్లను సులువుగా పొందవచ్చు. ఈనేపథ్యంలోనే గత రెండేళ్లలో క్రెడిట్ కార్డ్ హోల్డర్లు తమ లిమిట్‌ను భారీగా పెంచు కున్నారు. క్రెడిట్ కార్డ్‌లపై బకాయిల మొత్తం రెండేళ్లలో దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. అదేసమయంలో క్రెడిట్ కార్డ్‌లపై లావాదేవీ విలువ రెండింతల పెరిగిందని TruBoardPartners అధ్యయనం తెలిపింది. రూ. 951 కోట్లు పెరిగిన క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్స్ సమాచార హక్కు చట్టం (RTI) కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా ప్రకారం, క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్‌లు 2022 ఆర్థిక సంవత్సంలో లో రూ. 3,122 కోట్ల నుండి 2023లో రూ.951 కోట్లు పెరిగి రూ. 4,073 కోట్లకు చేరాయి. (ప్రౌడ్ ఫాదర్ జస్ప్రీత్ బుమ్రా నెట్‌వర్త్, లగ్జరీ కార్లు, ఈ వివరాలు తెలుసా?) క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అంటే ఏమిటి? అవకాశం ఉంది కదా అని ఇబ్బబిముబ్బడిగావాడటం, చెల్లింపులు చేయకపోవడం ఆందోళన కరంగా మారుతోంది. విచక్షణా రహితంగా క్రెడిట్ కార్డు వాడేసి, తరువాత చెల్లించడంలో విఫలమైనా, అనుకోని కారణాలతో చెల్లింపులు చేయలేకపోయినా కూడా తిప్పలు తప్పవు. ఈ క్రమంలో క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అంటే ఏమిటి? క్రెడిట్ కార్డ్ చెల్లింపు డిఫాల్ట్ అయితే పరిష్కారం ఏమిటి అనే విషయాలను ఒకసారి చూద్దాం. (జీతాల పెంపు: దిగ్గజ ఐటీ కంపెనీల ఉద్యోగులకు షాక్! ) క్రెడిట్ కార్డ్ ద్వారా సాధారణ ఖర్చులు, మెడికల్ బిల్లు,తదితర అత్యవసర కొనుగోళ్లు చేయవచ్చు. ఆ తరువాత వీటిని బ్యాంకు నిర్దేశించిన గడువు లోపల చెల్లించాలి. ఒకవేళ భారీగా ఖర్చు చేసి, దానిని చెల్లించలేకపోతే, వాయిదా పద్దతిలో చెల్లించే విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, దురదృష్టవశాత్తూ, ఉద్యోగం కోల్పోవడం, లేదా వ్యాపారంలో నష్టాలు, ఇతర అత్యవసర పరిస్థితుల కారణంగా క్రెడిట్ కార్డ్ బిల్ తిరిగి చెల్లించడం మీకు కష్టంగా అనిపించే సందర్భాలు ఉండవచ్చు. కష్టం కావచ్చు.కానీ క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించడంలో విఫలమైతే, మీరు అనేక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి క్రెడిట్ కార్డ్ డిఫాల్టర్. నెలల తరబడి క్రెడిట్ కార్డ్ బిల్లుకనీస మొత్తాన్ని కూడా చెల్లించడంలో విఫలమైతే..దానినే క్రెడిట్ కార్డ్ పేమెంట్ డిఫాల్ట్ అంటారు. 30 రోజుల పాటు చెల్లింపు చేయడంలో విఫలం కావడం తొలి తప్పు. ఆరు నెలలు పాటు కనీస చెల్లింపులు చేయకుండా ఉంటే మాత్రం క్రెడిట్ కార్డ్ ఖాతా వెంటనే డియాక్టివేట్ అవుతుంది. డిఫాల్ట్ లిస్ట్‌లోకి వెళుతుంది. రీపేమెంట్‌కు సంబంధించి సదరు బ్యాంకు ఆయా ఖాతాదారులను సంప్రదిస్తాయి. దీని తర్వాత కూడా మీరు చెల్లించకపోతే, ఖాతా మూతపడుతుంది. ఈ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు నో పేమెంట్ రిపోర్ట్ చేస్తారు.దీంతో క్రెడిట్ స్కోర్‌పై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. భవిష్యత్తులో రుణం తీసుకోవడం లేదా కొత్త క్రెడిట్ కార్డ్‌ని పొందడం కష్టం. క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ పరిణామాలు ఆలస్య చెల్లింపు రుసుములు ,అదనపు వడ్డీ ఛార్జీలు బ్యాంకులు బకాయిలపై 38 నుండి 42 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. లోన్లు రావడం కష్టం. క్రెడిట్ పరిమితి తగ్గుతుంది. క్రెడిట్ కార్డ్ చెల్లింపును డిఫాల్ట్ అధిక-రిస్క్ రుణగ్రహీతగా మారిపోతారు. చట్టపరమైన చర్యలు: రికవరీ కోసం బ్యాంక్ సివిల్ దావా వేయవచ్చు.కొన్ని సందర్భాల్లో, బ్యాంక్ మోసం చేసినందుకు క్రిమినల్ కేసు కూడా నమోదు చేయవచ్చు.లీగల్ నోటీసును పంపవచ్చు. రికవరీ ఏజెంట్ల బాధలు: క్రెడిట్ కార్డ్ చెల్లింపును తిరిగి పొందడానికి బ్యాంకు రుణ సేకరణ ఏజెన్సీల ద్వారా రికవరీ ఏజెంట్లను నియమిస్తే, వారి దూకుడుని, వేధింపులను తట్టు కోవడం కష్టం. ఇది లేనిపోని అవమానాలు,ఆందోళనకు కారణం కావచ్చు. క్రెడిట్ కార్డ్ చెల్లింపు డిఫాల్ట్ అయితే ఏమి చేయాలి? ఫస్ట్చేయాల్సిన పని: బ్యాంక్‌ని సంప్రదించి పరిస్థితిని వివరించడం, క్రెడిట్ స్కోర్‌కు మరింత నష్టం జరగకుండా ఉండాలంటే పాక్షిక చెల్లింపు చేయడం. తక్కువ వడ్డీ రేటు, తగ్గిన ఫీజులు లేదా ఆలస్య చెల్లింపు ఛార్జీల మినహాయింపు కోసంబ్యాంక్ అధికారులతో చర్చించాలి. వృత్తిపరమైన సహాయం కోరవచ్చు. తద్వారా రుణ చెల్లింపు, అలాగే క్రెడిట్ కార్డును తిరిగి ట్రాక్‌లోకి తెచ్చుకోవచ్చు. అలాగే వన్-టైమ్ సెటిల్మెంట్ అవకాశముందేమో పరిశీలించి సెటిల్ చేసుకోవడం. మరిన్ని విషయాలు కాబట్టి, సకాలంలో చెల్లింపులు చేయడం, క్రెడిట్ కార్డ్‌ను బాధ్యతాయుతంగా నిర్వహించడం చాలా అవసరం. ఒక వేళ ఆర్థిక ఇబ్బందులెదురైతే, మీ క్రెడిట్ కార్డ్ చెల్లింపులో డిఫాల్ట్ కాకుండా ఉండటానికి మీ బ్యాంక్‌ను సంప్రదించి, సంబంధిత ఆప్షన్స్ ఎంచుకోవడం బెటర్.జూలై 1, 2022 నుండి అమలులోకి వచ్చే RBI మార్గదర్శకాల ప్రకారం, కార్డ్ జారీచేసేవారు కార్డ్ హోల్డర్లకు 7-రోజుల నోటీసు వ్యవధిని ఇవ్వాలి, క్రెడిట్ బ్యూరోలకు డిఫాల్టర్‌గా నివేదించాలనే ఉద్దేశ్యం గురించి సంబంధిత ఖాతాదారులకు తెలియజేయాలి. బకాయిలనుచెల్లించడానికి గడువు ఇవ్వాలి. సెటిల్మెంట్ , డిఫాల్ట్‌లు మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తాయి. ఇవి 7 సంవత్సరాల వరకు మీ రికార్డ్‌లో కనిపిస్తాయి! -
రికార్డు స్థాయిలో ‘క్రెడిట్ కార్డ్’ వినియోగం
ముంబై: క్రెడిట్ కార్డుల వినియోగం దేశంలో పెద్ద ఎత్తున పెరుగుతోంది. మే నెలలో క్రెడిట్ కార్డులపై రూ.1.4 లక్షల కోట్లు వ్యయం చేయడమే ఇందుకు నిదర్శనం. క్రెడిట్ కార్డులపై బకాయిలు గత ఆర్థిక సంవత్సరంలో స్థిరంగా ఉండగా, ఈ ఏడాది ప్రతీ నెలా 5 శాతం చొప్పున పెరుగుతూ వస్తున్నట్టు ఆర్బీఐ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి క్రెడిట్ కార్డుల సంఖ్య 50 లక్షలకు పైగా పెరిగింది. మే చివరికి మొత్తం 8.74 కోట్లకు కార్డుల సంఖ్య చేరింది. కొత్తగా జారీ అయిన క్రెడిట్ కార్డుల్లో 20 లక్షల యూజర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే గణనీయంగా వినియోగించారు. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో యాక్టివ్ (వినియోగంలో ఉన్నవి) క్రెడిట్ కార్డుల సంఖ్య 8.24 కోట్లు కాగా, ఫిబ్రవరిలో 8.33 కోట్లు, మార్చి చివరికి 8.53 కోట్లు, ఏప్రిల్ చివరికి 8.65 కోట్లు చొప్పున పెరుగుతూ వచి్చంది. 2022–23లో ఏడాది అంతటా క్రెడిట్ కార్డులపై వినియోగం ప్రతి నెలా సగటున రూ.1.1–1.2 లక్షల కోట్లుగా ఉంటూ వచి్చంది. ఈ ఆర్థిక సంవత్సరం మే నెలకు వచ్చే సరికి రూ.1.4 లక్షల కోట్లకు పెరిగింది. ఒక్కో కార్డుపై సగటు వ్యయం రూ.16,144గా ఉంది. మొదటి స్థానంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మే చివరి నాటికి 1.81 కోట్ల కార్డులతో (వినియోగంలో ఉన్న) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. క్రెడిట్ కార్డు రుణాల పరంగానూ 28.5 శాతం వృద్ధితో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 1.73 కోట్ల కార్డులతో ఎస్బీఐ కార్డ్ రెండో స్థానంలో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ 1.46 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ 1.24 కోట్ల కార్డులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సిటీ బ్యాంక్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడంతో, 1,62,150 లక్షల కొత్త కార్డులు యాక్సిస్ బ్యాంక్ పోర్ట్‌ఫోలియోకు తోడయ్యాయి. మరోవైపు క్రెడిట్ కార్డు రుణాలు గణనీయంగా వృద్ధి చెందుతుండడంతో, ఈ విభాగంలో నిరర్థక ఆస్తులు (వసూలు కాని బకాయిలు/ఎన్పీఏలు) 0.66 శాతం పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి 2.94 శాతానికి చేరినట్టు ఇటీవలే ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఓ నివేదిక రూపంలో వెల్లడించడం గమనార్హం. -
ఆకర్షణ కోల్పోతున్న డెబిట్ కార్డు.. దూసుకుపోతున్న క్రెడిట్ కార్డు!
న్యూఢిల్లీ: డెబిట్ కార్డ్ ఇప్పుడు తన ఆకర్షణ కోల్పోతోంది. దీని స్థానంలో క్రెడిట్ కార్డు ఆకర్షణీయంగా మారుతోంది. డెబిట్ కార్డు బదులు క్రెడిట్ కార్డుతో చెల్లింపుల లావాదేవీలు నిర్వహించడానికే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపిస్తున్నట్టు ఆర్బీఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి. దశాబ్దం క్రితం డెబిట్ కార్డులే చెల్లింపుల్లో సింహ భాగం వాటా కలిగి ఉంటే, నేడు క్రెడిట్ కార్డులు ఎక్స్‌ప్రెస్ వేగంతో ఎక్కువ మంది వినియోగదారులను చేరుకుంటున్నాయి. కార్డుతో చెల్లించినప్పటికీ, 45 రోజుల వరకు ఆ బకాయి తీర్చేందుకు వ్యవధి ఉండడం, చెల్లింపులపై రివార్డులు ఆకర్షణీయమని చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో డెబిట్ కార్డుల ద్వారా 22 కోట్ల మర్చంట్ (వర్తకులు) చెల్లింపులు నమోదు అయితే, అదే నెలలో క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపుల లావాదేవీలు 25 కోట్లుగా ఉన్నాయి. కానీ, విలువ పరంగా చూస్తే.. ఏప్రిల్ నెలలో క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1.3 లక్షల కోట్ల విలువైన చెల్లింపుల జరిగితే, డెబిట్ కార్డుల లావాదేవీల విలువ ఇందులో సగానికంటే తక్కువ రూ.53,000 కోట్లుగానే ఉంది. ఇవన్నీ కూడా ఈ–కామర్స్, భౌతిక దుకాణాల్లో చేసిన లావాదేవీలు కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో క్రెడిట్ కార్డుల స్వైప్ (చెల్లింపు)లు 20 శాతం పెరగ్గా, డెబిట్ కార్డు స్వైప్‌లు 31 శాతం క్షీణించాయి. ఫిన్‌టెక్‌ల మద్దతు స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ సంస్థలు కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకురావడానికి ప్రాధాన్యం చూపిస్తున్నాయి. మింత్రా కోటక్ మహీంద్రా బ్యాంకుతో, పేటీఎం ఎస్బీఐ కార్డ్‌తో కలసి ఇటీవలే క్రెడిట్ కార్డును తీసుకొచ్చాయి. పతంజలి ఆయుర్వేద్ సంస్థ ప్రభుత్వరంగ పీఎన్బీ బ్యాంక్‌తో కలసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు తీసుకురావడం గమనార్హం. ఇలా పెద్ద సంస్థలన్నీ ఇదే బాటలో నడుస్తున్నాయి. ‘‘వస్త్రాలను విక్రయించే పెద్ద మార్కెట్‌ప్లేస్‌కు అమ్మకాలపై ఎంతలేదన్నా 50–60 శాతం లాభాల మార్జిన్ ఉంటుంది. దీంతో అవి తమ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డు కస్టమర్లకు 10 శాతం డిస్కౌంట్ ఇవ్వగలవు. తద్వారా కస్టమర్ల విశ్వసనీయతను చూరగొనవు’’అని ఓ ఫిన్‌టెక్ సంస్థ ఉన్నతోద్యోగి తెలిపారు. బ్యాంకులు క్రెడిట్ కార్డు మార్కెట్లో వాటా పెంచుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. కానీ, అది వాటికి పెద్ద సవాలుగా మారింది. బ్యాంకు శాఖ తరఫున ఒక్క క్రెడిట్ కార్డు కస్టమర్‌ను పొందేందుకు అవి రూ.2,000ను ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనితో పోలిస్తే కో బ్రాండెడ్ ఒప్పందం ద్వారా అయితే తక్కువ ఖర్చులోనే ఎక్కువ కస్టమర్లను చేరుకోవడం వాటిని ఆ దిశగా దృష్టి సారించేలా చేస్తోంది. అందుకే అవి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు, ప్ర ముఖ ఫిన్‌టెక్‌లు, కన్జ్యూమర్ కంపెనీలతో టైఅప్ కోసం కృషి చేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో, అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ సాయంతో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను మార్కెట్ చేస్తుండడం గమనార్హం. పరిశ్రమ వ్యాప్తంగా క్రెడిట్ కార్డు యాక్టివిటీ రేటు 50 శాతంగా ఉంటే, అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్‌కార్డులో ఇది 70 శాతంగా ఉన్నట్టు అమెజాన్ పే ఇండియా హోల్‌టైమ్ డైరెక్టర్ వికాస్ బన్సాల్ తెలిపారు. యూపీఐ ప్రభావం.. డెబిట్ కార్డుల వినియోగం తగ్గడానికి క్రెడిట్ కార్డులే కాకుండా, యూపీఐ చెల్లింపుల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. దాదాపు అన్ని దుకాణాల్లోనూ యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసే సౌలభ్యం ఉండడంతో డెబిట్ కార్డు ప్రాధాన్యం తగ్గింది. మే నెలలో 536 కోట్ల యూపీఐ మర్చంట్ లావాదేవీలు నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇదే నెలలో ఉన్న 254 కోట్ల లావాదేవీలతో పోలిస్తే రెట్టింపయ్యాయి. ఇప్పుడు అన్ని చెల్లింపుల సాధనాల్లోనూ యూపీఐ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత క్రెడిట్ కార్డు చెల్లింపులకే వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 8.5 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఏడాది క్రితం వీటి సంఖ్య 7.5 కోట్లు. మూడేళ్ల క్రితం 5 కోట్ల కంటే తక్కువే ఉన్నాయి. ‘‘యూపీఐ మాదిరిగా కాకుండా క్రెడిట్ కార్డు అనేది మొత్తం ఎకోసిస్టమ్‌లో ఉన్న అందరికీ ఆదాయాన్నిచ్చే సాధనం. సాధారణంగా అధిక విలువ కొనుగోళ్లకు, వినియోగ చెల్లింపులకు దీన్ని స్వైప్ చేస్తుంటారు’’అని ఓ బ్యాంకర్ తెలిపారు. -
అంతర్జాతీయ క్రెడిట్ కార్డులపై ఆర్బీఐ గురి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రయాణ సమయాల్లో వ్యయాలకు సంబంధించి అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల (ఐసీసీ) వినియోగాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెమిటెన్స్ పథకం (ఎల్ఆర్ఎస్) పరిధిలోకి తీసుకుని వస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. ఇదీ చదవండి: Mahila Samman Scheme: గుడ్‌న్యూస్.. మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన దీని ప్రకారం అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా విదేశీ మారకంలో చేసే వ్యయాలు ఇకపై ఎల్ఆర్ఎస్ పరిధిలోకి వస్తాయి. ఒక రెసిడెంట్ రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా సంవత్సరానికి గరిష్టంగా 2.5 లక్షల డాలర్ల వరకూ వ్యయం చేసే అవకాశం ఏర్పడింది. 2.5 లక్షల డాలర్లు, లేదా మరేదైన విదేశీ కరెన్సీలో దానికి సమానమైన మొత్తానికి మించిన చెల్లింపులకు (రెమిటెన్స్) ఆర్బీఐ నుంచి అనుమతి అవసరం అవుతుంది. అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ చెల్లింపులను ఎల్ఆర్ఎస్లో చేర్చడానికి సంబంధించి విదేశీ మారక నిర్వహణ (కరెంట్ అకౌంట్ లావాదేవీలు) (సవరణ) రూల్స్, 2023ని మంత్రిత్వ శాఖ మే 16న నోటిఫై చేసినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఆర్బీఐతో సంప్రదింపులతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!
ప్రస్తుత డిజిటల్ యుగంలో డెబిట్ కార్డులు , క్రెడిట్ కార్డు ఉండటం చాలా అవసరంగానూ సర్వసాధారణంగానూ మారిపోయింది. లావాదేవీల పరంగా డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు రెండూ దాదాపు ఒకే పద్ధతిలో పనిచేస్తాయి. అయితే వాటికి కొన్ని ప్రాథమిక తేడాలు ఉన్నాయి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుండి ఖర్చు చేయడానికి డెబిట్ కార్డ్ ఉపయోగపడితే, ఖాతాలో డబ్బులేకపోయినా, లిమిట్ మేరకు తక్షణ అవసరాలకు వాడుకుని భవిష్యత్తు చెల్లింపు సూత్రంపై క్రెడిట్ కార్డ్ పనిచేస్తుంది. అలాగే క్రెడిట్ కార్డ్ ద్వారా లభించే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి క్రెడిట్ స్కోర్. క్రెడిట్ కార్డ్‌ని షాపింగ్ చేయడానికి, అవుట్లెట్లలో చెల్లింపులకు, ఆన్లైన్ చెల్లింపులు చేయడానికి, ఏటీఎం నగదును విత్‌డ్రా చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ నగదు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి కాకుండా, క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ లేదా బ్యాంకు క్రెడిట్ పరిమితి నుండి లోన్‌గా లభిస్తుంది. లావాదేవీ జరిగిన తేదీ నుండి గరిష్టంగా 50 రోజుల వరకు వడ్డీ రహిత వ్యవధిలో లోన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో అయితే ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాలి. లేదంటే భారీ షాక్ తప్పదు. క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే కొనుగోళ్లకు రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ వోచర్లను సంపాదించవచ్చు. ఈ పాయింట్లు క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ నుండి ఆకర్షణీయమైన బహుమతులు, షాపింగ్ వోచర్ల ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు. అయితే క్రమశిక్షణతో ఉపయోగించక పోతే క్రెడిట్ కార్డ్ తిప్పలు తప్పవు. క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు నివారించాల్సిన అత్యంత సాధారణ తప్పులను చూద్దాం. సకాలంలో చెల్లింపులు క్రెడిట్ కార్డ్ గడువు తేదీని అస్సలు మిస్‌కాకూడదు. క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్లో మొత్తం ఖర్చులపై 48 రోజుల వరకు వడ్డీ రహిత వ్యవధిని అనుమతి ఉంటుంది. దీని ఆధారంగా ప్రతి నెల నిర్దిష్ట తేదీలోపు బకాయిలను క్లియర్ చేయాలి. గడువు తర్వాత బకాయి మొత్తంపై వడ్డీ బాదుడు ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సో.. సకాలంలో బిల్ చెల్లించలేకపోతే, క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటుంది. భవిష్యత్తులో లోన్ పొందే అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుంది. (రాధిక మర్చంట్, ఫ్రెండ్ ఒర్రీ: ఈ టీషర్ట్, షార్ట్ విలువ తెలిస్తే షాకవుతారు) చెల్లించాల్సిన కనీస మొత్తం, వడ్డీ వివరాలు పూర్తిగా చూడాలి ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మొత్తం లోన్ అమౌంట్ చెల్లించలేక, ఈఎంఐ సదుపాయాన్ని ఎంచుకుంటే ఈ మెయిల్ ద్వారా అందించే క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ను పూర్తిగా చదవాలి. ఇందులో లోన్లపై వివరాలు, వడ్డీ, చెల్లించాల్సిన మినిమం నగదు లాంటి వివరాలు పరిశీలించాలి. ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది తనిఖీ చేసుకోవాలి క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో పేర్కొన్న అన్ని లావాదేవీలు ఖచ్చితమైనవేనా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా పొరబాటు లేదా మోసపూరిత లావాదేవీ జరిగినట్లయితే క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్‌కు తెలియజేయాలి. అలాగే క్రెడిట్ కార్డ్‌లు వడ్డీ ఛార్జీలు, ఫైనాన్స్ ఛార్జీలు, ఆలస్య చెల్లింపు రుసుములు, వార్షిక రుసుములు మొదలైన అనేక ఛార్జీలుంటాయి. క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో అలాంటి ఛార్జీలు ఏవైనా ఉంటే, అన్యాయమని భావిస్తే వాటిపై ప్రశ్నించవచ్చు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు ఉపసంహరణ క్రెడిట్ కార్డ్ ద్వారా ఏటీఎం నగదు విత్‌డ్రా అవకాశం ఉన్నప్పటికీ, అత్యవసరమైతే తప్ప దీన్ని వాడ కుండా ఉండటమే బెటర్. ఎందుకంటే ఇలాంటి నగదు అడ్వాన్సులపై అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి. అంతేకాదు ఉపసంహరించుకున్న వెంటనే వడ్డీ షురూ అవుతుంది. అంతేకాకుండా, రుణ మొత్తం పెరుగుతూనే ఉండి చివరికి బిల్లును తడిసి మోపెడవుతుంది. క్రెడిట్ లిమిట్ మించకుండా క్రెడిట్ కార్డ్ వాడేటపుడు మన లిమిట్‌ను ఖచ్చితంగా గమనించాలి. క్రెడిట్ రేషియోలో 50శాతం లేదా అంతకంటే తక్కువ వాడటం ఉత్తమం. ఇలాంటి వాటిల్లో తేడా వస్తే క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా దెబ్బ తింటుంది. అవసరాలకు అనుగుణమైన క్రెడిట్ కార్డ్ భారతదేశంలో అనేక బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) క్రెడిట్ కార్డ్‌లను అందిస్తున్నాయి. సరైన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు నిబంధనలు, షరతులు, ఛార్జీలు, ఫీచర్లు, ప్రయోజనాలను జాగ్రత్తగా విశ్లేషించాలి. ఉదాహరణకు విమాన టిక్కెట్లు ,హోటల్స్బుక్ చేసుకోవడానికి అదనపు ప్రయోజనా లందించే క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవచ్చు. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సదుపాయం ఉన్న క్రెడిట్ కార్డ్ కోసం కూడా వెతకవచ్చు, తద్వారా ఇతర క్రెడిట్ కార్డ్‌ల నుండి తక్కువ వడ్డీ రేట్లకు లోన్ బ్యాలెన్స్‌ను బదిలీ చేయవచ్చు. చివరగా: క్రెడిట్ కార్డ్‌లు చాలా సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, కానీ వాటిని తెలివిగా వాడితేనే ఫలితం. లేదంటే అనవసరమైన అప్పులు చిక్కులు తెచ్చిపెడతాయి. అన్నింటికంటే మించి, అవసరాలకు సరిపోయే సరైన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవాలి. నిర్లక్ష్యంగా అవకాశం ఉంది కదా అని ఎలాంటి ప్లాన్స్ లేకుండా వాడేస్తే ఆ తరువాత వాటిని చెల్లించలేక నానా అగచాట్లు పడాలి. వడ్డీకి వడ్డీకి పెరిగి పెద్ద గుదిబండలాగా మెడకు చుట్టుకుంటుంది. (బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?) -
యూపీఐకి క్రెడిట్ కార్డుల అనుసంధానం.. ఫస్ట్ టైమ్!
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో అనుసంధానం చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇంతకుముందు వరకు యూపీఐకి కేవలం బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలను లింక్ చేసుకుని చెల్లింపులు చేసుకోవాల్సి వచ్చేది. ఆర్బీఐ క్రెడిట్ కార్డుల లింకింగ్ కూడా అనుమతించడంతో పరిశ్రమలో ఈ మేరకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ‘‘ఇక నుంచి హెచ్డీఎఫ్సీ బ్యంక్ రూపే క్రెడిట్ కార్డులను ప్రముఖ యూపీఐ ప్లాట్‌ఫామ్‌లపై అనుసంధానించుకుని, వినియోగించుకోవచ్చు’’ అని హెచ్డీఎఫ్సీ బ్యంక్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో కస్టమర్లకు డిజిటల్ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా మారతాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేమెంట్స్ విభాగం హెడ్ పరాగ్‌రావు తెలిపారు. యూపీఐపై రూపే క్రెడిట్ కార్డ్ అనుసంధానం నిజంగా పరిశ్రమ రూపురేఖలను మారుస్తుందని భావిస్తున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సీవోవో ప్రవీణ్ రాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: వడ్డీ రేట్ల పెంపు జాబితాలోకి మరో రెండు బ్యాంకులు) -
పేటీఎం రూపే క్రెడిట్ కార్డ్ వచ్చేసిందిగా! కార్డు లేకుండానే..
