Milestone
-
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కొత్త మైలురాయి
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన మొత్తం క్లయింట్ ఖాతాల సంఖ్య 20 కోట్ల మార్కును దాటింది. డిజిటల్ పరివర్తన, నూతన సాంకేతిక ఆవిష్కరణలు ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. ఎనిమిది నెలల క్రితం 16.9 కోట్ల స్థాయిలో ఉండగా స్వల్ప వ్యవధిలోనే ఈ మైలురాయిని దాటినట్లు పేర్కొంది.ఇదీ చదవండి: ఎన్ఎస్ఈ కొత్త యాప్.. తెలుగులోనూ వెబ్సైట్భారత వృద్ధి గాథపై ఇన్వెస్టర్లకున్న పటిష్టమైన విశ్వాసానికి ఇది నిదర్శనమని ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 3.6 కోట్ల ఖాతాలు ఉండగా, ఉత్తర్‌ప్రదేశ్ (2.2 కోట్లు), గుజరాత్ (1.8 కోట్లు), చెరి 1.2 కోట్ల ఖాతాలతో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
డీమ్యాట్ సెక్యూరిటీలు రూ. 500 లక్షల కోట్లు
డీమెటీరియలైజ్డ్(డీమ్యాట్) రూపంలో ఉన్న మొత్తం సెక్యూరిటీల విలువ రూ. 500 లక్షల కోట్లను తాకినట్లు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్ఎస్డీఎల్) వెల్లడించింది. 2024 సెప్టెంబర్‌కల్లా 6 లక్షల కోట్ల డాల ర్లకు చేరినట్లు తెలిపింది.తొలి రూ. 100 లక్షల కోట్ల మార్క్‌ను 18ఏళ్లలో అంటే 2014 జూన్‌లో అందుకున్నట్లు తెలియజేసింది. తదుపరి ఆరేళ్ల కాలంలో 2020 నవంబర్‌కల్లా విలువ రెట్టింపై రూ. 200 లక్షల కోట్లకు చేరింది. ఈ బాటలో డీమ్యాట్ సెక్యూరిటీలు 4ఏళ్లలోనే రూ. 500 లక్షల కోట్లయ్యింది. కృతజ్ఞతలుఈ చరిత్రాత్మక మైలురాయికి కారణమైన ఇన్వెస్టర్లు, మార్కె ట్ పార్టిసిపెంట్లు, నియంత్రణ సంస్థలు తదితరులకు కృతజ్ఞతలు. – ఎస్.గోపాలన్, ఎన్ఎస్డీఎల్ ఎండీ -
కారు.. రికార్డు! 2 లక్షల మంది కొనేశారు..
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (FRONX) ఎస్యూవీ మరో మైలురాయిని సాధించింది. కేవలం 17.3 నెలల్లో 2 లక్షల విక్రయాల మార్కును చేరుకుని సరికొత్త పరిశ్రమ రికార్డును నెలకొల్పిందని కంపెనీ ప్రకటించింది.2023 ఏప్రిల్‌లో లాంచ్ అయిన ఈ కాంపాక్ట్ ఎస్యూవీ దాని థ్రిల్లింగ్ డ్రైవ్, ఫ్యూచరిస్టిక్ డిజైన్, అధునాతన గాడ్జెట్లు, మల్టీ పవర్‌ట్రెయిన్ ఎంపికల కారణంగా ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించింది. గతేడాది జనవరిలో 1 లక్ష విక్రయాల మైలురాయిని చేరుకున్న అత్యంత వేగవంతమైన కొత్త మోడల్‌గా గుర్తింపు పొందిన తరువాత 7.3 నెలలకే మరో లక్ష విక్రయాలు సాధించి 2 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకోవడం విశేషం.ఫ్రాంక్స్ సాధించిన ఈ మైలురాయి మారుతి సుజుకి పట్ల కస్టమర్లకు ఉన్న అంచనాలు, వాటికి అనుగుణంగా ఉత్పత్తులను అందించడానికి తాము చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తుందని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ పార్థో బెనర్జీ పేర్కొన్నారు. మారుతీ ఫ్రాంక్స్ టైర్ 1, టైర్ 2 నగరాల్లోని కస్టమర్లలో గణనీయమైన ఆకర్షణను పొందింది. వీటి అమ్మకాలకు ఎన్సీఆర్, ఢిల్లీ, ముంబై, కొచ్చి, బెంగళూరు మొదటి ఐదు టాప్ మార్కెట్లుగా నిలిచాయి. -
ఆ మైలురాయి సాధించడమే ఎస్బీఐ లక్ష్యం
వచ్చే 3-5 సంవత్సరాలలో రూ. 1 లక్ష కోట్ల నికర లాభం మైలురాయిని దాటిన మొదటి భారతీయ ఆర్థిక సంస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.2024 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ 21.59 శాతం వృద్ధితో రూ.61,077 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. వచ్చే 3-5 సంవత్సరాలలో రూ. 1 లక్ష కోట్లు దాటడం సాధ్యమేనా అని అడిగినప్పుడు “మాకు అవకాశం ఉంది. ఖచ్చితంగా, ఆ మైలురాయిని చేరుకున్న దేశంలో మొదటి కంపెనీగా మేము ఉండాలనుకుంటున్నాం” అని సీఎస్ శెట్టి చెప్పారు.లాభాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదలైనవి తమకు చాలా ముఖ్యమైన అంశాలని, అదే సమయంలో కస్టమర్-సెంట్రిసిటీకి సమానమైన ప్రాధాన్యతనిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే తమ కార్యకలాపాలలో ప్రాథమిక అంశంగా ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.ఇక కార్పొరేట్ రుణ డిమాండ్‌కు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుండి బ్యాంక్ ఇప్పటికే రూ. 4 లక్షల కోట్ల బలమైన క్రెడిట్ పైప్‌లైన్‌ను పొందిందని వివరించారు. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రైవేట్ రంగం మూలధన వ్యయం పెరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
