
న్యూఢిల్లీ: సుమారు రెండున్నరేళ్ల స్వల్ప వ్యవధిలోనే 20 లక్షల పైచిలుకు టాటా న్యూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. కొత్తగా జారీ అయిన కార్డుల్లో ఇవి సుమారు 13 శాతం వాటా దక్కించుకున్నట్లు టాటా న్యూ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించాయి.
వివిధ ఉత్పత్తులు, సేవల కొనుగోళ్ల ద్వారా వచ్చే రివార్డు పాయింట్లన్నీ సమగ్రంగా అనుసంధానమవుతాయని పేర్కొన్నాయి. ఈ క్రెడిట్ కార్డుతో 10% వరకు ఆదా, ట్రావెల్.. ఫ్యాషన్ మొదలైన వాటి షాపింగ్‌లో ప్రత్యేక ప్రాధాన్యత తదితర ప్రయోజనాలను పొందవచ్చని టాటా డిజిటల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (ఫైనాన్షియల్ సర్వీసెస్) గౌరవ్ హజ్రతి తెలిపారు.