ముంబై: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) భాగస్వామ్యంతో యూపీఐ ఆధారిత ‘రూపే క్రెడిట్ కార్డ్’ను విడుదల చేసింది. కార్డు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చని తెలిపింది. యూపీఐ ఐడీకి రూపే క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేసుకుంటే సరిపోతుందని పేర్కొంది. రూపే క్రెడిట్ కార్డుతో యూపీఐపై చెల్లింపుల సౌలభ్యం ఏర్పడుతుందని తెలిపింది. వినియోగదారులకు ఉత్తమ సదుపాయాలను అందించాలన్న లక్ష్యంలో భాగమే రూపే క్రెడిట్ కార్డ్ అని కంపెనీ అభివర్ణించింది. (ఇదీ చదండి : RBI Policy review: రెపో రేటు పెంపు) రూపే క్రెడిట్ కార్డ్ లింక్ చేసుకున్న యూపీఐ ఐడీ ద్వారా లావాదేవీలు సజావుగా, ఆఫ్‌లైన్ , ఆన్లైన్ చెల్లింపులు రెండూ వేగంగా మారుతాయని కంపెనీ వెల్లడించింది. తమ కస్టమర్లకు చెల్లింపులను మరింత సులభం చేసేలా ఎన్పీసీఐ భాగస్వామ్యంతో యూపీఐలో రూపే క్రెడిట్ కార్డ్ సేవలు ప్రారంభించామని పేమెంట్స్ బ్యాంక్ సీఎండీ సురీందర్ చావ్లా తెలిపారు. (ఐకియా గుడ్‌న్యూస్: ధరలు తగ్గాయోచ్!) -
ఇక ఈ క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ చెల్లింపులు...ఫస్ట్ చాన్స్ వారికే
సాక్షి,ముంబై: యూపీఐ చెల్లింపుల విషయంలో క్రెడిట్ కార్డ్ యూజర్లకు తీపి కబురు అందించింది. దేశంలో డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డ్ హోల్డర్లు త్వరలో వస్తువులు, సేవల కోసం యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆపరేటెడ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. దీంతో ప్రస్తుతం వినియోగదారుల బ్యాంకు ఖాతాలకే పరిమితమైన యూపీఐ చెల్లింపులు ఇకపై క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా అందుబాటులో వస్తాయి. బుధవారం నుంచి యూపీఐలో క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ప్రారంభమైనట్లు రేజర్ పే ప్రకటించింది. వినియోగదారులు తమ రూపే క్రెడిట్ కార్డ్‌లను యూపీఐతో లింక్ చేయడానికి అనుమతించే ఎన్సీపీఐ ఫీచర్‌ను స్వీకరించిన తొలి చెల్లింపు గేట్‌వే తామేనని రేజర్ పే తెలిపింది. తమ చెల్లింపుల గేట్‌వేని ఉపయోగించే వ్యాపారులకు మాత్రమే పరిమితమని వెల్లడించింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఇది సాధ్యమైందని రేజర్‌పే ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్డిఎఫ్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ,ఇండియన్ బ్యాంక్‌ల కస్టమర్లు ఈ ప్రయోజనాలను మొదట పొందుతారని తెలిపింది. ఇప్పటికే రూపేక్రెడిట్ కార్డ్‌ల చెల్లింపులు మొదలైన సంగతి తెలిసిందే. (వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!) యూపీఐ క్రెడిట్ కార్డ్ లింకింగ్ ద్వారా కస్టమర్లు ఇకపై చెల్లింపుల కోసం తమ క్రెడిట్ కార్డ్‌లను అన్ని సమయాల్లో తమ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.తద్వారా చోరీ, లేదా క్రెడిట్ కార్డ్ పోగొట్టుకోవడం లాంటి కష్టాలు లేకుండా కస్టమర్లకు భద్రతను పెంచుతుంది. అలాగే స్వైపింగ్ మెషీన్ల వద్ద సున్నితమైన కస్టమర్ సమాచారాన్ని స్కిమ్మింగ్ చేసే లేదా కాపీ చేసే ముప్పునుంచి తప్పిస్తుంది. (సుజుకి కొత్త స్కూటర్, అదిరే ఫీచర్స్, ప్రీమియం లుక్, ధర ఎంతంటే?) కాగా దాదాపు 250 మిలియన్ల మంది భారతీయులు తమ రోజువారీ లావాదేవీల కోసం UPIని ఉపయోగిస్తున్నారు మరియు దాదాపు 50 మిలియన్ల మంది వినియోగదారులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్నారు. ఆర్బీఐ డేటా ప్రకారం క్రెడిట్ కార్డ్ పరిశ్రమ గత మూడు సంవత్సరాలలో 30 శాతం పెరిగింది. -
హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్
-
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ముఖ్య గమనిక
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ముఖ్య గమనిక. జనవరి నెల ప్రారంభం నుంచి క్రెడిట్ కార్డులపై అందించే రివార్డ్ పాయింట్లను సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఎస్బీఐ కార్డ్స్ వెబ్సైట్ ప్రకారం.. గతంలో అమెజాన్ ఆన్లైన్ షాపింగ్‌పై 10ఎక్స్ రివార్డ్స్ పాయింట్స్‌పై పొందే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అమెజాన్‌లో సింప్లీ క్లిక్, సింప్లీ క్లిక్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డ్స్‌తో ఇప్పుడు 5 రివార్డ్స్ పాయింట్లు మాత్రమే పొందే అవకాశం లభించింది. పైగా ఇతర ఏ ఆఫర్లతోనూ గానీ, వోచర్లతో గానీ కలిపి వినియోగించడానికి వీల్లేదని ఎస్బీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. జనవరి 6 నుంచి ఈ రూల్ అమల్లోకి రానుందని తెలిపింది. ఇక అపోలో 24/7, బుక్ మై షో, క్లియర్, ఈజీ డైనీర్, లెన్స్ కార్ట్ అండ్ నెట్ మెడ్స్ వంటి ట్రాన్సాక్షన్లపై 10 రివార్డ్స్ పాయింట్లు పొందే అవకాశాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పింది. -
రుణ సాయం... బీమా సౌకర్యం
సాక్షి, అమరావతి: కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ)ల ద్వారా ఆక్వా రైతులు, మత్స్యకారులకు మరింత మేలు చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడేళ్లలో 19,059 కేసీసీ కార్డుదారులకు రూ.2,673 కోట్ల రుణ పరపతిని ప్రభుత్వం కల్పించింది. మరింత ఎక్కువ మందికి కేసీసీలను జారీ చేయడం ద్వారా వారికి రుణ సాయం, బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేసీసీల జారీ, రుణపరపతి కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ ఆధారిత కేసీసీ అప్లికేషన్(ఆటోమేషన్)ను రూపొందించింది. జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు కేసీసీల జారీ, రుణాల మంజూరు వివరాలను ఆర్బీకేల్లోని మత్స్య సహాయకుల ద్వారా అప్లోడ్ చేస్తున్నారు. కేసీసీ పొందాలంటే... కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం మత్స్యకారులు, ఆక్వా రైతులు స్థానిక ఆర్బీకేల్లో దరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తిగతంగానే కాకుండా జేఎల్‌జీ, మహిళా, స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడినా కిసాన్ క్రెడిట్ కార్డులు జారీచేస్తారు. ఇందుకోసం ఆర్బీకే స్థాయిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో వారి సామర్థ్యాన్ని బట్టి రుణపరపతి కోసం బ్యాంకులకు సిఫార్సు చేస్తారు. అర్హులైన కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు పాండ్స్, ట్యాంక్స్, ఓపెన్ వాటర్ బాడీస్, హేచరీలు, రేరీంగ్, ప్రొసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రుణాలు ఇస్తారు. మత్స్యకారులకు వెస్సెల్స్, బోట్స్ నిర్మాణానికి ఆర్థిక చేయూతనిస్తారు. వర్కింగ్ క్యాపిటల్ కింద మత్స్యకారులకు సీడ్, ఫీడ్, ఎరువులు, ఫ్యూయల్, విద్యుత్, కూలీ, మార్కెటింగ్ చార్జీలు, లీజ్ రెంట్ల చెల్లింపుల కోసం రుణాలు పొందవచ్చు. మత్స్య ఉత్పత్తులు విక్రయించేవారు కూడా తమ వ్యాపార విస్తరణకు కోసం రుణ పరపతిని పొందవచ్చు. మత్స్యకారులకు భరోసా ప్రతి సీజన్లో ఆక్వా రైతులకు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణంలో మొదటి రూ.2 లక్షలను కేసీసీ రుణంగా పరిగణిస్తారు. ఆ రూ.2లక్షలపై 2%, మిగిలిన రుణం సకాలంలో చెల్లిస్తే మరో 3% వడ్డీ రాయితీ పొందే వెసులుబాటు కల్పించారు. కేసీసీ పొందిన వారికి బీమా కూడా వర్తిస్తుంది. కార్డు పొందిన ప్రతీ మత్స్యకారునికి నెలకు రూ.12 ప్రీమియంతో 18 నుంచి 70 ఏళ్ల వయసున్న వారికి ప్రధానమంత్రి సురక్ష యోజన, 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి రూ.330ల ప్రీమియంతో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన బీమా వర్తింపజేస్తారు. పెరుగుతున్న కార్డుదారులు.. రుణాలు రాష్ట్రంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో 2,865 కేసీసీ కార్డుదారులకు రూ.688.85కోట్లు, 2020–21లో 5,114 కార్డుదారులకు రూ.711.20కోట్లు, 2021–22లో 9,112 కార్డుదారులకు రికార్డు స్థాయిలో రూ.1,205.89 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీ నాటికి 1,968 కార్డుదారులకు రూ.67.26కోట్ల రుణాలు మంజూరు చేశారు. ప్రస్తుతం బ్యాంకుల వద్ద రుణాల కోసం 46,383 కేసీసీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. -
క్రెడిట్ కార్డ్ వాడకం మామూలుగా లేదుగా, తెగ కొనేస్తున్నారు!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రతికూల ప్రభావాలు క్రమంగా తగ్గుముఖం పట్టి .. ఆర్థిక కార్యకలాపాలు, వినియోగం నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. క్రెడిట్ కార్డు, యూపీఐ చెల్లింపుల ధోరణులే ఇందుకు నిదర్శనమని నిపుణులు, మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ నెలవారీ గణాంకాల ప్రకారం ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) లావాదేవీలు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 9.83 లక్షల కోట్లుగా ఉండగా ఆగస్టులో రూ. 10.73 లక్షల కోట్లకు చేరాయి. అలాగే పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) టెర్మినల్ ద్వారా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు ఏప్రిల్‌లో రూ. 29,988 కోట్లుగా ఉండగా ఆగస్టు నాటికి రూ. 32,383 కోట్లకు చేరాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో క్రెడిట్ కార్డుల వినియోగం రూ. 51,375 కోట్ల నుంచి రూ. 55,264 కోట్లకు చేరింది. 2017-2022 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో క్రెడిట్ కార్డులపై బకాయిలు వార్షిక ప్రాతిపదికన 16 శాతం మేర పెరిగినట్లు ఎస్బీఐ కార్డ్ ఎండీ రామ్మోహన్ రావు అమర తెలిపారు. ‘క్రెడిట్ కార్డులను ఉపయోగించడం పెరిగే కొద్దీ వాటితో ఖర్చు చేయడం కూడా పెరిగింది. గత కొద్ది నెలలుగా సగటున నెలకు క్రెడిట్ కార్డులపై చేసే వ్యయాలు రూ. 1 లక్ష కోట్లు దాటుతోంది. భారీ వినియోగ ధోరణులను ఇది సూచిస్తోంది. పండుగ సీజన్ రానుండటంతో ఇది మరింత పెరగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఊతం.. డిజిటల్ లావాదేవీలు ఇటు విలువపరంగా అటు అమ్మకాలపరంగా పెరుగుతుండటం ఎకానమీకి మేలు చేకూర్చే అంశమని పేనియర్‌బై ఎండీ ఆనంద్ కుమార్ బజాజ్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ పేమెంట్లకు సంబంధించి వివిధ విధానాల విషయంలో భయాలను పక్కనపెట్టి ప్రజలు అలవాటు పడుతుండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం, ఆదాయాలు, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతుండటం, ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగు పడుతుండటం వంటి అంశాలు ఆన్లైన్ చెల్లింపుల వృద్ధికి దోహదపడుతున్నాయని బజాజ్ చెప్పారు. మరింతమంది వర్తకులు డిజిటల్ పేమెంట్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండటం మరో సానుకూలాంశమని వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వారు కూడా యూపీఐని ధీమాగా వినియోగిస్తుండటంతో ప్రస్తుత పండుగ సీజన్లో ఈ విధానంలో చెల్లింపులు మరింతగా పెరిగే అవకాశం ఉందని సర్వత్రా టెక్నాలజీస్ ఎండీ మందర్ అగాషే చెప్పారు. మరోవైపు, డెబిట్ కార్డులు కాకుండా క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చులు పెరుగు తుండటానికి రెండు పార్శా్వలు ఉండవచ్చని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ (ఎకనమిక్ అడ్వైజరీ సర్వీసెస్) రణేన్ బెనర్జీ తెలిపారు. కుటుంబాలు నిజంగానే మరింతగా ఖర్చు చేస్తూ ఉండటం ఒక కోణం కాగా, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా రుణాలపై ఆధారపడుతుండటం మరో కోణం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. -
వీ–మార్ట్‌లో వినాయక చవితి ఆఫర్లు
హైదరాబాద్: ఫ్యాషన్ రిటైల్ సంస్థ వీ–మార్ట్... రాబోయే వినాయక చవితి సందర్భంగా గొప్ప ఆఫర్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణతో సహా ఒడిషా, కర్ణాటక, గోవా, పుణెల్లోని అన్ని వీ–మార్ట్ షోరూంలలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 19 నుంచే మొదలైన ఈ పండుగ ఆఫర్లు.. నెలాఖరుదాకా కొనసాగనున్నాయి. రూ.3 వేల కొనుగోలుపై రూ.1,500 డిస్కౌంట్ వోచర్, హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై 7.5% వరకు తక్షణ డిస్కౌంట్లను ఇస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
డెబిట్, క్రెడిట్ కార్డు నిబంధనలు: చివరి తేదీ వచ్చేస్తోంది
సాక్షి,ముంబై: ఆన్లైన్ షాపింగ్ సౌలభ్యం కోసం ఆర్బీఐ‘టోకనైజేషన్’ అనే కొత్త పద్దతిని ప్రవేశపెట్టింది. అలాగే చాలా సురకక్షితంగా కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేసుకోవచ్చని కేంద్ర బ్యాంకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్లైన్,ఆఫ్‌సేల్ యాప్‌లో లావాదేవీలలో ఉపయోగించిన మొత్తం క్రెడిట్, డెబిట్ కార్డ్ డేటాను సెప్టెంబర్ 30, 2022 నాటికి ప్రత్యేక టోకెన్లతో భర్తీ చేయాలని ఆదేశించింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జూలై 1 నుండి 'క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్' మార్గదర్శకాలను అమలు చేయాల్సవ ఉంది. అయితే, పరిశ్రమ వాటాదారుల విజ్ఞప్తి మేరకు ఈ గడువును అక్టోబరు 1కి పెంచింది. కస్టమర్లు సురక్షితమైన లావాదేవీలు చేయడంలో సహాయపడతాయని, కార్డ్ వివరాలు ఎన్క్రిప్టెడ్ “టోకెన్”గా స్టోర్ అవుతాయని తెలిపింది. ఒరిజినల్ కార్డ్ డేటాను ఎన్క్రిప్టెడ్ డిజిటల్ టోకెన్‌తో భర్తీ చేయడం తప్పనిసరి చేసింది. ఈ టోకెన్లు కస్టమర్ వివరాలను బహిర్గతం చేయకుండా చెల్లింపు చేయడానికి అనుమతిస్తాయి. ఫలితంగా కార్డ్ హోల్డర్ల ఆన్లైన్ లావాదేవీల అనుభవాలను మెరుగుపరుస్తుంది. సైబర్ నేరగాళ్లనుంచి కార్డ్ సమాచారాన్ని భద్ర పరుస్తుంది. కార్డులు లేకుండానే ఆన్ లైన్ లో షాపింగ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ షాపింగ్ లో దిగ్గజాలైన అమెజాన్, ప్లిఫ్ కార్ట్, బిగ్ బాస్కెట్..ఇతరత్రా ఆన్ లైన్ వెబ్ సైట్ లలో షాపింగ్ మరింత సులభతరం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. అందుకనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా 2022, జనవరి నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్ లైన్ షాపింగ్ చేసేందుకు కొత్త చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రజల సమాచారం కూడా భద్రంగా వీలు ఉండే అవకాశం ఉందని వెల్లడిస్తోంది. టోకెన్లు ఎలా రూపొందించుకోవాలి ♦ కొనుగోలుకుముందు చెల్లింపు లావాదేవీని ప్రారంభించడానికి, ఇ-కామర్స్ వ్యాపారి వెబ్సైట్ లేదా అప్లికేషన్‌కు వెళ్లాలి ♦ ఉత్పత్తులను కొనుగోలు చేసే క్రమంలో..తమ కార్డు పూర్తి సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. ♦ షాపింగ్ వెబ్ సైట్ కు చెందిన చెక్ అవుట్ పేజీలో కార్డు వివరాలను నమోదు చేయాలి. అనంతరం టోకనైజేషన్ సెలక్ట్ చేసుకోవాలి. ♦ క్రియేట్ టోకెన్‌ను సెలక్ట్ చేసి,అధికారిక మొబైల్ ఫోన్ లేదా ఇమెయిల్‌లో ద్వారా వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. దీంతోటోలావాదేవీ పూర్తి అవుతుంది. ♦ తమకు నచ్చినన్ని కార్డులను టోకనైజ్ చేసుకొనే ఛాన్స్ ఉంది. అదే వెబ్సైట్ లేదాయాప్లో తదుపరి కొనుగోళ్లకు నాలుగు అంకెల టోకెన్ ఇస్తే సరిపోతుంది. ♦ తద్వారా మోసాలకు తావుండదని, కొనుగోలుదారు సమాచారాన్ని సేకరించడం హ్యాకర్లకు కష్టమవుతుందని ఆర్బీఐ అభిప్రాయం. ♦ దీని ప్రకారం ఇకపై 16 అంకెల కార్డు వివరాలను, కార్డు గడువు తేదీని గుర్తించుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే కార్డ్ జారీ చేసేవారు క్రెడిట్ కార్డ్‌ను యాక్టివేట్ చేయడానికి కార్డ్ హోల్డర్ నుండి వన్ టైమ్ పాస్వర్డ్ ఆధారిత సమ్మతిని తప్పనిసరిగా పొందాలి. ఒకవేళ అది జారీ చేసిన తేదీ నుండి 30 రోజుల కంటే ఎక్కువ కస్టమర్ యాక్టివేట్ చేయపోతే, ఎలాంటి సమ్మతి రాకపోయినా, కన్ఫర్మేషన్ కోరిన తేదీ నుండి ఏడు పని దినాలలోగా, కస్టమర్‌కు ఎటువంటి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ ఖాతా క్లోజ్ అవుతుంది. -
క్రెడిట్ కార్డుల వ్యాపారంలోకి సీఎస్బీ బ్యాంక్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల వ్యాపార విభాగంలోకి ప్రవేశించనున్నట్లు సీఎస్బీ బ్యాంక్ ఎండీ (తాత్కాలిక) ప్రళయ్ మండల్ వెల్లడించారు. ఇందుకోసం అవసరమైన టెక్నాలజీని పటిష్టపర్చుకుంటున్నట్లు చెప్పారు. క్రెడిట్ కార్డులతో పాటు ఇతరత్రా ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. 2028–29 నాటికి రిటైల్ విభాగం మొత్తం వ్యాపారంలో అతి పెద్దదిగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మండల్ తెలిపారు. బంగారం రుణాల వృద్ధి నిలకడగా కొనసాగుతోందని, చిన్న..మధ్య స్థాయి సంస్థలకు లోన్లు పుంజుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. మొండిబాకీలు తగ్గడంతో తొలి త్రైమాసికంలో సీఎస్బీ బ్యాంక్ నికర లాభం 88 శాతం పెరిగి రూ. 115 కోట్లకు చేరింది. -
రి‘కార్డ్’ స్థాయిలో క్రెడిట్!.. జాగ్రత్తగా ఉండకపోతే జేబుకు చిల్లే
‘రండి బాబూ రండి.’ అంటూ క్రెడిట్ కార్డులిస్తున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఏ అవసరానికైనా అప్పటికప్పుడే డబ్బు సర్దుబాటు అవుతుందంటూ గాలం ఫేస్బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఎస్ఎంఎస్.. ఏది చూసినా ఇవే ప్రకటనలు ఒక్క మే నెలలోనే 17 లక్షల క్రెడిట్ కార్డులు జారీ చేసిన సంస్థలు జూన్‌లో క్రెడిట్ కార్డుల లావాదేవీలు ఏకంగా రూ.1.14 లక్షల కోట్లు సులువుగా అందుతుండటంతో భారీగా పెరిగిన వినియోగం అడ్డగోలుగా క్రెడిట్ లిమిట్ వాడేస్తూ.. కట్టలేక చార్జీలు, వడ్డీలతో ఇబ్బందులు ఒకప్పుడు అప్పు చేయాలంటే ఒకటిCrకి రెండు సార్లు ఆలోచించేవారు. ఇప్పుడు తమ ఆదాయానికి తగ్గట్టు కొందరు.. ఆదాయానికి మించి ఇంకొందరు ఎడాపెడా అప్పులు చేస్తూనే ఉన్నారు. బ్యాంకులూ ఈ పరిస్థితిని అనుకూలంగా ఉపయోగించుకుని ప్రాసెసింగ్ ఫీజులు, సర్వీసు చార్జీలు, అపరాధ రుసుముల పేరిట వినియోగదారుల జేబులు ఖాళీ చేస్తున్నాయి. ఫీజులు, జరిమానాలు కొండంత అని తెలిసినా వినియోగదారుల్లో క్రెడిట్ కార్డులపై మోజు తగ్గకపోగా అంతకంతకూ పెరిగిపోతోంది. అదే సమయంలో బ్యాంకులు కూడా ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయా, లేదా? అన్నది కూడా చూసుకోవడం లేదన్నంతగా అప్పులు ఇచ్చేస్తున్నాయి! పది మందిలో ఇద్దరు లేదా ముగ్గురు అప్పు ఎగవేసినా ఇబ్బంది లేని రీతిలో బ్యాంక్‌లు ఉన్నాయి. ఎందుకంటే బాగా చెల్లించగలిగిన ఆ ఏడెనిమిది మంది నుంచే క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంక్‌లు వసూలు చేస్తున్న వడ్డీ 45 శాతం (నెలవారీగా). బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఓ బ్యాంకర్ చెప్పిన మాట ఇది. సక్రమ చెల్లింపులతో బ్యాంకులకు నష్టమే! వినియోగదారులు నిబంధనల ప్రకారం సకాలంలో సొమ్ము చెల్లిస్తే తమకు నష్టమేనని ప్రైవేట్ క్రెడిట్ కార్డు సంస్థలు, బ్యాంకులు అంటున్నాయి. ‘‘ఇచ్చిన వంద రూపాయల అప్పును వినియోగదారుడు నిర్దిష్ట వ్యవధిలోగా తిరిగి చెల్లిస్తే మాకు ఏమీ గిట్టుబాటు కాదు. ఒకవేళ ఆ తేదీ నాటికి వినియోగదారుడు పూర్తి మొత్తం కాకుండా, కనీస మొత్తంగా పది రూపాయలు చెల్లించాడనుకుంటే.. మిగతా రూ.90పై 43% దాకా వడ్డీ పడుతుంది. దీనినే రివాల్వింగ్ క్రెడిట్ అంటారు. ఇలాంటి జరిమానాలు, వడ్డీలతోనే బ్యాంకులకు లాభాలొస్తాయి’’ అని ఓ బ్యాంకింగ్ నిపుణుడు విశ్లేషించారు. కొన్ని బ్యాంకులు తమ షరతులను వినియోగదారులకు వివరించకుండానే కార్డులు జారీ చేస్తున్నాయి. ఇలాంటి బ్యాంకులకు ముకుతాడు వేసేందుకు రిజర్వ్ బ్యాంకు తాజాగా కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం క్రెడిట్ కార్డు సంస్థలు వినియోగదారుడికి తగినంత సమయం, సమాచారం ఇవ్వకుండా కార్డుల జారీ చేయరాదు. ఉన్నవాటి స్థాయి పెంచరాదు. వినియోగదారుడు కార్డును రద్దు చేసుకుంటానంటే ఆ విజ్ఞప్తిని పోస్ట్ ద్వారానే పంపాలని చెప్పకూడదు. ఈ–మెయిల్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా కూడా వినియోగదారులకు సమాచారం అందించాలి. కొంచెం జాగ్రత్త.. ►క్రెడిట్ కార్డుల వినియోగం, బిల్లుల చెల్లింపులో అజాగ్రత్తగా వ్యవహరిస్తే జేబుకు చిల్లు పడటం ఖాయం. ఆ పరిస్థితి రాకుండా కొన్ని సూచనలివీ.. ►అన్నిరకాల క్రెడిట్ కార్డులను పరిశీలించి తక్కువ వడ్డీ రేట్లు ఉన్న వాటిని ఎంచుకోవాలి. చాలా ఆర్థిక సంస్థలు ఇప్పుడు వార్షిక రుసుము వసూలు చేయడం లేదు. దీనిపైనా ఓ కన్నేసి ఉంచాలి. క్యాష్ అడ్వాన్స్ ఫీజు, లేట్ పేమెంట్ చార్జీలు, చెక్ బౌన్స్ చార్జీలు, స్టేట్మెంట్ కోసం చెల్లించాల్సిన డబ్బులు.. ఇలా రకరకాల పేర్లతో డబ్బు వసూలు చేస్తుంటాయి. వీటి గురించి ముందే తెలుసుకుని, వీలైనంత వరకూ ఆ లావాదేవీలకు దూరంగా ఉంటే సొమ్ము ఆదా అవుతుంది. ►అత్యవసర పరిస్థితుల్లో లేదా నెలవారీ చెల్లింపుల కోసం మాత్రమే క్రెడిట్ కార్డులు వాడటం మేలు. ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు నాలుగు నుంచి ఐదు వారాల సమయం ఉంటుంది కాబట్టి.. అంత సమయం వడ్డీ లేకుండా అప్పు దొరుకుతుందన్నమాట. సకాలంలో చెల్లించకపోతే పెనాల్టీలు తడిసి మోపెడవుతాయి. చెల్లింపు ►గడువునాటికి సరిపడా డబ్బు లేకుంటే.. కనీస మొత్తానికంటే ఎక్కువ కట్టడం ద్వారా వడ్డీ, పెనాల్టీ బాధ తగ్గించుకోవచ్చు. లేకుంటే నెలవారీ కిస్తీలుగా మార్చుకుని ఎప్పటికప్పుడు చెల్లించడం మేలు. ►బిల్లులు గడువులోగా చెల్లించకుంటే సిబిల్ రేటింగ్ పడిపోతుందని, ఇతర ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడాన్ని నిలిపివేస్తాయని గుర్తుంచుకోవాలి. మార్చిలో లక్ష కోట్లు ఈ ఏడాది మార్చి నెలలో కేవలం క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన కొనుగోళ్ల విలువ ఏకంగా రూ.లక్ష కోట్లు. రెండు నెలలు గడిచి జూన్ వచ్చేసరికి రికార్డు స్థాయిలో లక్షా 14 వేల కోట్ల రూపాయలకు చేరింది. అంటే నెలకు ఎనిమిది శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 118 శాతం ఎక్కువ. మరో విషయం ఏమిటంటే మేలో దేశంలోని మొత్తం అన్ని బ్యాంకులు కలిసి దాదాపు 17 లక్షల క్రెడిట్ కార్డులు జారీ చేశాయి. గత రెండేళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ వంటి బ్యాంకులు అత్యధికంగా కార్డులిచ్చాయి. అంతేకాదు ఇచ్చిన అప్పులు తిరిగి వసూలైన విషయంలోనూ మేలో ఒక రికార్డు నమోదైంది. గత మూడేళ్లతో పోలిస్తే అతి తక్కువ బౌన్స్ రేటు ఈ నెలలోనే ఉంది. కారణాలు ఏమిటి? స్థూలంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి కోవిడ్ తరువాతి పరిస్థితులైతే, రెండోది డిజిటల్ వ్యవహారాలు పెరిగిపోవడం. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు ఇళ్లకే పరిమితమైనవారు ఇప్పుడిప్పుడే వినోద, విహారాలకూ సిద్ధమవుతున్నారు. కోవిడ్ సమయంలో జేబులు ఖాళీ అయిన వారే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తక్షణావసరాలకు క్రెడిట్‌కార్డులు ఉపయోగిస్తే తప్పేమిటన్న భావన ఏర్పడింది. దీనికితోడు కోవిడ్ సమయంలో డిజిటల్ లావాదేవీలకు ప్రజలు అలవాటు పడటం కూడా కార్డుల వాడకం పెరిగేందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘మేం ఎప్పటికీ క్రెడిట్ కార్డులు తీసుకోం. మాకు ఆ పరిస్థితి రాదని 2016–2019 మధ్య మేం సర్వే చేసిన వారిలో 23 శాతం మంది చెప్పారు. కానీ కరోనా తదనంతర పరిస్థితుల్లో వారిలో 17 శాతం మంది క్రెడిట్‌కార్డులు తీసుకున్నారు’’ అని మనీ కంట్రోల్ ఆర్గనైజేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవేంద్ర ద్వివేది చెప్పారు. డిజిటల్ లావాదేవీల వల్ల ప్రతి వ్యక్తి ఆర్థిక స్థితిగతులపై బ్యాంకులకు అవగాహన ఏర్పడిందని, దీంతో కార్డుల జారీ మరింత వేగిరం చేశాయని హైదరాబాద్‌కు చెందిన ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఒకరు చెప్పారు. అయితే పాక్షికంగా ఆర్థిక సంక్షోభం వచ్చినా బ్యాంక్‌లు నష్టపోయే ప్రమాదం ఉందని ఆర్బీఐ హెచ్చరించిందని కూడా వివరించారు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
బ్యాంకుకు వెళ్లిన సాగర్‌కు మతి పోయినంతపనైంది.. భద్రం బ్రదరూ! ఇంతకూ ఏమైంది?