World EV Day 2024: దేశంలో రయ్ మంటున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫోటోలు)
-
దూసుకెళ్తున్న బీఎస్ఎన్ఎల్.. ‘4జీ’లో మరో మైలురాయి
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దూసుకెళ్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో 4జీ సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్ తాజాగా మరింత ప్రగతి సాధించింది. దేశవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను అందించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.దేశవ్యాప్తంగా 4జీ సర్వీస్‌ను విస్తరిస్తున్న బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కంపెనీలకు పోటీగా 5జీ టెక్నాలజీని పరీక్షించడం ప్రారంభించింది. ఈ క్రమంలో వినియోగదారులకు 5జీ సిమ్ కార్డ్‌లను కూడా అందిస్తోంది. తాజగా 4జీ సర్వీస్‌లో మరింత పురోగతి సాధించింది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లు 15 వేల మైలురాయికి చేరుకున్నాయి.ఈ టవర్లను 'ఆత్మనిర్భర్ భారత్' పథకం కింద నిర్మించామని, దేశవ్యాప్తంగా అంతరాయం లేని ఇంటర్నెట్ను అందిస్తామని కంపెనీ తెలిపింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే బీఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ పూర్తిగా భారతీయ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఈ మొబైల్ టవర్లలో అమర్చిన పరికరాలన్నీ భారత్‌లోనే తయారయ్యాయి.అక్టోబరు చివరి నాటికి 80,000 టవర్లను ఏర్పాటు చేస్తామని, మిగిలిన 21,000 టవర్లను వచ్చే ఏడాది మార్చి నాటికి ఏర్పాటు చేస్తామని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అంటే 2025 మార్చి నాటికి మొత్తం లక్ష టవర్లు 4జీ నెట్‌వర్క్‌కు అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల డౌన్లోడ్ స్పీడ్ పెరుగుతుందని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఏడేళ్లలో 7 లక్షలు.. ఇండియన్ కార్ ఘనత!
టాటా నెక్సాన్ 7 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. 2017లో భారత్‌లో లాంచ్ అయిన ఈ ఎస్యూవీ అమ్మకాల మార్కును అధిగమించడానికి కేవలం ఏడేళ్లు పట్టింది. ఈ ఘనతను పురస్కరించుకుని టాటా మోటార్స్ నెక్సాన్‌పై రూ .1 లక్ష వరకు ప్రయోజనాలను అందిస్తోంది.మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మహీంద్రా స్కార్పియో వంటి వాటిని అధిగమించి, టాటా నెక్సాన్ 2024 ఆర్థిక సంవత్సరంలో 1,71,697 యూనిట్లు, 2023 ఆర్థిక సంవత్సరంలో 1,72,139 యూనిట్లు, 2022 ఆర్థిక సంవత్సరంలో 1,24,130 యూనిట్లతో భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది. అయితే టాటా నెక్సాన్ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల జాబితాలోకి ప్రవేశించలేకపోయింది. ఈ రెండు నెలల్లో 11వ స్థానానికే పరిమితమైంది.నెక్సాన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ), ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీలో రెవోట్రాన్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ (120 పీఎస్, 170 ఎన్ఎమ్), రెవోటార్క్ 1.5-లీటర్ డీజిల్ (115 పీఎస్, 260 ఎన్ఎమ్) రెండు ఐసీఈ ఎంపికలు ఉన్నాయి. ఇక ఈవీ వెర్షన్లో 129 పీఎస్/215ఎన్ఎం పీఎంఎస్ఎం, 30 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో మీడియం రేంజ్ (ఎంఆర్), 145 పీఎస్/215ఎన్ఎం పీఎంఎస్ఎం, 40.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో లాంగ్ రేంజ్ (ఎల్ఆర్) అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. నెక్సాన్ ఈవీ ఎంఆర్ వెర్షన్ రేంజ్ 325 కిలోమీటర్లు, ఎల్ఆర్ వెర్షన్ రేంజ్ 465 కిలోమీటర్లు.నెక్సాన్ ఐసీఈ, ఈవీ వర్షన్లు రెండూ సేఫ్టీలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందాయి. నెక్సాన్ ఐసీఈకి గ్లోబల్ ఎన్సీఏపీలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండగా, నెక్సాన్ ఈవీకి భారత్ ఎన్సీఏపీలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇక ధర విషయానికి వస్తే టాటా నెక్సాన్ ఐసీఈ రూ .8 లక్షల నుంచి రూ .15.80 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య, ఈవీ రూ .14.49 లక్షల నుంచి రూ .19.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. -
క్రెడిట్ కార్డుల్లో హెచ్డీఎఫ్సీ రికార్డు!
దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డుల విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. వినియోగంలో ఉన్న రెండు కోట్ల క్రెడిట్ కార్డుల మైలురాయిని సాధించిన తొలి బ్యాంక్‌గా నిలిచింది. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ డేటా ప్రకారం.. అన్ని బ్యాంకులు మొత్తంగా జారీ చేసిన 9.6 కోట్ల క్రెడిట్ కార్డులలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దాదాపు 21 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక కార్డు వ్యయాల్లో 2023 మార్చి 31 నాటికి తమ వాటా 28.6 శాతం ఉన్నట్లు బ్యాంక్ తెలిపింది. లేటుగా ప్రారంభించినా.. క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించిన ప్రధాన బ్యాంకులలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చివరిది కావడం గమనార్హం. ఎస్బీఐ తన కార్డ్ వ్యాపారాన్ని 1997లో ప్రారంభించగా ఐసీఐసీఐ బ్యాంక్ 2000లో క్రెడిట్ కార్డులు తీసుకొచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2001లో తన కార్డ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇతర బ్యాంకులు మందగించినప్పటికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రం ఓ వైపు కస్టమర్లతోపాటు మరోవైపు వ్యాపారులపైనా దృష్టి పెడుతూ స్థిరంగా దాని పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేసుకోగలిగింది. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వ్యాపారంలో 90లలో సిటీ బ్యాంక్ ఆధిపత్యం ఉండేది. ఆ తర్వాత దేశీయ ప్రైవేట్ బ్యాంకులు విస్తరించడంతో విదేశీ బ్యాంకులు మార్కెట్ వాటాను కోల్పోయాయి. -
వాట్సాప్ చానెల్: ప్రధాని మోదీ రికార్డ్..షాకింగ్ ఫాలోవర్లు
PM Modi WhatsApp Channelప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మరోసారి తన హవాను చాటుకున్నారు. తాజాగా వాట్సాప్ చానెల్లో కూడా సత్తాచాటారు. ప్రధాని మోదీ తన వాట్సాప్ ఛానెల్ ప్రారంభించిన ఒక్క రోజులోనే మిలియన్ సబ్స్క్రైబర్లను దాటేసి మరో రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పటికే ఎక్స్(ట్విటర్) ఫేస్బుక్ ,ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డ్ - సెట్టింగ్ ఫాలోవర్లను సంపాదించారు. తాజాగా వాట్సాప్ ఛానెల్లో మరో కీలక మైలురాయిని సాధించడం విశేషం 91 మిలియన్ల మంది ఫాలోవర్లతో Xలో అత్యధికంగా ఫాలో అవుతున్న ఇండియన్స్‌లో టాప్ ప్రధాని మోదీ. కాగా, ఫేస్బుక్లో, పీఎం మదీకి 48 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 78 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వాట్సాప్ ఛానెల్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. వాట్సాప్ చానెల్లో చేరడం ఆనందంగా ఉంది అంటూ కొత్త పార్లమెంటు భవనం ఫోటోను పోస్ట్ చేశారు మోదీ. సెప్టెంబర్ 13న భారతదేశంతో పాటు, 150కి పైగా దేశాలలో WhatsApp ఛానెల్స్‌ను ప్రారంభించింది. -
భారీగా పెరిగిన పెన్షన్ స్కీముల ఆస్తులు
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ స్కీము (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) కింద నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ రూ. 10 లక్షల కోట్లకు చేరింది. ఆగస్టు 23న ఈ మైలురాయిని అధిగమించినట్లు పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ దీపక్ మహంతి తెలిపారు. రెండేళ్ల 10 నెలల కాలంలో ఏయూఎం రూ. 5 లక్షల కోట్ల నుంచి రెట్టింపైనట్లు వివరించారు. ఎన్పీఎస్, ఏపీవై చందాదారుల సంఖ్య 6.62 కోట్ల పైచిలుకు చేరినట్లు మహంతి చెప్పారు. 2004లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రకటించిన ఎన్పీఎస్ను 2009 నుంచి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. దేశ పౌరులు దీన్ని స్వచ్ఛందంగా ఎంచుకోవచ్చు. మరోవైపు, 2015 జూన్ 1న ఏపీవైని కేంద్రం ఆవిష్కరించింది. 60 ఏళ్లు దాటిన చందాదారులు తాము కోరుకున్నంత నిధిని ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌పై కసరత్తు తుది దశలో ఉందని, అక్టోబర్ లేదా నవంబర్ నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని మహంతి వివరించారు. ప్రస్తుతం ఎన్పీఎస్ చందాదారులు 60 ఏళ్లు దాటితే 60 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలుంది. మిగతా 40 శాతం మొత్తం తప్పనిసరిగా యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలి. -
వన్ అండ్ ఓన్లీ యాపిల్: కీలక మైలురాయిని అధిగమించిన యాపిల్
న్యూఢిల్లీ: టెక్దిగ్గజం యాపిల్ కీలక మైలురాయిని చేరుకుంది. యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాప్‌లో 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ మైలురాయిని అధిగమించిన ఏకైక కంపెనీగా నిలిచింది. ఇటీవల యాపిల్ షేర ధర ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో మార్కెట్ వ్యాల్యూ బాగా పెరిగింది. (టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట) ప్రపంచంలోనే తొలిసారి 3 ట్రిలియన్ డాలర్ల విలువతో ట్రేడింగ్ డేను ముగించిన పబ్లిక్ కంపెనీగా యాపిల్ నిలిచింది. యాపిల్ శుక్రవారం 1 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 191.34 డాలర్లను తాకాయి. దీంతో యాపిల్ మార్కెట్ క్యాప్ రికార్దు స్థాయికి చేరింది. జనవరి 3, 2022న, ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో 3 ట్రిలియన్ డాలర్ల మార్కును తాకింది కానీ ముగింపులో నష్టపోయింది. ఈ 3 ట్రిలియన్ మార్కును దాటి ఈ ఘనతను సాధించిన ఏకైక కంపెనీ యాపిల్. వచ్చే ఏడాది విక్రయానికి రానున్న విజన్ ప్రో, ఆగ్మెంటెడ్ రియాలిటీ పరికరం ప్రివ్యూ టెక్ ప్రియులను ఆకట్టుకుంది. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) కాగా 2022తో పోలిస్తే ఈ ఏడాది స్టాక్ మార్కెట్ లాభం యాపిల్‌కు కలసి వచ్చింది. 2021 తరువాత తొలిసారి 2023 ప్రారంభంలో మార్కెట్ క్యాప్ స్థాయినుంచి 2 ట్రిలియన్ల దిగువకు పడిపోయింది. ఆతరువాత మార్కెట్ పుంజుకోవడంతో యాపిల్ షేరు ఈ ఏడాది దాదాపు 46 శాతం పెరిగడంతో మార్కెట్ క్యాప్ పరంగా టాప్‌లో నిలిచింది. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) -
కోటికి పైగా ఐటీఆర్‌లు దాఖలు.. గతేడాది కంటే చాలా వేగంగా..
