
సాక్షి, గజపతినగరం: ఓ వైపు టిట్లీ పెను తుఫాన్... మరో వైపు ఉదయం నుంచి వీస్తున్న భారీ ఈదురుగాలులు... ఇంకో వైపు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలు ప్రజాభిమానం ముందు చిన్నబోయాయి. తమ కష్టాలు తీర్చే నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో ఇవేమీ ఖాతరు చేయని జనసందోహం నడుమ 284వ రోజు పాదయాత్ర విజయవంతంగా సాగింది. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్రలో అరాచక టీడీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న కష్టాలను జననేతకు విన్నవించుకున్నారు.
ఇంటికో ఉద్యోగం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైఎస్ జగన్‌ను కలిసిన దివ్యాంగుడు అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో నిరద్యోగిగా మిగిలిపోయానని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలేదని న్యాయవాదులు జననేత దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌ను న్యాయవాదులు కలిశారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జననేతకు వినతి పత్రం అందించారు. రాజన్న తనయుడు వారందరికీ భరోసానిస్తూ ముందకు సాగారు.