సాగర్‌కు రెండు క్రెడిట్ కార్డులున్నాయి. పరిమితి కూడా ఎక్కువ. దేనికైనా వీటినే వాడుతూ ఉంటాడు. క్రెడిట్ స్కోరుకు ఢోకా లేకుండా బిల్లు కరెక్టుగా చెల్లిస్తుంటాడు. కానీ ఈ మధ్య ఓ లోన్కోసం వెళితే... తన క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందన్నారు. రిపోర్టు చూసి అదిరిపడ్డాడు సాగర్. ఎందుకంటే తన పేరిట 5 క్రెడిట్ కార్డులున్నాయి. వాటిలో కొన్నింటికి బకాయిలున్నాయి. మరికొన్నిటి చెల్లింపులు ఆలస్యమయ్యాయి. దానివల్లే క్రెడిట్ స్కోరు తగ్గింది. బ్యాంకుకు వెళ్లి ఇదేంటని అడిగిన సాగర్‌కి... విషయం తెలిసి మతి పోయినంతపనైంది. ఇంతకీ ఏంటది? సాధారణంగా షాపింగ్‌కో, ఆన్లైన్ పేమెంట్లకో క్రెడిట్ కార్డు వాడటం సాగర్‌కు అలవాటు. కానీ ఈ మధ్య ఆన్లైన్లో అత్యంత సౌకర్యంగా ఉండటంతో ఇన్స్టంట్ లోన్/పేమెంట్ యాప్‌లను ఎడాపెడా వాడటం మొదలెట్టాడు. తరువాత చెల్లింవచ్చు కదా (పోస్ట్ పెయిడ్) అనే ఉద్దేశంతో చాలా యాప్‌లలో కొంత మొత్తం చొప్పున వాడేశాడు. వాటిలో కొన్నింటి గడువు తేదీ వారం రోజులే!. మరికొన్నింటికి 10 రోజులు– 15 రోజులు ఇలా బిల్లింగ్ సైకిల్స్ ఉన్నాయి. అంత తక్కువ వ్యవధి కావటంతో వాటిని తిరిగి చెల్లించటంలో కిరణ్ అంత శ్రద్ధ పెట్టలేకపోయాడు. ఇవిగో... ఇవే సిబిల్ రిపోర్టులో కొంప ముంచాయి. పోస్ట్‌పెయిడ్–లోన్ యాప్స్ వేరువేరు కస్టమర్లను ఆకట్టుకోవటానికి కొన్ని... వ్యాపారాన్ని పెంచుకోవటానికి కొన్ని. కారణమేదైనా ఇపుడు చాలా కంపెనీలు పోస్ట్‌పెయిడ్ మొదలెట్టేశాయి. అంటే... ‘ఇప్పుడు కొను–తరువాత చెల్లించు’ (బీఎన్‌పీఎల్) అన్నమాట. షాపింగ్ యాప్‌లతో పాటు సర్వీసులందించే యాప్‌లు కూడా వీటిని అందిస్తున్నాయి. ఉదాహరణకు క్యాబ్ అగ్రిగేటర్ ‘ఓలా’నే తీసుకుంటే... క్యాబ్ బుక్ చేసిన వెంటనే చెల్లించాల్సిన పనిలేదు. కొంత మొత్తం పరిమితికి లోబడి... ఓలా పోస్ట్ పెయిడ్ సేవలందిస్తోంది. ఆ మొత్తం వరకూ సర్వీసులు వాడుకోవచ్చు. ఈలోపు బిల్లింగ్ తేదీ వస్తే బిల్లు అందుతుంది. చెల్లిస్తే సరి. మరిచిపోతే కాస్త జరిమానాలూ ఉంటాయి. ఓలాతో పాటు ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి కూడా కొంత పరిమితి వరకూ ‘పే లేటర్’ సేవలందిస్తున్నాయి. ఇదంతా పోస్ట్‌పెయిడ్ వ్యవహారం. లోన్‌యాప్స్ కూడా ఇంచుమించుగా... మారుతున్న కాలానికి తగ్గట్టుగా క్రెడిట్ కార్డుల్లానే ఆన్లైన్ లోన్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. కార్డులు లేకున్నా, వాలెట్లలో డబ్బులు లేకున్నా సరే... ఈ యాప్స్‌తో అప్పటికప్పుడు ఈజీగా పే చేసేయొచ్చు. లేజీ పే, సింపుల్, బుల్లెట్, పేటీఎం పోస్ట్‌పెయిడ్, ఫ్రీచార్చ్ పే లేటర్, మొబిక్విక్ జిప్ పేలేటర్, పే లేటర్ బై ఐసీఐసీఐ... ఇవన్నీ అలాంటివే. ఆన్లైన్లో కొన్న వస్తువుకో, అందుకున్న సర్వీసుకో దీనిద్వారా తక్షణం చెల్లించేయొచ్చు. బిల్లులు కూడా. వీటన్నిటినీ కూడా క్రెడిట్కార్డుల్లానే భావించాల్సి ఉంటుంది. అందించేవన్నీ ఆర్థిక సేవల కంపెనీలే కాబట్టి... సిబిల్ జాబితాలో వీటిని కూడా క్రెడిట్ కార్డుల్లానే చూడాల్సి వస్తుంది. చిన్నచిన్న పేమెంట్లే కనక వీటి చెల్లింపు గడువు కూడా తక్కువే. జరిమానాలూ ఎక్కువే. ఉదాహరణకు 100 రూపాయల బిల్లు గనక చెల్లించకపోతే... మరో 100 ఫైన్ కట్టాల్సి రావచ్చు. ఎందుకంటే చాలా సంస్థలు కనీస ఫైన్ మొత్తాన్ని ఈ రకంగా నిర్ధారిస్తున్నాయి. శాతంలోనైతే ఇది 100. చాలామందికి రూ.100 అనేది చిన్న మొత్తంగానే కనిపిస్తుంది కాబట్టి పెద్ద సమస్య ఉండదు. కాకపోతే వీటిని విస్మరిస్తే సిబిల్ రిపోర్టులో స్కోరుపై మాత్రం ప్రభావం చూపిస్తాయని మరిచిపోకూడదు. పోస్ట్‌పెయిడ్–లోన్ యాప్స్‌కు తేడా ఏంటి? పోస్ట్‌పెయిడ్‌లో సదరు సంస్థ తమ దగ్గర కొన్న వస్తువుకో, అందుకున్న సర్వీ సుకో దీన్ని అందిస్తుంది. కానీ లోన్‌యాప్స్ అయితే ఏ కంపెనీలో కొన్న వస్తువుకైనా, ఎక్కడ తీసుకున్న సర్వీసుకైనా వీటి నుంచి చెల్లింపులు చేయొ చ్చు. నిజానికిప్పుడు లేజీ పే వంటి చాలా లోన్‌యాప్స్ అస్సలు వడ్డీలు వసూలు చేయటం లేదు. మరి వాటి మనుగడ ఎలా? అనే సందేహం సహజం. ప్రస్తుతానికైతే ఆలస్య రుసుములే వీటికి ప్రధాన ఆదాయ వనరు. పైపెచ్చు ఇవన్నీ యూజర్ బేస్‌ను (కస్టమర్ల సంఖ్య) పెంచుకోవటంపైనే దృష్టిపెడుతున్నాయి. అక్కడ సక్సెస్ అయితే పెట్టుబడులొస్తాయి. ఏదో ఒక దశలో ఆ పెట్టుబడులపై లాభాన్ని అందించాల్సిన బాధ్యత ప్రమోటర్‌కు ఉంటుంది. కాబట్టి మున్ముందు ఇవన్నీ వడ్డీల రూపంలోనో... నెలవారీ ఫీజుల రూపంలోనో యూజర్ల నుంచి చార్జీలు వసూలు చేయక తప్పదు కూడా. ఇంతకీ వీటిని వాడొచ్చా? క్రెడిట్ కార్డుల్ని సైతం ఎడాపెడా వాడితే ఆ తరువాత ఇబ్బందులు తప్పవన్నది చాలామందికి అనుభవంలోకి వచ్చిన వాస్తవం. అలాంటిది అందుబాటులో ఉన్నాయి కదా అని ఎడాపెడా లోన్ యాప్స్ నుంచి రుణాలు తీసుకుంటే?. వీటి బిల్లింగ్‌ను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ అప్డేటెడ్గా ఉండటం అంత తేలికేమీ కాదు. బిల్లుకు సంబంధించిన మెసేజ్ వచ్చాక... ఏ కాస్త నిర్లక్ష్యం చేసినా మరిచిపోయి ఫైన్ పడే ప్రమాదం ఎక్కువ. అందుకని వీటికి దూరంగా ఉండటమే మంచిదని చెప్పాలి. సిబిల్ రిపోర్టులో సైతం మీరు ఉపయోగించిన ఒక్కో లోన్ యాప్ ఒక్కో క్రెడిట్లైన్ మాదిరి కనిపిస్తుంది. వాటిలో జరిమానాలు, ఆలస్యపు చెల్లింపులు ఉంటే స్కోరు దెబ్బతినే అవకాశం తప్పకుండా ఉంటుంది. మరో ముఖ్యమైన అంశమేంటంటే కొన్ని యాప్‌లు తమ బకాయిల వసూలుకు రకరకాల అనైతిక మార్గాలు కూడా అనుసరిస్తున్నాయి. రుణం తీసుకున్న వారి కాంటాక్టు లిస్టులో ఉన్నవారందరికీ ఫోన్లు చేయటం... భయపెట్టడం... వారి దగ్గర ఈ వ్యక్తిని అవమానించటం వంటివన్నీ చేస్తున్నాయి. కాబట్టి వీలైనంతవరకూ వీటికి దూరంగా ఉండటమే మంచిదని చెప్పాలి. -మంథా రమణమూర్తి -
క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ చెల్లింపులు: లింకింగ్ ఎలా?
సాక్షి, ముంబై: డిజిటల్ ఇండియాలో భాగంగా రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా వినియోగదారులకు కొత్త అవకాశాన్ని ప్రకటించింది. క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ లావాదేవీలకు అనుమతినివ్వనుంది. ద్వైమాసిక పాలసీ సమీక్ష, రెగ్యులేటరీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను మరింత ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుందని శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ ప్రమోట్ చేసిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) జారీ చేసిన రూపే క్రెడిట్ కార్డ్‌లతో తొలుత ఈ అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. దీనికవసరమైన సిస్టమ్ డెవలప్మెంట్ పూర్తయిన తర్వాత తగిన సూచాలు అందిస్తామన్నారు. అలాగే యూపీఐలో మొత్తం 26 కోట్ల మంది ప్రత్యేక వినియోగదారులు, 5 కోట్ల మంది వ్యాపారులు ఉన్నారనీ మే నెలలో 594.63 కోట్ల యూపీఐ లావాదేవీల ద్వారా రూ.10.40 లక్షల కోట్లు ట్రాన్సాక్షన్స్ జరిగాయని ప్రకటించారు. ఆర్బీఐ ప్రకటించిన ఈ వెసులుబాటుతో యూపీఏ ప్లాట్‌ఫామ్స్‌కు క్రెడిట్ కార్డును లింక్ చేసి, కార్డు స్వైప్ చేయ కుండానే పేమెంట్స్ చేసుకోవచ్చు. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయవచ్చన్న మాట. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే వన్‌టైం పాస్వర్డ్ ఎంటర్ చేసిన తరువాత మాత్రమే పేమెంట్ పూర్తి చేయవచ్చు. కాగా ఇప్పటివరకు యూపీఐ ఖాతాలకు కేవలం డెబిట్ కార్డులను మాత్రమే లింక్ చేసుకునే సౌకర్యం ఉన్న సంగతి తెలిసిందే. అలాగే గూగుల్‌పే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐ ఆధారిత యాప్స్‌ను ఎంపిక చేసిన బ్యాంకులు క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులకు అనుమతిస్తున్నాయి. పేమెంట్స్ యాప్స్‌తో క్రెడిట్ కార్డ్ అనుసంధానం ఎలా? ♦ పేమెంట్ యాప్‌ను ఓపెన్ చేసి ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేయాలి. ♦ ఆ తర్వాత పేమెంట్ మెథడ్‌ను క్లిక్ చేస్తే యాప్‌లో బ్యాంకు అకౌంట్స్ జాబితా కనిపిస్తుంది ♦ ఇక్కడ యాడ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పైన క్లిక్ చేయాలి. ♦ తరువాత కార్డు నెంబర్, ఎక్స్పైరీ డేట్, సీవీవీ, కార్డ్ హోల్డర్ పేరు నమోదు చేసి, సేవ్ను క్లిక్ చేస్తే సరిపోతుంది. -
అడగకుండా కార్డులు జారీ చేయొద్దు
ముంబై: కస్టమర్ల నుంచి విస్పష్టంగా సమ్మతి తీసుకోకుండా క్రెడిట్ కార్డులు ఇవ్వడం లేదా ప్రస్తుత కార్డును అప్‌గ్రేడ్ చేయడం వంటివి చేయొద్దని కార్డ్ కంపెనీలను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. దీన్ని ఉల్లంఘించిన పక్షంలో కస్టమర్‌కు వేసిన బిల్లుకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. బాకీల వసూలు కోసం కస్టమర్లపై వేధింపులు, బెదిరింపులకు దిగరాదంటూ కార్డుల సంస్థలు, థర్డ్ పార్టీ ఏజెంట్లకు ఆర్బీఐ సూచించింది. 2022 జూలై 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం ఎవరి పేరు మీదైనా అడగకుండానే కార్డు జారీ అయితే, వారు ఆ విషయంపై సదరు కార్డు సంస్థకు ఫిర్యాదు చేయొచ్చు. కంపెనీ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారుకు వాటిల్లిన నష్టాన్ని (సమయం, వ్యయాలు, మానసిక ఆవేదన తదితర అంశాలు) పరిగణనలోకి తీసుకుని కార్డు జారీ సంస్థ చెల్లించాల్సిన పరిహారాన్ని అంబుడ్స్‌మన్ నిర్ణయిస్తారు. రూ. 100 కోట్లకు పైగా నికర విలువ గల కమర్షియల్ బ్యాంకులు స్వతంత్రంగా లేదా కార్డులు జారీ చేసే ఇతర బ్యాంకులు/ఎన్బీఎఫ్సీలతో కలిసి క్రెడిట్ కార్డు వ్యాపారం ప్రారంభించవచ్చు. స్పాన్సర్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంకులతో ఒప్పందం ద్వారా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డులు ఇవ్వొచ్చు. ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎన్బీఎఫ్సీలు .. డెబిట్, క్రెడిట్ కార్డులు మొదలైనవి జారీ చేయకూడదు. కార్డు జారీ సంస్థలు/వాటి ఏజెంట్లు.. బాకీల వసూలు విషయంలో క్రెడిట్ కార్డుహోల్డర్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు పట్ల మౌఖికంగా గానీ భౌతికంగా గానీ ఏ విధంగాను బెదిరించడం లేదా వేధింపులకు పాల్పడకూడదని ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. -
ఐఫోన్లో మరో అదిరిపోయే ఫీచర్..!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మరో కొత్త సేవను తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొనిరావలని యోచిస్తుంది. చిన్న వ్యాపారాలు ఎటువంటి అదనపు హార్డ్‌వేర్ లేకుండా తమ ఐఫోన్లలో నేరుగా క్రెడిట్ కార్డు చెల్లింపులను స్వీకరించడానికి ఒక కొత్త సాఫ్ట్వేర్ రూపొందిస్తుంది. బ్లూమ్ బెర్గ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం రిటైలర్స్ డబ్బును స్వీకరించడానికి బ్లూటూత్ ద్వారా అనుసంధానించిన ఐఫోన్లలో బ్లాక్ ఇంక్ స్క్వేర్ చెల్లింపు వ్యవస్థలును ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త ఫీచర్ ఐఫోన్‌ను చెల్లింపు టెర్మినల్'గా మారుస్తుంది. వ్యాపారులు క్రెడిట్ కార్డు లేదా మరొక ఐఫోన్ సహాయంతో చెల్లించే చెల్లింపులను స్వీకరించడానికి ఈ కొత్త ఫీచర్ అనుమతిస్తుంది అని బ్లూమ్ బెర్గ్ నివేదిక తెలిపింది. ఈ ఫీచర్ కోసం ప్రస్తుతం యాపిల్ పే కోసం వినియోగించే ఎన్ఎఫ్సీ చిప్‌ను ఉపయోగిస్తుందని, రాబోయే కొద్ది నెలల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఈ ఫీచర్ బయటకు రావచ్చని నివేదిక తెలిపింది. కంపెనీ సుమారు 2020 నుంచి ఈ కొత్త కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. అయితే, బ్లూమ్ బెర్గ్ నివేదికపై వ్యాఖ్యానించడానికి యాపిల్ నిరాకరించింది. నివేదిక ప్రకారం, ఈ చెల్లింపు కోసం యాపిల్ పేలో భాగంగా బ్రాండ్ చేస్తారా లేదా ఇప్పటికే ఉన్న చెల్లింపు నెట్ వర్క్ తో భాగస్వామ్యం వహించాలని కంపెనీ యోచిస్తోందా లేదా ఒంటరిగా ప్రారంభించాలా అనేది అస్పష్టంగా ఉంది. (చదవండి: 69 ఏళ్ల తర్వాత టాటా గూటికి ఎయిర్ ఇండియా..!) -
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు ఊరట..! ఆన్లైన్ లావాదేవీలపై ఆర్బీఐ కీలక నిర్ణయం..!
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు ఊరట కల్పిస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల టోకనైజేషన్ విధానాల అమలును మరో ఆరు నెలలపాటు పొడిగించింది. ఆర్బీఐ ఒక ప్రకటనలో...సీఓఎఫ్(కార్డ్ ఆన్ ఫైల్ డేటా) ను నిల్వ చేసేందుకు మరో ఆరు నెలల పాటు పొడిగించినట్లు పేర్కొంది. దీంతో కొత్త టోకెనైజేషన్ పాలసీ 2022 జూలై 1 నుంచి ప్రారంభంకానుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చాలనే లక్ష్యంతో ఈ కొత్త రూల్స్‌ను ఆర్బీఐ ప్రవేశపెట్టనుంది. వచ్చే ఏడాది జనవరి 1 తో కొత్త రూల్స్ వచ్చే నేపథ్యంలో ఇప్పటికే ఆయా బ్యాంకులు మర్చంట్ వెబ్సైట్ లేదా పలు యాప్‌లో క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను స్టోర్ చేసే విషయంలో ఖాతాదారులను అలర్ట్ చేశాయి. ప్రస్తుతం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులకు ఊరట కల్గనుంది. టోకనైజేషన్ విధానాలతో ఆయా క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలను బహిర్గతం చేయకుండా ఆన్లైన్ కొనుగోళ్లను అనుమతిస్తుంది. సీఐఐ అభ్యర్థన మేరకే..! ఇటీవల టోకనైజేషన్‌ను అమలు చేయడానికి కనీసం ఆరు నెలల సమయాన్ని ట్రేడ్ యూనియన్ వ్యాపారులు కోరారు. దీని అమలు పలు అంతరాయాలను కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ కొత్త నియమాల కారణంగా ఆన్లైన్ మర్చెంట్స్ తమ రాబడిలో 20 నుంచి 40 శాతం మేర నష్టపోయే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) గతంలో పేర్కొంది. ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం...2020-21లో భారత డిజిటల్ చెల్లింపుల పరిశ్రమ విలువ రూ. 14,14,85,173 కోట్లుగా ఉంది. కరోనా మహమ్మారి సమయంలో డిజిటల్ చెల్లింపులు ఆర్థిక వృద్ధిని ప్రేరేపించాయని సీఐఐ పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 98.5 కోట్ల కార్డ్‌లు ఉన్నాయని అంచనా. వీటితో ఒకే రోజు సుమారు 1.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని సీఐఐ తెలిపింది. చదవండి: వ్యాపారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్..! -
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్..!
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్..! అన్ని డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీల విషయంలో వచ్చే ఏడాది నుంచి కొత్త రూల్స్‌ను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకురానుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చాలనే లక్ష్యంతో ఆర్బీఐ కొత్త రూల్స్‌ను తీసుకురానుంది. ఇకపై అన్ని వివరాలను గుర్తుంచుకోవాలి...! క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి జరిపే ఆన్లైన్ లావాదేవీలకు ఆర్బీఐ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆయా వెబ్సైట్లు, పేమెంట్ గేట్‌వేస్‌లలో అంతకుముందే నిక్షిప్తమైన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలు ఇకపై నిక్షిప్తం కావు. ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం.. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు లేదంటే డిజిటల్ చెల్లింపులు నిర్వహించేటప్పుడు ఆయా వెబ్‌సైట్స్, యాప్స్ వంటివి కస్టమర్ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను స్టోర్ చేయకూడదని ఆర్బీఐ పేర్కొంది. ఈ కొత్త రూల్స్ జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో కొత్త ఏడాది నుంచి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కచ్చితంగా 16 అంకెల డెబిట్, క్రెడిట్ కార్డు నంబర్లతో పాటు, సీవీవీ, గడువు తేదీ వంటి వివరాలను గుర్తుంచుకోవాలి. ఒక వేళ ఇది వీలు కాకుంటే...టోకెనైజేషన్ పద్ధతిని వాడాల్సి ఉంటుంది. ఆర్బీఐ 2020 మార్చి నెలలోనే ఈ విషయాన్ని వెల్లడించింది. డేటా సెక్యూరిటీ నిబంధనల ప్రకారం.. వెబ్‌సైట్స్, యాప్స్ కస్టమర్ల కార్డుల వివరాలను స్టోర్ చేయకూడదని ఆదేశించింది. చదవండి: ఎస్బీఐ బంపర్ ఆఫర్..! కార్డు తీసుకుంటే రూ.4,999 విలువైన స్మార్ట్‌వాచ్ ఉచితం..! ఇంకా మరెన్నో ఆఫర్లు అలర్ట్ ఐనా బ్యాంకులు..! వచ్చే ఏడాది నుంచి మారనున్న క్రెడిట్, డెబిట్ కార్డు రూల్స్ మారడంతో ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులను ఇప్పటికే అలర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మర్చంట్ వెబ్సైట్ లేదా యాప్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు వివరాలు స్టోర్ చేయడం కుదరదని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇప్పటికే తమ ఖాతాదారులకు తెలియజేస్తోంది. టోకెనైజేషన్ అంటే..? ఆన్లైన్ లావాదేవీలను జరిపేటప్పుడు ఖాతాదారులు 16 అంకెల క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను గుర్తుంచుకోకపోతే...టోకెనైజేషన్ విధానాన్ని వాడవచ్చును. ఈ విధానంలో ఆయా క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లు వారి కార్డు వివరాలను తెలియజేయాల్సిన పని లేదు. ఒరిజినల్ కార్డు నెంబర్‌కు బదులు ప్రత్యామ్నాయ ఎన్క్రిప్టెడ్ కోడ్‌ను బ్యాంకులు ఇస్తాయి. దీన్ని టోకెన్ అని పిలుస్తారు. లావాదేవీ సమయంలో ఈ కోడ్‌ను అందిస్తే సరిపోతుంది. చదవండి: మార్కెట్క్రాష్.. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న మీమ్స్ -
ఓటీపీ ఇవ్వకపోయినా క్రెడిట్ కార్డుల నుంచి నగదు లూటీ
విజయవాడకు చెందిన మల్లెల శేషగిరిరావు బెంగళూరులో ఉండే తన స్నేహితుడికి పుట్టిన రోజు బహుమతి ఇచ్చేందుకు ఓ వస్తువు కోసం ఆన్లైన్లో వెతికాడు. తన స్నేహితుడి కోరిక మేరకు ఓ వస్తువును కొనుగోలు చేసేందుకు ఓ విక్రయ కంపెనీని మెయిల్ ద్వారా సంప్రదించాడు. తన స్నేహితుడు ఉండే చిరునామాకు సదరు వస్తువును డెలివరీ ఇస్తామని కంపెనీ నుంచి హామీ వచ్చిన తర్వాత శేషగిరిరావు నగదు లావాదేవీలు ప్రారంభించాడు. అయితే రూ. 620 ఖరీదు చేసే వస్తువుకు కంపెనీ రూ. 49,999 బిల్ చేసి శేషగిరిరావును ఓటీపీ అడిగింది. దీంతో అనుమానం వచ్చిన శేషగిరిరావు నగదు లావాదేవీలను వెంటనే ఆపేసి.. వస్తు కొనుగోలును ఉపసంహరించుకున్నాడు. ఈ వ్యవహారం జరిగింది ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన. సీన్ కట్ చేస్తే.. అయితే అదే రోజు శేషగిరిరావు ఉపయోగించే క్రెడిట్ కార్డ్ నుంచి రూ. 49,999 డెబిట్ అయినప్పటికీ మెసేజ్ మాత్రం రాలేదు. కాగా వారం క్రితం క్రెడిట్ కార్డు సంస్థ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ముంబై కేంద్రంగా నడిచే ప్రముఖ ఆన్లైన్ సంస్థ ద్వారా హరియాణా నుంచి రాజస్థాన్‌కు ఓ పార్సిల్ డెలివరీ అయ్యిందని దానికి గానూ రూ.49,999 అయినట్లు ఆ మెసేజ్ ఉంది. తనకు సంబంధం లేని వస్తు డెలివరీకి తన ఖాతా నుంచి నగదు పోవడంతో కంగారు పడిన శేషగిరిరావు వెంటనే బ్యాంక్ సిబ్బందిని, క్రెడిట్ కార్డ్ విభాగం అధికారులను, కస్టమర్ కేర్ సిబ్బందిని సంప్రదించాడు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో విజయవాడ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి బాధితులు ఎంతో మంది.. దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్న ఓ ప్రైవేటు బ్యాంకుకు విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని ఓ బ్రాంచ్ ఉంది. దీనిలో ఖాతాలు కలిగి.. క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్న 35 మంది ఇదే తరహాలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిర్వాహకులే సైబర్ నేరగాళ్లకు తమ కార్డ్ వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చి నగదు కాజేస్తున్నట్లు బాధితులు అనుమానిస్తున్నారు. పట్టించుకోని సైబర్ క్రైం అధికారులు.. విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు బాధితులు క్యూ కడుతున్నా.. కనీసం ఫిర్యాదు సైతం తీసుకోకపోవడంతో బాధితులు ఎవరికీ చెప్పుకోలేక మిన్నకుండిపోతున్నారు. రూ. 2 లక్షల లోపు మోసం జరిగిన ఫిర్యాదులను తీసుకోమని సైబర్ సెల్ అధికారులు తెగేసి చెప్పడంతో లబోదిబోమంటున్నారు. బాధితులు తమ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా కనీసం ఫిర్యాదు తీసుకోవడం లేదనివాపోతున్నారు. బాధితులు వేలల్లో.. కేసులు పదుల్లో.. బాధితులు వేలల్లో ఉంటే గడిచిన ఏడాది కాలంలో విజయవాడ సైబర్ క్రైం పోలీసులు నమోదు చేసిన కేసులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ఇక పరిష్కరించిన సమస్యలు ఏడాది కాలంలో రెండు అంకెలు దాటక పోవడం గమనార్హం. ఇదిలా ఉంటే సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే సదస్సులు కూడా అంతంతమాత్రంగానే నిర్వహిస్తున్నారు. క్లిక్ చేస్తే ఖల్లాస్.. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజూ ఎంతో మంది సైబర్ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ప్రోగ్రామింగ్ యాప్స్ నుంచి ఖాతాదారులకు ‘బ్యాంక్ ఖాతా నిలిచిపోయింది’, ‘గూగుల్ పే, ‘ఫోన్ పే’ ఇకపై వాడలేరంటూ ఫోన్లకు మెసేజ్‌లు పంపి ఖాతాదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏదో అయిపోతుందనే కంగారులో సదరు మెసేజ్ వెబ్ లింక్‌ను క్లిక్ చేసిన వెంటనే ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతా వివరాలు పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. అక్కడ నుంచి క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఖాతాలోని నగదును సునాయాసంగా కాజేస్తున్నారు. అయితే మధ్యలో ఉన్న బ్యాంక్ అధికారులకు ఇబ్బందులు రాకుండా ఏదో ఆన్లైన్ డెలివరీ అని సృష్టించి నగదును దోచుకుంటున్నారు. ఖాతాదారులు బ్యాంకులపై న్యాయ పోరాటానికి దిగేందుకు వీలు లేకుండా సైబర్ నేరగాళ్లు బ్యాంక్‌లకు ఈ విధంగా సాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్లకు, బ్యాంక్ అధికారులకు సంబంధాలున్నాయనే అనుమానం బాధితుల్లో తలెత్తుతోంది. సైబర్ నేరగాళ్లు తెలివి మీరారు.. పోలీసుల కంటే నేరగాళ్లే ఎక్కువ తెలివిగా, చురుగ్గా వ్యవహరిస్తున్నారు. రూ. 2 లక్షల పైబడి మోసపోయిన వారి నుంచి ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం. వాటిలో కొన్ని పరిష్కరించాం. రూ. 2 లక్షల లోపు మోసపోయిన వారి నుంచి ఫిర్యాదు తీసుకోవద్దని ఉన్నతాధికారుల నుంచి మాకు ఆదేశాలున్నాయి. అయినప్పటికీ మా దగ్గరకు వచ్చిన వారి వివరాలు సేకరించి.. మరోసారి మోస పోకుండా పలు సూచనలు చేసి పంపుతున్నాం. తక్కువ మొత్తంతో మోసపోయిన వ్యక్తులు వారి ప్రాంతంలోని పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలి. – కె.శ్రీనివాస్, సీఐ, సైబర్ క్రైం, విజయవాడ -
ఇండిగో, కొటక్ కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్
ముంబై: విమానయాన సంస్థ ఇండిగో, ప్రైవేట్ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ కోసం వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇండిగో, ఇతర వ్యాపార సంస్థలకు ఈ కార్డుతో చెల్లింపులు చేయడం ద్వారా రివార్డ్ పాయింట్స్ అందుకోవచ్చు. వాటిని ఉపయోగించి కాంప్లిమెంటరీ ఎయిర్ టికెట్స్, డిస్కౌంట్స్, చెక్–ఇన్ ప్రాధాన్యత, సీట్ ఎంపిక, కాంప్లిమెంటరీ మీల్ వంటి ప్రయోజనాలు పొందవచ్చని ఇండిగో తెలిపింది. ఇండిగో విమాన టికెట్లను కొనుగోలు చేసేందుకూ ఈ పాయింట్లను వాడొచ్చు. -
పేటీఎం యూజర్లకు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులు !
నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు రెండు పెద్ద ఆర్థిక సంస్థలు సిద్ధమయ్యాయి. దేశంలోనే అతి పెద్ద ప్రైవేటు బ్యాంకు హెచ్డీఎఫ్సీ , పేటీఎంలు సంయుక్తంగా క్రెడిట్‌కార్డులు అందించేందుకు రెడీ అవుతున్నాయి.పండగ సీజన్ సందర్భంగా భారీ ఎత్తున క్రెడిట్ కార్డులు జారీ చేసి ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలనుకుంటున్నట్టు హెచ్డీఎఫ్సీ ప్రకటించింది. ఈ మేరకు పేటీఎం సంస్థతో కలిసి పని చేస్తామని తెలిపింది. చదవండి: Paytm : మొబైల్ బిల్స్ పేమెంట్స్‌పై పేటీఎమ్ బంపర్ ఆఫర్...! యూత్‌పై పట్టుపెంచుకునే దిశలో.. ఆన్‌లైన్స్ ట్రాన్సాక్షన్ సర్వీసెస్ అందించే స్టార్టప్‌గా మార్కెట్లోకి వచ్చిన పేటీఎం అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం పేటీఎంకే 30 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఇందులో 21 కోట్ల మంది వ్యాపారులు, చిరు వ్యాపారులే ఉన్నారు. వీరిలో చాలా మందికి క్రెడిట్ కార్డులు లేవు. హెచ్‌డీఎఫ్‌సీకి దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది క్రెడిట్‌కార్డు వినియోగదారులు ఉన్నారు. ఇందులో 3 కోట్ల మంది వ్యాపారులే ఉన్నారు. అయితే హెచ్డీఎఫ్సీ కస్టమర్ బేస్‌లో మిలీనియల్స్, యువకులు తక్కువగా ఉన్నారు. దీంతో యూత్‌లో పట్టు పెంచుకోవాలనేది హెచ్డీఎఫ్సీ మార్కెటింగ్ వ్యూహంగా ఉంది. దీంతో పేటీఎంతో జట్టు కట్టింది. దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకొని.. పేటీఎం ఖాతాదారుల్లో అర్హులైన వారిని క్రెడిట్ కార్డు పరిధిలోకి తేవాలని హెచ్డీఎఫ్సీ యోచిస్తోంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. నెలకు కొత్తగా 5 లక్షల వంతున క్రెడిట్‌కార్డులను అందివ్వాలని హెచ్డీఎఫ్సీ లక్ష్యంగా పెట్టుకుంది. దసరా, దీపావళి వంటి పండగ సీజన్లో ప్రజలకు ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో క్రెడిట్ కార్డులు జారీ చేయడం ద్వారా మార్కెట్లోకి త్వరగా దూసుకుపోవచ్చన్నది హెచ్డీఎఫ్సీ ప్రణాళికగా ఉంది. పేటీఎం సంస్థ గతంలో సిటీ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది .అయితే ఇటీవల ఇండియాలో రిటైల్ బ్యాంకింగ్ సర్వీస్ నుంచి తప్పుకోవాలని సిటీ బ్యాంకు నిర్ణయించింది. అదే సమయంలో హెచ్డీఎఫ్సీ సంస్థ పేటీఎంతో జత కట్టింది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా క్రెడిట్ కార్డులు అందివ్వనున్నాయి. చదవండి: Paytm: పార్కింగ్‌లోనూ ఫాస్టాగ్, ప్రారంభించిన పేటీఎం -
నెలకు 3 లక్షల కార్డులు క్రెడిట్ కార్డ్స్: హెచ్డీఎఫ్సీ బ్యాంక్
ముంబై: క్రెడిట్ కార్డ్స్ మార్కెట్లో తిరిగి పుంజుకుంటామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. కొత్త క్రెడిట్ కార్డుల జారీకి ఆర్బీఐ నుంచి గత వారం గ్రీన్‌సిగ్నల్ పొందిన నేపథ్యంలో భారీ లక్ష్యాన్ని బ్యాంక్ నిర్ధేశించుకుంది. తొలుత నెలకు 3 లక్షల కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు బ్యాంక్ పేమెంట్స్, కంజ్యూమర్ ఫైనాన్స్ గ్రూప్ డైరెక్టర్ పరాగ్ రావ్ వెల్లడించారు. ‘మూడు నెలల్లో ఈ సంఖ్యను చేరుకుంటాం. ఆ తర్వాత ఆరు నెలలకు ఈ సంఖ్యను 5 లక్షలకు చేరుస్తాం. 9–12 నెలల్లో కార్డుల సంఖ్య పరంగా మా వాటాను తిరిగి చేజిక్కించుకుంటాం’ అని వివరించారు. కార్డుల సంఖ్య పరంగా హెచ్డీఎఫ్సీ వాటా 2 శాతం తగ్గి 25లోపుకు వచ్చింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నూతన క్రెడిట్ కార్డులు జారీ చేయరాదంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను 2020 నవంబరులో ఆర్బీఐ ఆదేశించింది. -
డెబిట్, క్రెడిట్ కార్డు ఉంటే రూ.10 లక్షల ఉచిత ఇన్సూరెన్స్
బ్యాంకులు జారీ చేసే డెబిట్, క్రెడిట్ కార్డులు కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీతో వస్తాయి. దీని గురించి చాలా మంది ఖాతాదారులకు తెలియదు. రూపే కార్డు డెబిట్ కార్డు ఖాతాదారులకు బ్యాంకు బీమా కవరేజీని అందిస్తుందని చెన్నైకి చెందిన ఇండియన్ బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బ్యాంకు జారీ చేసిన అన్ని డెబిట్, క్రెడిట్ కార్డ్ వేరియెంట్లు బీమా కవరేజీ అందిస్తాయని ఆయన తెలిపారు. ఖాతాదారులు ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత సంపూర్ణ వైకల్యం చెందిన బీమా అందిస్తారు. డెబిట్, క్రెడిట్ కార్డులను బట్టి బీమా కవరేజీ ₹50,000 నుంచి ₹10 లక్షల వరకు లభిస్తుంది అని ఇండియన్ బ్యాంక్ అధికారి తెలిపారు. అనుకోకుండా జరిగే ప్రమాదాల వల్ల ఖాతాదారుడు మరణిస్తే లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యం చెందితే బీమా కవరేజీ లభిస్తుందని తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా లేదా స్వయంకృతాపరాధం వల్ల జరిగిన ప్రమాదాలకు కాదు అని ఆయన అన్నారు. బీమా కవరేజీ బ్యాంకుతో వినియోగదారులకు ఉన్న సంబంధంపై ఆధారపడి బీమా కవరేజీ ₹2 లక్షల నుంచి ప్రారంభమై డెబిట్, క్రెడిట్ కార్డులు రెండింటికీ ₹10 లక్షల వరకు లభిస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. కార్డులు వాడుతూ ఉండాలి ఇటువంటి సదుపాయాల గురించి వినియోగదారులకు అవగాహన లేదని, ఖాతాదారులకు తెలియజేయడం బ్యాంకుల విధి అని వినియోగదారుల ఫోరం యాక్టివిస్ట్ శ్రీ సదాగోపన్ అన్నారు. బీమాక్లెయిం చేసుకోవడానికి ఒక షరతు ఉన్న ఏమిటంటే? కార్డు యాక్టివ్ యూజ్ లో ఉండాలి. క్లెయింలను నిర్ధిష్ట కాలవ్యవధిలో మాత్రమే చేయాలి. ఉదాహరణకు, రూపే బీమా కార్యక్రమం కింద ప్రమాదం జరిగిన తేదీ నుంచి 90 రోజుల్లోగా క్లెయిం కోసం సమాచారం అందించాలి. అలాగే క్లెయింకు సంబంధించిన అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్ లను సమాచారం ఇచ్చిన తేదీ నుంచి 60 రోజుల్లోగా సబ్మిట్ చేయాలి. ప్రమాదం జరిగిన తేదీకి 90 రోజుల ముందు కార్డుదారుడు ఏదైనా లావాదేవీ(ఆర్థిక లేదా ఆర్థికేతర లావాదేవీ) చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు అందించే బీమా రకం, బీమా క్లెయిం ప్రక్రియ గురించి బ్యాంకులను ఏడాదికి ఒకసారి ఆడిట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
క్రెడిట్ కార్డుల్లో మళ్లీ విజృంభిస్తాం
ముంబై: కొత్త క్రెడిట్ కార్డుల జారీపై రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించడం వల్ల మార్కెట్ షేరును పెంచుకోవడంపై ప్రతికూల ప్రభావం పడిందని ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ, కన్జూమర్ ఫైనాన్స్ విభాగాల హెడ్ పరాగ్ రావు తెలిపారు. అయితే, తాత్కాలికమైన ఆంక్షలు తొలగిపోయిన తర్వాత మళ్లీ మార్కెట్లో మళ్లీ దూకుడుగా తిరిగొస్తామని, నష్టాన్ని భర్తీ చేసుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పరిస్థితులను సమీక్షించుకునేందుకు, కొత్త ఆవిష్కరణలను రూపొందించేందుకు గత ఆరు నెలల కాలాన్ని తాము ఉపయోగించుకున్నట్లు పరాగ్ వివరించారు. నిషేధం ఎత్తివేసిన 3–4 నెలల్లోనే మళ్లీ తాము మార్కెట్ వాటాను కొల్లగొట్టగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఉత్పత్తులు, ఫీచర్లను ప్రవేశపెట్టడంతో పాటు నిషేధ సమయంలో కుదుర్చుకున్న భాగస్వామ్య ఒప్పందాలను అమల్లోకి తెస్తామని ఆయన వివరించారు. గడిచిన రెండేళ్లుగా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటాన్ని సీరియస్‌గా తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ .. గత డిసెంబర్లో బ్యాంకుపై అసాధారణంగా పెనాల్టీలు విధించిన సంగతి తెలిసిందే. కొత్త క్రెడిట్ కార్డుల జారీ, కొత్త డిజిటల్ ఆవిష్కరణలపైన నిషేధం విధించింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ సూచనల మేరకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు తమ సిస్టమ్‌లను అప్‌గ్రేడ్ చేసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించిన తక్షణ, స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను ఆర్బీఐకి సమర్పించినట్లు పరాగ్ రావు తెలిపారు. ఆర్బీఐ నుంచి సానుకూల నిర్ణయం రాగలదని ఆశిస్తున్నట్లు వివరించారు. -
మీ డెబిట్, క్రెడిట్ కార్డులు జాగ్రత్త.. పోగొట్టుకుంటే మళ్లీ కష్టమే!
మీకు డెబిట్, క్రెడిట్ కార్డులు బ్యాంకుల నుంచి రావాలంటే ఎంత సమయం పడుతుంది... డెబిట్ కార్డు కోసమైతే..రెండు లేదా మూడు రోజులు పట్టొచ్చు. కొన్ని బ్యాంకులయితే వెంటనే అకౌంట్ తీసిన రోజే డెబిట్ కార్డును జారీ చేస్తాయి. క్రెడిట్ కార్డు కోసమైతే.. అన్ని వెరిఫీకేషన్లు పూరైన వెంటనే బ్యాంకులు కార్డును జారీ చేస్తాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు పోతే బ్లాక్ చేసి రెండు, మూడురోజుల్లో బ్యాంకులనుంచి తిరిగి సులువుగా పొందవచ్చుననీ అనుకుంటున్నారా..! భవిష్యత్తులో అలా కుదరదు. తీవ్ర చిప్స్ కొరతతో కార్డుల ఉత్పత్తికి ఆటంకం..! రానున్న రోజుల్లో డెబిట్, క్రెడిట్ కార్డులను బ్యాంకులు వెంటనే జారీ చేయకపోవచ్చును అసలు డెబిట్, క్రెడిట్ కార్డులను ఇవ్వకపోవచ్చును. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్ కొరతతో డెబిట్, క్రెడిట్ కార్డుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడబోతుందని వ్యాపార నిపుణులు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 3 బిలియన్ల డెబిట్, క్రెడిట్ కార్డులను కంపెనీలు తయారుచేస్తున్నాయి. సుమారు 90 శాతం మేర నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి కార్డులను తయారుచేసే కంపెనీలు ప్రస్తుతం తీవ్ర చిప్ కొరతను ఎదుర్కొంటున్నాయి. చెల్లింపు కార్డుల వాణిజ్య సంస్థ , మొబైల్ చెల్లింపుల సంస్థలు చిప్‌ల కొరతను నివారించడానికి, సరఫరా పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ తెచ్చినా తంటాలు...! కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం చిప్ తయారీదారులు కార్యకలాపాలను పూర్తిగా మూసివేయవలసి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన చిప్స్ కొరత ఏర్పడింది. చిప్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల కోసం ఆకస్మాత్తుగా డిమాండ్ పెరిగింది. చిప్స్ కొరత ఏర్పడడంతో సెమీకండక్టర్ పరిశ్రమ దెబ్బతింది. చిప్స్ కొరతతో పలు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం నెలకొన్న ఈఎంవీ చిప్స్ కొరతతో డెబిట్, క్రెడిట్ కార్డుల ఉత్తత్తికిభారం కానుంది. దీంతో భవిష్యత్తులో బ్యాంకుల నుంచి డెబిట్, క్రెడిట్ కార్డుల జారీకి ఆటంకం ఏర్పడునుందని ట్రేడ్ యూనియన్ తెలిపింది. కాగా ప్రస్తుతం చిప్స్ కొరత 2022 సంవత్సరం వరకు కొనసాగనుందని చెల్లింపు కార్డుల వాణిజ్య సంస్థలు , మొబైల్ చెల్లింపుల సంస్థలు పేర్కొన్నాయి. సో ప్రస్తుతం ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా కాపాడుకోండి. ఎక్కడపడితే అక్కడే పొగ్గొట్టుకున్నారో ఇక అంతే సంగతులు. చదవండి: Debit Card EMI: మీకు అర్హత ఉందో లేదో ఇలా తెలుసుకోండి..? -
ఆర్బీఐ షాక్: ఈ కొత్త కార్డుల జారీపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వీటి చెల్లింపు వ్యవస్థ డేటా నిల్వ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ కొత్త దేశీయ క్రెడిట్ కార్డులను వినియోగదారులకు జారీ చేయకుండా నిషేధం విధించింది. మే 1వ తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. అయితే కార్డ్ నెట్‌వర్క్‌లపై ఆంక్షలు ప్రస్తుత వినియోగదారులపై ప్రభావం చూపదని తెలిపింది. దేశంలోని భారతీయ వినియోగదారుల డాటా, ఇతర సమాచారాన్ని భద్రపరచడానికి నిబంధనలను ఉల్లంఘించడంపై రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 (పీఎస్ఎస్ యాక్ట్) సెక్షన్ 17 కింద కార్డు నెట్వర్క్ ఆపరేటింగ్‌కు సంబంధించి అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థలకు అనుమతి ఉంది. చెల్లింపు వ్యవస్థతో అనుసంధానించిన అన్ని సర్వీసు ప్రొవైడర్లు, వారు నిర్వహించే చెల్లింపు వ్యవస్థకు సంబంధించిన డాటా, ఇతర సమాచారాన్ని ఆరు నెలల్లో తమ ముందు ఉంచేలా చూడాలని 2018 ఏప్రిల్‌లోసర్క్యులర్ ద్వారా సూచించింది. దీనిపై అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించడానికి ఆర్బీఐ కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉత్తర్వులు ప్రస్తుత భారతీయ కస్టమర్లను ప్రభావితం చేయదని, కార్డులను యథాతధంగా ఉపయోగించవచ్చునని స్పష్టం చేసింది. -
క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఇది చదవండి
సత్వర నిధులకు అందుబాటులో ఉన్న పలు మార్గాల్లో క్రెడిట్ కార్డ్‌లూ ఒకటి. వినియోగించే విధానం తెలిస్తే క్రెడిట్ కార్డులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బిల్లు తేదీ, చెల్లించేందుకు ఉన్న వడ్డీ రహిత గడువు, ఈఎంఐ ఆప్షన్, వడ్డీ రేట్లు, ఆలస్య రుసుములు.. ఇలా ప్రతీ ఒక్కటీ తెలిస్తే నెలవారీ బడ్జెట్ మీద అదనపు భారం పడకుండా క్రెడిట్ కార్డ్‌ను వినియోగించుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బకాయిలను వినియోగదారులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లిస్తే క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఎలాంటి వడ్డీని వసూలు చేయవు. గడువు తేదీ తర్వాత చెల్లిస్తే మాత్రం అధిక వడ్డీ రేట్లు, అదనపు ఫీజులు వసూలు చేస్తాయి. కనుక కుదిరితే క్రెడిట్ కార్డ్ బిల్లులను సమయానికి చెల్లించటమే ఉత్తమం. పెద్ద మొత్తంలోని బకాయిలను చెల్లించలేని స్థితిలో ఉంటే.. ఈఎంఐ విధానాలను ఎంచుకోవచ్చు. క్రెడిట్ కార్డును మెరుగ్గా నిర్వహించే మార్గాలను చూద్దాం.. ఈఎంఐ ఆప్షన్.. నిర్ణీత గడువు తేదీలోపు చెల్లించని క్రెడిట్ కార్డ్ బకాయిల మీద క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని బట్టి 23 నుంచి 49 శాతం వరకు వడ్డీ కింద కంపెనీలు చార్జ్ చేస్తుంటాయి. దీంతో పాటు తిరిగి చెల్లింపుల్లో విఫలమైతే ఆలస్య రుసుము కింద రూ.1,300 వరకు కంపెనీలు వసూలు చేస్తుంటాయి. అంతేకాదు, ఈ తర్వాత క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై వడ్డీ రహిత కాల వ్యవధిని రద్దు చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. గడువులోగా క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించకపోతే మీ రుణ చరిత్రపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి ఇబ్బందులను నివారించేందుకు.. బిల్లులను సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే, కొంత భాగాన్ని ఈఎంఐగా మార్చుకోవడం ఒక మార్గం. క్రెడిట్ కార్డ్ తిరిగి చెల్లింపుల కాల వ్యవధి (ఈఎంఐ) సాధారణంగా 3 నుంచి 60 నెలల వరకు ఉంటుంది. దీనిపై వార్షిక వడ్డీ రేటు 11–24 శాతంగా ఉంటుంది. అది కూడా క్రెడిట్ కార్డ్ వినియోగం, జారీ చేసిన కంపెనీని బట్టి మారుతుంటుంది. నో కాస్ట్ ఈఎంఐతో లాభమే.. ‘నో కాస్ట్ ఈఎంఐ’.. ‘రూపాయి చెల్లించి నచ్చిన ఉత్పత్తిని ఇంటికి తీసుకెళ్లండి.. ఆ తర్వాత ఎటువంటి వడ్డీ లేకుండా ఈఎంఐ చెల్లించండి’ అనే ప్రకటనలు చూసే ఉంటారు. మర్చంట్ ఈఎంఐ ఆప్షన్లో ఒక రకమే నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్. ఇందులో ఈఎంఐ మీద వడ్డీని వర్తకులు లేదా తయారీదారులు భరిస్తారు. దీంతో ఉత్పత్తి లేదా సేవల ధరను ఈఎంఐల రూపంలో అనుమతించిన కాల వ్యవధి మేరకు కొనుగోలుదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ మీద వడ్డీ భారం పడకపోయినా.. ఆ వడ్డీపై 18% జీఎస్టీని క్రెడిట్ కార్డ్ వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆఫర్లు.. రిటైల్ స్టోర్లు, ఈ–కామర్స్ పోర్టళ్లు క్రెడిట్ కార్డ్‌ల కొనుగోళ్లపై ఈఎంఐలను ఆఫర్ చేస్తాయి. తయారీదారులు/వ్యాపారుల మధ్య ఒప్పందాలకు అనుగుణంగా.. ఈఎంఐ వడ్డీ రేట్లు, కాల వ్యవధులు నిర్ణయించడం జరుగుతుంది. ఆఫర్లలో భాగంగా ఆయా సంస్థలు ప్రకటించే ఈఎంఐ వడ్డీ రేట్లు.. క్రెడిట్ కార్డ్ బకాయిలను ఈఎంఐగా మార్చుకునే వడ్డీ రేట్లతో పోలిస్తే తక్కువగానే ఉండ డం ఆకర్షణీయం. అందుకే భారీ కొనుగోళ్లకు ముందుగా.. రిటైల్ స్టోర్లు, ఈ–కామర్స్ కంపెనీల ఈఎంఐ ఆఫర్లను తనిఖీ చేయాలి. పైగా ఈ ఆఫర్లకు ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు. క్రెడిట్ కార్డులపై రుణాలు.. మంచి సిబిల్ స్కోర్, చెల్లింపుల చరిత్ర ఉన్న వారు క్రెడిట్ కార్డులపై రుణాలనూ తీసుకోవచ్చు. కాకపోతే తీసుకున్న రుణం మేరకు క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు. తిరిగి చెల్లించిన తర్వాత మళ్లీ ఆ పరిమితిని అందుబాటులోకి తెస్తారు. రుణాల రీపేమెంట్ కాల వ్యవధి 6 నుంచి 60 నెలలుగా ఉంటుంది. వడ్డీ రేట్లు వినియోగదారుల క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటాయి. కాకపోతే క్రెడిట్ కార్డులపై రుణాల జారీ వేగంగా ఉంటుంది. వీటి వడ్డీ రేట్లు పర్సనల్ లోన్స్ కంటే ఎక్కువ ఉండవని పైసాబజార్.కామ్ డైరెక్టర్ సాహిల్ అరోరా తెలిపారు. -
10 కోట్ల కార్డుల వివరాలు లీక్!
న్యూఢిల్లీ: డిజిటల్ వేదికలపై కస్టమర్ల కీలక సమాచారం ఎద్ద ఎత్తున చోరీకి గురైంది. ఏకంగా 10 కోట్ల క్రెడిట్, డెబిట్ కార్డుల కీలక వివరాలను ‘జస్ పే’ వేదిక నుంచి తస్కరించిన సైబర్ నేరగాళ్లు వాటిని డార్క్‌వెబ్‌లో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు!. ఈ విషయాన్ని సెక్యూరిటీ అంశాల పరిశోధకుడు రాజశేఖర్ రాజహారియా వెలుగులోకి తీసుకొచ్చారు. డార్క్‌వెబ్‌లో ఈ సమాచారం అమ్మకానికి పెట్టడాన్ని ఆయన కనిపెట్టనట్లు వెల్లడించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న జస్పే.. ప్రముఖ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మేక్ మై ట్రిప్, ఎయిర్టెల్, ఉబెర్, స్విగ్గీ తదితర కంపెనీలకు లావాదేవీలను ప్రాసెస్ చేసే సేవలను అందిస్తోంది. దీంతో 10 కోట్ల కార్డు వివరాలు బహిర్గతం కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. 2017 మార్చి నుంచి 2020 ఆగస్ట్ మధ్య ఈ వివరాలు చోరీకి గురి కాగా, ఇటీవలే ఒకే విడత ఈ మొత్తాన్ని విక్రయించినట్టు భావిస్తున్నారు. అన్ని వివరాలూ.. కార్డు కంపెనీ (వీసా/మాస్టర్‌కార్డ్, ఏఎమ్ఎక్స్), కార్డు ఎక్స్పైరీ, కార్డుపై ఉండే మొదటి ఆరు, చివరి నాలుగు అంకెలు, కార్డు రకం (క్రెడిట్ లేదా డెబిట్), కార్డుపై పేరు, దాన్ని మంజూరు చేసిన బ్యాంకు, కార్డ్ ఫింగర్‌ప్రింట్, కార్డు ఐఎస్ఐఎన్.. ఇలా కార్డుల్లోని 16 ఫీల్డ్స్ వివరాలు, లావాదేవీల సమాచారం లీక్ అయినట్టు భావిస్తున్నారు. అలాగే, ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు, పేర్లు కూడా తరలిపోయాయి. ఈ వివరాలు లావాదేవీల సమయంలో ఈ కామర్స్ సంస్థల నుంచి జస్పేకు వెళుతుంటాయి. వీటి ఆధారంగా జస్పే లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. మోసాలకు ఆస్కారం.. ఇలా చోరీ చేసిన సున్నిత సమాచారం ఆధారంగా సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు సందేహిస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా యూజర్లకు కాల్ చేసి బ్యాంకు నుంచో లేక జస్పే లేక అమెజాన్ నుంచి చేస్తున్నట్టు నమ్మించి కావాల్సిన ఇతర సమాచారం కూడా తీసుకోవడం ద్వారా లావాదేవీలను చేసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. కార్డుకు సంబంధించి తమ వద్దనున్న వివరాలు చెప్పడం ద్వారా నమ్మించే ప్రయత్నం చేయవచ్చంటున్నారు. కార్డు వివరాలు లీక్ కాలేదు: జస్పే ‘‘2020 ఆగస్ట్ 18న మా సర్వర్లపై అనధికార దాడికి ప్రయత్నం జరగ్గా.. గుర్తించి అడ్డుకున్నాము. అయితే కార్డు నంబర్లు లేదా ఆర్థిక వివరాలు లేదా లావాదేవీల వివరాలు ఉల్లంఘనకు గురి కాలేదు’’ అంటూ జస్పే గతంలోనే ఓ ప్రకటన రూపంలో స్పష్టం చేసింది. భద్రత ఎలా..? కార్డుపై మూడు నంబర్ల సీవీవీ అన్నది ఎంతో సున్నితమైనది. లావాదేవీ ప్రాసెస్‌కు ముందు దీన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ వేదికల్లో టూఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను కూడా ఉంటోంది. అంటే కార్డుదారు మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసిన తర్వాతే అది ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ హ్యాకర్ తనకు లభించిన సమాచారంతో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను మార్చేస్తే అప్పుడు జరగాల్సిన నష్టాన్ని అడ్డుకోలేము. కనుక ప్రతీ ఆన్లైన్ లావాదేవీ కోసం ప్రత్యేకంగా వర్చువల్ కార్డును ఉపయోగించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్
న్యూఢిల్లీ/ముంబై: గడిచిన రెండేళ్లుగా ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ సేవల్లో పదే పదే అంతరాయాలు కలుగుతుండటంపై రిజర్వ్ బ్యాంక్ తీవ్రంగా స్పందించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా, కొత్త డిజిటల్ కార్యకలాపాలేమీ ప్రకటించకుండా తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ గురువారం అసాధారణ ఆదేశాలు ఇచ్చింది. సాంకేతిక సమస్యలను పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంపై బ్యాంకు బోర్డు దృష్టి పెట్టాలని సూచించింది. ‘డిజిటల్ 2.0 (ఇంకా ఆవిష్కరించాల్సి ఉంది) కింద కొత్త డిజిటల్ వ్యాపార లావాదేవీలు, ఇతరత్రా ఐటీ యాప్‌ల ద్వారా ప్రతిపాదిత లావాదేవీలు, కొత్త క్రెడిట్ కార్డుల జారీ వంటివన్నీ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ సూచించింది‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంక్ తెలియజేసింది. బ్యాంక్ నూతన సీఈవోగా ఇటీవలే (అక్టోబర్ చివర్లో) పగ్గాలు చేపట్టిన శశిధర్ జగదీశన్‌కు ఈ పరిస్థితిని చక్కదిద్దడం తొలి సవాలు కానుంది. దేశీయంగా క్రెడిట్ కార్డుల జారీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అతి పెద్ద సంస్థ. ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం 1.49 కోట్ల మంది క్రెడిట్ కార్డు యూజర్లు, 3.38 కోట్ల డెబిట్ కార్డు యూజర్లు ఉన్నారు. ప్రస్తుత యూజర్లకు యథాప్రకారం సర్వీసులు కొనసాగుతాయని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ ఆదేశాలు ఎప్పటివరకూ అమల్లో ఉంటాయన్న వివరాలు వెల్లడి కాలేదు. సాధారణంగా బ్యాంకుల సేవా లోపాలకు సంబంధించి జరిమానాల వంటి వాటితో సరిపెట్టే ఆర్బీఐ ఇలాంటి చర్యలు తీసుకోవడం అసాధారణమని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అసౌకర్యానికి చింతిస్తున్నాం.. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు బ్యాంక్ కొత్త సీఈవో శశిధర్ జగదీశన్ పేర్కొన్నారు. ఇప్పటికే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్స్‌ను మెరుగుపర్చుకునేందుకు బయట నిపుణుల సహా యం కూడా తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో వివరించారు. మరోసారి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో కొత్తగా మరిన్ని మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెట్టడంలో జాప్యం జరగవచ్చని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల నుంచీ .. 2018 డిసెంబర్లో బ్యాంక్ కొత్తగా ఆవిష్కరించిన మొబైల్ యాప్ కొద్ది గంటల్లోనే క్రాష్ అయ్యింది. భారీ ట్రాఫిక్‌ను సర్వర్లు హ్యాండిల్ చేయలేకపోవడం ఇందుకు కారణం. ఏడాది తర్వాత సరిగ్గా జీతాల సమయంలో ఆన్లైన్ సేవలన్నింటిలోనూ అంతరాయం కలిగింది. దీంతో ఈ సమస్యలపై దృష్టి సారిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇక తాజాగా నవంబర్ 21న మరోసారి ఇలాంటి సమస్యలే తలెత్తాయి. తమ ప్రాథమిక డేటా సెంటర్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలే ఇందుకు కారణమంటూ సంస్థ వివరణ ఇచ్చినప్పటికీ.. బ్యాంక్‌పై కస్టమర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ తాజా చర్యలు ప్రకటించింది. కొన్నాళ్లుగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆన్లైన్ మాధ్యమం వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో పాటు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ సహా పలు బ్యాంకులు ఇలాంటి సాంకేతిక సమస్యలే ఎదుర్కొంటున్నాయి. దీనితో ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గురువారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 2 శాతం క్షీణించి రూ. 1,377 వద్ద క్లోజయ్యింది. కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ సుమారు రూ. 16,056 కోట్లు కరిగిపోయి రూ. 7,58,287 కోట్లకు తగ్గింది. బీఎస్ఈలో 7.36 లక్షలు, ఎన్ఎస్ఈలో 1.89 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఎస్బీఐ యోనో యాప్ డౌన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆన్లైన్ సర్వీసుల్లో కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తరహాలోనే సమస్యలు తలెత్తుతున్నాయి. సిస్టమ్ వైఫల్యం కారణంగా తమ యోనో మొబైల్ యాప్ సర్వీసుల్లో అంతరాయం కలిగినట్లు ఎస్బీఐ గురువారం వెల్లడించింది. సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈలోగా లావాదేవీల కోసం నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ యాప్‌ను వినియోగించాలని కస్టమర్లను కోరింది. అటు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) డిజిటల్ సేవల్లో కూడా అంతరాయం ఏర్పడింది. ఇటీవల విలీనం చేసుకున్న బ్యాంకుల ఐటీ ఇన్ఫ్రాను అనుసంధానం చేసే క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని బ్యాంకు వర్గాలు తెలిపాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్