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులు జూన్ 26 నాటికి కోటికిపైగా దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. గతేడాది కంటే చాలా వేగంగా కోటి రిటర్నులు దాఖలైనట్టు వివరించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసేందుకు జూలై 31 ఆఖరు తేదీగా ఉంది. ఆడిట్ అవసరం లేని వేతన జీవులు అందరికీ ఈ గడువు అమలవుతుంది. గతేడాదితో పోలిస్తే కోటి రిటర్నులు 12 రోజులు ముందే దాఖలయ్యాయంటూ ఆదాయపన్ను శాఖ ట్వీట్ చేసింది. చివరి నిమిషంలో రద్దీ లేకుండా ఉండేందుకు వీలైనంత ముందుగా రిటర్నులు దాఖలు చేయాలంటూ పన్ను చెల్లింపుదారులను కోరింది. Over one crore ITRs have been filed till 26th June 2023 compared to one crore ITRs filed till 8th of July last year. One crore milestone reached 12 days early this year compared to corresponding period in the preceding year: Income Tax Department @IncomeTaxIndia — All India Radio News (@airnewsalerts) June 27, 2023 -
స్టార్‌షిప్ మరో ప్రయోగంపై ఎలన్ మస్క్ అప్డేట్
ఎలన్‌మస్క్ సారధ్యంలోని స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ స్టార్‌షిప్ ప్రయోగంలో మరో కీలక మైలు రాయి దాటింది. ఈ ప్రయోగం గతంలో విఫలమైన తరువాత ఎలన్ మస్క్ మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడతామని వెల్లడించారు. తాజాగా జరిగిన ఫ్లైట్-2 ప్రయోగంలో మరో మైలురాయిని అధిగమించినట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎలన్ మస్క్ వెల్లడించారు.దీనికి సంబంధించి తాజాగా టెక్సాస్‌లోని స్టార్‌బేస్‌లో షిప్ 25 సిక్స్ ఇంజిన్ స్టాటిక్ ఫైర్ టెస్ట్ పూర్తి చేసుకున్నదని ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా మస్క్ షేర్ చేశారు. గత ఏప్రిల్‌లో ఎలన్ మస్క్ సారధ్యంలో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలమైన విషయం విదితమే. అమెరికాలోని టెక్సాస్ సమీపంలోగల బోకా చీకా తీరం నుంచి నింగిలోకి ఎగిసిన కొద్దిసేపటికే రాకెట్ స్టార్‌షిప్ పేలిపోయింది.ఈ రాకెట్ ప్రయోగం విఫలమమైన నేపధ్యంలో బూస్టర్, స్పేస్ క్రాఫ్ట్ పేలిపోయినట్లు స్పేస్ ఎక్స్ సంస్థ వివరించింది. గత ప్రయోగ ఫలితాలను విశ్లేషించి.. అయితే నాడు ఎలన్ మస్క్ ఒక ట్వీట్లో ఈ ప్రయోగ ఫలితాలను తమ సైంటిస్టులు క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. ఈ వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకున్నామని, మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడతామని తెలిపారు. అంతరిక్షంలో వ్యోమగాములు, సరుకు రవాణాకు ఉద్దేశించిన స్టార్‌షిప్ ప్రయోగాన్ని గత ఏప్రిల్ 17న చేపట్టారు. ఈ ప్రయోగం ప్రారంభమైన మూడు నిమిషాలకు బూస్టర్ విడిపోయి, మెక్సికోలో పడేలా దానిని రూపొందించారు. అయితే స్పేస్ క్రాఫ్ట్ భూమి చుట్టూ దాదాపు ఒక పరిభ్రమణం సాగించినా, సాంకేతిక కారణాలతో చివరి క్షణంలో ప్రయోగం వాయిదా పడింది. తరువాతి ప్రయోగంలో ఊహించని విధంగా స్టార్‌షిప్ ప్రయోగం విఫలమైంది. అయితే తాజాగా చేసిన ప్రయోగంలో మరోమైలు రాయి దాటినట్లు ఎలన్ మస్క్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. Key milestone completed for flight 2 https://t.co/bGmWKOnKEH — Elon Musk (@elonmusk) June 27, 2023 ఇది కూడా చదవండి: ఇకపై డాక్టర్ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు.. -
సీఏ మిస్‌కావడంతో ఫలితాలకు బ్రేక్
ముంబై: చార్టెడ్ అకౌంటెంట్ కనిపించకుండాపోవడంతో ఆర్థిక ఫలితాలను ప్రకటించలేకపోతున్నట్లు ఆఫీస్ ఫర్నీచర్ తయారీ కంపెనీ మైల్స్టోన్ ఫర్నీచర్ తాజాగా బీఎస్ఈకి తెలియజేసింది. సీఏ ఫోన్‌కాల్‌లో సైతం అందుబాటులోకి రావడంలేదని పేర్కొంది. మే 25న నిర్వహించిన సమావేశంలో కంపెనీ సీఏ భూపేంద్ర గాంధీ కనిపించకుండాపోవడం, ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో ఆర్థిక ఫలితాలు పెండింగ్‌లో పడినట్లు చైర్మన్ వెల్లడించినట్లు మైల్స్టోన్ బీఎస్ఈకి తెలియజేసింది. అయితే ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారాన్ని కనుక్కోనున్నట్లు తెలియజేసింది. తద్వారా సాధ్యమైనంత త్వరగా బీఎస్ఈ, ఆర్వోసీ నిబంధనలు పాటించనున్నట్లు పేర్కొంది. కంపెనీ 2018లో బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయ్యింది. కాగా.. 2022 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలానికి కంపెనీ ఎలాంటి ఆదాయం ప్రకటించకపోగా.. రూ. 2.6 కోట్ల నికర నష్టం నమోదైంది. -
రెనాల్ట్ డస్టర్ కమింగ్ సూన్: సేల్స్‌లో దూకుడు! ఎన్ని కార్లు అమ్మిందంటే!
