
సాక్షి, హైదరాబాద్: ప్రజాసంకల్పయాత్రలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజాభిమానం దన్నుతో పాదయాత్రలో చారిత్రక ఘట్టాన్ని లిఖించినందుకు హర్షం ప్రకటించారు. తన ఆనందాన్ని ట్విటర్ ద్వారా వ్యక్త పరిచారు.
‘ఈరోజు మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలతో కలిసి పాదయాత్ర చేయడం గొప్ప అనుభూతి. నా మీద మీరు చూపించిన ప్రేమ, విశ్వాసం ప్రతిరోజు ప్రేరణ’గా నిలుస్తుందని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కాగా, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని జననేత దాటారు.
Feeling extremely humbled as I complete the 3000km milestone today. Walking alongside my people has been one of the greatest learning experiences. The love & faith you all have shown towards me has been a constant inspiration to move further every single day.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 24 September 2018
Comments
Please login to add a commentAdd a comment