ముంబై, సాక్షి: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు తాజాగా రిజర్వ్ బ్యాంక్ షాకిచ్చింది. ఆన్లైన్ సర్వీసులలో అంతరాయాల నేపథ్యంలో డిజిటల్, క్రెడిట్ కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేయమంటూ ఆదేశించింది. గత రెండేళ్లలో మూడుసార్లు ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో సమస్యకు తొలుత పరిష్కారాన్ని వెదకమంటూ ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. డిజిటల్-2లో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రవేశపెట్టనున్న అన్ని డిజిటల్ సంబంధ కార్యక్రమాలనూ తాత్కాలికంగా నిలిపివేయవలసిందిగా ఆర్బీఐ ఆంక్షలు విధించింది. వీటిలో భాగంగా కొత్తగా క్రెడిట్ కార్డుల జారీని సైతం నిలిపివేయవలసి ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. సర్వీసులకు ఇబ్బంది లేదు నిబంధనలకు అనుగుణంగా లోపాలను సవరించిన వెంటనే ఆర్బీఐ విధించిన తాజా ఆంక్షలను ఎత్తి వేయనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలు బ్యాంకు రోజువారీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావమూ చూపవని తెలియజేసింది. ప్రస్తుత కస్టమర్లకు అన్ని సేవలూ యథావిధిగా అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ప్రైమరీ డేటా సెంటర్లో విద్యుత్ ప్రసారంలో వైఫల్యాలు సర్వీసులలో అంతరాయాలకు కారణమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గత నెల 21న.. ఇటీవల గత నెల 21న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్, ఆన్లైన్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడటంతో ఆర్బీఐ వివరాలు దాఖలు చేయమంటూ ఆదేశించింది. గతేడాది డిసెంబర్లో తలెత్తిన అంతరాయం కారణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లు తొలిసారి రెండు రోజులపాటు మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలను పొందలేకపోయారు. గత రెండేళ్లుగా ఐటీ వ్యవస్థల పటిష్టానికి పలు చర్యలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలియజేసింది. కాగా..ప్రస్తుత క్రెడిట్ కార్డుల వినియోగదారుల సేవలు, డిజిటల్ బ్యాంకింగ్ తదితర సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని హెచ్డీఎఫ్సీ బ్యాంకు వివరించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 15,292 ఏటీఎంలున్నాయి. 14.9 మిలియన్ క్రెడిట్ కార్డులు, 33.8 మిలియన్ డెబిట్ కార్డులను కస్టమర్లకు బ్యాంక్ జారీ చేసింది. -
డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆంక్షలు
సాక్షి, ముంబై: బ్యాంకు కార్డు మోసాలకు చెక్ పెడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త గైడ్ లైన్స్ అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డులకు మరింత రక్షణ కల్పించేలా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని ఆర్బీఐ వెల్లడించింది. తక్షణమే అన్ని బ్యాంకులు, కార్డులను జారీ చేసే కంపెనీలు డెబిట్, క్రెడిట్ కార్డుల అనవసరంగా అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపు సేవలను తీసివేయాలని, కార్డు వినియోగదారుడు అభీష్టం మేరకు ఆ సౌకర్యాన్ని కల్పించాలని ఆర్బీఐ కొత్త మార్గ దర్శకాలను జారీ చేసింది.. క్రెడిట్ కార్డులను ఇంటర్నేషనల్, ఆన్ లైన్ లావాదేవీలకు, కాంటాక్ట్ లెస్ కార్డ్ లావాదేవీలకు వాడాలంటే, ముందస్తు అనుమతి తప్పనిసరి. వాడకంపై ముందుగానే పరిమితులను పెట్టుకోవచ్చు. ఈ పరిమితి దాటి కార్డు ద్వారా లావాదేవీకి ప్రయత్నిస్తే, వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్ ఫోన్ కు సమాచారం అందుతుంది. కస్టమర్లు తమ కార్డులను ఏటీఎం, ఎన్ఎఫ్సీ, పీఓఎస్, ఈ-కామర్స్ లావాదేవీలకు వాడకుండా తాత్కాలికంగానూ నిషేధించుకోవచ్చు. బ్యాంకులు జారీచేసే క్రెడిట్, డెబిట్ కార్డులుఏటీఎంలలోనూ, పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) వద్ద మాత్రమే పనిచేస్తాయి. కస్టమర్లకు వారి నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కు ఖాతాను జత చేస్తారు. ఈ నిబంధన ప్రీ పెయిడ్, గిఫ్ట్ కార్డులకు మాత్రం వర్తించదు. ఎలా అంటే మొబైల్ లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా మీ బ్యాంక్ ఖాతాకు లాగిన్ అవ్వాలి. కార్డులు విభాగంలోకి వెళ్లి ' మేనేజ్ కార్డ్స్ ' ఎంచుకోవాలి. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఇక్కడ మనకు కావాల్సిన దాన్ని ఎంచుకుని డిసేబుల్ చేయాలి. మళ్లీ కావాలనుకున్నపుడు దానికనుగుణంగా ఆన్ - ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ట్రాన్సాక్షన్ పరిమితిని కూడా సెట్ చేసుకోవచ్చు. -
క్రెడిట్ కార్డ్ క్లోనింగ్‌తో సైబర్ క్రైమ్!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డ్ క్లోనింగ్‌లో అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు... ఏటీఎం మెషిన్ల వద్దే అత్యాధునిక పరికరాలు బిగిస్తూ విలువైన డేటా తస్కరిస్తున్నారు... దీని ఆధారంగా బోగస్ కార్డులు తయారు చేసి వినియోగదారుల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు... ఈ తరహా సైబర్ క్రైమ్ మరోసారి నగరంలో వెలుగులోకి వచ్చింది. వీరి బారినపడిన ఇద్దరు బాధితులు శనివారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఖైరతాబాద్‌లోని ఏటీఎం కేంద్రంగా ఈ వ్యవహారం సాగిందని, పుప్పాలగూడలోని ఏటీఎం నుంచి నగదు డ్రా చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇది ‘మామూలు’ కాదు.. ఏటీఎమ్ సెంటర్లో డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లే వ్యక్తి మెషిన్లో నిర్దేశించిన స్లాట్‌లో కార్డు పెడతారు. క్రెడిట్/డెబిట్ కార్డుల్లోని వివరాలను తస్కరించడానికి చేతిలో ఇమిడిపోయే స్కిమ్మర్లను వినియోగిస్తారన్నది తెలిసిన విషయమే. ఇప్పుడు అవే స్కిమ్మర్లు ఫాల్స్ స్లాట్ రూపంలో ‘అందుబాటులోకి’ వచ్చాయి. వాటిని సైబర్ నేరగాళ్లు అసలు స్లాట్‌పై ఇలా అమరుస్తున్నారు. ఈ ఫాల్స్ స్లాట్స్‌లో ఉండే అత్యాధునిక పరికరాలు వినియోగదారుడు కార్డు ఇందులో నుంచి పెట్టిన వెంటనే దాని డేటాను రీడ్ చేస్తాయి. అంటే మన ప్రయేమం, పొరపాటు లేకుండానే రహస్య సమాచారంగా పరిగణించే డెబిట్/క్రెడిట్ కార్డు ఎలక్ట్రానిక్ సమాచారం ఫాల్స్ స్లాట్ రీడ్ చేస్తుంది. ఈ ఫాల్స్ స్లాట్ ఏటీఎం మిషన్ రంగు, డిజైన్లోనే ఉండటంతో పరిశీలించి చూస్తే తప్ప గుర్తించడం సాధ్యం కాదు. కెమెరాతో పిన్ నంబర్.. కేవలం కార్డుకు సంబంధించిన సమాచారం ఒక్కటే సైబర్ నేరగాడికి ఉపయోగపడదు. దీనిని వినియోగించాలంటే అతనికి పిన్ నంబర్ కూడా తెలియాలి. దీని కోసం దుండగుడు ఏటీఎమ్ మెషిన్ స్క్రీన్‌పై భాగంలో సీసీ కెమెరాను పోలిన చిన్న కెమెరాను ఏర్పాటు చేశాడు. ఇది వినియోగదారుడు టైప్ చేసే పిన్ నంబర్‌ను రికార్డు చేస్తుంది. సాధారణంగా ఎటీఎమ్ సెంటర్లలో బ్యాంకు వారు ఏర్పాటు చేసే కెమెరాలు ఇలా ఉండవు. ఎక్కువగా ఎలాంటి సెక్యూరిటీ గార్డులు లేని అన్మ్యాన్డ్ ఏటీఎం సెంటర్లనే ఈ సైబర్ ముష్కరులు ఎంపిక చేసుకుంటున్నారు. ఫాల్స్ స్లాట్, కెమెరాలకు వైఫై ఫెసిలిటీ ఉంటే... ఆ ఏటీఎమ్ సెంటర్‌కు సమీపంలో ఉండి ల్యాప్‌టాప్ ద్వారా వాటిలో రీడ్/రికార్డు అయిన వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ఆ పరికరాలకు వైఫై సౌకర్యం లేని పక్షంలో సైబర్ నేరగాడు ఎటీఎం సెంటర్ సమీపంలోనే కాపు కాసి ఉంటాడు. కొంత మంది కస్టమర్లు వచ్చి వెళ్లిన తరవాత అదను చూసుకుని మళ్లీ ఏటీఎం సెంటర్లోకి వెళ్లి ఫాల్స్ స్లాట్, కెమెరాలను తీసుకుని వెళ్లి కంప్యూటర్ సిస్టమ్‌కు అనుసంధానించడం ద్వారా వివరాలు అందులోకి పంపిస్తారు. రైటర్స్‌తో డూప్లికేట్స్ తయారీ.. ముంబై సహా అనేక మార్కెట్లతో చిప్‌తో కూడిన ఖాళీ కార్డులు బల్క్‌గా విక్రయిస్తుంటారు. ఇంటర్నెట్లోనూ ఇవి విరివిగా లభిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేసే నేరగాళ్లు కార్డ్ రైటర్‌ను కంప్యూటర్‌కు అనుసంధానించి, ఖాళీ కార్డులను రైటర్లో పెట్టి సిస్టంలో ఉన్న డేటాను దీనిలో రైట్ చేస్తారు. ఈ రకంగా ఇతరులకు ఎలాంటి అనుమానం రాకుండా మన కార్డును పోలిన కార్డు... మన పిన్ నంబర్ ముష్కరుల చేతికి వెళ్లిపోతాయి. సైబర్ నేరగాళ్లు వాటి ద్వారా మన ఖాతాలకు ఖాళీ చేసేస్తారు. ముష్కరులు ఒక్క రోజులోనే రూ.లక్షల్లో స్వాహా చేసే అవకాశం ఉంది. డబ్బు డ్రా అయిన తరవాత బాధితుడికి ఎస్సెమ్మెస్ అలెర్ట్ వచ్చినా... కాళ్లరిగేలా బ్యాంకు అధికారుల చుట్టూ తిరగడం తప్ప ఫలితం ఉండదు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఏటీఎం కేంద్రంలోకి వెళ్ళినప్పుడు కార్డు స్లాట్పైన ఫాల్స్ స్లాట్స్ ఏమైనా ఉన్నాయా? అనేది గమనించాలి. పరీక్షగా చూస్తే వీటిని గుర్తించడం చాలా తేలిక. మరోపక్క ఏటీఎం మెషిన్‌కు ఉండే సీసీ కెమెరా దాని లోపల ఇమిడి ఉంటుంది. ఇది కాకుండా బయట మిషన్‌కు సంబంధం లేకుండా మరోటి ఉండే అవకాశం ఉంది. వీటికి తోడు మరో కెమెరా మీ కంట పడిందంటే అనుమానించాలి. ఇటీవల కాలంలో పైన నేరగాళ్ల కెమెరా ఏర్పాటు చేసినా కస్టమర్ పిన్ ఎంటర్ చేస్తుంటే అది రికార్డు కాకుండా కీ ప్యాడ్‌పైన డిజైన్డ్ కవర్స్ ఏటీఎం మిషన్లుకు ఉంటున్నాయి. ఇలాంటివి లేకపోతే చేయి పైన అడ్డుపెట్టి పిన్ ఎంటర్ చేయాలి. వీలున్నంత వరకు ఇల్లు, వర్క్‌ప్లేస్‌లకు సమీపంలోని ఏదో ఒక ఏటీఎం నుంచే డబ్బు డ్రా చేయాలి. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డు ఉన్న వాటినే ఎంచుకోవాలి. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ -
రైతులకు క్రెడిట్, డెబిట్ కార్డులు
సాక్షి, అమరావతి: రైతులకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు అందించడం వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘ఈ–పంట’తో అనుసంధానిస్తూ రైతుల క్రెడిట్ కార్డు ఉండాలని, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వారికి డెబిట్ కార్డు ద్వారా అందించాలని సూచించారు. ఈ ఖరీఫ్ నాటికి రాష్ట్రంలో రైతులకు 56 లక్షల క్రెడిట్ కార్డులు, 56 లక్షల డెబిట్ కార్డులను సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న కియోస్క్‌లను ముఖ్యమంత్రి పరిశీలించారు. కియోస్క్ రైతులకు విజ్ఞాన కేంద్రంలా పని చేస్తుందని అధికారులు తెలిపారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. రైతులకు మరింత మేలు ► క్రెడిట్, డెబిట్ కార్డు వల్ల రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. రైతులెవరికీ తమ డబ్బు చేతికి రాదనే భయం ఉండకూడదు. సంబంధిత బ్యాంక్‌కు వెళ్లి కార్డు చూపగానే డబ్బులు రైతుల చేతికిచ్చేలా ఉండాలని సీఎం పేర్కొన్నారు. ► ఈ క్రాప్‌కు లింక్ చేస్తూ క్రెడిట్ కార్డు ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు డెబిట్ కార్డు ద్వారా రైతులకు అందాలి. కొత్తగా క్రెడిట్ కార్డులు ఇవ్వడంతోపాటు కొత్త అకౌంట్లు ఓపెన్ చేయాలి. ఆర్బీకేలు సిద్ధం.. ప్రత్యేక యాప్ ► రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,158 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు కానుండగా ఇప్పటికే 10,592 భవనాలను గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు. జూన్ 1 కల్లా అన్నీ సిద్ధ్దమవుతాయన్నారు. వీటిపై రైతుల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు చెప్పారు. సేకరణ, మార్కెట్ ఇంటెలిజెన్స్, గ్రేడింగ్, ప్యాకింగ్ కూడా ఆర్బీకేకు లింక్ చేసేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం పేర్కొన్నారు. గ్రామస్థాయిలో గ్రేడింగ్, ప్యాకింగ్ జరిగితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ► ఆర్బీకే యాండ్రాయిడ్ యాప్ వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. యాప్‌లో సర్వీసెస్ (కాల్‌సెంటర్) కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రైతు భరోసా కేంద్రాల వద్ద పొలం బడి, పశు విజ్ఞాన బడి పేరుతో చేపట్టే కార్యక్రమాల గురించి కూడా అధికారులు వివరించారు. ఆక్వాకూ కాల్ సెంటర్ ► ఆక్వా రైతులకు నాణ్యమైన ఫీడ్, సీడ్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆక్వా రైతులకు కూడా కాల్‌సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి చోటా ఆక్వా టెస్టింగ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. కిట్లు సిద్ధం కావాలి.. ► విత్తనాల నాణ్యత, భూసార పరీక్ష కిట్లను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విత్తనాలు మంచి నాణ్యతతో ఉండాలని, కాలపరిమితి ముగిసినవి ఎట్టి పరిస్ధితుల్లోనూ విక్రయించకుండా చూడాలని స్పష్టం చేశారు. నాణ్యమైనవి, సర్టిఫై చేసిన విత్తనాలు మాత్రమే రైతులకు సరఫరా చేయాలన్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ రైతు నష్టపోకూడదని చెప్పారు నాణ్యత పరీక్ష విధానంపై అధికారుల నుంచి సీఎం వివరాలు సేకరించారు. తయారీదారుల వద్ద కూడా క్వాలిటీ టెస్టింగ్ జరగాలని సీఎం ఆదేశించారు. విమర్శలకు తావులేకుండా పారదర్శకంగా విత్తనాల కంపెనీల నుంచి కొనుగోళ్లు జరగాలన్నారు. ప్రకృతి సేద్యంపై దృష్టి సారించి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. మెరుగ్గా మార్కెట్ యార్డులు ► మార్కెట్ యార్డులను మరింత మెరుగ్గా వినియోగించుకోవడంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. జనతా బజార్లను మార్కెట్ యార్డ్‌లతో అనుసంధానించేలా చూడాలన్నారు. ► సమావేశంలో వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
క్రెడిట్ కార్డు బకాయిలు కూడా కట్టక్కర్లేదా?
సాక్షి, ముంబై : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 1.7లక్షల కోట్ల రూపాయల రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన మరుసటి రోజే (శుక్రవారం) కేంద్రం బ్యాంకు ఆర్బీఐ కీలక నిర్ణయాలను ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లపై ముందస్తు కోతను విధించడంతోపాటు లాక్డౌన్ కష్టాల నుంచి బయటపడేందుకు రుణాలపై భారీ ఊరటనిచ్చింది. అన్ని రకాల రుణాలపై మూడు నెలల పాటు మారటోరియం విధించింది. దీని ప్రకారం గృహ, ఇతర రుణాలను తీసుకున్న వినియోగదారులకు ఈఎంఐ చెల్లింపుల నుంచి మూడు నెలల మినహాయింపునిచ్చింది. అంతేకాదు సదరు ఖాతాలను ఎన్పీఏలుగా పరిగణించరాదని కూడా ఆయా బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలకు ఆదేశాలిచ్చింది. సాధారణంగా రుణగ్రహీతలు 90 రోజులకు పైగా చెల్లింపులను చేయకపోతే బ్యాంక్ ఆ ఖాతాను ఎన్పీఏగా పరిగణిస్తాయి. (రుణ గ్రహీతలకు భారీ ఊరట) అయితే తాజా ఆర్బీఐ నిర్ణయం వెలువడిన తరువాత పలువురు వినియోగదారుల్లో క్రెడిట్ కార్డు రుణాల పరిస్థితిపై అనేక సందేహాలు వెల్లువెత్తాయి. దీనిపై ఆర్బీఐ వివరణ ఇచ్చింది. క్రెడిట్ కార్డు రుణాలు, లేదా బకాయిలకు కూడా మూడు నెలల మారటోరియం వర్తిస్తుందని స్పష్టం చేసింది. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు లాంటివి మాత్రమే టర్మ్ లోన్స్ పరిధిలోకి వస్తాయని చెప్పింది. (వచ్చే 3నెలలు ఈఎంఐలు కట్టకపోయినా ఫర్వాలేదు) మరోవైపు ఆర్బీఐ తాజా నిర్ణయంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. ఆర్బీఐ కల్పించిన వెసులుబాట్లపై అటు మార్కెట్ వర్గాలు, ఇటు విశ్లేషకులు కూడా సంతోషాన్ని ప్రకటించారు. Appreciate @RBI @DasShaktikanta’s reassuring words on financial stability. The 3 month moratorium on payments of term loan instalments (EMI) & interest on working capital give much-desired relief. Slashed interest rate needs quick transmission. #IndiaFightsCoronavirus — Nirmala Sitharaman (@nsitharaman) March 27, 2020 -
మీ కార్డును స్విచాఫ్ చేయండి
రమణమూర్తి మంథా శ్రీధర్‌కు రెండు డెబిట్ కార్డులు... మూడు క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఇవన్నీ వీసా, మాస్టర్, మ్యాస్ట్రో కార్డులే కావటంతో ప్రపంచవ్యాప్తంగా చెల్లుబాటవుతాయి. కాకపోతే గతనెల్లో వచ్చిన ఓ క్రెడిట్ కార్డు, ఓ డెబిట్ కార్డు బిల్లులో... తాను వాడకపోయినా ఏకంగా రూ.45,000 వాడేసినట్లుంది. ఎక్కడ వాడానని చూస్తే... అంతర్జాతీయ ఈ–కామర్స్ సైట్లలో వాడినట్లు ఉంది. తనకస్సలు ఆ వెబ్సైట్ల పేర్లే తెలియవంటూ బ్యాంకుకెళ్లాడు. బ్యాంకు అధికారులు పరిశీలించారు. కార్డుల డేటా సేకరించి... ఓటీపీ అవసరం లేని సైట్ల ద్వారా ఆ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చెయ్యమన్నారు. చేసేదేమీ లేక శ్రీధర్ పోలీసుల్ని ఆశ్రయించాడు. ఇది శ్రీధర్ ఒక్కడికే పరిమితమైన గొడవ కాదు. చాలామంది ఇప్పుడు ఇలాంటి ఫిర్యాదులతోనే పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే చాలా విదేశీ ఈ–కామర్స్ వెబ్సైట్లు తమ ద్వారా లావాదేవీలు జరిపినపుడు ఒన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) అడగటం లేదు. ఓటీపీ అక్కర్లేకుండానే కార్డు నంబరు, పేరు, ఎక్స్పైరీ తేదీ, సీవీవీ వంటి వివరాలిస్తే లావాదేవీ పూర్తయిపోతోంది. దీంతో లావాదేవీ పూర్తయ్యాకే ఫోన్లకు మెసేజీ వస్తోంది. కొన్ని బ్యాంకుల నుంచైతే ఆ మెసేజీ కూడా రావటం లేదు. దీంతో డబ్బులు పోగొట్టుకోవటం కస్టమర్ల వంతవుతోంది. మరి దీన్ని అడ్డుకోవటం ఎలా..? ఆ చర్యల వివరాలే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు కూడా వినియోగదారుల డేటా రక్షణకు అత్యాధునిక చర్యలు తీసుకుంటున్నాయి. అందులో ఒకటి... మన లావాదేవీల్ని మనమే నిలిపేసుకోవటం. మన కార్డును మనమే నియంత్రించుకోవటం. మనకు కావాల్సినపుడు మన కార్డును స్విచాన్ చేసుకోవటం... అక్కర్లేనపుడు ఆఫ్ చేసుకోవటం. ఇలా గనక చేస్తే... మన కార్డుపై మనకు తెలియకుండా లావాదేవీలు జరపటం ఎవ్వరి తరమూ కాదు. అదెలాగో చూద్దాం... ఇప్పుడు ప్రతి బ్యాంకుకూ ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ (యాప్) ఉంది. ఆ అప్లికేషన్ ద్వారా ఖాతా వివరాలు తెలుసుకోవటం, నగదు బదిలీ చేసుకోవటం, చెక్బుక్కు అభ్యర్థన పంపటం, ఈ–డిపాజిట్లు తెరవటం, బిల్లులు చెల్లించటం... ఇలా చాలా పనులు చేసుకోవచ్చు. దీంతోపాటే.. మన ఆన్లైన్ లావాదేవీల్ని, కార్డు ద్వారా జరిపే లావాదేవీలను నియంత్రించుకోవచ్చు కూడా. - దీనికోసం ‘మేనేజ్ యువర్ కార్డ్’ విభాగంలోకి వెళ్లాలి. దాదాపు అన్ని బ్యాంకుల యాప్‌లలోనూ ఈ సౌలభ్యం ఉంటుంది. కాకపోతే దీని శీర్షిక ఒక్కో యాప్‌లో ఒకోలా ఉండొచ్చు. - ఆ విభాగంలోకి వెళ్లినపుడు అక్కడ మీరు వాడుతున్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ అదే బ్యాంకు నుంచి ఒకటికన్నా ఎక్కువ కార్డులు వాడుతున్నట్లయితే ఆ కార్డులన్నీ కనిపిస్తాయి. వాటిలో మనకు కావాల్సిన కార్డును సెలక్ట్ చేసుకోవాలి. - ఆ కార్డును సెలక్ట్ చేసుకున్న తరవాత దానికి సంబంధించిన ఆప్షన్లు వస్తాయి. ఆ ఆప్షన్లలో... మొత్తం లావాదేవీలన్నిటినీ నిలిపేయటం... విదేశీ లావాదేవీల్ని మాత్రమే నిలిపేయటం... స్వదేశీ లావాదేవీల్ని మాత్రమే నిలిపేయటం వంటివి ఉంటాయి. వాటిలో మనం దేన్నయినా సెలక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు విదేశీ లావాదేవీల్ని మాత్రమే నిలిపేశామనుకోండి. విదేశాల నుంచి ఎవ్వరు మీ కార్డు నంబరుతో లావాదేవీలు చేసినా అది తిరస్కరణకు గురవుతుంది. దాంతో విదేశీ లావాదేవీల నుంచి మీ కార్డును కాపాడుకున్నట్లేనన్న మాట. - విదేశీ లేదా స్వదేశీ ఆన్లైన్ లావాదేవీలకు, విదేశీ లేదా స్వదేశీ పీఓఎస్ మెషీన్ల ద్వారా (స్వైపింగ్) జరిగే లావాదేవీలకు పరిమితులను కూడా మీరే నిర్దేశించుకోవచ్చు. ఉదాహరణకు విదేశీ, స్వదేశీ లావాదేవీలు రెండింటికీ ఆన్లైన్ ద్వారా రూ.5,000 పరిమితిని పెట్టుకున్నారనుకోండి... అంతకన్నా ఒక్క రూపాయి ఎక్కువున్నా ఆ లావాదేవీని బ్యాంకు అనుమతించదు. మీ అంతట మీరు లావాదేవీ జరిపినా అంతే. అలాగే పీఓఎస్‌ల ద్వారా కూడా. మీరు గనక ఒక పరిమితిని నిర్దేశిస్తే... దాన్ని మించిన మొత్తానికి లావాదేవీ జరిగితే అది తిరస్కరణకు గురవుతుంది. ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు... ఆన్లైన్ లావాదేవీలకు, పీఓఎస్ లావాదేవీలకు యాప్ ద్వారా నిర్దేశించుకునే పరిమితులను గానీ... అనుమతించటం, స్విచాఫ్ చేయటం వంటివిగానీ యాప్‌లో ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. అదే సెకన్లో... అంటే రియల్‌టైమ్‌లో అది అప్డేట్ అవుతుంది కూడా. అంటే... మీరు ఆన్లైన్ లావా దేవీల్ని పూర్తిగా నిలిపేసుకున్నారనుకోండి. ఆన్లైన్లో పేమెంట్ చేసే ముందు మీ యాప్‌లోకి వెళ్లి నియంత్రణను తొలగించుకోవచ్చు. పేమెంట్ పూర్తయిన వెంటనే మళ్లీ నిలిపేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీ కార్డులు, మీ ఖాతాలు పూర్తిగా మీ అధీనంలో ఉంటాయి. నకిలీ లావాదేవీలకు ఎలాంటి ఆస్కారం ఉండదు. కార్డును ఇలా కూడా కాపాడుకోవచ్చు... చాలామంది పెట్రోలు బంకుల్లో, రెస్టారెంట్లలో పలు సందర్భాల్లో తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల్ని అక్కడి సిబ్బంది చేతికి ఇస్తుంటారు. ఆ సిబ్బంది వాటిని క్లోన్ చేయొచ్చు. లేకుంటే వివరాలు రాసుకున్నా... మొబైల్ ఫోన్‌తో రెండువైపులా ఫొటోలు తీసుకున్నా సరిపోతుంది. మన వివరాలన్నీ తన చేతికి చిక్కేసినట్లే. అందుకే పీఓఎస్ యంత్రాన్ని మన దగ్గరకే తీసుకురమ్మని చెప్పి... కార్డు మన కళ్లెదురుగానే ఇన్సర్ట్ చేయించి... మనమే పిన్ నంబరు నొక్కితే సరిపోతుంది. అంటే మన కళ్ల నుంచి ఎలాంటి చర్యా తప్పించుకోకుండా చూసుకోవాలన్న మాట. -
అమ్మకానికి 13 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా..