సాక్షి, ముంబై: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా విక్రయాల్లో సరికొత్త మైలురాయిని అధిగమించింది. దేశంలో 9 లక్షల వాహనాల విక్రయాలను అధిగమించినట్లు రెనాల్ట్ ప్రకటించింది. తద్వారా ఈ ఘనతను సాధించిన దేశంలోని స్మాలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కార్ మేకర్లలో ఒకటిగా అవతరించింది. గత ఫిబ్రవరిలో 8 లక్షల సేల్స్ మార్క్‌ను తాకింది. త్వరలోనే కొత్త డస్టర్ లాంచ్‌కు సన్నద్ధమవుతున్న క్రమంలో ఈ కీలక విక్రయ మైలురాయిని చేరుకోవడం విశేషం. (AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత) పదకొండేళ్ల క్రితం 2012లో భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది రెనాల్ట్. కైగర్, ట్రైబర్, క్విడ్ లాంటి కార్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 2015లో క్విడ్ రాకతో మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం భారతదేశంలో సేల్ అవుతున్న మూడు రెనాల్ట్ కార్లలో క్విడ్ ఒకటి. త్వరలోనే డస్టర్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. అంతేకాదు రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. (యాపిల్ లవర్స్ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్ ఐప్యాడ్ ) ఇండియా తమకు టాప్ 5 మార్కెట్లలో ఒకటి, గతకొన్నేళ్లుగా దేశంలో బలమైన మార్కెట్‌ను సాధించామని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. కేంద్రం'మేక్ ఇన్ ఇండియా' కు కట్టుబడి ఉన్నామని, రానున్న ఉత్పత్తుల్లో 90 శాతం స్థానికీకరణను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. కాగా ప్రస్తుతం, రెనాల్ట్ 450 ప్లస్ సేల్స్, 530 సర్వీస్ టచ్‌పాయింట్స్ ద్వారా సేవలందిస్తోంది. మరిన్ని ఆటో, టెక్ వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
దుమ్మురేపిన నెక్సాన్.. ఉత్పత్తిలో రికార్డు బద్దలు
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా కార్లలో ఒకటి నెక్సాన్. దేశీయ మార్కెట్లో ఈ SUV విడుదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు దీని కున్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదంటే ఏ మాత్రం అతిశయోక్తికాదు. కంపెనీ ఇటీవల నెక్సాన్ ఉత్పత్తిలో ఐదు లక్షల మైలురాయిని చేరుకుంది. 2017 నుంచి సబ్-4-మీటర్ సెగ్మెంట్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే విజయకేతనం ఎగురవేసింది. నిజానికి 2014 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన టాటా నెక్సాన్ 2017లో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఇది మొదట్లో ఏడు వేరియంట్లు, రెండు ఇంజిన్ ఆప్షన్లతో మొదలైంది. 'నెక్సాన్'లో మొదటి ఇంజిన్ 3 సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ (109 హెచ్‌పి & 170 ఎన్ఎమ్ టార్క్) కాగా, రెండవది 1.5-లీటర్, ఫోర్-సిలిండర్, డీజిల్ రెవోటార్క్ (109 హెచ్‌పి & 260 ఎన్ఎమ్ టార్క్). ఈ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలలో లభించాయి. 2020లో నెక్సాన్ మార్కెట్లో రీడిజైన్ మోడల్ విడుదలైంది. ఇందులో ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మార్పులు జరిగాయి. ఆ తరువాత నెక్సాన్ ఈవీ తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. 2020లోనే కంపెనీ రూ. 14.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో నెక్సాన్ ఈవీ లాంచ్ చేసింది. ఇది 30.2 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించేలా తయారైంది. ఈ ఎలక్ట్రిక్ కారు అతి తక్కువ కాలంలోనే అత్యంత ఎక్కువ అమ్మకాలు పొందిన కారుగా రికార్డ్ సృష్టించింది. ఇక టాటా మోటార్స్ 2022లో నెక్సాన్ ఈవీ మ్యాక్స్ విడుదల చేసింది. ఇది దాని స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ కంటే ఎక్కువ రేంజ్ అందించేలా అప్డేట్ అయింది.ఈ అప్డేట్ మోడల్ 40.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో 453 కిమీ పరిధిని అందిస్తుందని ARAI ద్వారా ధ్రువీకరించారు. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంది. మొత్తానికి టాటా నెక్సాన్ తన ఆరు సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో గొప్ప విజయాలను కంపెనీకి తీసుకురావడంలో సహాయపడింది. ఈ మధ్య కాలంలోనే కంపెనీ కస్టమర్ల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని నెక్సాన్ డార్క్ ఎడిషన్, కజిరంగా ఎడిషన్, జెట్ ఎడిషన్ వంటి అనేక స్పెషల్ అవతార్లలో కూడా విడుదల చేసి ఉత్పత్తిలో 5 లక్షల మైలురాయిని చేరుకుంది. -
డిజిటల్ రూపీ ప్రారంభం చరిత్రాత్మక మైలురాయి