న్యూఢిల్లీ : భారత బ్యాంక్ కస్టమర్లకు చెందిన 13 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన కీలక డేటా డార్క్ వెబ్‌లో బహిరంగ అమ్మకానికి సిద్ధంగా ఉంది. వీటి అమ్మకంతో సైబర్ క్రిమినల్స్ 130 మిలియన్ డాలర్లు సొమ్ము చేసుకునేందుకు లక్షలాది బ్యాంకు కస్టమర్ల కీలక డేటాను అమ్మకానికి పెట్టారు. జడ్డీనెట్ అందించిన వివరాల ప్రకారం దేశీ కస్టమర్లకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు జోకర్స్ స్టాష్‌లో అందుబాటులో ఉన్నాయి. డార్క్ వెబ్‌లోని పురాతన కార్డ్ షాపులలో ఒకటైన జోకర్స్స్టాష్ ప్రధాన హ్యాకర్లు కార్డ్ డంప్‌లను విక్రయించే ప్రదేశంగా ప్రసిద్ది చెందింది. అనైతిక కార్యకలాపాలు సాగించేందుకు ఐపీ అడ్రస్ పసిగట్టకుండా వెబ్ మాఫియా డార్క్ వెబ్‌ను అడ్డాగా చేసుకుని చెలరేగుతోందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డార్క్ వెబ్‌లో జోకర్స్ స్టాష్ ఇండియా మిక్స్ న్యూ-01 అనే శీర్షికతో ప్రకటన ఇస్తోందని సైబర్ సెక్యూరిటీ సంస్థ గ్రూప్-ఐబీఏకు చెందిన పరిశోధకులు గుర్తించారు. భారత్‌కు చెందిన పలు బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులను ఒక్కోటి రూ 100 డాలర్లకు అమ్మకానికి పెట్టారు. ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద కార్డ్ డంప్‌గా సెక్యూరిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) సిస్టమ్స్ వద్ద ఏర్పాటు చేసిన స్కిమ్మింగ్ పరికరాలతో కార్డు వివరాలను హ్యాకర్లు రాబడుతున్నట్టు డేటా అనాలిసిస్ ద్వారా గుర్తించామని ఆ నివేదికలో పరిశోధకులు తెలిపారు. జోకర్స్ స్టాష్ నుంచి కార్డు వివరాలను కొనుగోలు చేసిన నేరగాళ్లు వాటి ఆ వివరాలతో క్లోనింగ్ ద్వారా సరైన కార్డులు రూపొందించి ఏటీఎంల నుంచి దర్జాగా నగదు విత్‌డ్రా చేస్తారు. ఫిబ్రవరిలో జోకర్స్ స్టాష్‌లో 25 లక్షల మంది అమెరికన్ల కార్డు వివరాలు అమ్మకానికి పెట్టారు. గత ఐదేళ్లుగా టార్గెట్, వాల్‌మార్ట్, లార్డ్ అండ్ టేలర్, బ్రిటిష్ ఎయిర్వేస్ వంటి కంపెనీల నుంచి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతూ దొంగిలించిన క్రెడిట్ కార్డుల డేటాను విక్రయిస్తూ ప్రముఖ అండర్‌గ్రౌండ్ క్రెడిట్ కార్డు షాప్‌గా పేరొందింది. దీనివద్ద 53 లక్షల క్రెడిట్ కార్డుల వివరాలు ఉన్నట్టు సైబర్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. -
ఎస్బీఐ బంపర్ ఆఫర్లు
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కూడా ఆఫర్ల యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చింది. దీపావళి సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు పండగ ఆఫర్ ప్రకటించింది. తనక్రెడిట్ కార్డు వినియోగదారులు ఈ పండుగ సీజన్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఎస్బీఐ వివిధ రకాల పెద్ద బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీపావళి బంపర్ ఆఫర్ 30 అక్టోబర్ 2019 వరకు చెల్లుతుంది. ముఖ్యంగా ఎస్బీఐ ఇండియా కా దీపావళి ఆఫర్ కింద రూ.లక్ష విలువైన మేక్ మై ట్రిప్ యాప్ హాలిడే వోచర్‌ను గెలుచుకోవచ్చు. కార్డుపై ఎక్కువ మొత్తం ఖర్చుపెట్టిన టాప్ వినియోగదారులకు ఈ అద్భుత అవకాశం దక్కనుంది. అలాగే మరికొంతమందికి షావోమి స్మార్ట్ఫోన్లను ఉచితంగా అందిస్తుంది. ఇంకా ఇతర స్మార్ట్ డివైజ్‌లను కూడా సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు మెగా ప్రైజ్, వీక్లి ప్రైజ్, డైలీ ప్రైజ్, అవర్లీ ప్రైజ్‌లు కూడా ఉన్నాయి. ఎస్బీఐ అందిస్తున్న ఆఫర్లు అవర్లీ ప్రైజ్ కింద రూ.1000 విలువ చేసే ప్యూమా గిఫ్ట్ వోచర్ డైలీ ప్రైజ్ కేటగిరీలో రూ.7000 వైర్లెస్ హెడ్ ఫోన్స్ వీక్లీ కేటగిరీలో రూ. 17,499ల ఎంఐ ఏ3 ఫోన్ కాగా ఎస్బీఐ ఇటీవల ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. Make this festive season more exciting! Avail great deals across your favourite brands with your SBI Credit Card. Become the Top spender and stand a chance to win exciting gifts! Valid till 30th October 2019. Know more: https://t.co/lzAFch4kK6 #IndiaKaDiwaliOffer #makelifesimple pic.twitter.com/4Ugv7hnGSV — SBI Card (@SBICard_Connect) October 2, 2019 -
3.8 లక్షల క్రెడిట్‌కార్డులు హ్యాక్
లండన్: బ్రిటీష్ ఎయిర్వేస్ ప్రయాణికుల క్రెడిట్ కార్డు వివరాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 వరకు సంస్థ మొబైల్ యాప్ ద్వారా, ఎయిర్వేస్ వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసిన 3.8లక్షల ప్రయాణికుల క్రెడిట్ కార్డు వివరాలు చోరీఅయ్యాయని బ్రిటీష్ ఎయిర్వేస్ తెలిపింది. ఈ వివరాలు దుర్వినియోగంకాకుండా ఆపేందుకు యత్నిస్తున్నామని బ్రిటీష్ ఎయిర్వేస్ సీఈవో అలెక్స్ క్రూజ్ చెప్పారు. పోలీసుల విచారణ కొనసాగుతోందన్నారు. ‘ప్రయాణికుడి పేరు, చిరునామా, ఈ–మెయిల్ అడ్రస్, క్రెడిట్ కార్డు సమాచారాన్ని (కార్డు నెంబరు, ఎక్సై్పరీ డేట్, సీవీసీ కోడ్) హ్యాకర్లు సంపాదించారు. ప్రయాణికుల పాస్‌పోర్టు వివరాలు హ్యాక్ కాలేదు’ అని క్రూజ్ చెప్పారు. ఆగస్టు 21 – సెప్టెంబర్ 5 మధ్య టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు కార్డులను బ్లాక్ చేసుకోవాలని ఆయన కోరారు. బ్రిటీష్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీకి సమాచారం అందించామని చెప్పారు. కాగా, పలువురు ప్రయాణికులు తమ క్రెడిట్ కార్డును ఎవరో వాడుకున్నట్లు ఫోన్‌కు సందేశాలు వచ్చాయని బ్రిటన్ ప్రెస్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. పెద్ద కంపెనీల్లో భద్రత డొల్లే! డిజిటల్ సర్వీసులను కల్పించే ప్రయత్నంలో కనీస భద్రత కల్పించకపోవడంపై బ్రిటీష్ ఎయిర్వేస్పై ప్రయాణికులు సహా ఐటీ నిపుణులు మండిపడుతున్నారు. బ్రిటీష్ ఎయిర్వేస్లో ఐటీ సంబంధిత సమస్య తలెత్తడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది మేలో కంప్యూటర్ వ్యవస్థలో లోపాల కారణంగా 700కు పైగా విమానాలు హఠాత్తుగా రద్దవడం.. 75వేల మంది ప్రయాణికులు వివిధ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. అమెరికాలోని డెల్టా ఎయిర్‌లైన్స్ కూడా మాల్వేర్ కారణంగా తమ ప్రయాణికుల చెల్లింపుల వివరాలు బహిర్గతమయ్యేందుకు ఆస్కారముందని ఈ ఏడాది ఏప్రిల్‌లో వెల్లడించింది. -
పెట్రోల్, డీజిల్ ధరలు : వాటితో మనీ సేవ్
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్కై రాకెట్లా దూసుకుపోతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరగడమే కానీ తగ్గడం కనిపించడం లేదు. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు 50 పైసలు మేర పైకి ఎగిశాయి. మొత్తంగా గత నెల నుంచి పెట్రోల్‌పై లీటరుకు మూడు రూపాయలు, డీజిల్‌పై లీటరుకు నాలుగు రూపాయలు ధర పెరిగింది. ఇలా వాతపెడుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో మీ జేబులు ఖాళీ అవుతుంటే, వెంటనే బ్యాంక్‌లు క్రెడిట్ కార్డులను వాడడంటూ ఆఫర్ చేస్తున్నాయి. మీ క్రెడిట్ కార్డుల వాడకం ద్వారా ఇంధన ఖర్చులను తగ్గించుకోవచ్చని చెబుతున్నాయి. అన్ని ప్రైవేట్, ప్రభుత్వం రంగ బ్యాంక్‌లు క్రెడిట్ కార్డులపై ఇంధన సర్‌ఛార్జ్‌ను మాఫీ చేస్తున్నాయి. అంతేకాక రివార్డు పాయింట్లను రిడీమ్ చేసుకుని, ఇంధనం కొనుగోలు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నాయి. కొటక్ మహింద్రా: కొటక్ రాయల్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు... రూ.500 నుంచి రూ.3000 మధ్యలో లావాదేవీలకు కొటక్ రాయల్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డుదారులకు ఫ్యూయల్ సర్ఛార్జ్ మాఫీ లభిస్తుంది. గరిష్ట మాఫీని ఏడాదిలో రూ.3500 పొందేలా పరిమితం చేసింది ఈ బ్యాంక్. సిటీ బ్యాంక్ : సిటీ బ్యాంక్ రివార్డ్స్ క్రెడిట్ కార్డు... మీ క్రెడిట్ కార్డు ద్వారా రూ.125 విలువైన ప్రతి కొనుగోలుపై ఒక రివార్డు పాయింట్‌ను పొందవచ్చు. అప్పీరల్ లేదా డిపార్ట్మెంట్ స్టోర్లలో చేసే కొనుగోళ్లపై పది రెట్ల రివార్డు పాయింట్లను పొందవచ్చు. ఈ రివార్డు పాయింట్లను దేశవ్యాప్తంగా ఉన్న 800కు పైగా ఇండియన్ ఆయిల్ అవుట్లెట్లలో ఇంధన బిల్లులు చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు. ఒక్క రివార్డు పాయింట్ విలువ 0.25 పైసలు. ఇండియన్ ఆయిల్ సిటీ ప్లాటినం కార్డు... దేశవ్యాప్తంగా ఉన్న అధికారిక ఇండియన్ ఆయిల్ అవుట్లెట్లలో 150 రూపాయల విలువైన ఇంధన కొనుగోళ్లపై 4 టర్బో పాయింట్లను పొందవచ్చు. ఈ టర్బో పాయింట్లను ఉచిత ఇంధనం పొందడానికి ఉపయోగించుకోవచ్చు. ఒక్క టర్బో పాయింట్ ఉచిత ఇంధన విలువ రూపాయి. షాపింగ్, డైనింగ్ వంటి వాటిపై టర్బో పాయింట్లను పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ : హెచ్డీఎఫ్సీ మనీబ్యాక్ క్రెడిట్ కార్డు... ఇంధన కొనుగోళ్లుపై ప్రతి నెలా గరిష్టంగా 250 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : బీపీసీఎల్ ఎస్బీఐ కార్డు... మీరు జాయినింగ్ ఫీజు చెల్లించిన తర్వాత, రూ.500 విలువైన రివార్డు పాయింట్లు క్రెడిట్ అవుతాయి. వీటిని భారత్ పెట్రోలియయం అవుట్లెట్లలో ఇంధన బిల్లు చెల్లింపులకు వాడుకోవచ్చు. అంతేకాక బీపీ అవుట్లెట్ వద్ద ప్రతి ఫ్యూయల్ కొనుగోళ్లపై 4.25 శాతం వాల్యు బ్యాక్ ఆఫర్లను ఎస్బీఐ ఇస్తోంది. 4000 రూపాయల వరకు ఉన్న ప్రతి లావాదేవీపై, 1 శాతం సర్ఛార్జ్ మాఫీతో పాటు 3.25 శాతం వాల్యు బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డు అండ్ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డు.... రూ.500 నుంచి రూ.3000 మధ్యలో ఉన్న లావాదేవీలపై 1 శాతం సర్ఛార్జ్ మాఫీ వినియోగదారులకు లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై గరిష్టంగా నెలకు 100 రూపాయల వరకు మాఫీనీ పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా... తన అన్ని క్రెడిట్ కార్డులపై జీరో ఫ్యూయల్ సర్‌ఛార్జ్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తుంది. -
కాల్‌సెంటర్ ‘కాల్’కేయులు!
సాక్షి, హైదరాబాద్: ‘అచ్చం బ్యాంక్ నుంచి ఫోన్‌కాల్ వచ్చినట్లుగానే ఉంటుంది. అవతలి నుంచి మాట్లాడిన టెలికాలర్ క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చేస్తామంటూ చెప్పి.. ఖాతాదారుల నుంచి కార్డు వివరాలు, సీవీవీ తీసుకుంటారు. ఇలా వివరాలు చెబుతుండగానే జేశ్రీ డిస్ట్రిబ్యూటర్స్ బ్యాంక్ ఖాతాకు రూ. 8,500లు షాపింగ్ పేరిట బదిలీ అయ్యాయని ఎస్ఎంఎస్లు వస్తాయి. ఇలా 2 వేల మంది నుంచి రూ.5 కోట్లు కాజేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ మోసాలు సాగుతుండటంతో రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 30 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.80 లక్షల నగదుతో పాటు 2 ల్యాప్‌టాప్‌లు, 15 సెల్ఫోన్లు, ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఖాతాదారుల డేటా, కారు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 8 మందిని కీలక నిందితులుగా నిర్ధారించారు. కేసు వివరాలను సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ బుధవారం మీడియాకు వివరించారు. జీన్స్ వ్యాపారం నుంచి మోసాలవైపు... న్యూఢిల్లీకి చెందిన విజయ్‌కుమార్ శర్మ వీవోపీ పేరుతో జీన్స్ తయారీ వ్యాపారం నిర్వహిస్తూ తరచూ హైదరాబాద్ వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే గతేడాది జూలైలో సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేటలో జేశ్రీ డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న సందీప్ బజాజ్‌తో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. తను ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయానంటూ విజయ్‌కు సందీప్ వివరించాడు. తాను ఎస్బీఐ క్రెడిట్ కార్డుల పేరుతో మోసపూరిత వ్యాపారం చేసి లక్షలు సంపాదించానని విజయ్ చెప్పడంతో సందీప్ కూడా ఆ వ్యాపారం చేయడానికి ఒప్పుకున్నాడు. ఒక్కరిని మోసగిస్తే రూ.800లు ఇన్సెంటివ్... సందీప్ పేరు మీద డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జేశ్రీ.కామ్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జీన్స్లైక్.కామ్‌లను విజయ్ రిజిస్టర్ చేశాడు. అలాగే లావాదేవీల కోసం సందీప్ 3 ఖాతాలను ఈ వెబ్సైట్లతో అనుసంధానం చేశాడు. అప్పటికే బ్యాంక్ ఖాతాదారులను మోసం చేసిన కేసులో గతేడాది ఢిల్లీ పోలీసులకు చిక్కిన విజయ్ కొత్త వ్యాపారం గురించి ఢిల్లీలోనే కాల్సెంటర్లలో పనిచేసిన అభిజిత్ శ్రీవాత్సవ్, అతని భార్య సీతాకుమారి, సోదరుడు అశుతోష్ శ్రీవాత్సవ్‌కు వివరించాడు. ఈ ముగ్గురు వేర్వేరుగా ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి కాల్సెంటర్లను 21 మందితో నిర్వహిస్తూ ఎస్బీఐ క్రెడిట్ కార్డు పాత డేటాబేస్ నుంచి ఖాతాదారుల వివరాలు తెలుసుకొని కాల్ చేయడం మొదలుపెట్టారు. కార్డు నంబర్, ఎక్స్పైరీ డేట్, సీవీవీ, ఓటీపీ నంబర్లు తెలుసుకొని మోసపూరిత లావాదేవీలను జేశ్రీ.కామ్ ఖాతాకు మళ్లించేవారు. ఇలా ఒక్కరి వద్ద నుంచి వివరాలు సేకరించిన టెలికాలర్‌కు రూ.800ల చొప్పున ఇన్సెంటివ్ ఇచ్చేవారు. సందీప్ బ్యాంక్ ఖాతాకు వచ్చిన డబ్బుల్లో తను 15 శాతం ఉంచుకొని మిగిలిన మొత్తాన్ని విజయ్, శ్రీవాత్సవ్ కుటుంబ సభ్యుల ఖాతాలకు బదిలీ చేసేవాడు. ఇలా దాదాపు రూ.5 కోట్ల మేర మోసం చేశారు. అసిస్టెంట్ మేనేజర్ ఫిర్యాదుతో రంగంలోకి... నగదు మాయంపై వందలాది కస్టమర్ల నుంచి ఫోన్‌కాల్స్ వస్తుండటంతో ఎస్బీఐ కార్డు అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ మృదుల కొడూరి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు జూన్ 25న ఫిర్యాదు చేశారు. క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా ఆదేశం మేరకు ఏసీపీ వై.శ్రీనివాస్‌కుమార్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి టెక్నికల్ డేటా సహకారంతో సందీప్‌ను కొంపల్లిలో అరెస్టు చేసింది. ఇతడిచ్చిన వివరాలతో ఢిల్లీలో విజయ్, అభిజిత్, సీత, అశుతోష్, ధరమ్‌రాజ్, రెహన్ ఖాన్, విపిన్‌కుమార్‌ను అరెస్టు చేశారు. వీరితో పాటు 22 మంది టెలికాలర్లను కూడా పట్టుకున్నారు. వీరందరినీ ఢిల్లీలోని టీస్ హజారిలో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ కేసులో కీలక నిందితులైన ఏడుగురిని ట్రాన్సిట్ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు కోర్టు అనుమతినిచ్చింది. మిగిలిన 22 టెలికాలర్లను ఈ నెల 23న సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చిన ఏడుగురితో పాటు నగరానికి చెందిన సందీప్‌ను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానంలో పిటిషన్ వేస్తామని సజ్జనార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొమ్మును మీడియాకు చూపిస్తున్న సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ -
సేవ్ చేసిన పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డు వివరాలు చోరి
న్యూఢిల్లీ : ఇంటర్నెట్లో మరో కొత్త మాల్వేర్ విజృంభించింది. ఫైర్‌బాక్స్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్లలో నిక్షిప్తం చేసుకున్న ఫైనాన్సియల్ డేటాను అది చోరి చేసేస్తోంది. అదే వేగా స్టీలర్. వేగా స్టీలర్ అనే కొత్త మాల్వేర్ యూజర్లు సేవ్ చేసుకున్న అత్యంత కీలకమైన పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డుల సమాచారాన్ని ఫైర్‌బాక్స్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ల నుంచి దొంగలిస్తుందని ప్రూఫ్‌పాయింట్ రీసెర్చర్లు పేర్కొన్నారు. చిన్న చిన్నగా చేస్తున్న ఈ దాడులు, భవిష్యత్తులో వ్యాపారాలకు పెనుముప్పుగా పరిణమించనుందని రీసెర్చర్లు పేర్కొన్నారు. వేగా స్టీలర్ అనేది ఆగస్ట్ స్టీలర్కు వేరియంట్ అని, ఇది అత్యంత కీలకమైన, రహస్యకరమైన డాక్యుమెంట్లను, క్రిప్టోకరెన్సీని, ఇతర ముఖ్యమైన సమచారాన్ని చోరి చేస్తుందని పేర్కొన్నారు. సేవ్ చేసుకున్న కీలకమైన సమాచారాన్ని దొంగలించడంపైనే ఈ మాల్వేర్ ఎక్కువగా ఫోకస్ చేసిందని, గూగుల్ క్రోమ్, ఫైర్బాక్స్ల నుంచి పేమెంట్ సమాచారాన్ని చోరి చేస్తుందని రీసెర్చర్లు తెలిపారు. కీలకమైన సమాచారంలో పాస్వర్డ్లు, ప్రొఫైల్స్, సేవ్ చేసుకున్న క్రెడిట్ కార్డు వివరాలు, కుకీస్ ఉన్నాయి. కేవలం సమాచారాన్ని దొంగలించడమే కాకుండా.. ప్రభావితమైన డివైజ్‌లను స్క్రీన్షాట్లను తీస్తుందని, .doc, .docx, .txt, .rtf, .xls, .xlsx, or .pdf తో ముగిసే ఫైళ్లను స్కాన్ చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ మాల్వేర్, వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్, రిటైల్, తయారీ, మానవ సంబంధాల విభాగాలపై ఎక్కువగా టార్గెట్ చేసిందని పేర్కొన్నారు. -
పేటీఎంలో మార్పు:యూజర్లు ఆగ్రహం
డిజిటల్ వాలెట్‌గా ఎక్కువగా ప్రాముఖ్యం సంపాదించిన పేటీఎం, చడీచప్పుడు లేకుండా తన ప్లాట్‌ఫామ్‌పై అతిపెద్ద మార్పు చేపట్టింది. క్రెడిట్ కార్డుల ద్వారా వాలెట్‌కు రీఛార్జ్ చేసుకునే మనీని గిఫ్ట్ ఓచర్లుగా మార్చేస్తోంది. అంటే పేటీఎం వాలెట్‌లోకి ఎవరైనా క్రెడిట్ కార్డు ద్వారా నగదును యాడ్ చేస్తే, ఈ నగదు వెంటనే గిఫ్ట్ ఓచర్లుగా మారిపోతాయి. వాటిని కేవలం పేటీఎం మాల్లో ఉత్పత్తులను కొనుగోలు చేయడం లేదా రీఛార్జ్‌లు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. ఈ నగదును బ్యాంకుకు లింక్ చేయడం కానీ, స్నేహితులకు ట్రాన్సఫర్ చేయడం కానీ ఇక నుంచి కుదరదు. దీంతో పేటీఎం యూజర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పరిమిత కాల వ్యవధిలో కంపెనీ దీన్ని లాంచ్ చేసిందని, ఈ కొత్త రూల్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభించిందని అవుట్‌లుక్ రిపోర్టు చేసింది. పరిమిత కాల ట్రయల్స్ అయినా.. కనీసం సమాచారం లేకుండా పేటీఎం ఇలా చేయడం దారుణమంటున్నారు. ట్విట్టర్ వేదికగా కంపెనీపై మండిపడుతున్నారు. క్రెడిట్ కార్డు వాడుతూ.. పేటీఎం వాలెట్లో ఎందుకు నగదు యాడ్ చేయాలి? పేటీఎం గిఫ్ట్ ఓచర్లు బలవంతంగా ఎందుకు కొనుగోలు చేపిస్తున్నారు? అసలేం జరుగుతోంది? ఈ పరిమితులు ఎందుకు? అంటూ యూజర్లు ప్రశ్నిస్తున్నారు. కస్టమర్లను దోచుకోవడంలో ఇది మరో రకమైన పేటీఎం మోసమని అంటున్నారు. పాలసీలో మార్పులపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై కొంతమంది యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. సమాచారం లేకుండా పాలసీలో మార్పులు తీసుకురావడం అన్యాయమని అంటున్నారు. ఈ ట్వీట్లపై స్పందించిన పేటీఎం ''హాయ్, క్రెడిట్ కార్డు ద్వారా ఈ లావాదేవీ జరిపితే, అది పేటీఎం గిఫ్ట్ వాల్యుమ్‌లోకి యాడ్ అవుతుంది. ఈ నగదుతో పేటీఎం యాప్‌పై రీఛార్జ్ చేసుకోవచ్చు. పేటీఎం అంగీకరించే అవుట్లెట్లు, మెర్చంట్ల చెల్లింపులు వాడుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా పేటీఎం వాలెట్‌లోనే నగదును యాడ్ చేయాలనుకుంటే, ఆ నగదును డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా యాడ్‌చేసుకోవచ్చు'' అని తెలిపింది. అయితే పేటీఎం తన పాలసీని తాత్కాలికంగా మార్పు చేయడానికి ప్రధాన కారణం తన ప్లాట్‌ఫామ్‌పై క్రెడిట్ కార్డుల దుర్వినియోగమేనని తెలుస్తోంది. 0 శాతం ఫీజులతో పేటీఎం బ్యాంకు సేవలను అందిస్తోంది. చాలా మంది తమ క్రెడిట్ కార్డులను వాడుతూనే వాలెట్ రీఛార్జ్ చేస్తున్నారు. ఈ రీఛార్జ్‌తో నగదును బ్యాంకు అకౌంట్లోకి ట్రాన్సఫర్ చేయడం, విత్‌డ్రా చేయడం చేస్తున్నారు. అయితే ఒకవేళ క్రెడిట్ కార్డు ద్వారా డైరెక్ట్‌గా నగదును విత్‌డ్రా చేస్తే, బ్యాంకును బట్టి ట్రాన్సాక్షన్ ఫీజు 2-3 శాతం వసూలు చేస్తున్నారు. ఇలా ఎలాంటి ఫీజులు లేకపోవడంతో, పేటీఎంలో క్రెడిట్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నట్టు తెలుస్తోంది. -
ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు క్లోనింగ్ ముఠా గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: చెన్నై కేంద్రంగా జరుగుతున్న క్రెడిట్ కార్డ్ మోసానికి పోలీసులు చెక్‌పెట్టారు. ఇంటర్నేషనల్ క్రెడిట్‌కార్డ్‌ల ద్వారా అక్రమ లావాదేవీలు చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఇటీవల క్రెడిట్ కార్డ్ మోసాలు ఎక్కువగా నమోదు కావడంతో రంగంలోకి దిగిన రాచకొండ్ స్పెషల్ ఆపరేషన్స్ టీం, సైబర్ క్రైమ్ పోలీసులు ఒక జాయింట్ ఆపరేషన్‌లో ఈ ముఠాను అదుపులోకి తీసుకుంది. క్లోనింగ్ చేసిన కార్డు ద్వారా ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. వినియోగదారుల ఫిర్యాదుతో నిఘా పెట్టిన పోలీసు అధికారులు చెన్నైకి చెందిన ఐదుగురి సభ్యుల ముఠాను అరెస్ట్ చేసింది. వీరిలో చెన్నైకు చెందిన అయ్యప్పన్ (30), ఒంగోలుకు చెందిన రాఘవేంద్ర (32) కొత్తపేట నుంచి పల్లెచెర్ల కృష్ణ (25), విశాఖపట్నానికి చెందిన చల్లా భాస్కర్‌రావు (43) వనస్థలిపురం నుంచి సిద్దుల భాస్కర్ ఉన్నారు. వీళ్లంతా జాయింట్‌గా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని, ఇందులో కమిషన్ ఏజెంట్‌గా పనిచేసిన , ఐటీ ఇంజనీర్ అయ్యప్పన్ కీలకమని పోలీసులు చెప్పారు.గత మూడు నెలలనుంచి దాదాపు రూ.30లక్షలను దోచుకున్నారని రాచకొండ కమిషనర్ మహేష్ ఎం భగవత్ వెల్లడించారు. వీరు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ద్వారా ఒకరినొకరు కలుసుకుని కార్డులను క్లోన్ చేయం ప్రారంభించారన్నారు. ఇలా క్లోనింగ్ చేసిన కార్డు ద్వారా ఆయా ఖాతాల్లోని డబ్బును తమ ఖాతాలోకి మళ్లించుకుంటారు. నిందితుల దగ్గరనుంచి భారీ మొత్తంలో పీఓఎస్ మెషిన్లను, ల్యాప్ టాప్‌ను మెగ్నటిక్ కార్డును, నగదును స్వాధీనం చేసుకున్నామని కమిషన్ తెలిపారు. అలాగే ఈ లావాదేవీకోసం ఎలాంటి ఓటీపీ , పిన్ నెంబర్ అవసరం ఉండదని పేర్కొన్నారు. -
డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం పైపైకి!
నోయిడా: రాబోయే మూడు నాలుగేళ్లలో దేశంలో డెబిట్, క్రెడిట్ కార్డులు, ఏటీఎంల వినియోగం బాగా పెరుగుతుందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. ఆర్థిక లావాదేవీల నిర్వహణకు భవిష్యత్తులో మొబైల్ ఫోన్ల వాడకంపై ఆధారపడతారన్నారు. దేశంలో దాదాపు 72 శాతం ప్రజలు 32 ఏళ్లలోపు వారేనని, 2040 వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. 100 కోట్ల బయోమెట్రిక్ కార్డులు, పెద్ద సంఖ్యలో మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు ఉన్న దేశం మనదేనని చెప్పారు. 7.5 శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత్ ముందుకు పోతుందని, ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం సమయంలో మన వృద్ధి రేటు ఒయాసిస్సును తలపిస్తుందని అభిప్రాయపడ్డారు. -
జస్ట్ రూ.500కే క్రెడిట్ కార్డు వివరాలు
ఇండోర్ : సైబర్ కేటుగాళ్లు ఆగడాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను మధ్య ప్రదేశ్ పోలీసు సైబర్ స్క్వాడ్ అరెస్టు చేసింది. హ్యాక్ చేసిన క్రెడిట్ కార్డు వివరాలను ఆన్లైన్లో కొనుగోలు చేసిన వీరు, పెద్ద మొత్తంలో కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను ఎంజాయ్ చేస్తున్నారని సీనియర్ అధికారులు చెప్పారు. డార్క్ వెబ్ ద్వారా హ్యాక్ చేసిన క్రెడిట్ కార్డు వివరాలను వీరు పొందుతున్నారని, ప్రతి క్రెడిట్ కార్డును కొనుగోలు చేయడానికి రూ.500 నుంచి రూ.800 వెచ్చిస్తున్నారని రాష్ట్ర సైబర్ సెల్స్ ఇండోర్ యూనిట్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు జితేంద్ర సింగ్ తెలిపారు. బిట్ కాయిన్ ద్వారా పేమెంట్లు జరిపి క్రెడిట్ కార్డు వివరాలను రాబడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులను రామ్‌కుమార్ పిళ్ళై, రాంప్రసాద్ నాదర్‌గా అధికారులు గుర్తించారు. ముంబైకు చెందిన వీరు, పాకిస్తాన్‌కు చెందిన షైక్ అఫ్జల్ కా షోజి నడిపే అంతర్జాతీయ సైబర్ క్రిమినల్స్ గ్యాంగ్ తరుఫున పనిచేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. లాహోర్‌కు చెందిన షోజి, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సందర్శించినట్టు ఎస్పీ చెప్పారు. నాదర్, పిళ్ళైతో షోజి స్కైప్‌లో మాట్లాడాడని తెలిపారు. ఈ సైబర్ గ్యాంగ్‌కు చెందిన సభ్యులు డార్క్ వెబ్ ద్వారా క్రెడిట్ కార్డు వివరాలు కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వివరాలతో బ్యాంకాక్, థాయ్‌లాండ్, దుబాయ్, హాంకాంగ్, మలేసియా వంటి ప్రాంతాలకు విమాన టిక్కెట్లు కొనుగోలు చేయడం చేస్తున్నారని, అదేవిధంగా పెద్ద మొత్తంలో ఖరీదైన వస్తువులు కొంటున్నారని ఎస్పీ తెలిపారు. -
క్రెడిట్ కార్డు వివరాలు అందించి ...
ముంబై : బ్యాంకు అధికారాలమంటూ కాల్స్ చేసి, వినియోగదారులను ఖాతాల్లో డబ్బును కాజేస్తున్నారు ఘరానా మోసగాళ్లు. ఈ ఘటనలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయే కాని తగ్గడం లేదు. తాజాగా ఓ మల్టినేషనల్ కంపెనీలో పనిచేసే హెచ్ఆర్ ప్రొఫెషనల్‌కు బ్యాంకు అధికారినంటూ కాల్ చేసిన మోసగాడు, ఆమె ఖాతాల్లో రూ.94వేలు నొక్కేశాడు. పేబ్యాక్ పాయింట్లు రిడీమ్ చేసుకోండంటూ ఈ మోసానికి పాల్పడ్డాడు. అది మోసపూరిత కాల్ అని గుర్తించలేని ఆమె, తన నాలుగు కార్డుల వివరాలతో పాటు, తన సహచరిణి కార్డు వివరాలు, వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను మోసగాడికి అందించి బుకైంది. తన ఖాతాల్లో డబ్బును కోల్పోయే సరికి షాక్‌కు గురైన ఆ 49 ఏళ్ల మహిళ పోవై పోలీసులను ఆశ్రయించింది. ఆ మహిళ అందించిన వివరాల ప్రకారం తను అధేరిలో ఓ మల్టినేషనల్ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తుంది. మోసగాడి నుంచి ఓ రోజు ఫోన్ కాల్ వచ్చింది. తన బ్యాంకు నరిమాన్ పాయింట్ బ్రాంచు నుంచి కాల్ చేసినట్టు చెప్పినట్టు ఆ మహిళ పేర్కొంది. తన క్రెడిట్ కార్డులపై ఉన్న పేబ్యాక్ పాయింట్లను రిడీమ్ చేసుకోవాలంటూ ఆ మోసగాడు పేర్కొన్నాడని తెలిపింది. అనంతరం మొబైల్‌ఫోన్‌కు నగదు డెబిట్ అయినట్టు వచ్చిన మెసేజ్ చూసి షాక్ గురయ్యాయని పేర్కొంది. వంచన, గుర్తింపు దొంగతనం, మోసం కింద ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద గుర్తుతెలియని ఆ మోసగాడిపై పోవై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. -
డిపాజిట్ ఉంటే.. కార్డిస్తారు!
♦ క్రెడిట్ కార్డులు పొందటానికి ఈజీ మార్గం ♦ క్రెడిట్ స్కోరు బాగులేని వారికిది అనుకూలమే ♦ వేతన రుజువులు చూపించాల్సిన పనిలేదు ♦ కాకపోతే డిపాజిట్లో 85 శాతం వరకే పరిమితి ♦ ఇతర నిబంధనలు సాధారణ కార్డుల మాదిరే ♦ తక్కువ వడ్డీకే డిపాజిట్‌ను కొనసాగిస్తుండాలి ♦ ఈ పరిస్థితుల్లో అది ప్రతికూలమే: నిపుణులు ♦ స్వయం ఉపాధి, స్థిరాదాయం లేనివారికీ బెటర్ క్రెడిట్ కార్డు ఒకప్పుడు పెద్దగా అవసరం లేదనుకునేవారు. అప్పులకు భయపడేవారు కార్డులక్కూడా దూరంగానే ఉండేవారు. ఇక అప్పులు బాగా ఎక్కువైన వారికి కంపెనీలే కార్డులిచ్చేవి కాదు. కొన్నాళ్ల కిందటిదాకా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉన్నా... పెద్ద నోట్లు రద్దు, వ్యవస్థలో నగదుకు కటకట ఏర్పడటం, వైద్య ఖర్చుల వంటివి భారీగా పెరగటం తదితర పరిణామాలతో క్రెడిట్ కార్డులకు సంబంధించి చాలా మార్పులొచ్చాయి. కార్డు వినియోగం, అవసరం బాగా పెరిగింది. అవసరానికి క్షణాల్లో అప్పు పుట్టించే ఈ కార్డులకు డిమాండూ పెరిగింది. వేతన జీవులకు క్రెడిట్ కార్డు సులభంగానే లభిస్తుంది. స్థిరమైన ఆదాయం వస్తుంది గనుక వీరు అడగకుండానే... బ్యాంకులే స్వయంగా కార్డులు చేతిలో పెట్టే పరిస్థితి వచ్చింది. కానీ, అదే సమయంలో స్థిరమైన ఆదాయం లేని వారు, స్వయం ఉపాధిలో ఉన్నవారికి, క్రెడిట్ హిస్టరీ లేని వారికి క్రెడిట్ కార్డు లభించడం అంత సులభంగా లేదు. అయితే, వీరిక్కూడా ఓ మార్గం ఉంది. నిర్ణీత మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానిపై క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. వీటిని సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులుగా పరిగణిస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహింద్రా బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా ఇలా ఎన్నో బ్యాంకులు ఎఫ్డీ చేస్తే ఇతర అర్హతలేవీ చూడకుండా క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తున్నాయి. అందుకు గల విధి, విధానాలు ఒకసారి చూద్దాం... అర్హతలు ఇవీ.. క్రెడిట్ కార్డు తీసుకుందామనుకున్న తర్వాత సంబంధిత బ్యాంకు వద్ద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ సమయంలో బ్యాంకు అవసరమైన పత్రాలను తీసుకుంటుంది. కనుక క్రెడిట్ కార్డు సమయంలో ఇతరత్రా పత్రాలేవీ సమర్పించాల్సిన అవసరం ఉండదు. దరఖాస్తు ఒక్కటి మాత్రం సరిపోతుంది. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు కనీసం రూ.20,000 డిపాజిట్‌ను అడుగుతున్నాయి. కోటక్ మహింద్రా బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా అయితే రూ.25,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంత మేరకైనా డిపాజిట్ చేయవచ్చు. ఒక్క యాక్సిస్ బ్యాంకు మాత్రం గరిష్ట డిపాజిట్ రూ.25 లక్షలుగా పరిమితి నిర్దేశించింది. డిపాజిట్ చేయాల్సిన కాల వ్యవధి ఐసీఐసీఐ కోరల్ లేదా ఇన్స్టంట్ ప్లాటినమ్ కార్డులకు 180 రోజులుగా ఉంది. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి యాస్పైర్ క్రెడిట్ కార్డు పొందాలంటే సెంట్ యాస్పైర్ టర్మ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పరిమితులు కూడా ఉన్నాయ్... డిపాజిట్‌పై తీసుకునే క్రెడిట్ కార్డుల విషయంలోనూ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకు మైనర్ల పేరిట డిపాజిట్ చేసినప్పటికీ క్రెడిట్ కార్డులిచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఇదే బ్యాంకులో ఫ్లెక్సీ డిపాజిట్, ట్యాక్స్ సేవర్ డిపాజిట్లు చేసినట్టయితే వాటిపైనా కార్డులను జారీ చేయడం లేదు. ఐసీఐసీఐ బ్యాంకు థర్డ్‌పార్టీకి, భాగస్వామ్య సంస్థలు తదితర వర్గాలకు క్రెడిట్ కార్డులు ఇవ్వడం లేదు. అలాగే, తనఖాలో ఉంచిన డిపాజిట్లపై కూడా క్రెడిట్ కార్డులు జారీ చేయడం లేదు. చాలా బ్యాంకులు డిపాజిట్ మొత్తంలో 80 శాతం విలువకు సమానమైన క్రెడిట్ లిమిట్ (రుణ పరిమితి) ఇవ్వటానికే మొగ్గు చూపిస్తున్నాయి. ఆ మేరకే కార్డులు మంజూరు చేస్తున్నాయి. ఉదాహరణకు రూ.1 లక్ష డిపాజిట్ చేసి ఉంటే రూ.80,000 వరకు లిమిట్‌తో క్రెడిట్ కార్డును తేలిగ్గా పొందొచ్చు. కొన్ని బ్యాంకులు కార్డులపై క్రెడిట్ లిమిట్‌ను కూడా పరిమితం చేస్తున్నాయి. కోటక్ మహింద్రా బ్యాంకు ఆక్వాగోల్డ్ కార్డ్‌పై గరిష్టంగా రూ.12 లక్షలకే క్రెడిట్ లిమిట్‌ను ఖరారు చేసింది. అంటే డిపాజిట్ రూ.50 లక్షలు చేసినా, రూ.12 లక్షలకే క్రెడిట్ లిమిట్‌తో కార్డు ఇస్తుంది. సెంట్రల్బ్యాంకు యాస్పైర్ క్రెడిట్ కార్డుపై రూ.10 లక్షల గరిష్ట పరిమితి ఉంది. చార్జీలు, వడ్డీ రేట్లు మామూలే! క్రెడిట్ కార్డు కాల వ్యవధి, ఫీజులు, వడ్డీ రేటు, ఇతర చార్జీలన్నీ కూడా వీటికీ సాధారణ క్రెడిట్‌కార్డుల మాదిరిగానే అమల్లో ఉన్నాయి. రుణ కాల వ్యవధి 30 నుంచి 60 రోజుల వరకు ఉంది. సకాలంలో చెల్లింపులు చేయకపోతే ఆలస్య రుసుం, వడ్డీ పడుతుంది. ఈ కార్డుల వల్ల బ్యాంకులకు ఉన్న వెసులుబాటు కార్డు దారుడు రుణం తీసుకుని చెల్లించకపోతే డిపాజిట్ నుంచి రికవరీ చేసుకుంటాయి. ఐసీఐసీఐ బ్యాంకు అయితే క్రెడిట్ కార్డుపై తీసుకున్న రుణం గనక డిపాజిట్ విలువకు చేరినట్లయితే వెంటనే డిపాజిట్‌ను రద్దు చేసి రుణం కింద జమ చేసుకుంటోంది. క్రెడిట్ కార్డు కాలవ్యవధి అన్నది డిపాజిట్ కాలవ్యవధిపైనే ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ కార్డులకు హామీగా ఉన్న డిపాజిట్లను బ్యాంకులు సాధారణంగా ఆటో రెన్యువల్ మోడ్‌లో ఉంచుతాయి. అంటే గడువు తీరిన తర్వాత డిపాజిట్లు తిరిగి పునరుద్ధరిస్తూ ఉంటాయి. డిపాజిట్ మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా క్రెడిట్ కార్డును వాడుకోవాలని అనుకునేవారు దానిపై తనఖా మార్కును తీసేసి అన్ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు కిందకు మార్చాలంటూ బ్యాంకులను కోరవచ్చనేది రుబిక్యూ ఎండీ, సీఈవో మానవ్‌జీత్ సూచన. అయితే, మీ క్రెడిట్ స్కోరు, ఇతర అంశాల ఆధారంగా క్రెడిట్ పరిమితిని సవరించే అవకాశం ఉంటుంది. ‘‘డిపాజిట్‌పై క్రెడిట్ కార్డు తీసుకున్నాక చెల్లింపులు సకాలంలో చేయడం ద్వారా కాల వ్యవధి ముగిసే నాటికి మంచి క్రెడిట్ స్కోరును సంపాదించొచ్చు. దాంతో సాధారణ కార్డుకు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది’’ అని క్రెడిట్ మంత్రి సీఈఓ రంజిత్ పుజా తెలియజేశారు. ఈ కార్డులు ఎవరికి అనుకూలం? ఫిక్స్డ్ డిపాజిట్‌పై క్రెడిట్ కార్డులు మూడు వర్గాల వారికి అనువైనవన్నది నిపుణుల మాట. క్రెడిట్ హిస్టరీ లేకుండా, అప్పటి వరకు ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోని వారికి ఇవి అనువైనవి. వీరు డిపాజిట్‌పై కార్డు తీసుకుని అవసరాలు తీర్చుకోవడంతో పాటు క్రెడిట్ స్కోర్‌ను కూడా సాధించుకునే వీలుంటుంది. అలాగే, తక్కువ క్రెడిట్ స్కోరు ఉండి, రుణం పొందడానికి అడ్డంకిగా ఉన్న వారికి సైతం ఇవి అనుకూలం. స్థిరమైన ఆదాయం లేని వారికి కూడా ఇవి అనువైనవేనని లోన్‌ట్యాప్ సహ వ్యవస్థాపకుడు వికాస్ కుమార్ తెలియజేశారు. చిన్న వ్యాపారాల్లో, స్వయం ఉపాధిలో ఉండి అస్థిరమైన ఆదాయం కలిగిన వారు, క్రెడిట్ కార్డు కావాలనుకుంటే డిపాజిట్ చేసి సులభంగా కార్డు తీసుకోవచ్చని సూచించారు. అయితే, కార్డు పొందాలంటే ముందుగా డిపాజిట్ చేయడంతోపాటు దాన్ని లాకిన్‌లో ఉంచడం మాత్రం ప్రతికూలమే. -
డేటా తెలిస్తే దోపిడీనే..
బెంగళూరులో నకిలీ క్రెడిట్ కార్డుల ముఠా అరెస్టు జయనగర (బెంగళూరు): క్రెడిట్ కార్డుల సమాచారాన్ని తస్కరించి అత్యాధునిక టెక్నాలజీతో నకిలీ కార్డులు చేసి దండుకుంటున్న ముఠా గుట్టు రట్టయింది. శ్రీలంక పౌరునితో పాటు ముగ్గురిని శనివారం బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ ప్రవీణ్‌సూద్ తెలిపారు. శ్రీలంకలోని జాఫ్నా నివాసి దివ్యన్, బెంగళూరుకు చెందిన నవాజ్ షరీఫ్, నదీమ్ షరీఫ్ అనే ముగ్గురు కలిశారు. దివ్యన్ స్నేహితుడు టౌమ్జో అనే వ్యక్తి పేరుతో జాలహళ్లిలోని ఓ ఖరీదైన అపార్టుమెంట్లో ఫ్లాట్ తీసుకుని నకిలీ క్రెడిట్ కార్డుల దందా నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. సీసీబీ డీసీపీ రామ్నివాస్ ఆధ్వర్యంలో దాడి జరిపి వీరిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 144 క్రెడిట్ కార్డులు, 36 బయటి రాష్ట్రాల దుకాణాల కార్డు స్వైపింగ్ మిషన్లు, 16 నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు, ల్యాప్‌టాప్‌తోపాటు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా మోసం చేసేవారు అమెరికా, జపాన్ తదితర దేశాల్లోని పౌరుల క్రెడిట్ కార్డు దారుల సమాచారాన్ని ఇంటర్నె ట్లో సేకరిస్తారు. అమెజాన్, అలీబాబా తదితర షాపింగ్ వెబ్సైట్ల నుంచి ఖాళీ మ్యాగ్నటిక్ స్వైప్ కార్డులను పొందేవారు. వాటిలోకి తాము తస్కరించిన విదేశీ పౌరుల కార్డుల సమాచారాన్ని లోడ్ చేస్తారు. క్రెడిట్‌కార్డు ప్రింటింగ్ మిషన్ సాయంతో ఆ కార్డులపై అచ్చం అసలైన కార్డులపై ఉన్నట్లుగానే ఖాతా నంబర్లను ఉబ్బెత్తుగా ముద్రించేవారు. అనంతరం పుదుచ్చేరి, హరియాణా, ముంబై తదితర నగరాల్లోని ఏజెంట్ల ద్వారా దుకాణదారుల నుంచి అంతర్జాతీయ క్రెడిట్‌కార్డు స్వైపింగ్ మిషన్లను తెప్పించి వాటిలో నకిలీ క్రెడిట్ కార్డులను స్వైప్ చేసి నగదును వ్యాపారుల ఖాతాల్లోకి మళ్లించేవారు. అం దులో దుకాణదారులు, ఏజెంట్లు, నిందితులు వాటాలు వేసుకుని పంచుకునేవారు. కాగా, దివ్యన్ అక్రమంగా చెన్నైకు వచ్చాడు. అతనిపై అక్కడ రెండు చీటింగ్ కేసులున్నాయి. మరో వంచకుడు నదీమ్‌పై బెంగళూరులో చీటింగ్ కేసులు విచారణలో ఉన్నా యి. బాధితులు సుదూర ప్రదేశాల్లో ఉండడం, ఫిర్యాదు చేయడం సాధ్యం కాకపోవడంతో దుండగుల వంచన నిరాఘాటంగా సాగిపోయిందని కమిషనర్ సూద్ చెప్పారు. కొందరు బాధితులు క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయగా, మరికొందరు నిర్లక్ష్యంగా ఉండిపోయి భారీగా డబ్బు పోగొట్టుకున్నారు. -
క్రెడిట్‌కార్డు చెల్లింపులపై డబుల్ పన్ను?
కొత్త పన్ను విధానం జీఎస్టీ అమల్లోకి రావడంతో క్రెడిట్ కార్డులు లేదా ఎలక్ట్రానిక్ విధానం జరిపే చెల్లింపులకు రెట్టింపు పన్ను భరించాల్సి వస్తుందనే రూమర్లకు ప్రభుత్వం చెక్ పెట్టింది. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను నమ్మద్దని సూచించింది. రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా సోషల్ మీడియాలో వచ్చే రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే యుటిలిటీ బిల్లుల పేమెంట్లకు జీఎస్టీ రెండు సార్లు చెల్లించాల్సి వస్తుందనే వార్తలు పూర్తిగా అవాస్తవం అని అధియా ట్వీట్ చేశారు. అథారిటీల వద్ద చెక్ చేసుకోకుండా.. ఇలాంటి మెసేజ్‌లను సోషల్ మీడియాలో రీ-సర్క్యూలేట్ చేయవద్దని చెప్పారు. నేషనల్ పేమెంట్ల కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ హోటా కూడా ఈ డబుల్ పన్నుల రూమర్లపై స్పందించారు. ఆయన కూడా ఈ రూమర్లు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. 18 శాతం జీఎస్టీ మినహా మిగతా ఎలాంటి ఛార్జీలను తాము వేయడం లేదని స్పష్టీకరించారు. అంతకముందున్న సేవాపన్ను 15 శాతం, కొత్తగా వచ్చిన పన్నుల విధానంతో 18 శాతమైన సంగతి తెలిసిందే. కాగ, జీఎస్టీ ప్రభావంతో ఫైనాన్సియల్ సెక్టార్ పన్నులు మూడు శాతం పాయింట్లు పెరగనున్నట్టు కొన్ని బ్యాంకర్లు చెప్పాయి. కాగ, వీటిని ప్రస్తుతం కూడా సర్వీసు పన్ను రూపంలో వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నాయి. అయితే తాము అదనంగా ఎలాంటి లావాదేవీల పన్ను వేయడం లేదని సీనియర్ బ్యాంకర్ చెప్పారు. -
నగదు రహితం దిశగా..
►వ్యవసాయ శాఖ నుంచి మొదలు ►ఎరువులు, పురుగు మందులు, విత్తనాల షాపుల్లో అమలు ►స్వైప్ మిషన్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన పేనియర్ సంస్థ ►జిల్లాలో 229 దుకాణాలు హన్మకొండ: నగదు రహిత జిల్లాగా మార్చేందుకు వరంగల్ అర్బన్ జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. నగదుతో నిమిత్తం లేకుండా క్రయ విక్రయాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్లో ఖాతాలకు నగదు మార్పిడి, డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జిల్లా కలెక్టర్ అమ్రపాలి చర్యలు చేపడుతున్నారు. జిల్లా మొత్తం ఒకేసారి కాకుండా ప్రభుత్వ శాఖల వారీగా నగదు రహిత సేవలు చేపట్టనున్నారు. ముందుగా వ్యవసాయ శాఖ నుంచి ఈ ప్రక్రియ మొదలు పెట్టాలని నిర్ణయించారు. ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్, సీడ్స్ షాపుల్లో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయడం ద్వారా నగదు రహిత సేవలను రైతులకు, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు పేనియర్ సంస్థకు స్వైప్ మిషన్లు ఏర్పాటు, బ్యాంకులతో లింకేజీ ఏర్పాటు చేసే పనులు అప్పగించారు. పేనియర్ సంస్థ ఇప్పటికే సిద్దిపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసింది. ఆ జిల్లాలో నగదు రహిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దుకాణాల్లో స్వైప్ మిషన్లు ఏర్పాటు, బ్యాంకులతో లింకేజీ సౌకర్యం పేనియర్ సంస్థ కల్పిస్తుంది. దీని కోసం ప్రత్యేక డివైస్‌ను రూపొం దించారు. పేనియర్ స్వైప్ మిషన్ మొబైల్ ఫోన్ సహాయంతో పని చేస్తుంది. మొబైల్ ఫోన్లో కనీసం 2జీ ఇంటర్ నెట్ సౌకర్యం కలిగి ఉండాలి. స్వైప్ మిషన్‌ను మొబైల్ ద్వారా బ్యాంకులకు అనుసంధానిస్తారు. దీంతో లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తానాలు కొనుగోలు చేసుకోవచ్చు. డీవైస్ సమస్య ఉత్పన్నమైతే ఏర్పాటు చేసిన నాటి నుంచి సంవత్సరం పాటు పేనియర్ సంస్థ ఉచితంగా సేవలు అందిస్తుంది. వరంగల్ అర్బన్ జిల్లాలో ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్, సీడ్స్ దుకాణాలు 229 ఉన్నాయి. ముందుగా ఈ దుకాణాల్లో పేనియర్ స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసి నగదు రహిత సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. క్రమంగా ఇతర దుకాణాల్లోను నగదు రహిత సేవలు అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ సేవలు పొందడానికి దుకాణదారులు ఆధార్ కార్డు, పాన్‌కార్డు జిరాక్స్ ప్రతులతో పాటు కరెంట్ ఖాతాదారులైతే షాపు లైసెన్స్ అందించాల్సి ఉంటుందని పేనియర్ సంస్థ వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా ఏరియా మేనేజర్ మణికంఠ తెలిపారు. సేవింగ్ ఖాతాదారులకు షాప్ లైసెన్స్ అవసరం లేదన్నారు. స్వైప్ మిషన్లకు 9866444292 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. -
క్రెడిట్ కార్డుల స్కాం.. రూ.23.8 కోట్ల మోసం
⇒ 16 మంది భారతీయ అమెరికన్లపై కేసులు న్యూయార్క్: అమెరికాలో పెద్ద ఎత్తున ఇతరుల క్రెడిట్ కార్డుల్ని దొంగిలించి రూ. 23.8 కోట్ల మేర మోసగించిన కేసులో 16 మంది భారతీయ అమెరికన్లపై అక్కడి అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ భారీ మోసంలో న్యూయార్క్ రాష్ట్రం క్వీన్స్‌కు చెందిన మహమ్మద్ రానా(40) ప్రధాన సూత్రధారి కాగా.. ఇందర్జీత్ సింగ్(24) ప్రధాన సహచరుడిగా విచారణలో పోలీసులు గుర్తించారు. కేసులో మొత్తం 30 మంది హస్తమున్నట్లు నిర్ధారించిన అమెరికా పోలీసులు వారందరిపై కేసులు నమోదు చేశారు. వందలమంది వినియోగదారుల వ్యక్తిగత క్రెడిట్ సమాచారం దొంగిలించిన నిందితులు పలువురు వ్యక్తులు, ఆర్థిక సంస్థలు, వ్యాపార సంస్థలకు భారీగా నష్టం కలిగించినట్లు విచారణలో తేలింది. క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ రిచర్డ్ బ్రౌన్ మాట్లాడుతూ...క్రెడిట్ కార్డు అసలు యజమానుల తరఫున కొత్త క్రెడిట్ కార్డులు కావాలని కోరుతూ నిందితులు బ్యాంకుల్ని కోరేవారని, క్రెడిట్ కార్డులు వినియోగదారులకు చేరాక వారి పోస్టుబాక్సుల నుంచి చోరీ చేసేవారని బ్రౌన్ తెలిపారు. దొంగిలించిన క్రెడిట్ కార్డుల్ని ఉపయోగించి నిందితులు గురువారం పెద్ద మొత్తంలో షాపింగ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. -
క్రెడిట్ కార్డ్ రీచార్జ్‌లపై పేటీఎం వాత
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం చార్జీల బాదుడుకు తెరతీసింది. క్రెడిట్ కార్డు ద్వారా వాలెట్ రీఛార్జింగ్ కోసం చేసే లావాదేవీలపై వాత పెట్టేందుకు నిర్ణయంచింది. వీటిపై 2శాతం ఫీజును వసూలు చేస్తోంది. దీనిపై పేటీఎం తన అధికారిక బ్లాగ్‌లో వివరణ ఇచ్చింది. వాలెట్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. క్రెడిట్ కార్డులు ఉపయోగించి వాలెట్ రీఛార్జ్ , బ్యాంకులకు డబ్బు తిరిగి బదిలీలలో చోటు చేసుకుంటున్న అక్రమాలని ఆపడానికి ఈ చార్జీలను విధిస్తున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయం మార్చి 8 నుంచి అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే షాపింగ్, బిల్లుల చెల్లింపులకు ఈ ఫీజు పెంపు వర్తించదని స్పష్టం చేసింది. కేవలం రీచార్జ్‌లపై మాత్రమే 2 శాతం చార్జీ వసూలు చేయనున్నట్టు తెలిపింది. అయితే డెబిట్ కార్డు చెల్లింపులు, నెట్‌బ్యాంకింగ్‌పై ఎలాంటి రుసుముం ఉండదని బ్లాగ్‌లో వివరణ ఇచ్చింది. అలాగే క్రెడిట్ కార్డు ద్వారా వాలెట్ టాప్ ఆప్ లపై అదే మొత్తంలో క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తునట్టు పేర్కొంది. ఇ-కామర్స్, ఇతర ఆన్లైన్ వాణిజ్య సంస్థలకు యూజర్ల డిజిటల్ చెల్లింపుల కోసం కార్డ్ నెట్ వర్క్ సంస్థలకు లేదా బ్యాంకులకు తము అధిక ఫీజులు చెల్లిస్తున్నామని కంపెనీ సీఈవో విజయ్‌శేఖర్ శర్మ తెలిపారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు ద్వారా యూజర్లు కేవలం వాలెట్ లో మనీ యాడింగ్ చేసుకుంటూ పోతే తమకు వచ్చే లాభమేమీ ఉండదనీ, ఇలాంటి సేవల వల్ల తాము నష్టపోతున్నామన్నారు. కాగా గతంలో మొబైల్ రీచార్జ్‌లు, కరెంట్ బిల్లు చెల్లింపులు, బస్ టికెట్లు వంటి వాటికే పరిమితమైన డీమానిటైజేషన్ నేపథ్యంలో మొబైల్ వాలెట్ చెల్లింపులు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. -
నగదు లేకుండా నడవగలమా?