న్యూఢిల్లీ: డిజిటల్ రూపాయి ప్రారంభం ఒక చరిత్రాత్మక మైలురాయి అని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. దీనివల్ల కరెన్సీ వ్యవస్థ సామర్థ్య మరింత పెరుగుతుందని, ఆర్థిక సేవలు భారీగా విస్తరిస్తాయని తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ట్రాకర్ ప్రకారం, ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 95 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 105 దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ కరెన్సీని ప్రారంభించడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నాయని ఆయన తెలిపారు. దాదాపు 50 దేశాలు డిజిటల్ కరెన్సీని ప్రారంభించే తుది దశలో ఉండగా, 10 దేశాలు డిజిటల్ కరెన్సీని పూర్తిగా ప్రారంభించాయని పేర్కొన్నారు. పీహెచ్డీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ)నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ఆయన చేసిన ప్రకటనలో మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► డిజిటల్ రూపాయి చెల్లింపులు చేసే విధానంలో వినూత్నతను తీసుకువస్తుంది. అంతర్జాతీయ స్థాయి చెల్లింపుల్లో సైతం పూర్తి సులభతరమైన వెసులుబాటును కల్పిస్తుంది. ► సీబీడీసీ వినియోగదారుల ఆర్థిక పరిరక్షణకు దోహదపడటమే కాకుండా, హానికరమైన సామాజిక– ఆర్థిక పరిణామాలను నివారిస్తుంది. ప్రజలకు అవసరమైన తగిన సేవలు అందించడంలో దోహదపడుతుంది. ► ఆర్బీఐ ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ.. సీబీడీసీ–డబ్ల్యూ, అలాగే సీబీడీసీ–ఆర్‌లను భారత వ్యవస్థలో పైలట్ ప్రాతిపదికన ఆవిష్కరించింది. సీబీడీసీ–డబ్ల్యూ టోకు లావాదేవీలను సీబీడీసీ–ఆర్ రిటైల్ లావాదేవీలను సూచిస్తాయి. ► డిజిటల్ కరెన్సీ– యూపీఐ మధ్య వ్యత్యాసాన్ని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివరిస్తూ, భౌతిక కరెన్సీ తరహాలోనే సెంట్రల్ బ్యాంక్ జారీ చేసే డిజిటల్ కరెన్సీ ఆర్బీఐ నిర్వహణాలో ఉంటుంది. ఇక యూపీఐ చెల్లింపు సాధనం తద్వారా జరిగే లావాదేవీ సంబంధిత బ్యాంకు బాధ్యతకు సంబంధించినది అని చెప్పారు. -
కీలక మైలురాయిని అధిగమించిన హోండా కార్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కొత్త మైలురాయిని అధిగమించింది. దేశీయంగా మొత్తం 20 లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 20లక్షల మార్క్‌గా ప్రీమియం సెడాన్ హోండా సిటీ కారును విడుదల చేసింది. ఇదీ చదవండి : మారుతి స్విఫ్ట్-2023 కమింగ్ సూన్: ఆకర్షణీయ, అప్డేటెడ్ ఫీచర్లతో భారత్‌లో రాజస్తాన్‌లోని టపూకరా వద్ద సంస్థకు ప్లాంటు ఉంది. 1997 డిసెంబర్లో ఉత్పత్తి ప్రారంభం అయింది. దేశంలో ఇప్పటి వరకు హోండా రూ.10,000 కోట్లను వెచ్చించింది. సిటీ, అమేజ్ మోడళ్లను 15కుపైగా మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. ప్లాంటు సామర్థ్యం ఏటా 1,80,000 యూనిట్లుగా ఉంది. కాగా భారతదేశంలోని తన వినియోగదారుల కోసం ప్రీమియం, ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందించడంపై దృష్టి సారించి కార్యకలాపాలను ప్రారంభించామనీ,"మేక్ ఇన్ ఇండియా" విజన్‌లో భాగంగా 2 మిలియన్ల మైలురాయిని దాటామని కంపెనీ ప్రకటించింది. భారత్‌లో 2 మిలియన్ల కార్ల ఉత్పత్తి అనే చారిత్రాత్మక మైలురాయి దాటడం అంటే గత 25గా 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి హోండా నిబద్ధతకు నిదర్శమ ని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ టకుయా సుమురా తెలిపారు. ఇదీ చదవండి : పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు -
ఎయిర్టెల్ 5జీ హవా: నెల రోజుల్లోనే రికార్డు
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులను ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది పైగా కస్టమర్ల మైలురాయిని దాటినట్లు భారతి ఎయిర్టెల్ వెల్లడించింది. నెట్‌వర్క్‌ను నిర్మించుకునే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తుండగానే ఇది సాధించగలిగామని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణ్‌దీప్ సెఖోన్ తెలిపారు. యాపిల్ ఐఫోన్లు మినహా 5జీ ఆధారిత స్మార్ట్ఫోన్లు అన్నీ ఈ నెల మధ్య నాటికి తమ సేవలను అందుకోగలవని ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ ఇప్పటికే తెలిపారు. ఐఫోన్ల కోసం యాపిల్ నవంబర్ తొలినాళ్లలో సాఫ్ట్వేర్ అప్డేట్లను విడుదల చేస్తుందని, డిసెంబర్ మధ్య నుంచి అవి కూడా 5జీని సపోర్ట్ చేయవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి 4జీ రేట్లకే 5జీ సేవలు అందిస్తున్నామని, వచ్చే 6-9 నెలల్లో ధరలపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. 2024 మార్చి ఆఖరు నాటికి కీలకమైన గ్రామీణ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి తేగలమని పేర్కొన్నారు. భారతి ఎయిర్టెల్ ప్రస్తుతం దశలవారీగా హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో 5జీ సర్వీసులను విస్తరిస్తోంది. -
బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్.. బైడెన్ పొగడ్తల జల్లు!
వాషింగ్టన్: కన్జర్వేటివ్ పార్టీలో తన నాయకత్వనికి బహిరంగంగా తిరుగుబాటు రావడంతో లిజ్‌ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అలాగే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ అనుహ్య రీతిలో తప్పుకోవడం, మరో ప్రత్యర్థి పెన్నీ మోర్డాంట్ కావల్సినంత మంది ఎంపీల మద్దతు కూడగట్టుకోలేకపోవడంతో బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే మార్గం సుగమమైంది. నెలన్నరరోజుల క్రితం లిజ్‌ట్రస్ చేతిలో ఓడిపోయిన అదే రిషి సునాక్ తిరిగి ప్రధానిగా బ్రిటన్ పగ్గాలు చేపట్టడం విశేషం. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్‌హౌస్‌లో జరిగిన దీపావళి వేడుకలో మాట్లాడుతూ...."సునాక్ విజయం చాలా ఆశ్చర్యకరమైనది. ఈ విజయం ఒక సంచలనాత్మక మైలురాయి. ఆయనకు అధికారిక అభినందనలు తెలిపేందుకు ఎదురు చూస్తున్నాను" అని అన్నారు. ఈ క్రమంలో వైట్‌హౌస్ ప్రతినిధి కరీన్ జీన్ పియరీ బ్రిటన్ ప్రధాని సునాక్.. కింగ్ చార్లెస్‌తో ప్రోటోకాల్ సమావేశం జరిగిన తదనంతరం ఆయనతో బైడెన్ సంభాషించనున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: అమెరికా వైట్‌హౌస్‌లో అంగరంగ వైభవంగా దీపావళి: వీడియో వైరల్) -
సేల్స్‌లో టాటా నెక్సాన్ అదరహో! కొత్త వేరియంట్ కూడా వచ్చేసింది
సాక్షి,ముంబై: ప్రముఖ వాహన తయారీ దారు టాటా మోటార్స్ టాటా నెక్సాన్ కొత్త వేరియంట్నులాంచ్ చేసింది. టాటా నెక్సాన్ ఎక్స్జెడ్+(ఎల్) వేరియంట్‌ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. సరికొత్త ఫీచర్లతో లాంచ్ చేసిన కారు ధరను రూ. 11.37 లక్షలతో నిర్ణయించింది. ఇదీ చదవండి: Volkswagen: ఇండియన్ కస్టమర్లకు ఫోక్స్‌వ్యాగన్ భారీ షాక్ టాటా మోటార్స్ పూణేలోని రంజన్‌గావ్ ఫ్యాక్టరీనుంచి కాంపాక్ట్ ఎస్‌యూవీల సంఖ్య నాలుగు లక్షలకు చేరింది. దీనికి గుర్తుగా దేశంలో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్జెడ్+(ఎల్) వేరియంట్‌ను విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో, అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. కొత్త టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్ ధర రూ. 11,37,900 (ఎక్స్-షోరూమ్,న్యూఢిల్లీ). ఇది చదవండి: Axis Bank: యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్ టాటా మోటార్స్ 3 లక్షల ఎస్‌యూవీల మైలురాయిని దాటిన తర్వాత కేవలం ఏడు నెలల్లోనే నాలుగు లక్షల మార్క్‌ను టచ్ చేసింది. సెప్టెంబరు 2017లో నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. కేవలం ఐదేళ్లలో దేశీయ మార్కెట్లో నాలుగు లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించడం విశేషం. 72 శాతం వృద్దితో కంపెనీ సేల్స్ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉంది నెక్సాన్. (యూట్యూబ్ యూజర్లకు పండగే..45 శాతం ఆదాయం) ఇంజన్, ఫీచర్లు 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ రెవోట్రాన్ పెట్రోల్. 1.5-లీటర్ రెవోటార్క్ టర్బో డీజిల్ ఇంజన్లను అందిస్తోంది. ఒక ఇంజన్ గరిష్టంగా 120 PS పవర్ అవుట్‌పుట్, 170 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.. ఇక రెండోది 110 PS , 260 Nm లను విడుదల చేస్తుంది.వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయం, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో-డిమ్మింగ్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లతో ఈ కారు లభ్యం. ఇంకా, కొత్త XZ+(L) వేరియంట్ నెక్సాన్ #డార్క్ ఎడిషన్‌లో కూడా లభ్యం. కాగా ప్రస్తుతం అత్యంత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ వాహనం టాటా టియాగో ఈవీని వచ్చే వారం భారతదేశంలో విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
మహీంద్రా స్వరాజ్ 20 లక్షల మార్క్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా గ్రూప్‌లో భాగమైన స్వరాజ్ ట్రాక్టర్స్ సరికొత్త రికార్డును సాధించింది. 20 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసి నూతన మైలు రాయిని అధిగమించింది. ఈసందర్బంగా స్వరాజ్ బ్రాండ్‌పై కస్టమర్ల విశ్వాసానికి, విశ్వాసానికి నిదర్శనమని కంపెనీ పేర్కొంది. స్వరాజ్ డివిజన్, ఎం అండ్ ఎం లిమిటెడ్ సీఈవో హరీష్ చవాన్ ఉద్యోగులు హాజరైన ప్రత్యేక కార్యక్రమంలో 20 లక్షల మార్క్‌నుటచ్ చేసిన ట్రాక్టర్‌ను విడుదల చేశారు. 1974లో స్వరాజ్ ట్రాక్టర్ల ఉత్పత్తి ప్రా రంభం అయింది. 10 లక్షల యూనిట్ల తయారీ మార్క్‌ను కంపెనీ 2013లో నమోదు చేసింది. పంజాబ్‌లోని రెండు ప్లాంట్లలో 15–65 హెచ్‌పీ సామర్థ్యం గల ట్రాక్టర్లను సంస్థ ఉత్పత్తి చేస్తోంది. స్వరాజ్ ట్రాక్టర్ల కోసం మూడవ ప్లాంటును ఇదే రాష్ట్రంలో నెలకొల్పుతోంది. -