• ‘ప్లాస్టిక్’ నాణేనికి రెండు వైపులా పదును • డిజిటల్ మనీతో నల్లధనానికి, అవినీతికి ముకుతాడు • ప్రభుత్వానికి ఆదాయం.. ఆర్థిక వ్యవస్థకూ లాభం • ఉగ్రవాద నిధులకూ, నకిలీ నోట్లకూ చరమగీతం • కానీ.. సైబర్ నేరాలకు, హ్యాకింగ్ మోసాలకు నెలవు • వ్యయంపై నియంత్రణ, వ్యక్తిగత గోప్యతకు చెల్లుచీటీ • కరెన్సీ వినియోగ సంస్కృతి ఉన్నఫళంగా మారుతుందా? • నిరక్షరాస్యత, పేదరికం అవరోధాలను అధిగమించేనా? మనిషి శ్రమకు ప్రతిరూపం... నిత్య జీవనాధారం... భవిష్యత్తుకు భరోసా! నాలుగు రాళ్లు సంపాదించినా.. ఖర్చు చేసినా.. దాచుకున్నా.. అంతా డబ్బు రూపంలోనే.. కరెన్సీ నోట్ల రూపంలోనే! భారతీయ సంస్కృతిలో వందల ఏళ్లుగా వస్తున్న అలవాటు ఇది.. నాణేనికి, నోటుకు లక్ష్మీదేవి ప్రతిరూపమని దేవత హోదా ఇచ్చిన సంస్కృతి ఇది! ఇప్పుడా డబ్బు.. కరెన్సీ నోట్లు వాడటం మానేద్దాం అంటోంది ప్రభుత్వం! డబ్బును ఇళ్లలో, పెట్టెల్లో దాచుకోవద్దు అంటోంది. అంతా బ్యాంకుల్లోనే ఉంచేద్దామంటోంది. కంప్యూటర్ సంకేతాలుండే ప్లాస్టిక్ ముక్కతోనో.. మొబైల్ ఫోన్లలో అప్లికేషన్ ద్వారానో.. డిజిటల్ మనీగా ఖర్చు పెట్టుకునే అలవాటు చేసుకుందాం అంటోంది! ఇది మన దేశానికి.. మన ప్రజలకు.. మన ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని, అభివృద్ధికి బాటలు పరుస్తుందని చెప్తోంది. అవినీతి, నల్లధనం వంటి రుగ్మతలకు ఇదే విరుగుడని అంటోంది! చాలా మంది ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులు, నిపుణులూ ఇదే మాట చెబుతున్నారు. మరోవైపు నగదు రహిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో చాలా లోటుపాట్లు ఉన్నాయనే వాదనలూ వినిపిస్తున్నాయి. వ్యక్తి తన శ్రమ ఫలాన్ని నగదు రూపంలో తన దగ్గర దాచుకోలేకపోవడం.. భౌతికంగా చేతిలో లేకపోవడం వల్ల ఖర్చుపై నియంత్రణ లేకపోవడం.. సైబర్ దాడుల ముప్పు వంటి ఎన్నో ప్రతికూలతలపై మరికొందరు ఆర్థికవేత్తలు, నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ లాభనష్టాల సంగతి ఎలా ఉన్నా భారతదేశం నగదు రహితంగా మారడానికి ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయన్న దానిపై మాత్రం అందరూ ఏకీభవిస్తున్నారు. దేశం చారిత్రకంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక పెను మార్పు వైపుగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. నగదు రహిత వ్యవస్థ లాభనష్టాలు, అందుకు గల అవరోధాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. - సాక్షి నాలెడ్‌జ సెంటర్ ⇔ ప్రస్తుతం దేశంలో 14.6 లక్షల స్వైపింగ్ మెషీన్లే ఉన్నాయి. ⇔ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు చేయాలంటే స్వైపింగ్ మెషీన్లు ఉండాలి. ⇔ నగదురహిత లావాదేవీలను విస్తృతం చేయడానికి వచ్చే మూడునెలల్లో మరో 10 లక్షల స్వైపింగ్ మెషీన్లను దుకాణదారులకు అందించాలని బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. ⇔ నోట్ల రద్దు కారణంగా గత 20 రోజుల్లో మొబైల్ వ్యాలెట్, ఈ-వ్యాలెట్ సంస్థల వ్యాపారం ఏకంగా నాలుగు రెట్లు పెరిగిపోరుుంది. ఇంకా పెరుగుతూనే ఉంది. 16.7 భారత్‌లో ఈ ఏడాది నవంబర్ నాటికి ఇంకా 16.7 కోట్ల మందికి అసలు బ్యాంకు ఖాతానే లేదని ఆర్బీఐ, ప్రైస్ వాటర్ కూపర్ హౌస్‌ల నివేదికలు చెబుతున్నాయి. వీరందరినీ బ్యాంకు సేవల పరిధిలోకి తేవాల్సి ఉంటుంది. 19.5 కోట్ల ఖాతాలు పేరుకు మాత్రమే ఉన్నాయని, వీటిల్లో దీర్ఘకాలంగా ఎలాంటి లావాదేవీలు జరగడం లేదని వరల్డ్ బ్యాంక్ 2015లో వెల్లడించింది. 68.84 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే... వీరికి సేవలు అందించడానికి పనిచేస్తున్న బ్యాంకులు 38 శాతమే (భారత్‌లో బ్యాంకు శాఖల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవి). 31.16 శాతంగా ఉన్న పట్టణ ప్రజలకు సేవలందించడానికి బ్యాంకు శాఖల్లో 62 శాతం నగరాలు, పట్టణాల్లోనే ఉన్నారుు. నిరక్షరాస్యత.. ఇంగ్లిష్ లోపం దేశంలో నాలుగో వంతు మందికి పైగా నిరక్షరాస్యులే. మూడొంతుల మంది అక్షరాస్యులే అయినా.. అందులో సగం మందికిపైగా ఏదో ఒక భాషలోనే చదవడం, రాయడం తెలిసినవారు. ఇంగ్లిష్‌లో చదవగల, రాయగల వారి సంఖ్య పావు శాతం కూడా ఉండదు. ఇంగ్లిష్‌లో ఉండే ఆన్లైన్ వ్యవహారాలను ఎంత మంది చేయగలరనేది ప్రశ్నార్థకం. డిజిటల్, ఆన్లైన్ అక్షరాస్యత దేశంలో సగం మంది పాతికేళ్ల లోపు యువతే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు ఇట్టే అందిపుచ్చుకోగలరు. కానీ వారికున్న ఆర్థిక స్వేచ్ఛ తక్కువ. అధికంగా ఆర్థిక లావాదేవీలు జరిపే వర్గాల వారిలో అత్యధికులకు డిజిటల్, ఆన్లైన్ అక్షరాస్యత లేదు. ఆన్లైన్ ఆర్థిక మోసాలు పెరిగిపోవడం, ఆ మోసాలు జరిగే తీరు తెన్నులు, తీసుకోవలసిన జాగ్రత్తలు అర్థంకాకపోవడం వల్ల చాలా మంది ప్లాస్టిక్, డిజిటల్ మనీని ఇష్టపడటం లేదు. బ్యాంకులు, ఏటీఎంల కొరత దేశ జనాభా సుమారు 134 కోట్లయితే.. బ్యాంకు శాఖలు 1.32 లక్షలు ఉన్నాయి. 68.84 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా.. మొత్తం బ్యాంకుల్లో 38 శాతమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. పట్టణ జనాభా 31.16 శాతం ఉంటే.. 62 శాతం బ్యాంకు శాఖలు వాటిల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. అలాగే ఇంత మంది జనాభాకు 2.03 లక్షల ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. అసంఘటిత రంగంలో ఎలా? దేశంలో అతి పెద్ద ఉద్యోగ రంగం.. అసంఘటిత రంగం! ఈ రంగం దాదాపుగా నగదు ఆధారితంగానే నడుస్తుంది. వ్యవస్థ నుంచి భారీ మొత్తంలో నోట్లను ఉపసంహరించడం.. భరోసానివ్వగల లావాదేవీల వ్యవస్థలు లోపించడం కారణంగా.. గ్రామీణ ప్రాంతాలు, అసంఘటిత రంగాలు కష్టాలు ఎదుర్కోనున్నాయి. యజమానుల వ్యతిరేకత పనిచేసే వారిలో 90 శాతం మంది (దేశవార్షిక ఉత్పత్తిలో సగం వీరి నుంచే వస్తుంది) అసంఘటిత రంగంలోనే ఉన్నారు. కాంట్రాక్టు లేబర్‌తో చిన్న పరిశ్రమలు పని చేయించుకుంటాయి. వారికి చెల్లింపులన్నీ నగదు రూపంలో.. వోచర్ పేమెంట్ ద్వారా జరుగుతాయి. యాజమాన్యాలు వారికి బ్యాంకు ఖాతాలు తెరిచి జీతాలు చెల్లించడానికి ముందుకు రావు. ఎందుకంటే ఒకసారి ఖాతాలు తీసి కార్మికులుగా చూపితే.. చట్టబద్ధంగా వారికి ప్రయోజనాలన్నీ ఇవ్వాల్సి వస్తుంది. 37.1 కోట్లు ⇔ భారత్‌లో మొబైల్ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య ⇔ 2016 జూలై నాటికి భారత్‌లో ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య 46 కోట్లు (సింహభాగం మొబైల్ ఇంటర్నెట్). ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకందారులు ఎక్కువగా ఉన్న దేశాల్లో చైనా తర్వాతి స్థానం మనదే. అమెరికాను కూడా దాటిపోయాం. దేశంలో జనాభాలో ఇంటర్నెట్ యాక్సెస్ఉన్న వారు 34.8 శాతం. ⇔ భారత్‌లో సెల్‌ఫోన్ కనెక్షన్ల సంఖ్య 103.32 కోట్లు. ⇔ స్మార్ట్ ఫోన్లు 22 కోట్లు ⇔ మొబైల్ వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు చేయాలంటే స్మార్ట్ ఫోన్లు, కనెక్టివిటీ అవసరం. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో నెట్ చార్జీలు అధికం. ఆండ్రాయిడ్ ఫోన్ కూడా పేదలకు భారమే. తక్కువ ధరకే ఆండ్రాయిడ్ ఫోన్లు ప్రజలకు అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం సాయపడటం, నెట్ చార్జీలు తగ్గించడం, పబ్లిక్ ప్లేస్‌లలో ఉచిత వైఫైని విరివిగా అందించడం... జనాన్ని మొబైల్ వ్యాలెట్ దిశగా ప్రోత్సహిస్తాయి. ⇔ అనుకూలాంశమేమిటంటే... భారత్ జనాభాలో 50 శాతం మంది 25 ఏళ్ల లోపు వారే. వీరికి టెక్నాలజీపై పట్టు ఉంటుంది. మొబైల్ వ్యాలెట్లు ఉపయోగించడానికి, ఆన్లైన్ లావాదేవీలు చేయడానికి సంసిద్ధత చూపుతారు. ఖాతాలపై పేదల వ్యతిరేకత దేశంలో చాలా మంది పేదలు బ్యాంకు ఖాతాలతో అనుసంధానం అవడానికి నిరాకరిస్తున్నారు. వారు వేతనాన్ని బ్యాంకుల ద్వారా తీసు కుంటే, అది రూ.60 వేలు దాటితే.. దారిద్య్రరేఖకు దిగువన గల పేదలుగా అందే సంక్షేమ పథకాలను కోల్పోతామనే భయమే కారణం. 71.24 కోట్లు రిజర్వుబ్యాంకు ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలో అన్ని బ్యాంకులు కలిపి 71.24 కోట్ల డెబిట్ కార్డులు (ఒకటికి మించి డెబిట్ కార్డులు కలిగిన వారు చాలామంది ఉంటారు) జారీచేశాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో స్వైపింగ్ మెషిన్లు లేకపోవడం, నగదుతోనే కొనడానికి బాగా అలవాటుపడటం... కారణమేదైనా ప్లాస్టిక్ మనీతో కొనుగోళ్లు మాత్రం జరగడం లేదు. కొనుగోళ్లు తదితర ఖర్చుల కోసం డెబిట్ కార్డులను ఉపయోగించటానికి.. దేశంలో ఆ కార్డులున్న వారు కూడా పూర్తిగా అలవాటుపడలేదు. ⇔ డెబిట్ కార్డులను ఎలా ఉపయోగిస్తున్నారని చూస్తే విస్మయం చెందుతాం. డెబిట్ కార్డుల వాడకం... 85 % ఏటీఎంలలో నగదు ఉపసంహరణకే జరుగుతోంది. 25 కోట్లు 25 కోట్ల జన్ ధన్ ఖాతాలు ప్రారంభించారు. 20 కోట్ల రూపే డెబిట్ కార్డులు ఇచ్చారు. 94 %డెబిట్ కార్డుల ద్వారా జరిగే ఖర్చు కూడా స్వల్పమే. డెబిట్ కార్డుల ద్వారా బయటికి వెళ్లే డబ్బులో 94 శాతం నగదుగా జనం తీసుకుం టున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే లక్ష రూపాయలు డెబిట్ కార్డు ద్వారా వాడితే అందులో 94 వేలు నగదు ఉపసంహరణే ఉంటోంది. మిగిలిన రూ.6 వేలే కొనుగోళ్లు, చెల్లింపులకు వాడుతున్నారన్న మాట. 75 % 2015లో భారతదేశంలో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో 75 శాతం నగదు ఆధారిత లావాదేవీలేనని.. అదే సమయంలో అమెరికా, జపాన్, ఫ్రాన్స, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నగదు రూపంలో లావాదేవీలు 20-25 శాతంగా ఉందని గూగుల్‌ఇండియా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయన నివేదిక చెప్తోంది. ఆ 75 శాతం నగదు లావాదేవీల్లో మూడింట రెండు వంతులు నగదు రహితంగా మారడం ఇప్పటికిప్పుడు సాధ్యమేనా? 1,50,000 దేశంలో కంప్యూటర్లతో పనిచేసే పోస్టాఫీసులు లక్షా యాభై వేల పైచిలుకు ఉన్నాయి. వీటిల్లో నగదు లావాదేవీలు జరపొచ్చు. -
కేటుగాళ్లున్నారు ’క్రెడిట్, డెబిట్ కార్డులు’ జాగ్రత్త
-
స్వైపింగ్తోనే సరుకులు
నగదు లేక ప్రజల ఇబ్బందులు పాత నోట్లపై అప్పుడే నిషేధం పెట్రోల్ బంకుల్లోనూ మిషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ వరంగల్ : నగరంలోని ప్రజలు తమ నిత్యావసర వస్తువుల కొనుగోళ్ల కోసం తప్పని పరిస్థితుల్లో డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించక తప్పడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో పాత రూ.500, రూ.1000 నోట్లను వ్యాపారులు తీసుకోవడం లేదు. పెద్ద నోట్లకు సరిపడా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తామన్నా వ్యాపారులు ఒప్పుకోవడం లేదు. పాత నోట్లు తీసుకుని బ్యాంకుల వద్దకు వెళ్లి క్యూలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని, ఇదంతా ఎందుకని పెద్ద నోట్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నట్లు వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం స్వైపింగ్ మిషన్ల ద్వారా చిల్లర విక్రయాలు కొనసాగిస్తున్నామన్నారు. దీనికి తోడుగా హోల్‌సేల్ వ్యాపారస్తులు ఇచ్చిన సరుకులకు పాత నోట్లు తీసుకోవడం లేదని, అందువల్ల తాము కూడా కొత్త నోట్లకు, చిల్లర నోట్లకే సరుకులు విక్రరుుస్తున్నట్లు తెలిపారు. నగరంలోని పలు కిరాణ షాపుల యాజమానులు ఇప్పుడిప్పుడే స్వైపింగ్ మిషన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. డిసెంబర్ 31వరకు బ్యాంకులు పాత నోట్లు తీసుకుంటామని ప్రకటనలు చేసినా వ్యాపారులు మాత్రం ఇప్పటి నుంచి పెద్ద నోట్లపై నిషేధం అమలు చేస్తున్నారు. కానరాని రూ.500 నోట్లు... దేశంలోని ఇతర రాష్ట్రాల్లో రూ.500 నోట్లు దర్శనమిచ్చినా నగరంలో వీటి జాడే లేకుండా పోరుుంది. పలు ఏటీఎంలలో రూ.100నోట్లనే పెడుతున్నారుు. ఇలా ఏటీఎంలలో పెట్టిన నోట్లు నిమిషాల్లో ఖాళీ కావడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఇళ్లలో ఖర్చుల నిమిత్తం దేవుళ్లకు వేసిన ముడుపులు సైతం బయటకు తీయక తప్పడం లేదని తెలుస్తోంది. ఈ ఇబ్బందులు మరెన్ని రోజులు ఉంటాయో అని నగరవాసులు అంటున్నారు. లీటర్‌కు నో... రూ.300కు ఒకే... రద్దైన పెద్ద నోట్లతో మోటార్‌బైక్‌లు ఉన్న వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్‌పంపుల్లో చిల్లర నోట్లకే పెట్రోల్ పోస్తున్నారు. రూ.500 ఇచ్చి లీటర్, రెండు లీటర్లు పోయమంటే లేదన్న సమాధానం వస్తోంది. చివరకు రూ.250 నుంచి 300లో పోసుకుంటేనే మిగిలిన చిల్లర ఇస్తున్నారు. నిత్యావసర వస్తువుల్లో పెట్రోల్ కూడా ఒక ప్రధానం కావడంతో పోరుుంచుకోక తప్పడం లేదని నగర వాసులు వాపోతున్నారు. ఆర్బీఐ పెద్ద నోట్లు రద్దు చేసినా వాటి స్థానంలో రూ.100 నోట్లను ఎక్కవ సంఖ్యల్లో అందుబాటులోకి తెస్తే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కావని పలువురు వాపోతున్నారు. చివరకు పెట్రోల్‌పంపుల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వస్తోంది. -
‘స్వైపింగ్’ యంత్రాలకు డిమాండ్!
గిరాకీని కాపాడుకునేందుకు హైదరాబాద్‌లో వ్యాపారుల యత్నం - మంగళవారం పలు బ్యాంకులకు సుమారు మూడువేల వినతులు - పది జాతీయ బ్యాంకులు సహా ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయిస్తున్న వైనం - నిబంధనలను సడలించాలని కోరుతున్న వ్యాపారులు సాక్షి, హైదరాబాద్: ప్రజల చేతిలో చిల్లర లేదు.. దుకాణాల్లో గిరాకీ లేదు.. దీంతో తమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి దుకాణ నిర్వాహకులు స్వైపింగ్ యంత్రాల కోసం బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులు స్వైపింగ్ చేసే యంత్రాలకు ఇప్పుడు గిరాకీ పెరిగింది. హైదరాబాద్‌లోని వ్యాపారులు గిరాకీని కాపాడుకునేందుకు స్వైపింగ్ యంత్రాలు కావాలంటూ ఎస్బీఐ, సెంట్రల్‌బ్యాంక్, ఎస్బీహెచ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర పది జాతీయ బ్యాంకులతో సహా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, కొటక్‌మహీంద్ర వంటి ప్రైవేటు బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు. రోజూ వేల రూపాయల వ్యాపారం నిర్వహించే తినుబండారాల దుకాణదారులు, ఫుట్‌పాత్, వీధి వ్యాపారులు కూడా ఈ యంత్రాలుంటేనే తమ వ్యాపారానికి ఢోకా ఉండదని భావిస్తున్నట్లు సమాచారం. మంగళవారం ఒకే రోజు ఆయా బ్యాంకులకు సుమారు మూడువేల స్వైపింగ్ యంత్రాలు కావాలంటూ నుంచి విజ్ఞప్తులు అందినట్లు బ్యాంకింగ్ రంగ నిపుణులు తెలపడం గమనార్హం. ఈనెల 8 నుంచి బహిరంగ మార్కెట్లో రూ.500, వెరుు్య నోట్ల చలామణి కష్టతరం కావడం, చిల్లర కష్టాలు మొదలైన నేపథ్యంలో ఈ యంత్రాలకు గిరాకీ పెరిగినట్లు తెలిసింది. కాగా ఈ యంత్రాలను పొందడం అందరికీ సాధ్యపడడం లేదు. మూడేళ్ల ఐటీ రిటర్న్స్, పాన్‌కార్డు, చిరునామా ధ్రువీకరణ, వ్యాట్, లేబర్ సర్టిఫికెట్ వంటి ప్రభుత్వ పరమైన గుర్తింపులు, ధ్రువీకరణలు కలిగి ఉన్న కరెంట్ అకౌంట్ వినియోగదారులకు మాత్రమే ఈ యంత్రాలను సరఫరా చేయనున్నట్లు బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. వీధి వ్యాపారాల్లో అధికంగా కూరగాయలు, పండ్లు, టీ, బ్యాగులు, ఫ్యాన్సీ ఐటమ్స్, తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఉన్నారుు. వీరిలో 70 శాతం మంది మాత్రమే బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని, ఇందులోనూ ఎక్కువగా సేవింగ్స్ అకౌంట్లున్నవారే కావడం గమనార్హం. ఒకవేళ బ్యాంకు అకౌంట్ ఉన్నప్పటికీ ప్రస్తుత బ్యాంకుల నిబంధనల ప్రకారం స్వైపింగ్ యంత్రాలు పొందే అర్హతలున్నవారు సగం మంది మాత్రమే ఉన్నారని ఆయా వ్యాపారాలు నిర్వహించేవారు వాపోతున్నారు. బ్యాంకు అకౌంట్ కలిగిన ప్రతి వ్యాపారికి ఈ యంత్రాలను సరఫరా చేసి నెలవారీ అద్దె వసూలు చేసుకోవాలని ఆయా వ్యాపారులు బ్యాంకర్లను కోరుతున్నారు. -
నోట్ల కష్టాలు ఇప్పుడు కార్డులకు వచ్చేశాయ్!
న్యూఢిల్లీ: నోట్ల కష్టాలు ఇప్పుడు డెబిట్, క్రెడిట్ కార్డులకు కూడా వచ్చాయి. దేశవ్యాప్తంగా పలు రెస్టారెంట్లలో, మాల్స్‌లో, మల్టీఫ్లెక్సుల్లో తాత్కాలికంగా డెబిట్, క్రెడిట్ కార్డుల సర్వీసులు నిలిచిపోయాయంటూ కౌంటర్ల ముందు నోటీసు బోర్డులు వెలిశాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వరకు ఈ సర్వీసులు నిలిచిపోగా, కొన్ని ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా ఈ సర్వీసులు పునరుద్ధరణ కాలేదు. ఇదివరకెప్పుడు లేని విధంగా డెబిట్, క్రెడిట్ కార్డుల సేవలు విపరీతంగా పెరిగిపోవడంతో సర్వర్ల మధ్య సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కార్డుల సర్వీసుల్లో మూడు విభాగాల సర్వర్లు ప్రత్యక్ష పాత్ర పోషిస్తాయి. ఇవన్నీ ఒకదానికి ఒకటి అనుసంధానమై పనిచేయాల్సి ఉంటుంది. ఎక్కడ సాంకేతిక సమస్య ఉత్పన్నమైనా సర్వీసులు మధ్యలో నిలిచిపోతాయి. ఇంటర్నెట్ సర్వీసు ప్రొఫైడర్, సంబంధిత బ్యాంకు, పేమెంట్ గేట్‌వే సంస్థ సర్వర్లు ఈ సర్వీసుల్లో ప్రత్యక్ష పాత్ర పోషిస్తాయని అనేక ప్రభుత్వ సంస్థలకు సలహాదారు, ఇండియన్ సైబర్ ఆర్మీ వ్యవస్థాపకులు కిస్లే చౌధరి తెలిపారు. ఈ మూడు సంస్థల్లో ఏ సర్వర్ డౌన్ అయినా లేదా డిమాండ్‌కు తగ్గ సామర్థ్యం లేకపోయినా సమస్యలు వస్తాయని ఆయన వివరించారు. డెబిట్, క్రెడిట్ కార్డుల విషయంలో బ్యాంక్ సర్వీసులపై తమకు పెద్దగా ఒత్తిడి లేదని, బ్యాంకు సర్వర్ల సామర్థ్యం చాలా ఎక్కువగానే ఉందని రాజస్థాన్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్ హెడ్ కల్పనా గుప్తా మీడియాకు తెలిపారు. ప్రస్తుత నోట్ల మార్పిడియే తమకు పెద్ద సమస్యగా మారిందని, తగినంత సిబ్బందిలేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె చెప్పారు. సాధారణంగా చెల్లింపు సంస్థల సర్వర్ల వద్దనే సమస్యలు వస్తాయని, ఆ సంస్థకు ఒక బ్యాంకు ఆన్లైన్ రూటు బిజీగా ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా మరో బ్యాంకు నుంచి చెల్లింపులు జరిపేందుకు ఆ సంస్థకు వీలుండాలని, అలా ఉండాలంటే ఆ చెల్లింపు సంస్థలు పలు బ్యాంకులతో టైఅప్ పెట్టుకుని ఉండాలని ఆమె సూచించారు. ఎలక్ట్రానిక్ పేమెంట్స్ బాగా ఊపందుకున్నప్పటికీ మాస్టర్ కార్డు చెల్లింపులకు మాత్రం ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని దక్షిణాసియా డివిజన్ అధ్యక్షుడు పోరుష్ సింగ్ తెలిపారు. సెకనుకు 4,300 కోట్ల లావాదేవీలు నిర్వహించే నెట్వర్క్ తమ మాస్టర్ కార్డుకుందని ఆయన తెలిపారు. -
కార్డుదారులూ...తస్మాత్ జాగ్రత్త..!
-ఓ పక్క క్లోనింగ్... మరోపక్క స్కిమ్మింగ్ -నిత్యం సైబర్ క్రై మ్ పోలీసులకు ఫిర్యాదులు -నిత్యం మోసపోతున్నది కనీసం 15 మంది -కనీస జాగ్రత్తలే మేలంటున్న అధికారులు సాక్షి, సిటీబ్యూరో ప్లాస్టిక్ మనీగా పిలిచే క్రెడిట్/డెబిట్ కార్డుల వినియోగం గణనీయంగా పెరిగింది. జీతాలు తీసుకోవడం మొదలుకొని షాపింగ్ చేసే వరకు ఇప్పుడు ప్రతి చోటా ప్లాస్టిక్ కరెన్సీనే వాడుతుండటంతో జీవితంగా భాగంగా మారిపోయాయి. దీన్నే కొందరు ఆసరాగా చేసుకుని హైటెక్ మోసాలకు పాల్పడుతున్నారు. సీసీఎస్ ఆధీనంలోని సైబర్‌క్రై మ్ పోలీసులకు ప్రతి రోజూ 15 ఫిర్యాదులు వస్తున్నాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. షాపింగ్ చేసేప్పుడు, రెస్టారెంట్లుకు వెళ్లేప్పుడు నోట్ల కట్టలతో తిరిగే బదులు అంతా వీటి వినియోగానికే మొగ్గుచూపున్నారు. ఇది ఈ కార్డులకు సంబంధించిన ఒక కోణం మాత్రమే. సాంకేతిక పరిఙ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్లాస్టిక్ కరెన్సీని దుర్వినియోగం చేయడం మరో కోణం. ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ కరెన్సీకి సంబంధించి క్లోనింగ్, స్కిమ్మింగ్ ఉదంతాలు పెరిగిపోయాయి. అనేక వ్యవస్థీకత ముఠాలు రంగంలోకి దిగి విజంభిస్తున్నాయి. మరోపక్క బ్యాంకుల పేర్లతో ఫోన్లు చేసి కార్డు వివరాలు తెలుసుకుని అందినకాడికి దండుకుంటున్న ముఠాలు అనేకం ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కార్డుల వినియోగం, జరిగే మోసాలు, జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... స్కిమ్మింగ్ ఏమిటి..? ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా స్కిమ్మింగ్ పెరిగిపోయింది. ఈ ముఠాలు షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ తదితర ప్రదేశాల్లో ఉండే బాయ్స్‌ను ప్రలోభాలకు లోను చేసిన తమ వైపు తిప్పుకుంటారు. వినియోగదారుడు అక్కడకు వెళ్లిన సందర్భంలో బిల్లు చెల్లించడానికి కార్డులు ఇచ్చినప్పుడు వాటిని స్కిమ్ చేస్తారు. దీనికోసం వాడే స్కిమ్మర్ అరచేతిలో ఇమిడిపోయే సైజులో ఉంటాయి. కార్డుని ఒక్కసారి అందులో స్వైప్ చేస్తే చాలు... దాని డేటా మొత్తం అందులో నిక్షిప్తమైపోతుంది. అంటే మన కార్డు గుట్టు వారి చేతుల్లోకి వెళ్లిపోయినట్లే. మరోపక్క ఏటీఎం సెంటర్లలో ఫిక్స్ చేసే స్కిమ్మర్లూ ఉన్నాయి. వీటిని ఏటీఎం మిషన్‌లో కార్డులను ఇన్సర్ట్ చేసే ప్రదేశంలో ఫిక్స్ చేస్తారు. డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లిన వినియోగదారుడు కార్డును ఇన్సర్ట్ చేయగానే... అక్కడ ఏర్పాటు చేసిన స్కిమ్మర్ డేటాను గ్రహిస్తుంది. క్లోనింగ్.. ఈ విధానంలో వినియోగదారుడు తాను మోసపోయానని గుర్తించడానికీ చాలా కాలం పడుతుంది. క్లోనింగ్ చే సే ముఠాలకు కార్డులు అందుబాటులో ఉండాల్సిన పని లేదు. వీరికి ఇంటర్నెట్ ప్రధాన ఆధారం. బ్యాంకులకు సంబంధించిన వెబ్సైట్లు హ్యాక్ చేయడం, కొందరు బ్యాంకు సిబ్బందిని ప్రలోభ పెట్టడం ద్వారా అక్కడుండే కార్డు హోల్డర్ల డేటా సేకరిస్తారు. మరోపక్క ఆన్లైన్ షాపింగ్ అంటూ ఎరవేయడం ద్వారా... వినియోగదారుల వివరాలు వెరిఫికేషన్ చేస్తున్నామంటూ ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లు పంపించి, పూర్తి సెక్యూర్డ్ కాని వెబ్‌సైట్స్‌లో ఆన్లైన్ షాపింగ్ చేసే సందర్భంలోనూ కార్డు హోల్డర్ల డేటా తీసుకుంటారు. మరికొన్ని సందర్భాల్లో పరిచయస్తుల కార్డులకు సంబంధించిన వివరాలను చోరీ చేస్తారు. బోగస్ తయారీ ఇలా.. ప్లాస్టిక్ కరెన్సీకి సంబంధించిన డేటా ముష్కరుల చేతికి చేరిన తరవాత... స్కిమ్మింగ్, క్లోనింగ్ కార్డులను తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. కంప్యూటర్, కార్డు రైటర్, కార్డు మేకర్, మేగ్నెటిక్ స్ట్రిప్, ఎమ్టీ కార్డులు... ఇవన్నీ ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకుని బోగస్ కార్డుల తయారీని ‘కుటీర పరిశ్రమలా’ స్థాపించేస్తున్నారు. కంప్యూటర్ను వినియోగించి తాము సేకరించిన డేటాను కార్డు రైటర్ పంపిస్తారు. అక్కడ నుంచి ఎమ్టీ కార్డుల్లో మేగ్నెటిక్ స్ట్రిప్ ఏర్పాటు చేసి వాటిని రైటర్లో పెట్టడం ద్వారా డేటా మొత్తం ఫీడ్ చేస్తారు. కార్డు మేకర్లో ఉంచి సంబంధిత బ్యాంకు డిజైన్‌తో బోగస్ కార్డులు తయారవుతాయి. ఇవి అసలు కార్డులకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటాయి. ఈ కార్డులతో ముష్కరులు షాపింగ్ చేసుకుంటే... బిల్లులు మాత్రం అసలు కార్డు హోల్డర్‌కు వచ్చి చేరతాయి. కాస్త అప్రమత్తంగా ఉంటే... - ఏక్కడైనా బిల్లు చెల్లించడానికి మీ క్రెడిట్ కార్డులను ఇస్తే... వాటిపైనే దష్టి పెట్టి ఉంచండి. - పూర్తిగా పరిచయస్తులు కాని వారికి క్రెడిట్ కార్డుల వివరాలు, పిన్ నెంబర్లు చెప్పకండి. - కార్డును అందుకున్న వెంటనే దాని వెనుక వైపు తప్పకుండా సంతకం చేయాలి. - కార్డు వెనుక ఉండే సీసీవీ కోడ్‌లోని చివరి మూడు అంకెలూ భద్రమైన చోట రాసిపెట్టుకుని, కార్డుపై లేకుండా తుడిచేయండి. - సెక్యూర్డ్ కాని వెబ్‌సైట్స్‌లో ఆన్లైన్ షాపింగ్ చేయవద్దు. - అవసరమైన క్రెడిట్ కార్డులు మాత్రమే మీతో ఉంచుకోండి. - ఏటీఎం సెంటర్లకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండండి. - కార్డుపైన, దాని కవర్ పైన ఎట్టిపరిస్థితిల్లోనూ పిన్ నెంబర్ రాయద్దు. - కార్డు పోయినట్లయితే వెంటనే సంబంధిత బ్యాంక్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి బ్లాక్ చేయించండి. - అపరిచితులు కాల్ సెంటర్ల నుంచి అంటూ ఫోన్ చేస్తే గుడ్డిగా నమ్మి కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పవద్దు. - దుకాణదారులు సైతం సంతకాలు లేని కార్డులను అనుమతించకూడదు. - పెద్ద ఎత్తున ట్రాన్స్క్షన్స్ జరిగిన సందర్భంలో వినియోగదారులు గుర్తింపు పత్రాలు అడిగి, వాటిని సరిచూసుకోవాలి. - క్రెడిట్ కార్డు రిసిప్ట్‌లను ఎక్కడపడితే అక్కడ నిర్లక్ష్యంగా పడేయకూడదు. - ప్రతి నెలా మీరు చేస్తున్న లావాదేవీల బిల్లులు జాగ్రత్త చేసుకుని, కార్డు స్టేట్మెంట్ వచ్చిన తరవాత సరిచూసుకోండి. - మీ కార్డు లావాదేవీలపై ఎలాంటి సందేహాలు వచ్చినా... వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించండి. -
దొంగ క్రెడిట్ కార్డుల ముఠా అరెస్ట్
సనత్‌నగర్: ఐసీఐసీఐ బ్యాంక్‌కు వచ్చే దరఖాస్తుదారులకు తెలియకుండా వారి చిరునామాల ఆధారంగా పొందిన ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో రూ. 20 లక్షలు షాపింగ్ చేసి మోసానికి పాల్పడిన ముగ్గురు ముఠా సభ్యులను బేగంపేట్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బేగంపేట్ ఎస్ఐ రాంచందర్ తెలిపిన వివరాల ప్రకారం...చందానగర్ పాపిరెడ్డికాలనీకి చెందిన సారధికుమార్ (42) గచ్చిబౌలి నానక్‌రామ్‌గూడలోని ఐసీఐసీఐ టవర్స్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను దరఖాస్తుదారుల చిరునామాలపై ఎస్బీఐ క్రెడిట్‌కార్డుకు ఆప్లై చేసి కార్డులు తీసుకునేవాడు. ఇలా 22 మంది పేర్లపై తీసుకున్న కార్డులతో రూ. 22.95 లక్షలు షాపింగ్ చేశాడు. క్రెడిట్ కార్డులపై ఉన్న చిరునామాల్లో ఉండే వ్యక్తులను కలిసి షాపింగ్ కోసం చేసిన మొత్తాన్ని చెల్లించాలని ఎస్బీఐ సిబ్బంది కోరడంతో బాధితులు తాము కార్డు తీసుకోలేదని చెప్పారు. దీంతో ఎస్బీఐ క్రెడిట్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ విశాల్ విన్సెంట్ మే 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ జగన్ నేతృత్వంలో ఎస్ఐ రాంచందర్ దర్యాప్తు చేపట్టి సారథికుమార్ ఈ మోసానికి సూత్రధారిగా గుర్తించారు. అతనికి సహకరించిన నామాలగుండుకు చెందిన వీరబాబును గతంలోనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న శివచంద్ర, నర్సింహరావు, ఉపేంద్రలను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆధునిక ఫీచర్లతో ఏటీఎమ్‌లను అప్‌గ్రేడ్ చేయండి
బ్యాంక్‌లకు ఆర్బీఐ ఆదేశాలు ముంబై: అధునిక భద్రత ఫీచర్లతో ఏటీఎమ్‌లను వచ్చే ఏడాది సెప్టెంబర్ కల్లా అప్‌గ్రేడ్ చేయాలని బ్యాంక్‌లకు భారత రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. డెబిట్, క్రెడిట్ కార్డులను స్కిమ్మింగ్, క్లోనింగ్ చేయడాన్ని నిరోధించే రక్షణాత్మక ఫీచర్లతో ఏటీఎమ్‌లను బ్యాంక్‌లు అప్‌గ్రేడ్ చేయాలని సూచించింది. ఈఎంవీ(యూరోపే, మాస్టర్‌కార్డ్,విసా) చిప్, పిన్ లతో కూడిన కార్డులను పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్) టెర్మినల్స్ సమర్థవంతగా యాక్సెస్ చేస్తున్నాయని పేర్కొంది. కార్డ్‌ల్లో ఈఎంవీ చిప్, పిన్ ఉన్నప్పటికీ ఏటీఎమ్‌లు ఇప్పటికీ మ్యాగ్నటిక్ స్ట్రిప్ ఆధారంగానే కార్డ్ లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్నాయని ఆర్బీఐ వివరించింది. ఫలితంగా ఏటీఎమ్ కార్డ్ లావాదేవీలు స్కిమ్మింగ్, క్లోనింగ్, తదితర మోసాలకు గురయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. అందుకని ఏటీఎమ్‌లు కూడా ఈఎంవీ చిప్, పిన్ కార్డ్‌లను యాక్సెస్ చేసేలా ఏటీఎమ్‌లను అప్‌గ్రేడ్ చేయాలని సూచించింది. ఇక కొత్తగా ఏర్పాటు చేయబోయే ఏటీఎమ్‌లను కూడా ఈఎంవీ చిప్, పిన్కార్డ్స్లను యాక్సెస్ చేసేలా రూపొందించాలని పేర్కొంది.