వావ్.. మార్కెట్లో భారీగా పెరుగుతున్న ఇన్వెస్టర్లు, కీలక మైలురాయి
సాక్షి, ముంబై: దేశంలో స్టాక్‌మార్కెట్ పెట్టుబడిదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా డీమ్యాట్ ఖాతాల సంఖ్య 10 కోట్ల కీలక మైలురాయిని అధిగమించింది. ఆగస్టులో తొలిసారిగా 100 మిలియన్ల మార్కును టచ్ చేయడం విశేషం. కోవిడ్‌కు ముందు ఈ సంఖ్య 41 మిలియన్లకంటే తక్కువే. డిపాజిటరీ సంస్థలు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (డీసీఎస్ఎల్) విడుదల చేసిన డేటా ప్రకారం, 2.2 మిలియన్లకు పైగా కొత్త ఖాతాలు వచ్చాయి. ఈ నాలుగు నెలల్లో మరీ ముఖ్యంగా గత నెలలో కొత్తగా వచ్చిన ఖాతాలతో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 100.5 మిలియన్లకు చేరింది. కోవిడ్-19 మహమ్మారికి ముందు కోవిడ్-19 మహమ్మారికి ముందు అంటే మార్చి 2020లో ఈ సంఖ్య 40.9 మిలియన్లుగా ఉండటం గమనార్హం. బుల్లిష్ మార్కెట్ కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.అలాగే మార్కెట్లో డీప్ కరెక్షన్ కారణంగా జూన్‌లో కొత్త డీమ్యాట్ ఓపెనింగ్స్ 1.8 మిలియన్ల వద్ద 16 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అయితే మార్కెట్లు అంతే వేగంగా రీబౌండ్ కావడంతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగిందని భావిస్తున్నారు. అలాగే 100 మిలియన్ల డీమ్యాట్ ఖాతాల సంఖ్య దేశంలోని ప్రత్యేక పెట్టుబడిదారుల సంఖ్యకు ప్రాతినిధ్యం వహించదని చాలా నకిలీ ఖాతాలుండే అవకాశం ఉందని మార్కెట్ పెద్దల మాట. ఎందుకంటే ఒక ఇన్వెస్టర్ పలు బ్రోకరేజీల వద్ద డీమ్యాట్ ఖాతాలను తెరవడానికి అనుమతి ఉన్న నేపథ్యంలో చాలా వరకు నకిలీ ఖాతాలుండే అవకాశం ఉందంటున్నారు -
సీడీఎస్ఎల్ రికార్డు, 7 కోట్లు దాటేసిన డిమ్యాట్ ఖాతాలు
న్యూఢిల్లీ: డిపాజిటరీ సేవలను అందించే సీడీఎస్ఎల్ మరో కొత్త మైలురాయిని అధిగమించింది. సంస్థ నిర్వహణలో డీమ్యాట్ ఖాతాలు 7 కోట్ల మార్క్‌ను దాటాయి. సీడీఎస్ఎల్ 1999లో కార్యకలాపాలు ప్రారంభించింది. డీమ్యాట్ ఖాతాల ద్వారా ఇన్వెస్టర్ల సెక్యూరిటీల లావాదేవీలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంటుంది. తాము ఏడు కోట్ల ఖాతాల మైలురాయిని అధిగమించడం తమకు మాత్రమే కాకుండా, మొత్తం భారత సెక్యూరిటీల మార్కెట్ ఎకోసిస్టమ్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్టు సీడీఎస్ఎల్ ఎండీ, సీఈవో నెహల్ వోరా అన్నారు. యాక్టివ్ డీమ్యాట్ ఖాతాల సంఖ్య పరంగా సీడీఎస్ఎల్ దేశంలోనే అతిపెద్ద డిపాజిటరీ సేవల సంస్థగా ఉంది. మరో సంస్థ ఎన్ఎస్డీఎల్ కూడా ఇదే విధమైన సేవలు అందిస్తుంటుంది. -
టీమిండియాకు 1000వ వన్డే.. కోహ్లిని ఊరిస్తున్న రికార్డు
టీమిండియా మెషిన్‌గన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. విండీస్‌తో జరగనున్న తొలి వన్డేలో ఆరు పరుగులు చేస్తే.. స్వదేశంలో వన్డేల్లో 5వేల పరుగులు మార్క్‌ను అందుకున్న రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. ఇంతకముందు బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మాత్రమే స్వదేశంలో 5వేల పరుగుల మార్క్‌ను అధిగమించాడు. సచిన్‌కు స్వదేశంలో 5వేల పరుగులు మార్క్‌ను అందుకోవడానికి 121 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. అయితే కోహ్లి విండీస్‌తో తొలి వన్డేలో 6 పరుగులు సాధిస్తే.. కేవలం 96 ఇన్నింగ్స్‌లోనే ఆ రికార్డును అందుకోనున్నాడు. ఇక కోహ్లి అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత స్వదేశంలో ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు స్వదేశంలో టీమిండియా న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడింది. ఆ సమయంలో కోహ్లి టెస్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ప్రొటీస్ టూర్లో టెస్టు సిరీస్ కోల్పోయిన వెంటనే కోహ్లి తన టెస్టు కెప్టెన్సీ పదవికి గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం కోహ్లి టీమిండియా సీనియర్ బ్యాటర్‌గా కొనసాగుతూ బ్యాటింగ్‌పై పూర్తిస్థాయి దృష్టి సారించాడు. ఇక టీమిండియా-వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా నేపథ్యంలో తొలి వన్డే రద్దు అవుతుందని ఊహాగానాలు వచ్చినప్పటికి బీసీసీఐ వాటిని కొట్టిపడేసింది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ వన్డే మ్యాచ్ టీమిండియాకు 1000వ మ్యాచ్ కావడం విశేషం. క్రికెట్ చరిత్రలో వెయ్యెవ మ్యాచ్ ఆడుతున్న తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించనుంది. దీంతో టీమిండియాకు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారింది. ఎలాగైనా మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో భోణి చేయాలని టీమిండియా భావిస్తోంది.